Jump to content

చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేసిన దత్తాత్రేయ


John

Recommended Posts

636624364625387607.jpg
 
హైదరాబాద్: కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నం చేయడంలో తప్పు లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో ఏర్పడబోయే ప్రభుత్వం అనైతిక ప్రభుత్వమని చెప్పారు. వాళ్లకు ముందుంది ముసళ్ల పండుగని ఎద్దేవా చేశారు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కున్న చంద్రబాబు కూడా నీతులు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యారని ఘాటు విమర్శలు చేశారు. మరో వైపు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని చెప్పుకొచ్చారు. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి టీఆర్ఎస్ నేతలు ఎందుకు హాజరవుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
 
జాతీయ పార్టీతోనే దేశానికి మనుగడ తప్ప.. ప్రాంతీయ పార్టీలతో ఉపయోగం ఉండదన్నారు. ప్రాంతీయ పార్టీలతో సుస్థిర పాలన కొనసాగదన్న విషయం ఎంపీ కవిత గ్రహించాలని హితవు పలికారు. 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని దత్తాత్రేయ ధ్వజమెత్తారు. 1951 నుంచి ఇప్పటి దాకా 88 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ రద్దు చేసిందని గుర్తు చేశారు. 1992లో నాలుగు రాష్ట్రాల బీజేపీ ప్రభుత్వాలను కాంగ్రెస్ రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు రాహుల్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ లక్షణాన్ని కోల్పోయిందన్నారు. ప్రాంతీయ పార్టీల సహకారం లేకపోతే దేశంలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుందని దత్తాత్రేయ చెప్పుకొచ్చారు.
Link to comment
Share on other sites

2 minutes ago, NatuGadu said:

Trump president avvataniki bob ee help chesadu

Kishan and dattu CBN recommend dattu as this may be his last chance ani vesaru

Link to comment
Share on other sites

6 hours ago, sagarkurapati said:

But nda parties like trs and ysrcp tn kl lo nda ki evaru support chestharo vellaki 101 lo 30 lopala ravali

BJP ki takkuva vasthe evaru dhekaru bro.. Jagga gadu Malli Central govt edhi vunte valatho pairaveelu chesukuntadu..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...