sonykongara Posted May 20, 2018 Share Posted May 20, 2018 అక్కరకొచ్చిన బాబు అనుభవం20-05-2018 04:19:26 కుమారస్వామికి కీలక సూచనలు ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై సలహాలు మమత నుంచీ సీఎంకు ఫోను అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక పరిణామాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం జనతాదళ్-ఎ్సకు బాగా ఉపయోగపడింది. ఎన్టీఆర్ హయాంలో గవర్నర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేల క్యాంపులను తామెలా నిర్వహించిందీ.. ఎమ్మెల్యేలంతా స్థిరంగా ఉంటే రాజకీయం ఎలా మార్చవచ్చో చంద్రబాబు జేడీఎస్ నేత, కాబోయే సీఎం హెచ్డీ కుమారస్వామికి తెలియజెప్పారు. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డాక.. మెజారిటీ ఉన్న జేడీఎ్స-కాంగ్రెస్ కూటమిని గాక బీజేపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించబోతున్నారని తెలియగానే కుమారస్వామి చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. ఆ సందర్భంగా సీఎం ఆయనకు కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవడం, అదే సమయంలో గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏం చేయాలో వివరించారు. ఇవి కర్ణాటక రాజకీయ పరిణామాల్లో కీలకంగా ఉపయోగపడ్డాయని అంటున్నారు. మరోవైపు గవర్నర్ పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేయాలని కూడా బాబు సూచించారు. బిహార్, గోవా, మణిపూర్లలో అత్యధిక స్థానాలు సాధించిన పార్టీలకు అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను డిమాండ్ చేయాలని కూడా ఆయన చెప్పినట్లు సమాచారం. గవర్నర్ల వ్యవస్థతో కేంద్రం పెత్తనం చేయడం కుదరదని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిర్ణయం సరికాదన్నది బలంగా తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు తెలిసింది. ఇంకోవైపు.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా సీఎంకు ఫోన్ చేసి కర్ణాటక పరిణామాలపై చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలూ చేతులు కలపాలని ఆమె ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే. Link to comment Share on other sites More sharing options...
subash.c Posted May 20, 2018 Share Posted May 20, 2018 Ayana diganantha varake ...okasari digithe dabidi dibidi nbk style lo gif eskondi Link to comment Share on other sites More sharing options...
sagar_tdp Posted May 20, 2018 Share Posted May 20, 2018 Enka south lo elections dhaggara lo levu kabatti mana state meedha full foucs by bajafa Link to comment Share on other sites More sharing options...
ask678 Posted May 20, 2018 Share Posted May 20, 2018 2 hours ago, sagarkurapati said: Enka south lo elections dhaggara lo levu kabatti mana state meedha full foucs by bajafa Valla bokka edatharu....mundhu vallav status chdadndi Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.