Jump to content

cms india corruption study 2018


Recommended Posts

 

పవన్ గారు, ఎంత అన్యాయమో చూసారా.. అవినీతిలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు చూడండి... మీకు ఇంకా ఎవరూ చెప్పలేదా ?

Super User
18 May 2018
Hits: 30
 
pk-18052018-3.jpg
share.png

మీ రాష్ట్రంలో అవినీతి ఎక్కువ అని, హైదరాబాద్ నుంచి వచ్చి మంగళగిరిలో మీటింగ్ పెట్టి, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని నాశనం చేసే పని చేసాడు పవన్... ఎప్పటిదో పాత రిపోర్ట్ తీసుకువచ్చి, ఆంధ్రప్రదేశ్ అవినీతిలో నెంబర్ వన్ గా ఉంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారే లేరు, అంటూ ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మడు... అంతే కాదు, ముఖ్యమంత్రి అవినీతి చేస్తున్నాడు, లోకేష్ అవినీతి చేస్తున్నాడు అని చెప్పాడు పవన్... ఆధారాలు చెప్పండి అని అడిగితే, నా దగ్గర ఆధారాలు లేవు, ఎవరో చెప్తే విన్నాను, అదే మీకు చెప్తున్నాను అంటూ, గాల్లో ఆరోపణలు చేసి, గుడ్డ కాల్చి మొఖాన వేసాడు.. ఇలా చెప్పటం ద్వారా, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని, ఇండస్ట్రియల్ సర్కిల్ లో చంద్రబాబు ఇమేజ్ ని పాడు చెయ్యవచ్చు అని, బీజేపీ ప్లాన్... కాని, అది జరగలేదు, తరువాత హీరో హోండా వచ్చి శంకుస్థాపన చేసింది, అశోక్ లేల్యాండ్ వచ్చి శంకుస్థాపన చేసింది... ఇది చంద్రబాబు మీద ఉండే నమ్మకం...

 

pk 18052018 3

తాజగా, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే సంస్థ, అవినీతి పై ఒక రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి, లంచాలు తీసుకోవడంలో దేశంలోనే తమిళనాడు మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. 13 రాష్ట్రాల్లో మాత్రమే చేసిన సర్వే ఇది.. ఇండియా 2018 అవినీతి అధ్యయన నివేదికను సీఎంఎస్(సెంటర్ ఫర్ మీడియా స్టడీస్) శుక్రవారం విడుదల చేసింది. సీఎంఎస్ సర్వే చైర్మన్ భాస్కర్ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఈ ఏడాదిలో 75 శాతం మంది గృహస్థులు అవినీత పెరిగిందని భావిస్తున్నారు. తెలంగాణలో అవినీతి తక్కువ అనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి ఎక్కువనే ప్రచారం ఎక్కువగా ఉంది. కానీ అవినీతి మాత్రం తక్కువగా ఉంది. అంతేకాదు.. గతంతో పోలిస్తే ఏపీలో అవినీతి తగ్గింది. కానీ ప్రజా సేవలపై పౌరుల క్రియాశీలత తక్కువగా ఉంది. రాజకీయ పార్టీలు కొన్ని చేస్తున్న ప్రచారం తప్ప ఏపీలో అవినీతి లేదు’’ అని భాస్కర్ రావు తెలిపారు.

pk 18052018 3

ఈ రిపోర్ట్ తో ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టం... సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రచారంతో, ప్రజలు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎంతో నెగటివ్ గా ఫీల్ అవుతున్నారు అని రిపోర్ట్ చెప్పింది... కాని వారి దాకా వచ్చే సరికి, వ్యక్తిగతంగా జరిగిన పనులు గురించి మాత్రం, ఏపి ప్రభుత్వం అద్భుతం అంటున్నారు... గ్రౌండ్ లెవెల్ లో ప్రజలు అందరూ చంద్రబాబు వెంటే ఉన్నారు అనే చెప్తున్న రిపోర్ట్ ఇది... ఈ సర్వే ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లో, అవినీతి ఉంది అని అనుకునేవాళ్లు 72%... కాని అవినీతి పేస్ చేసింది మాత్రం 17 % మందే... అదే తెలంగాణాలో, అవినీతి ఉంది అని అనుకునేవాళ్లు 13%... కాని అవినీతి పేస్ చేసింది మాత్రం 73 % మంది... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దొంగ ప్రచారం ఇలా ఉంది... రాష్ట్ర ప్రభుత్వం, అధికార తెలుగుదేశం పార్టీ మీడియా మ్యనేజేమేంట్ లో ఎలా ఫెయిల్ అయ్యారో ఈ సర్వే చెప్తుంది.. విష ప్రచారం ప్రజలు నమ్మారు, కాని వారి దాకా వస్తే కాని, ఆ విష ప్రచారం తప్పు అని తేలలేదు.. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు, ఇందుకేనేమో తెలంగాణాకి 6 మార్కులు, చంద్రబాబుకు 2.5 మార్కులు వేసింది... ఈ రిపోర్ట్ గురించి, ఇంకా మీకు ఎవరూ చెప్పలేదా పవన్ గారు ? కొంచెం మీ తెలంగాణా రాష్ట్రం గురించి చూసుకోండి, మా ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన సాగుతుంది అని రిపోర్ట్ చెప్తుంది.

http://cmsindia.org/cms_ics18/CMS_ICS_2018_Report.pdf

Link to comment
Share on other sites

37 minutes ago, Nandamuri Rulz said:

Asusual idi kuda evadiki teliyadu... No publicity... Tdp publicity :dieplz:

emi ardam avtundi ba.. okademo top corrupted lo tn, ts, ap stand 1,2,4 respectively antadu. inkokademo Ap stands 4th in the least corrupted antadu. Edi ardam kavatam ledu

Link to comment
Share on other sites

16 hours ago, vasu4tarak said:

Fake propaganda ey range lo vundoo, janaalameeda daani impact enthaga vundoo inthakante cheppakkarledu.. Shame on our part n Govt.. 

Adega Mana daridram...fake news Ni 10 times chusthe evarikaina right ane anipinchochu....ee vishayam lo complete failure....chesina work kuda cheppukokapovatam worst asala...atu pakka kcr gadi dabba aithe ado rakam

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...