sonykongara 1,618 Posted May 18, 2018 అనంతకు విమాన యోగం!పుట్టపర్తి నుంచి పలు నగరాలకు సర్వీసులుపలు సంస్థలతో ప్రభుత్వం చర్చలు కొన్నేళ్లుగా వీవీఐపీలకు మాత్రమే ఉపయోగపడుతున్న పుట్టపర్తి విమానాశ్రయం అందరికీ అందుబాటులోకి రానుంది. ఇక్కడి నుంచి నిత్యం విమానాల రాకపోకలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వివిధ నగరాలకు సర్వీసులు నడిపేలా ఆయా సంస్థలతో చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా జిల్లాకు కియా పరిశ్రమ రాకతో విమాన సర్వీసుల అవసరం పెరిగింది. ఈక్రమంలో పుట్టపర్తి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సర్కార్ యోచిస్తోంది. ఇదే జరిగితే జిల్లావాసులకు విమాన ప్రయాణ యోగం కలగనుంది. ఈనాడు - అనంతపురం ల్లా వాసులు విమాన ప్రయాణం చేయాలంటే 200 కి.మీ. దూరంలోని బెంగళూరు విమానాశ్రయానికి వెళ్లాల్సిందే. లేదంటే రోడ్డు, రైలు మార్గాలను ఆశ్రయించాలి. బెంగళూరు నుంచి నిత్యం విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాలవైపు వెళ్లే విమానాలు రద్దీగానే ఉంటాయి. అప్పటికప్పుడు టిక్కెట్లు దొరకవు. అత్యవసరమైతే అధిక ధరలకు టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. మరోవైపు జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు విమానాల్లో వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల కొందరు కడప విమానాశ్రయానికి వెళుతున్నారు. ఇకపై ఈ కష్టాలు ఉండకుండా జిల్లాలోనే పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు నడిపేందుకు రంగం సిద్ధమవుతోంది. అయిదు నగరాలకు..జిల్లాకు కియా రాకతో పారిశ్రామిక అభివృద్ధి చెందుతోంది. వచ్చే ఏడాది కియా కార్ల పరిశ్రమ సిద్ధమై, ఉత్పత్తి మొదలుకానుంది. అలాగే అనుబంధంగా పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసుల ఆవశ్యకత ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వం పుట్టపర్తి నుంచి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నైలకు విమానాలు నడపాలని భావిస్తున్నారు. అలాగే తిరుపతికి కూడా సర్వీసులు నడపనున్నారు. జిల్లా నుంచి రాకపోకలు సాగించేవారికి, పారిశ్రామికవేత్తలకు, పుట్టపర్తికి వచ్చే భక్తులకు ఊరట కలగనుంది. ప్రస్తుతం ప్రభుత్వం పలు విమానయాన సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. పొరుగున కడప జిల్లా నుంచి మూడేళ్లుగా హైదరాబాద్, విజయవాడ, చెన్నైలకు విమాన సర్వీసులు నడుపుతున్నారు. ట్రూజెట్ సంస్థ 72 సీట్ల సామర్థ్యమున్న విమానాలను నడుపుతోంది. తొలుత ప్రయాణికుల రద్దీ లేదంటూ అయిదారు నెలలు సర్వీసులు నిలిపేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, ప్రతి సర్వీసులో ఖాళీగా ఉండే సీట్లకు కొంత మొత్తం చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత క్రమంగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా పుట్టపర్తికి కూడా 72 సీట్ల సామర్థ్యమున్న విమానాలను నడపటంపైనే దృష్టి పెడుతున్నారు. ప్రయాణికుల రద్దీ ఎంత?ఏవైనా విమానయాన సంస్థలు కొత్త ప్రాంతం నుంచి సర్వీసులు నడపాలనుకుంటే.. ఆ ప్రాంతం నుంచి ఎంత మంది ప్రయాణికులు వేర్వేరు చోట్లకు రాకపోకలు సాగిస్తున్నారో పరిగణనలోకి తీసుకుంటారు. జిల్లా నుంచి విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, చెన్నై, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎంత? ఏసీ రైలు, ఏసీ బస్సుల్లో అక్కడికి వెళ్లేవారు, విమాన ప్రయాణికులు ఎందరు? తదితర విషయాలపై ఆరా తీస్తున్నారు. ఆయా నగరాల నుంచి పుట్టపర్తికి నేరుగా, లేదా సింగిల్ స్టాప్‌తో విమానాలు నడపనున్నారు. 13 ఏళ్లుగా విరామం..పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయాన్ని 1991లో ఆరంభించారు. 145 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. 1993 నుంచి 2005 వరకు హైదరాబాద్, ముంబయి, బెంగళూరు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు నడిచేవి. ఆ తర్వాత నిలిచిపోయాయి. ఎవరైనా వీవీఐపీలు ప్రత్యేక విమానాల్లో అడపాదడపా వస్తున్నారు. జిల్లాకు ముఖ్యమంత్రి పర్యటన ఉందంటే ఈ విమానాశ్రయానికే వస్తున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్తున్నారు. దాదాపు 13 ఏళ్లుగా రోజువారీ విమాన రాకపోకలు లేని సత్యసాయి విమానాశ్రయానికి త్వరలో కళ రానుంది. ఇక్కడి నుంచి విమాన సర్వీసులపై పరిశీలన చేస్తున్నామని, పలు సంస్థలతో మాట్లాడుతున్నామని, త్వరలో సర్వీసులు మొదలయ్యే అవకాశం ఉందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు ధ్రువీకరించారు. Share this post Link to post Share on other sites
Nandamuri Rulz 2,549 Posted May 18, 2018 Anavasaram.. Kutha vetu dooram lo Bangalore airport. Share this post Link to post Share on other sites
Saichandra 1,230 Posted May 18, 2018 1 minute ago, Nandamuri Rulz said: Anavasaram.. Kutha vetu dooram lo Bangalore airport. Ok Share this post Link to post Share on other sites
Nandamuri Rulz 2,549 Posted May 18, 2018 Just now, Saichandra said: Ok meeru mee avasaram leni sokulu Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted May 18, 2018 3 minutes ago, Nandamuri Rulz said: meeru mee avasaram leni sokulu miku inka theliyadu emo new greenfield airport 13oo acres plan chesadu new ga Share this post Link to post Share on other sites
MVS 641 Posted May 18, 2018 11 minutes ago, Nandamuri Rulz said: Anavasaram.. Kutha vetu dooram lo Bangalore airport. ah kuta vetuke air lo veltamu nasty Share this post Link to post Share on other sites
Nandamuri Rulz 2,549 Posted May 18, 2018 1 hour ago, sonykongara said: miku inka theliyadu emo new greenfield airport 13oo acres plan chesadu new ga ATP lona? Share this post Link to post Share on other sites
Nandamuri Rulz 2,549 Posted May 18, 2018 1 hour ago, MVS said: ah kuta vetuke air lo veltamu nasty mee gurinchi maakenduku.. mee rich state fellas emanna seyyagalaru Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 15, 2018 సాగర్, పుట్టపర్తికి..: విజయవాడ- నాగార్జునసాగర్, విజయవాడ- పుట్టపర్తి మధ్య కూడా విమాన సేవలను ప్రవేశపెట్టేందుకు ఏపీఏడీసీఎల్ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ఈ రెండు ప్రాంతాలకు 9 సీట్ల ఎయిర్ క్రాఫ్ట్‌ను నడపాలనేది సంస్థ యోచన. Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 15, 2018 On 5/18/2018 at 2:22 PM, Nandamuri Rulz said: ATP lona? Share this post Link to post Share on other sites
Nandamuri Rulz 2,549 Posted June 16, 2018 13 hours ago, sonykongara said: Waste Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted June 25, 2018 వచ్చే నెలలో పుట్టపర్తి, సాగర్‌కు విమానయాన సేవలువిజయవాడ నుంచి నడపనున్న ‘సుప్రీం ఎయిర్ లైన్స్’ ఈనాడు, అమరావతి: వచ్చే నెల నుంచి విజయవాడ నుంచి పుట్టపర్తి, నాగార్జునసాగర్ మధ్య విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ప్రారంభ తేదీని ఖరారు చేయనున్నారు. విజయవాడ నుంచి ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ రెండు ప్రాంతాలకు ప్రత్యేకించి పర్యాటకులకు విమానయాన సేవలు ప్రారంభించేందుకు రాష్ట్ర విమానయాన అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) ప్రజాభిప్రాయాన్ని కోరినపుడు అత్యధికులు తమ సమ్మతిని తెలిపారు. దీనిపై బిడ్లను ఆహ్వానించినపుడు మిగతా సంస్థల కంటే ‘సుప్రీం ఎయిర్‌లైన్స్’ తక్కువ ఖర్చుకు నడిపేందుకు ముందుకు వచ్చిందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి రాగానే సుప్రీం ఎయిర్‌లైన్స్‌తో అవగాహన ఒప్పందం చేసుకొని సేవలు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి పుట్టపర్తికి రోజూ ఉదయం 7 గంటలకు విమానం బయలుదేరి 8.30 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 9 గంటలకు పుట్టపర్తిలో బయలుదేరి 10.30 గంటలకు విజయవాడకు రానుంది. సాయంత్రం మళ్లీ 5 గంటలకు మరో సర్వీసు నడపనున్నారు. విజయవాడ నుంచి నాగార్జునసాగర్‌కు ఉదయం 11 గంటలకు బయలుదేరే విమానం తిరిగి సాయంత్రం 3 గంటలకు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వార్తలు Share this post Link to post Share on other sites
sonykongara 1,618 Posted January 18 AP State govt plans flights to Nagarjunakonda, Puttaparthi THE HANS INDIA | Jan 18,2019 , 12:44 AM IST AP State govt plans flights to Nagarjunakonda, Puttaparthi Guntur: The Andhra Pradesh Airports Development Corporation is making arrangements to operate nine seater flights from Gannavaram to Nagarjunasagar and Puttaparthi by March end this year. The Supreme Airlines got all the permissions from the government to operate flights from Gannavaram to Nagarjunasagar and Puttaparthi. But it is facing problems with regard to pilots. Pilots who were working in the airlines were shifted to other airlines. Due to pilots’ problem, the company has decided to engage foreign nationals as pilots and seeking permission from the Central government. As soon as it gets clearance from the Centre, it will recruit the pilots and start operations to Nagarjunasagar and Puttaparthi. The Supreme Airlines will operate daily two trips to Nagarjunasagar and Puttaparthi. The government is feeling that if Nagarjunasagar Airstrip will come into operation, more tourists will visit Amaravati as part of their visits to Nagarjunakonda. The government is planning to develop Buddhists circuit in the State. Andhra Pradesh Airports Development Corporation Managing Director and CEO Virendra Singh said, ``We are doing our best to operate flights to Nagarjunakonda and Puttaparthi at the earliest. Pilots’ problems will be solved soon. If we operate nine-seater flights to Nagarjunakonda and Puttaparthi, and the tourism in the State will get boost. " Share this post Link to post Share on other sites