Jump to content

Krish to direct NTR Biopic


sonykongara

Recommended Posts

  • Replies 91
  • Created
  • Last Reply
 
DpJGmwFXcAEtgPf.jpg
14 replies 239 retweets 605 likes
 
 
 
 
 
 
 
Link to comment
Share on other sites

బాలకృష్ణను చూస్తుంటే ఎన్టీఆర్‌ను చూసినట్లుంది
తెదేపా నేతలు రావుల, పెద్దిరెడ్డి

01211911BRK82A.JPG

హైదరాబాద్‌: ‘యన్‌టీఆర్‌’ బయోపిక్‌ అద్భుతంగా వస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరావు, పెద్దిరెడ్డిలు అన్నారు. నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రమిది. క్రిష్‌ దర్శకుడు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం తెదేపా నేతలు రావుల, పెద్దిరెడ్డిలు ‘యన్‌టీఆర్‌’ చిత్రీకరణ జరుగుతున్న సెట్స్‌కు వెళ్లారు. కొద్దిసేపు బాలకృష్ణతో ముచ్చటించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ‘‘యన్‌టీఆర్‌’ బయోపిక్‌ చరిత్రలో నిలిచిపోతుంది. బాలకృష్ణ నటన చూస్తుంటే ఎన్టీఆరే స్వయంగా నటిస్తున్నట్లు అనిపిస్తోంది. ఎన్టీఆర్‌ అండదండలతో ఈ ఎన్నికలో విజయభేరీ మోగిస్తాం. కేవలం షూటింగ్‌ చూడటానికి మాత్రమే ఇక్కడకు వచ్చాం. రాజకీయాలపై బాలకృష్ణతో చర్చించలేదు’’ అని అన్నారు.

‘యన్‌టీఆర్‌’ బయోపిక్‌లు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌ సతీమణిగా విద్యాబాలన్‌, చంద్రబాబుగా దగ్గుబాటి రానా, అక్కినేనిగా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు నటిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ‘యన్‌టీఆర్‌’ను బయోపిక్‌ రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. జనవరి 9న కథానాయకుడు, జనవరి 24మహానాయకుడుగా విడుదల చేస్తారు.

Link to comment
Share on other sites

ఎన్టీఆర్’ కోసం రకుల్ ఎంత తీసుకుందంటే.... Updated : 11-Oct-2018 : 14:43
 
 
636748661619547949.jpg
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ఎన్టీఆర్ బయోపిక్ బాగా చర్చనీయాంశం అవుతోంది. ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు. విద్యాబాలన్, రానా తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ బయోపిక్‌లో మరో కీలక పాత్ర శ్రీదేవిది. ఈ పాత్ర కోసం రకుల్ ప్రీత్ ఎంపికైన విషయం తెలిసిందే. నిన్న శ్రీదేవి ఫస్ట్ లుక్ కూడా చిత్రబృందం రిలీజ్ చేసింది. ఎన్టీఆర్‌తో శ్రీదేవి 14 సినిమాల్లో నటించింది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ సాధించాయి. దీంతో ఈ బయోపిక్‌లో శ్రీదేవి పాత్ర కూడా కీలకమే.
 
రకుల్, ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్న బాలయ్యతో కలిసి ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటకు డ్యాన్స్ చేస్తున్న పిక్ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాలో రకుల్ పాత్ర దాదాపు 20 నిమిషాలు ఉంటుందట. ఈ పాత్ర కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. శ్రీదేవి పాత్ర కోసం రకుల్ రూ.కోటి రూపాయలు తీసుకుందట. అయితే రకుల్‌తో వేటగాడు మూవీలోని ‘ఆకు చాటు పిందె తడిసె’ పాట మాత్రమే కాకుండా మరికొన్ని పాటలు కూడా చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. అంతే కాకుండా ఈ బయోపిక్ పార్ట్ 2 లో కూడా రకుల్ కనిపించనుందని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో 'బాలగోపాలుడు' సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు .. బాబాయ్, వాళ్ల నాన్న గారిలా... నేను, మా నాన్నగారిలా. #NTRBiopic @DirKrish

DpOhGr0X4AAV4Jc.jpg
Link to comment
Share on other sites

జయప్రద పాత్రలో తమన్నా?

04330510BRK-TAMANNAH.JPG

హైదరాబాద్‌: మిల్కీ బ్యూటీ తమన్నా..అలనాటి తార జయప్రద పాత్రలో నటించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లో నందమూరి తారక రామారావుకు జోడీగా నటించిన అగ్ర కథానాయికలను చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో దివంగత నటి శ్రీదేవి పాత్రకు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను తీసుకున్నారు. ఈ రోజు రకుల్‌ బర్త్‌డేను పురస్కరించుకుని ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

అయితే ఈ చిత్రంలో జయప్రద పాత్రలో తమన్నా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఎన్టీఆర్‌-జయప్రద కాంబినేషన్‌లో ‘సూపర్‌మ్యాన్’, ‘అడవి రాముడు’, ‘చాణక్య చంద్రగుప్తా’, ‘యమగోల’ చిత్రాలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో జయప్రద, జయసుధ పాత్రల్లో వారే నటించబోతున్నారని గతంలో వార్తలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు తమన్నా పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ, ఆయన సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌, అల్లుడు చంద్రబాబు నాయుడు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్‌ నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం ‘కథనాయకుడు’ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కాబోతోంది. రెండో భాగం ‘మహానాయకుడు’ జనవరి 24న విడుదల కాబోతోంది.

Link to comment
Share on other sites

యన్‌టిఆర్‌’లో హరికృష్ణను చూశారా!

062804BRK123-NTRBIOPIC1.JPG

హైదరాబాద్‌: తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్‌’. నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని ఒక్కో పాత్రను చిత్ర బృందం అభిమానులకు పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ పాత్రకు సంబంధించి చిత్ర వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. అదే ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి హరికృష్ణ పాత్ర. ఆ పాత్రను ఇప్పుడు హరికృష్ణ తనయుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ పోషిస్తున్నారు. సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫొటోను కల్యాణ్‌రామ్‌ అభిమానులతో పంచుకున్నారు.

‘‘30 ఏళ్ల క్రితం మా బాబాయ్‌తో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు.. బాబాయ్.. వాళ్ల నాన్న గారిలా... నేను, మా నాన్నగారిలా’’ అంటూ ప్రచారం రథం దగ్గర ఎన్టీఆర్‌(బాలకృష్ణ)తో కలిసి వెనక్కి తిరిగి ఉన్న ఫొటోను ట్వీట్‌ చేశారు.

brk123-NTRBiopic2.JPG

నటుడిగా తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి వెండితెరను పంచుకోవడమే కాదు, ఎన్నికల ప్రచార రథ సారథిగా హరికృష్ణ ఆయన వెన్నంటే ఉండి ఎన్నో వేల కి.మీ. ప్రయాణం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన పాత్రను ఎవరు చేస్తారా? అన్నదానిపై చాలా చర్చ జరిగింది. మొదట ఎన్టీఆర్‌ పేరు వినిపించినా, ఆ తర్వాత కల్యాణ్‌రామ్‌ పేరు బయటకు వచ్చింది. అయితే, ఎక్కడా దీనిపై స్పష్టత లేదు. అయితే, గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఎన్టీఆర్‌ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే, అప్పటికే కల్యాణ్‌రామ్‌ తన తండ్రి పాత్రలో నటించడానికి సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరిగినా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు కల్యాణ్‌రామ్‌ ట్వీట్‌తో ‘యన్‌టిఆర్‌’లో హరికృష్ణ ఎవరన్న దానికి సమాధానం లభించేసింది.

brk123-NTRBiopic3.JPG

‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లో పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్‌ సతీమణిగా విద్యాబాలన్‌, చంద్రబాబుగా దగ్గుబాటి రానా, అక్కినేనిగా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు నటిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ‘యన్‌టిఆర్‌’ను బయోపిక్‌ రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. జనవరి 9న కథానాయకుడు, జనవరి 24మహానాయకుడుగా విడుదల చేస్తారు.

Link to comment
Share on other sites

ఎన్టీఆర్‌’ సతీమణి వచ్చేశారు!
ఫొటో షేర్‌ చేసిన విద్యాబాలన్‌
09390917BRKBASAVA.JPG


హైదరాబాద్‌: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారుల ఫస్ట్‌లుక్‌లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం లుక్‌ బయటికి వచ్చింది. ఆమె పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. బసవతారకంలా తయారై అద్దం ముందు కూర్చుని తన అందాన్ని చూసుకుంటున్న ఫొటోను విద్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

ఫొటోపై ‘నేనేం చూస్తున్నాను’ అని రాశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లో కుమారుడు హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్‌, చంద్రబాబు నాయుడుగా దగ్గుబాటి రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు నటిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌ రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 2019 జనవరి 9న ‘కథానాయకుడు’, జనవరి 24 ‘మహానాయకుడు’గా విడుదల చేస్తారు.

Link to comment
Share on other sites

‘ఎన్టీఆర్’ నుంచి మరో క్రేజీ లుక్ రిలీజ్.. Updated : 18-Oct-2018 : 11:54
 
 
636754624333465535.jpg
విశ్వ విఖ్యాత న‌టుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌క‌థ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం `ఎన్టీయార్‌`. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాను నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తుండగా శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, చంద్రబాబుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ సెట్స్‌పై కదులుతున్నారు. ఇప్పటికే వీరందరి లుక్స్ బయటకు వదిలి నందమూరి అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చిన చిత్రయూనిట్ తాజాగా మరో క్రేజీ లుక్‌తో ఆకట్టుకుంది.
 
    కొద్దిసేపటి క్రితం దివంగత నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు లుక్ బయటకు వదిలి సినిమాపై మరింత ఆసక్తి నెలకొలేలా చేశారు యూనిట్ సభ్యులు. అప్పట్లో నంద‌మూరి తార‌క రామారావు, గుమ్మడి కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరి మధ్య ఎంతో అనుబందం ఉండేది.. కాబట్టి `ఎన్టీయార్‌` సినిమాలో గుమ్మడి పాత్రకు ప్రాధాన్యత ఇచ్చారు దర్శక నిర్మాతలు. చిత్రసీమలో దర్శకుడిగా పేరొందిన దేవీ ప్రసాద్ గుమ్మడి పాత్రలో నటిస్తున్నారు. మిస్టర్ పెళ్లికొడుకు, కెవ్వుకేక, వంటి సినిమాలకు దేవీ ప్రసాద్ డైరెక్షన్‌ చేశారు.
Link to comment
Share on other sites

ఎన్టీఆర్’ నుంచి మరో అప్‌డేట్ Updated : 22-Oct-2018 : 13:45
 
 
636758127862464745.jpg
నటరత్న నందమూరి బాలకృష్ణ నిర్మాతగానూ.. హీరోగానూ నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. తన తండ్రి జీవితకథను బయోపిక్‌గా బాలయ్య తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తొలిపార్ట్‌ను ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అని.. రెండో పార్ట్‌కు.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పేరుతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాల విడుదల తేదీలు కూడా ఫిక్స్ అయిపోయాయి.
 
ఈ చిత్రంలో కీలక పాత్రల్లో విద్యాబాలన్, రానా, రకుల్ ప్రీత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది. ‘నందమూరి అందగాడు చిందులేయగా.. తెలుగువాడి నరనరమూ నాట్యమాడగా..’ అంటూ రెండు పిక్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఎన్టీఆర్ ఓ పాటకు చిందేస్తున్నట్టుగా ఉన్నాయి ఆ పిక్స్. వాటిలో బాలయ్య అచ్చం ఎన్టీఆర్‌ను తలపిస్తున్నారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ జనవరి 9న రిలీజ్ అవుతుండగా.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
 

లేచింది.. నిద్ర లేచింది మహిళాలోకం. దద్దరిల్లింది పురుష ప్రపంచం. బుల్లోడుగా బాలయ్య.. బుల్లెమ్మగా నిత్యామీనన్.. #HappyDiwaliDiwali_2018.png #NBK #NTRBioPic #NandamuriBalakrishna @MenenNithya @DirKrish #NTRKathaNayakuduOnJan9 #NTRMahanayakuduOnJan24 #NTRKathanayakudu

DrPGWC_U4AE2EQu.jpg
Link to comment
Share on other sites

ఎన్టీఆర్’లో మాళవిక నాయర్.. ఏ పాత్ర కోసమంటే... Updated : 15-Nov-2018 : 12:01
 
 
636778800630973215.jpg
నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ చిత్రంలోకి మరొక కొత్త క్యారెక్టర్ ఎంటర్ కాబోతోంది. ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్‌లో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపించనున్నారు.
 
దీనిలో భాగంగా ఇప్పటికే సావిత్రి పాత్రలో నిత్యామీనన్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్, జయప్రదగా తమన్నా తదితరులు నటిస్తున్నారు. అయితే మరో ముఖ్య పాత్ర కృష్ణకుమారి. ఎన్టీఆర్, కృష్ణకుమారి జంటగా నటించిన చిత్రాలన్నీ దాదాపు మంచి సక్సెస్‌ను సాధించాయి. కాబట్టి ఈ బయోపిక్‌లో కృష్ణకుమారి పాత్ర కూడా కనిపించనుంది. ఈ పాత్ర కోసం మాళవిక నాయర్‌ను తీసుకున్నారు. త్వరలోనే బాలయ్య, మాళవికలపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
Link to comment
Share on other sites

యన్‌.టి.ఆర్‌. సెకండ్‌ పార్ట్‌... సరికొత్త సంచలనాలెన్నో! Updated : 14-Nov-2018 : 22:53
 
 
636778327901980920.jpg
సెకండ్‌పార్ట్‌లో తెరపై మెరిసేందుకు నేటి తరం స్టార్‌ హీరో(ల)ను సంప్రతించారని భోగట్టా. ఆ అతిథి పాత్రపోషణ తాలూకు సందర్భం, సన్నివేశాలు అంతా సిద్ధం కూడా అయ్యాయట. ఇక, గ్రీన్‌ సిగ్నల్‌ రావడమే తరువాయి
 
 
తెలుగు సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడు, తెలుగు ప్రజానీకానికి అభిమానపాత్రుడైన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంపై రూపొందుతున్న ‘యన్‌.టి.ఆర్‌’. బయోపిక్‌కు సంబంధించి రోజుకో వార్త సంచలనం రేపుతోంది. నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ, తన తండ్రి పాత్రను తానే ధరిస్తున్న ఈ చిత్రాన్ని మొదట మొత్తం ఒకే సినిమాగా రూపొందించాలనుకున్నారు. అయితే, ఆ తరువాత ఈ బయోపిక్‌ను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
 
సెకండ్‌ పార్ట్‌లో స్టార్‌ హీరో(లు)?
‘చిత్రజ్యోతి’కి తెలిసిన తాజా కబురేమిటంటే, తెలుగుదేశం పార్టీ స్థాపన మొదలు యన్‌.టి.ఆర్‌. రాజకీయ జీవితంపై సాగే సెకండ్‌ పార్ట్‌ ‘యన్‌.టి.ఆర్‌ - మహానాయకుడు’లో నిజజీవితంలో ఆయన ఎదిగిన క్రమానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయట. అందుకు తగ్గట్లే, ఈ పార్ట్‌లో తెరపై మెరిసేందుకు గాను నేటి తరం స్టార్‌ హీరో(ల)ను సంప్రతించారని భోగట్టా. ఆ అతిథి పాత్రపోషణ తాలూకు సందర్భం, సన్నివేశాలు అంతా సిద్ధం కూడా అయ్యాయట. ఇక, గ్రీన్‌ సిగ్నల్‌ రావడమే తరువాయి అని విశ్వసనీయ వర్గాల కథనం.
 
...లేదంటే... నటవారస తెరంగేట్రం?
అంతా అనుకున్నట్టు జరిగితే, సెకండ్‌ పార్ట్‌లో ప్రత్యేక పాత్రల్లో నేటి స్టార్‌ హీరో(ల) సందర్శనం అభిమానులకు మరో బోనస్‌ కానుంది. ఒకవేళ ఆ సంగతి ఆఖరి క్షణంలో అనివార్యమై ఆగితే గనక... ఏకంగా నందమూరి కుటుంబం నుంచి మరో నటవారసుడి తెరంగేట్రం చేయించాలని కూడా ఆలోచన జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంటే, ఎలా చూసినా ఈ సెకండ్‌ పార్ట్‌లో తెరపై మెరిసే నటుల పేర్లు పెను సంచలనం కానున్నాయన్న మాట!
 
సెకండ్‌ పార్ట్‌ శివరాత్రికేనా?
ఇలా ఉండగా, సెకండ్‌ పార్ట్‌ రిలీజ్‌ వాయిదా వేస్తారంటూ కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలోని వాస్తవాల గురించి వాకబు చేస్తే, మరిన్ని విశేషాలు తెలిశాయి. నిజానికి, కొత్త ఏడాది జనవరిలోనే ఈ బయోపిక్‌ రెండు పార్టులనూ రిలీజ్‌ చేయాలని భావించారు. ఆ మేరకు ప్రకటన కూడా ఇచ్చారు. యన్‌.టి.ఆర్‌. సినీ జీవితంపై ప్రధానంగా దృష్టి నిలిపే ఫస్ట్‌ పార్ట్‌ ‘యన్‌.టి.ఆర్‌. - కథానాయకుడు’ జనవరి 9న సంక్రాంతికి ముందస్తు కానుకగా రానుంది. ఇక, ఆయన రాజకీయ జీవితంపై దృష్టి కేంద్రీకరించే సెకండ్‌ పార్ట్‌ ‘యన్‌.టి.ఆర్‌. - మహానాయకుడు’ను నిజానికి, అదే నెలలో 24న రిలీజ్‌ చేయనున్నట్లు మొదట ప్రకటించారు. అయితే, ఫస్ట్‌పార్ట్‌ రిలీజై ఆడుతుండగానే కేవలం రెండు వారాల వ్యవధిలోనే సెకండ్‌ పార్ట్‌ రిలీజ్‌ చేయడం వ్యాపార వర్గాలకు కొంత ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన ఇప్పుడు ఆ చిత్ర నిర్మాణవర్గాల మనసుల్లో తిరుగుతోంది. దాంతో, సెకండ్‌ పార్ట్‌ రిలీజ్‌ను ఫిబ్రవరి రెండో వారంలో వచ్చే శివరాత్రికి వాయిదా వేయాలనే చర్చ జరుగుతున్నట్టు భోగట్టా.
 
కొత్త రికార్డు సొంతమయ్యేనా?
అయితే, ఈ రిలీజు వాయిదా వేయడానికి మళ్ళీ చిత్ర యూనిట్టే సంశయిస్తోంది. వాయిదా వేయాలంటే ప్రధానంగా రెండు ఇబ్బందులున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో జరగాల్సిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు క్రితంసారి లాగా ముందుగానే ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్‌ గనక అమలులోకి వస్తే, అప్పుడు సెకండ్‌ పార్ట్‌ ప్రదర్శనకు ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, జనవరి చివరలోనే అనుకున్నట్టు చేసేస్తే బెటర్‌ అని ఒక ఆలోచన. అలాగే, ఒక సినిమా తాలూకు రెండు పార్టులూ ఒకే నెలలో విడుదలైన దాఖలాలు సినీ చరిత్రలో మునుపెన్నడూ లేవు. ఇప్పుడు ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ రెండు పార్టుల్నీ క్యాలెండరు పేజీ తిరగకుండానే ఒకే నెల (జనవరి)లో రిలీజు చేస్తే, చరిత్రలో కనివిని ఎరుగని కొత్త రికార్డు సొంతమవుతుంది. కాబట్టి, ఆ ఛాన్స్‌ పోగొట్టుకోవడం ఎందుకని కూడా చిత్ర బృందం తర్జనభర్జన పడుతున్నట్టు కథనం.
 
ఏమైనా, ఎన్నికల రాజకీయాల పరిస్థితులను బట్టి కానీ, సెకండ్‌ పార్ట్‌ రిలీజ్‌ తేదీ ఖరారు చేయలేరు. మొత్తానికి, రిలీజ్‌ డేట్‌ మాట ఎలా ఉన్నా ఈ ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ సెకండ్‌ పార్ట్‌లో ఇవాళ్టి టాప్‌ స్టార్‌ హీరో(లు) అతిథి పాత్రల్లో నటించడం, కుదరకపోతే నందమూరి కుటుంబం నుంచి మరో సరికొత్త నట వారసుడు తెరంగేట్రం చేయడం మాత్రం ఖాయమని కృష్ణానగర్‌ కబురు. ఈ వార్త అధికారికంగా వెల్లడి కావడానికి మాత్రం మరికొద్ది రోజులు ఆగక తప్పదు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...