Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

Krish to direct NTR Biopic

Recommended Posts

ఎన్టీఆర్ బయోపిక్.. తెరపైకి మరో హీరో పేరు! Updated : 01-Jul-2018 : 13:08
 
 
636660473349606202.jpg
ప్రారంభం కూడా కాకముందే.. వివాదమవుతోంది ఓ బయోపిక్. ఇదిలాఉంటే ఈ బయోపిక్‌లో నటించబోయే తారల పేరుతో రోజుకో కొత్త కబురు తెరపైకి వస్తోంది. తాజాగా మరో నటుడి పేరు వినిపిస్తోంది. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బాలకృష్ణ నేతృత్వంలో బయోపిక్ రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ప్రారంభంలోనే ఈ సినిమా నుంచి దర్శకుడు తేజ తప్పుకోవడం.. ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో ఈ సినిమా ముందుకు వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్ట్‌కు మరో ఇబ్బంది వచ్చిపడింది. ఈ సినిమా నిర్మాణాన్ని ఆపాల్సిందిగా హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌కు నోటీసులు వచ్చాయట. బయోపిక్‌కు సంబంధించి తమను ఎవరూ సంప్రదించలేదు కనుక.. ఈ సినిమాలో కీలకమైన నాదేండ్ల భాస్కరరావు పాత్రను నెగటివ్‌గా చూపించబోతున్నారంటూ ఆయన కుటుంబ సభ్యులు నోటీసులు పంపారట.
 
 
బయోపిక్స్ అన్నాక.. ఇలాంటి వివాదాలు, నోటీసులు రావడం కామన్. కాకపోతే ఈ విషయంపై 'ఎన్టీఆర్' బయోపిక్ టీమ్ ఏ రీతిన ముందుకెళ్లబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జీవితంతో సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులే కాదు.. ఆయనతో కలసి నటించిన సినీతారల పాత్రలు కూడా ప్రధానమైనవే కనుక ఆయా పాత్రలను ఎవరు పోషిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ఎన్టీఆర్ భార్య బసవతారకంగా విద్యాబాలన్, చంద్రబాబునాయుడుగా రానా దాదాపుగా ఖాయం అంటున్నారు. అక్కినేని పాత్రకు నిన్నమొన్నటి వరకూ నాగచైతన్య పేరు వినిపించగా.. ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకొచ్చింది.
 
 
ఇటీవల 'మహానటి'లో తాత ఏఎన్నార్‌గా నాగచైతన్య నటించడంతో.. 'ఎన్టీఆర్' బయోపిక్ లోనూ చైతూతోనే ఈ పాత్ర చేయిస్తున్నారనే ప్రచారం మొదలైంది. అయితే క్రిష్ మాత్రం నాగచైతన్య కాకుండా ఈ పాత్రను సుమంత్ చేత చేయించాలని భావిస్తున్నాడట. ఏఎన్నార్‌కు ఎంతో ఇష్టమైన మనవడు కావడంతో పాటు ఆయన పోలికలు కూడా సుమంత్‌లో కనిపిస్తాయి. అందుకే తాత పాత్రకు ఈ మనవడు కూడా న్యాయం చేయగలడని భావిస్తున్నాడట క్రిష్. ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న ఈ వార్తలో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Share this post


Link to post
Share on other sites
ఎన్టీఆర్‌ సతీమణి పాత్రలో ఆమే!
ప్రకటించిన చిత్రబృందం

1211404BRK-VIDYA.JPG

హైదరాబాద్‌: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా బయోపిక్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు ‘యన్‌టిఆర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రీల్‌ లైఫ్‌ ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తున్నారు.

ఇందులో ఎవరెవరు ఏ పాత్రల్లో నటించబోతున్నారు? అన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ ఫిక్స్‌ అయిపోయారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోపక్క సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు, నాగచైతన్య, రానా, శర్వానంద్‌ల పేర్లు కూడా వినపడుతున్నాయి. అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన మోహన్‌‌బాబు కూడా ‘యన్‌టిఆర్‌’లో కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ప్రముఖ నటుడు రాజశేఖర్‌కీ ఓ పాత్ర దక్కిందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది.

బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను హిందీలోనూ విడుదల చేయనున్నారు. 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని సెంటిమెంట్‌గా భావించి ఈ చిత్రాన్ని 2019 జనవరి 9న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

Share this post


Link to post
Share on other sites
రేప‌ట్నుంచి `ఎన్టీయార్‌` షూటింగ్‌? Updated : 04-Jul-2018 : 11:45
 
 
636663015278593291.jpg
మాజీ ముఖ్య‌మంత్రి, విశ్వ‌విఖ్యాత న‌టుడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌క‌థ ఆధారంగా `ఎన్టీయార్‌` బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన పాత్ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ సినిమాకు బాల‌య్య తొలిసారి నిర్మాత‌గా కూడా మార‌బోతున్నారు. తేజ ఈ ప్రాజెక్టు నుంచి అర్ధంతరంగా త‌ప్పుకోవ‌డంతో డైరెక్ట‌ర్ క్రిష్ లైన్‌లోకి వ‌చ్చారు.
 
ఇప్ప‌టివ‌ర‌కు స్క్రిప్టు పనులను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించిన క్రిష్.. ఇక‌, షూటింగ్ ప్రారంభించ‌బోతున్నారు. ఈ నెల ఐదో తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. నిర్విరామంగా షూటింగ్ చేసి సంక్రాంతి సమయానికి సినిమాను థియేట‌ర్ల‌లోనికి తీసుకురావాల‌ని చిత్ర‌బృందం కృత‌నిశ్చ‌యంతో ఉంది. ఈ సినిమాలో న‌టీన‌టుల ఎంపిక కూడా పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాలు బ‌య‌ట‌కు రాబోతున్నాయ‌ని స‌మాచారం.

Share this post


Link to post
Share on other sites
మనదేశం’ సందర్భంతో 'ఎన్టీఆర్ బయోపిక్' ప్రారంభం! Updated : 05-Jul-2018 : 22:14
 
 
636664256810839884.jpg
మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ జూలై 5న ప్రారంభమైన సందర్భంగా నందమూరి అభిమానులు ఈ రోజును చారిత్రాత్మక రోజుగా పరిగణిస్తున్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతోన్న 'ఎన్టీఆర్' సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభం అయ్యింది.
 
స్వర్గీయ నందమూరి తారకరామారావు తన మొదటి సినిమా రంగప్రవేశం 'మనదేశం' సినిమాతో జరిగింది. మనదేశం సినిమా చిత్రీకరణలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ బాలకృష్ణ చెప్పారు. ఈ సీన్‌ను గురువారం 'ఎన్టీఆర్ బయోపిక్' కోసం షూట్ చేశారు. ఎన్టీఆర్ పోషించిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో బాలకృష్ణ నటించడం విశేషం.
 
అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ స్వయంగా 1975లో ఒక ఉత్తరం రాయడం జరిగింది. "అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి, ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా ఋణపడ్డట్టే. నా శుభాకాంక్షలు, సోదరుడు రామారావు" అని ఎన్టీఆర్ రాసిన ఉత్తరాన్ని నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్.. నాడు నేడు 'మనదేశం' తోనే చరిత్రకు శ్రీకారం అంటూ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా వారు తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు కోరుకున్నారు. 'మనదేశం' చిత్ర సీన్స్‌తో షూటింగ్ స్టార్ట్ చేసినట్లు బాలకృష్ణ, క్రిష్ తెలిపారు.
 
Biopic-Start.jpg 

Share this post


Link to post
Share on other sites
మనదేశంతో శ్రీకారం! Updated : 05-Jul-2018 : 23:16
 
 
636664294098182455.jpg
  • పోలీసు గెట్‌పలో బాలకృష్ణ
  • క్రిష్‌ దర్శకత్వంలో నాగయ్య, ఎల్వీ ప్రసాద్‌!
తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, అభిమాన కథానాయకుడైన నందమూరి తారక రామారావు జీవిత కథాచిత్రం ఇప్పుడిక మళ్ళీ వేగం పుంజుకుంది. యన్టీఆర్‌ కుమారుడైన హీరో నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్ర పోషిస్తూ, ఎన్‌.బి.కె. ఫిలిమ్స్‌ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్న బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌’ షూటింగ్‌ క్రిష్‌ దర్శకత్వంలో గురువారం ఉదయం పునఃప్రారంభమైంది. అన్నపూర్ణా ఏడెకరాల స్టూడియోలో ఫస్ట్‌ఫ్లోర్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో సన్నివేశాల చిత్రీకరణ సాగింది. ఆనాడు యన్టీఆర్‌ సినీజీవితం ‘మనదేశం’ (1949 నవంబర్‌ 24న రిలీజ్‌) సినిమాతో శ్రీకారం చుట్టుకుంది.
 
అదే డైలాగ్‌... ఇప్పుడు బాలకృష్ణ నోట!
గురువారం ఈ బయోపిక్‌ చిత్రీకరణ కూడా అప్పటి ఆ సినిమాలోని సన్నివేశాన్ని మరోసారి కెమేరా ముందు పునఃసృష్టించడంతో మొదలైంది. ‘మనదేశం’లో చిత్తూరు నాగయ్య ఇంటికి దేశభక్తుడైన అతని తమ్ముణ్ణి అరెస్టు చేయడానికి వస్తారు బ్రిటీషు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ పాత్రధారి యన్టీఆర్‌. ఆ సందర్భంలో యన్టీఆర్‌ చెప్పిన ‘...ఇంత (వేలు అంత చూపిస్తూ) కానిస్టేబుల్‌గా జీవితం మొదలుపెట్టి, ఈ (పెద్ద... అని అర్థం వచ్చేలా చూపిస్తూ) హోదాకు వచ్చానంటే నేను ఎన్ని ఊళ్ళు చూశాను... ఎంతమందిని చూసి ఉంటాను...’ అనే డైలాగ్‌ ఘట్టాన్ని దర్శకుడు క్రిష్‌, కెమెరామన్‌ జ్ఞానశేఖర్‌లు గురువారం అద్భుతంగా చిత్రీకరించారని యూనిట్‌ వర్గాలు తెలిపాయి. ఆనాటి యన్టీఆర్‌ పోలీస్‌ గెట్‌పలో బాలకృష్ణ కనువిందు చేసి, ఆ డైలాగ్‌ను పండించారు. ఈ దృశ్యం చిత్రీకరణలో చిత్తూరు నాగయ్య పాత్రధారితో పాటు, ‘మనదేశం’ దర్శకుడు ఎల్వీ ప్రసాద్‌ పాత్రధారిగా 99 చిత్రాల అనుభవమున్న ప్రముఖ బెంగాలీ నటుడు జిష్షు సేన్‌ గుప్తా, అలాగే ఆ రోజుల్లో యన్టీఆర్‌ రూమ్మేట్‌ అయిన (తరువాతి కాలంలో ప్రముఖ దర్శకుడు) డి. యోగానంద్‌ పాత్రధారిగా నటుడు రవిప్రకాశ్‌ పాల్గొన్నారు.
 
ఈ నెలలోనే విద్యాబాలన్‌ ఎంట్రీ
Manadesam-scene-F.jpg‘నాడు, నేడు ‘మనదేశం’తోనే చరిత్రకు శ్రీకారం. తెలుగు వారందరి ఆశీస్సులు కోరుతున్నాం’ అని బాలకృష్ణ, క్రిష్‌ జంట సంయుక్తంగా పేర్కొంది. కాగా, దాదాపు 70 ఏళ్ళ క్రితం నాటి ఆ ఘట్టం చిత్రీకరణ సందర్భంగా స్వర్గీయ ఎల్వీ ప్రసాద్‌ కుమారుడూ, ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత ఎ. రమేశ్‌ ప్రసాద్‌ స్వయంగా షూటింగుకు హాజరై, బాలకృష్ణనూ, తన తండ్రి పాత్ర పోషిస్తున్న బెంగాలీ నటుణ్ణీ, ఇతర యూనిట్‌ సభ్యులనూ మనసారా అభినందించి వెళ్ళారు. కాగా, ఇప్పటి నుంచి వరుస షెడ్యూల్‌లో ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ చిత్రీకరణ సాగుతుందని సమాచారం. ఇప్పటికే యన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రకు ఎంపికైన ప్రముఖ హిందీ నటి విద్యాబాలన్‌ ఈ నెలలోనే ఈ బయోపిక్‌ చిత్రీకరణలో అడుగుపెట్టనున్నారు. మొత్తం మీద రకరకాల గెటప్పులు, అప్పటి నిజజీవిత పాత్రధారులు, సంఘటలను మళ్ళీ కళ్ళ ముందుకు తెస్తూ, ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ రూపొందుతుండడం అందరిలో ఆసక్తి రేపుతోంది.
 
 
 
 

Share this post


Link to post
Share on other sites
ఎన్టీఆర్‌ బయోపిక్‌లో మురళీశర్మ
పాత్ర ఏంటో తెలుసా?
0909529BRKNTR-MURALI1.JPG

హైదరాబాద్‌: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’కు నటీనటుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లోనూ ఆయన భాగస్వామ్యం వహిస్తున్నారు.

ఎన్టీఆర్‌ జీవితం అంటే ఎన్నో పాత్రలు, సంఘటనలు ఉంటాయి. కాబట్టి ఆయా పాత్రలకు తగిన వారిని తీసుకోవాలని యూనిట్‌ భావిస్తోంది. బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. నారా చంద్రబాబు నాయుడుగా రానా కనిపించనున్నారు. కాగా ఈ సినిమాలో తను ఆలూరి చక్రపాణి పాత్రను పోషిస్తున్నట్లు ప్రముఖ నటుడు మురళీ శర్మ తెలిపారు. సోమవారం నుంచి తన షూటింగ్‌ మొదలైందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెట్‌లో క్రిష్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. ఆలూరి చక్రపాణి పాత్రకు తనను తీసుకున్నందుకు క్రిష్‌కు ధన్యవాదాలు చెప్పారు. చాలా సంతోషంగా, థ్రిల్లింగ్‌గా ఉందని పేర్కొన్నారు.

ఈ బయోపిక్‌లో ఏఎన్నార్‌ పాత్రకు నాగచైతన్యను, కృష్ణ పాత్రకు మహేష్‌బాబును అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోహన్‌బాబు, రాజశేఖర్‌ కూడా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Share this post


Link to post
Share on other sites
ఏయన్నార్‌‌గా ఎవరో తెలిసిపోయింది
నాగచైతన్య కాదు..

0438444BRKNTR-ANR1.JPG

హైదరాబాద్‌: ‘ఎన్టీఆర్‌’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో అక్కినేని నాగచైతన్య కనిపించనున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్రలో నటుడు సుమంత్‌ సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా సుమంత్‌ ట్వీట్‌ చేశారు. ‘ఎన్టీఆర్‌ బృందంతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో మా తాతయ్య ఏయన్నార్‌ పాత్రను పోషిస్తున్నా. ధన్యవాదాలు’ అని ఆయన పేర్కొన్నారు.

‘ఎన్టీఆర్‌’లో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ దర్శకుడు. బసవతారకంగా విద్యా బాలన్‌ నటిస్తున్నారు. ఇందులో చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్నట్లు సమాచారం. ఇక కృష్ణ, శ్రీదేవి తదితర పాత్రల్లో ఎవరు నటించనున్నారనే విషయంపై ప్రకటన రావాల్సి ఉంది. అయితే, యంగ్‌ ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ, కృష్ణగా మహేశ్‌బాబు, సావిత్రిగా కీర్తి సురేశ్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రామానాయుడుగా వెంకటేశ్‌ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌లో రానా చేరారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం ఆయన చంద్రబాబును కలిసి, మాట్లాడారట. సంక్రాంతికి ఈ బయోపిక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Share this post


Link to post
Share on other sites
శ్రీదేవిగా ఆమే!
‘ఆ కథానాయికల్ని కలవలేదు’

0342378BRKRAKUL-SRI1.JPG

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’లో శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్‌ సింగ్ నటించనున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ పాత్ర కోసం దర్శక, నిర్మాతలు ముందుగా కంగనా రనౌత్‌, సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్‌ల‌ను సంప్రదించినట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రచారం గురించి చిత్ర నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి‌ స్పష్టత ఇచ్చారట. ఈ మేరకు ఓ ఆంగ్లపత్రికతో ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘మేం సోనాక్షి, కంగన, శ్రద్ధలను కలవలేదు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మా మొదటి ఎంపిక. ఆమెకు దక్షిణాదిలో చాలా పాపులారిటీ ఉంది. ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే ‘ఎన్టీఆర్‌’ సినిమా షూటింగ్‌ 30 శాతం పూర్తయింది. విద్యా బాలన్‌ ఆరు రోజుల షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రకుల్‌ డేట్స్‌ తీసుకునే పనిలో ఉన్నాం’ అని ఆయన చెప్పినట్లు రాశారు.

రకుల్‌ కూడా శ్రీదేవి పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారని ఆమె ప్రతినిధి అన్నట్లు తెలిసింది. ‘శ్రీదేవికి రకుల్‌ పెద్ద అభిమాని. కాబట్టి, ఈ పాత్రను ఇష్టపడి చేస్తున్నారు. కానీ, ఇంకా ఈ సినిమా పూర్తి వివరాలు ఆమె తెలుసుకోలేదు. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. మరోపక్క ఈ బయోపిక్‌కు డేట్స్‌ను కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని పేర్కొన్నట్లు తెలిసింది.

‘ఎన్టీఆర్‌’లో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Share this post


Link to post
Share on other sites
శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ ఫిక్స్ అయిన‌ట్టేనా? Updated : 09-Aug-2018 : 12:37
 
 
636694150513958263.jpg
మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత న‌టుడు నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌కథ ఆధారంగా `ఎన్టీయార్` సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీయార్ పాత్ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తూ, నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ దశ‌లో ఉంది.
 
ఈ సినిమాలో ప‌లు కీల‌క పాత్ర‌ల‌కు ప్ర‌ముఖ న‌టుల‌ను తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీయార్ భార్య బ‌స‌వ‌తారకం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, అల్లుడు నారా చంద్ర‌బాబు నాయుడి పాత్ర‌లో యంగ్ హీరో రానా న‌టిస్తున్నారు. అతిలోక సుంద‌రి శ్రీదేవి పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌న‌పించ‌నుంద‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన విష్ణు.. ర‌కుల్ ప్రీత్ గురించి క్లారిటీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఓ జాతీయ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ.. `ద‌క్షిణాదిలో, ముఖ్యంగా తెలుగులో మంచి పాపులారిటీ ఉన్న ర‌కుల్‌నే శ్రీదేవి పాత్ర కోసం అనుకున్నాం. శ్ర‌ద్ధ, కంగ‌న‌, సోనాక్షిల‌ను మేం అసలు క‌ల‌వ‌నే లేదు. త్వ‌ర‌లోనే ర‌కుల్ డేట్స్ తీసుకుని షూటింగ్ ప్రారంభిస్తామ‌`ని ఆయ‌న పేర్కొన్న‌ట్టు తెలుస్తోంది.

Share this post


Link to post
Share on other sites
ఎన్టీఆర్’‌లో చిరు పాత్ర?
ఎవరు నటిస్తారు..!
04391411BRKCHIRU-NTR1.JPG

హైదరాబాద్‌: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న‌ ‘ఎన్టీఆర్‌’ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. బసవతారకం పాత్రలో విద్యా బాలన్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నారు. సినీ కెరీర్‌కు సంబంధించి ఎన్టీఆర్‌ అనేక మందితో కలిసి పనిచేశారు. కాబట్టి వారి పాత్రల్ని కూడా ఈ బయోపిక్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు క్రిష్‌. ఈ నేపథ్యంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, హెచ్‌.ఎం. రెడ్డి, చక్రపాణి, ఎస్వీఆర్‌, కృష్ణ, శ్రీదేవి తదితర పాత్రలు సినిమాలో ఉన్నట్లు తెలిసింది.

కాగా ఎన్టీఆర్‌, చిరంజీవి కలిసి ‘తిరుగులేని మనిషి’ సినిమాలో సందడి చేశారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది. ఈ మేరకు ‘ఎన్టీఆర్‌’లో చిరు పాత్ర కనిపిస్తుందా? లేదా? అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు నెట్టింట్లో తెగ ప్రచారం జరుగుతోంది. చిరు పాత్ర నిజంగా ఉంటే.. అందులో ఎవరు నటిస్తారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

మరోపక్క ఈ సినిమాలో ఇప్పటికే తారాగణం, అతిథి పాత్రలు ఎక్కువయ్యాయని యూనిట్‌ భావిస్తోందట. మరి కొత్తగా చిరు పాత్ర ఉండబోతోంది అనడంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ‘ఎన్టీఆర్‌’ రెండో షెడ్యూల్‌ జరుగుతోంది. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Share this post


Link to post
Share on other sites
ఎన్టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

05353014BRK-NTR.JPG

హైదరాబాద్‌: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. యన్‌.బి.కె. ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. బాలయ్య అచ్చం తన తండ్రి ఎన్టీఆర్‌లా కనిపించారు. కాషాయ రంగు దుస్తుల్లో ఎన్టీఆర్‌లానే మైక్‌ ముందు నిల్చుని మాట్లాడుతూ కనిపించారు. ఆయన వెనుక త్రివర్ణ జెండా ఉంది. ఈ ప్రచార చిత్రం ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

‘ఎన్టీఆర్‌’ సినిమాలో పలువురు అగ్ర తారలు అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌గా మోక్షజ్ఞ, నారా భువనేశ్వరిగా మంజిమా మోహన్‌, సావిత్రిగా కీర్తి సురేశ్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, రామానాయుడుగా వెంకటేశ్‌, కృష్ణగా మహేశ్‌బాబు.. ఇలా వివిధ పాత్రల్లో పలువురు నటులు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Share this post


Link to post
Share on other sites
ఆ పాట‌కు రాశి అంగీక‌రిస్తుందా? Updated : 15-Aug-2018 : 12:42
 
 
636699337261144678.jpg
విశ్వ విఖ్యాత న‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం `ఎన్టీయార్‌`. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తూ స్వ‌యంగా నిర్మాత‌గా మారుతుండ‌డం విశేషం. ఈ సినిమాలో ప‌లు కీల‌క పాత్ర‌ల్లో ప్ర‌ముఖ న‌టులు న‌టిస్తున్నారు. ఎన్టీయార్ భార్య బ‌స‌వ‌తారకం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, నారా చంద్ర‌బాబు నాయుడి పాత్ర‌లో రానా వంటి న‌టులు న‌టిస్తున్నారు.
 
అలాగే అతిలోక సుంద‌రి శ్రీదేవి పాత్ర‌లో టాప్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్, భువ‌నేశ్వ‌రి పాత్ర‌లో మంజిమా మోహ‌న్‌ క‌నిపించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మ‌రో అప్‌డేట్ బ‌య‌టికొచ్చింది. ఎన్టీయార్ కెరీర్‌లో సూప‌ర్ హిట్ సాంగ్‌గా నిలిచిన `ఆరేసుకోబోయి.. పారేసుకున్నాను` పాట‌ను ఈ సినిమాలో చూపించ‌బోతున్నార‌ట‌. ఈ పాట‌లో న‌టించిన‌ జ‌య‌ప్ర‌ద పాత్ర‌లో హీరోయిన్ రాశీఖన్నాను చూపించాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. అయితే ఈ పాట పూర్తిగా ఉండ‌ద‌ని, కేవ‌లం ఒక్క చ‌ర‌ణం మాత్ర‌మే ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రి, ఈ ఒక్క చ‌ర‌ణం కోసం రాశీ ఖన్నా అంగీక‌రిస్తుందా అనేది అనుమానంగా మారింది.

Share this post


Link to post
Share on other sites
చంద్రబాబు మాదిరే రానా! సోషల్ మీడియాలో వైరల్ Updated : 15-Aug-2018 : 17:44
 
 
636699518546666292.jpg
టాలీవుడ్ టు బాలీవుడ్ ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలోనే తెలుగులో రూపొందుతోన్న ఓ ప్రతిష్ఠాత్మక బయోపిక్ కోసం.. రానా భారీ కసరత్తులు చేస్తున్నాడట. చంద్రబాబు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాడట.
 
 
పాత్రకు అనుగుణంగా మేకోవర్ అవ్వడంలో భల్లాళదేవ రానా బాగా సిద్ధహస్తుడు. 'బాహుబలి' కోసం భారీగా బాడీని పెంచి భళ్లాలదేవ పాత్రలో అదరగొట్టాడు రానా. ఇక చారిత్రక చిత్రం 'రుద్రమదేవి'లోని చాళుక్య వీరభద్రుడిగా, 'ఘాజీ ఎటాక్'లో లెప్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మగా మరో తరహా మేకోవర్స్‌తో మెప్పించాడు.
  
 
ఇటీవలే పీరియాడికల్ మూవీ '1945' కోసం స్వాతంత్ర్యానికి పూర్వం లుక్ లోకి వెళ్లిన రానా.. ట్రైలింగ్వల్ 'హాథీ మేరే సాథీ' కోసం షార్ట్ హెయిర్ కట్‌తో గడ్డం, మీసాలతో మావటి పాత్రలోకి షిప్టయ్యాడు. ప్రస్తుతం 'యన్.టి.ఆర్' బయోపిక్ కోసం చంద్రబాబు నాయుడుగా అలరించేందుకు క్లీన్ షేవ్ లోకి వచ్చేశాడు ఈ దగ్గుబాటి హీరో.
 
భళ్లాలదేవుడి క్లీన్ షేవ్ పిక్ ఒకటి.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. యుక్త వయసులో ఉన్న చంద్రబాబు మాదిరే ఈ ఫోటోలో అదరగొడుతున్నాడు రానా. చంద్రబాబు గెటప్పు మాత్రమే కాదు.. ఇప్పుడు ఆన్ స్క్రీన్‌పై బాబుగా అలరించేందుకు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడట రానా. చంద్రబాబు నాయుడు పాత వీడియోలను చూస్తూ ఆయనలా మారడానికి కసరత్తులు చేస్తున్నాడట. బాబు బాడీ లాంగ్వేజ్.. మాట్లాడే తీరును.. వెండితెరపై ప్రదర్శించేందుకు సమాయత్తమవుతున్నాడట. త్వరలో ప్రారంభం కాబోయే 'యన్.టి.ఆర్' కొత్త షెడ్యూల్‌లో రానా పై సీన్స్‌ను చిత్రీకరించబోతున్నాడట డైరెక్టర్ క్రిష్. మొత్తంమీద ఈ బయోపిక్‌లో చంద్రబాబు నాయుడుగా భళ్లాలదేవుడు ఏ రీతిన అలరిస్తాడో చూడాలి.

Share this post


Link to post
Share on other sites
ఎన్టీఆర్ రూపంలో బాలయ్యను చూస్తుంటే: మంచు మనోజ్ Updated : 15-Aug-2018 : 15:49
 
 
636699449766504821.jpg
నందమూరి బాలకృష్ణ నిర్మాణ సారధ్యంలో.. క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. రోజుకో కొత్త వార్తతో ఈ సినిమా సెన్సేషన్ అవుతోంది. షూటింగ్ దశలోనే ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. చిత్ర నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాలయ్య.. సినిమాకు అన్నీ తానై చిరస్థాయిగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు.
 
 
కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ఈ చిత్రం నుంచి నిన్న (14 ఆగస్టు) విడుదల చేసిన బాలయ్య లుక్ సోషల్ మీడియాలో  ట్రెడింగ్ అవుతూ నందమూరి అభిమానులను ఆకట్టుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ పోస్టర్ చూసి బాలయ్యను అభినందనలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ పోస్టర్ చూసిన మంచు మనోజ్ ‘‘న భూతో.. న భవిష్యత్’’ అని ట్వీట్ చేశాడు. ‘‘కళ్ళు తిప్పకుండా అలాగే చూస్తుండిపోవాలనిపిస్తోంది ఈ పోస్టర్ చూస్తుంటే! ఇలాంటి అద్భుతమైన పోస్టర్ వదిలిన నా డార్లింగ్ బ్రదర్ క్రిష్‌కి ధన్యవాదాలు. నీలో చాలా శక్తి దాగి ఉంది’’ అని ట్యాగ్ చేస్తూ అచ్చం ఎన్టీఆర్ రూపంలో దర్శమిస్తున్న బాలయ్య లుక్‌ని పోస్ట్ చేశాడు మంచు మనోజ్.

Share this post


Link to post
Share on other sites
ఎన్టీఆర్‌ సొంత ఇంట్లో... 
16tollywood-8a.jpg 16tollywood-8b.jpg

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ సొంత ఇంట్లో షూటింగ్‌ జరుగుతుండడం విశేషం. చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో   హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేశారు ఎన్టీఆర్‌. అదంటే ఆయనకు చాలా ఇష్టం. ఇప్పుడు అదే ఇంట్లో  చిత్రీకరణ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, రానాలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్నారు. కాబట్టి... ఇవన్నీ మామా అల్లుళ్లకు సంబంధించిన సన్నివేశాలు అనుకోవాలి. ఆగస్టు 15న ‘ఎన్టీఆర్‌’ లుక్‌ని విడుదల చేశారు. దానికి మంచి స్పందన వస్తోంది. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Share this post


Link to post
Share on other sites
అబిడ్స్‌లోని ఎన్టీఆర్‌ నివాసంలోనే చిత్రీకరణ
ఆ అవకాశం మాకు దక్కినందుకు సంతోషంగా ఉంది: రానా
1104343BRK-NTR.JPG
 


హైదరాబాద్‌: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా ‘యన్‌టిఆర్‌’ టైటిల్‌తో బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. క్రిష్‌ దర్శకుడు. ఎన్టీఆర్‌ అల్లుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. కాగా..ఇందులో రానా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అబిడ్స్‌లోని ఎన్టీఆర్‌ నివాసం నుంచి మొదలైందట.

ఈ విషయాన్ని రానా ఓ ఆంగ్ల మీడియా ద్వారా వెల్లడించారు. ‘చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన సినిమాలు, రాజకీయ ప్రయాణం, సమాజంపై, తెలుగు భాషపై ఆయనకున్న గౌరవాన్ని చూసి ముగ్దుడినయ్యాను. ఇప్పుడు ఆయన జీవితాధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో నాకు నటించే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. నా తొలి కాల్‌షీట్‌లో చిత్రీకరణ అబిడ్స్‌లోని ఎన్టీఆర్‌ నివాసంలో అని తెలియగానే మరింత ఎక్జైట్‌ అయ్యాను. ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు చరిత్రలోకి ప్రయాణిస్తున్నట్లుగా అనిపించింది. ఆ నివాసంలో ఎన్టీఆర్‌ మేకప్‌ గదిని ఇప్పటికీ భద్రంగానే ఉంచారు. ఆయన సొంత ఇంట్లోనే చిత్రీకరణ జరగడం నా జీవితంలో మర్చిపోలేని అంశం. ఇప్పటివరకు ఈ నివాసంలో ఎప్పుడూ చిత్రీకరణ జరగలేదు. ఆ అవకాశం మాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం తెలుగు పదాలను ఉచ్ఛరించడం, రాయడం నేర్చుకుంటున్నాను.’ అని తెలిపారు రానా.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Share this post


Link to post
Share on other sites
తాత కారులో `ఎన్టీయార్‌` షూటింగ్‌కు..! Updated : 12-Sep-2018 : 14:13
 
 
636723584267127035.jpg
విశ్వ విఖ్యాత న‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌కథ ఆధారంగా డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో `ఎన్టీయార్` బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి నిర్మాత‌గా కూడా మారారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ప‌లువురు ప్ర‌ముఖ నటులు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
 
ఈ సినిమాలో ఎన్టీయార్ భార్య బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో విద్యా బాల‌న్‌, అల్లుడు చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో ఆయ‌న మ‌న‌వ‌డు సుమంత్ న‌టిస్తున్నాడు. ఈ రోజు (బుధ‌వారం) `ఎన్టీయార్‌` సెట్స్‌లో సుమంత్ అడుగుపెట్టాడు. షూటింగ్‌కు బ‌య‌లుదేరుతున్న‌ట్టు సుమంత్ ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. ``ఎన్టీయార్‌` బ‌యోపిక్‌లో ఏఎన్నార్ పాత్ర‌లో న‌టించ‌డానికి వెళ్తున్నా. ఏఎన్నార్‌ వాడిన చివ‌రి కారులో నా తొలి రోజు షూటింగ్‌కు హాజ‌ర‌వుతున్నా` అని సుమంత్ ట్వీట్ చేశాడు. కారు న‌డుపుతున్న ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×