Jump to content

అత్యంత ఆప్తుడి కోసం చంద్రబాబు ఇచ్చిన సూచనలు ఏంటి?


Recommended Posts

 
 
ఆయన చంద్రబాబుకు నమ్మకస్తుడు.. కేవలం చంద్రబాబు, లోకేశ్‌ వంటి కొంతమంది నేతలకు మాత్రమే అందుబాటులో ఉంటారు. పార్టీ సర్వేలు.. నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి.. ద్వితీయశ్రేణి నాయకత్వం పనితీరు వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. సీఎంకు కావలసిన సమస్త సమాచారాన్ని రప్పిస్తుంటారు. ఇటీవల ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబుకు అంత ఆప్తుడైన వ్యక్తి ఎవరు..? అక్కడ చంద్రబాబు ఎటువంటి కామెంట్లు చేశారు..? వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
        ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నమ్మకస్తులైన వారు ఎవరూ ఉండరనుకుంటారు.. కానీ ఆయనను వెన్నంటి ఉండే ఓ వ్యక్తి ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు... అధికారానికి దూరమైనప్పుడు చంద్రబాబుకు దగ్గరగా ఉన్న ఆ వ్యక్తే ప్రొఫెసర్‌ శ్రీనివాసులునాయుడు.. ఆయనకు తెలుగుదేశంపార్టీ పరిస్థితి.. నియోజకవర్గ స్థితిగతులు అన్నీ తెలుసు! చంద్రబాబుకు అవసరమైన సమాచారాన్నంత సేకరించి ఇస్తూ ఉంటారు. వారంలో అయిదు రోజులపాటు ఆయన ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం చంద్రబాబును కలుస్తూ ఉంటారు. ప్రభుత్వ సంక్షేమ.. అభివృద్ధి కార్యక్రమాలపై సమాచారంతో పాటు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రికి అవసరమైన సమాచారం ఇవ్వడం.. ఆయన అప్పగించిన పనులను పూర్తి చేయడం మాత్రమే శ్రీనివాసులునాయుడు పని! ఆయన ఆధ్వర్యంలో ఒక బృందం రహస్యంగా ఈ పనులన్నింటినీ చక్కబెడుతుంది. 
 
      ఇంత పని ఒత్తిడిలో ఉన్న శ్రీనివాసనాయుడు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆయన నగరంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న వెంటనే చంద్రబాబు కొంతమంది సన్నిహితులతో కలిసి పరామర్శకు వెళ్లారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో నార్మన్‌ ఫాస్టర్స్‌ను కలుసుకుని తిరిగివచ్చే సమయంలో శ్రీనివాసనాయుడు దగ్గరకు వెళ్లారు చంద్రబాబు.. ఎలా ఉన్నావంటూ కుశలప్రశ్నలు వేశారు.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు చంద్రబాబుకు వివరించారు. డాక్టర్లు వెళ్లిపోయిన తర్వాత శ్రీనివాసనాయుడు రూమ్‌లో ఉన్న సోఫాలో కూర్చుని కొద్ది సేపు కబుర్లు చెప్పారు చంద్రబాబు.. ముచ్చట్లన్ని అయిన తర్వాత శ్రీనివాసనాయుడుకు కొన్ని ఆరోగ్య సూత్రాలను చెప్పారు.. 'నువ్వు టెన్షన్‌ పడుతున్నట్టున్నావు.. టెన్షన్ ఎందుకు? జాగ్రత్తగా పనిచేసుకో... నాలా ఉండటం నేర్చుకో... నేను చూడు.. ఎంత టెన్షన్‌ ఉన్నా జాగ్రత్తగా ఉంటాను.. నింపాదిగా పనిచేస్తాను.. నేను ఎంత పని ఒత్తిడిలో ఉన్నా రాత్రి వెళ్లి హాయిగా నిద్రపోతాను.. పడుకున్న వెంటనే నిద్రపడుతుంది' అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. 
 
       రూమ్‌లో ఉన్న అధికారులు.. నేతలు చంద్రబాబు చెప్పినవన్నీ విని బిత్తరపోయారు.. ఏం మాట్లాడాలో అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.. తమలో తాము నవ్వుకున్నారు.. ఆ తర్వాత చంద్రబాబు అందరివంకా చూస్తూ ఎవరూ టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదనీ.. ప్రశాంతంగా ఉంటేనే పనులు సాఫీగా జరుగుతాయనీ హితబోధ చేశారు. బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు...నేతలు చంద్రబాబు మాటలను మననం చేసుకున్నారు.. 'సీఎంకు టెన్షన్‌ ఎందుకుంటుంది..? చెప్పాల్సినవన్నీ చెప్పి ఆయన హాయిగానే ఉంటారు.. ఆ పనులు చేయలేక టెన్షన్‌ పడేది మనమే కదా' అని అనుకుంటూ ఒకరినొకరు సర్దిచెప్పుకున్నారు.. 
 
       ఆ తర్వాత చంద్రబాబుతో కలిసి మరో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఏలూరు ఎంపీ మాగంటి బాబు చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించిన చంద్రబాబు అక్కడ కూడా కొన్ని ఆరోగ్యసూత్రాలను వివరించారు. జాగ్రత్తగా ఉండాలంటూ మాగంటిబాబుకు సలహా ఇచ్చారు. ఈ వయసులో కూడా చంద్రబాబు 12 గంటలు పని చేయగలుగుతున్నారంటే అందుకు కారణం ఆ ఆరోగ్య సూత్రాలను పాటించడమే కదా అని అనుకున్న అధికారులు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...