Jump to content

Anantapur politics


Recommended Posts

కంచుకోటలో రాజకీయ వేడి!
17-05-2018 03:58:09
 
636621262896167653.jpg
  • మరోసారి ప్రభంజనంపై ‘అనంత’ టీడీపీ కన్ను..
  • అనంతపురం ఎంపీగా జేసీ కుమారుడి పోటీ?..
  • హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్పే
  • తెలుగుదేశం సిటింగ్‌ ఎమ్మెల్యేలకే అవకాశం
  • వైసీపీ తరపున కొన్ని సీట్లలో పోటీ
  • కల్యాణదుర్గం నుంచి పీసీసీ నేత రఘువీరా
 
అనంతపురం... రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గత ఎన్నికల్లో మిగిలిన మూడు సీమ జిల్లాలతో పోల్చితే ఇక్కడ టీడీపీ ప్రభంజనం వీచింది. 14 అసెంబ్లీ స్థానాల్లో 12, రెంటికి రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు ఆ తర్వాత టీడీపీలో చేరారు. తనకు అండగా నిలిచిన అనంతపురం జిల్లాలో అభివృద్ధిని పరుగులెత్తించడానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీని ఫలితంగా ప్రతిష్టాత్మక కియ కార్ల ఫ్యాక్టరీ తరలివచ్చింది. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొచ్చి జిల్లాలో పెద్ద సంఖ్యలో చెరువులను నింపడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం తన ప్రతిష్ఠ పెంచుకుంది. వీటి ద్వారా జిల్లాలో పట్టు చెదరకుండా చూసుకోవాలన్న ప్రయత్నంలో టీడీపీ నాయకత్వం ఉండగా... ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఆసరాగా ఆ పార్టీ ఆధిక్యాన్ని కొంతైనా తగ్గించాలని వైసీపీ ఎత్తులు వేస్తోంది.
 
ఎంపీ స్థానాలపై..
జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో అనంతపురానికి టీడీపీ తరపున మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఆయన బదులు కొడుకు పవన్‌కుమార్‌ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా పార్టీ అధిష్ఠానం సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. జేసీ పోటీ చేస్తేనే గెలుపు సులువవుతుందని అభిప్రాయపడుతోంది. ఇక్కడ వైసీపీలో పోటీ నెలకొంది. రిటైర్డ్‌ ప్రభుత్వ అధికారి రంగయ్య ను ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఇటీవల నియమించింది. బీసీ సామాజిక నేపథ్యం ఆయనకు ఉపకరిస్తుందని ఆ పార్టీ ఆశిస్తోంది. కానీ మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఈ స్థానాన్ని గట్టిగా ఆశిస్తున్నారు. పార్టీ నాయకత్వం ఆయన్ను అనంతపురం అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలని సూచిస్తోంది. కానీ తాను సీనియర్‌నని, అసెంబ్లీకి పోటీ చేయలేనని.. ఎంపీగానే బరిలోకి దిగుతానని ఆయన తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. హిందూపురం లోక్‌సభ స్థానానికి టీడీపీ తరపున నిమ్మల కిష్టప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాయకత్వం అవకాశం ఇస్తే పెనుగొండ అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలన్నది ఆయన కోరిక. కానీ ఆయనైతేనే ఎంపీగా గెలవగలుగుతారని, ఆయన్నే పోటీకి నిలుపుతారని చెబుతున్నారు. అనంతపురానికి చెందిన ముస్లిం మైనారిటీ నేత నదీంను వైిసీపీ నాయకత్వం ఇటీవల హిందూపురం ఎంపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. అదే సమయం లో ఆ పార్టీ నుంచి స్థానిక నేత కడపల శ్రీకాంత్‌రెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది.
 
అనంత పరిధిలో ఆసక్తికరంగా...
అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లలో కొన్నింటిలో ప్రధానపార్టీల్లో స్పష్టత ఉన్నా కొన్ని సీట్లలో రెండు పార్టీలు ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నాయి. జిల్లా కేంద్రంలో టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి ప్రజాదరణ ఉన్నా.. సొంతపార్టీలోనే కొంత అసమ్మతి ఎదుర్కొంటున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌ ఈ సీటుపై ఆసక్తితో పాదయాత్రలు చేస్తున్నారు. కానీ తండ్రీకొడుకులిద్దరికీ లోక్‌సభ, అసెంబ్లీ టికెట్లు రావడం కష్టమని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎంపీగా జేసీ కుటుంబ సభ్యులు పోటీచేసే పక్షంలో ఎమ్మెల్యేగా ప్రభాకర్‌ చౌదరి మళ్లీ పోటీ చేయడం ఖాయమని చెబుతున్నాయి. వైపీసీలో ఇంకా స్పష్టత రాలేదు. మాజీ ఎంిపీ అనంత వెంకట్రామిరెడ్డి పోటీకి సంసిద్ధంగా లేకపోవడంతో ఆ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారో స్పష్టత లేదు. తాడిపత్రిలో టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఢోకాలేదు. ఆయన పోటీ నుంచి వైదొలగి.. తన కొడుకు అస్మిత్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని కోరితే తప్ప మార్పు జరిగే అవకాశం లేదు. ఆయన కోరినా మార్పునకు అఽధిష్ఠానం అంగీకరిస్తుందో లేదో చూడాలి. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేయడం ఖాయమైంది. ఉరవకొండలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డికి ఈసారి సొంతపార్టీలో పోటీ ఎదురవుతోంది. మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఈసారి తనకు టికెట్‌ కావాలని పట్టుపడుతున్నారు. టీడీపీ నుంచి శాసనమండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌ పోటీచేయడం ఖాయమే. మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గంలో టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జేసీ సమీప బంధువు-ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఈ నియోజకవర్గంలో కార్యకలాపాలు పెంచారు. మంత్రితో సం బంధం లేకుండా జేసీ ఈ ఇద్దరు నేతలను నియోజకవర్గానికి తీసుకెళ్లి సమావేశం నిర్వహించారు. కాల్వ దీనిపై ఏ ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. వైిసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు. శింగనమల(ఎస్సీ) నియోజకవర్గంలో టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే యామినీబాలకు సొంత కుటుంబంలోనే పోటీ ఎదురవుతోంది. తన తల్లి, ఎమ్మెల్సీ శమంతకమణితో విభేదాలు నెలకొన్న నేపఽథ్యంలో తన కుమారుడు అశోక్‌కు ఈసారి టికెట్‌ ఇప్పించాలని శమంతకమణి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రిటైర్డ్‌ అధికారి బండారు రవికుమార్‌ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం సర్వీసు లో ఉన్న వారిలో ఒకరిద్దరు అధికారులకు కూడా ఈ నియోజకవర్గంపై ఆసక్తి ఉందని, ఎన్నికల సమయంలో వారు బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీలో నియోజకవర్గ ఇన్‌చార్జి జొన్నలగడ్డ పద్మకే టికెట్‌ దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే జితేందర్‌ గౌడ్‌కు కూడా పోటీ ఎదురవుతోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ ఈ సీటు కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మధుసూధన్‌ గుప్తా పేరును కొందరు టీడీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌ లో ఉన్నారు. దివంగత నేత కేసీ నారాయణ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఆశాభావంతో ఉన్నారు. వైసీపీ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న వెంకట్రామిరెడ్డికే ఈసారి టికెట్‌ వస్తుందని అనుకుంటున్నా ఇంకా మంచి అభ్యర్థి కోసం ఆ పార్టీ నాయకత్వం అన్వేషిస్తోంది.
 
హిందూపురం పరిధిలో ఇబ్బందుల్లేవు..
అనంతపురంతో పోలిస్తే హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంత రాజకీయ స్థిరత్వం కనిపిస్తోంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సినీహీరో బాలకృష్ణ మళ్లీ పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనపై వైిసీపీ నుంచి నవీన్‌ నిశ్చల్‌ పోటీ చేస్తారని అంటున్నారు. ధర్మవరంలో టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి) మళ్లీ పోటీ చేస్తారు. ఆయనపై వైిసీపీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని నిలిపే అవకాశం కనిపిస్తోంది. వైఎ్‌సఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకుడు జీవానందరెడ్డి కూడా రేసులో ఉన్నారు. రాప్తాడులో మంత్రి పరిటాల సునీత మళ్లీ పోటీ చేయడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కొడుకు శ్రీరాంకు అవకాశం ఇవ్వాలనుకుంటే ఆమె తనకు తానుగా తప్పుకొనే అవకాశం లేకపోలేదు. కానీ అంతిమంగా అధిష్ఠానం ఆదేశాలనే పరిటాల కుటుంబం పాటించే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాల కఽథనం. పెనుగొండలో టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథికే తిరిగి అవకాశం లభించనుంది. ఎంపీ కిష్టప్ప ఆసక్తి చూపుతున్నా పార్థసారథి వైపే అధిష్ఠానం మొగ్గుతోందని చెబుతున్నారు. వైసీపీ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి శంకరనారాయణకే టికెట్‌ లభించే అవకాశం ఉంది. మరింత మంచి అభ్యర్ధి కోసం ఆ పార్టీ అన్వేషిస్తోందని ప్రచారం జరుగుతోంది. పుట్టపర్తి నియోజకవర్గంలో శాసనసభ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి పార్టీలో అంతర్గతంగా కొంత అసమ్మతి ఎదుర్కొంటున్నా తిరిగి పోటీ చేసే విషయంలో ఆయనకు ఏ ఇబ్బందీ లేదని చెబుతున్నారు. అంతకంటేమంచి అభ్యర్థి మరెవరూ లేకపోవడమే దీనికి కారణం. వైసీపీ నుంచి ఈ నియోజకవర్గంలో శ్రీధర్‌రెడ్డి పోటీ చేయనున్నారు. కదిరిలో కొంత ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. సిటింగ్‌ ఎమ్మెల్యే చాంద్‌బాషా వైిసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కందికుంట వెంకట ప్రసాద్‌ వర్గం చాంద్‌బాషాను గట్టిగా వ్యతిరేకిస్తోంది. కోర్టు శిక్ష కారణంగా ప్రసాద్‌కు పోటీచేసే అవకాశం లేకపోవడంతో తన భార్య యశోదకు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లాలో ఏకైక ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే అయినందువల్ల తనకు ఇబ్బంది ఉండకపోవచ్చని చాంద్‌బాషా ధీమాగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైిసీపీ టికెట్‌ సిద్ధారెడ్డికి లభించే అవకాశం ఉంది. కడపల మోహన్‌రెడ్డి కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. మడకశిర(ఎస్సీ) స్థానం నుంచి టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే ఈరన్న మళ్లీ పోటీచేయడం ఖాయమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్సీ తిప్పేస్వామి మద్దతు ఉండడం ఆయనకు కలిసివస్తోంది. వైిసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఇక్కడ టికెట్‌కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గంపై పట్టున్న రఘువీరారెడ్డి కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను బరిలో నిలిపే అవకాశముంది. - ఆంధ్రజ్యోతి, అనంతపురం
 
కుమారుడికి కల్యాణదుర్గం కోరుతున్న సునీత
కల్యాణదుర్గం నియోజకవర్గ పరిస్థితి ఆసక్తి కలిగిస్తోంది. టీడీపీ సిటింగ్‌ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పార్టీలో సీనియర్‌. ఈసారి కూడా పోటీ కి సన్నాహాలు చేసుకొంటున్నారు. వయసు రీత్యా ఏవైనా అభ్యంతరాలొస్తే తన కొడుకు మారుతి లేదా కోడలు వరలక్ష్మికి ఇవ్వాలని ప్రతిపాదించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చౌదరిని మార్చేపక్షంలో అక్కడ తన కొడుకు శ్రీరాంకు అవకాశం ఇవ్వాలని మంత్రి పరిటాల సునీత కోరతారని అంటున్నారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం నుంచి మారాల్సి వస్తే ఆయన పేరు కూడా పరిశీలనకు రావచ్చని కథనం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీ చేస్తానని రఘువీరా ప్రకటించారు. వైసీపీ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఉషాచరణ్‌కే తిరిగి అవకాశం రావచ్చని అంటున్నారు.
Link to comment
Share on other sites

1 hour ago, NTR2727 said:

Can u elaborate ?

The typical ruling party corruption..making/demanding money for works etc. I heard that sunita lost handle of things happening around her. Not sunita directly but mostly to do with the people surrounding her it seems.

Edited by curiousgally
Link to comment
Share on other sites

ఆ ఇద్దరి మధ్య విభేదాలు.. అయోమయంలో తెలుగు తమ్ముళ్లు
23-05-2018 12:07:44
 
636626740658951119.jpg
కదిరి అంటే కుంకుమకు, మల్లెలకు ఫేమస్‌. ఇప్పుడు అదే స్థాయిలో తెలుగుదేశంలోని నేతల మధ్య విభేదాలకు కూడా కేరాఫ్‌గా నిలిచింది. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించినా డోంట్‌కేర్‌ అనే స్థాయిలో నాయకులు వ్యవహరిస్తుండడం గమనార్హం. ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా, నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్‌ ఇద్దరూ ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం కూడా మినీ మహానాడులు విడివిడిగా నిర్వహించారు. దీంతో ఎవరి వెనుక ఉండాలో తేల్చుకోలేక ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా నేతల మధ్య సమన్వయం లేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
 
 
అనంతపురం: కదిరి టీడీపీ విభేదాలకు కళ్లెం వేసేదెవరు? అక్కడి ఎమ్మెల్యే చాంద్‌బాషా, నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ మధ్య సమన్వయం చేసేదెవరు? ఇవీ ప్రస్తుతం కదిరి నియోజకవర్గ టీడీపీ శ్రేణు ల్లో ఉతప్పన్నమవుతున్న ప్రశ్నలు. వారిద్దరి మ ధ్య ఏర్పడిన విభేదాలు రోజురోజుకూ ముదురుపాకాన పడుతున్నాయి. ఎన్నికలకు ఏడాది కూ డా లేని ప్రస్తుత సమయంలో ఇద్దరూ విడివిడి గా కదిరి మహానాడు నిర్వహించడం విశేషం. 2014 ఎన్నికల తరువాత ఎమ్మెల్యే చాంద్‌బాషా వైసీపీనుంచి టీడీపీలో చేరినప్పటి నుంచి పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. చాంద్‌బాషాకు, కందికుంటకు మధ్య పరిస్థితి ఉప్పు, నిప్పులా మారింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి చాంద్‌బాషా, టీడీపీనుంచి కందికుంట పోటీచేశారు. ఆ ఎన్నికల్లో చాంద్‌బాషా విజయం సాధించారు. వారిద్దరూ ఒకప్పటి సన్నిహితులే అయినా ఆ ఎ న్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. ఎన్నికల అనంతరం టీడీపీ అమలు చేసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా ఎమ్మెల్యే చాంద్‌బాషా అధికార పార్టీలో చేరారు. ఆ తర్వాత నియోజకవర్గ టీడీపీలో ఇ ద్దరు నాయకులు చెరో గ్రూపుగా చీలిపోయారు.
 
ఆదినుంచీ వేరు కుంపట్లే..
చాంద్‌బాషా టీడీపీలో చేరినప్పటి నుంచి కందికుంట ఆయనపై గుర్రుగానే ఉన్నారు. పార్టీ శ్రేణులను తన వైపు తిప్పుకోవడానికి ఇద్దరూ ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. గత ఎన్నికల్లో వారిద్దరూ ప్రత్యర్థులుగా నిలవడంతో ఏకతాటిపైకి రాలేకపోతున్నారు. అయినా ఇద్దరూ టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చెరో గ్రూపునకు నాయకత్వం వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల అనంతరం సుమారు రెండేళ్లకు చాంద్‌బాషా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకు ముందు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కందికుంట బాధ్యతలు నిర్వహించేవారు. పార్టీకి అన్నీ తానై చూసుకునేవారు. చాంద్‌బాషా టీడీపీలో చేరిన తరువాత కూడా కందికుంటనే నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎవరి పట్టు వారు నిలుపుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 2016లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించాల్సిన కందికుంట పార్టీపై అలకబూనారు. ఆ సమయంలో కందికుంట వద్దకు వచ్చిన పార్టీ ప్రచార సామగ్రిని అధిష్ఠానం ఎమ్మెల్యే చాంద్‌బాషాకు అప్పగించింది. దీంతో చాంద్‌బాషా ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు.
 
ఆ సమయంలో మెజారిటీ టీడీపీ శ్రేణులు కందికుంటవైపే ఉండడంతో చాంద్‌బాషాకు కొంత ఎదురుగాలి వీచింది. అయినా టీడీపీని కందికుంట వీడలేదు. ఆ సమయంలో జరిగిన జిల్లా మహానాడులో తాము పార్టీలో ప్రొఫెసర్ల లాంటి వారమని, స్టూడెంట్లు వస్తుంటారు.. పోతుంటారని వ్యాఖ్యానించారు. ఆ పరిణామాలను జిల్లా అధిష్ఠానం తేలిగ్గా తీసుకోవడంతో వారిద్దరి మధ్య విభేదాలు ముదురు పాకానపడ్డాయి. దీనిపై పార్టీ రాష్ట్ర శాఖ జోక్యం చేసుకోవడంతో 2017లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపైకి చేరారు. ఎడ్లబండిలో ప్రయాణించి తాము ఒక్కటయ్యామని శ్రేణులకు చాటడానికి ప్రయత్నించారు. అ ది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆ తరువాత కార్యక్రమాలన్నీ కదిరిలో ఇద్దరూ విడివిడిగానే నిర్వహించారు. మంగళవారం కదిరి మినీ మహానాడు కూడా విడివిడిగా నిర్వహించారు.
 
అధిష్ఠానం మౌనం ఎందుకో?
కదిరిలో టీడీపీ నేతలిద్దరూ చెరో గ్రూపునకు నాయకత్వం వహిస్తున్నా అధిష్ఠానం ఎందుకు మౌనంగా ఉందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పుట్టపర్తిలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు అప్పటి మున్సిపల్‌ చైర్మన్‌పై జిల్లా అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. రాయదుర్గం నియోజకవర్గంలోనూ డీ. హీరేహాళ్‌ ఎంపీపీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. తాడిపత్రిలో కూడా ఇద్దరు టీడీపీ నేతలపై పార్టీ అధిష్ఠానం కొరడా ఝుళిపించింది. ఇంకా అక్కడక్కడా జిల్లాలో కొంతమందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వచ్చారు. కానీ.. కదిరి టీడీపీలో రోజురోజుకూ క్రమశిక్షణ అదుపు తప్పుతున్నా అధిష్ఠానం మౌనం వహించడంతో ఆ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. ఇక ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదని, నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడరుందని, అయినా ఎందుకు పెద్దలు పట్టించుకోవడం లేదని తెలుగుతమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

On 5/17/2018 at 2:05 AM, curiousgally said:

The typical ruling party corruption..making/demanding money for works etc. I heard that sunita lost handle of things happening around her. Not sunita directly but mostly to do with the people surrounding her it seems. 

 

Big works lo commission okay le....vaallu votes negligible....

Link to comment
Share on other sites

Anantapur & Chittoor lo expecting clean sweep from TDP this time. 

Hope people will vote for Development in these 2 Districts irrespective of religion or caste. Very visible development changes can be seen in some parts of these 2 districts.

Kurnool & Kadapa lo kooda KIA laanti 1-2 industries vasthe TDP will do well in entire Rayalaseema.

Link to comment
Share on other sites

4 hours ago, RKumar said:

Anantapur & Chittoor lo expecting clean sweep from TDP this time. 

Hope people will vote for Development in these 2 Districts irrespective of religion or caste. Very visible development changes can be seen in some parts of these 2 districts.

Kurnool & Kadapa lo kooda KIA laanti 1-2 industries vasthe TDP will do well in entire Rayalaseema.

Chittoor town kashtam candidate change cheyyakapothe, Chittoor district ante Only Tirupathi anukontunnaru manalni partinchukovatledu ane feeling ekkava vundi

GD Nellore strong candidate ledu 90% loss 

Peddyreddy will win

Thamballapalle same mla ayithe sure loss

Srikalahasthi meeda doubt antunnaru no idea

Rest all can can

My prediction 10/14

 

Link to comment
Share on other sites

తీరు మారాలి... తమ్ముళ్లూ!
 ఆధిపత్యానికే నాయకుల ప్రాధాన్యం
 ఎన్నికల వేళయినా సర్దుకుంటారా?
 నేడు పుట్టపర్తిలో జిల్లా మహానాడు
atp-top2a.jpg

ఈనాడు - అనంతపురం: అనంత... తెలుగుదేశానికి కంచుకోట. సరిగ్గా ఏడాదిలో ఎన్నికలు. ఈలోపే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈతరుణంలో జిల్లాలో ఎన్నికలకు ముందు నుంచి ప్రత్యేక సన్నద్ధతతో, ఐక్యతతో ఉంటూ పార్టీ శ్రేణులకు మార్గదర్శకంగా నిలవాల్సిన అగ్రనాయకుల్లో కొందరు ఆధిపత్య పోరుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ కంటే తమ హవానే ముఖ్యమనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. మరికొన్నిచోట్ల ఓ నియోజకవర్గం వారు మరో ప్రాంతంలో తలదూరుస్తూ వర్గపోరుకు తెరలేపుతున్నారు. ఇదేసమయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో పుట్టపర్తి వేదికగా గురువారం నిర్వహించనున్న జిల్లా మహానాడులో నాయకులు ఐక్యతారాగం చూపుతారా? అహం వీడి కలిసి సాగుతారా? అని శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. గత ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించిన అనంతపురం జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానమనీ, ఈ జిల్లాకు ఎంత నిధులైనా వెచ్చిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నారు.  మాట ఇచ్చినట్లే వివిధ ప్రాజెక్టులకు పెద్దఎత్తున నిధులు ఇస్తున్నారు. అనేక పనులు మంజూరు చేస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తున్నారు. ఈతరుణంలో జిల్లాలో తెలుగుదేశం తిరుగులేనిదిగా మారాల్సి ఉంది. కానీ వాస్తవ పరిస్థితిలో మాత్రం కొంత తేడాలు వస్తున్నాయి. శ్రేణులు బలంగా ఉన్నా.. కొన్నిచోట్ల నాయకుల్లో సఖ్యత లేకపోవడం, ఆధిపత్య పోరుతో పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయి. ఏ వర్గంలో ఉండాలి? ఎవరికి మద్దతు తెలపాలో శ్రేణులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే ఓ నియోజకవర్గంలో ఒక నాయకుడు బలంగా ఉంటే, వారిని కొంత వరకు అయినా తగ్గించే ఉద్దేశంతో ఇతర నాయకులు అటుగా తొంగి చూస్తున్నారు. దీంతో వారి మధ్య విభేదాలు వస్తున్నాయి. మరికొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరు తీవ్రంగా ఉండటంతో శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు దఫాలు జిల్లా నాయకులతో నిర్వహించిన భేటీల్లో కలిసి పనిచేయాలని చెప్పినా సరే చాలా మంది పట్టించుకోవడం లేదు. రెండు రోజులు కలిసున్నట్లు కనిపించినా, ఆ తర్వాత నుంచి మళ్లీ యథావిధిగా ఆధిపత్య పోరు సాగిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఏమవుతుందో అని ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

ఎక్కడికక్కడ పేచీలు...
* కదిరిలో ఎమ్మెల్యే చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ రెండు వర్గాలుగా ఉన్నారు. చాంద్‌బాషా పార్టీలో చేరినప్పటి నుంచి కందికుంటకు, ఆయనకు సఖ్యత లేదు. ఏ కార్యక్రమం అయినా వేర్వేరుగానే నిర్వహిస్తున్నారు. ఆ మధ్య కొన్ని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉండటంతో చాలా కాలం వాటిని ఆపేశారు. తర్వాత ఎలాగోలా కొన్ని కొలిక్కి వచ్చాయి. అయితే ఆ ఇద్దరు నాయకులు మాత్రం కలవడం లేదు. తాజాగా నియోజకవర్గ మినీ మహానాడు సైతం వేర్వేరుగా నిర్వహించారంటే అక్కడి పార్టీ పరిస్థితి ఏంటనేది స్పష్టమవుతోంది.
* పెనుకొండలో అక్కడి ఎమ్మెల్యే, జిల్లా తెదేపా అధ్యక్షుడు బీకే పార్థసారథి చక్రం తిప్పుతున్నారు. కానీ.. గోరంట్ల మండలం విషయంలో మాత్రం... ఆయనకు, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పకు ఆధిపత్యపోరు వస్తోంది. కిష్టప్ప సొంత మండలం కావడంతో ఆయన తన ఆధిపత్యం చూపేయత్నం చేస్తుండగా... నా నియోజవర్గంలో ఆయన పెత్తనం ఏంటనే తీరుతో బీకే ఉన్నారు. మొత్తానికి ఈ మండలం విషయంలో ఇద్దరూ నువ్వా నేనా అనేలా వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య కొన్ని సీసీ దారుల పనులు, జన్మభూమి కమిటీల విషయంలో కూడా తమ మాటే నెగ్గాలని ఇద్దరూ పంతం పట్టారు. దీంతో వీరిద్దరికీ సర్దిచెప్పలేక అధికారులు కూడా ఆపసోపాలు పడుతున్నారు.
* అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరికి, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మొదటి నుంచి ఉప్పూ, నిప్పులా ఉంది. ఇద్దరూ కలిసి అధికారిక కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు అరుదనే చెప్పాలి. రాంనగర్‌ వంతెన నిర్మాణం మొదలు, రహదారుల విస్తరణ తదితర అంశాల్లో గతంలో విమర్శలు చేసుకున్నారు. ఆ మధ్య నగరపాలికలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఎంపీ వ్యాఖ్యానించారు. దీంతో మేయర్‌ స్వరూప సైతం ఎంపీ తీరును దుయ్యబట్టారు. ఇక ఎంపీ కుమారుడు పవన్‌ అనంతపురంలో ఏదైనా కార్యక్రమాన్ని సొంతంగా నిర్వహిస్తున్నారు. ఆయన ప్రత్యేకంగా ఓ వర్గాన్ని కూడగట్టుకొని వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు నగరంలో కొందరు ఎమ్మెల్యేకు వ్యతిరేకవర్గంగా ఉన్నారు. వీరిలో కొందరు కార్పొరేటర్లు ఇటీవల మాజీ ఎంపీ సైఫుల్లా ఇంటికివెళ్లి, ఆయన కుమారుడితో భేటీ కావడం చర్చనీయాంశమైంది.
* రాయదుర్గం నుంచి మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంత కాలంగా  దుర్గంపై ఎంపీ జేసీ ప్రత్యేక దృష్టిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. జేసీ చొరవతో వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, జేసీ కుమారుడు పవన్‌ తదితరులంతా రాయదుర్గంలో ఓ సామాజిక సమీకరణ సమావేశం నిర్వహించారు. దీనికి దివాకర్‌రెడ్డి హాజరయ్యారు. దీనిపై మంత్రి కాలవ వర్గీయులు మండిపడుతున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన తమ నాయకుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వీరంతా భేటీ కావడంపై ప్రశ్నించారు. దీనిపై మంత్రి బయటకు మాట్లాడకపోయినా.. అప్పటి నుంచి మంత్రికి, ఎంపీకి కొంత దూరం ఏర్పడినట్లు తెలుస్తోంది.
* శింగనమలలో తల్లీ, కుమార్తెలైన ఎమ్మెల్సీ శమంతకమణి, విప్‌ యామినీబాల మధ్య కొంత కాలంగా సఖ్యత లేదని అక్కడి నాయకుల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక విషయంలో సైతం తాను చెప్పిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలంటూ ఎమ్మెల్యే అధికారులకు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కిందట నిర్వహించిన నియోజకవర్గ మినీమహానాడుకు సైతం తొలుత శమంతకమణి హాజరుకాపోవడంతో కొందరు నాయకులు బుజ్జగించి ఆమెను తీసుకొచ్చారని తెలుస్తోంది. వీరిలా ఉండటంతో ఏం చేయాలో క్యాడర్‌కు పాలుపోవడం లేదు.
* గుంతకల్లులో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ ఉన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తా తెదేపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీ జేసీ ఆయనకు మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ నియోజకవర్గంలో మున్ముందు రాజకీయాలు ఎలా మలుపులు తిరుగుతాయనేది చూడాల్సి ఉంది.
* తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అంతా తానై వ్యవహరిస్తూనే... కుమారుడు అస్మిత్‌రెడ్డిని ఎక్కువగా ప్రజల్లో తిప్పుతున్నారు. ఇదే సమయంలో తాడిపత్రిలో కొందరు తెదేపా నాయకులు ప్రభాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తారు. వారు వేరొక వర్గంగా ఏర్పడ్డారు. పార్టీ కార్యాలయాన్ని కూడా వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. తెదేపా కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డిని పురపాలిక సమావేశాల్లోకి హాజరుకాకుండా పదేపదే సస్పెండ్‌ చేస్తున్నారు. దీనిపైనా విమర్శలు ఉన్నాయి. మరోవైపు జయచంద్రారెడ్డి, అతని సోదరుడు జగదీశ్వర్‌రెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ ఇవ్వాలంటూ పార్టీ నుంచి ఆ ఇద్దరు నాయకులకు తాఖీదులు వచ్చాయి. దీనిపై స్పందించిన వారు తాడిపత్రిలో ఏం జరుగుతోందనేది సమగ్ర వివరాలు, ఆధారాలతో పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు తెలిసింది.
* ఇక రాప్తాడుకు చెందిన మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే సూరి మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. బయటకు బాగానే ఉన్నట్లు కన్పిస్తున్నా వీరి మధ్య పోరు తారస్థాయిలో ఉంది. ఇటీవల నిర్వహించిన జాతీయ రహదారుల విస్తరణ, వంతెనల టెండర్లలో గుత్తేదారులు పెద్దఎత్తున పోటీపడటం, గతంలో ఎన్నడూ లేనంతగా అంచనా వ్యయం కంటే తక్కువ మొత్తానికి పోటీపడి కొందరు టెండర్లు పొందటం వెనుక ఈ ఇద్దరి పోరే కారణంగా తెలుస్తోంది.

తెదేపాలోకి మధుసూదన్‌గుప్తా?
గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా పసుపు కండువా వేసుకోనున్నట్లు తెలిసింది. 2009లో కాంగ్రెస్‌ తరపున గెలిచిన ఆయన 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కొంతకాలంగా ఆయన తెదేపాలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ద్వారా ఆయన తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ పెద్దల నుంచి పిలుపు కూడా వచ్చినట్లు తెలిసింది. ఈ నెల 27న విజయవాడలో జరిగే మహానాడుకు హాజరుకావాలని ఆహ్వానం అందినట్లు తెలిసింది. అక్కడే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. మధుసూదన్‌ అనుయాయులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
అనంతపురంలో వైసీపీకి భారీ షాక్‌
02-07-2018 13:10:40
 
636661338391095126.jpg
  • సింగిల్‌ విండో అధ్యక్షుడు కేవీ చౌదరి టీడీపీలో చేరిక
  • సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే గోనుగుంట్ల
ధర్మవరం/అనంతపురం: బత్తలపల్లి మడలంలో వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, బత్తలపల్లి సింగిల్‌ విండో అధ్యక్షుడు కేశనపల్లి వెంకటచౌదరి వైసీపికి గుడ్‌బై చెప్పి ఆదివారం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. భారీ జనం మధ్య సుమారు 500 మందికి పైగా అనుచరులతో అట్టహాసంగా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కేవీ చౌదరితో పాటు ఆయన అనుచరులకు శాలువాలు కప్పి టీడీపీలోకి ఎమ్మెల్యే గోనుగుంట్ల ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం పెల్లుబికింది. కేశనపల్లి వెంకటచౌదరి మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నా చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం, స్థానికంగా కూడా కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి పార్టీలకతీతంగా ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదరించడమే తనను పార్టీలోకి చేరేలా ప్రేరేపించాయన్నారు.
 
జీవితాంతం ఎమ్మెల్యేగా గోనుగుంట్ల గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గోనుగుంట్ల మాట్లాడుతూ కేవీ చౌదరి టీడీపీలోకి రావడంతో పార్టీకి మరింత బలం చేకూరినట్లయిందన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం కలగా మిగిలిపోవాల్సిందేనన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, ఆ మూడు పార్టీలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉండడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ కమతం కాటమయ్య, మండల కన్వీనర్లు వీరనారప్ప, నారాయణస్వామి, దేవేంద్రరెడ్డి, జక్కంపూటి వెంకటేశ్వరచౌదరి, జక్కంపూటి పురుషోత్తం చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అనంతపురం జిల్లాలో వైసీపీ పరిస్థితి తెలిస్తే...
10-07-2018 11:33:12
 
636668191917590238.jpg
  • వైసీపీలో లుకలుకలు!
  • ఎవరికి వారే యమునా తీరే
  • పదవుల పందేరంతో సమస్యలు
  • ఆధిపత్యపోరు.. గ్రూపులాట
అనంతపురం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఎక్కడికక్కడ ఆధిపత్య పోరు అధికమయింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కదిరిలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జరిగిన ఘర్షణే ఇందుకు తాజా నిదర్శనం. ఆ పార్టీలో పెత్తనం కోసం కొన్నిచోట్ల ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. మరికొన్ని చోట్ల ఎవరికి వారుగా వైఎస్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. మరికొన్ని చోట్ల ఆయా నియోజకవర్గాల్లోని మండలాల్లో కూడా వైసీపీ శ్రేణులు విడివిడిగా వైఎస్‌ జయంతి వేడుకలను జరుపుకున్నాయి. ప్రధానంగా కదిరిలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. చివరికి పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే 2014 ఎన్నికల అనంతరం వైసీపీని ఏకతాటిపై నడిపించే నాయకత్వం కరువైందనే విమర్శలున్నాయి. అందులోనూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో చేసిన ప్రయోగాలు అంతగా విజయవంతం కాలేదనే అభిప్రాయాలున్నాయి. ప్రధానంగా అనంతపురం నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఉన్న నదీం అహ్మద్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించడంతో జిల్లాలోని ముస్లింలలో వైసీపీపై విశ్వాసం సన్నగిల్లిందనే చెప్పాలి. పొమ్మనలేక పొగపెట్టి ఆయనకు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలిచ్చారని ఆ సామాజికవర్గీయులు అభిప్రాయపడుతున్నారు.
 
అనంతపురంలో వైసీపీ బాధ్యతలు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి టీడీపీలోకి చేరిన తరువాత నదీం అహ్మద్‌ను తెరమీదికి తెచ్చారు. అంతలోనే ఆయనను అక్కడి నుంచి హిందూపురానికి మార్చారు. ఇలా కొన్నిచోట్ల చేసిన ప్రయోగాలు వైసీపీలో గ్రూఫులను పెంచాయి. టీడీపీ నేతలను ఢీకొట్టగలరనే నమ్మకమున్న మరికొన్ని చోట్ల నేతలు నోరు జారడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఇలా నాయకులకు పార్టీ పదవులు పందేరం చేయడంతో జిల్లాలో బహునాయకత్వం పెరిగిపోయింది. దీంతో ఎవరికి వారుగా తామే నియోజకవర్గ నాయకులమంటూ చెలామణి అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఎవరికీ ఖరారు చేయలేదని, తామూ టిక్కెట్ల బరిలో ఉన్నామని బాహాటంగానే చెబుతున్నారు. టిక్కెట్ల గొడవ అటుంచితే జిల్లాలో జగన్‌ పార్టీ లుకలుకల మధ్య నలుగుతోందనే చెప్పాలి. పార్టీని సమన్వయపరచడంలో జిల్లా నాయకుల పాత్ర నామమాత్రంగా మారింది.
 
 
అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో..
అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని శాసనసభానియోజకవర్గాల్లోనూ వైసీపీలో గ్రూపులున్నాయి. ప్రధానంగా అనంతపురం నియోజకవర్గంలో గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు ముగ్గురికి నియోజకవర్గ బాధ్యతలు మార్చారు. తొలుత గుర్నాథరెడ్డికి, ఆయన టీడీపీలో చేరిన తరువాత ముస్లిం నేత నదీం అహ్మద్‌కు బాధ్యతలిచ్చారు. తమ సామాజికవర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని నగరంలో పట్టు సాధించుకుంటున్న తరుణంలో ఆయనకు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలప్పగించారు. ఆ స్థానంలో అప్పటివరకు అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని నిలబెట్టారు. అనంతపురం నియోజకవర్గంలో నదీం తరువాత నగరానికి చెందిన వైవీ శివారెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ కార్యదర్శి పదవినిచ్చారు. నగరంలోనే మహలక్ష్మి శ్రీనివాస్‌ కూడా వైసీపీ నాయకుడిగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఆశిస్తున్నారు. కాగా, మునిరత్నం ట్రావెల్స్‌కు చెందిన మునిరత్నం శ్రీనివాస్‌ కూడా జగన్‌తో టచ్‌లో ఉంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. వీరి మధ్యలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాగే పరశురాం టిక్కెట్టు ఆశించకపోయినా తానూ ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్నానని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న అనంత వెంకట్రామిరెడ్డికి బహునాయకత్వాన్ని ఏకతాటిపై నడిపించడం కష్టంగా మారిందనే విమర్శలున్నాయి.
 
 
తాడిపత్రి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వీఆర్‌ రామిరెడ్డి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అప్పట్లో ఆయన రూ. కోట్లు ఖర్చు చేశారు. రెండేళ్ల క్రితం ఆ నియోజకవర్గంలో సమన్వయకర్త బాధ్యతలు పెద్దారెడ్డికి అప్పగించారు. దీంతో అక్కడ వైసీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైసీపీలో రెండేసి గ్రూపులున్నాయి. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి వైసీపీ నాయకులుగా ఉన్నారు. వారిద్దరికీ టిక్కెట్ల విషయంలో పోరు సాగుతోంది. కాపు రామచంద్రారెడ్డి గాలి జనార్దనరెడ్డి అనుచరుడిగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి వచ్చిన పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డి తన కుమారుడైన అజయ్‌కుమార్‌ రెడ్డిని బరిలోకి దించే యత్నాల్లో ఉన్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కడప జిల్లాకు చెందిన నేత వైఎస్‌ కొండారెడ్డిని నియమించినా ఫలితం కనిపించలేదు. ఆ నియోజకవర్గ వైసీపీలో రెండు గ్రూపులు బలంగా తయారయ్యాయి. గుంతకల్లు నియోజకవర్గంలో వైసీపీ నేతగా వై వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ చేతిలో ఓడిపోయారు. ఏడాది నుంచి ఆ నియోజకవర్గంలో వైఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ తరపున జీవానందరెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి బొమ్మ ముందుంచుకుని ఆయన పోటీకి సై అంటున్నారు. దీంతో గుంతకల్లు నియోజకవర్గంలో కూడా వైసీపీలో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఉరవకొండలో వైసీపీ ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఆ సీటును మాజీ ఎమ్మెల్యే వై. శివరామిరెడ్డి ఆశించారు. కానీ, విశ్వేశ్వరరెడ్డికి టిక్కెట్టు దక్కడంతో ఆయన విజయానికి కృషి చేశారు. వచ్చే ఎన్నికల్లో శివరామిరెడ్డి కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డికి, శివరామిరెడ్డికీ మధ్య అంతరాలు పెరిగాయని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
 
కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్తగా ఉషశ్రీ కొనసాగుతున్నారు. అక్కడ పార్టీలోని సీనియర్లను కలుపుకుపోవడంలో ఆమె విఫలమయ్యారనే విమర్శలున్నాయి. దీంతో అక్కడున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, మరో నేత తిప్పేస్వామి ఉషశ్రీకి వ్యతిరేకంగా ఉన్నట్టు ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఆ నియోజకవర్గ వైసీపీలో గ్రూపులు మండలాలకు కూడా పాకాయి. ఇక శింగనమల నియోజకవర్గంలో వైసీపీ నాయకురాలిగా జొన్నలగడ్డ పద్మావతి కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆమె టీడీపీ చేతిలో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ మాజీ మంత్రి శైలజానాథ్‌ కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు. అయితే ఆయన నుంచి ఎదురయ్యే పోటీని నిలువరించడానికి పద్మావతి ఇప్పటికే కార్యక్రమాలు ముమ్మరం చేశారు. కాగా, పార్లమెంటు నియోజకవర్గస్థాయి నాయకుడిగా ఇప్పటివరకూ అనంత వెంకట్రామిరెడ్డి ఉండేవారు. ఆ స్థానంలో జిల్లా అధికారిగా పనిచేసిన తలారి రంగయ్యను రంగంలోకి దింపారు.
 
 
హిందూపురం నియోజకవర్గంలో..
హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని శాసనసభా నియోజకవర్గాల్లో కూడా వైసీపీలో గ్రూపులు మూడుపువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి. కదిరిలో నియోజకవర్గ సమన్వయకర్త సిద్దారెడ్డికి, వజ్ర భాస్కరరెడ్డికీ మధ్య పొసగడం లేదు. వారిద్దరూ వేర్వేరు గ్రూపులకు నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆదివారం వైఎస్‌ జయంతి సందర్భంగా ఆధిపత్యపోరులో భాగంగా రాజశేఖరెడ్డి విగ్రహం వద్ద ఇరువర్గాలూ దాడులు చేసుకోవడం విశేషం. దీంతో అక్కడ ఆధిపత్యపోరులో రెండు గ్రూపులుగా పార్టీ చీలింది. మడకశిర నియోజకవర్గంలో సమన్వయకర్తగా తిప్పేస్వామి ఉంటున్నారు. అదే నియోజకవర్గ వైసీపీ నేతలుగా మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి నర్సేగౌడ్‌.. తిప్పేస్వామికి అనుకూలంగా ఉంటున్నారు. మరోనేత సిద్దగిరి శ్రీనివాసులుకు తిప్పేస్వామికి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. ఈ ప్రభావంతో ఆ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైసీపీలో గ్రూపులు ఏర్పడ్డాయి. పెనుకొండ సమన్వయకర్తగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఉంటున్నారు. ఆయనకు నియోజకవర్గంలో ఇంటిపోరు అధికమైందనే విమర్శలున్నాయి.
 
 
రియల్‌ వ్యాపారి పొగాకు రామచంద్ర పార్టీలో టిక్కెట్‌ ఆశిస్తున్నారు. నెల నుంచి ఆయనను పక్కన పెట్టడంతో అక్కడ వైసీపీలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. అదే నియోజకవర్గంలో గోరంట్లకు చెందిన సుదర్శనశర్మ కూడా వచ్చే ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని చెబుతున్నట్టు సమాచారం. ఇలా అక్కడ బహు నాయకత్వంతో ఎవరికి వారుగా తయారయ్యారనే విమర్శలున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో పోటీ చేసి పరిటాల సునీత చేతిలో ఓడిపోయారు. ఈయన వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని ఉన్నారు. అయితే ఇటీవల ఉద్యోగులపై ఆయన నోరుజారిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతేకాకుండా ఉద్యోగవర్గాలు ఆయనకు దూరమయ్యాయనే అభిప్రాయాలున్నాయి. కాగా, రాప్తాడు వైసీపీలో తోపుదుర్తి కవిత, రిటైర్డ్‌ జిల్లా జడ్జి కిష్టప్ప కూడా వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం ఆశిస్తున్నారు.
 
 
పుట్టపర్తి నియోజకవర్గ వైసీపీలో మాజీ ఎమ్మెల్యే కడపల మోహనరెడ్డికీ, ఎస్వీ సోమశేఖరరెడ్డికీ మధ్య విభేదాలున్నాయి. వారిద్దరూ చెరో గ్రూపునకు నాయకత్వం వహిస్తుండగా మరో నేత కడపల శ్రీకాంత్‌రెడ్డి తటస్థంగా వ్యవహరిస్తున్నారు. హిందూపురంలో వైసీపీ నాయకుడిగా నవీన్‌నిశ్చల్‌ వ్యవహరిస్తున్నారు. కానీ ఆ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో రెడ్డి సామాజికవర్గం ఆయనను వ్యతిరేకిస్తోందనే విమర్శలున్నాయి. అక్కడ బీసీలు, రెడ్డి సామాజికవర్గం మధ్య వైసీపీలో గ్రూపులున్నాయి. వైఎస్‌ జయంతిని ఆ గ్రూపులు వేర్వేరుగా నిర్వహించుకోవడం గమనార్హం. ధర్మవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమన్వయకర్తగా ఉంటున్నారు. ధర్మవరంలో తాడిమర్రి చంద్రశేఖరరెడ్డి తటస్థంగా మారడంతో అక్కడ వైసీపీలోని ఒక వర్గం కూడా స్తబ్ధుగా మారింది.
Link to comment
Share on other sites

వీళ్లలో ఎందరికి వైసీపీ, టీడీపీ టికెట్లు దక్కేను?
16-07-2018 13:59:46
 
636673463871133332.jpg
  • మాజీల పయనమెటు?
  • ఉనికి కోసం కొందరి ఉబలాటం
  • 2019కి మరి కొందరి సమాయత్తం
అనంతపురం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 2019 ఎన్నికలు సమీపించబోతున్నాయి. అధికార పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నవారు తమతమ సీట్లు పదిలం చేసుకోవడానికి అవసరమైన ఎత్తుగడలు వేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీలో కూడా కొందరు వర్ధమాన నాయకులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా 2019లో టిక్కెట్లు సంపాదించి పోటీచేసే ప్రయత్నాల్లో మునిగిపోయారు. పాతకాపుల్లో కొందరు తమ ఉనికి చాటుకోవడానికి వీలుగా వచ్చే ఎన్నికల్లో అవకాశం కోసం ఉబలాటపడుతున్నారు.
 
వారిలో ఇంకొందరు 2019లో ఎలాగైనా పోటీ చేయాలనే దిశగా సమాయత్తమవుతున్నారు. కాగా, అధికారంలో ఉన్న టీడీపీ గానీ, ప్రతిపక్ష వైసీపీ గానీ ఎవరికి వారుగా రేసుగుర్రాలు వెతుక్కుంటున్నాయి. కాంగ్రెస్‌ మాత్రం తన ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ ప్రాబల్యం ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. కొత్తగా రంగంలోకి వచ్చిన జనసేన ఇంకా తమ పార్టీకి ఎవరు బాధ్యులో నిర్ణయించలేదు. ఈ పరిస్థితుల్లో మన మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటో ఒకసారి చూద్దాం.
 
 
మధుసూదన్‌ గుప్త
ఈయన 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గుంతకల్లు నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ఆయనకు 2014లో టిక్కెట్‌ దక్కలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీ టిక్కెట్టు రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సహకారంతో ఆ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇటీవల అనంతపురంలో నిర్వహించిన ఎంపీల నిరసన దీక్షలో పాల్గొనడం ద్వారా ఆయన సైకిలెక్కేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
 
 
కాపు రామచంద్రారెడ్డి
రాయదుర్గం నుంచి 2004, 2009 సంవత్సరాల్లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా ఈయన గెలుపొందారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ టిక్కెట్‌ రేసులో ఉన్నారు.
 
 
మెట్టు గోవిందరెడ్డి
ప్రస్తుతం ఈయన టీడీపీలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా పదవీకాలం ముగియడంతో వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం టీడీపీ టిక్కెట్‌ కావాలని కోరుతున్నట్టు సమాచారం. గతంలో ఆయన టీడీపీ తరపున రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
 
 
కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
ధర్మవరానికి చెందిన ఈయన 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతర పరిణామాల్లో ఆయన వైసీపీలో చేరి 2014లో పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ధర్మవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారు.
 
 
అబ్దుల్‌ఘని
హిందూపురానికి చెందిన ఈయన 2009లో టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆయన తన సీటు త్యాగం చేసి నందమూరి బాలకృష్ణకు అవకాశమిచ్చారు. వచ్చే ఎన్నికలపై ఆయన స్తబ్ధుగా ఉంటున్నారు. హిందూపురానికి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు ప్రస్తుతం బీసీ కార్పొరేషన్‌ చైర్మ‌న్‌గా ఉంటున్నారు. అలాగే ఇంకో మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు కూడా టీడీపీలో ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బాలకృష్ణ పోటీ చేస్తే.. వీరందరూ రేసులో లేనట్లే.
 
 
సుధాకర్‌ బాబు
మడకశిరకు చెందిన ఈయన 2009లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకూ ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. 2014లో కాంగ్రెస్‌ తరపున పోటీచేసి ఓడిపోయారు. రఘువీరారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న సుధాకర్‌బాబు వచ్చే ఎన్నికల్లో మడకశిర కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
 
 
శైలజానాథ్‌
శింగనమలకు చెందిన ఈయన 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవి చేపట్టారు. అనంతరం 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ నిర్వీర్యం కావడంతో టీడీపీ టిక్కెట్టు కోసం చివరిదాకా ప్రయత్నించి విఫలమయ్యారు. తరువాత ఆయన కాంగ్రె్‌సలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రె్‌సలోనే ఉంటారా? లేక గత ఎన్నికల్లో మాదిరి టీడీపీ టిక్కెట్టు రేసులో ఉంటారా? అనే అంశం ఇంకా స్పష్టం కాలేదు.
 
 
గుర్నాథరెడ్డి
అనంతపురానికి చెందిన ఈయన 2009లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతర పరిణామాల్లో ఆయన వైసీపీలో చేరారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. తరువాత కొంతకాలానికి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని గాడ్‌ఫాదర్‌గా ఎంచుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఈయనకు అహుడా చైర్మన్‌ పదవి ఖరారైందనే ప్రచారం జరిగింది. కానీ చడీచప్పుడూ లేకుండా పోయింది. ప్రస్తుతం ఎంపీ జేసీ కూడా ఎన్నికలు దగ్గరపడడంతో ఇతర నియోజకవర్గాలపై దృష్టి సారించారు. గుర్నాథరెడ్డి కూడా వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ తన పాతగూటికి చేరతారనే ప్రచారం జరుగుతోంది. తమ సోదరులు వైసీపీలోనే కొనసాగుతూండడం, తనకు టీడీపీలో పట్టు దొరకకపోవడం వంటి కారణాలతో ఆయన పునరాలోచనలో ఉన్నట్టు సమాచారం.
 
 
కడపల మోహన్‌రెడ్డి
పుట్టపర్తికి చెందిన ఈయన 2009లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఆయన వైసీపీలో చేరినా ఆ పార్టీ తరపున పోటీచేసే అవకాశం రాలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తానేననే ప్రచారంతో సమాయత్తమవుతున్నారు.
 
 
కందికుంట వెంకటప్రసాద్‌
కదిరికి చెందిన ఈయన 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత నేత పరిటాల రవీంద్ర అనుచరుడిగా ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పటికీ పార్టీలో చురుగ్గా ఉంటూ కదిరి టీడీపీ శ్రేణులకు దగ్గరగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తన సతీమణి యశోదమ్మను టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశాలున్నట్టు సమాచారం.
 
 
శివరామిరెడ్డి
ఉరవకొండకు చెందిన ఈయన వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఆయన కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ప్రస్తుతం ఉరవకొండలో వైసీపీ ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. అయినా ఈసారి శివరామిరెడ్డి బరిలో నిలుస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
Link to comment
Share on other sites

అనంతలో ఆ ఒక్కటి లేకుండా ఎన్నికల్లో ఎవరూ గెలవలేరా..!?
18-07-2018 10:20:36
 
636675060374280298.jpg
  • కులమే.. వారి బలం!
  • ఎన్నికల్లో కీలకమవుతున్న కుల సంఘాలు
  • సామాజికవర్గాలను ఆకర్షిస్తూ సేవలు
  • నాయకుల వెంట ఆయా కులస్థులు
అనంతపురం: జిల్లాలో రాజకీయాలు కులాల ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఎవరికి వారుగా కులమే తమ బలమన్నట్లు ముందుకు సాగుతున్నారు. ఎక్కడికక్కడ నాయకులు వారివారి సామాజికవర్గాలను వెనకేసుకొస్తున్నారు. పలు సేవల పేరుతో ఆయా కులాలను ఆకర్షించి దగ్గర పెట్టుకోవాలని మరీ సూచనలిస్తున్నారు. ఏ సామాజిక వర్గానికి ఆ సామాజికవర్గ నాయకులు సంక్షేమ పథకాలు, పలు రకాల ఇతర ప్రయోజనాలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ బలంగా ఉన్న ఈ జిల్లాలో పలు కులాలు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. వాటి ప్రకారమే సీట్లు వస్తున్నాయి. ఓట్లు కూడా అలాగే పడుతున్నాయి. ఈ లెక్కన చూస్తే జిల్లాలో ప్రధానంగా కమ్మ, రెడ్డి, బలిజ, వాల్మీకి, యాదవ, కురబ, చేనేత, ముస్లిం, వైశ్య, దళిత సామాజిక వర్గాల నాయకులు చట్టసభలకు ప్రాతినిథ్యం వహించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయా ప్రజాప్రతినిధుల సామాజికవర్గాలు కూడా కష్టమైనా, నష్టమైనా వారి చుట్టే తిరుగుతున్నాయి.
 
ఈ ప్రకారం జిల్లాలోని ఆయా సామాజిక వర్గాలు బలంగా ఉన్న నియోజకవర్గాలను పరిశీలిస్తే..
దివంగత నేత ఎన్టీఆర్‌ సామాజిక వర్గమైన కమ్మ కులస్థులు జిల్లాలోని అనంతపురం, తాడిపత్రి, రాప్తాడు, ఉరవకొండ, ధర్మవరంలో అధికంగా ప్రభావం చూపుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం తాడిపత్రి, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు, శింగనమలలో ఎక్కువగా ప్రభావం చూపుతున్నారు. బలిజలు అనంతపురం, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో ఎక్కువగా ప్రభావం చూపుతున్నారు. వాల్మీకులు రాయదుర్గం, పెనుకొండ, కళ్యాణదుర్గం, హిందూపురం నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతున్నారు. యాదవులు రాప్తాడు, పెనుకొండలోను, కురబలు మడకశిర, పెనుకొండ, రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోనూ అధికంగా ఉన్నారు. వైశ్యులు అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, రాయదుర్గంలో అధికంగా రాజకీయ ప్రభావం చూపుతున్నారు. దళితులు శింగనమల, మడకశిరలోనే కాకుండా అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లులో రాజకీయ ప్రభావం చూపుతున్నారు. ముస్లింలు అనంతపురం, తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, పెనుకొండ, హిందూపురం తదితర నియోజకవర్గాల్లో తమ ప్రాబల్యం కనబరుస్తున్నారు. వీరిలో ఇప్పటి వరకు జిల్లాలో చట్టసభలకు (శాసనసభ, పార్లమెంటు) వెళ్లిన వారిలో కమ్మ, రెడ్డి, ముస్లిం, దళిత, చేనేత, వైశ్య, యాదవ, కురుబ, వాల్మీకి కులస్థులే ఎక్కువగా ఉన్నారు. బలిజ సామాజిక వర్గంలో అనంతపురం నుంచి దివంగత నేత ఎన్‌. రామకృష్ణ మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వారికి ప్రాధాన్యం లభించలేదు.
 
 
సంఘాలు.. ఆకర్షిస్తున్న సేవలు..
జిల్లాలో ప్రస్తుతం రాజకీయ ప్రాధాన్యం కలిగిన నేతలకు కులమే బలంగా కనిపిస్తోందనే అభిప్రాయాలున్నాయి. ఆయా కులసంఘాలు పలు సేవా కార్యక్రమాలతో తమ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌, బీజేపీతోపాటు కొత్తగా తెరమీదికి వచ్చిన జనసేన కూడా రంగంలో ఉండే అవకాశాలున్నాయి. వీటిలో కొన్ని సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఆయా సంఘాల ద్వారా ఇప్పటి నుంచే ఓటర్లకు మార్గనిర్దేశం చేస్తున్నారు. బీజేపీ, కమ్యూనిస్టులకు కులం ప్రాతిపదిక కాకపోవడంతో అన్ని సామాజికవర్గాల వారూ ఆ పార్టీల్లో ఉన్నారు. ఈ ప్రకారం సామాజిక వర్గాల సంఘాలు.. ఆయా నేతల ప్రాధాన్యతలు గమనిస్తే..
 
కమ్మ సంఘం
జిల్లాలో ఈ సామాజికవర్గం నుంచి చట్టసభల్లో ప్రాతినిథ్యం వహించేవారే అధికంగా ఉన్నారు. వారిలో ప్రధానంగా దివంగత నేత ఎన్టీఆర్‌ దగ్గర నుంచి మరో దివంగత నేత పరిటాల రవీంద్ర వరకూ ఆ సామాజిక వర్గానికి వన్నె తెచ్చారు. జిల్లాలో ప్రస్తుతం మంత్రిగా పరిటాల సునీత, శాసనమండలి చీఫ్‌వి్‌పగా పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్యేలుగా వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, గోనుగుంట్ల సూర్యనారాయణ, ఉన్నం హనుమంతరాయచౌదరి ఉన్నారు. నగర మేయర్‌గా మదమంచి స్వరూప కొనసాగుతున్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన కేసీ నారాయణ, సరిపూటి సూర్యనారాయణ, ఆలం నరసానాయుడు వంటివారు ప్రముఖులుగా ఉన్నారు. జిల్లాలో కమ్మ సంఘం నాయకులుగా పట్నం సుబ్బయ్య, బాంబేడయింగ్‌ నాగన్న వ్యవహరిస్తూ తమ సామాజిక వర్గానికి రాజకీయ మార్గనిర్దేశం చేస్తున్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు పదో తరగతిలో ప్రతిభ కనబరచిన వారికి ప్రతిభ అవార్డులిస్తూ ప్రోత్సహిస్తున్నారు. పెళ్లిళ్లు వంటి కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సామాజిక వర్గీయులు అధికంగా టీడీపీనే అనుసరిస్తున్నారు.
 
 
రెడ్డి సామాజిక వర్గం
జిల్లాలో కమ్మల తరువాత రెడ్డి సామాజిక వర్గమే రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం తాడిపత్రికి చెందిన అన్నదమ్ములు జేసీ దివాకర్‌రెడ్డి ఎంపీగానూ, ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగానూ వ్యవహరిస్తున్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి టీడీపీలో కీలకంగా ఉంటూ ప్రభుత్వ చీఫ్‌వి్‌పగా వ్యవహరిస్తున్నారు. ఉరవకొండ ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరెడ్డి కొనసాగుతున్నారు. రెడ్డి సామాజికవర్గంలో మాజీ ఎమ్మెల్సీలు మెట్టు గోవిందరెడ్డి, శివరామిరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కడపల మోహన్‌రెడ్డి, గుర్నాథరెడ్డి తదితరులు రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సామాజిక వర్గ రాజకీయ కోణాన్ని పరిశీలిస్తే.. టీడీపీ, వైసీపీ, కాంగ్రె్‌సలో వారు ఎక్కువగా ఉంటున్నారు. అధికశాతం రెడ్డి సంఘాలు వైసీపీని అనుసరించే అవకాశాలున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గంలోని పలు సంఘాలు ఆయా కులస్థులను ప్రతిభ అవార్డుల పేరుతో ఆకర్షిస్తున్నాయి. సుధాకర్‌రెడ్డి, గాంధీరెడ్డి వంటివారు సంఘాలకు ప్రతినిధులుగా ఉంటున్నారు.
 
 
బలిజ సామాజికవర్గం
జిల్లా ఓటు బ్యాంకులో ఈ సామాజికవర్గం కీలకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ పరిశీలిస్తే.. ఆ సామాజికవర్గం నుంచి దివంగత నేత రామకృష్ణ మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆ కులస్థులు కేవలం ఓటు బ్యాంకుకే పరిమితమయ్యారు. జిల్లా బలిజ సంఘానికి బళ్లారి వెంకట్రాముడు అధ్యక్షుడిగా ఉంటూ ప్రతిభ అవార్డులు అందజేస్తూ, మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తూ కులస్థులను ఆకర్షిస్తున్నారు. మహాలక్ష్మి శ్రీనివాస్‌, మునిరత్నం శ్రీనివాసులు, నవీన్‌ నిశ్చల్‌, టీజే ప్రకాష్‌, టీజే వరుణ్‌, భవానీ రవికుమార్‌, కాపు జేఏసీ కన్వీనర్‌ జంగటి అమరనాథ్‌, రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌, న్యాయవాది గాజుల ఆదెన్న, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ రాయల్‌ మురళి వంటి వారు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నారు. వారు ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో ఉన్నారు.
 
 
యాదవ సంఘం
జిల్లా రాజకీయాల్లో యాదవ సంఘం చక్రం తిప్పిన రోజులున్నాయి. జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి కాంగ్రెస్‌ రాజకీయాలను శాసించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా గుండుమల తిప్పేస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా వెంకటశివుడు యాదవ్‌, సురేంద్రబాబు వంటి వారు యాదవుల్లో రాజకీయ ప్రభావం చూపుతున్నారు. న్యాయవాది నరసింహులు యాదవ సంఘానికి నాయకుడిగా ఉంటూ పదో తరగతి విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేస్తూ.. శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తూ.. పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి వంటివి కల్పిస్తూ కులస్థులను ఆకర్షిస్తున్నారు. యాదవుల్లో అధికశాతం మంది టీడీపీ, కాంగ్రె్‌సను అనుకరించే అవకాశాలున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
 
వాల్మీకులు
జిల్లా రాజకీయాల్లో వాల్మీకుల ప్రభావం ఎక్కువేనని చెప్పవచ్చు. జిల్లాలో ఆ సామాజికవర్గ ఉద్యోగ సంఘానికి అక్కులప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిభా పురస్కారాలు, ఉచిత విద్యవంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మంత్రి కాలవ శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, మాజీ పీడీ, వైసీపీ నేత రంగయ్య, ఆదినారాయణ వంటివారు రాజకీయాల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వాల్మీకులు ప్రధానంగా టీడీపీని అనుసరించే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు.
 
 
కురుబలు
జిల్లా రాజకీయాల్లో కురుబలు కూడా రాజకీయ ప్రాధాన్యం కలిగి ఉన్నారు. పెనుకొండ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు శంకరనారాయణ, గొర్రెలు, మేకల పెంపక సంఘం డైరెక్టరుగా శివబాల రాజకీయంగా ప్రస్తుతం కురుబ సామాజికవర్గీయులను ప్రభావితం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ వెంటే వారు అధికంగా ఉండే అవకాశాలున్నట్టు తెలుస్తోంది
 
 
చేనేతలు:
జిల్లా రాజకీయాల్లో చేనేతలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుత హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్‌, జొన్నా రామయ్య, జొన్నా సూర్యనారాయణ, చెన్నా వెంకట్రావు వంటివారు రాజకీయ ప్రముఖులు. చేనేతలు దేవాంగభవన్‌, తొగట వీర క్షత్రియ కల్యాణమండపం నిర్మించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపనున్నారు. ప్రధాన నాయకులు టీడీపీలోనే ఎక్కువగా ఉన్నందున చేనేతలు వారినే అధికంగా అనుసరించే అవకాశాలున్నాయి.
 
 
ముస్లింలు
జిల్లా రాజకీయాల్లో ముస్లింలు ప్రభావం ఉంటోంది. కేఎం సైఫుల్లా, సాలార్‌బాషా, అబ్దుల్‌ఘని వంటివారు గతంలో రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా అత్తార్‌ చాంద్‌బాషా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మహ్మద్‌ గౌస్‌ మోద్దీన్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పర్హానా, ఫయాజ్‌, ఫిరోజ్‌బేగం వంటి వారు ఆ సామాజికవర్గ మార్గదర్శకులుగా ఉన్నారు. ఆది నుంచి కాంగ్రె్‌సను అనుకరించే ముస్లింలు ఆ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైన సమయంలో కొంత అయోమయానికి గురయ్యారు. ప్రస్తుతం బీజేపీకి టీడీపీ దూరం కావడంతో వచ్చే ఎన్నికల్లో ముస్లింలు సైకిల్‌ వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలున్నాయని ఆ సామాజికవర్గ పెద్దలు వివరిస్తున్నారు.
 
 
ఈడిగలు
ఇక జిల్లాలో ఈడిగలు కూడా కొంత మేరకు రాజకీయ ప్రభావం చూపే అవకాశాలున్నాయి. వారిలో ఆ సంఘాల నేతలుగా కిరణ్‌కుమార్‌గౌడ్‌, రమేష్‌ గౌడ్‌, నాగేశ్వరరావు వంటివారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో ద్వితీయ స్థానంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి సమీప బంధువైన జితేంద్రగౌడ్‌ గుంతకల్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో వారు కూడా ఎక్కువగా టీడీపీనే అనుసరించే అవకాశాలున్నాయి.
 
 
దళితులు
ఆది నుంచి వీరు కాంగ్రెస్‌ అనుచరులుగా ఉండేవారు. కాలక్రమేణా వారు కూడా టీడీపీకి మద్దతు పలికి సీట్లు, ఓట్లు సంపాదించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలయ్యారు. ప్రస్తుతం శింగనమల నుంచి ఎమ్మెల్సీగా శమంతకమణి, ఎమ్మెల్యే, విప్‌గా యామినీబాల వ్యవహరిస్తుండగా మడకశిర ఎమ్మెల్యేగా ఈరన్న ఉంటున్నారు. దళిత సంఘాలకు నాయకత్వం వహించే ఎంఎస్‌ రాజు, దాస్‌ వంటి వారు కూడా జిల్లాలో దళిత ప్రజాప్రతినిధుల సూచనల ప్రకారమే రాజకీయ మార్గం అనుసరిస్తారనే అభిప్రాయాలున్నాయి.
 
 
వైశ్యులు
జిల్లా రాజకీయాల్లో వైశ్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గుంతకల్లు నుంచి గతంలో మధుసూదన్‌ గుప్తా ఎమ్మెల్యేగా గెలిచారు. డీసీసీ అధ్యక్షుడు కోట సత్యం, బీఎస్‌ విద్యాసాగర్‌, తిరువీరుల జగదీష్‌ వంటివారు వైశ్యుల్లో రాజకీయ ప్రముఖులు. వచ్చే ఎన్నికల్లో సీట్లు వచ్చే అవకాశాలను బట్టి వారు రాజకీయ మార్గం ఎంచుకోనున్నట్టు భావిస్తున్నారు. ఆర్యవైశ్య మహాసభ పేరుతో వైశ్యులు పలు సమావేశాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు.
 
 
వడ్డెర్లు
జిల్లా రాజకీయాల్లో వడ్డెర్లది కూడా కీలక పాత్రగా చెప్పవచ్చు. వడ్డెర్ల మురళి ఆ సామాజికవర్గ చైర్మన్‌గా ప్రభుత్వం నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండగా జిల్లా టీడీపీ ప్రచార కార్యదర్శిగా బీవీ వెంకట్రాముడు వ్యవహరిస్తున్నారు. వారిని అనుసరించే సామాజికవర్గం రాబోయే ఎన్నికల్లో టీడీపీ వైపే అధిక మొగ్గు చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు.
 
 
గిరిజనులు
ఈ సామాజిక వర్గీయుల్లో డిప్యూటీ మేయర్‌ గంపన్న, వడిత్యా శంకర్‌నాయక్‌, శ్రీరాముల నాయక్‌ వంటివారు ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వారు తమ నాయకుల వెంటే నడిచే అవకాశాలున్నాయి. దూదేకులు, బెస్త, గాండ్ల వంటి సంఘాలున్నా ఆ సామాజిక వర్గాలనుంచి పెద్దగా రాజకీయ పదవులు అనుభవించిన వారు లేరనే చెప్పాలి. బీసీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నామని చెప్పుకుంటున్న టీడీపీ ఆ కులస్థులను అధికంగా ఆకర్షించే అవకాశాలున్నాయి.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
చంద్రబాబు వద్ద జేసీ దివాకర్‌రెడ్డి పెట్టిన షరతులు ఇవేనా..?
01-08-2018 11:24:10
 
636687194513038997.jpg
ఆయన సీనియర్ పొలిటీషియన్. ఆయనతో వచ్చిన చిక్కల్లా ఆయన మాట్లాడే తీరే! ముక్కుసూటిగా మాట్లాడి నలుగురికి చెడ్డవుతున్నారు. ఇటీవల ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. తర్వాత మనసు మార్చుకుని పార్లమెంట్‌‌ సమావేశాలకు వెళ్లారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన రాజకీయశైలి ఏంటి? వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
        అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గురించి పెద్దగా పరిచయం చెప్పనక్కరలేదు. తన ప్రకటనల ద్వారా, చేష్టల ద్వారా ఆయన సుప్రసిద్ధులు. ఈ మాటని ఆయన అనుచరగణమే చెబుతుంటుంది. ఆరు దఫాలు తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన దివాకర్‌రెడ్డి.. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పారు. టీడీపీలో చేరి తనదైన శైలిలో రాజకీయం నడుపుతున్నారు. అయితే ఆయనలో ఓ చిన్న అసంతృప్తి ఉంది. గతంలో కాంగ్రెస్‌ హయాంలో జరిగినట్టుగా తన పనులు జరగడం లేదన్నది ఆయన భావన. ఈ విషయాన్ని బహిరంగంగానే ఆయన చెబుతుంటారు కూడా!
 
 
      ప్రస్తుతం అనంతపురం జిల్లా రాజకీయాల్లో మరోసారి దివాకర్‌రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. మొన్న జరిగిన ఎంపీల దీక్షలో ఆయన వీరావేశం ప్రదర్శించారు. పార్లమెంట్‌కి సీమ తడాఖా ఏంటో చూపిస్తానని ప్రకటించారు. అయితే ఆ మరుసటి రోజే మారో మాట అన్నారు. పార్లమెంట్‌కి తాను పోననీ, అటు కేంద్రంలో- ఇటు రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవని బాంబు పేల్చారు. పార్లమెంట్‌కి ఎందుకు వెళ్లడం లేదని మీడియా గుచ్చిగుచ్చి ప్రశ్నించినా అదే బదులిచ్చారు.
 
 
      మరుసటి రోజున మళ్లీ మనసు మార్చుకున్నారు. తాను పార్లమెంట్‌కి వెళ్తున్నానని ప్రకటించారు. ఇంతకీ ఎంపీ అలక వెనుక కారణం ఏంటని శోధించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు అసలు విషయం బోధపడింది. తాను పార్లమెంట్‌ సమావేశాలకు వెళ్లాలంటే తిలక్ రోడ్డు, గాంధీబజార్ విస్తరణ పనులు చేపట్టాలని ఆయన షరతు పెట్టారట. గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తాను పార్టీలోకి చేర్చుకోవాలని అడిగారట. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డికి అహుడా ఛైర్మన్ పదవి ఇవ్వాలన్నారట. ఇలాంటివే మరికొన్ని ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచారట. వాటికి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత తాను పార్లమెంట్‌కి వెళ్తానని జేసీ ప్రకటించారట.
 
 
      జేసీ దివాకర్‌రెడ్డి లాంటి నేత తన డిమాండ్లను సాధించుకోవడానికి అదను చూసి అధిష్టానం మెడపై కత్తిపెట్టారని ఈ సందర్భంగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు సీనియర్ నేతలు మాత్రం జేసీ చర్యలను తప్పుబడుతున్నారు. ఆయన చేసింది బ్లాక్ మెయిల్‌ తప్పా మరొకటి కాదని వారు అంటున్నారు. ఏదిఏమైనా జేసీ తాను అనుకున్నది సాధించుకున్నారని జేసీ అనుచరవర్గం సంబరపడుతోంది.
 
 
          అహుడా ఛైర్మన్ పదవి గురునాథరెడ్డికి కట్టెబట్టాలన్న ప్రతిపాదనను అనంత ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రభాకర్‌చౌదరిని పిలిపించి చర్చించారు. గుంతకల్లులో గుప్తాని పార్టీలో చేర్చుకునే విషయమై స్థానిక ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌తో కూడా సీఎం మాట్లాడినట్లు సమాచారం. తన డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం సీఎంతో ఒక గంటపాటు ఎంపీ జేసీ సమావేశమయ్యారు. అనంతరం ఉత్సాహంతో బయటకు రావడం పట్ల జేసీ వ్యతిరేకవర్గంలో నిరాశనిస్పహలు చోటుచేసుకున్నాయి. అనంతపురం జిల్లాలో జేసీవల్లే ఎక్కువ సీట్లు వచ్చాయనే అభిప్రాయం అధిష్టానంలో ఉండటంతో ఆయనకు పెద్దపీట వేస్తున్నారని టీడీపీ సీనియర్లు అంటున్నారు. చూద్దాం తాజా పరిణామాలు అనంత రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో!
Link to comment
Share on other sites

మాట మరిచిన పవన్.. ఆందోళనలో కార్యకర్తలు...
02-08-2018 19:11:42
 
636688339032877221.jpg
అనంతపురం: జిల్లాలో ప్రధాన పార్టీలకు గ్రూప్ తలనొప్పులు తప్పట్లేదు. అయితే విజయం తమదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. మరోవైపు కాంగ్రెస్ ... పునర్వైభవం కోసం పాకులాడుతోంది. వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచే పోటీచేస్తానన్న జనసేనాని మళ్లీ ఆ ఊసే ఎత్తట్లేదు. దీంతో జనసేన శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అటు బీజేపీ, కమ్యునిస్టు పార్టీలు ప్రభావం కనిపించట్లేదు.
 
రాష్ట్ర విభజనతో కోల్పోయిన ప్రాభవాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుస్తీ పడుతోంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి జిల్లాకు చెందిన నేత కావడంతో.. పార్టీని బతికించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. తరచూ జాతీయ, రాష్ర్ట స్థాయి నేతలను తీసుకువచ్చి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూన్నారు. మొన్నీమధ్యనే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్ చాందిని జిల్లాకు తీసుకొచ్చి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. కళ్యాణదుర్గం నుంచి పోటీచేస్తానని ఇప్పటికే రఘువీరారెడ్డి ప్రకటించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇన్‌ఛార్జిగా పనిచేసిన మాజీ మంత్రి శైలజానాథ్‌ను శింగనమల నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. అయితే శైలజానాథ్‌ ఇటీవల సీఎం చంద్రబాబును అమరావతిలో కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాను వ్యక్తిగత పనిమీద ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లానని శైలజానాథ్‌ వివరణ ఇచ్చుకోవడంతో.. ఆ చర్చకు ఫుల్‌స్టాప్‌ పడింది.
 
అనంతపురంలో జిల్లా జనసేన పార్టీ కార్యాలయానికి పవన్‌ భూమిపూజ చేసి వెళ్లారు. జిల్లా పర్యటనకు వచ్చిన రెండుసార్లూ.. ఇక్కడ నుంచే పోటీచేస్తానని గతంలో ప్రకటించారు. దీంతో అప్పట్లో జిల్లా జనసేన శ్రేణుల్లో సందడి నెలకొంది. కానీ ఆ తర్వాత చడీచప్పుడూ లేదు. హడావుడే తప్ప... జనసేన ప్రభావం పెద్దగా జిల్లాలో కనిపించట్లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో బలిజ, కాపు సామాజికవర్గాలకు చెందిన పలు నియోజకవర్గాల్లోని యువకులు తొలుత పవన్ వెంట నడిచారు. కానీ ఇంతవరకు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నిర్మాణం జరగపోవడం ఆ పార్టీ అభిమానుల్ని కలవరపరుస్తోంది.
 
ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని ఏమాత్రం ఆదరణ లేదు జిల్లాలో.. ఇక సీపీఐ, సీపీఎం ప్రభావమూ అంతంతే.. గత ఎన్నికల్లో రెండంటే రెండు సీట్లకే పరిమితమైన వైసీపీకి రెడ్డి సామాజికవర్గం నుంచే టికెట్లు ఆశించేవారు ఉండడంతో ఆ పార్టీ విజయావకాశాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ప్రత్యేకహోదా కోసం, విభజన హామీల అమలు కోసం పోరాడుతున్న తమకే ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.
 
టీడీపీ నేతల ధీమాకు తగ్గట్లే వచ్చే ఎన్నికల్లో వారసులు రంగంలోకి దిగనున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి తనయుడు డాక్టర్ మారుతీ చౌదరి ఇప్పటికే పార్టీ, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పార్టీ ఆదేశిస్తే కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దిగడానికి సిద్దమవుతున్నారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌కుమార్‌రెడ్డి ఎంపీగా పోటీచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో పవన్‌కుమార్‌రెడ్డి విసృతంగా పర్యటిస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి... తన తనయుడు అస్మిత్ రెడ్డిని రాజకీయరంగంలోకి దించారు. ఇప్పటికే అస్మిత్‌ రెడ్డి... నియోజకవర్గంలో స్పర్శ అనే సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టారు. మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కూడా ఈ సారి ఎన్నికల గోదాలోకి దిగుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పరిటాల కుటుంబానికి పెద్ద సంఖ్యలో అభిమానులున్న పెనుకొండ నుంచి శ్రీరాంను రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
 
హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప... తన వారసుడు అంబరీష్‌కు టికెట్ ఆశిస్తున్నారు. పుట్టపర్తి, పెనుకొండ నుంచి తన కుమారుడుకి అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి శమంతకమణి తన కుమారుడు అశోక్ కుమార్‌కు శింగనమల టికెట్ ఇప్పించాలనే ధృడనిశ్చయంతో పనిచేస్తున్నారు. అధికార పార్టీలో నేతల వారసులు పోటీచేసేందుకు ఉవ్విళ్లూరుతుంటే..., వైసీపీ, ఇతర పార్టీల్లో ఈ సందడి కనిపించట్లేదు.
 
 
Tags : TDP, YCP, Congress, Janasena, Politics, anantapuram
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...