Jump to content

alla ramakrishna reddy


Recommended Posts

వైసీపీ ఎమ్మెల్యే‌కు ఏసీబీ నోటీసులు
16-05-2018 13:04:08
 
636620726492568033.jpg
అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. బినామీ ఆస్తుల కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది. గతంలో ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు ఆళ్ల రామకృష్ణారెడ్డి బినామీగా ఉన్నారని ఏసీబీకి సమాచారం ఉంది. ఈ క్రమంలో విచారణకు హాజరుకావాలని ఐపీసీ సెక్షన్ 160 కింద ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది.
Link to comment
Share on other sites

డీఎస్పీ అక్రమాస్తులకు బినామీగా ఆళ్ల భార్య!
17-05-2018 03:22:14
 
636621241348980516.jpg
  • మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసు
  • 22న విచారణకు రావాలని ఆదేశం
అమరావతి, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న అవినీతిపరులకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారా..? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ). క్రికెట్‌ బెట్టింగ్‌లతో జనాన్ని కొల్లగొడుతోన్న బుకీలకు నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండగా నిలిచారని ఆ జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఇటీవల సంచలనం సృష్టించింది. నిన్న అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న కుమారుడు కాంట్రాక్టరును డబ్బు కోసం కిడ్నాప్‌ చేయడం.. తాజాగా ఏసీబీ కేసు దర్యాప్తులో గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చాయి. రాజధాని ప్రాంతంలో అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలున్న పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై గతేడాది జనవరిలో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ (సీఐయూ)ను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా తుళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నట్లు బయటపడింది. ఆరా తీయగా డీఎస్పీ బినామీల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న ఆస్తుల పత్రాలు డీఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు ఆయనకు బుధవారం నోటీసు ఇచ్చారు. ఈ నెల 22న విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చి వివరాలు వెల్లడించాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఆర్పీ ఠాకూర్‌ను సంప్రదించగా.. కేసు దర్యాప్తులో ఉన్నందున వివరాలు వెల్లడించలేమన్నారు.
Link to comment
Share on other sites

ఆరా తీయగా డీఎస్పీ బినామీల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న ఆస్తు పత్రాలు డీఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు 

calling Nandamuri Rulz for further investigation

Link to comment
Share on other sites

Neethulu cheppukuni tirige kuxxx ippudu addamga dorikinda.

ilaanti vaadu MLA a vundatam mangalagiri chesukunna duradrustam.

Evadanna capital tama place lo vasthe santhosha padathaaru, veedu maree ghoram adugu aduguna capital raakudadu ani addukunnadu.

Link to comment
Share on other sites

ఏసీబీ ఎదుట హాజరుకాని వైసీపీ ఎమ్మెల్యే
22-05-2018 13:41:06
 
636625932683792599.jpg
 
అమరావతి: బినామీ ఆస్తుల కేసు వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ఎదుట హాజరుకాలేదు. ఆయన తరఫున లాయర్‌ సుధాకర్‌రెడ్డి ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌‌కి చెందిన అక్రమాస్తులు... ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల పేర్లతో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ సందర్భంగా లాయర్‌ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దుర్గాప్రసాద్‌ అక్రమాస్తులతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సంబంధం లేదన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఎమ్మెల్యేను ఇరికించాలని చూస్తోందన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కంటి ఆపరేషన్ కారణంగా ఏసీబీ ఎదుట హాజరుకాలేదని అధికారులకు చెప్పగా ఈనెల 29న ఎమ్మెల్యే హాజరుకావాలని ఏసీబీ అధికారులు చెప్పారని ఆళ్ల తరపు లాయర్‌ పేర్కొన్నారు.
 
ఎన్నికల అఫిడవిట్‌లో ఎమ్మెల్యే తన ఆస్తులను చూపించారా లేదా అని ఏబీసీ పరిశీలించింది. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు లేవని గుర్తించిన ఏసీబీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమాచారం అందించింది. అలాగే ఆస్తుల వివరాలు ఎందుకు వెల్లడించలేదో వివరణ ఇచ్చేందుకు రావాల్సిందిగా ఆళ్లకు ఏసీబీ సమాచారమిచ్చింది. మంగళవారం ఉదయం 11గంటలకు రామకృష్ణారెడ్డి ఏసీబీ కార్యాలయంలో హాజరుకావాలని అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

రెండోసారీ లాయర్లనే పంపిన వైసీపీ ఎమ్మెల్యే
29-05-2018 12:12:09
 
636631927351931997.jpg
విజయవాడ: బినామీ ఆస్తుల కేసులో రెండో సారి కూడా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ముందు గైర్హాజరయ్యారు. ఈసారి కూడా ఏసీబీ ఎదుట ఆళ్ల తరపు లాయర్లే హాజరయ్యారు. అయితే శస్త్ర చికిత్స కారణంగా ఎమ్మెల్యే ఆర్కే హాజరుకాలేకపోయారని ఏసీబీకి లాయర్లు వివరణ ఇచ్చారు. ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌కి చెందిన అక్రమాస్తుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల పేర్లను ఏబీసీ గుర్తించింది. దీంతో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆళ్లకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

56 minutes ago, sonykongara said:
రెండోసారీ లాయర్లనే పంపిన వైసీపీ ఎమ్మెల్యే
29-05-2018 12:12:09
 
636631927351931997.jpg
విజయవాడ: బినామీ ఆస్తుల కేసులో రెండో సారి కూడా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ముందు గైర్హాజరయ్యారు. ఈసారి కూడా ఏసీబీ ఎదుట ఆళ్ల తరపు లాయర్లే హాజరయ్యారు. అయితే శస్త్ర చికిత్స కారణంగా ఎమ్మెల్యే ఆర్కే హాజరుకాలేకపోయారని ఏసీబీకి లాయర్లు వివరణ ఇచ్చారు. ఏసీబీకి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌కి చెందిన అక్రమాస్తుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల పేర్లను ఏబీసీ గుర్తించింది. దీంతో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆళ్లకు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

amaravati meda donga caselu veyytam anukuava raaa

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...