Jump to content

TTD meda kutra rajakiyam


Recommended Posts

  • Replies 221
  • Created
  • Last Reply
ఆగమ సలహామండలి నుంచి రమణదీక్షితులు తొలగింపు
27-06-2018 01:20:33
 
636656629074279133.jpg
  • ఆయన స్థానంలో వేణుగోపాల దీక్షితులు నియామకం
  • 32.26కోట్లతో గోవిందరాజస్వామి ఆలయానికి బంగారు తాపడం
  • ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి 36కోట్లు: టీటీడీ చైర్మన్‌ పుట్టా
తిరుమల, హైదరాబాద్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆగమ సలహామండలి నుంచి మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులును తొలగించారు. 65ఏళ్ల వయోపరిమితి వర్తింపుతో ఆయన్ను అర్చకత్వం నుంచి తప్పించినప్పటికీ సలహామండలిలో మాత్రం సభ్యుడిగానే ఉన్నారు. అయితే ప్రధాన అర్చకత్వం కోల్పోయిన నేపథ్యంలో దీక్షితులును మండలి సభ్యుడిగా కూడా తొలగించారు. ఆయన స్థానంలో అదే వంశంనుంచి ప్రధాన అర్చకుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాల దీక్షితులును ఎంపికచేస్తూ మంగళవారం తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు.
 
9tpt53.jpg 
చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు, ఈవో అనిల్‌కుమార్‌ పాల్గొని, పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం పుట్టా మీడియాతో మాట్లాడుతూ... టీటీడీపై ఆరోపణలు చేస్తున్న రమణదీక్షితులుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, స్పందన కోసం ఇచ్చిన 10రోజుల గడువులో 3రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. అప్పటికీ స్పందించకపోతే తదుపరి చర్యలపై బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా, నిబంధనలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని మిరాశీ కుటుంబాల నుంచి అర్హత కలిగిన 12మందిని అర్చకులుగా నియమించామని ఈవో అనిల్‌ తెలిపారు. ఇంటర్వ్యూలలో మెరిట్‌ సాధించిన నలుగురికి తిరుమలలో, మిగిలినవారికి తిరుపతిలో విధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు.
 
 
బోర్డు నిర్ణయాలు
  • తిరుమలలో రూ.15కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణానికి ఆమోదం.
  • గోవిందరాజస్వామి ఆలయ గర్భగుడిపై విమాన గోపురానికి రాగిరేకులపై బంగారుపూత పూసేందుకు రూ.32.26కోట్లకు ఆమోదం.
  • ఒంటిమిట్ట కోదండరామాలయం వద్ద అభివృద్ధి పనులకు రూ.36 కోట్లు మంజూరు. యాత్రికుల వసతిగృహాలకు రూ.5.25కోట్లు.
  • ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు మండలం దుడ్డుకూరు గ్రామంలోని చెన్నకేశవ ఆలయ పున రుద్ధరణకు రూ.25లక్షలు మంజూరు.
  • దివ్యదర్శన పథకానికి టీటీడీ వాటా కింద ఏపీఎస్‌ ఆర్టీసీకి ఏడాదికి రూ.1.25కోట్లు చెల్లించేందుకు నిర్ణయం.
  • అనంతపురం జిల్లా పరిగి మండలం మోదా గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో, రొద్దంమండలం రొద్దకంబ ఆలయం సమీపంలో కమ్యూనిటీ హాళ్ల కోసం రూ.75లక్షలు చొప్పున కేటాయింపు. హిందూపురం మండలం చేలూరు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.25లక్షలు మంజూరు.
  • చిల్లర నాణేల మార్పిడికి ప్రత్యేక కమిటీ... త్వరలో ఆర్బీఐతో చర్చలు.
 
టీటీడీ బోర్డు చైర్మన్‌కు ఊరట
టీటీడీ బోర్డు చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది. అన్యమత కార్యక్రమానికి ఓసారి అతిథిగా హాజరైనంత మాత్రాన ఆలయ ప్రతిష్ఠకు ఆయన భంగం కలిగించారని భావించలేమని పేర్కొంది.
Link to comment
Share on other sites

మీరే నిగ్గు తేల్చండి!
28-06-2018 02:59:27
 
636657515687966533.jpg
  • శ్రీవారి నగలను తనిఖీ చేయించండి
  • సిట్టింగ్‌ జడ్జితో ధ్రువీకరించండి
  • నివేదికను ప్రజల ముందుంచండి
  • స్వార్థం కోసం నిరాధార ఆరోపణలు
  •  భక్తుల్లో ఆందోళన రేకెత్తించారు
  •  ఇది సున్నిత, భావోద్వేగ అంశం
  •  వివాదానికి ముగింపు పలకాలి
  •  హైకోర్టు సీజేకు చంద్రబాబు లేఖ
 
అమరావతి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘తిరువాభరణాలు మాయమయ్యాయి’ అంటూ టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు ఆరోపణలు, దీనిని సమర్థించేలా విపక్షాల వ్యాఖ్యలు, జాతీయ స్థాయిలో వివాదం తలెత్తిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జిని నియమించి... సమగ్ర ధ్రువీకరణ చేయించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను కోరారు. దీనిపై బుధవారం ఆయన ఒక లేఖ రాశారు. ‘‘తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యదైవం.
 
అత్యంత భక్తి ప్రపత్తులతో స్వామివారిని కొలుస్తారు. స్వామివారి దగ్గర పాటించే ఆచారాలు అత్యంత పవిత్రం. వెలకట్టలేని నగలు, ఆభరణాలు, ఆస్తులు స్వామివారి సొంతం. అవి దొంగతానికి గురైనట్లు, దుర్వినియోగం జరిగినట్లు ఇటీవల కాలంలో పలువురు ఆరోపణలను వెల్లువెత్తించారు. స్వార్థం, స్వప్రయోజనాల కోసమే కొందరు ఈ పనిచేశారు. అంతా బాగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, ప్రభుత్వం చేసిన ప్రకటనలు ప్రజలు, ముఖ్యంగా భక్తుల మనసులకు సాంత్వన కలిగించలేదు. ఇది అత్యంత సున్నితమైన, భక్తుల భావోద్వేగాలతో ముడిపడిన విషయం. అందుకే ఈ విషయంలో వచ్చిన ఆరోపణలపై హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో సమగ్ర ధ్రువీకరణ జరిపించాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు. ఆ నివేదికను బహిరంగంగా ప్రజల ముందు పెట్టి ఈ వివాదానికి ముగింపు పలకాలన్నారు.
 
స్వార్థపూరిత ఆరోపణలతో వెంకన్న భక్తుల్లో లేనిపోని ఆందోళనలు రేకెత్తించారని చంద్రబాబు తెలిపారు. గతంలో టీటీడీపై ఇలాంటి ఆరోపణలే వచ్చినప్పుడు కొన్ని కమిటీలు వేసినట్లు గుర్తు చేశారు. ‘‘2009లో జస్టిస్‌ జగన్నాథరావు కమిషన్‌, 2011లో జస్టిస్‌ వాద్వా కమిటీలను స్వామివారి ఆభరణాలు పరిశీలించేందుకు వేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే మళ్లీ తలెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వరస్వామి భక్తుల్లో ఉన్న భయాందోళనలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో ధ్రువీకరణ చేయించాలి. రికార్డులు పరిశీలించేందుకు, వెలకట్టలేని నగలు, ఆభరణాలు, ఆస్తులను తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించాలి. స్వామివారికి కైంకర్యాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయో లేదో కూడా ధ్రువీకరించాలి. అన్నీ పరిశీలించిన తర్వాత ఇచ్చే నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలి’’ అని చంద్రబాబు తన లేఖలో తెలిపారు.
Link to comment
Share on other sites

తిరుమల కొండపై అయ్యగారి కుక్క!
28-06-2018 04:07:01
 
636657556227599182.jpg
దిగాలుగా పడుకున్న ఈ శునకాన్ని చూశారుగా! ఇది... టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు వారి పెంపుడు శునకం! ఆయన తిరుమలలోని తన నివాసంలో నాలుగేళ్లుగా దీనిని పెంచుకుంటున్నారు. అయితేనేం అంటారా!? తిరుమలలో కుక్కలను పెంచుకోవడం నిషిద్ధం! కొండ మీద కుక్కలు కనిపిస్తే వెంటనే పట్టుకుని తిరుపతికి తరలిస్తారు. శునకాన్ని తాకినవారు ఆలయ ప్రవేశం చేయకూడదని ఆగమ శాస్త్ర నియమం. శునకం ఆలయంలోకి ప్రవేశిస్తే ఏకంగా సంప్రోక్షణ చేయాల్సి వస్తుంది. అందుకే, పెంపుడు కుక్కలను కూడా తిరుమలలో అనుమతించరు. కానీ... మొన్నటిదాకా స్వయంగా ప్రధానార్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు ఇవేమీ పట్టించుకోలేదు. కుక్కను పెంచుకున్నారు! ఆ విషయాన్ని పక్కనపెడితే... ఈ శునకం మాత్రం ఇప్పుడు బాగా దిగులుగా కనిపిస్తోంది. కారణం... తన యజమాని రమణ దీక్షితులు నెలన్నరగా దర్శనమివ్వకపోవడమే!
Link to comment
Share on other sites

మీరు తిరుమల ఎప్పుడు వెళ్లారు?
04-07-2018 03:42:24
 
  • గోపురానికి అప్పుడు బంగారు పూత లేదా?
  • న్యాయవాదికి ధర్మాసనం ప్రశ్నల వర్షం
 
హైదరాబాద్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): తిరుమల స్వామివారి కైంకర్యాల్లో ఆగమశాస్త్ర నియమాలను విస్మరించి అపచారం చేస్తున్నారంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ చైర్మన్‌, ఈవో, ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థలకు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణ ఈనెల 24కి వాయిదా వేసింది. శ్రీవారి ఆభరణాలు, బంగారు డాలర్లు మిస్సింగ్‌ కేసులతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారణకు వేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక సీజే జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన అభియోగాలను ఉటంకిస్తూ... శ్రీవారి ఆలయంలో అక్రమాలను ప్రశ్నిస్తూ... గుంటూరుకు చెందిన అనిల్‌ కుమార్‌, గుజరాత్‌కు చెందిన భూపేంద్ర సంయుక్తంగా పిటిషన్‌ దాఖలు చేశారు.
 
రాజులు ఇచ్చిన విలువైన నగలు గల్లంతవుతున్నాయని, గులాబి వజ్రాన్ని ఇటీవలే జెనీవాలో వేలం వేసినట్లు కోర్టు దృష్టికి పిటిషనర్‌ తరఫున న్యాయవాది తెచ్చారు. ఏసీజే కల్పించుకుంటూ... ఇది ఇప్పటి సమస్య కాదని, 2010లోనే దీనిపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైందని అన్నారు. విచారణ జరిపిన కమిటీ అది డైమండ్‌ కాదని, రూబీ అని తేల్చిందని గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... గోపురానికి బంగారు పూత వేస్తున్నారన్నారు. ‘బంగారు పూత ఇప్పుడు వేసింది కాదు. అది ఎప్పుడో వేసారు’ అని న్యాయమూర్తులు గుర్తు చేశారు.
 
‘మీరు తిరుపతి మొదటిసారి ఎప్పుడు వెళ్లారు’ అని న్యాయవాదిని బెంచ్‌ ప్రశ్నించింది. 16 ఏళ్ల ప్రాయంలో మొదటిసారి వెళ్లానని, ఆతర్వాత కూడా చాలా సారు వెళ్లినట్లు న్యాయవాది తెలిపారు. అప్పుడు గోపురానికి బంగారుపూత ఉందా లేదా అని అడిగిన ప్రశ్నకు న్యాయవాది ఉందని చెప్పారు. ‘ఒకవైపు ఎప్పటినుంచో ఉందని మీరే చెబుతున్నారు.. అలాంటప్పుడు ఇప్పుడే వేస్తున్నారని ఎలా చెబుతారు’ అని ప్రశ్నించింది. కాగా, ఆగమశాస్త్ర పండితులు సూచనలు, సలహాల మేరకు ప్రసాదాలు తయారు చేసే పోటుకు మరమ్మత్తులు చేసినట్లు ఏపీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోర్టుకు తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...