Jump to content

TTD meda kutra rajakiyam


Recommended Posts

రమణదీక్షితులుకు వ్యతిరేకంగా ఒక్కటైన పురోహితులు
20-05-2018 18:45:21
 
636624387222258337.jpg
తిరుమల: రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలను వ్యతిరేకిస్తూ టీటీడీ పురోహితులు ఒక్కటైనారు. శ్రీవారి ఆలయం కేంద్రంగా... కొద్దిరోజులుగా జరుగుతున్న వివాదం బాధాకరమని టీటీడీ ప్రధాన అర్చకులు కృష్ణదీక్షితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆగమం ప్రకారమే శ్రీవారికి కైంకర్యాలు జరుగుతున్నాయని, ఆగమ సలహామండలి, అర్చకుల ఆమోదంతోనే మార్పులు... శిథిలావస్థకు చేరడంతోనే పోటు మరమ్మతులు చేస్తున్నారని కృష్ణ దీక్షితులు తెలిపారు.
 
 
రమణదీక్షితులు ఆరోపణలు పూర్తిగా నిరాధారమని సీనియర్‌ అర్చకులు నరసింహాచార్యులు వ్యాఖ్యానించారు. శ్రీవారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని, రాయలు నగలంటూ ప్రత్యేకంగా టీటీడీ రికార్డుల్లో లేవని, శ్రీవారిని పస్తు పెట్టారంటూ ఆరోపించడం సరికాదని హితవుపలికారు. రమణదీక్షితులు హయాంలో శ్రీవారి ఆలయంలో... అర్చకులను నానా ఇబ్బంది పెట్టారని నరసింహాచార్యులు దుయ్యబట్టారు.
 
 
రమణదీక్షితులు మీద ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ జరపించాలని, గొల్లపల్లి కుటుంబంలోకి రమణదీక్షితులు దత్తత వచ్చారని ప్రధాన అర్చకుడు వేణుగోపాల్‌ దీక్షితులు వెల్లడించారు. ఆయన కంటే ఎక్కువ హక్కు తమకే ఉందని ఆయన స్పష్టం చేశారు. స్వామివారికి ఎప్పుడైనా కైంకర్యాలు నిర్వహించాలని, రమణదీక్షితులు మంత్రాలు కూడా సక్రమంగా చెప్పలేరని, రమణదీక్షితులు సీఎంను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని వేణుగోపాల్‌దీక్షితులు ఆరోపించారు.
Link to comment
Share on other sites

  • Replies 221
  • Created
  • Last Reply

తిరుమల: ఆగమశాస్త్రం ప్రకారమే శ్రీవారికి కైంకర్యాలు జరుగుతున్నాయని ప్రధాన అర్చకుడు కృష్ణదీక్షితులు స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వ్యవహారాలపై రమణదీక్షితులు చేసిన ఆరోపణలను పలువురు ఖండించారు. ఆదివారం అర్చక భవనంలో పలువురు అర్చకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణదీక్షితులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆగమ సలహా మండలి, అర్చకుల ఆమోదంతోనే మార్పులు చేసినట్లు కృష్ణ దీక్షితులు తెలిపారు. శిథిలావస్థకు చేరుకోవడంతోనే పోటు మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. అందులో ఎటువంటి తప్పిదాలు లేవని కృష్ణ దీక్షితులు తెలిపారు. అప్పుడు పోటు కూల్చివేతకు అంగీకరించింది రమణదీక్షితులేనని వేణుగోపాల దీక్షితులు తెలిపారు. రమణదీక్షితుల స్థానంలో మరొకరు రాకూడదా? అని ప్రశ్నించారు. ఆత్రేయ బాబు, పెద్దింటి రాంబాబు, సౌందర్యరాజన్‌తో అర్చకులకు ఏం సంబంధమని వ్యాఖ్యానించారు. వేరే ప్రాంతంలో ప్రసాదాల తయారీకి రమణ దీక్షితులే అంగీకరించారని చెప్పారు. పురావస్తు శాఖకు శ్రీవారి ఆలయాన్ని ఎందుకు అప్పగించాలని, ఎప్పుడైనా రమణదీక్షితులు 12 నామాలు ధరించారా? అని ప్రశ్నించారు. తన తరువాతే రమణదీక్షితులు కైంకర్యాలకు వచ్చారన్నారు. అర్చకులు ఎవరైనా సెంటు కొట్టుకొని ఆడి కారులో కైంకర్యాలకు వస్తారా? అని విమర్శించారు. రమణదీక్షితుల వ్యవహారంపై ముఖ్యమంత్రికి ఎప్పుడో ఫిర్యాదు చేశామని, 2013 నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. రమణదీక్షితులపై ఎన్నో ఆరోపణలున్నాయని, సీబీఐతో విచారణ జరిపించాలని వేణుగోపాల దీక్షితులు డిమాండ్‌ చేశారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

శ్రీ శ్రీ శ్రీ బీజేపీ-వైసీపీ బంధువర్య రమణ దీక్షితులు అయ్యవారి ప్రైవేటు మేడలు, కాంప్లెక్సులు, ఆడి కారు. నాలుగు అంతస్తుల భవనాలు. దర్శించి తరించండి. ఓం నమో వేంకటేశాయ. >> ఎంత నిజాయితీపరుడు, స్వామి సేవ తప్ప అంబానీ వైఎస్ ల సేవ తెలీని వాడు, కడు పేదవాడయితే ఇవన్నీ వస్తయ్యి చెప్పండి?

DdpgwCIUwAAzmlU.jpgDdpg8xNV0AEJqbg.jpg

 

DdpgxOsU8AEcIzj.jpg

Link to comment
Share on other sites

13 minutes ago, Urban Legend said:

Ddp5q1uU0AAHwIv.jpg

of course he has to fight for hereditary archakathvam to grow and sustain these properties 

paiga deeniki ntr meeda edavatam...

parigetthinchi kottali itla devudni kuda commodity chese ammukuni dabbulu sampadinche vallani!

Link to comment
Share on other sites

ఆభరణాల లెక్కలన్నీ పక్కా
21-05-2018 03:22:12
 
636624697333655913.jpg
  • శ్రీవారి ఆభరణాలు భద్రం.. ఆగమ నిపుణులు సరేనంటే వాటి ప్రదర్శన: ఈవో
  • అది వజ్రం కాదు.. రూబీ మాత్రమే
  • జియ్యంగార్ల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా కైంకర్యాలు
  • అంగీకరిస్తే ప్రత్యక్ష ప్రసారం
  • ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే అర్చకులకు వయోపరిమితి
  • పోటు తవ్వకాలు అబద్ధం: ఈవో
తిరుమల, మే 20 (ఆంధ్రజ్యోతి): తిరుమలేశుడి ఆభరణాలన్నీ పూర్తి సురక్షితంగా ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో) అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. వాటిని త్రీడీ ఫొటోలు తీసి ఆగమ నిపుణులు అంగీకరిస్తే భక్తులకు ప్రదర్శిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే అర్చక స్వాములకు 65 ఏళ్ల వయోపరిమితిని అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జేఈవో శ్రీనివాసరాజుతో కలిసి ఈవో విలేకరులతో మాట్లాడారు.
 
 
శ్రీవేంకటేశ్వరుడికి ఆగమోక్తంగా కైంకర్యాలు జరుగుతున్నాయా.. స్వామికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలు, ఇతర నగలు సురక్షితంగా ఉన్నాయా..ఆలయంలో మరమ్మతులు సక్రమంగా జరుగుతున్నాయా.. టీటీడీ ప్రధాన అర్చకులపై చర్యలకు కారణాలేంటని భక్తుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారికంగా వివరణ ఇవ్వాలని భావించామన్నారు. ‘తిరువాభరణం రిజిస్టర్‌ ప్రకారం ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయి. 1952 నుంచి పక్కాగా లెక్కలున్నాయి. ఈ మేరకు గతంలో నియమించిన జస్టిస్‌ వాద్వా, జస్టిస్‌ జగన్నాథం కమిటీలు నివేదికలిచ్చాయి. 2010లో జస్టిస్‌ జగన్నాథం కమిటీ అందజేసిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. స్వామివారి నగల బహిరంగ ప్రదర్శనకు ఆగమ సలహా మండలి అంగీకరించకుంటే వాటిని త్రీడీ ఫొటోలు తీసి సైట్‌లో పెడితే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం’ అని వెల్లడించారు.
 
 
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2001 అక్టోబరు 21న జరిగిన గరుడసేవలో భక్తులు విసిరిన నాణేల వల్ల పగిలింది వజ్రం కాదని.. రూబీ మాత్రమే పగిలినట్లు జస్టిస్‌ జగన్నాథం కమిటీ నివేదికలో పేర్కొందన్నారు. అప్పుడే అర్చకులు వెతకగా పగిలిన రూబీ ముక్కలు కొన్ని లభించాయని, ఇవి ఇప్పటికీ టీటీడీ అధీనంలో ఉన్నాయని తెలిపారు. ఈ ఆభరణాన్ని 1954లో మైసూరు మహారాజు శ్రీవారికి కానుకగా సమర్పించారని.. దీని విలువ రూ.50గా రికార్డుల్లో నమోదు చేసి ఉందని చెప్పారు. ఇదే విషయాన్ని 2010లో అప్పటి టీటీడీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు.. పగిలింది కెంపు మాత్రమేనని, గులాబీ వజ్రం కాదని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని గుర్తుచేశారు. దీనిపై రమణ దీక్షితులు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. శ్రీవారికి నిత్యం పెద్ద, చిన్న జియ్యంగార్ల సమక్షంలో పూజా కైంకర్యాలు, ఆర్జితసేవలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆగమ సలహామండలి అంగీకరిస్తే మూలవర్లకు నిర్వహించే సేవలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తామని తెలిపారు.
nagalu-158.jpg 
 
 
 
వయో పరిమితిపై రెండు జీవోలు..
జీవో నంబర్లు 1171 (16-12-1987), 611 (16-10-2012) ప్రకారం 65 ఏళ్ల వయోపరిమితి ముగిసిన అర్చకులకు పదవీ విరమణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని ఈవో వెల్లడించారు. 2013లో ధర్మకర్తల మండలి దీనికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. దీనిని టీటీడీ సర్వీస్‌ రూల్‌ 122 కింద నమోదు చేసినట్లు తెలిపారు. ప్రధాన అర్చకుడైన ఏఎస్‌ నరసింహ దీక్షితులు, అర్చకులైన రామచంద్ర దీక్షితులు, భక్తవత్సల దీక్షితులు ముగ్గురికీ 65 ఏళ్ల వయోపరిమితి ముగియడంతో నిబంధనల ప్రకారమే వారికి పదవీవిరమణ అమలు చేశామని తెలిపారు. వారు హైకోర్టును ఆశ్రయించగా.. రిటైర్మెంట్‌ చేసి ఎలాంటి సంభావన లేకుండా అర్చకత్వం కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు.
 
 
దీంతో మళ్లీ ఆ ముగ్గురు విధుల్లో చేరారని.. కొన్ని నెలలకు టీటీడీ మానవతా దృక్పథంతో సంభావన ఇవ్వాలని తీర్మానించిందని చెప్పారు. ఇది జరిగాక రమణ దీక్షితులు కుమారులు సహా పది మంది మాజీ మిరాశీదారులు తమకూ అర్చకత్వం హక్కు ను కల్పించాలని కోరారన్నారు. ‘టీటీడీ స్పందించకపోవడంతో కొన్నాళ్లకు ఆ పది మంది హైకోర్టును ఆశ్రయించారు. అర్హత, ఖాళీలను అనుసరించి వీరిని అర్చకులుగా నియమించాలని కోర్టు ఆదేశించింది. అప్పటికే 43 మందికి బదులుగా 53 మంది అర్చక స్వాములున్నారు. 2015లో టీటీడీ ఇదే విషయం తెలియజేసింది. మళ్లీ ఆ పది మంది టీటీడీని అభ్యర్థించారు. స్పందన లేకపోవడంతో వారు మళ్లీ కోర్టులో బోర్డు చైర్మన్‌, ఈవోపై పిటిషన్‌ వేశారు. ఈ క్రమంలో ఈనెల 16న జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సందర్భంగా ఈ పది మందీ తమ అంశాన్ని తిరిగి లేవనెత్తారు. బోర్డు తదుపరి భేటీలో నిర్ణయిస్తామని తెలియజేశాం’ అని వివరించారు.
 
 
మిరాశీ వ్యవస్థ ఉన్నప్పుడే..
మిరాశీ వ్యవస్థ ఉన్న సమయంలోనే 1956లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 25 నుంచి 65 ఏళ్ల నడుమే అర్చకత్వం నిర్వహించాలని ఉన్నట్లు సింఘాల్‌ తెలిపారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న బోర్డు 65 ఏళ్ల వయోపరిమితి అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చిందన్నారు. ‘మిరాశీ విధానం రద్దయ్యాక ప్రధాన అర్చక పోస్టులు ఉంటే బావుంటుందని భావించి ఆ నాలుగు కుటుంబాల్లో ఒక్కొక్కరిని ప్రధాన అర్చకులుగా, మిగిలిన వారిని అర్చకులుగా నియమించింది. అప్పట్నుంచి వంతులకు సంబంధం లేకుండా ఆ నలుగురూ స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఇందులో మిరాశీ కుటుంబాలకు అవమానం, అన్యాయం జరగలేదని.. ఎవరిపైనా కక్ష సాధింపు కూడా లేదని స్పష్టం చేశారు.
 
 
రహస్య మరమ్మతుల్లేవ్‌...
శ్రీవారి ఆలయంలో రహస్యంగా మరమ్మతులు జరగడం లేదని ఈవో స్పష్టంచేశారు. జియ్యంగార్లు, రమణ దీక్షితులు, సుందరవరదన్‌ను సంప్రదించే వకుళమాత పోటులో ఆధునికీకరణ పనులు చేశామన్నారు. అక్కడ ఎలాంటి తవ్వకాలూ జరగలేదన్నారు. 2001, 2007లో కూడా ఆధునికీకరణ పనులు జరిగాయని చెప్పారు. మహాసంప్రోక్షణ నిర్వహించే సమయంలో గర్భగుడిలో అర్చక స్వాముల ద్వారా మరమ్మతులు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆగమశాస్త్రాల్లో అధికారుల ప్రమేయం ఉండదని స్పష్టంచేశారు.
 
టీటీడీపై ఆరోపణలు చేయడం తనకెంతో బాధ కలిగించిందన్నారు. భక్తులకు సులభతరంగా దర్శనం కల్పించడం, శ్రీవారి కైంకర్యాలు ఆగమశాస్త్ర బద్ధంగా నిర్వహించడం తమ బాధ్యతగా పేర్కొన్నారు. భవిష్యత్‌లో అందరి సలహాలూ తీసుకుని టీటీడీ ప్రతిష్ఠను మరింత పెంచుతామన్నారు. ఈ సందర్భంగా విలేకరులను వకుళమాత పోటు వద్దకు తీసుకెళ్లారు. బూందిపోటు రాతి గోడకు దన్నుగా నిర్మించిన గోడ దెబ్బతినడంతో దానిని తొలగించి మళ్లీ అక్కడ గోడ కట్టిన వైనాన్ని వివరించారు. ఈసారి వేడి తట్టుకునేందుకు ఫ్యాబ్రిక్‌ తాపడం చేశారు.
Link to comment
Share on other sites

పస్తులు అవాస్తవం
శ్రీవారి సేవల్లో  అపచారం లేదు
తవ్వకాలు జరగలేదు.. చిన్నచిన్న మార్పులే
అన్ని ఆభరణాలకు లెక్కలున్నాయి
తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టీకరణ
ఈనాడు-తిరుపతి, తిరుమల, న్యూస్‌టుడే
20ap-main1a.jpg

పెద్దజీయర్‌, చిన్నజీయర్‌ స్వామివార్ల ఆధ్వర్యంలో స్వామివారి కైంకర్యాలన్నీ ఆగమోక్తంగా జరుగుతున్నాయని తితిదే కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు. ‘స్వామివారి సేవలకు సంబంధించి 1979లో ప్రత్యేకమైన షెడ్యూలును పెట్టారు. ఉదయం సుప్రభాతం దగ్గర నుంచి ఏకాంతసేవ వరకు దానిని అనుసరించే జరుగుతున్నాయి. ప్రతిసేవ ఆగమశాస్త్రబద్ధంగానే నిర్వహిస్తున్నాం...’ అని వెల్లడించారు. స్వామివారి నగల భద్రత, నైవేద్యం తయారుచేసే పోటును తవ్వేయడం, సుప్రభాతం, ఇతర సేవలకు సంబంధించి రమణదీక్షితులు మీడియాలో వివిధ అంశాలు ప్రస్తావించారు. దీనిపై తిరుమలలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంో ఈవో అన్ని వివరాలను వెల్లడించారు.

స్వామివారి ఆలయానికి చిన్నచిన్న మార్పులే తప్ప... లోపల ఎలాంటి తవ్వకాలు జరగలేదు. రమణదీక్షితులు నాకు ఫిర్యాదు చేయగానే జేఈవోను, చీఫ్‌ ఇంజినీరును పంపి పరిశీలన చేయించాం. స్వామివారికి ఎప్పుడూ నైవేద్యాలు లేకుండా పస్తులనేవి పెట్టలేదు. 2001, 2007లోనూ స్వామివారి నైవేద్యాలను పడిపోటు నుంచి వేరే వద్ద తయారు చేశారు. ఆగమ సలహాదారు సుందరవరదన్‌ సలహాతోనే చిన్నపాటి మార్పులు చేశాం. మహాసంప్రోక్షణ సమయంలో గర్భాలయంలోనే అర్చకులు చిన్నచిన్న మార్పులు సూచిస్తారు.

20ap-main1b.jpg

65 ఏళ్లు మేం చేసింది కాదు
రమణదీక్షితుల మీదనో, ఇంకెవరి మీదనో వ్యక్తిగత కోపం మాకెవ్వరికీ లేదు. 65 ఏళ్లకు అర్చకులు ఉద్యోగ విరమణ చేయాలనేది 2012లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం. జీవో నెంబరు 1171లోని జీవో ఎంఎస్‌ నెంబరు 611 కింద ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని రూల్‌ ఆఫ్‌ 1202 కింద తితిదే చట్టంలో నమోదు చేశారు. అప్పట్లో ప్రధానఅర్చకులుగా ఉన్న నరసింహదీక్షితులు, రామచంద్రదీక్షితులు, భక్తవత్సలం ఉద్యోగాలు కోల్పోయారు. వారు హైకోర్టును ఆశ్రయించగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించాలని.. సంభావన ఇవ్వవద్దని తితిదేకు ఆదేశాలు జారీ చేసింది. తర్వాత వారు పలుమార్లు తితిదేకు వినతులు ఇవ్వడంతో వారికి సంభావన ఇవ్వడం ప్రారంభమైంది. దీని తర్వాత రమణదీక్షితులుతో పాటు మరో 9 మంది మిరాశీ అర్చకులు తమకు అర్చకత్వం కావాలని కోర్టును ఆశ్రయించగా ఖాళీలు, అర్హతలను బట్టి తీసుకోవాలని ఆదేశించింది. అప్పటికే ఆలయంలో 43 మందికి గాను...  53 మంది విధుల్లో ఉన్నారని... ఖాళీలు లేవని తితిదే తెలిపింది. 2015లో రమణదీక్షితులు కోర్టు ధిక్కరణ పిటీషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం...65 ఏళ్లకు పైబడిన వారిని ఉద్యోగ విరమణ చేయిస్తే ఖాళీలు ఏర్పడతాయనే కోణంలో పాలకమండలి దీన్ని ఆమోదించింది. 1956 తితిదే చట్టంలోనే... మిరాశీ వ్యవస్థ బలంగా ఉన్న సమయంలోనే కనిష్ఠంగా 25ఏళ్లు... గరిష్ఠంగా 65ఏళ్లు అర్చకులకు ఉండాలని రాశారు. మేం అన్నీ న్యాయపరమైన సలహాలు, వినతులు పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆలయ సంప్రదాయం ప్రకారం నాలుగు కుటుంబాల్లోని తదుపరి సీనియర్లను ప్రధానఅర్చకులుగా తీసుకున్నాం.

20ap-main1c.jpg

పక్కాగా ఆభరణాల లెక్కలు
గతంలోనూ స్వామి వారి ఆభరణాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై జస్టిస్‌ వాద్వా కమిటీ, జస్టిస్‌ జగన్నాథరావు కమిటీలు వేశారు. వారు తితిదే వద్ద ఉన్న ఆభరణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్వామి వారి తిరువాభరణాలన్నీ కచ్చితంగా ఉన్నాయి. 1952 రికార్డుల పరంగా అప్పుడు రాసినవన్నీ భద్రంగా ఉన్నాయి. 1952కు ముందు ఉన్న వాటిపై లెక్కలు, రికార్డులు, దాతల వివరాలు లేవు. కృష్ణదేవరాయలు ఇచ్చిన నగలపైనా లేవు. 1987కు ముందు అర్చకుల ఆధీనంలోనే నగలు ఉండేవి. తర్వాత తితిదేకి అప్పగించారు. విలువైన స్వామి వారి వజ్రం జెనీవాలో అమ్మకం జరిగిందనే మాట పూర్తిగా అవాస్తవం. దీనిపై జస్టిస్‌ జగన్నాథరావు కమిటీ పరిశీలన జరిగింది. 2001లో జరిగిన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున స్వామివారికి 1945లో మైసూరు మహారాజా ఇచ్చిన కెంపుల హారం అలంకరించారు. మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతున్నప్పుడు కొందరు భక్తులు విసిరిన చిల్లరనాణేలు తగిలి గులాబీరంగు కెంపు పగిలిపోయినట్లు రికార్డులో రాశారు. పగిలిన ముక్కల్లో కొన్ని అర్చకులకు దొరికాయి. వాటిని తితిదే భద్రపరిచింది. దీన్ని 2009లో జస్టిస్‌ జగన్నాథరావు కమిటీ పరిశీలించి నిజమేనని తేల్చింది. ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. 2010 సెప్టెంబరులో అప్పటి తితిదే ఈవో ఐ.వై.ఆర్‌.కృష్ణారావు ప్రభుత్వానికి సవివర నివేదిక సమర్పించారు.


ప్రజలకు ఆభరణాలను చూపాలి: ఈవో అనిల్‌కుమార్‌

ది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. ఆగమం ప్రకారం ఇది అవుతుందా లేదా..? అనేది నాకు తెలియదు.  స్వామివారి నగలను భక్తులందరికీ కనిపించేలా ప్రదర్శన ఏర్పాటు చేస్తే వారికి నమ్మకం కలుగుతుంది. అలాకాకుంటే త్రీడీ చిత్రాలను ప్రజల ముందు పెట్టాలి. పటిష్ఠ భద్రత మధ్య ఈ ప్రదర్శన ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. స్వామివారి సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తే భక్తకోటికి కనులపండువగా ఉంటుంది.


రమణదీక్షితులపై విచారణ చేపట్టాలి
శ్రీవారి ఆలయ అర్చకుల డిమాండ్‌
20ap-main1d.jpg

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఓ అక్రమాల పుట్ట అని, ఆయనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆలయ ప్రధానఅర్చకులతో పాటు పలువురు సీనియరు అర్చకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తిరుమలలో ఆదివారం శ్రీవారి ఆలయ ప్రస్తుత ప్రధానఅర్చకులు వేణుగోపాలదీక్షితులు, కృష్ణ శేషాచలదీక్షితులు, గోవిందరాజదీక్షితులు, ఆగమ సలహాదారు సుందరవరదన్‌, సీనియర్‌ అర్చకులు ఖాద్రిపతిస్వామి విలేకరులతో మాట్లాడారు. ఆగమ సలహామండలి అనుమతులతోనే వకుళామాత పోటుకు మరమ్మతులు చేయించారన్నారు. ‘‘రమణదీక్షితులు ఏనాడైనా 12 నామాలు ధరించారా?ఆయన ఇద్దరు కుమారులు ఎన్నో ఏళ్లుగా కైంకర్యాలకు రాకపోవడంపై సమాధానం చెప్పాలి. శ్రీకృష్ణదేవరాయులు ఇచ్చిన ఆభరణాలను మిరాశీ వ్యవస్థ రద్దయిన సమయంలో సర్కారుకు అప్పగించలేదు. ఈ విషయం నిరూపించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ ఆరోపణ సరికాదని ఆయనే నిరూపించుకోవాలి. వేదికను ఎంపిక చేసుకోవాలి...’అని వారు పేర్కొన్నారు.  ‘తోటి కైంకర్యపరులను రమణదీక్షితులు అవమానించిన సమయంలో బ్రాహ్మణ, అర్చక సంఘాలు ఎక్కడికి వెళ్లాయి? రాష్ట్రంలోని ఆలయాలు వేరు. తితిదే వేరు. మా విషయాల్లో ఇతరుల జోక్యం తగదు. వేయికాళ్ల మండపం కూల్చివేతకు అనుమతిస్తూ సంతకం చేసిన వ్యక్తి.. నేడు తితిదేపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.’ అని వివరించారు. ‘సౌందర్‌రాజన్‌ కుమారుడు అర్చకుడు కావచ్చు.. మేం రాకూడదా? దత్తతకు వచ్చిన రమణదీక్షితులు.. గొల్లపల్లి వంశీయులకు జన్మించానని చెప్పడం నిజం కాదా? 2001లో పోటు మరమ్మతులకు అనుమతించిన విషయం నిజం కాదా? నేడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?...’ అని పలు ప్రశ్నలు సంధించారు. రమణదీక్షితులు వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశామన్నారు. తమను ప్రధాన అర్చకులుగా నియమించడం, 32 మంది కైంకర్యపరులను క్రమబద్ధీకరించడంపై ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Link to comment
Share on other sites

అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
తిరుమల శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు
20ap-main6a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: కలియుగదైవం వేంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో జరుగుతున్న అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని తితిదే మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు డిమాండ్‌ చేశారు. వీటిపై ప్రశ్నించినందునే తనను పదవీ విరమణ సాకుతో తప్పించారని చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. స్వామివారి అమూల్యమైన తిరు ఆభరణాల నిర్వహణ, భద్రత పారదర్శకంగా జరగడం లేదన్నారు. ఆగమయుక్తంగా జరగాల్సిన పూజాదికాలకు తిలోదకాలివ్వడంపై ఆయన ఆందోళన వెలిబుచ్చారు.  ‘‘మైసూరు మహారాజులు ఇచ్చిన ఆభరణంలోనిగులాబీరంగు వజ్రం కొన్నేళ్లుగా కనిపించడం లేదు. ఈ అంశంపై తాను ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పడం లేదు. ఇటీవల జెనీవాలో వేలానికి వచ్చిన గులాబీరంగు వజ్రం స్వామి వారి వజ్రాన్ని పోలి ఉంది. ఆభరణాల లెక్క తేల్చేందుకు గతంలో అశాస్త్రీయంగా విచారణ జరిగినందున నిజాలు బయటకు రాలేదు. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన, పురావస్తు కట్టడం గోడలు తొలగించడం ఎంతవరకు శ్రేయస్కరం. 1150లో ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించిన పాకశాల(పోటు)ను 25రోజుల పాటు మూసివేయడం దారుణం. చరిత్రలో తొలిసారి పాకలో చేసిన పదార్థాలతో స్వామి వారికి ప్రసాదాలు సమర్పించారు. పోటులో దెబ్బతినని గ్రానైట్‌ రాళ్లను తొలగించి మళ్లీ వాటినే యథాస్థానంలో అమర్చారు. అన్నీ సక్రమంగా ఉంటే తవ్వకాల వెనుక ఆంతర్యం ఏమిటి...’’అని ప్రశ్నించారు. ఆలయంలో సొత్తు అపహరణకు గురవుతుందని స్పష్టం చేశారు. దేవస్థానం పాలకమండలి, అధికారులు అర్చకుల మాటలను పెడచెవిన పెడుతున్నారన్నారు.

Link to comment
Share on other sites

ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతోనే రమణ దీక్షితులు వ్యాఖ్యలు’
21-05-2018 13:58:21
 
విజయవాడ: శ్రీవారి సేవలో నిత్యం కైంకర్యాలు చేస్తూ దైవత్వం సంతరించుకున్న రమణ దీక్షితులు ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య సలహాదారు కోట శంకర శర్మ అన్నారు. ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతో పక్క రాష్ట్రంలో కూర్చుని తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా మాట్లాడటం తగదని తెలిపారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వివిధ బ్రాహ్మణ సంఘాలు ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని కోట శంకర శర్మ వ్యాఖ్యానించారు.
Link to comment
Share on other sites

On 5/16/2018 at 3:08 PM, Urban Legend said:

.agrahara ahankaarama? leka bjp adhikaara daahama?

lol , maa brahmins meedha edupu start ayindha ga , jagan gadini christian ani sign chesi ravali ane apesenappudu memu YSRCP tho kalisipoyam ani anipinchaledhu kani ippudu mathram aa christian party tho mammalani antagaduthunnaru .

YSRCP lanti party laki kallu vothalisina avasaram BRAHMINS ki vundhi ante , pity about them . ala ayithe national level lone maa sharma's and sastry's chakram thippevaru .

 

BRAHMIN ante nee intiki vacchi , nuvvu nee family suka soubhagyalatho vundalani manasu purthi ga devudu ni pradhinchi , nuvvuche dabbulani dhakshina ledha sambhavana ga thesukulethadu . vallu valla vamsaparam paryani kapadukoni vasthunnaru. gathi leka kadhu .

 

Link to comment
Share on other sites

4 minutes ago, svallabh said:

lol , maa brahmins meedha edupu start ayindha ga , jagan gadini christian ani sign chesi ravali ane apesenappudu memu YSRCP tho kalisipoyam ani anipinchaledhu kani ippudu mathram aa christian party tho mammalani antagaduthunnaru .

YSRCP lanti party laki kallu vothalisina avasaram BRAHMINS ki vundhi ante , pity about them . ala ayithe national level lone maa sharma's and sastry's chakram thippevaru .

 

BRAHMIN ante nee intiki vacchi , nuvvu nee family suka soubhagyalatho vundalani manasu purthi ga devudu ni pradhinchi , nuvvuche dabbulani dhakshina ledha sambhavana ga thesukulethadu . vallu valla vamsaparam paryani kapadukoni vasthunnaru. gathi leka kadhu .

 

bro tanu brahmins ni analedu,hes talksing about ramana deekshitulu anthe

Link to comment
Share on other sites

3 minutes ago, svallabh said:

lol , maa brahmins meedha edupu start ayindha ga , jagan gadini christian ani sign chesi ravali ane apesenappudu memu YSRCP tho kalisipoyam ani anipinchaledhu kani ippudu mathram aa christian party tho mammalani antagaduthunnaru .

YSRCP lanti party laki kallu vothalisina avasaram BRAHMINS ki vundhi ante , pity about them . ala ayithe national level lone maa sharma's and sastry's chakram thippevaru .

 

BRAHMIN ante nee intiki vacchi , nuvvu nee family suka soubhagyalatho vundalani manasu purthi ga devudu ni pradhinchi , nuvvuche dabbulani dhakshina ledha sambhavana ga thesukulethadu . vallu valla vamsaparam paryani kapadukoni vasthunnaru. gathi leka kadhu .

 

BRAHMINS  andari ni analedu,ysr, ivr , bjp ki thotulu ayi nindalu vese vallani anedi.

Link to comment
Share on other sites

రమణ దీక్షితులుకు మతిభ్రమించింది’
21-05-2018 13:21:50
 
గుంటూరు: రమణ దీక్షితులు, రంగరాజన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నేతలు టీ.వీ.శ్రీరామమూర్తి, రాచకొండ శ్రీనివాసశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్వామివారి వజ్రాలు పోయిన విషయం ఇన్నాళ్ళు ఎందుకు దాచారని ప్రశ్నించారు. రమణ దీక్షితులు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో ఆలోచించాలన్నారు. రమణ దీక్షితులు, రంగరాజన్ వల్ల బ్రాహ్మణ సమాజం తలదించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మీద జరుగుతున్న కుట్రలో భాగమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని టీ.వీ.శ్రీరామమూర్తి, రాచకొండ శ్రీనివాసశాస్త్రీ ఆరోపించారు.
Link to comment
Share on other sites

UrbanLegend @pritam_ul 2h2 hours ago

 
 

UrbanLegend Retweeted anigalla

UrbanLegend added,

DdsahHyUwAARdAm.jpg
DdsainvUQAABsjU.jpg
anigalla @anigalla
నిర్మాణాల మార్పు చెయ్యవచ్చనీ, చెయ్యమనీ స్వదస్తూరీతో రాసి సంతకం చేసింది తమరేగా తామరమిత్రా?
0 replies 0 retweets 0 likes
 
 
 
 
 
Link to comment
Share on other sites

మేము ఏదైనా చెప్తే... పూర్తి సాక్షాధారాలతో చెప్తాము. BJP is involved in TTD controversy

ధిల్లీతో డీ ఆంధ్ర రెడీ added,

DdudrNEUwAAuDWS.jpg
DdudvJiVMAAL45L.jpg
Achanta Raja @achantaraja
Operation Garuda via TTD
0 replies 1 retweet 1 like
 
 
 
 
 
Link to comment
Share on other sites

5 minutes ago, RKumar said:

Oh addam ga doriki poyadu gaa ee ramana deekshitulu.

Dorikina enti use? Namme vadu manam enni cheppina nammuthadu. Aa twitter chusthe rotha vasthundi. Devudi bomnalu pettukoni BJP em chesina aaha ooho antu .. BJP ki evaru opposite ga matladina valla meeda padipothunnaru without knowing anything.. alanti batch unnantha varaku Modi ki no issues ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...