Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

sonykongara

TTD meda kutra rajakiyam

Recommended Posts

రమణ దీక్షితులు వెనుకున్నది ఎవరు?: కందారపు మురళి
16-05-2018 11:27:12
 
తిరుమల: శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సీపీఎం నేత కందారపు మురళి డిమాండ్ చేశారు. రమణ దీక్షితులు వెనుక వున్న అదృశ్య శక్తులను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. రమణ దీక్షితులు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలకు ఫిర్యాదు చెయ్యకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామనడం అనుమానాలకు తావిస్తోందని కందారపు మురళి అన్నారు.

Share this post


Link to post
Share on other sites
కొండపై ఆగమ నియమాల ఉల్లంఘన
16-05-2018 03:07:49
 
636620368701029827.jpg
  • వీఐపీల కోసం అర్ధరాత్రి సుప్రభాత సేవకు ఒత్తిడి
  • ప్రాచీన తిరువాభరణాలు.. భద్రంగా ఉన్నాయో లేవో?
  • సీబీఐ విచారణ చేయాలి
  • ప్రధానార్చకులు రమణ దీక్షితులు
 
చెన్నై, మే 15(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో అడుగడుగునా వైఖానస ఆగమ నియమాలను ఉల్లంఘిస్తున్నారని, వంశపారంపర్యంగా స్వామివారికి సేవలు చేస్తున్న అర్చకులకు, వారి కుటుంబీకులకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఆరోపించారు. మంగళవారం చెన్నైలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల ఆలయ ప్రాచీన వైభవం, పవిత్రత గురించి ఏ మాత్రం అవగాహన లేని అధికారులు.. రాజకీయ ప్రముఖులు, వీఐపీల కోసం స్వామివారికి చేస్తున్న సేవలలో కోత విధిస్తున్నారని, నైవేద్యాలను తగ్గిస్తున్నారని, సుప్రభాత సేవను సూర్యోదయానికి గంట ముందు చేయాల్సి ఉండగా, అర్ధరాత్రి 12.05 గంటలకు జరుపమంటూ అర్చకులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ పాలకమండలి కంటే యేళ్లతరబడి పాతుకుపోయిన అధికారులు... పాలకులను, ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునేలా వారికి ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోను, దేశంలోనూ సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలను చూస్తుంటే స్వామివారి ఆలయంలో అపవిత్రత చోటుచేసుకోవడం వల్లే అవన్నీ జరుగుతున్నాయని విశ్వసిస్తున్నట్లు రమణ దీక్షితులు తెలిపారు. ఇక ఆలయ పవిత్రతకు భక్తులే ఉద్యమించాలని రమణ దీక్షితులు వేడుకున్నారు.
 
తిరుమలేశుడికి శ్రీకృష్ణదేవరాయల నుంచి మైసూరు మహారాజుల వరకు కానుకలుగా చెల్లించిన ప్రాచీన ఆభరణాలు భద్రంగా ఉన్నాయో లేదో తెలియడం లేదని, ప్రస్తుతం స్వామివారికి కొత్త ఆభరణాలతోనే అలంకరణ చేయిస్తున్నారని ఆయన చెప్పారు. తిరుమలేశుడే తనకు నిత్య కైంకర్యాలు, పూజలు చేసేందుకు అర్చకులను నియమించుకున్నారని, తమ వంశపు పూర్వీకుడైన గోపీనాథన్‌ కాలంలో అంటే రెండువేల సంవత్సరాలకు ముందే ప్రధాన అర్చకుడయ్యారని వివరించారు. వంశపారంపర్యంగా స్వామివారికి వైఖానస ఆగమ నియమాల ప్రకారం సేవలు చేస్తున్న అర్చకుల మిరాసీ విధానాన్ని రద్దు చేసి తమ నెలసరి ఆదాయాలకు గండి కొట్టినా, స్వామివారి సేవల బాధ్యతను తామే కొనసాగించేందుకు న్యాయస్థానం అనుమతించిందని దీక్షితులు వివరించారు.
 
 
ఆర్కియాలజీ చూస్తే బాగుండేది..!
ఆలయ చారిత్రక విశేషాలు ఏవీ తెలియని అధికారులు ఆలయం లోపల రంగనాయకుల మండపంలో అలంకరణల పేరుతో డ్రిల్లింగ్‌ యంత్రాలతో రంధ్రాలు వేయడం, ఆలయం లోపల క్యూలైన్లను అటూ ఇటూ మార్చడానికి, ఇనుప చట్రాలను అమర్చడానికి నేలపై వందల సంఖ్యలో డ్రిల్లింగ్‌ యంత్రాలతో రంధ్రాలు వేసి పునాదులు బలహీనపడేలా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఆర్కియాలజీ విభాగం తిరుమల ఆలయాన్ని స్వాధీనం చేసుకోకుండా పరిశీలించి ఉంటే ఆలయ నిర్మాణం ఎలా బలహీనపడిపోయిందో లోకానికి తెలిసేదన్నారు.
 
తిరుమల ఆలయ పవిత్రతను, ప్రాచీనతను కాపాడేందుకు తగు చర్యలు చేపట్టాలని రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని, గవర్నర్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రాలు సమర్పిస్తామని రమణదీక్షితులు తెలిపారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Share this post


Link to post
Share on other sites

Iyr gadiki oka group vundali.itlav

 Vuunte labham ledu. Capital farmers andaru aggressive gaa vundali evaraina capital ki against gaa matladutunnadu eggs kottali

Share this post


Link to post
Share on other sites

YSR Family -> Ramana Deekshitulu baaga close.

YSR -> IYR -> Ramana baaga dorikindi link.

I think he is classmate of YSR.

Eppudu neethulu cheppe eeyanaki innallu gurthuku raaleda, previous 10 years congress government lo TTD meeda enni issues ayina noru teravaledu ok Christian ni TTD chairman chesina noru medapaledu.

Share this post


Link to post
Share on other sites
రాజకీయాల నుంచి శ్రీవారిని రక్షించుకోవాలి
తితిదే ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణ
15ap-state5a.jpg

చెన్నై, న్యూస్‌టుడే: అధికార బలంతో శ్రీవారి ఆలయ ఆగమ శాస్త్ర నియమాలను గాలికి వదిలేస్తున్నారని తితిదే ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు. రాజకీయాల నుంచి శ్రీవారిని రక్షించుకోవాలని అన్నారు. చెన్నైలో ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే ఆభరణాల వివరాలు తెలియడం లేదని తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికిచ్చిన ఆభరణాల పరిస్థితి ఏమిటి? అవన్నీ భద్రంగా ఉన్నాయా? అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. రాజకీయ నాయకులే ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వ్యాపారంగా మార్చుతున్నారని విమర్శించారు. ఏ చరిత్రా తెలియని పాలకమండలి, అధికారుల వల్ల ఆలయ ప్రతిష్ఠ మంటగలుస్తోందని.. అన్యమతస్తుల విషయం నాయకుల విచక్షణకే వదిలేస్తున్నానని తెలిపారు. ఆలయం గురించి తెలియని అధికారులను నియమించి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని విమర్శించారు. బృహత్‌ ప్రణాళిక పేరుతో ఆలయం, ఆగమశాస్త్రాలు, హిందూ మతాన్ని కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హుండీ ఆదాయం పూర్తిగా స్వామివారి సేవకేనని పేర్కొంటూ, ఓ అధికార పార్టీ ఎమ్మెల్సీ తమ ఊరిలో కల్యాణమండపం కట్టడానికి రూ.పది కోట్లు కోరుతున్నారంటే ప్రభుత్వ తీరు అర్థమవుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారుల కనుసన్నల్లో జరుగుతున్న అవినీతి నుంచి ఆలయం, స్వామివారిని కాపాడుకునేందుకు తాము నిత్యం పోరాడుతూనే ఉంటామన్నారు. తమతోపాటు భక్తులు కలిసి రావాలని కోరారు.

Share this post


Link to post
Share on other sites

Ysr unapudu emi peekutunaru ramana chari garu appudu tamaru nidra potunara.. Monna amitsha gadu.. Ninna pawala gadu velli vachina taruvata nee noru legustundi ante nee venaka evaru unaro ardam avutundi.. Ysr unnapudu Christian vadini direct chairman cheste eda tongunaru meeru 

Share this post


Link to post
Share on other sites
1 minute ago, sonykongara said:

mathanii kulani recchagottam chesthunaru ...

all sides attacking 

silently spreading fake news by using tirumala to polarize hindus ?

Share this post


Link to post
Share on other sites

Try to arrange a counter attack from ttd archaka sangam and shut their mouths 

Share this post


Link to post
Share on other sites

Ithane kada sonth koduku kosam Tirumala lo edo chesi dorikaadu annaru. Aa issue bayataku teesthe moosukuni koorchuntaadu Jagan pressure pettina.

Share this post


Link to post
Share on other sites
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగించాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కొత్త పాలకమండలి తన మొట్టమొదటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయంతో శ్రీవారి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా పదవీ విరమణ చేయాల్సి వస్తుంది. ఆయనతో పాటు అర్చకులు నరసింహదీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నారాయణదీక్షితులు కూడా పదవీ విరమణ చేస్తారు. ఈ అర్చకుల పదవీ విరమణ నేపథ్యంలో మిరాశీ వంశాలకు చెందిన నలుగురిని ప్రధాన అర్చకులుగా టీటీడీ నియమించింది. వీరిలో గొల్లపల్లి వంశం నుంచి వేణుగోపాల దీక్షితులు, పైడిపాల్లి వంశం నుంచి కృష్ణ శేషాద్రి దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులు ఉన్నారు.
 
రమణదీక్షితులు ఇటీవల చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆచార వ్యవహారాలపై పలు విమర్శలు చేసి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే టీటీడీపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వివరణ కోరుతామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి సింఘాల్ తెలిపారు.
 
 
ఇదిలా ఉండగా, టీటీడీ బ్యాంక్‌ డిపాజిట్లు, ఎఫ్ఎంఎస్ పనితీరుపై సబ్‌కమిటీలు ఏర్పాటు చెయ్యాలని టీటీడీ పాలకమండలి నిశ్చయించింది. ఢిల్లీలో శ్రీవారి ఆలయానికి కమిటీ నియామకం జరిగింది. శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి కోదండరామస్వామి ఆలయాల్లో పునర్వసు నక్షత్రం రోజున ఆర్జితకల్యాణ౦ నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Share this post


Link to post
Share on other sites

Tirumala chief priest in a row over private blessing

 
TNN | Updated: May 7, 2012, 01:29 IST
 
 
 
TIRUMALA: Chief priest A V Ramana Deekshitulu landed himself in a fresh controversy when he went to meet a top industrialist's son at a private guest house here on Sunday. Deekshitulu was closeted with industrialist's son for a brief while in the evening to bless him.
 

When cameramen tried to approach him, the chief priest sped away in his car from the guest house. While Deekshitulu was unavailable for his comments, the Tirumala Tirupati Devasthanams (TTD) refused to be drawn into the controversy. But this was not the first time that the chief priest had courted controversies. He was served a memo by the TTD authorities for conducting special rituals in violation of temple norms for a top industrialist at a guest house atop the hill on April 10, 2010.
 
 
 

"Deekshitulu is often seen rubbing shoulders with industrialists, business magnates, film stars and celebrities. As one who stands closest to the Moola Virat inside the sanctum sanctorum, he should only be at the service of the Lord," points out seer Kamalananda Bharati Swamy.
 
 

Latest Comment

This is not the first time that he indulged in such practice. In the past he went all the way to a guest house to bless Mr. Mukesh Ambani. Every body is equal before GOD, it's sad that the chief prie... Read MoreKV RAO

 


In fact, the temple rules forbid priests from officiating at any private functions. They have to be at the service of the Lord and observe temple rituals and customs in accordance with Agama sastra principles. "The chief priest should confine himself to the sanctum sanctorum and perform Nitya Kainkaryams (sevas) and rituals for the Lord," a temple priest not wanting to be named said.
 
 
 

Narendra of the Tirumala temple protection samithi pointed out that Deekshitulu had performed Sudarshana homam in Tirumala for late CM YS Rajasekhara Reddy and his son Jagan in 2009. "He even made trips to Pulivendula and Hyderabad to perform rituals for YSR," he revealed.
 


It remains to be seen as to what action TTD would initiate against the chief priest, Hindu Dharma Prachara activists said Deekshitulu should be shown the door for violating the temple rules.
 
 

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×