Jump to content

TTD meda kutra rajakiyam


Recommended Posts

mamulu time lo ne bhayamkaram ga tosukuntu vuntaru queue lo. ika edaina small fire accident lantivi jarigindante asalu fire kante thokkisalata valla lot of people will die. agamna, nigamana (or whatever it is) kante public safety is important.

influence vunna valla kosam special darshanalu time kani appudu arrange/force cheyyatam matram tappu. 

2000 years nunchi vunna tradition ayinanta matrana marchakudadu ani emi ledu. if something is wrong or not safe, it is okay to change. pata kalam lo 10 years lope pellillu chese vallu, ala ani ippudu kuda child marriages ni allow cheyyala. pujarula family members ki special admission teeseyyali no modi lodi. enti valla special. 

Link to comment
Share on other sites

  • Replies 221
  • Created
  • Last Reply
రాజకీయ నాయకుడా, తిరుమల అర్చకుడా?
17-05-2018 03:29:13
 
636621245544288654.jpg
  • రమణదీక్షితులు వ్యవహార శైలిపై చర్చ.. సర్వత్రా విమర్శలు
 
తిరుపతి, మే 16: తిరుమల ఆలయంలో ఆచార సంప్రదాయాలు మంటగలిసిపోతున్నాయంటూ ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు విమర్శలతో విరుచుకుపడ్డ తీరు చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ అనేకసార్లు ఆయన ఇలాగే మీడియా ముందుకు రావడం, ఆ తర్వాత సర్దుకుని మౌనంగా ఉండడం తెలిసిందే. ఈసారి ఆయన తన దాడికి చెన్నైని వేదిక చేసుకున్నారు. అదీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు స్పష్టమైన వెనువెంటనే గొంతు విప్పడం, పైగా సమావేశానికి రావాలంటూ బీజేపీ నాయకులు మీడియా ప్రతినిధులను పిలవడం, వారు కూడా సమావేశానికి హాజరు కావడం.. ఇవన్నీ అనేక సందేహాలకు తావిస్తున్నాయి. అర్చకుడిలాగాక ఓ రాజకీయ నాయకుడిలా ఆయన వాగ్ధాటి సాగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల ఆలయంలో ప్రధాన అర్చకులుగా నలుగురు ఉన్నా రమణ దీక్షితులు పేరే అందరికీ తెలుసు. ఆయన వ్యవహార శైలే అందుకు కారణం. ఆరేళ్ల కిత్రం శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు వచ్చిన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబాని కుమారుడు అనంత్‌ అంబానీని అతిధి గృహానికి వెళ్లి కలవడంపై తీవ్రస్ధాయిలో విమర్శలోచ్చాయి. పలువురు ప్రముఖుల ఇళ్లల్లో ఆయన పూజలు చేస్తారనే ఆరోపణలున్నాయి. ఇక, శ్రీవారి ఆలయంలో ఏకఛత్రాధిపతిలా వ్యవహరిస్తారంటూ ఇతర అర్చకులు విమర్శలకు దిగిన సందర్భాలున్నాయి. టీటీడీ అధికారులు వివరణ కోరిన ప్రతి సందర్భంలోనూ ఆగమ ఉల్లంఘన జరుగుతోందంటూ మీడియాకు ఉప్పందిస్తారనే విమర్శలున్నాయి. చాలాకాలంగా విధులకు హాజరు కాని ఆయన కుమారులకు టీటీడీ నోటిసులు ఇవ్వడమే ఆయన తాజా ఆగ్రహానికి, ఆరోపణలకు కారణమని చెబుతున్నారు. దీనిపై ఇప్పటిదాకా వ్యూహాత్మకంగా ఒత్తిడి తెస్తూ సాధించుకుంటూ వస్తున్న రమణ దీక్షితులు చెన్నైలో మాత్రం అమీతుమీ అన్నట్టుగా విమర్శలు చేశారు. ఆయన ధోరణిలోని తీవ్రతను పసిగట్టడంతోనే టీటీడీ... బుధవారం జరిగిన పాలకమండలి సమావేశంలో.. 65ఏళ్లు పైబడిన అర్చకులకు పదవీవిరమణ ఉంటుందని ప్రకటించింది. దీంతో రమణదీక్షితులుకు టీటీడీ చెక్‌ పెట్టినట్టే అని భావిస్తున్నారు. ఆయన మాత్రం తనకు ఢిల్లీ స్థాయిలో ఉన్న అండతో పోరాటానికే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. శ్రీవారి పూజా కైంకర్యాల్లో రమణదీక్షితులు సరిగ్గా పాల్గొనరని మహతిలో జరిగిన టీటీడీ ఆగమ సదస్సులో సంస్కృత విద్యాపీఠం ఆచార్యుడు చెప్పి బాధపడ్డారు. మిరాశీ ఉన్న సమయంలో కూడా రమణదీక్షితులు కుటుంబం సినిమాలను ప్రొడ్యూస్‌ చేస్తూ విలాసంగా గడిపేవారనే విమర్శలు ఉన్నాయి. తిరుమల ఆలయానికి మహాద్వారం గుండా వెళ్లటానికి ఉన్న నిబంధనలనుకూడా ఆయన తుంగలో తొక్కారు. గతడాది బ్రహ్మోత్సవాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా తన మనవడితో మహాద్వారం నుంచి ఆలయంలోని సన్నిధిలోకి వెళ్లటంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై టీటీడీ వివరణ కోరుతూ రమణదీక్షితులుకు నోటీసులు జారీ చేసింది.
 
నేతల ప్రాపు కోసం పాట్లు..
రమణ దీక్షితులు శ్రీవారికి సేవ చేయటం కంటే రాజకీయ నేతల ప్రాపు కోసం పాకులాడే తీరుపై ఎన్నోసార్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఓ రాజకీయ నాయకుడికి ఆయన తన ఇంట్లో ప్రైవేటుగా హోమం చేయించారు. శ్రీవారి ఆలయంలో తప్ప ఇతరచోట్ల హోమాలు చేయకూడదని టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని కూడా తుంగలో తొక్కారు. తిరుపతి విమానాశ్రయంలో ఓ కాంగ్రెస్‌ నేతకు బొట్టుపెట్టి నానా హంగామా చేశారు. అది కూడా అప్పట్లో వివాదమైంది.
  •  ఓ కీలక రాజకీయ నేత వచ్చినపుడు.. మడిలో ఉండి స్వామికి సేవ చేయాల్సిన అర్చకుడు వారితో రాసుకుపూసుకు తిరిగి... ఆలయం బయట కారు వరకూ వచ్చి సాగనంపి... తిరిగి మూలవిరాట్‌ వద్దకు వెళ్లిన ప్పుడు కూడా భక్తులు, తోటి అర్చకులు బాధపడ్డారు.
  •  గత బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు కు అఖిలాండం వద్ద తలపాగ చుట్టేందుకు రమణదీక్షితులు పోటీపడ్డారు. ఓ అర్చకుడి చేతిలో ఉన్న వస్ర్తాన్ని ఆయన లాక్కుని మరి సీఎం తలకు చుట్టడంపై కూడా తీవ్రస్థాయిలో దుమారం రేగింది.
  •  తాజాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వచ్చినపుడు ఆయనతో రహస్యంగా భేటీఅయ్యారని సమాచారం. అలాగే సుబ్రమణ్యస్వామిని కూడా రమణదీక్షితులు కలుస్తుంటారని తెలుస్తోంది.
  •  గత నవంబరులో అర్చకుల మధ్య రేగిన వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. తమను ఆవుట్‌ సోర్సింగ్‌ అర్చకులు అనటంపై సంభావన అర్చకుడు ఖాద్రిపతి నరసింహాచార్యులు రమణదీక్షితులుపై మండిపడ్డారు. కైంకర్య అర్చకులందరిపై రమణదీక్షితులు కక్ష సాధిస్తున్నారని, తమకు అదనపు విధులు కేటాయించి పనిభారం మొపుతూ, కించపరిచేలా మాట్లాడుతున్నారని ఖాద్రిపతి నరసింహాచార్యులు ఆగ్రహించారు.
  •  ఇటీవల కర్ణాటకలోని మాండ్యాలో జరిగిన ఓ ప్రైవేట్‌ కల్యాణోత్సవంలో కుమారుడి కలిసి రమణదీక్షితులు పాల్గొనటం చర్చనీయాంశమైంది. దీంతో టీటీడీ ఆయన్నన వివరణ అడిగింది. గతంలోనూ ఆయన ఇలా ప్రైవేటు కల్యాణోత్సవాలు నిర్వహించారనే ఫిర్యాదులున్నాయి. దీనిపై టీటీడీ విజిలెన్స్‌ పూర్తి విచారణ చేసింది. ఈ అంశంపై గతంలోనే రమణదీక్షితులుపై చర్యలు తీసుకోవాల్సి వుంది. అయితే రాజకీయ అండతో తనపై చర్యలు లేకుండా ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టించారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ రమణదీక్షితులు ప్రైవేటు కల్యాణాల విచారణ ఫైల్‌ టీటీడీ విజిలెన్స్‌ వద్ద ఉంది.
Link to comment
Share on other sites

రమణ దీక్షితులుకు ‘ఉద్వాసన’
17-05-2018 03:27:15
 
636621244356790850.jpg
  • మరో ఇద్దరు ప్రధాన అర్చకులకూ రిటైర్మెంట్‌
  • 65 ఏళ్లు నిండిన అర్చకులకు పదవీ విరమణ
  • టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం
  • ఆరోపణలపై రమణ దీక్షితులుకు నోటీసులు
  • బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లపై సబ్‌ కమిటీ
తిరుమల, మే 16(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితుల్ని టీటీడీ పాలక మండలి పరోక్ష రీతిలో సాగనంపింది. ఆయనతో పాటు మరో ఇద్దరు ప్రధాన అర్చకులకు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించింది. ఇకపై టీటీడీ ఆలయాల్లో 65ఏళ్లు దాటిన అర్చకులు పదవీ విరమణ చేయాలని తీర్మానించింది. ఇటీవలే ఏర్పడిన టీటీడీ నూతన ధర్మకర్తల మండలి బుధవారం తిరుమలలో తొలిసారి సమావేశమైంది. గత ఏడాదిగా బోర్డు లేనందున టీటీడీ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం కోసం మొత్తం 200 అంశాలు చర్చకు వచ్చాయి. అన్నిటినీ చర్చించలేక కొన్నింటికే ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు బోర్డులో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు వివరించారు. టీటీడీలో 65ఏళ్లు పైబడిన అర్చకులు పదవీ విరమణ చేయాలని తీర్మానించామని, అర్హత మేరకు వారి కుటుంబ సభ్యులతో ఆ ఖాళీలను భర్తీ చేస్తామని వివరించారు. ఇందులో మిరాశీ అర్చకులకు ప్రాధాన్యం ఉంటుందని, లేనివారిని తీసుకోబోమన్నారు. ఈ నిర్ణయం మేరకు టీటీడీలోని అర్చకులు 52మందిలో 15మంది ఉద్యోగ విరమణ 9ttd.jpgచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో దాదాపు రూ.11వేల కోట్లు టీటీడీ డిపాజిట్లు ఉన్నాయని వీటిలో గత మార్చిలో రూ.4వేల కోట్లు రెన్యువల్‌ చేశామన్నారు. ఈ డిపాజిట్ల వ్యవహారంపై ఓ సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై బోర్డులో చర్చించామని, ఆయన వివరణ కోసం నోటీసు జారీకి ఆమోదించామన్నారు. ప్రతిఏటా ఆభరణాల లెక్కింపు కార్యక్రమం పటిష్ఠంగా జరుగుతోందన్నారు. అర్చకుల తరహాలో సన్నిధి గొల్లలు కూడా వారసత్వం హక్కును కోరుతున్నారన్నారు. ప్రస్తుతం అర్చకులకు వర్తిస్తున్న సంభావన విధానాన్నే తమకూ ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిపై ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. న్యూఢిల్లీ శ్రీవారి ఆలయ సలహామండలి ఏర్పాటు, రెండేళ్ల కాలపరిమితికి ఆమోదం తెలిపామన్నారు. చంద్రగిరి కోదండరామస్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రతినెలా ఆర్జిత కల్యాణోత్సవం నిర్వహణకు ఆమోదించామన్నారు. వచ్చే నెల 5న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించనున్నట్లు చైర్మన్‌, ఈవో వివరించారు.
 
ప్రధాన అర్చకుల నియామకం
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా పైడిపల్లి ఏఎస్‌ కృష్ణశేషాచలం దీక్షితులు, గొల్లపల్లి వేణుగోపాల దీక్షితులు, పెద్దంటి శ్రీనివాస దీక్షితులను నియమిస్తూ టీటీడీ బోర్డు ఆమోదించింది. 65ఏళ్లు దాటిన ఏవీ రమణ దీక్షితులు, శ్రీనివాసమూర్తి దీక్షితులు, నరసింహ దీక్షితులుకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. తిరుపతమ్మ వంశస్థుల తరపున నియమించే అర్చకుని విషయంలో బోర్డు నిర్ణయం వాయిదా వేసింది. అర్చకులకు డ్యూటీలు కేటాయించే బాధ్యతలను ఆలయ డిప్యూటీ ఈవోకు అప్పగించారు.
 
కక్షతోనే నిర్ణయం: రమణ దీక్షితులు
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చక పదవి నుంచి తనకు రిటైర్మెంటు ప్రకటిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానని రమణ దీక్షితులు పేర్కొన్నారు. తనపై కక్షగట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తిరుమల కట్టడాలను, స్వామివారి అభరణాలను, శాస్త్ర సంప్రదాయాలను సంరక్షించుకోవలసిన అవసరాన్ని సూచిస్తూ మీడియా ముందుకు వస్తే మాపై కక్షతో రిటైర్మెంట్‌ ప్రకటించారని ఆగ్రహించారు. దీనిని చట్టపరంగా ఎదుర్కొంటామని, సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలయ్యేలా పోరాడతామన్నారు.
 
టీటీడీ అర్చకుల సర్వీసు క్రమబద్ధీకరణ
టీటీడీలో పనిచేస్తున్న మిరాశీయేతర అర్చకులు 32మంది సర్వీసును క్రమబద్ధీకరించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గతంలో పద్మావతి అమ్మవారి ఆలయంలో మిరాశీయేతర అర్చకుల సర్వీసును క్రమబద్ధీకరించిన విధానమే వీరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది.
 
టీటీడీ నిర్ణయం సరికాదు: ఐవైఆర్‌
టీటీడీలో నిర్వహించే కైంకర్యాలు జీవిత కాలానికి సంబంధించినవని, అటువంటి దైవికమైన కార్యక్రమానికి లౌకికమైన ఉద్యోగంలా పదవీ విరమణ నిర్ణయించటం సరికాదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు అన్నారు. ఈ మేరకు బుధవారం టీటీడీ ఈవోకు ఆయన లేఖ రాశారు. తిరుపతిలో ఉండే అర్చకులు స్కేల్‌ ఆఫ్‌ పే పొందలేదు కాబట్టి వారికి ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, పదవీ విరమణ తర్వాత వచ్చే సౌకర్యాలు ఉండవని పేర్కొన్నారు. 65 ఏళ్లకి వారిని పదవీ విరమణ చేయాలనడం సరికాదన్నారు. వారిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సుప్రీంకోర్టు అనుమతితో ధార్మిక పరిషత్‌కు మాత్రమే ఉంటుదని వివరించారు.
 
ఆప్పుడు నోరు మెదపలేదేం?: ఆనంద్‌సూర్య
వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన తప్పిదాలపై మౌనం దాల్చిన టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు అప్పుడు ఎందుకు నోరు మెదపలేదని బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేమూరి ఆనందసూర్య ప్రశ్నించారు. ఆయన మతి తప్పి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దీక్షితులు వెనుక ఉన్న అదృశ్య అజెండా ఏమిటో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రమణ దీక్షితులు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమేనన్నారు. టీటీడీని ఆర్కియాలజీకి ఇవ్వాలని లేఖ రాసిన ఐవైఆర్‌ కృష్ణారావు ఎవరి ఒత్తిడి, సలహా మేరకు ఆ లేఖ రాశారో చెప్పాలని ఆనంద్‌సూర్య డిమాండ్‌ చేశారు.
Link to comment
Share on other sites

20 hours ago, koushik_k said:

cbn atyasha kani e community eppudu TDP venta unnaru.. entha chesina vellaki a converted mahametha antene abhimanam.. 

Your comment is in a bad taste. Why blame whole community if some one makes a comment or create a nonsense? 

Link to comment
Share on other sites

TTD gurinchi eedu kuda neetulu cheptunada....

 

YSR kosam Tirumala lo yagam cheyyatam worst lo worst.....eedu chepulu esukuni velte kanisam pakka unna party vallu evadu addu cheppala....chivaraki security vallu chepthe ne tesadu....

Link to comment
Share on other sites

రమణ దీక్షితులు చాలా తప్పులు చేశారు: కేఈ

12182317BRK76A.JPG

అమరావతి: ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు ఎన్నో తప్పులు చేశారని.. సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరించారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఏడుకొండల గురించి గతంలో చెడుగా మాట్లాడిన రాజకీయ నాయకులకు ఏం జరిగిందో అందరికీ తెలుసని.. రమణ దీక్షితులు గతంలో చేసిన తప్పులపైనా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. స్వామివారి నగలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. అధికారులు వాటిని ఏటా పరిశీలిస్తారని కేఈ తెలిపారు. రమణ దీక్షితులు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని.. భక్తుల మనోభావాలు దెబ్బతీసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. రమణ దీక్షితులు అర్చక వృత్తి మరిచి రాజకీయ దీక్ష తీసుకున్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

అధికారంలోకి వస్తే... జగన్ తాజా ట్వీట్
17-05-2018 19:53:32
 
636621836128348860.jpg
ఏలూరు:  టీటీడీలో అవినీతి, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేశారు. అర్చకులకి పదవీవిరమణ ప్రకటించడం సరైందని కాదని ఆయన తెలిపారు. ప్రధాన అర్చకుడు వెల్లడించిన విషయాలతో చంద్రబాబు ధనయావ, అధికార దాహం మరోసారి వెల్లడైందన్నారు. అనువంశిక సేవకులుగా స్వామివారికి అన్ని కైంకర్యాలు నిర్వర్తించే హక్కు శక్తి ఉన్నంతకాలం ఆ అర్చకులకు ఉంటుందని చెప్పారు.
 
పదోన్నతితో కూడిన పే స్కేలు, పదవి వదిలిపెట్టిన తర్వాత ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వనప్పుడు, ఉద్యోగిగా పరిగణించనప్పుడు, వారికి ప్రభుత్వ రిటైర్మెంట్ ప్రకటించడం అర్ధంలేనిదని పేర్కొన్నారు. దేవుని మీద భయం, శక్తి లేనివారు కాబట్టే గుడిభూములను కాజేయాలని చూశారన్నారు. ఇప్పుడు ఆలయ అర్చకుల విషయంలోనూ దశాబ్దాలుగా ఏ పాలకుడూ చేయని పని చేస్తున్నారని విమర్శించారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతో తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేవాలయాల్లో అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తామన్నారు. ఈ విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తామని జగన్ స్పష్టం చేశారు.
 
jagan-tweet.jpg 
 
Tags : ys jagan, tweet, TTD issues
 
Link to comment
Share on other sites

రమణదీక్షితులుపై చర్యలు తప్పవు
18-05-2018 02:40:17
 
636622080184291407.jpg
  • తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తే ఉపేక్షించం: కేఈ
అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): బాధ్యత, హోదా మరచి రమణ దీక్షితులు టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చారని సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తప్పవని హెచ్చరించింది. టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులకు దేవస్థానం పాలకమండలి పదవీవిరమణ ప్రకటించిన దరిమిలా ప్రభుత్వం స్పందించింది. గురువారం ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తన కార్యాయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి రమణదీక్షితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల ఆధ్యాత్మికతకు భంగం కలిగిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. రమణ దీక్షితులు అర్చక వృత్తిని మరచి రాజకీయాలనే వృత్తిగా తీసుకున్నట్లు కనబడుతోందని, ఆయన రాజకీయాలనుంచి శ్రీవారిని రక్షించుకోవాలని చెప్పారు. పక్క రాష్ట్రంలో విలేకరుల సమావేశం పెట్టి పవిత్ర క్షేత్రాన్ని దిగజార్చేవిధంగా రమణ దీక్షితులు మాట్లాడారని, దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని కేఈ చెప్పారు. ఇది ఆయన హోదాను, టీటీడీ నియమాలను అతిక్రమించడమేనని స్పష్టం చేశారు. మిరాశీ వ్యవస్థను రద్దుచేసిన సమయంలో... 1996లో మిరాశీదారులుగా ఉన్న రమణదీక్షితులు స్వామివారి నగలన్నీ భద్రంగానే ఉన్నాయని అంగీకరించిన విషయాన్ని కేఈ గుర్తుచేశారు. ప్రతీఏటా శ్రీవారి నగలను అధికారులు భౌతిక పరిశీలన చేస్తున్నారని, ఈ విషయంలో జస్టిస్‌ జగన్నాథరావు, జస్టిస్‌ వాద్వా కమిటీ విచారణ చేసి సంతృప్తి వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ఆలయ నిబంధనలను అతిక్రమించి తన మనుమడిని అంతరాలయంలోకి తీసుకెళ్లడం, స్వయంగా వీఐపీల అతిథి గృహాలకు వెళ్లి ఆశీర్వచనాలు అందించడం సంప్రదాయ ఉల్లంఘన కాదా? అని కేఈ ప్రశ్నించారు. స్వామిసేవకంటే ధనికుల సేవే ఆయనకు పరమావధిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారికి తనవల్లే ఇంత ప్రాచుర్యం వచ్చిందనే అహంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పతనం మొదలైనట్లేనని కేఈ హెచ్చరించారు. తిరుమల ఆలయ ప్రతిష్ఠను దిగజార్చాలని ప్రయత్నించిన వారు పతనమయ్యారన్నారు. స్వామి వారికి ఏడుకొండలు ఎందుకు, మూడు కొండలు చాలు అన్నవారు ఏమయ్యారో అందరికీ తెలుసన్నారు. తాము తప్పుచేశామని ఆర్కియాలజీ విభాగమే తన లేఖను వెనక్కు తీసుకుంటే... మళ్లీ అదే శాఖ తీసుకోవాలని చెప్పడంలోని అర్ధంమేమిటని ప్రశ్నించారు. తిరుమల ఆలయం గురించి ఎవరు అవాకులు, చెవాకులు పేలినా తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇకపై ఆడిట్‌ వివరాలను ప్రతీఏటా వెల్లడించాలని టీటీడీని ఆదేశిస్తామన్నారు.
 
రమణదీక్షితులు వెనుక వైసీపీ, బీజేపీ
తిరుమల దేవస్థానంపై రమణ దీక్షితులు మాట్లాడ టం చూస్తుంటే ఆయన వెనుక వైసీపీ, బీజేపీ ఉన్నట్లు అనుమానం కలుగుతుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు విమర్శించారు. ప్రధాన అర్చకుడిగా ఉండి టీటీడీ గురించి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే పదవికి రాజీనామాచేసి ఇష్టమొచ్చిన పార్టీలో చేరవచ్చన్నారు. 40ఏళ్ల క్రితమే అయ్యవార్లు అందరూ కూర్చుని చర్చించి, సుప్రభాత సేవ గురించి నిర్ణయం తీసుకున్నారన్నారు. అగమశాస్త్ర ప్రకారం వెయ్యికాళ్ల మంటపాన్ని తొలగించడానికి సంతకం పెట్టింది రమణదీక్షితులు కాదా అని ప్రశ్నించారు.
 
నేతలకు మొక్కడం ఏ సంప్రదాయం?
శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉంటూ రాజకీయ నేతలకు మొక్కడం ఏ సంప్రదాయమని రమణ దీక్షితులును టీటీడీ బోర్డు సభ్యుడు డొక్కా జగన్నాథం ప్రశ్నించారు. శ్రీవారి ఆలయంలో గోవిందనామాలు చెప్పుకుంటూ అర్చన చేయాల్సిన రమణ దీక్షితులు రాజకీయ నాయకులకు మొక్కడం దుర్మార్గమన్నారు. నాయకుల ఇంటికి వెళ్లి సుదర్శన యాగాలు చేయడం ఆయనకే చెల్లిందని దుయ్యబట్టారు. వైఎస్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే ఇలా మాట్లాడుతున్నారన్నారు. బ్రాహ్మణ సమాజం విజ్ఞతతో అంతా గమనిస్తోందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి ఇప్పటివరకు రూ.300కోట్లు అందజేశారన్నారు. టీడీపీ వెన్నంటే బ్రాహ్మణ సమాజం ఉందన్నారు. అనంతరం తుడా అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ మాట్లాడుతూ, తిరుమల పవిత్రత అందరికంటే ఆ దేవుని కటాక్షంతో బయటపడిన చంద్రబాబు నాయుడుకే బాగా తెలుసన్నారు.
Link to comment
Share on other sites

I feel 65 years cut off is good thing other junior brahmins will get chance. It might not be right time to do it.

Already YSRCP Christian batch pushing Bs like Undavalli, IYR, Ramana deekshitulu against TDP.

All these years why Ramana deekshitulu did not question about gold, why he did not question appointment of christian - Karunakar Reddy as TTD chairman,   why he supported YSR though he is christian, why he did not question anyamata pracharam when YSR & Jagan done it from 20014-14 openly through Karunakar Reddy.

Same as IYR when he was CM & Brahmin corporation chairman everything done by TDP was good. Now why suddenly all these people raising voices?

 

This time their problem is one BC community person appointed as TTD chairman first time in history by TDP, which is not liked by YSRCP & BJP. These people started questioning it through IYR, Vundavalli & Ramana Deekshitulu.

 

These people don't get ashamed supporting Christian party being Hindu?

 

 

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

I feel 65 years cut off is good thing other junior brahmins will get chance. It might not be right time to do it.

Already YSRCP Christian batch pushing Bs like Undavalli, IYR, Ramana deekshitulu against TDP.

All these years why Ramana deekshitulu did not question about gold, why he did not question appointment of christian - Karunakar Reddy as TTD chairman,   why he supported YSR though he is christian, why he did not question anyamata pracharam when YSR & Jagan done it from 20014-14 openly through Karunakar Reddy.

Same as IYR when he was CM & Brahmin corporation chairman everything done by TDP was good. Now why suddenly all these people raising voices?

 

This time their problem is one BC community person appointed as TTD chairman by TDP, which is not like by YSRCP & BJP. These people started questioning it through IYR, Vundavalli & Ramana Deekshitulu.

 

These people don't get ashamed supporting Christian party being Hindu?

 

 

yup main problem is bc atanni appoint chesaru,ycp bc votes ni lagali anukundi from tdp but kudaradam ledu,so they started this

Link to comment
Share on other sites

#తిరుమల_తిరుపతి_దేవస్థానం లో ఏమి జరిగింది..
ఎందుకు రమణ దీక్షితులు గారిని తోలగించారు...
ప్రతి తెలుగువాడు తెలుసుకోవాలిసిన నిజాలు...
తెలుగుదేశం & చంద్రబాబు పై జరుగుతున్న దుష్ప్రచారాన్నికి అడ్డుగా షేర్ చేసి అందరికి తెలియచేయండి...

Link to comment
Share on other sites

ఆ ఆరోపణలు నిరాధారం
హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ వివరణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి నెలా రూ.100 కోట్ల విలువైన పాలు, వెన్న, నెయ్యి, జీడిపప్పు పంపిణీ చేస్తున్నామన్న ఆరోపణలు పూర్తి నిరాధారమైనవని హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ తెలిపింది. సంస్థ ప్రారంభించిన నాటి నుంచి వీటిని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తితిదేకు ఎన్నడూ సరఫరా చేయలేదని హెరిటేజ్‌ ఫుడ్స్‌ అధ్యక్షుడు ఎం.సాంబశివరావు శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవం, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమిలాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రూ.నాలుగు చొప్పున మజ్జిగ పొట్లాలను సరఫరా చేస్తున్నామని తెలిపారు. అది కూడా నిబంధనలకు అనుగుణంగా దక్కించుకున్న టెండర్ల ప్రక్రియ ప్రకారమేనని వివరించారు. నాలుగేళ్లుగా ఏటా రూ.15 లక్షల చొప్పున రూ.75 లక్షల విలువైన మజ్జిగను తితిదేకు సరఫరా చేసినట్లు చెప్పారు. మార్కెట్‌లో రూ.ఐదు చొప్పున విక్రయించే ప్యాకెట్‌ను తితిదేకు రూ.4కే అందిస్తున్నామని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

ఆపరేషన్‌ గరుడలో రమణదీక్షితులు పావు
20-05-2018 02:36:52
 
636624148540695308.jpg
  • బ్రాహ్మణ చైతన్య వేదిక కో-కన్వీనర్‌ శ్రీధర్‌
గుంటూరు(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానంపై పొరుగు రాష్ట్రంలో తీవ్ర విమర్శలు చేసిన రమణ దీక్షితులు ఆపరేషన్‌ గరుడలో ఒక పావు అని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్‌ సిరిపురపు శ్రీధర్‌ ఆరోపించారు. శనివారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ ఈ ఆపరేషన్‌లో ఐవైఆర్‌ కృష్ణారావును వాడిన తరహాలోనే రమణ దీక్షితులును కూడా బీజేపీ వాడుకుంటోందన్నారు. శ్రీవారికి సేవ చేయడం కంటే రాజకీయ నేతల ప్రాపకం కోసం ఆయన పాకులాడారని ఆరోపించారు. తిరుమలకు ఏ వీఐపీ వచ్చినా రహస్యంగా వారి గదులకు వెళ్లి మంతనాలు జరిపేవారన్నారు. ఇప్పటికైనా రమణ దీక్షితులు నోరు అదుపులో ఉంచుకోకుంటే తగిన గుణపాఠం తప్పదని శ్రీధర్‌ హెచ్చరించారు.
Link to comment
Share on other sites

ఆ నాలుగు కుటుంబాలు.. తిరుమల మిరాశీ అర్చక కుటుంబాల కథ
20-05-2018 16:20:30
 
636624300317726805.jpg
  • స్వామి సేవలో రెండు వేల ఏళ్లుగా వారే
రెండువేల ఏళ్ల కిందట...
శ్రీమహాలక్ష్మీదేవికీ, మహావిష్ణువుకీ జగడం వచ్చిందంట. లక్ష్మమ్మ మీద స్వామి అలిగి భూలోకానికి వచ్చేశాడంట. శ్రీనివాసుడిగా అవతరించిన స్వామి భూలోక యాత్ర చేస్తుండగా పద్మావతీ దేవిని చూసి మోజుపడ్డాడంట. పరిణయమాడాడు. అయ్యగారిని వెతుక్కుంటూ లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చింది. అలిగి వచ్చిన పతి భూలోకంలో వెలగబెట్టిన వ్యవహారం చూసి అమ్మవారికి మండుకొచ్చింది. కోపంతో రగిలిపోయింది. ఇంకేముందీ అమ్మవారి ఆగ్రహం వల్ల స్వామి భూలోకంలో విగ్రహంగా మారిపోయాడు. విగ్రహం చుట్టూ పుట్టలు పేరుకుపోయాయి. దట్టమైన అడవి పెరిగిపోయింది. ఒక రోజు అడవికి మేతకు వెళ్ళిన ఆవు పుట్టలోకి పాలు వదులుతూ ఉంటే గొల్లవాళ్లు చూశారు. ఏమిటీ వైచిత్రి అనుకుని చూస్తే పుట్టలో స్వామి విగ్రహం కనిపించింది. అదే సమయంలో గోపినాథ్‌ దీక్షితులు అనే భక్తుడి కలలో స్వామి కనిపించి, తనకు పూజా కైంకర్యాలు నిర్వహించాలని చెప్పారంట. అప్పటి నుంచీ గోపినాథ్‌ దీక్షితులు కుటుంబం రోజూ స్వామికి పూజాదికాలు భక్తితో నిర్వహించేవారంట.
 
 
ఇదంతా రెండువేల ఏళ్ళ కిందటి కత అని చెప్పుకుంటారు. భరద్వాజ గోత్రానికి చెందిన గోపినాథ్‌ దీక్షితులే స్వామికి తొలికైంకర్యాలు నిర్వహించారని చెబుతారు. ఆ వంశంలోని వారే తొలుత స్వామికి పూజలు చేస్తూ వచ్చారు. అయితే.. మైలు, ఇతర అవాంతరాలు సంభవించినప్పుడు కైంకర్యాలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో మరో గోత్రానికి చెందిన వ్యక్తులను కూడా అర్చకులుగా తీసుకోవాలని నిర్ణయించారు.
 
ఇందులో భాగంగా కైశిక గోత్రానికి చెందిన వారు అర్చకులుగా స్వామి సేవలోకి వచ్చారు. ఈ రెండు గోత్రాల వారే స్వామికి కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ తరువాత స్వామివైభవం పెరగడంతో పాటు అనేక మంది రాజుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆర్కాడ్‌ నవాబు, ఈస్టిండియా కంపెనీ, మహంతులు ఆలయ పారిపాలన చూసుకునేవారు. 80 ఏళ్ల కిందట టీటీడీ ఏర్పాటైంది. భరద్వాజ గోత్రంలోని గొల్లపల్లి, పైడిపల్లి కుటుంబాలు తిరుమలలోని శ్రీవారి ఆలయం, వరాహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించేవారు. కైశిక గోత్రంలోని తిరపతమ్మ, పెద్దింటి కుటుంబాలకు చెందిన వారు తిరుపతిలోని ఆలయాల్లో విధులు నిర్వహించేవారు. ఈ రెండు గోత్రీకుల ఆర్చకత్వం ఇలా మొదలైందని చెబుతారు.
 
భూములు పోయి వాటాలొచ్చాయి
తొలిరోజుల్లో స్వామికి కైంకర్యం చేసే అర్చకులు తమ ఇంటి నుంచి తీసుకువచ్చిన బియ్యాన్ని వండి స్వామికి నైవేద్యం పెట్టేవారు. దట్టమైన అరణ్యప్రాంతం కనుక పూజలు ముగించుకుని సాయంత్రానికే ఆలయం మూసి తిరుమల వదిలి వెళ్లేవారు. భక్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో పాటు ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉండేది. దీంతో రాజులు, మహంతులు నాలుగు అర్చక కుటుంబాలకు జీవనాధారం కింద ఇనాంగా గ్రామాలను ఇచ్చారు. ఆ గ్రామాల పేర్లే తరువాతి కాలంలో వీరి వంశం పేర్లుగా మారాయి. ఆయా గ్రామాల్లో ఉన్న పొలాలను సాగుకి ఇచ్చి వచ్చిన ఆదాయంతో జీవనం సాగించేవారు.1978 తర్వాత భూసంస్కరణలు అమలులోకి రావడంతో 80 శాతానికిపైగా భూములు వారికి దూరమయ్యాయి. ఆ తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యతో పాటు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.
 
ఈ క్రమంలో 1979 నుంచి జీవనభృతి విధానం మారింది. వంతు వచ్చిన అర్చకుడికి ఆర్జిత సేవలు నిర్వహించగా వచ్చిన ఆదాయంలో 5 శాతం అందజేసేవారు. వీటితో పాటు ప్రసాదాలకు సంబంధించి ప్రసాదాల గంగాళంలో పావుభాగం ఆ అర్చకుడికే ఇచ్చేవారు. అలా వచ్చిన ప్రసాదాలను భక్తులకు విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని అర్చకుడే తీసుకునేవారు. అలాగే హోమశేషం కింద పసుపు, కుంకుమ, బియ్యం, నెయ్యి వంటి అందేవి. దాంతో పాటు పడి(51 లడ్డూలు) లడ్డూల తయారీలో రెండు లడ్డూలు వీరికి వాటాగా అందేవి. అయితే ఈ లడ్డూల విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వంతు అర్చకుడితో పాటు వంతులో లేని అర్చకులు కూడా తీసుకునేవారు. ఇలా వచ్చిన ఆదాయంతో గుమస్తాలకు జీతాలు ఇచ్చేవారు.
 
 
టీటీడీలో మొత్తం 87 మంది ప్రధాన, సాధారణ అర్చకులు స్వామికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఇందులో దీక్షితుల కుటుంబానికి చెందిన వారిలో నలుగురు ప్రధాన అర్చకులతో పాటు 33 మంది అర్చకులుగా ఉన్నారు. అలాగే సంభావన అర్చకులు తిరుమలలో 34 మంది, తిరుపతిలో 16 మంది స్వామి కైంకర్యాలలో పాల్గొంటున్నారు. సంభావన అర్చకులు అర్చకత్వం నుంచి విరమించుకుంటే, వారి జీవనం కోసం రూ.10 లక్షలు టీటీడీనే అందజేస్తుంది.
 
 
1997 వరకు ప్రధాన అర్చకులు లేరు
స్వామికి కైంకర్యాలు నిర్వహించేవారందరిని అర్చకులనే పిలిచే వారు. ఈ నాలుగు కుటుంబాలకు చెందిన వారు ఏడాదికి ఓ కుటుంబం చొప్పున వంతు పేరుతో కైంకర్యాలు నిర్వహించేవారు. మిగిలిన వారు తిరుమల మినహా మిగిలిన ఆలయాలను పర్యవేక్షిస్తూ ఉండేవారు. వంతు వచ్చిన అర్చకుడు గుమస్తాలను(సంభావన అర్చకులు) ఏర్పాటు చేసుకుని కైంకర్యాలు నిర్వహించేవారు. అలా వంతు వచ్చిన అర్చకుడు ఏడాదిపాటు అర్చకత్వం చేసి వంతు విరమించుకుని మరో కుటుంభానికి అప్పగించేవారు. ఆ కుటుంబానికి చెందిన వారెవరైనా చనిపోతే అప్పటికే శ్రీవారిపాదసేవ చేయించిన కుటుంబ పెద్దను అర్చకుడిగా తీసుకునేవారు. 1998లో ప్రభుత్వం మిరాశీని రద్దు చేసింది. ఈ నాలుగు కుటుంబాలకూ అన్యాయం జరగకూడదని, ప్రతి కుటుంబం నుంచీ ఒకరిని ప్రధాన అర్చకుడిగా ఎంపిక చేశారు. అప్పటి నుంచే ప్రధాన అర్చక అనే పదం వాడుకలోకి వచ్చింది.
 
 
అర్చకుల జీతభత్యాలు ఎంత?
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో మీరాశి వ్యవస్థను రద్దు చేయాలని ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు హయాంలో నిర్ణయించారు. అర్చకులను ఉద్యోగుల్లా పరిగణించాలని 1987లో బిల్లు పాస్‌ చేశారు. రాష్ట్రపతి ఆమోదంతో యాక్ట్‌ను అమలుచేస్తూ మిరాశీ వ్యవస్థను రద్దు చేశారు. దీనిపై తిరుమలలోని నాలుగు కుటుంబాలూ కోర్డుకెళ్లాయి. కోర్టు స్టే ఇవ్వడంతో పాటు రిటైర్‌ జడ్జి నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా 1997లో మిరాశీని కోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో చాలా మంది అర్చకులు మిరాశీని వదులుకుని కైంకర్య అర్చకులుగానే కొనసాగుతున్నారు. మిరాశీ రద్దు అయిన తరువాత ఒక అర్చకుడికి నెలకు రూ.1500 జీతం, రూ.300 భోజన ఖర్చులిచ్చేవారు. ఆ తర్వాత రూ.3 వేలు, రూ.15 వేల వరకు జీతం పెరిగింది.
 
2010లో ఒకేసారి జీతం రూ.30 వేలుగా నిర్ణయించారు. ప్రధాన అర్చకులకు రూ.60 వేల వరకు జీతం వచ్చేది. ఈ తరుణంలో ప్రతి అర్చకుడికీ ఏడాదికి రూ.3 వేలు జీతం పెరిగేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రస్తుతం తిరుమల ప్రధాన అర్చకుడికి రూ.80 వేల జీతం, భోజనానికి రూ.3వేలు అందుతోంది. సాధారణ అర్చకుడికి రూ.41 వేల జీతం, భోజనం కింద రూ.3వేల నగదు వస్తోంది. వీటితో పాటు గౌరవమర్యాదల కింద ఆర్జిత సేవల ద్వారా వచ్చే బియ్యం కూడా అందుతోంది. వీటితో పాటు నెలలో ఐదు రోజులు సెలవులు కూడా ఉంటాయి. బస కింద వరాహస్వామి ఆలయం ఎదుట ఉన్న అర్చకుల భవనంలో గదులు కేటాయించారు.
Link to comment
Share on other sites

గులాబీ వజ్రాన్ని దేశం దాటించారు: రమణ దీక్షితులు
20-05-2018 14:11:31
 
636624222922883443.jpg
 
తిరుపతి: టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అత్యంత విలువైన గులాబీ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారని ఆరోపించారు. టీటీడీలో ఎప్పటినుంచో పాతుకుపోయిన సిబ్బంది వల్ల అర్చకులంటే చులకున భావన ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో అర్చకుల మాటకు విలువ లేదని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అపచారాల వల్ల స్వామి వారి తేజస్సు తగ్గిపోతోందని, స్వామి వారి తేజస్సు తగ్గితే భక్తులకు స్వామి అనుగ్రహం దొరకదని చెప్పారు. ఆలయానికి చుట్టూ ఉన్న వివిధ మండపాలు దివ్య పురుషుడి అవయువాలుగా చెప్పుకుంటామని, భక్తులు అతి పవిత్రంగా భావించే మండపాలను తీసివేశారని ఆయన ఆరోపించారు. ఎన్ని విన్నపాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే తాను కాపాడుకోవాలని భావించానని చెప్పుకొచ్చారు.
 
 
‘‘మాపై ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. స్వామి వారి పవిత్ర దయ, కరుణ భక్తులకు దొరకాలి. అలంకారమంటే స్వామి వారికి చాలా ఇష్టం. వీటన్నిటినీ కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. భక్తులు తలదాచుకోవటానికి కట్టిన వెయ్యి కాళ్ల మండపాన్ని కాపాడాల్సిన అవసరముంది. ఇదే విషయాన్ని అధికారులకు చెప్పాను. వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చివేయటంలో నా పాత్ర ఉంటే.. రథ మండపం లేకుండా ఎవరు చేశారు?. స్వామి వారి తేజస్సును తగ్గించే ఇనుమును వాడవొద్దని నేను ఎప్పటి నుంచే చెప్తున్నా. నామాట వినటం లేదు. ప్రతీ నగ, తిరువాభరణం గురించి నలుగురు అర్చకులకు మాత్రమే తెలుసు. మమల్ని తొలగిస్తే నగలు గురించి అడిగేవారే ఉండరని వాళ్ల ఆలోచన. టీటీడీ తీరు ఇలానే కొనసాగితే పూర్వం ఇక్కడ గుడి ఉండేదని భవిష్యత్తు తరాలకు చెప్పే పరిస్థితి వస్తోంది. స్వామి వారికి పస్తు పెట్టడం, నగలుపై సీబీఐ లాంటి సంస్థతో విచారణ జరిపించి, స్వామి వారి ఆస్తులను కాపాడాలి’’ అని రమణ దీక్షితులు డిమాండ్ చేశారు.
 
 
స్వామి వారి కరుణను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తాము టీటీడీ జీతగాళ్లం కాదని, వంశపారంపర్యంగా స్వామి వారికి సేవ చేసుకుంటున్నామని రమణ దీక్షితులు పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలికి అన్ని విషయాలు తెలియవని ఆయన అన్నారు. అన్నీ వదులుకుని వంశపారంపర్యంగా స్వామి వారికి కైంకర్యాలు చేస్తున్నామని, విచారణ జరిపితే చాలా విషయాలు బయటకొస్తాయన్నారు. పదవీ విరమణపై న్యాయపోరాటం తప్పక చేస్తానని ఆయన స్పష్టం చేశారు. చివరి ఊపిరి వరకు స్వామి వారికి సేవ చేసుకోవాలని భావించానని, స్వామి అనుగ్రహంతోనే అన్నీ జరుగుతాయని రమణ దీక్షితులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

రమణ దీక్షితులు ఆరోపణలపై.. ఆధారాలు బయట పెట్టిన టీటీడీ
20-05-2018 16:10:17
 
636624294182264332.jpg
 
తిరుమల: తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలను టీటీడీ తిప్పికొట్టింది. రమణ దీక్షితులు అసత్య ఆరోపణలు చేశారంటూ... ఆధారాలతో సహా టీటీడీ బయట పెట్టింది. పోటు మరమ్మతు పనులతో వెయ్యికాళ్ల మండపం కూల్చివేతకు... రమణ దీక్షితులు ఆమోదం తెలిపిన పత్రాలను టీటీడీ విడుదల చేసింది. శ్రీవారి ఆలయ౦లోని వకుళామాత పోటులో... ఎటువంటి తవ్వకాలు టీటీడీ జరపని చెప్పింది. కేవలం మరమ్మతులను మాత్రమే చేశామని టీటీడీ తెలిపింది. పోటును మీడియాకు చూపించి అనుమానాలను టీటీడీ నివృత్తి చేసింది.
 
 
టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై రమణదీక్షితులు ఆరోపణలు చేస్తున్నారు. తిరుమల ఆలయ వ్యవస్థ మీదే అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్తలకు ఎక్కుతున్నారు. నిజానికి ఆయన వ్యవహారశైలి తొలినుంచీ ఇలాగే ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయన తను కొలువున్న వ్యవస్థనే ఇరుకునపెట్టేలా ప్రవర్తించారని, ఆగమశాస్త్రం, ఆచార వ్యవహారాలు, నియమాలు అని మాట్లాడుతున్న రమణదీక్షితులు.. ఆయనే వాటిని చాలాసార్లు ఉల్లంఘించారనే విమర్శులున్నాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...