Jump to content

TTD meda kutra rajakiyam


Recommended Posts

  • Replies 221
  • Created
  • Last Reply
  • 2 weeks later...
దీక్షితులు ‘వెనుక’!?
21-06-2018 02:42:48
 
636651457827357811.jpg
  • అన్యమత ప్రచారకుడితో చెట్టాపట్టాల్‌
  • బోరుగడ్డ అనిల్‌కు వివాదాస్పద నేపథ్యం
  • ట్రస్టు పెట్టి క్రైస్తవ మత ప్రచారం
  • ఆర్పీఐ నాయకుడి హల్‌చల్‌
  • చీటింగ్‌, మారణాయుధాల కేసు
  • పెద్దల పేర్లు చెప్పి బెదిరింపులు
గుంటూరు, జూన్‌ 20: టీటీడీ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు మరో వివాదంలో చిక్కుకున్నారు. అన్యమత ప్రచారకులతో ఆయన చేతులు కలిపారంటూ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొనే బోరుగడ్డ అనిల్‌తో కలిసి రమణ దీక్షితులు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడటమే దీనికి కారణం. గుంటూరుకు చెందిన అనిల్‌.. సైమన్స్‌ అమృత్‌ ఫౌండేషన్‌ అనే క్రైస్తవ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన... రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కూడా! బుధవారం హైదరాబాద్‌లో రమణ దీక్షితులు వెనకే ఆయన కూర్చున్నారు. దీక్షితులు మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే తనకు ఫోన్‌ చేసి టీటీడీ వివరాలు అడిగారని.. తాను నివేదిక తయారు చేసి పంపించానని చెప్పారు.
 
 
అమిత్‌ షా తిరుమలకు వచ్చినప్పుడు ఆయనను కలిసి వివరాలు చెప్పామన్నారు. బోరుగడ్డ అనిల్‌పై పలు కేసులు, ఆరోపణలున్నాయి. గత ఏడాది రాజధాని పరిధిలోని తాడికొండ స్టేషన్‌లో ఆయనపై మారణాయుధాలు కలిగి ఉండటంతోపాటు చీటింగ్‌ కేసు నమోదైంది. ఓ స్థలం విషయంలో 2016 ఏప్రిల్‌లో ప్రకాశం జిల్లాకు చెందిన ఇంటూరి సురేశ్‌ బాబును బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశారని, తప్పుడు డాక్యుమెంట్లతో ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదైంది. అనిల్‌ను అరెస్టు చేశారు. ఈ సమయంలో ఆయన కారులో మారణాయుధాలు లభించాయి. దీంతో రెండు కార్లను కూడా తాడికొండ పోలీసులు సీజ్‌ చేశారు.
 
 
అనిల్‌ గుంటూరులో తనకు తాను ప్రముఖుడిగా చెప్పుకుంటూ కేంద్ర మంత్రుల పేర్లు చెప్పుకొని పంచాయితీలు చేస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి. తన కారుపై ఎంపీల స్టిక్కర్‌ వేసుకొని తిరుగుతూ.. కేంద్ర మంత్రులు, ప్రముఖులు తనకు బంధువులని చెప్పుకుంటారని తెలుస్తోంది. ‘మా పిన్నమ్మ జగన్‌కు బంధువు’ అని అనిల్‌ పేర్కొంటారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఓ క్రైస్తవ సంస్థ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పత్రికలకు ఫొటోలు పంపుతుంటారు.
Link to comment
Share on other sites

శ్రీవారి నగలన్నిటికీ లెక్కలున్నాయి
25-06-2018 01:44:37
 
636654929370481923.jpg
  • నా అనుమతితోనే పోటులో మరమ్మతులు
  • అక్కడ తవ్వకాలు అబద్ధం
  • ఆభరణాల ప్రదర్శన తప్పు
  • అది ఆగమ సమ్మతం కాదు
  • పింక్‌ డైమండ్‌ లేనే లేదు
  • ‘ఆంధ్రజ్యోతి’తో టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడు భట్టాచార్యులు
తిరుమల, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆభరణాలను ప్రదర్శనకు పెట్టే ఆలోచన శ్రేయస్కరం కాదనీ, అది ఆగమ సమ్మతం కూడా కాదని టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడు సుందరవదన భట్టాచార్యులు స్పష్టం చేశారు. 2003నుంచి టీటీడీ ఆగమ సలహామండలిలో సభ్యుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం గర్భగుడిలో స్వామి కైంకర్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా సంభాషించారు.
 
ఆరోపణలు బాధిస్తున్నాయి
1945నుంచీ తిరుమల క్షేత్రంలో ఉన్నాను. స్వామి కైంకర్యాలు, ఇతర పూజలు, ఆలయంలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు హఠాత్తుగా ఆగమానికి విరుద్ధంగా ఏదో జరిగిపోతోందని ఆరోపణలు, అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆలయ వ్యవహారాల్లో సుదీర్థకాలంగా పాల్గొంటున్న మమ్మల్ని ఇవి బాధిస్తున్నాయి. వాటికి నేను సమాధానాలు చెబుతాను.
 
పోటు రిపేర్లకు నేనే అనుమతిచ్చా
గతేడాది పోటు రిపేర్ల సమయంలో మైలపడిన ప్రసాదాలను స్వామికి నైవేద్యంగా పెట్టారని ఆరోపించడం సరికాదు. నా అనుమతితోనే పోటులో రిపేర్లు జరిగాయి. ఆలయంలోని వంటశాల(ప్రసాదం పోటు) దెబ్బతిందనీ, ప్రమాదాలు సంభవించేలా ఉన్నాయనీ టీటీడీ ఉన్నతాధికారులు నా దృష్టికి తీసుకువచ్చారు. నేను స్వయంగా పరిశీలించాను. ఏన్నో ఏళ్ల కిందటి నుంచి ఉన్న వంటశాల అది. నెయ్యి కింద పడటంతో పాటు దుమ్మూ ధూళితో మురికి చేరిపోయింది. గోడలు పొగబారిపోయాయి. గడిపొయ్యిలు పాడయ్యాయి. ఇటువంటి స్థితిలో అగ్నిప్రమాదం సంభవిస్తే పోటు కార్మికుల ప్రాణాలకే ప్రమాదం. ఆలయంలోని ముఖ్యమైన కట్టడాలు కూడా దెబ్బతింటాయి. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆగమ సలహాదారుడిగా మరమ్మతులకు అంగీకరించాను.పడిపోటులో సంప్రోక్షణం చేసి, అమ్మవారి ప్రతిమను ఏర్పాటుచేసి, అక్కడ తయారుచేసిన ప్రసాదాలను శ్రీవారికి సమర్పిస్తారు. ఈ విషయంలో ఎలాంటి లోపం జరగలేదు. ఆ సమయాల్లో రమణదీక్షితులు కూడా ఉన్నారు. అప్పట్లో ఏ అనుమానం వ్యక్తంచేయని ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడటమేమిటి? అక్కడ నిధుల కోసం తవ్వకాలు జరిగాయనడం సరికాదు.
 
పింక్‌ డైమండ్‌ను ఎప్పుడూ చూడలేదు
శ్రీకృష్ణదేవరాయుల పాలనా కాలంలో ఆభరణాలు సమర్పించినట్టు చెబుతుంటారు. శ్రీవారి ఆల యం విమాన సంప్రోక్షణ నుంచీ నేను స్వామికి కైంకర్యాలు నిర్వహిస్తున్నాను. రమణదీక్షితులు ఇప్పుడు చెబుతున్న పింక్‌ డైమండ్‌ను నేనెప్పుడూ చూడలేదు.
 
ఆభరణాలు స్వామి సన్నిధిలోనే ఉండాలి
ఎవరో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించాలనుకోవడం తప్పు. అవి ఎప్పుడూ స్వామి సన్నిధిలోనే ఉండాలి. స్వామికి ఆలంకరించినపుడు మాత్రమే భక్తులు చూస్తారు. తరువాత వాటిని రహస్య ప్రదేశంలో దాస్తారు. అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉండే ఆలయం నుంచి గురువింద కూ డా బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. ఆభరణాలన్నిటికీ రిజిస్టర్‌ ఉంది. ఏటా వాటిని పరిశీలించే ప్రక్రియ నడుస్తోంది. ఆభరణాల ప్రదర్శన అంశంపై ఇటీవల నన్ను అధికారులు అడిగారు. మంచిది కాదని చెప్పాను.
Link to comment
Share on other sites

బ్రేకింగ్: శ్రీవారి నగలపై సీఎం చంద్రబాబు కామెంట్స్..
25-06-2018 21:32:41
 
636655591618442007.jpg
అమరావతి: తిరుమలేశుని నగల విషయంలో వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆగమ శాస్త్రం ప్రకారమే తిరుమల కొండపై అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం ఇక్కడ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తిరుమల శ్రీవారి నగలకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది లేని నగలు, డైమండ్లు ఉన్నాయంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా రమణ దీక్షితులు ఆరోపణలపై మండిపడ్డారు. చివరికి దేవుడిని సైతం వదిలిపెట్టడం లేదని విమర్శించారు. ఇకపై ప్రతి రెండేళ్లకోసారి శ్రీవారి నగలపై న్యాయ విచారణ చేపడతామని సీఎం ప్రకటించారు. ఆ కమిటీ ముందే ప్రతి రెండేళ్లకోసారి నగల పరిశీలన చేస్తామన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

రమణదీక్షితుల ఆరోపణలకు చెక్!
25-06-2018 15:08:51
 
636655361320425915.jpg
తిరుమల: శ్రీవారి ఆభరణాలపై మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యల కారణంగా భక్తుల్లో కొంత అయోమయం ఏర్పడింది. దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తోంది టీటీడీ. ఇందులోభాగంగానే తిరుమల ధర్మకర్తల మండలి సోమవారం శ్రీవారి ఆలయంలోని స్వామివారి ఆభరణాలను పరిశీలించనుంది. ఈ మధ్య శ్రీవారి ఆభరణాలపై పలు రకాల ఆరోపణలు వ్యక్తమవుతూ వచ్చాయి. దీంతో జేష్టాభిషేకం తర్వాత బోర్డు సభ్యులు శ్రీవారి ఆభరణాల రిజిస్టర్, నగలను స్వయంగా పరిశీలించబోతున్నారు. తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. శ్రీకృష్ణదేవరాయులు, మైసూరు మహారాజుల పాలనాకాలంలో శ్రీవారి పలురకాల ఆభరణాలు సమర్పించారని ఈ మధ్య రమణదీక్షితులు మీడియా సమావేశంలో అన్నారు. అదే సమయంలో పింక్ డైమండ్ విదేశాలకు తరలించారని ఆరోపించారు. అంతేకాదు శ్రీవారి నగలకు భద్రతలేకుండా పోతోందని దుయ్యబట్టారు.
 
 
రమణదీక్షితులు ఆరోపణలపై టీటీడీ పాలకమండలి ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. బ్రహోత్సవాల్లో గరుడవాహనసేవ సందర్భంగా కెంపు ఒకటి పగిలిపోయిందని, దాన్ని కూడా ఆభరణాలు భద్రపరిచేచోట జాగ్రత్తగా ఉంచామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. కానీ ఆ తర్వాత కూడా దీక్షితులు పలురకాల ఆరోపణలు చేస్తున్నారు. రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలను ఆగమసలహా మండలి సభ్యులు సుందరవదన భట్టాచార్యులు ఖండించారు. ఆయన చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. పోటుకు మరమత్తులు చేయాల్సివస్తే దానికి ఆగమసలహా మండలి అంగీకరించిందని అందులో రమణదీక్షితులు కూడా ఉన్నారని భట్టాచార్య తెలిపారు.
Link to comment
Share on other sites

రమణ దీక్షితులుకి ఆ దేవుడే గుణపాఠం చెబుతాడు’
25-06-2018 21:57:18
 
636655606388054972.jpg
తిరుమల: శ్రీవారి ఆభరణాల విషయంలో అసత్య ఆరోపణలు చేసిన రమణ దీక్షితులుకు ఆ భగవంతుడే గుణపాఠం చెబుతాడని టీడీ చైర్మన్‌ సుధాకర్ యాదవ్ అన్నారు. శ్రీవారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయన్నారు. సోమవారం టీటీడీ పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడిన ఆయన.. రమణ దీక్షితులు తీరుపై మండిపడ్డారు. భక్తుల మనోభావాలను రమణ దీక్షితులు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. భక్తులు కానుకలు విసడం వల్ల పగిలిన రూబి విలువ 50 రూపాయలుగా రికార్డులో ఉందని సుధాకర్ తెలిపారు. రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నిజమైతే తిరుమలకు వచ్చి నిరూపించాలని సవాల్ విసిరారు. లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Link to comment
Share on other sites

వారివి దుర్మార్గమైన ఆరోపణలు: బోండా ఉమా
25-06-2018 22:12:21
 
విజయవాడ: శ్రీవారి ఆభరణాల్లో పింక్ డైమండ్ అసలు లేనే లేదని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సోమవారం టీటీడీ పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడిన బోండా ఉమా.. రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. వారి ఆరోపణలు దుర్మార్గమైనవని అన్నారు. రమణదీక్షితులు ఆరోపణలపై పరువు నష్టం దావా వేశామని చెప్పారు. తిరుఆభరణం రిజిస్టర్ మేరకు ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని తెలిపారు. శ్రీవారి పోటును పరిశీలించామని, ఎలాంటి తవ్వకాలు జరపలేదన్నారు. గోడలు శిధిలావస్థకు చేరుకోవడంతో మరమ్మత్తు చేశారని వివరించారు.
Link to comment
Share on other sites

రమణదీక్షితులు ఆరోపణలన్నీ అవాస్తవాలే
26-06-2018 01:55:47
 
636655749484756020.jpg
  • స్వామిపై అపవాదు వేశావు...
  • క్షమాపణ చెప్పాలి: టీటీడీ చైర్మన్‌ పుట్టా
తిరుమల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నో ఏళ్లుగా దేవుడి వద్ద సేవచేసిన రమణదీక్షితులు ఈ తరహాలో అపవాదులు వేయటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు. స్వామి ఆభరణాలను పరిశీలించాం. అన్ని లెక్కలు సరిగ్గా ఉన్నాయి. స్వామి వాహనసేవలో పగిలింది రూబీ మాత్రమే. అది గుర్తించింది కూడా రమణదీక్షితులే. దాని విలువ కూడా రికార్డుల్లో రూ.50 అని ఉంది. ఇంత కట్టుదిట్టంగా లెక్కలు ఉన్నప్పుడు ఎలా ఆరోపణలు చేస్తారు. దేవుడే రమణదీక్షితులుకు సరైన గుణపాఠం చెప్తాడు’ అని టీటీడీ బోర్డు చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. శ్రీవారి ఆభరణాల పరిశీలన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. రమణదీక్షితులు ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు బోర్డు సభ్యులందరితో కలిసి శ్రీవారి ఆభరణాలను పరిశీలించామని, ఆయన ఆరోపణలన్నీ వందశాతం అవాస్తవాలని అర్థమైందన్నారు. ఆభరణాలు ఉంచే లాకర్‌కు సంబంధించిన తాళాలు ఆలయ డిప్యూటీ ఈవో, ఏఈవో, సూపరిటెండెంట్‌ వద్ద ఉంటాయని, వాటన్నిటికి వేరువేరు నంబర్లు ఉంటాయని వివరించారు. అవి తెలిస్తేనే లాకర్‌ తెరుచుకుంటుందన్నారు.
 
అంతటి భద్రతతో పాటు 24 గంటలూ సీసీ కెమెరాల నిఘా ఉంటుంద న్నారు. గత 15ఏళ్లుగా రికార్డ్‌ అయిన ఫుటేజ్‌ డేటా టీటీడీ దగ్గర ఉందన్నారు. ప్రసాద పోటును కూడా తాము పరిశీలించామని, నేలమాళిగల కోసం పోటను తవ్వారంటూ రమణదీక్షితులు మూర్ఖంగా ఆరోపణలు చేశారని చైర్మన్‌ చెప్పారు. ఇకనైనా ఆరోపణలు చాలించి తిరుమలకు వచ్చి తమతో మాట్లాడితే ఆయనకు ఉన్న అనుమానాలు తొలగిస్తామన్నారు. కాగా, తిరుమల శ్రీవారి ఆభరణాలన్నీ ఎంతో భద్రత కలిగిన లాకర్లలో సురక్షితంగా ఉన్నాయని, అసత్య ఆరోపణలు చేసిన రమణదీక్షితులు భక్తుల గౌరవాన్ని, నమ్మకాన్ని పొగొట్టుకున్నారని టీటీడీ పాలకమండలి సభ్యులు, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ డొక్కా జగన్నాథం పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

 
 
శ్రీవారి నగలు భద్రం!.. టీటీడీ బోర్డు సభ్యుల ధ్రువీకరణ
26-06-2018 01:50:50
 
636655746507800345.jpg
  • నిత్యకట్ల, విశేష, లఘు ఆభరణాల పరిశీలన
  • నిబంధనలు వివరించిన అధికారులు.. సభ్యుల సంతృప్తి
  • రమణ దీక్షితులుపై మండిపాటు
తిరుమల, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా ఏడుకొండల వాడి ఆభరణాలను పాలక మండలి సభ్యుల కోసం ప్రదర్శించారు. ‘తిరువాభరణాలు తరలిపోయాయి’ అంటూ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. గత బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం ఈ ఆభరణాలను బోర్డు సభ్యులు పరిశీలించారు. తొలుత బోర్డు సభ్యులు, ఆ తర్వాత చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ బృందాల వారీగా నగలను సందర్శించారు. ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, పేష్కార్‌ రమేశ్‌ బాబు, బొక్కసం ఇన్‌చార్జి గురురాజారావు, ఆగమ సలహాదారు సుందర వరద భట్టాచార్యులు, అర్చకులతో కలిసి వీరు ఆభరణాల లాకర్ల వద్దకు చేరుకున్నారు. డిప్యూటీ ఈవో, పేష్కార్లు లాకర్లను తెరిచారు. బొక్కసం ఇన్‌చార్జి ద్వారా ఆభరణాలను అర్చకులకు అందజేస్తున్న విధానాన్ని బోర్డు సభ్యులు తెలుసుకున్నారు. తిరువాభరణం రిజిస్టర్‌ను పరిశీలించారు. రిజిస్టర్‌లో ఉన్న అనేక ఆభరణాల్లో ప్రధానమైన నిత్యకట్ల (నిత్యం స్వామికి అలంకరించేవి), విశేష (ప్రముఖులు తిరుమల వచ్చినప్పుడు అలంకరించేవి), లఘు (బ్రహ్మోత్సవాలకు అలంకరించేవి) తిరువాభరణాలను పరిశీలించారు.
 
ఆ తరువాత నగలను భద్రపరిచిన లాకర్ల చుట్టూ ఉన్న సీసీ కెమెరాల వ్యవస్థను చూశారు. ఇక్కడ 24 గంటలు నిఘా ఉంటుందని భద్రతా విభాగం అధికారులు తెలిపారు. చివరగా... సాయంత్రం 5 గంటలకు టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, సభ్యులు రుద్రరాజు పద్మరాజు, బొండా ఉమామహేశ్వరరావు నగలను సందర్శించారు. వీరు ప్రసాదాల పోటును, అక్కడ అదనంగా జరుగుతున్న గోడ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. పోటు సిబ్బందితో మాట్లాడారు. సీసీ కెమెరాల పనితీరును గమనించారు. మొత్తం మీద ఆభరణాల పరిశీలన సాయంత్రం 6.30 గంటలకు ముగిసింది. పాలకమండలి సభ్యులు శ్రీవారి ఆభరణాలను పరిశీలించడం టీటీడీ చర్రితలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇది తమ అదృష్టంగా పాలక మండలి సభ్యులు పేర్కొంటున్నారు.
 
దీక్షితులే కాజేశారేమో!
శ్రీవారి నగల పరిశీలన అనంతరం బోర్డు సభ్యులు మీడియాతో మాట్లాడారు. ‘‘పింక్‌ డైమండ్‌ లేనే లేదు. ఒకవేళ... అది ఉంటే రమణ దీక్షితులు ప్రధాన అర్చకుడిగా ఉన్న సమయంలో కాజేసారేమో!’’ అని రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. 65 ఏళ్లు వయోపరిమితిని అనుసరించి ఆయనతో పాటు చాలామందికి పదవీ విరమణ ఇచ్చారని... కేవలం తనను తొలగించారన్న ఆవేశంతో రమణ దీక్షితులు అసత్య ఆరోపణలు చేస్తూ అపచారాన్ని మూటకట్టుకుంటున్నారని చెప్పారు. తిరువాభరణ రిజిస్టర్‌ ప్రకారం ఆభరణాలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ‘‘రాములవారి మేడలోని సన్నసందులో ఆభరణాలు భద్రపరిచారు. చిన్న చిన్న ఆభరణాలు చాలా ఉన్నాయి. పగిలిన రూబీని కూడా పరిశీలించాం’’ అని రాయపాటి చెప్పారు.
 
ఆభరణాలన్ని భద్రంగా ఉన్నాయని మరో సభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. శ్రీవారి ఆభరణాల భద్రత విధానం, లాకింగ్‌ సిస్టమ్‌ చాలా పకడ్బందీగా ఉందని... పరిశీలించినంత వరకు నగలు భద్రంగా ఉన్నాయని సభ్యురాలు సుధానారాయణ మూర్తి చెప్పారు. రమణ దీక్షితులు 25 ఏళ్లు కైంకర్యాలు నిర్వహించి... ఇప్పుడు రక్షణ లేదని చెప్పడం దేవుడిని అవమానించడమేనని బోర్డు సభ్యుడు పెద్దిరెడ్డి అన్నారు. నగలను పరిశీలించిన వారిలో సండ్ర వెంకట వీరయ్య, రాఘవేంద్రరావు, రామచంద్రారెడ్డి, డొక్కా జగన్నాథం, కృష్ణ, రమేశ్‌ బాబు కూడా ఉన్నారు. మంగళవారం పాలకమండలి సమావేశం ఉన్న నేపథ్యంలో అంతకుముందు రోజే నగలను పరిశీలించారు.
Link to comment
Share on other sites

శ్రీవారి నగలపై రెండేళ్లకోసారి విచారణ
26-06-2018 01:48:33
 
  • ప్రతిదీ ప్రజలకు వివరిస్తాం: సీఎం
అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శ్రీవారి నగలు, ఇతర అంశాలపై ప్రతి రెండేళ్లకోసారి సునిశిత పరిశీలన జరుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జ్యుడీషియల్‌ విచారణ నిర్వహించి ప్రతి విషయం ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఆగమశాస్త్రానికి లోబడి... దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోమవారం విజయవాడలో జరిగిన వీఆర్‌ఏల సదస్సులో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏడుకొండల వాడిపైనా రాజకీయాలు చేస్తున్నారంటూ ఆక్రో శం వ్యక్తం చేశారు. రికార్డుల్లో లేని నగలు, వజ్రాల గురించి మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు.
Link to comment
Share on other sites

I think AP govt is doing the right thing ... letting TTD handle it.

Tirumala vishayamlo CBN chala saarlu chepthuntadu ... Bhaktula manobhavalu debbathinakudaku ani.

Its an important concept ... the whole thing is based on belief and perception ... CBN wouldn't tolerate anyone undermining that belief ... 

BJP (shah) intha neecha rajakeeyalaku ele digajarindo aa Venkanna ke theliyali ... 

That's why I say ... current BJP, power kosam emaina chesthundi ... vallaki basic morals kuda levu. 

Elections have consequences ... vote vesemundu oka saari alochinchandi ... that's your only chance.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...