Jump to content

Guntur politics


Recommended Posts

5 minutes ago, AnnaGaru said:

Macherla Modugula best candidate bro......Modugula ki Macherla lo YSRCP side nunchi kuda chala support undi behnd scenes...main Srigiripadu,veldurthi,Macherla down side koda Modugula has R's support

 

Srigiripadu punna reddy ni line lo pedithe sari pothundi

Link to comment
Share on other sites

  • Replies 131
  • Created
  • Last Reply
4 minutes ago, sonykongara said:

Srigiripadu punna reddy ni line lo pedithe sari pothundi

punna reddy and julkanti vallu koda Modugula support antunaru.....Macherla down lo sagam dharyam leka potundi manaki e sari akkada Modugula lakkostadu....villu unite ayite durgi,adigoppala,me karempudi side kuda kummestaru a talk tho...

antha negative unna 1989 lone TDP gelichindi ante imagine.....a 89 election lo TDP 1000 tho gelinchindi mainly groups unity tho even though candidate is calm going....

election ayina taruva they burnt TDP  winning mla house later..Modugula faction kakapovachu kani calm ayite kadu gattodu..

Link to comment
Share on other sites

1 minute ago, AnnaGaru said:

punna reddy and julkanti vallu koda Modugula support antunaru.....Macherla down lo sagam dharyam leka potundi manaki e sari akkada Modugula lakkostadu....villu unite ayite durgi,adigoppala,me karempudi side kuda kummestaru a talk tho...

antha negative unna 1989 lone TDP gelichindi ante imagine.....a 89 election lo TDP 1000 tho gelinchindi mainly groups unity tho even though candidate is calm going....

1989 veru bro, 1999 matram palanadu lo matram bambula godava valla taruvtha jarigindi, mundu jarigithe odipoye vallamu, kani 1999 baga kastapadi chesaru andharu, 2009 delimitation valla gurajala nunchi  rentachintala mandal purthiga kaliparu adi baga bad ayyindi

Link to comment
Share on other sites

2019లో రాయపాటికి టిక్కెట్ దక్కేనా..!?
19-05-2018 12:40:29
 
636623304305850030.jpg
  • ఎంపీ సీటుకు మళ్లీ పోటీకి సన్నద్ధం
  • పోటీకి విముఖత అనే ప్రచారానికి తెర
  • నరసరావుపేట కేటాయింపుపై అప్పట్లో అసంతృప్తి
  • తిరిగి అక్కడి నుంచే బరిలోకి...
  • ఆరో గోల్‌పై ఎంపీ రాయపాటి గురి
గుంటూరు: సీనియర్‌ పార్లమెంటేరియన్‌గా పేరొందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి విముఖతగా ఉన్నారనే ప్రచారానికి తెరపడింది. కొంతకాలంగా అస్వస్థతకు గురైన ఆయన తిరిగి కోలుకున్నారు. త్వరలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని క్రీయాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. వాస్తవానికి తాను అమితంగా ప్రేమించే సతీమణి లీలామణి అకాల మృతి చెందడం ఆయన్ను కుంగదీసింది. ఆ షాక్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాంగ్రెస్‌లో ఉన్నంతకాలం ఆయన గుంటూరు సీటునే అంటిపెట్టుకుని ఉన్నారు. నాలుగుసార్లు గుంటూరు నుంచే ఆయన విజయపతాకాన్ని ఎగురవేశారు. లోక్‌ సభలో కంటే ఆయన ముందు రాజ్యసభలో అడుగుపెట్టారు. 39 ఏళ్ళ వయసులో ఆయన తొలిగా 1982లో రాజ్యసభలో అడుగుపెట్టి 1988 వరకు కొనసాగారు.
 
 
రాష్ట్ర విభజన నేపథ్యంలోఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసు కున్న పరిణామాలతో విభజన నేపథ్యంలో రాయపాటి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. చేరిక ఆలస్యంగా జరగడం అప్పటికే గుంటూరు సీటును గల్లా జయదేవ్‌కు ఖరారు చేయడంతో రాయపాటి తప్పని పరిస్థితుల్లో నరసరావుపేట లోక్‌సభ నుంచి పోటీచేయాల్సి వచ్చింది. తొలుత ఆయన అంత దూరం పర్యటించడం కొంతఇబ్బందిగా భావిం చారు. స్వతహాగా ఆయనకు ఒక అలవాటు ఉంది. ఎంపీని అనే విషయాన్ని కూడా మరిచి ఎమ్మెల్యేల మాదిరిగా ఆయన నిత్యం నియోజక వర్గంలో వ్యక్తిగతంగా టచ్‌లో ఉండేవారు. ఆఖరికి పరిచయం ఉన్న ఓటరు ఇంటిలోనైనా సరే... ఏ శుభకార్యం జరిగినా వెళ్ళి పలకరించి రావడం ఆనవాయితీ... ఆ విధంగా ఇంచుమించు మూడు దశాబ్దాలపాటు గుంటూరు లోక్‌ సభ నియోజకవర్గంతో ఊరూరా సంబంధాలు ఏర్పర్చుకున్నారు. నరసరావుపేటలో పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలన్నింటిలో ఆయన పాల్గొం టున్నప్పటికీ గుంటూరులో మాదిరిగా సన్ని హిత సంబంధాలు ఏర్పర్చుకోలేకపోతున్నా మనే భావన ఆయనలో ఉండేది.
 
 
నిర్మొహమాటంగా మాట్లాడే నైజం రాయపాటికి ఉంది... ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గురించైనా సరే సందర్భాన్ని బట్టి వ్యతిరేకించి మాట్లాడతారు. 2004 నుంచి చనిపోయే వరకు ఉమ్మడి రాష్ట్రంలో హవా సాగించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై కూడా ఆయన అప్పట్లో విమర్శలు సంధించి ఆయనను ఎదుర్కొని నిలబడగలిగారు. వైఎస్‌ హయాంలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని కూడా ఆయన బహిరంగ విమర్శలు చేసిన సందర్భాలు లేకపోలేదు. 2009లో రాయపాటికి సీటు రాకుండా చేసేందుకు వైఎస్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
 
 
గుంటూరు సీటుకు రాయపాటి పేరును కాకుండా, సినీనటుడు కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేరును వైఎస్‌ ప్రతిపాదించి సోనియాకు జాబితాను పంపించగా ఆమె గుంటూరు ఎంపీ సీటు ఎదుట రాయపాటి పేరు లేకపోవడాన్ని గమనించి ‘వేర్‌ ఈజ్‌ ఆర్‌ఎస్‌... హూ ఈజ్‌ హి (ఆదిశేషగిరిరావు)’ అంటూ డోంట్‌ డిస్ట్రబ్‌ హిమ్‌ అంటూ అప్పట్లో వైఎస్‌పై మండిపడినట్లు ప్రచారం జోరుగా జరిగింది. దాంతో తిరిగి రాయపాటే వైఎస్‌ వ్యతిరేకించినా గుంటూరు పార్లమెంట్‌ సీటును దక్కించుకోగలిగారు.
 
ఆ ఘటన ద్వారా ఢిల్లీలోని టెన్‌ జన్‌పథ్‌తో ఆయనకున్న సంబంధాలు ఏ పాటివో వెల్లడయ్యాయి. ఇప్పటికే ఐదు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన రాయపాటి వచ్చే ఎన్నికల్లో కూడా బరిలోకి దిగి ఆరో విజయం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్ళూరు తున్నారు. ఈ పర్యాయం తాను పోటీచేసే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి తన వారసుడిని కూడా రంగంలోకి దించాలని ఎంపీ రాయపాటి భావిస్తున్నట్లు సమాచారం.
 
Tags : Rayapati Sambasiva Rao, narsaraopet mp seat, TDP
Link to comment
Share on other sites

  • 1 month later...
2 hours ago, mahesh1987 said:

Mimmalni blind gaa nammanu nenu

 

Friday District meeting lo guntur leaders tho cbn anna maata idi

 

Baaga unhappy gaa vunnadu guntur vallatho

Andaru baaga sampadinchukunaru ga..adi telisindi emo

Link to comment
Share on other sites

  • 2 weeks later...
టీడీపీలో భిన్న సంప్రదాయం.. ఐదు పర్యాయాలుగా ఆయనకే టికెట్ !
18-07-2018 16:29:25
 
636675281662829359.jpg
  • ఆరంభం నుంచి... ఆసక్తికరమే..!
  • గురజాలలో ఒకటి... రెండుసార్లే అవకాశం
  • టీడీపీలో భిన్న సంప్రదాయం
  • ఐదు పర్యాయాలుగా యరపతినేని అభ్యర్థి
పిడుగురాళ్ల(గుంటూరు జిల్లా): బ్రహ్మనాయుడు పరిపాలనతో పల్నాడుకే తలమానికమైన గురజాల రాజకీయం ఆరంభం నుంచి ఆసక్తిదాయకమే. కమ్యూనిస్టు రక్తంతో రాజకీయ చైతన్యవంతమైన ఇక్కడి ఎన్నిక ప్రక్రియలో అబ్బురపరచే అంశాలు కనిపిస్తాయి. అందులో ప్రధానంగా చెప్పుకో తగ్గది రాజకీయ పార్టీల సీట్ల కేటాయింపు. రాష్ట్రంలో ఎన్నికల సరళి ఆరంభమైన తరువాత చాలామంది ఈ నియోజకవర్గానికి నాయకులై ఎమ్మెల్యేలుగా పనిచేశారు. విచిత్రమేమింటే ఏ రాజకీయ పార్టీ కూడా తన అభ్యర్థికి మళ్లీ మళ్లీ అవకాశం ఇచ్చిన దాఖాలాల్లేవు. ఒకవేళ ఒకరిద్దరు మళ్లీ పోటీచేసినా తిరిగి గెలవలేదు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి వారికి ఇక్కడ మళ్లీ పోటీచేసే అవకాశం దక్కలేదు. తెలుగు దేశం ఆవిర్భావానికి ముందు ఇక్కడ కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల మధ్యే ప్రధాన పోటీవుండేంది. అప్పట్లో పోటీపడిన నాయకులందరూ ఆయా పార్టీలలో యోధాను యోధులనే చెప్పవచ్చు. దురదృష్టవశాత్తు వారికి మళ్లీ పోటీచేసే అవకాశం రాలేదు. 1952 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగిన కోలా సుబ్బారెడ్డి ఆ ఎన్నికల్లో కాసు బ్రహ్మనందరెడ్డిని ఓడించారు. కానీ తరువాత ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. కాంగ్రెస్‌ మాత్రం కాసుకు మళ్లీ ఇక్కడ టిక్కెట్‌ కేటాయించలేదు.
 
 
1955లో కేఎల్పీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన బాపనయ్యచౌదరికి ఆ తరువాత సీటు దక్కలేదు. 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొత్త వెంకటేశ్వర్లు మూడోసారి ఓటమి చవిచూడక తప్పలేదు. 1978లో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీచేసిన గడిపూడి మల్లికార్జునరావుకు 1983లో పోటీచేసే అవకాశం దక్కలేదు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన కాసు వెంకటకృష్ణారెడ్డికి ఓటమి ఎదరవ్వటంతో 1985 మధ్యంతర ఎన్నికల్లో సీటు కేటాయింపు విషయంలో నిరాశే ఎదురయ్యింది. 1989లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి కాయితి నర్సిరెడ్డికి కూడా 1994 ఎన్నికల్లో ఇదే అనుభవం ఎదరయ్యింది. 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన జంగా కృష్ణమూర్తికి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సీటు ఇవ్వకుండా మెండిచెయ్యి చూపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్‌ ఆలా వెంకటేశ్వర్లుకు ఆ తరువాత సీటు దక్కలేదు. పార్టీ అవిర్భావం నుంచి గురజాలలో టీడీపీ మాత్రం ఇతర పార్టీలకంటే భిన్నమైన సంప్రదాయం అవలంబించింది.
 
1983, 1985, 1989 మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఇప్పటివరకు ఒకే అభ్యర్థికి అవకాశం ఇస్తూ వచ్చింది. ఆ పార్టీ 1994 నుంచి ఇప్పటివరకు ఒకే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావును బరిలో దింపుతూ వచ్చింది. అయితే, యరపతినేనికి సీటురాకుండా తెరచాటుగాను, బహిరంగంగాను అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ అధిష్ఠానం ఆయన వైపే మొగ్గు చూపడం విశేషం! ఇప్పటి వరకు ఐదుసార్లు టిక్కెట్‌ తెచ్చుకున్న యరపతినేని 1994, 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో కేవలం 111 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గత అనుభవాన్ని పాఠంగా తీసుకొని వరుసగా (2009, 2014) గెలుపొందటమే కాకుండా తెలుగుదేశం పార్టీలో కీలకనేతగా ఎదిగారు.
Link to comment
Share on other sites

జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఆ ఎమ్మెల్యేకు టికెట్ పక్కా.. కానీ..
18-07-2018 16:18:17
 
636675274983704037.jpg
  • అధికార పార్టీలో నలుగురు.. విపక్షంలో నలుగురు
  • మళ్లీ టిక్కెట్‌ వరించేనా?
  • ఎవరి ప్రయత్నాలు వారివి...
ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వారెవరికైనా... అసెంబ్లీలో అడుగుపెట్టి... మైకు పట్టుకుని అధ్యక్షా.. అని పిలవాలనే కోర్కె తప్పకుండా ఉంటుంది. ఇక వారికి కొద్దిగా ఆర్థిక స్థోమత.. రాజకీయ అండ.. కార్యకర్తల మద్దతు.. సామాజిక, ప్రజాబలాలు ఉంటే... ఎమ్మెల్యే కావాలనే ఆకాంక్ష కలుగుతుంది. రాజకీయాల్లో అంతటి ప్రాముఖ్యం కలిగింది ఎమ్మెల్యే సీటు.. ఒక్కసారి ఎవరైనా సరే ఈ సీటు దక్కించుకుంటే... ఆ తరువాత ఆ సీటును పదిలం చేసుకోవడానికి.. పదికాలాల పాటు కొనసాగడానికి... సామ, దాన, భేద దండోపాయాలను అమలు పరుస్తారు. అవకాశం ఉన్నంతవరకు వదిలేది లేదంటారు. అలా గుంటూరు జిల్లాలో ఎనిమిది మంది తొలిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిలో నలుగురు అధికార పార్టీలో ఉంటే.. మరో నలుగురు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు.. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో వారి గురించి ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..!
 
 
(ఆంధ్రజ్యోతి, గుంటూరు)
గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా గత ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తొలిసారి గెలిచినవారే. వీరిలో టీడీపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి నలుగురు ఉన్నారు. వీరిలో రెండు పార్టీల్లో ఇద్దరేసి వంతున తొలిసారి దక్కిన సీటును మళ్లీ కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారు. వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూడాల్సివుంది. అధికార తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే... తొలిసారిగా ఎమెల్యే అయిన నలుగురిలో ఒకరు మాత్రమే సీటు ఖాయమని భరోసాగా ఉన్నారు. మిగిలిన ముగ్గురు ఎలాగైనా సీటు నిలబెట్టుకుని గెలవాలన్న కసరత్తును ముమ్మరంగా చేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో తొలిసారి గెలిచిన ఓ ఎమ్మెల్యే తనకు సీటు ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. ఇక మరో ఎమ్మెల్యే ఆది నుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఉంటూ ఆయనతో మాట్లాడే అవకాశం పొందినా ఈసారి సీటు కోసం ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
 
నియోజకవర్గంలోని రాజకీయ ఉద్దండులతో విభేదాలు, కొత్తగా పార్టీలో చేరిన సీనియర్‌ నాయకుల నుంచి పోటీ, అక్కడి నుంచే రెండు సార్లు ఎన్నికై మంత్రిగా చేసిన మరో అభ్యర్థి నుంచి పోటీ వంటి కారణాలతో ఈ ఎమ్మెల్యే బీఫారం పొందడానికే గట్టి పోటీ ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరందరి ఎత్తులు అధిగమించి ఎంతవరకు సీటు సాధిస్తారోనన్న సందిగ్ధం పార్టీ క్యాడర్‌లో నెలకొంది. దీంతో కిందిస్థాయి క్యాడర్‌ సైతం గ్రూపులుగా విడిపోతోంది. గ్రామస్థాయి నుంచి ఈ పరిణామాలు ఉన్నాయి. ఇది ఆయనకు వ్యతిరేకంగా మారే అంశంగా ఉంది. ఇక మరొకరు తన సత్తాతోనే ఎమ్మెల్యేగా సీటు సంపాదించుకుని గెలిచినా... ఆ నియోజకవర్గంలోనే బలమైన ప్రధాన సామాజికవర్గాన్ని దూరం చేసుకున్నారనే భావన ఉంది. దీంతో ఆయనకు ఈసారి సీటు విషయంలో అంత సానుకూలత ఉండదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే తమ పార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే లేని ప్రత్యామ్నాయ నియోజకవర్గంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇక అదృష్టవంతుడిగా పేరుపడ్డ మరో ఎమ్మెల్యే పరిస్థితి ఇంకోలా ఉంది. ‘అంగట్లో అన్నీ ఉన్నా’ అనే సామెతను ఈయనకు అన్వ యించు కుం టూ చెప్పు కునే పరి స్థితి నెల కొంది. ఈసారి ఆ నియోజకవర్గంలో మళ్లీ టిక్కెట్‌ లభిస్తుందనే అంశం అంత తేలిక కాదనే వాదన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
 
 
విపక్ష వైసీపీలో...
ప్రతిపక్ష వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ నుంచి తొలిసారి గెలుపొందిన నలుగురు ఎమ్మెల్యేల్లో అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేకు సీటు ఖాయమైనప్పటికీ విజయావకాశాలపై స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థి అంత బలంగా లేనప్పటికీ గెలుపు కోసం అష్టకష్టాలు పడాల్సివచ్చింది. ఇక నియోజకవర్గ అభివృద్ధిపై కాకుండా ఏకంగా సీఎంనే లక్ష్యంగా పెట్టుకుని వ్యవహరించడం మైనస్‌గా చెప్పుకుంటున్నారు. ఇక తనకు నచ్చని వారి పై కేసులు పెట్టడం, పరువు నష్టం దావాలు వేయడంతోనే ఈ నాలుగేళ్లు గడిపారన్న అపవాదు లేకపోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సారి గట్టెక్కడం అంత తేలిక కాదనేది సొంతపార్టీలోనే వినిపిస్తోంది.
 
ఇక జిల్లా కేంద్రం, డెల్టా, పల్నాడు ప్రాంతాల నుంచి తొలిసారి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలపై ఆయా నియోజకవర్గాల్లో పెద్దగా వ్యతిరేకత లేదనే భావన ఉంది. అయితే, ఈ ముగ్గురూ వివిధ సందర్భాల్లో పార్టీ మారుతున్నారనే వార్తలు వస్తుండడం... ఆ తర్వాత అవన్నీ అవాస్తవమేనని వారు బహిరంగంగానే ఖండించడం చోటుచేసుకున్నాయి. అయితే వారికి ఉన్న మిత్ర ప్రాబల్యం వల్ల ఈ పుకార్లు విస్తృతంగా జిల్లాలో వ్యాపించడంతోపాటు అధిష్టానం దృష్టికి వెళ్లాయి. దీంతో ఈ ముగ్గురూ మళ్లీ సీటు ఖాయం చేసుకునేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

తెనాలి నియోజకవర్గంలో ఈ ఆనవాయితీ కొనసాగుతుందా?
26-07-2018 10:02:39
 
636681961585686095.jpg
  • ఇక్కడ గెలిచిన పార్టీదే రాష్ట్ర పీఠం
  • 1983 నుంచి ఇదే ఆనవాయితీ
  • ఉన్నత పదవుల్లోనూ తెనాలికి స్థానం
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో తెనాలికి ప్రత్యేక స్థానమే ఉంది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీకే రాష్ట్రంలో అధికారపీఠం దక్కుతూ వస్తోంది. ఇది అదృష్టమో, ఆనవాయితీనో తెలియదుకానీ, ఆయా పార్టీలు కూడా అభ్యర్థి విషయంలో మంచి కసరత్తు చేస్తూ వస్తుంటారు.
 
 
తెనాలి(గుంటూరు జిల్లా): తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడినా తెలుగుదేశం పార్టీ పోటీలో నిలిచిన 1983 నుంచి మాత్రం ఈ ఆనవాయితీ ఒక్కసారి కూడా మారకుండా వస్తోంది. 1952 నుంచి 1983 వరకు తండ్రీ కూతురే ఏడుసార్లు ఎన్నికవుతూ వచ్చారు. ఆ సమయంలో మాత్రం కొన్ని సందర్భాల్లో మార్పులు జరిగాయి. తర్వాత నుంచి గెలిచిన పార్టీనే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తూ వస్తోంది. 1983లో తెలుగుదేశం తరపున పోటీచేసిన అన్నాబత్తుని సత్యనారాయణ గెలుపొందారు. ఆయనే 1985 మధ్యంతర ఎన్నికల్లోనూ గెలిచారు. ఈయన గెలిచిన రెండు పర్యాయాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటం, ఒకసారి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఆయ నకు ముం దు హ్యా ట్రిక్‌ విజయం సాధించిన దొడ్డపనేని ఇందిరను రెండు పర్యాయాలు ఓడించారు. ఇందిర తండ్రి ఆలపాటి వెంకట్రామయ్య నియోజకవర్గం ఏర్పాటయిన తొలి శాసనసభ్యుడు. ఆయన నాలుగుసార్లు గెలిచి రికార్డు సాధించారు. నియోజవర్గం 1955లో ఏర్పడితే, అంతకుముందున్న మద్రాసు ప్రభుత్వంలోనూ తెనాలి ఎమ్మెల్యేగా వెంకట్రామయ్య గెలిచారు. ఆయన కుమార్తె కూడా 5 సార్లు పోటీ చేసినా గెలుపు మాత్రం హ్యాట్రిక్‌తోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్‌, ఇందిర కాంగ్రెస్‌ తరపున ఇద్దరూ పోటీచేస్తూ వచ్చారు. వారు గెలిచిన సందర్భాల్లో అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
 
 
1983 తర్వాత మాత్రం ‘తెనాలి’ తీర్పునే రాష్ట్ర ప్రజలు గౌరవిస్తూ వచ్చారు. తెనాలిలో గెలిచిన పార్టీకే అధిక సీట్లు దక్కేలా తీర్పునిచ్చారు. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నాదెండ్ల భాస్కరరావు గెలిచారు. అప్పుడూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 1994లో రావి రవీంద్రనాథ్‌ తెలుగుదేశం తరపున పోటీచేసి నాదెండ్ల భాస్కరరావును ఓడించారు. అప్పుడూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1999లో గోగినేని ఉమ తెలుగుదేశం అభ్యర్ధిగా గెలిచారు. అదికూడా రాజకీయ కురువృద్ధుడు, ఆర్థిక రంగంలో అపర చాణుక్యుడిగా పేరున్న కొణిజేటి రోశయ్యను ఓడించారు.
 
మరో విశేషమేమంటే... ఈమె నాలుగు సార్లు గెలిచిన ఆలపాటి వెంకట్రామయ్య మనుమరాలు, మూడుసార్లు గెలిచిన దొడ్డపనేని ఇందిర కుమార్తె కావటం విశేషం! అంటే ఈ కుటుంబంలోని వ్యక్తులే 14 సార్లు జరిగిన ఎన్నికల్లో ఎనిమిది సార్లు విజయం సాధించారు. మిగిలిన ఆరుసార్లు ఇతర వ్యక్తులు గెలిచారు. ఉమ గెలిచిన సమయంలోనూ తెలుగుదేశమే రాష్ట్ర అధికారపీఠం ఎక్కింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున నాదెండ్ల భాస్కరరావు కుమారుడు మనోహర్‌ గెలుపొందారు. 2009 ఎన్నికల్లోనూ రెండోసారి ఆయనే గెలిచారు. వైఎస్‌ ప్రభుత్వంలో ఉప సభాపతిగా, తర్వాత శాసన సభాపతిగా పదవి దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గెలిచారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది.
 
 
ఈ ఆనవాయితీ కొనసాగేనా!
అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ రానున్న ఎన్నికల్లో కొనసాగుతుందా, లేక మారుతుందా అనేది సందిగ్ధత రేకెత్తిస్తున్న ప్రశ్న. అయితే ఈసారి ఎన్నికల్లో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ సందేహం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయింది. తెలుగుదేశం, వైసీపీతోపాటు కొద్దిగా పుంజుకున్న కాంగ్రెస్‌, కొత్తగా జనసేన పార్టీ పోటీలో నిలవనుండటం, తెలుగుదేశం మిత్రపక్షంగా గత ఎన్నికల్లో ఉన్న బీజేపీ కూడా ఈసారి పోటీలో నిలబడతామని ప్రకటించిన నేపథ్యంలో పోటీ రసవత్తర అంశమయింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
పదేళ్లుగా పసుపు జెండా ఎగరని చోట మంత్రి లోకేష్...
09-08-2018 10:47:44
 
636694084634183878.jpg
  • లోకేశ్‌ ఆపరేషన్‌ మాచర్ల?
  • పర్యటన విజయవంతంతో కార్యకర్తల్లో జోష్‌
  • నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రయత్నాలు
(మాచర్ల) (గుంటూరు జిల్లా)
పదేళ్లుగా పసుపు జెండా ఎగరని మాచర్ల నియోజకవర్గంపై టీడీపీ అధిష్ఠానం దృష్టి సారించినట్లు సమాచారం. మరికొన్ని నెల ల్లో ఎన్నికలు రానున్న క్రమంలో ఇక నుంచి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్‌ కనుసన్నల్లోనే ఇక్కడి రాజకీయాలు నడవనున్నట్లు పార్టీ పరిశీలకులు భావిస్తున్నారు. మూడు ఎన్నికల్లో పరాజయంతో వచ్చే ఎన్నికల్లో విజయానికి మంత్రి లోకేశ్‌ నేతృత్వంలో ఆపరేషన్‌ మాచర్ల ప్రారంభమైనట్లు నేతలు భావిస్తున్నారు. మంగళ వారం లోకేశ్‌ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మాచర్లకు వచ్చిన విషయం విదితమే. నియోజకవర్గంలో ఆయనకు బ్రహ్మరథం పట్టడంతో పార్టీ కేడర్‌కి కొత్త ఊపు వచ్చింది. లోకేశ్‌ పర్యటన విజయవంతమైన దరిమిలా ఈ నియోజకవర్గాన్ని చేజిక్కించు కోవడం తేలికనే భావన నాయకుల్లో ఏర్పడింది.
 
 
వరాల వెనుక అంతరార్థమిదేనా..
మాచర్ల నియోజకవర్గంలో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తన పర్యటనలో భాగంగా లోకేశ్‌ మాచర్లకు వరాల జల్లు కురిపించారన్న వాదన వినిపిస్తోంది. 2004 నుంచి కాంగ్రెస్‌ పదేళ్లు అధికారంలో ఉన్నా ఒరిగిందేమీ లేదు. ఆ పార్టీ నుంచి గెలిచిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి వెంట వెళ్లడంతో అభివృద్ధి కుంటుపడింది. తాగునీటి కోసం సతమతమయ్యే పల్లెలు, పూర్తి కాని ఎత్తిపోతల పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తే ఆటోమేటిక్‌గా జనాధరణ వస్తుందని భావించే మంత్రి లోకేశ్‌ రూ.215 కోట్లు మంజూరు చేసినట్లు భావిస్తున్నారు.
 
ఒకసారి చంద్రబాబు, మరోసారి వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసినా అడుగు ముందుకు పడని వరికపూడిశెల ఎత్తిపోతలపై కూడా లోకేశ్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. అభివృద్ధి చేసి చూపితే గెలుపు ఖాయమనే దిశగా లోకేశ్‌ అడు గులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నియోజక వర్గంలోని టీడీపీలో నెలకొన్న వర్గపోరు పార్టీకి చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. మంత్రి ప్రత్తి పాటి పుల్లారావు, గురజాల ఎమ్మెల్యే యరపతి నేని శ్రీనివాసరావులు కూడా వీటి నివారణకు ఎంతో ప్రయత్నాలు చేశారు. పొరుగు నియోజకవర్గమే కావడంతో యరపతినేనికి మాచర్లలో కూడా పట్టు ఉంది. అందువల్లే రోడ్డెక్కి బాహాబాహీకి దిగిన పరిస్థితులను కూడా ఆయన చక్కదిద్దారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంపై మరింత పట్టు సాధించేలా లోకేశ్‌ ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
వైసీపీలో హాట్ టాపిక్‌గా మారిన ఈ మహిళా నేత ఎవరో తెలిస్తే...
25-08-2018 13:55:40
 
636708021436010117.jpg
రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు జిల్లాకు ఓ ప్రత్యేక స్థానముంది. ఈ జిల్లా నుంచి ఎన్నికైన ముఖ్య నేతలు ముఖ్యమంత్రులుగా సేవలందించిన చరిత్ర కూడా ఉంది. ఇప్పటి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు కూడా గుంటూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎందరో రాజకీయ ఉద్ధండులున్న ఈ జిల్లా రాజకీయాల్లోకి ఓ ఎన్నారై మహిళ సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు జిల్లాలో ఆమె పొలిటికల్ ఎంట్రీనే హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పేరు విడదల రజనీకుమారి. వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా పలు రకాల సేవలందిస్తూ చిలకలూరిపేట ప్రజలకు ఇటీవల సుపరిచితురాలయ్యారు.
 
 
చంద్రబాబు అంటే అభిమానమంటూ ప్రత్తిపాటి పుల్లారావును కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆసీనులైన ఓ సభలో ఉత్సాహంగా ప్రసంగించి ఆయన దృష్టిలో పడ్డారు. ఆ సమయంలోనే మంత్రి ప్రత్తిపాటి ఆమెను సీఎంకు పరిచయం చేశారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆమెకే ఆలోచన వచ్చిందో లేక ఎవరైనా సలహా ఇచ్చారో గానీ వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట టీడీపీ టికెట్‌ను ఆమె ఆశించారు. ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అయ్యే ఖర్చంతా భరిస్తానని చెప్పినా పార్టీ అధిష్ఠానం విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రత్తిపాటిని కాదని టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని పార్టీ అధిష్ఠానం తేల్చి చెప్పినట్లు సమాచారం. పైగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కూడా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె ప్రత్తిపాటిని ఓడిస్తానంటూ శపథం చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ఎపిసోడ్ ముగిసిన కొన్నాళ్లకు ఆమె వైసీపీని సంప్రదించారు. ప్రతిపక్షంలోనైనా సీటు దక్కుతుందని భావించిన ఆమెకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. మర్రి రాజశేఖర్‌ను పక్కన పెట్టి పార్టీ టికెట్ రజనీకి ఎలా ఇవ్వగలమని జగన్ స్థానిక నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
 
 
అయితే ఏం రాజకీయం జరిగిందో తెలియదు గానీ ఆమె అనూహ్యంగా వైసీపీలోనే చేరారు. ఆగస్ట్ 24న ఆమె.. విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆమెకు టికెట్‌పై జగన్ హామీ ఇచ్చారని కొందరంటుంటే.. మరికొందరు మాత్రం ప్రత్తిపాటిపై పంతంతోనే విడదల రజనీకుమారి జగన్ పార్టీలో చేరారని అంటున్నారు. ఇదిలా ఉంటే.. చిలకలూరిపేటలో మరో వాదన కూడా తెరపైకొచ్చింది. మర్రి రాజశేఖర్ కొంత కాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారని.. ఈసారి పోటీచేసే పరిస్థితి లేదని.. మర్రి రాజశేఖర్ భార్యకు టికెట్ కేటాయించాలని స్థానిక వైసీపీ నేతల నుంచి అధిష్ఠానానికి వినతులందినట్టు సమాచారం. ఈ విషయంపై అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పష్టత రాకముందే విడదల రజనీ పార్టీలో చేరడంతో ఆమెకు టికెట్‌పై హామీ ఇచ్చి ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది. మొత్తం మీద ఈ ఎన్నారై మహిళా నేత చేరికతో చిలకలూరిపేట వైసీపీ టికెట్ ఎవరికి కేటాయిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
Link to comment
Share on other sites

జగన్ ఈమెను పార్టీలో చేర్చుకుని 5రోజులు కూడా కాకముందే..
27-08-2018 11:23:48
 
636709658286208332.jpg
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా టీడీపీలో చేరి.. ప్రసంగాలతో పార్టీ అధినేత దృష్టిని ఆకర్షించి.. టికెట్ ఆశించి.. భంగపడి.. చివరికి వైసీపీలో చేరి ప్రత్తిపాటిని ఓడిస్తానని శపథం చేసిన ఓ ఎన్నారై మహిళా నేత వ్యవహారం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విడదల రజనీకుమారికి చిలకలూరిపేట టికెట్ దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీకి భారీగా ఫండ్ ఇవ్వడానికి ఆమె ముందుకు రావడంతో టికెట్ ఆమెకే ఖరారు చేసినట్లు సమాచారం. పైగా ఎన్నికల్లో అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని రజనీకుమారి పూర్తి హామీ ఇచ్చారట. దీంతో మర్రి రాజశేఖర్‌తో పోల్చుకుంటే రజనీనే పార్టీ అభ్యర్థిగా సమర్థురాలనే భావన వైసీపీ అధినేత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆమెను నియోజకవర్గ సింగిల్ కో ఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఊహించని ఈ పరిణామంతో మర్రి రాజశేఖర్ వర్గం షాక్‌కు గురైంది. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న తమ నేతను కాదని నిన్న కాక మొన్న పార్టీలో చేరిన వారిని సమన్వయ కర్తగా నియమిస్తారా అంటూ మర్రి రాజశేఖర్ వర్గం అధిష్ఠానం తీరుపై మండిపడింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌ను పక్కన పెట్టి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా విడదల రజనీని జగన్ నియమించడంతో ఆయన వర్గంలో అసంతృప్తి భగ్గుమంది. మర్రి రాజశేఖర్ నివాసానికి వందలాదిగా తరలివచ్చిన నియోజకవర్గ, మండల స్థాయి నేతలు జగన్‌ను బహిరంగంగా విమర్శించారు. చిలకలూరిపేట మండల వైసీపీ అధ్యక్షులు చాపలమడుగు గోవర్ధన్‌ మాట్లాడుతూ మాట తప్పను. మడం తిప్పను అన్న అర్థాన్ని జగన్‌మోహనరెడ్డి కూనీ చేశారని విమర్శించారు. నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్తగా పార్టీలో చేరినవారిని నియమించారంటే జగన్‌ మాట తప్పుతాడు, మడమ తిప్పుతాడని అర్థమవుతుందన్నారు. సుమారు వివిధ పదవుల్లోని 404 మంది వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. మర్రి రాజశేఖర్ వెంటే మేమంతా ఉంటామని ప్రకటించారు.
 
 
వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుబాని మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీకి జిల్లాలో వెన్నుదన్నుగా నిలిచిన రాజశేఖర్‌ను జగన్‌ విస్మరించడం మంచిది కాదని తెలిపారు. పార్టీ ఫండ్‌ ఇస్తే ఎవరికైనా పదవులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇది రాజశేఖర్‌ ఒక్కడికి జరిగిన అన్యాయం కాదని నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ అన్యాయంగా తాము భావిస్తున్నామని వివరించారు. మనస్తాపంతో రాజీనామా చేస్తున్నామన్నారు. రాజశేఖర్‌ను కాదని డబ్బున్న వ్యక్తిని సమన్వయకర్తగా నియమించడం సిగ్గుచేటని తెలిపారు. చిలకలూరిపేట మండలంలోని వైసీపీ పదవులలో ఉన్న వారందరూ రాజీనామాలు చేశారని చెప్పారు. ప్రజాక్షేత్రంలో రాజశేఖర్‌ను గెలిపించుకునేందుకు ఎంతవరకైనా పోరాడతానని పేర్కొన్నారు. అయితే రజనీకుమారి మాత్రం మర్రి రాజశేఖర్‌తో కలసి పనిచేస్తానని ప్రకటించడం కొసమెరుపు.
 
 
ఆదివారం స్థానిక తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను పార్టీలో చేరబోయే ముందు మర్రి రాజశేఖర్‌ను కలసి ఆశీస్సులు తీసుకున్నానని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో తాను పార్టీలో చేరేందుకు విశాఖపట్నం రావాలని కోరినట్టు చెప్పారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం కుటుంబ సభ్యులతో తిరుపతి వెళ్లి వస్తానని రాజశేఖర్‌ చెప్పడంతో తాను తన అనుచరులతో విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రలో పార్టీలో చేరినట్లు వివరించారు. వైఎస్‌ జగన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. ప్రస్తుతం పార్టీలో వివిధ హోదాలలో కొనసాగుతున్న నాయకులు ఆయా హోదాల్లోనే ఇకపై కూడా కొనసాగాలని కోరారు. తన నాయకత్వంలో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యవర్గం, నాయకులు, కార్యకర్తలు అందరినీ స్వయంగా కలసి జగనన్న బాటలో నడుస్తామన్నారు. అన్న జగన్‌ని ముఖ్యమంత్రిగా చూడవలసిన బాధ్యత పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై ఉందని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఝలక్ ఇచ్చిన జగన్.. విధి లేని పరిస్థితుల్లో...
18-09-2018 11:27:43
 
636728668606902168.jpg
  • ముందస్తు సీట్ల హామీలు తారు మారు
  • గుంటూరు సీటుకు కొత్త ముఖం....
  • కిలారి రోశయ్యకు ఆఫర్‌.....
  • శ్రీకృష్ణదేవరాయలుకు ఝలక్‌...
  • నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగాలని ఆదేశం
(ఆంధ్రజ్యోతి - గుంటూరు)
ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో వైసీపీలో ఒక వైపు ఎమ్మెల్యే సీట్ల రగడ కొనసాగుతుండగా మరో వైపు ఎంపీ సీట్ల విషయంలో కూడా రచ్చ రేగుతోంది. ఏ నిమిషాన ఎవరి సీటుకు ముప్పు ఏర్పడుతుందో తెలియని పరిస్థితి. గుంటూరు లోక్‌సభ స్థానం వైసీపీ అభ్యర్థిగా విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు పేరును నాలుగేళ్ళ క్రితమే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ లోక్‌సభ స్థానం కోఆర్డినే టర్‌గా వ్యవహరిస్తూ కృష్ణదేవరాయలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో తండ్రి రత్తయ్యతో పాటు ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనప్పటికీ, ఆ తరువాత పార్టీ పరాజయం పాలైనప్పటికీ వైసీపీలోనే కొనసాగుతూ పార్టీ కోసం తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు.
 
 
సామాజిక సమీకరణాలే కారణం?
ఆ నేపథ్యంలోనే నాలుగేళ్ళ క్రితం శ్రీకృష్ణదేవరాయలును తమ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా పార్టీ అధినేత జగన్‌ అంతర్గతంగా హామీ ఇచ్చి అప్పటి నుంచి పనిచేయించుకుంటూ వచ్చారు. హఠాత్తుగా జగన్‌ మదిలో కొత్త ఆలోచన మెదిలింది. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి కాపు సామాజిక వర్గం అభ్యర్ధిని బరిలోకి దించాలని భావించి మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, చిల్లీస్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిలారి రోశయ్య పేరును తెరపైకి తెచ్చారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోశయ్య తదనంతరం వైసీపీలో చేరారు. తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న రోశయ్యకు జగన్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. భారీ మొత్తాన్ని భరించగలిగితే ఎంపీ సీటు ఇస్తానంటూ ఆఫర్‌ ఇవ్వగా ఆయన వెంటనే అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. రోశయ్య పోటీకి సిద్ధం అనగానే కృష్ణ దేవరాయులును పిలిచి సామాజిక సమీకరణల నేపథ్యంలో నీ సీటు రోశయ్యకు ఇస్తున్నట్లు చెప్పి, నువ్వు నరసరావుపేట నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. అయితే ఇప్పటికే గుంటూరు అభ్యర్ధిగా ప్రచారం చేసుకొని బూత్‌స్థాయి వరకు కార్యకర్తలతో మమేకమైన శ్రీకృష్ణదేవరాయలు ఈ హఠాత్‌ పరిణామంతో దిగ్ర్భాంతికి గురయ్యారు.
 
ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే ఉన్న సమయంలో కొత్త ప్రాంతానికి వెళ్ళి అదీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయటం కష్టతరమని భావిస్తూ కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఒప్పకున్నట్లు తెలిసింది. ఈ పరిణామం ఆ పార్టీలో కలకలం రేకెత్తించింది. ఒక వైపు చిలకలూరిపేట సీటు విషయం ఆ పార్టీలో తీవ్ర స్థాయిలో రగడ రేకెత్తించిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన మరుక్షణమే ఒక మహిళకు సీటు ఇస్తున్నట్లు ప్రకటించి, అప్పటి వరకు పార్టీని నమ్ముకొని కొమ్ముకాసిన నేతకు ఝలక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంకా ఆ నియోజకవర్గంలో చిచ్చు ఆరక మునుపే గుంటూరు ఎంపీ అభ్యర్థి విషయంలో పార్టీ అధినేత తాజాగా రెండురోజులు క్రితం తీసుకొన్న నిర్ణయం సిట్టింగ్‌లకు, ఇన్‌చార్జీలకు మింగుడు పడని విధంగా మారింది.
 
 
ఎన్నికల నాటికి ఎవరు ఎక్కడో...!
నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరుపున ఇప్పటి వరకు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డిని బరిలోకి దించాలని పార్టీ అధినేత భావించారు. గత ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తాను వైసీపీ తరపున పోటీ చేసే పరిస్థితే లేదని అయోధ్య రామిరెడ్డి ఇటీవలే తేల్చి చెప్పడంతో ప్రత్యామ్నాయంపై ఆలోచన చేశారు. ఒక దశలో అయోధ్య రామిరెడ్డి సోదరుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ కృష్ణారెడ్డిని పోటీ చేయాల్సిందిగా కోరారు. తనకు అంతగా ఆర్థిక స్థోమత లేదని తెలిపిన ఆర్కే... అవకాశమిస్తే తాను మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. విశేషమేమిటంటే 2014 ఎన్నికల్లో విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యకు టీడీపీ తరపున నరసరావుపేట నుంచి పోటీ చేసే అవకాశం ఒక దశలో వచ్చింది. తేల్చి చెప్పడంలో జాప్యం జరగటంతో ఈ లోగా కాంగ్రెస్‌ పార్టీలో నుంచి టీడీపీలో చేరిన రాయపాటి సాంబశివరావుకు నరసరావుపేట టిక్కెట్‌ ఖరారైంది. రాయపాటి పేరు ఖరారైన తరువాత రత్తయ్య తాను పోటీకి సిద్ధమేనని చెప్పినప్పటికీ టిక్కెట్‌ ఇవ్వలేని పరిస్థితి అప్పట్లో నెలకొంది. దాంతో ఆయన ఎన్నికలకు ముందే కుమారుడితో పాటు వైసీపీలో చేరారు. ఇప్పుడు కృష్ణదేవరాయలుకు కూడా నరసరావుపేట నుంచి అనుకోకుండా పోటీ చేసే అవకాశం జగన్‌ కల్పించారు. ఎన్నికల నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకొని ఎక్కడ అభ్యర్థిగా ఎవరు నిలబడతారనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి వైసీపీలో నెలకొంది.
 
 
బాపట్ల... తేల్చట్లా...
మరో వైపు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజక వర్గంగా ఉన్న బాపట్లలో కూడా ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరనేది తేలని విధంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ వరికూటి అమృతపాణి పరాజయం పాలైన తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. బాపట్ల అభ్యర్థిగా నందిగామ సురేష్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పేరు కొద్దికాలం వినిపించింది. ఆయనకు ఆర్థికంగా అంత బలం లేకపోవటంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు.
Link to comment
Share on other sites

17 hours ago, sonykongara said:
ఝలక్ ఇచ్చిన జగన్.. విధి లేని పరిస్థితుల్లో...
18-09-2018 11:27:43
 
636728668606902168.jpg
  • ముందస్తు సీట్ల హామీలు తారు మారు
  • గుంటూరు సీటుకు కొత్త ముఖం....
  • కిలారి రోశయ్యకు ఆఫర్‌.....
  • శ్రీకృష్ణదేవరాయలుకు ఝలక్‌...
  • నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగాలని ఆదేశం
(ఆంధ్రజ్యోతి - గుంటూరు)
ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో వైసీపీలో ఒక వైపు ఎమ్మెల్యే సీట్ల రగడ కొనసాగుతుండగా మరో వైపు ఎంపీ సీట్ల విషయంలో కూడా రచ్చ రేగుతోంది. ఏ నిమిషాన ఎవరి సీటుకు ముప్పు ఏర్పడుతుందో తెలియని పరిస్థితి. గుంటూరు లోక్‌సభ స్థానం వైసీపీ అభ్యర్థిగా విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు పేరును నాలుగేళ్ళ క్రితమే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ లోక్‌సభ స్థానం కోఆర్డినే టర్‌గా వ్యవహరిస్తూ కృష్ణదేవరాయలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో తండ్రి రత్తయ్యతో పాటు ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనప్పటికీ, ఆ తరువాత పార్టీ పరాజయం పాలైనప్పటికీ వైసీపీలోనే కొనసాగుతూ పార్టీ కోసం తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు.
 
 
సామాజిక సమీకరణాలే కారణం?
ఆ నేపథ్యంలోనే నాలుగేళ్ళ క్రితం శ్రీకృష్ణదేవరాయలును తమ పార్టీ గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా పార్టీ అధినేత జగన్‌ అంతర్గతంగా హామీ ఇచ్చి అప్పటి నుంచి పనిచేయించుకుంటూ వచ్చారు. హఠాత్తుగా జగన్‌ మదిలో కొత్త ఆలోచన మెదిలింది. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి కాపు సామాజిక వర్గం అభ్యర్ధిని బరిలోకి దించాలని భావించి మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, చిల్లీస్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిలారి రోశయ్య పేరును తెరపైకి తెచ్చారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోశయ్య తదనంతరం వైసీపీలో చేరారు. తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న రోశయ్యకు జగన్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. భారీ మొత్తాన్ని భరించగలిగితే ఎంపీ సీటు ఇస్తానంటూ ఆఫర్‌ ఇవ్వగా ఆయన వెంటనే అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. రోశయ్య పోటీకి సిద్ధం అనగానే కృష్ణ దేవరాయులును పిలిచి సామాజిక సమీకరణల నేపథ్యంలో నీ సీటు రోశయ్యకు ఇస్తున్నట్లు చెప్పి, నువ్వు నరసరావుపేట నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. అయితే ఇప్పటికే గుంటూరు అభ్యర్ధిగా ప్రచారం చేసుకొని బూత్‌స్థాయి వరకు కార్యకర్తలతో మమేకమైన శ్రీకృష్ణదేవరాయలు ఈ హఠాత్‌ పరిణామంతో దిగ్ర్భాంతికి గురయ్యారు.
 
ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే ఉన్న సమయంలో కొత్త ప్రాంతానికి వెళ్ళి అదీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయటం కష్టతరమని భావిస్తూ కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఒప్పకున్నట్లు తెలిసింది. ఈ పరిణామం ఆ పార్టీలో కలకలం రేకెత్తించింది. ఒక వైపు చిలకలూరిపేట సీటు విషయం ఆ పార్టీలో తీవ్ర స్థాయిలో రగడ రేకెత్తించిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన మరుక్షణమే ఒక మహిళకు సీటు ఇస్తున్నట్లు ప్రకటించి, అప్పటి వరకు పార్టీని నమ్ముకొని కొమ్ముకాసిన నేతకు ఝలక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంకా ఆ నియోజకవర్గంలో చిచ్చు ఆరక మునుపే గుంటూరు ఎంపీ అభ్యర్థి విషయంలో పార్టీ అధినేత తాజాగా రెండురోజులు క్రితం తీసుకొన్న నిర్ణయం సిట్టింగ్‌లకు, ఇన్‌చార్జీలకు మింగుడు పడని విధంగా మారింది.
 
 
ఎన్నికల నాటికి ఎవరు ఎక్కడో...!
నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరుపున ఇప్పటి వరకు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డిని బరిలోకి దించాలని పార్టీ అధినేత భావించారు. గత ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తాను వైసీపీ తరపున పోటీ చేసే పరిస్థితే లేదని అయోధ్య రామిరెడ్డి ఇటీవలే తేల్చి చెప్పడంతో ప్రత్యామ్నాయంపై ఆలోచన చేశారు. ఒక దశలో అయోధ్య రామిరెడ్డి సోదరుడు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ కృష్ణారెడ్డిని పోటీ చేయాల్సిందిగా కోరారు. తనకు అంతగా ఆర్థిక స్థోమత లేదని తెలిపిన ఆర్కే... అవకాశమిస్తే తాను మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. విశేషమేమిటంటే 2014 ఎన్నికల్లో విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యకు టీడీపీ తరపున నరసరావుపేట నుంచి పోటీ చేసే అవకాశం ఒక దశలో వచ్చింది. తేల్చి చెప్పడంలో జాప్యం జరగటంతో ఈ లోగా కాంగ్రెస్‌ పార్టీలో నుంచి టీడీపీలో చేరిన రాయపాటి సాంబశివరావుకు నరసరావుపేట టిక్కెట్‌ ఖరారైంది. రాయపాటి పేరు ఖరారైన తరువాత రత్తయ్య తాను పోటీకి సిద్ధమేనని చెప్పినప్పటికీ టిక్కెట్‌ ఇవ్వలేని పరిస్థితి అప్పట్లో నెలకొంది. దాంతో ఆయన ఎన్నికలకు ముందే కుమారుడితో పాటు వైసీపీలో చేరారు. ఇప్పుడు కృష్ణదేవరాయలుకు కూడా నరసరావుపేట నుంచి అనుకోకుండా పోటీ చేసే అవకాశం జగన్‌ కల్పించారు. ఎన్నికల నాటికి ఏ పరిణామాలు చోటు చేసుకొని ఎక్కడ అభ్యర్థిగా ఎవరు నిలబడతారనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి వైసీపీలో నెలకొంది.
 
 
బాపట్ల... తేల్చట్లా...
మరో వైపు ఎస్సీ రిజర్వుడ్‌ నియోజక వర్గంగా ఉన్న బాపట్లలో కూడా ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరనేది తేలని విధంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ వరికూటి అమృతపాణి పరాజయం పాలైన తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. బాపట్ల అభ్యర్థిగా నందిగామ సురేష్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పేరు కొద్దికాలం వినిపించింది. ఆయనకు ఆర్థికంగా అంత బలం లేకపోవటంతో కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు.

ornii maa lavu rathaih sir ki bokka pettadu ga jagan 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...