Jump to content

kurnool politics


Recommended Posts

  • Replies 123
  • Created
  • Last Reply
బళ్లారి ఫలితాలు కర్నూలు జిల్లా వైసీపీ నేతలపై ప్రభావం..?
19-05-2018 11:06:32
 
636623247933816603.jpg
కర్ణాటక ఎన్నికల వల్ల కష్టాల్లో పడ్డ కర్నూలు జిల్లా నేతలు ఎవరు? మైనింగ్ డాన్‌ గాలి జనార్దన్‌రెడ్డి సన్నిహిత అభ్యర్ధులకు వ్యతిరేకంగా జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే ప్రచారం చేశారా? బళ్లారి ఫలితాలు కర్నూలు జిల్లా వైసీపీ నేతల టిక్కెట్ల కేటాయింపుపై ఏ మేరకు ప్రభావం చూపనుంది? ఆసక్తికర కథనం మీకోసం!
 
 
      కర్ణాటక ఎన్నికల్లో కర్నూలు, బళ్లారి నేతలు అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. బళ్లారి జిల్లాలో బీజేపీ గెలుపునకు గాలి జానార్దన్‌రెడ్డి చక్రంతిప్పిన సంగతి తెలిసిందే! అయితే ఆయన బలపరిచిన అభ్యర్ధులకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ప్రచారం నిర్వహించారు. జయరామ్ బంధువులు కాంగ్రెస్‌పార్టీ తరపున అక్కడ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో గాలి జానార్దన్‌రెడ్డి అభ్యర్ధులను ఓడించేందుకు జయరామ్ వేసిన స్కెచ్‌లు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయట. ఈ తరుణంలో గాలి నేరుగా రంగంలోకి దిగడంతో ఇద్దరి మధ్య ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగిందట.
 
 
        వాస్తవానికి గాలి జనార్దన్‌రెడ్డి, గుమ్మనూరు జయరామ్ చాలా కాలంగా సన్నిహితులు. 2014 ఎన్నికల్లో జయరామ్‌కు ఆలూరు వైసీపీ టిక్కెట్ రావడంలో గాలి జానార్దన్‌రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జయరామ్ రాజకీయ ఎదుగుదల వెనుక గాలి జనార్దన్‌రెడ్డి పాత్ర అత్యంత ప్రధానమైనది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌కి టీడీపీలోకి వెళ్లడానికి ఆఫర్ వచ్చిందట. విషయం తెలియగానే గాలి జనార్దన్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారట. దీంతో ఎమ్మెల్యే జయరామ్ టీడీపీలోకి వెళ్లే ప్రయత్నానికి బ్రేక్ పడిందట. ఇదీ వారి మధ్య ఉన్న రాజకీయ అనుబంధానికి ఒక నిదర్శనం!
 
 
          ఇదిలా ఉంటే, ప్రస్తుత కర్ణాటక ఎన్నికలు గాలి జనార్దన్‌రెడ్డి, జయరామ్‌ మధ్య చిచ్చుపెట్టాయట. దీనికి బలమైన కారణమే ఉందట. ఎమ్మెల్యే జయరామ్ తమ్ముడైన నాగేంద్ర బళ్లారి రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. శ్రీరాములు మామ అయిన పక్కిరప్పపై మూడు వేల ఓట్ల మెజారిటీతో నాగేంద్ర గెలుపొందారు. మరోవైపు ఎమ్మెల్యే జయరామ్ అల్లుడైన మురళీకృష్ణ సిరిగుప్ప అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేశారు. అక్కడ బీజేపీ అభ్యర్ధి సోమలింగప్ప చేతిలో ఆయన ఓటమి చవిచూశాడు. అయితే, ఎన్నికల ప్రచార సమయంలో.. సిరుగుప్ప కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల్ని చేపట్టిన ఎమ్మెల్యే జయరామ్ బళ్లారి రూరల్, సిరుగుప్ప అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా గట్టి ప్రచారాన్నే నిర్వహించారు. దీంతో గాలి జనార్దన్‌రెడ్డి బలపరిచిన బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యే జయరామ్‌పై మండిపడ్డారట.
 
 
        ఎమ్మెల్యే జయరామ్ దూకుడు గాలి జనార్దన్‌రెడ్డికి ఏమాత్రం మింగుడుపడలేదట. బళ్లారి జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో రహస్య సమావేశం ఏర్పాటుచేసి జయరామ్‌పై గాలి ఫైర్ అయ్యారట. "జయరామ్‌కు రాజకీయబిక్ష పెడితే చివరకి నేను బలపరిచిన అభ్యర్ధులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. 2019 ఎన్నికల్లో ఆలూరు వైసీపీ టిక్కెట్ ఎలా తెచ్చుకుంటాడో చూద్దాం'' అంటూ గాలి తన అనుచరుల ఎదుట వ్యాఖ్యానించినట్టు సమాచారం. ముఖ్యంగా బళ్లారి రూరల్ స్థానంలో గాలి జనార్దన్‌రెడ్డి మామ పక్కిరప్ప ఓటమిని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. మరోవైపు బళ్లారి అర్బన్‌లో కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి అనిల్‌లాడ్ తరపున ప్రచారంచేశారు. అయితే అనిల్‌లాడ్‌పై గాలి జనార్దన్‌రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి గెలిచాడు. దీంతో కోట్ల మార్క్ బళ్లారిలో ఏమాత్రం పనిచేయలేదన్న భావం వారిలో ఏర్పడింది.
 
 
      తాజా పరిణామాల్లో మరికొన్ని వార్తలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. తనకు అడుగడుగునా చుక్కలు చూపించిన ఎమ్మెల్యే గుమ్మనూర్ జయరామ్, అతని తమ్ముడైన నాగేంద్రను బీజేపీ వైపునకు తిప్పేందుకు గాలి జనార్దన్‌రెడ్డి పావులు కదుపుతున్నట్లు వినికిడి. మొత్తానికి కర్నాటకలో చోటుచేసుకున్న పరిణామాలు గాలి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే జయరామ్ మధ్య స్నేహబంధాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి మరి!
Link to comment
Share on other sites

  • 1 month later...
వదులుకునేందుకైనా సిద్ధం... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
24-06-2018 11:15:34
 
636654357321416079.jpg
  • మనం గెలవాలి
  • ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు
  • విభేదాలు వీడి కలిసి పనిచేయండి
  • వ్యక్తుల కన్నా పార్టీనే ముఖ్యం
  • ఒకరిద్దరిని వదులుకునేందుకైనా సిద్ధం
  • కార్యకర్తలను విస్మరిస్తే ఇబ్బందులు తప్పవు
  • కర్నూలు లోక్‌సభ నాయకులకు సీఎం హెచ్చరిక
  • కర్నూలు జిల్లా టీడీపీ నాయకులతో చంద్రబాబు భేటీ
కర్నూలు (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. మనం గెలవాలి. విభేదాలు వీడి కలిసికటుగా పనిచేయాలి. వ్యక్తుల కన్నా పార్టీ గొప్పదని గుర్తిచండి. పార్టీకి నష్టం చేకూరుస్తామంటే ఊరుకునేది లేదు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవకపోయినా అధికారం చెలాయిస్తున్నారు. ఎప్పుడూ ఇలాగే ఉండాలనుకుంటే కుదరదు. అవసరం అయితే ఒకరిద్దరిని వదులుకోవడానికైనా సిద్ధమే’ అని టీడీపీ కర్నూలు జిల్లా నాయకులను సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇకనైనా విభేదాలు వీడి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శనివారం అమరావతిలో జిల్లా టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమా వేశమయ్యారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు, మంత్రి అఖిలప్రియ, ఎంపీ బుట్టా రేణుక, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘14 నియోజకవర్గాల్లో నాయకులంతా సమష్టిగా ఉన్నారన్న సంకేతాలు ప్రజలకు ఇవ్వలేక పోతున్నారు. ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్‌ ఇవ్వాలి. చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్పాలి. ఆ విషయంలో మీరు శ్రద్ధ పెట్టడం లేదు కానీ.. మీలోమీరు కొట్లాడుకుంటూ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు’ అని మండిపడినట్లు సమాచారం. తుంగభద్ర నదిపై లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలను తెలంగాణ చకచక చేసుకుంటోందని, మన ఇరిగేషన్‌ అధికారులు హైడ్రాలిక్‌ పర్టిక్యులర్‌ లేదంటూ ఇబ్బంది పెడుతున్నారని, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను ఏజెన్సీల ద్వారా కాకుండా కలెక్టర్‌ ద్వారా నియమకాలు చేపట్టాలని పలువురు నాయకులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.
 
 
కర్నూలు లోక్‌సభ నాయకులపై ఆగ్రహం
కర్నూలు లోక్‌సభ పరిధిలోని కర్నూలు, కోడుమూరు, ఎమ్మి గనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతో ముందుగా సమావేశమయ్యారు. ప్రధానంగా నాయకుల మధ్య నెలకొన్న విభేదాలపై చర్చించారు. ఓ స్థాయిలో తీవ్రంగా మండిపడ్డారు. ‘కొందరు నాయకులు ఎన్నికల్లో గెలవక పోయినా.. వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న దృక్పథంతో కూడా పనిచేయడంలేదు. ఇది మంచి పద్ధతి కాదు. విభేదాలు వీడి కలిసి పనిచేయండి. కార్యకర్తలను కాదని అభివృద్ధి పనులను ఇతర కాంట్రాక్టర్లకు ఇస్తే ఎన్నికల్లో వారు ఎలా పని చేస్తారు? గ్రామ కమిటీలను పూర్తిగా విస్మరిస్తున్నారు. వ్యక్తుల కన్నా పార్టీ గొప్పది. ఈ రోజు అధికారంలో ఉన్నారంటే పార్టీ గెలవడం వల్లే. అది విస్మరిస్తే నష్టపోతాం. రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మనమే గెలవాలి. మీలో మార్పు రాకపోతే అవసరమైతే ఒకరిద్దరిని వదులుకోవడానికైనా సిద్ధమే’ అని సీఎం హెచ్చరించారు. ప్రధానంగా కోడుమూరు, కర్నూలు, పాణ్యం, పత్తికొండ నియోజక వర్గాల్లో నాయకులు కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఏయే నియోజకవర్గాల్లో ఎవరు బరిలో ఉంటారో కూడా స్పష్టత ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో మాట్లాడారు. అడిగిన అభివృద్ధి పనులు మంజూరు చేస్తూనే లోపాలను సరిదిద్ధుకోవాలని సూచించారు.
 
 
మీ ముగ్గురు కలిసి పని చేయండి
‘కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌.. మీ ముగ్గురూ కర్నూలు లోక్‌సభ పరిధి పూర్తిగా తిరగండి’ అని సీఎం సూచించినట్లు తెలిసింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తే దిశగా కృషి చేయాలని సీఎం వారికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో నాయకుల మధ్య విభేదాలను తొలగించాలని, కొత్తగా విభేదాలు సృష్టించ వద్దని సూచించిన్నట్లు సమాచారం. ఎంపీ బుట్టా రేణుకకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పూర్తి స్థాయిలో సహకరించాలని సీఎం అన్నట్లు తెలిసింది.
 
 
నంద్యాల లోక్‌సభ అభ్యర్థి ఎవరు?
నంద్యాల లోక్‌సభ పరిధిలోని నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, నందికొట్కూరు, శ్రీశైలం, డోన్‌ నియోజకవర్గాల నాయకులతో సీఎం మాట్లాడారు. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ పరిధిలోని నాయకులు కలిసి పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసేందుకు తనకు పూర్తి అవకాశం ఇవ్వాలని సీనియర్‌ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి కోరినట్లు తెలిసింది. జిల్లాలో వైసీపీ నుంచి ప్రప్రథమంగా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో ఆయన కుటుంబానికి చెందిన వారిలో ఒకరికి నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని, గట్టి హామీ ఇస్తే ఇప్పటి నుంచే సన్నద్ధమవుతామని ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. సరైన న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారని సమాచారం. నందికొట్కూరు నాయకులతో సీఎం మాట్లాడినప్పుడు.. ఇన్‌చార్జి బాధ్యతల విషయంలో తమకు అన్యాయం జరుగిందని ఓ నాయకుడు గట్టిగానే అడిగినట్లు తెలిసింది.
 
 
ప్రధానంగా నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని బరిలో దింపితే గెలిచే అవకాశాలు ఉన్నాయో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డిని ఎంపీగా పోటీకి పెడితే ఎలా ఉంటుందని ఆ సెగ్మెంట్‌ పరిధిలోని ముఖ్య నాయకులతో చర్చించినట్లు తెలిసింది. మాండ్రకు టికెట్‌ ఇస్తే ఆయన సమీప బంధువు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందా..? అని కూడా ఆరా తీసినట్లు సమాచారం. పాణ్యం నియోజకవర్గంలో నాయకుల మధ్య విభేదాలపై సీఎం సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది. భేటీకి ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మణి గాంధీ, ఎస్వీ మోహన్‌రెడ్డి, భూమా బ్రహ్మనందరెడ్డి, వాల్మీకి ఫెడరేషన్‌ చైర్మన్‌ బీటీ నాయుడు, శాలివాహన ఫెడరేషన్‌ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, గొర్రెలు, మేకలు పెంపకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్‌, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, తిక్కారెడ్డి, వీరభద్రగౌడు, కేఈ ప్రతాప్‌, కేఈ శ్యామ్‌బాబు, మాండ్ర శివానందరెడ్డి, కర్నూలు ఎంపీపీ రాజవర్దన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బుట్టా.. టీజీ దారెటు?
10-07-2018 11:06:14
 
636668175736927477.jpg
  • కర్నూలు శాసనసభకు ఎస్వీ.. లోక్‌సభకు బుట్టా..
  • అభ్యర్థులను ప్రకటించిన నారా లోకేష్‌
  • ఎమ్మెల్యే ఎస్వీ వర్గం సంబరాలు
  • డీలాపడ్డ ఎంపీ టీజీ వర్గం
  • సమీకరణలు మారే అవకాశం
రాబోయే ఎన్నికల్లో మీకు రెండు ఓట్లు ఉంటాయి. ఒక ఓటు మోహన్‌రెడ్డికి.. మరో ఓటు బుట్టా రేణుకకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. మోహన్‌రెడ్డిని శాసనభకు, బుట్టా రేణుకను లోక్‌సభకు పంపే బాధ్యత మీదే. కర్నూలు ఉస్మానియా కళాశాలలో సోమవారం జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మంత్రి లోకేష్‌ ప్రకటన ఇది.
 
 
కర్నూలు (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్‌ ఊహించని విధంగా కర్నూలు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ను ప్రకటించారు. బి-ఫామ్‌ చేతికి వచ్చేంతవరకు ఆశావ హుల్లో ఉత్కంఠ కొనసాగడం ఆనవాయితీ. అయితే అనూహ్యంగా లోకేష్‌ చేసిన కీలక ప్రకటన టీడీపీతోపాటు అన్ని పార్టీల నాయకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కర్నూలు అసెంబ్లీ స్థానం టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీతో పాటు ఎంపీ టీజీ వెంకటేశ్‌ తనయుడు టీజీ భరత్‌ ఆశిస్తున్నారు. ఎవరికి వారు వర్గాలను బలోపేతం చేసుకుం టున్నారు. టికెట్‌ ఎస్వీకేనని ఆయన వర్గీయులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. సర్వే ఆధారంగా గెలిచే అభ్యర్థికే ముఖ్యమంత్రి చంద్రబాబు టికెట్‌ ఇస్తారని, టికెట్‌ టీజీ భరత్‌కే వస్తుందని ఎంపీ టీజీ వర్గీయులు చెబుతూ వస్తున్నారు. ఎవరికి వారే టికెట్‌పై నమ్మకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నగరానికి సోమవారం వచ్చిన యువనేతను ఆకట్టుకోవడానికి ఇరువర్గాలు బలప్రదర్శనకు దిగాయి. బైక్‌ ర్యాలీలు, గజమాలలతో హంగామా చేశాయి. మంత్రి లోకేష్‌ అభ్యర్థులను బహి రంగంగా ప్రకటించడంతో టీజీ వర్గం ఒక్కసారిగా డీలా పడింది. ఎస్వీ వర్గీయులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
 
 
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా టీజీ వెంకటేశ్‌, వైసీపీ అభ్యర్థిగా ఎస్వీ మోహన్‌ రెడ్డి బరిలో నిలిచారు. స్వల్ప ఆధిక్యతతో ఎస్వీ గెలుపొందారు. ఓటమి చెందిన టీజీ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ టీడీపీ కేవలం ఎమ్మిగనూరు, పత్తికొండ, బనగానపల్లె నియోజక వర్గాల్లో మాత్రమే గెలిచింది. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు 2014 నుంచే వ్యూహాల అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 2016లో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. మొదట్లో ఎస్వీ చేరికను టీజీ వ్యతిరేకించారు. సీఎం సూచనతో కాస్త మెత్త బడినా.. అంతర్గతంగా వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు.
 
టీజీకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో ఎమ్మెల్యే టికెట్‌ ఎస్వీకే అని అప్పట్లోనే ఎస్వీ వర్గీయులు ప్రకటించుకున్నారు. అయితే కర్నూలు స్థానాన్ని ఎట్టి పరిస్థితు ల్లోనూ వదులుకోనని, తన తనయుడు టీజీ భరత్‌ బరిలో ఉంటాడని ఎంపీ టీజీ తన సన్నిహితులతో చెబుతూ వచ్చారు. ఓ దశలో కర్నూలు టికెట్‌ ఎస్వీకా.. టీజీ భరత్‌కా..? అన్న చర్చ కార్యకర్తల్లో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో కర్నూలు పర్యటకు వచ్చిన లోకేష్‌, వచ్చే ఎన్నికల్లో ఎస్వీ మోహన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. ఇలా చెప్పకనే తమ అభ్యర్థి ఎస్వీ అని ప్రకటించేశారు. ఈ పరిణామం ఎస్వీ వర్గీయుల్లో ఆనందాన్ని నింపింది. ప్రధాన వీధుల్లో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొన్నారు.
 
 
టీజీ ఏ నిర్ణయం తీసుకుంటారో..
రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ యువనేత టీజీ భరత్‌ బరిలో ఉంటాడని టీజీ వర్గం స్పష్టం చేస్తోంది. ఆ దిశగా సన్నాహాలు కూడా చేసుకుంటోంది. మొదటి నుంచి టికెట్‌ వస్తుందని ఆశించిన టీజీ వర్గం లోకేష్‌ నిర్ణయంతో కంగుతింది. ఈ నేపథ్యంలో టీజీ వెంకటేశ్‌ ఏ నిర్ణయం తీసుకుంటారు..? అన్న చర్చ జరుగుతోంది. లోకేష్‌ ప్రకటనతో టీడీపీ టికెట్‌ రాదని తేలిపోయింది.. ప్రస్తుతం ఎంపీ టీజీ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సర్ది చెప్పడం, బలమైన హామీ ఇస్తే బరినుంచి తప్పుకుని టీడీపీలో కొనసాగడం, రెండోది వైసీపీ టికెట్‌పై పోటీ చేయడం, మూడోది జనసేన టికెట్‌పై బరిలో నిలవడం. ఎన్నికలకు సుమారు ఏడాది గడువు ఉన్నందున ఈ మూడింటిలో ఏ ఆప్షన్‌వైపు మొగ్గు చూపుతారోనన్న చర్చ మొదలైంది. టీజీ భరత్‌ను వైసీపీ అభ్యర్థిగా బరిలో దింపేందుకు ఆ పార్టీ రాష్ట్ర ముఖ్యనాయకులు ఇప్పటికే రాజ్యసభ సభ్యు డు టీజీ వెంకటేశ్‌తో రహస్య చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ప్రస్తుతానికి తనకు టీడీపీని వీడే ఆలోచన లేదని ఎంపీ టీజీ సున్నితంగా తిరస్కరించనట్లు తెలుస్తోంది. కాగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ తన తనయుడు టీజీ భరత్‌ను రాబోయే ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేయించాలనే దృఢ నిశ్చయంతో ఉన్న టీజీ వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని, అదే జరిగితే ఆ పార్టీ టికెట్‌పై భరత్‌ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ముస్లిం మైనార్టీలకే కర్నూలు టికెట్‌ ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారని, తనకే వైసీపీ టికెట్‌ వస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ ఖాన్‌ విశ్వాసంతో ఉన్నారు.
 
 
ఎంపీగా బుట్టా రేణుక..
వచ్చే ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానానికి టీడీపీ టికెట్‌ ఎంపీ బుట్టా రేణుకకే అని మంత్రి లోకేష్‌ ప్రకటించారు. దీంతో బుట్టా వర్గీయుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. బుట్టా రేణుక వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన ఆమె రాబోయే ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మొదట్లో ప్రచారం సాగింది. దీంతో ఎంపీ టికెట్‌ను ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌, వాల్మీకి ఫెడరేషన్‌ చైర్మన్‌ బీటీ నాయుడు ఆశించినట్లు తెలిసింది. లోకేష్‌ ప్రకటనతో బుట్టా రేణుక ఎంపీగానే పోటీ చేస్తారని తేలిపోయింది. దీంతో ఆశావాహుల ప్రయత్నాలకు బ్రేక్‌ పడినట్లే. ఇదేక్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డికి కూడా లైన్‌ క్లియర్‌ అయింది.
 
 
టీజీ వర్గంలో నిరుత్సాహం..
మంత్రి లోకేష్‌ బళ్లారి చౌరస్తాకు చేరుకోగానే టీజీ భరత్‌ యువసేన ఆధ్వర్యంలో టీజీ వర్గం ఉత్సాహంతో ఉరుకలు వేసింది. క్రేన్‌ ద్వారా గజమాలతో లోకేష్‌ను సన్మానించారు. ఎస్వీ వర్గానికి పోటీగా వందలాది మంది టీజీ భరత్‌ యువసేన కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. లోకేష్‌ వాహనంలో ఓ పక్క ఎస్వీ, మరో పక్క టీజీ భరత్‌ ప్రజలకు అభివాదం చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
 
వీధుల్లో ఎటు చూసినా లోకేష్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన టీజీ వెంకటేశ్‌, టీజీ భరత్‌ ఫ్లెక్సీలే. టీజీ వర్గం ఉత్సాహంతో మంత్రి పర్యటనలో పాల్గొంది. ఎంపీ టీజీ వెంకటేశ్‌ కూడా ఉత్సాహంగానే ప్రసంగించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. రాబోయే ఎన్నికల్లో మీ ఓటును మోహన్‌రెడ్డి అన్నకు వేసి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని లోకేష్‌ ప్రజలను కోరారు. అభ్యర్థి ఎస్వీనే అని చెప్పకనే చెప్పేశారు. దీంతో అప్పటిదాకా ఉత్సాహంగా ఉన్న టీజీ వర్గం ఒక్కసారిగా డీలా పడింది. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ పాల్గొన్నా ఆయనలో ఉత్సాహం కనిపించలేదు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో భోజనం సమయంలో టీజీ వెంకటేశ్‌, టీజీ భరత్‌ లోకేష్‌ను కలిసినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి పోటీ చేయనుంది వీళ్లే..!!
14-07-2018 11:24:45
 
636671642850206323.jpg
  • చట్టసభలకు వెళ్ల్లేందుకు యువతరం ఆసక్తి
  • రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తహతహ
  • ప్రధాన పార్టీ టికెట్ల కోసం ప్రయత్నాలు
  • వెన్నంటి ఉండి ప్రొత్సహిస్తున్నసీనియర్లు
కర్నూలు: వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు యువతరం సిద్ధమౌతోంది. తమ వారసులు చట్టసభల్లో అడుగు పెడితే చూడాలని సీనియర్‌ నాయకులు ఉవ్వీళ్లూరుతున్నారు. ప్రధాన పార్టీ టికెట్లు దర్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారసుల రాజకీయ భవిష్యత్తుకోసం కన్నవాళ్లు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతుండడంతో ఇప్పటి నుంచి యువనేతలు పార్టీ కార్యాక్రమాలు, సేవా కార్యాక్రమాలతో జనం మధ్యలో ఉంటున్నారు. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు పిలిస్తే చాలు వాలిపోతున్నారు. కర్నూలు అర్బన్‌ అసెంబ్లీ స్థానం నుంచి తన తనయుడు, యువపారిశ్రామికవేత్త టీజీ భరత్‌ను పోటీకి దింపాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు.
 
పత్తికొండ నుంచి తన వారుసుడిగా కేఈ శ్యాంబాబు పోటీ చేస్తారని ఇప్పటికే డిప్యూటీ సీఏం కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి తనయుడు గంగుల బిజేంద్రారెడ్డి (నాని), నంద్యాల నుంచి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి వారుసుడిగా శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి పోటీ చేసేందుకు రాజకీయ వేదికలను సిద్ధం చేసుకుంటున్నారు. అదే క్రమంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తన వారసుడిగా కోట్ల రాఘవేంద్రరెడ్డిని తెరపైకి తెచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మంత్రాలయం నుంచి ఎమ్మెలే బాలనాగిరెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన అన్న, మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి కుమారుడు వై.ప్రదీప్‌రెడ్డి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీకి జిల్లాలోని వివిధ నియో జకవర్గాల్లో ఆరుగురు వారసులు కసరత్తు చేస్తున్నారు.
 
 
టీజీ వారసుడు భరత్‌
రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ తన వారసు డిగా టీజీ భరత్‌ను బరిలో దింపేందుకు సన్నా హాలు చేస్తున్నారు. ఆ దిశగా పావులు కదుపు తున్నారు. టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు కొనసా గిస్తున్నారు. తండ్రి బాటలోనే యువ పారిశ్రామిక వేత్త టీజీ భరత్‌ టీడీపీ చేపట్టే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టీజీ భరత్‌ యూత్‌ ద్వారా సామాజిక సేవ, యువజన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తు న్నారు. టీజీ వర్గాన్ని బలోపేతం చేసు కుంటున్నారు. ఆయన అధికార టీడీపీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఇటీవల కర్నూలు పర్యటనలో మంత్రి లోకేష్‌ ఎస్వీ మోహన్‌ రెడ్డిని పరోక్షంగా తమ అభ్యర్థిగా ప్రకటించి వెళ్లారు. అయితే సీఎం చంద్రబాబుదే తుది నిర్ణయమని, చివరి వరకు టికెట్‌ రేసులో ఉంటామని టీజీ వర్గం గట్టిగా చెబుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎట్టిపట్టిపరిస్థితుల్లోనూ టీజీ భరత్‌ను బరిలో దింపుతామని టీజీ వర్గం అంటోంది.
 
 
కేఈ వారసుడు శ్యాంబాబు
పత్తికొండ నుంచి రాబోయే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడు కేఈ శ్యాంబాబు బరిలో ఉంటారని ఇప్పటికే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో శ్యాంబాబు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. టీడీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు చేరువ వుతున్నారు. ఇంటింటికి తెలుగుదేశం, సైకిల్‌ యాత్ర వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యక ర్తలకు చేరవయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. పత్తికొండలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. జూన్‌ 3న జొన్నగిరిలో జరిగిన సీఎం చంద్రబాబు సభలోనే కేఈ శ్యాంబాబు ప్రజలను ఆకట్టుకునే యత్నం చేశారు.
 
 
మంత్రాలయం నుంచి ప్రదీప్‌ రెడ్డి
మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన సోదరుడు, మాజీ ఎంపీపీ వై సీతారామిరెడ్డి తనయుడు ప్రదీప్‌రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలోనే తాను బరిలోకి దిగుతానని కుటుంబ సభ్యులకు ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో ఈ సారి అవకాశం ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కుడిభుజంగా ఉంటూ మంత్రాలయం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాల్లో ప్రదీప్‌ రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో ఏ శుభకార్యం జరిగినా వాలిపోతున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 
శిల్పా వారసుడు రవిచంద్రకిషోర్‌ రెడ్డి
నంద్యాల నుంచి మాజీ మంత్రి శిల్పామోహన్‌ రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగు పెట్టాలని తహతహలాడుతున్నారు. వైసీపీ టికెట్‌పై నంద్యాల నుంచి ఎమ్మెల్యే లేదా ఎంపీగా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు జగన్‌ కూడా హామీ ఇచ్చారని శిల్పా వర్గీయులు చెబుతున్నారు. ఉప ఎన్నికల నాటి నుంచే 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ యువ నాయకుడు ప్రజలకు చేరువయ్యేందుకు వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. శిల్పా సేవా సంస్థ ద్వారా చేపట్టే కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో మమేకమవు తున్నారు. కార్యకర్తలకు దగ్గరగా ఉంటున్నారు.
 
 
గంగుల వారసుడు నాని
ఆళ్లగడ్డ నుంచి గంగుల వారసుడిగా మూడోతరం బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. గంగుల వర్గీయులు దీన్ని ధ్రువీకరిస్తున్నారు. ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి తనయుడు గంగుల బిజేంద్రారెడ్డి (నాని) వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. గంగుల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండడం తో.. ఆయన వారసుడుగా నాని పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ చేపట్టే పలు కార్యక్రమాల్లో చురుగ్గా
పాల్గొంటున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఏ శుభకార్యానికి పిలిచినా హాజరవుతున్నారు.
Link to comment
Share on other sites

దానికి ఇంకా చాలా టైముంది.. ఇప్పుడే చర్చలొద్దు: టీడీపీ
14-07-2018 03:11:24
 
636671637481341534.jpg
  • ఎన్నికలకు చాలా సమయం ఉంది
  • పార్టీ ముఖ్యులకు టీడీపీ సూచన!
  • కర్నూలు రగడ నేపథ్యంలో జాగ్రత్తలు
అమరావతి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిత్వాలపై ఇప్పటినుంచే చర్చ జరగకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందువల్ల ఇప్పుడే దానిపై చర్చ సరికాదని, పార్టీలో ముఖ్యులు ఈ విషయంలో జాగ్రత్త పాటించాలని సూచించినట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి లోకేశ్‌ కర్నూలు జిల్లా పర్యటనలో యఽథాలాపంగా చేసిన ఒక విజ్ఞప్తి పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో ఈ సూచన ఇచ్చారు. కర్నూలులో జరిగిన ఒక కార్యక్రమంలో లోకేశ్‌ ప్రసంగిస్తూ.. రాబోయే ఎన్నికల్లో ఒక ఓటు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, మరో ఓటు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి వేయాలని కోరారు. కర్నూలు ఎమ్మెల్యే సీటును సిటింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితోపాటు ఎంపీ టీజీ వెంకటేశ్‌ కుమారుడు భరత్‌ కూడా ఆశిస్తున్నారు. లోకేశ్‌ విజ్ఞప్తితో కంగారుపడ్డ టీజీ వర్గీయులు ఇదేమిటని మంత్రిని అడిగారు. తాను అభ్యర్థిత్వాలు ప్రకటించలేదని, వాటిని అధిష్ఠానం ప్రకటిస్తుందని ఆయన వారికి చె ప్పారు.
 
ఇది కొంత చర్చనీయాంశం కావడంతో పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యులందరికీ జాగ్రత్తలు చెప్పారు. పార్టీకి ఓటు వేయాలని కోరాలే తప్ప అభ్యర్థుల పేర్లు చెప్పవద్దని సూచించారు. ఈ పరిణామంపై లోకేశ్‌ వివరణ వేరుగా ఉంది. ‘నేను గత ఏడాది కాలంగా ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడ స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీని మళ్లీ గెలిపించాలని కోరుతున్నాను. సిటింగ్‌ ఎమ్మెల్యే, ఎంపీలను గౌరవించే ఉద్దేశంతో ఇలా చెబుతున్నాను. నేను యథాలాపంగా చెప్పిన మాటలను కర్నూలులో కొంత ఎక్కువ సీరియ్‌సగా తీసుకున్నారు’ అని ఆయన కొందరు నాయకులతో చెప్పారు. ఈ వాదనలో తప్పులేదని పార్టీ రాష్ట్ర కార్యాలయ ముఖ్యుడొకరు అన్నారు. ‘ఒకసారి గెలవడంద్వారా వారికి ఆ అర్హత వచ్చింది. కానీ కొందరు బలహీనపడ్డారు. అందుకు కారణాలేమిటో పార్టీ అధిష్ఠానం గుర్తించింది. లోపాలు దిద్దుకుని బలపడాలని కోరుతోంది. బలపడితే ఇబ్బంది లేదు. లేదంటే నాయకత్వం ప్రత్యామ్నాయం ఆలోచిస్తుంది’ అని స్పష్టం చేశారు.
 
 
Tags : Andhrapradesh, Politics, TDP
Link to comment
Share on other sites

నంద్యాల ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయన వైసీపీలోకా.. టీడీపీలోకా..!
15-07-2018 10:29:41
 
636672473782587252.jpg
  • రాజకీయాలకు దూరమైన బిజ్జం
పాణ్యం, బనగానపల్లె నియోజ కవర్గాల్లో బిజ్జం, కాటసాని వర్గాల మధ్య మూడు దశాబ్దాల ఆధిపత్య పోరు కొనసాగింది. ఆ క్రమంలో బిజ్జం పార్థసారథిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 1999లో పాణ్యం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై విజయం సాధించారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే బిజ్జం నియోజకవర్గంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతిపల్లెలో తనకంటూ ఒక వర్గాన్ని నిర్మించుకున్నారు. 2004 ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.
 
 
టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా నియోజకవర్గానికి కొంత దూరమయ్యారు. 2009లో నియోజవర్గాల పునర్విభజనలో భాగంగా ఆయన సొంత మండలం అవుకు బనగానపల్లె నియోజకవర్గంలో విలీనమైంది. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పటి నుంచి బిజ్జం హైదరాబాదులో ఉంటూ వ్యాపారాల్లో బిజీ అయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓ ప్రధాన పార్టీ తరపున పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే టీడీపీ నుంచి పోటీ చేస్తారా..? వైసీపీ నుంచి పోటీ చేస్తారా అన్నది స్పష్టత లేదు. ఎంపీగా పోటీ చేసి రాజకీయాల్లో పునఃప్రవేశం చేసేందుకు వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నారని సన్నిహితులు అంటున్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
సీఎం పోటీపై టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
05-08-2018 15:36:52
 
636690802112654891.jpg
కర్నూలు: జిల్లా టీడీపీలో ఎమ్మెల్యే టికెట్‌ రాజకీయం మళ్లీ రాజుకుంది. ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు భరత్ కర్నూలు అసెంబ్లీ సీటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతితో సమానంగా నగరం అభివృద్ది చెందాలంటే సీఎం చంద్రబాబు కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరారు. కర్నూలు నుంచి పోటీ చేయని పక్షంలో ఇక్కడ సర్వే ప్రకారం సీటు తనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆదివారం భరత్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలోని అవుట్ డోర్ స్టేడియం క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ చంద్రబాబు పోటీ చేస్తే జిల్లాలోని సీట్లన్నీ టీడీపీ వశమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే కర్నూలు నుంచే చంద్రబాబు పోటీ చేయాలని కోరారు.
 
 
ఇటీవల మంత్రి లోకేష్‌ ఊహించని విధంగా కర్నూలు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా మోహన్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బి-ఫామ్‌ చేతికి వచ్చేంతవరకు ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగడం ఆనవాయితీ. అయితే అనూహ్యంగా లోకేష్‌ చేసిన కీలక ప్రకటన టీడీపీతోపాటు అన్ని పార్టీల నాయకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కర్నూలు అసెంబ్లీ స్థానం టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీతో పాటు ఎంపీ టీజీ వెంకటేశ్‌ తనయుడు టీజీ భరత్‌ ఆశిస్తున్నారు. ఎవరికి వారు వర్గాలను బలోపేతం చేసుకుంటున్నారు. టికెట్‌ ఎస్వీకేనని ఆయన వర్గీయులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. సర్వే ఆధారంగా గెలిచే అభ్యర్థికే ముఖ్యమంత్రి చంద్రబాబు టికెట్‌ ఇస్తారని, టికెట్‌ టీజీ భరత్‌కే వస్తుందని ఎంపీ టీజీ వర్గీయులు చెబుతూ వస్తున్నారు. ఎవరికి వారే టికెట్‌పై నమ్మకంగా ఉన్నారు.
 
 
 
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా టీజీ వెంకటేశ్‌, వైసీపీ అభ్యర్థిగా ఎస్వీ మోహన్‌‌రెడ్డి బరిలో నిలిచారు. స్వల్ప ఆధిక్యతతో ఎస్వీ గెలుపొందారు. ఓటమి చెందిన టీజీ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ఎన్నికల్లో జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గానూ టీడీపీ కేవలం ఎమ్మిగనూరు, పత్తికొండ, బనగానపల్లె నియోజక వర్గాల్లో మాత్రమే గెలిచింది. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 నుంచే వ్యూహాల అమలుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 2016లో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకున్నారు. మొదట్లో ఎస్వీ చేరికను టీజీ వ్యతిరేకించారు. సీఎం సూచనతో కాస్త మెత్త బడినా.. అంతర్గతంగా వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ వచ్చారు.
Link to comment
Share on other sites

ఇద్దరూ జై జగన్ అనే అంటున్నారు... కానీ...
05-08-2018 13:04:56
 
636690710953837393.jpg
  • పాణ్యం టికెట్‌ హామీతోనే వైసీపీలోకి
  • పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కల్లూరు(కర్నూలు జిల్లా): వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో సమావేశమై పాణ్యం టికెట్‌ హామీతోనే వైసీపీలో చేరానని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని మెగా సిరి ఫంక్షన్‌ హాల్‌లో సుభాకర్‌రెడ్డి అధ్యక్షతన చేపట్టిన క్షేత్రస్థాయి కమిటీ సభ్యుల సమావేశానికి కాటసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఇతర నియోజకవర్గాల వైపు చూడాల్సిన అవసరం తనకు లేదని, కార్యకర్తలు అలాంటి అపోహలను నమ్మవద్దని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాణ్యం వీడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.
 
 
పాణ్యం టికెట్‌ మాదే: గౌరు
పాణ్యం వైసీపీ నియోజకవర్గం టికెట్‌ తమదేనని ఎమ్మెల్యే గౌరుచరిత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి అన్నారు. శనివారం కల్లూరు సాయిశ్రీనివాస గార్డెన్‌లో రాష్ట్ర మైనార్టీసెల్‌ కార్యదర్శి ఫిరోజ్‌ అధ్యక్షతన నిర్వహించిన పాణ్యం నియోజకవర్గ క్షేత్ర స్థాయి కన్వీనర్ల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గౌరు దంపతులు మాట్లాడుతూ మొదటి నుంచి పార్టీకి సేవచేస్తూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న తమకే టికెట్‌ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకుడు, పాణ్యం టికెట్‌ తమదేనంటూ చేస్తున్న వదంతులను నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు.
 

 

Link to comment
Share on other sites

  • 1 month later...
బుట్టా రేణుకను ఢీకొట్టే వైసీపీ నేతలు లేరా..?
09-09-2018 11:43:57
 
636720907170028782.jpg
కర్నూలు లోక్‌సభ టికెట్‌ను బీసీ సామాజికవర్గానికి కేటాయిస్తానని జగన్మోహన్‌రెడ్డి ఎప్పుడో ప్రకటించారు. అయితే ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. జాప్యానికి కారణమేంటి? బుట్టా రేణుక, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిలను ఢీకొట్టగలిగే నేతలు లేరా? సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలపై వైకాపా నేతల రియాక్షన్‌ ఏంటి? వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
      వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక బరిలో దిగుతారని ఆ మధ్య మంత్రి లోకేశ్‌ ప్రకటించారు.. కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీమంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. మరి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదే ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమయ్యింది.. అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి కత్తిమీద సాముగా మారింది.. లోక్‌సభ అభ్యర్థి ప్రకటనపై ఆలస్యం అవుతుండటంతో అటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోనూ.. ఇటు సోషల్‌ మీడియాలోనూ రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.. మాజీ ఐజీ ఇక్బాల్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయన కర్నూలు లోక్‌సభకు పోటీ చేస్తారన్న టాక్‌ నడిచింది.. అయితే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల ఇక్బాల్‌ను విజయవాడ ఇన్‌చార్జ్‌గా పంపారు. ఈ క్రమంలోనే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌ పేరు తెరపైకి వచ్చింది.. ఆయనకు అసెంబ్లీ టికెట్‌ బదులు లోక్‌సభ టికెట్‌ ఇవ్వబోతున్నారంటూ ఆ పార్టీలోనే చెప్పుకున్నారు.. సోషల్‌మీడియాలో కూడా ఈ రకమైన ప్రచారమే జరిగింది.. అయితే ఈ వార్తలను హఫీజ్‌ఖాన్‌ కొట్టిపారేశారు.. అధికారపార్టీకి చెందిన కొందరు నేతలు తనపై కక్షగట్టి దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డి ఆశీస్సులు తనకే ఉన్నాయనీ.. వచ్చే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచే పోటీచేస్తానని బల్లగుద్ది మరీ చెప్పారు.
 
 
     మరోవైపు ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా కర్నూలుకు వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ...కర్నూల్‌ లోక్‌సభ టికెట్‌ను బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకే ఇస్తానని చెప్పారు.. అలా అయితే జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు బీవై రామయ్య ఒక్కరే ఉన్నారు. ఆయన ప్రస్తుతం కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. టికెట్‌ కోసం ఈయనకు పోటీ వచ్చే మరో నాయకుడు పార్టీలో లేరు.. ఎలాగూ టికెట్‌ దక్కుతుందన్న గట్టి నమ్మకం ఉండటంతో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు.. కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పట్నుంచి నియోజకవర్గ ప్రజలతో రామయ్య సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు.. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి సన్నిహితులుగా ఉన్నారు.. కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులుగా పని చేశారు.. 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేశారు కూడా!
 
 
     అయితే తాజాగా కర్నూలుకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ పేరు తెరమీదకు రావడంతో రామయ్య మరింత అప్రమత్తమయ్యారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేశారు.. దూకుడు పెంచారు. ఇదిలా ఉంటే బుట్టా రేణుక కూడా లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో కలిసి ఊరూరా తిరుగుతున్నారు. స్థానిక సమస్యల దృష్టిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతున్నారు. వాటిని పరిష్కరిస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు.. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా కొత్త క్యాడర్‌ను తయారు చేసుకుంటున్నారు.. కర్నూలు లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక భారాన్ని కూడా భుజనా వేసుకున్నారు కోట్ల!
 
 
      తెలుగుదేశం పార్టీ ఆల్‌రెడీ అభ్యర్థిని ప్రకటించేసింది కాబట్టి మనమూ త్వరగా అభ్యర్థిని ఫైనలైజ్‌ చేద్దామని వైకాపా క్యాడర్‌ అధినేతను కోరుతోంది.. ఇప్పుడే అభ్యర్థిని ప్రకటిస్తే ఎన్నికల నాటికి ఖర్చు భారమవుతుందని.. అందుకే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు అభ్యర్థిని ప్రకటిస్తే సరిపోతుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే ప్రకటిస్తే టీడీపీ, కాంగ్రెస్‌కు ధీటుగా గ్రౌండ్‌వర్క్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. చూద్దాం... జగన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో...!
Link to comment
Share on other sites

  • 3 weeks later...
నాడు వైఎస్‌ఆర్ వల్ల అజ్ఞాతంలోకి.. నేడు నంద్యాల నుంచే రీ ఎంట్రీ
29-09-2018 10:50:40
 
636738155551351623.jpg
పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఏ లోక్‌సభ స్థానంనుంచి ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు? అనుచరులకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? ఏ పార్టీ నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే!
 
 
          ఫ్యాక్షన్‌ రాజకీయాల కారణంగా 2004 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా దూరమైన మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి కొంతకాలం క్రితం అజ్ఞాతం వీడారు. ప్రజలతో మమేకమవుతున్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా బిజ్జం పార్థసారథిరెడ్డి తన అనుచరవర్గంతో హాజరవుతున్నారు. తద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. వచ్చే ఎన్నికలలో క్రియాశీలక పాత్ర పోషించడానికి ఇప్పటినుంచే సైలెంట్‌గా పావులు కదుపుతున్నారు. సభలు.. సమావేశాలలో తన పొలిటికల్‌ ఎంట్రీ గురించి కానీ.. ప్రస్తుత రాజకీయాల గురించి కానీ పెదవి విప్పడం లేదు కానీ... నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సంసిద్ధులవుతున్నట్టు సమాచారం.. మరోవైపు బిజ్జం పొలిటికల్‌ రీ ఎంట్రీపై కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది..
 
 
       పార్థసారథిరెడ్డి రాజకీయప్రవేశంపై సాగుతోన్న చర్చలు ఎలా ఉన్నా... కాటసాని రాంభూపాల్‌రెడ్డి... పార్థసారథిరెడ్డి కుటుంబాల మధ్య జరిగిన ఫ్యాక్షన్‌ గొడవలపై కూడా జనాలు ముచ్చటించుకుంటున్నారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి- పార్థసారథి తండ్రి సత్యంరెడ్డికి మధ్య దశాబ్దాలకాలం పాటు ఫ్యాక్షన్‌ రాజకీయం నడిచింది. వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరులో చాలామంది బలయ్యారు. తర్వాత కాటసాని రాంభూపాల్‌రెడ్డి... బిజ్జం పార్థసారథిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కాటసాని అయిదుసార్లు కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. పార్థసారథిరెడ్డి ఓసారి టీడీపీ తరఫున శాసనసభ్యుడిగా గెలుపొందారు. 40 ఏళ్లకు పైగా ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఫ్యాక్షన్‌ కక్షల వల్ల కొంతమంది అమాయకులు చనిపోయారు. ఈ క్రమంలోనే 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇద్దరిని పిలిచి ఫ్యాక్షన్‌ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని సూచించారు. ఇద్దరి మధ్య కొన్ని విషయాలపై ఒప్పందం కుదిర్చారనే ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి బిజ్జం పార్థసారథిరెడ్డి పాణ్యం రాజకీయాలను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
 
 
        2014 ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిజ్జం ప్రయత్నించారు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం సీరియస్‌గా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.. దాంతో మళ్లీ సైలెంటయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్థసారథిరెడ్డి పాణ్యంలోనే మకాం వేశారు. అనుచరవర్గం నిర్వహించే పలు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో బిజ్జం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా..? చేస్తే ఎక్కడి నుంచి బరిలో దిగుతారు..? లోక్‌సభకు పోటీ చేస్తారా..? లేక అసెంబ్లీ బరిలో దిగుతారా? అన్న విషయాలపై కొంతకాలంగా జిల్లాలో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎట్టకేలకు బిజ్జం మౌనం వీడారు. నంద్యాల ఎంపీగా పోటీ చేస్తానని అనుచరులతో చెప్పారట! ఆ దిశగా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. త్వరలో అభిమానులతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటించేందుకు బిజ్జం ప్లాన్ వేశారట...! దీంతో బిజ్జం ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారరనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నంద్యాల లోక్‌సభకు పోటీ చేసేందుకు తెలుగుదేశంపార్టీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి చాలా మంది ఆశావాహులు ముందుకొస్తున్న తరుణంలో బిజ్జం రాకతో నంద్యాల రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.
Link to comment
Share on other sites

  • 5 weeks later...
నంద్యాల టీడీపీ ఎంపీ టికెట్ గంగుల కుటుంబానికేనా..!?
29-10-2018 13:15:40
 
636764159937549369.jpg
  • శ్రీశైలం ఎమ్మెల్యేను కలిసిన మాజీ ఎంపీ గంగుల
వెలుగోడు/కర్నూలు: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డిని నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి ఆదివారం రాత్రి కలిశారు. వెలుగోడు పట్ట ణంలోని ఎంపీపీ అన్నారపు సీతమ్మ స్వగృహంలో వారు భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా టీడీపీ తరుపున పోటీ చేసేందుకు తనకు మద్దతు ఇవ్వాలని మాజీ ఎంపీ ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే బుడ్డాను కోరినట్లు తెలిసింది. ఇందుకు ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ భేటీలో ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, గంగుల సుదర్శన్‌ రెడ్డి, గంగుల భరత్‌, శివప్రసాదరెడ్డి, వెలు గోడు మండల నాయకులు అన్నారపు శేషిరెడ్డి తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

2019 ఎన్నికల్లో పోటీ చేస్తా: టీజీ భరత్
30-10-2018 15:35:40
 
636765106835873481.jpg
  • 2019 ఎన్నికల్లో పోటీ చేస్తా
  • నవంబరులో విజన్‌ యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళతాం
  • పారిశ్రామికవేత్త, టీజీవీ గ్రూప్స్‌ సీఎండీ టీజీ భరత్‌
  • టీజీ భరత్‌ విజన్‌ యాత్ర లోగో ఆవిష్కరించిన కౌశల్‌
  • ఆర్మీ ఫౌండేషన్‌కు రూ.లక్ష విరాళం ఇచ్చిన భరత్‌
కర్నూలు: 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని, 2019-2024 విజన్‌ ఏమిటో ప్రజల్లోకి వెళ్లి తెలుసుకుంటామని యువ పారిశ్రామికవేత్త, టీజీవీ గ్రూప్స్‌ సీఎండీ టీజీ భరత్‌ పేర్కొన్నారు. సోమవారం రాత్రి స్థానిక మౌర్యఇన్‌లోని పరిణయ ఫంక్షన్‌ హాలులో బిగ్‌బాస్‌-2 విన్నర్‌ కౌశల్‌ మండా సక్సెస్‌ మీట్‌లో టీజీ భరత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశల్‌ చేతుల మీదుగా టీజీ భరత్‌ విజన్‌ యాత్ర లోగోను ఆవిష్కరించారు. కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌కు టీజీ భరత్‌ తమ వంతు విరాళంగా రూ. లక్ష చెక్కు అందజేశారు. అనంతరం టీజీ భరత్‌ మాట్లాడుతూ ప్రజలు ఏం కావాలో, ఏంకోరుకుంటున్నారో తెలుసుకునే ఉద్దేశంతో తాను విజన్‌ యాత్ర ప్రారంభిస్తున్నానని చెప్పారు.
 
 
నవంబరు నుంచి కర్నూలు నియోజకవర్గం పరిధిలోని 33 వార్డుల్లో యాత్ర ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌ ద్వారానే ప్రజల అవసరాలను తెలుసుకుంటున్నారని, టీడీపీ తరపునే ఈయాత్ర ద్వారా ప్రజలను కలుస్తామని చెప్పారు. నాయకుడు 24 గంటలు అందుబాటులో ఉంటామంటూ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. విజన్‌ యాత్ర పూర్తయ్యాక 2019 జనవరి నెలలో తన మేనిఫెస్టో ప్రకటిస్తానని చెప్పారు. తన విజన్‌ యాత్ర టీడీపీ పక్షానే ఉంటుందని, పార్టీకి ఇది మేలు జరుగుతుందని, ఈ యాత్ర ద్వారా ప్రజల అవసరాలేమిటో స్పష్టంగా తెలిసే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌశల్‌ ఆర్మీ ఫౌండేషన్‌ సంస్థ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, టీజీబీ యూత్‌ సంస్థ ద్వారా కర్నూలులోనూ తాము సేవా కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నామని అన్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...
కర్నూలు ఎంపీ స్థానమెవరికి?

ఎంపీ స్థానంపై వాడీ వేడి చర్చ

కర్నూలులో మారుతున్న రాజకీయ సమీకరణాలు

30knl100.jpg

కర్నూలు: జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కోట్ల కుటుంబం తెదేపాలోకి వస్తుండడంతో జిల్లాలో బలమైన కేఈ కుటుంబం ఏవిధంగా స్పందిస్తుంది? కర్నూలు ఎంపీ బుట్టా రేణుక భవిష్యత్‌ ఏమిటి? అనే అంశంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. దీనికి సీఎం చంద్రబాబు మంచి పరిష్కారం చూపుతారని నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన.. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. సుదీర్ఘ మంతనాలు జరిపారు. తెదేపాలో చేరిన తర్వాత జిల్లాలో రాజకీయ పరిణామాలు ఏవిధంగా మారుతాయనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. కేఈ తెదేపాకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. కోట్ల కాంగ్రెస్‌కు పెద్దన్నగా మెలిగారు. కోట్ల తెదేపాలోకి వస్తే ఈ కుటుంబాలు కలిసి పనిచేస్తాయా? వీరి మధ్య సమన్వయం ఉంటుందా? అనే అంశాలపై జిల్లాలో చర్చ జరుగుతోంది. కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీ స్థానంతో పాటు డోన్‌, ఆలూరు, కోడూమూరు అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. డోన్‌ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు కేఈ కుటుంబం సిద్ధంగా లేదు. మిగిలిన స్థానాల్లో తమకేమీ అభ్యంతరం లేదని కేఈ వర్గీయుల నుంచి సంకేతాలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాన్ని కేటాయిస్తే ప్రస్తుత ఎంపీ బుట్టా రేణుక పరిస్థితి ఏమిటన్నది సందిగ్ధంలో పడింది. వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన కోడుమూరు శాసన సభ్యుడు మణిగాంధీ, ఆలూరు తెదేపా బాధ్యుడు వీరభద్రగౌడ్‌లను ఏవిధంగా బుజ్జగిస్తారు? అనేదానిపై చర్చ జరుగుతోంది. వీటన్నింటికీ సీఎం చంద్రబాబే సమాధానం చెబుతారని.. అందరికీ సమన్యాయం చేస్తారనే మాట తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తోంది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా నుంచి కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక గెలుపొందారు. ఆ తర్వాత తెదేపాలో చేరారు. అప్పుడు సీఎం స్పష్టమైన హామీలు ఇచ్చారని బుట్టా వర్గీయులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలోనే కర్నూలు పర్యటనకు వచ్చిన తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బుట్టా రేణుక పేరును ప్రకటించారు. ఓ వైపు పార్టీ జాతీయాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఇద్దరూ తమకు హామీ ఇచ్చారని రేణుక ధీమా వ్యక్తంచేశారు. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నామని ఎంపీ చెబుతున్నారు.

మరోవైపు సీట్ల విషయంలో చర్చలు కొలిక్కి వచ్చిన వెంటనే కోట్ల పచ్చ కండువాను కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు సీఎం ఏం చేస్తారు? అనే విషయంపైనా ఆసక్తి నెలకొంది. ఓ బలమైన రాజకీయ కుటుంబం తెదేపాలోకి రావడంతో పార్టీ బలోపేతమవుతుందని, అదే సమయంలో కోట్ల కుటుంబానికి లాభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...