Jump to content

IIIT-Ongole


Recommended Posts

1 minute ago, Kedism said:

Areyhoooooi..

 

Ongole pakkana Yerajarla lo feasibility check chesaaruuu ok annaruuu mareeee sudden change yentoooo

forest land anta adi, deforestation cheytam e paristhi lo avadu andukani marcharu

Link to comment
Share on other sites

అధికార పార్టీలో రగడ.. అమీతుమీకి సిద్ధమైన ఎమ్మెల్యే
12-05-2018 14:29:14
 
636617321550110951.jpg
  • నిపుణుల కమిటీకి సిఫార్సు బేఖాతరు
  • చక్రం తిప్పిన మంత్రి నారాయణ
  • పామూరులోనే అంటూ గంటా సమాచారం
  • ఎమ్మెల్యే పోతుల అలక.. అమీతుమీకి సిద్ధం
  • నేడు సీఎంను కలవనున్న రామారావు
ఒంగోలు: జిల్లాకు మంజూరైన త్రిపుల్‌ ఐటీ ఏర్పాటు వ్యవహారం అధికార పార్టీలో రగడను సృష్టించింది. స్థల ఎంపిక విషయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ నిపుణుల కమిటీ సిఫార్సులకు అతీతంగా చక్రం తిప్పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలవనున్నట్లు సమచారం.
 
 
మూడేళ్ల క్రితమే జిల్లాకు త్రిపుల్‌ ఐటీ కేటాయించినా ఇప్పటిదాకా స్థల ఎంపిక జరగలేదు. ఒంగోలు, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. జిల్లా కేంద్రం కావడంతో ఒంగోలులోనే ఏర్పాటు చేయాలని ఇటు ఎమ్మెల్యే దామచర్ల, అటు కనిగిరిలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కదిరి బాబురావులు పట్టుబట్టారు. నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు సూచించారు.
 
 
అప్పట్లో దామచర్ల, కదిరి బాబురావుల మధ్య ఈ విషయమై విభేదాలు పొడచూపాయి. చివరకు ముఖ్యమంత్రి ఒంగోలులోనే ఏర్పాటు చేయాలని సూచించడంతో వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. అయితే ప్రస్తుతం ఒంగోలు ప్రాంతంలో స్థలం లేకపోవడంతో ప్రత్యామ్నాయస్థలం చూడమని సీఎం ఆదేశించారు. దీంతో కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలంలోని చినపవని వద్ద ఏర్పాటు చేయాలని పోతుల రామారావు, కనిగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని కదిరి బాబురావులు ముఖ్యమంత్రిని కోరారు. ఆ దశలో నిపుణుల కమిటీ ఎంపిక చేసిన స్థలంలో ఏర్పాటు చేద్దామని సీఎం చెప్పారు. తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే పోతులకు కూడా చెప్పినట్లు తెలిసింది. తరువాత నిపుణుల కమిటీ అన్ని ప్రాంతాలలో స్థలాలను పరిశీలించి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. చినపవని వద్దనే ఏర్పాటు చేయటం సమంజసమని ఆ కమిటీ సూచించింది.
 
 
దూబగుంట వద్దేనంటూ..
తాజాగా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలోని దూబగుంట వద్ద ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి స్థల సేకరణకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. గురువారం కనిగిరిలో జరిగిన మినీ మహానాడులో ఫోన్‌ ద్వారా మంత్రి గంటా శ్రీనివాసరావు దూబగుంట వద్దనే ట్రిపుల్‌ ఐటీ నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. దీంతో కదిరి బాబూరావు, ఆ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరపడిపోగా పోతుల రామారావు కందుకూరు టీడీపీ శ్రేణులు అసంతృప్తికి గురయ్యారు. నిపుణుల కమిటీ సూచనలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై అమీతుమీకి ఎమ్మెల్యే పోతుల సిద్ధమైనట్లు తెలిసింది. జనవరిలో సంక్రాంతిరోజున స్వగ్రామమైన కామేపల్లి వచ్చిన మంత్రి గంటా చినపవని స్థలాన్ని చూసి వద్దామని పోతులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు అధికారులను కూడా అందుబాటులో ఉండమని రామారావు సమాచారం పంపారు.
 
 
నేడు సీఎంను కలవనున్న పోతుల
చివరిలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ జోక్యం చేసుకుని ఆ కార్యక్రమానికి వెళ్ళకుండా గంటాను ఆపినట్లు ప్రచారం.అదే విషయాన్ని ఎమ్మెల్యే రామారావు కూడా పార్టీ శ్రేణులతో అన్నట్లు తెలిసింది. నిపుణుల కమిటీ సిఫార్సులకు అనుగుణంగా స్థల ఎంపిక జరుగుతుందని సీఎం ఇచ్చిన హామీ మేరకే తాను ధైర్యంగా ఉన్నానని, ఈ కుతంత్రాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి తాడో పేడో తేల్చుకుంటానని పోతుల అంటున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి విస్తృత సమావేశం సందర్భంగానే సీఎంను కలిసేందుకు ఆయన ప్రయత్నించారు.
 
అయితే రాత్రి వేరే కార్యక్రమాలు ఉన్నందున సీఎం ఎమ్మెల్యేల కలయిక కార్యక్రమాలను రద్దు చేశారు. నెల్లూరు లోక్‌సభ పరిధి టీడీపీ నేతల సమావేశం శనివారం ముఖ్యమంత్రి వద్ద జరగనుంది. ఆ సమావేశానికి ఎమ్మెల్యే పోతుల హాజరవుతారు. ఆ సందర్భంగా ట్రిపుల్‌ ఐటీ స్థల ఎంపిక విషయంలో సీఎంహామీని గుర్తు చేసి జరుగుతున్న వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు రామారావు సిద్ధమయ్యారు. మరి సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. రామారావు ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Link to comment
Share on other sites

5 hours ago, KvrReddy said:

Meeku IIT Prakasam undi gaa inka IIIT enduku 

 Bro..ee iit prakasam ekkada undi..

iiit kosam ma kandukur baga feasible area ela chusukunna but political influence tho pamur ku poindi...idi Kdkr tdp leaders vyfalyam 

Link to comment
Share on other sites

On 5/11/2018 at 5:14 PM, adithya369 said:

Ekkada Pamuru ra babu :wall:

Train route ledu,  single narrow road,  commute ela chesthaaru? 

Ilaanti vp decisions Bhale theesukuntaaruga

4 lane road.... nadikudi vasthey train route kuda untundi...

Link to comment
Share on other sites

  • 1 month later...

ప్రకాశం జిల్లా పామూరు మండలం దూబగంట, బుక్కాపురంలలో అబ్దుల్‌కలాం ట్రిఫుల్‌ ఐటీ కోసం 208 ఎకరాలు

Link to comment
Share on other sites

కలాం ట్రిపుల్‌ ఐటీకి 208 ఎకరాలు
07-07-2018 02:31:15
 
  • ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు 40 ఎకరాలు
అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ట్రిపుల్‌ ఐటీ కోసం ప్రకాశం జిల్లా పామూరు మండలం.. దూబగుంట, బుక్కాపురం గ్రామాల్లోని 208 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు
Link to comment
Share on other sites

  • 3 weeks later...
ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు
07-08-2018 07:14:02
 
636692228409109840.jpg
అమరావతి: నేడు ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. జిల్లాలోని పామూరు మండలం దూబగుంటలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం చీరాలలో చేనేత దినోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా మంత్రులు, టీడీపీ నేతలు, పలువురు అధికారులు ఉండనున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...