Jump to content

AP TDP Office in Mangalagiri


Recommended Posts

టీడీపీ కేంద్ర కార్యాలయం జనవరికి రెడీ..!
09-05-2018 08:42:14
 
636614521333858269.jpg
  • జనవరికి రెడీ..!
  • నిర్మాణమవుతున్న టీడీపీ కేంద్ర కార్యాలయం
మంగళగిరి(గుంటూరు జిల్లా): మంగళగిరి వద్ద నిర్మాణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వచ్చే జనవరి నాటికి సిద్ధం కానుంది. జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశానికి ఇది కేంద్ర కార్యాలయంగా పనిచేయనుంది. మంగళగిరి పట్టణానికి చేరువలో 16వ నెంబరు జాతీయ రహదారి వెంబడి హ్యాపీ రిసార్ట్స్‌ ఎదురుగా 3.60 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. హైవే వెంబడి ఓ రెండు భారీ గేటెడ్‌ కమ్యూనిటీల మధ్య కేంద్ర కార్యాలయం రూపుదిద్దుకుంటోంది. గతేడాది నవంబరు 26న పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబరు నాటికి దీనిని పూర్తిచేయాలని సంకల్పించినప్పటికీ... అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో నిర్మాణ పనులను మరో నెలపాటు పొడిగించుకుంటూ జనవరి మాసాంతాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.
 
 
బహుశా ఇది అటుఇటుగా ఉగాది నాటికి ప్రారంభోత్సవం జరుపుకొని సార్వత్రిక ఎన్నికల నాటికి కోలాహలంగా మారనుంది. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని రెండు బ్లాకులుగా నిర్మిస్తున్నారు. ఒక బ్లాకును అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాకుగా పరిగణిస్తున్నారు. రెండో బ్లాకును సమావేశ మందిరాలు, డార్మెటరీలకు కేటాయిస్తారు. ప్రస్తుతానికి ఈ భవనాలను పార్కింగ్‌తోపాటు రెండంతస్తులుగా నిర్మిస్తున్నట్టు సమాచారం. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Link to comment
Share on other sites

  • 2 months later...
రాజధానిలో టీడీపీ సౌధం ఏ రేంజ్‌లో ఉందో చూడండి..
16-07-2018 08:47:38
 
636673276588884456.jpg
  • మంగళగిరి కేంద్రంగా పార్టీ కేంద్ర కార్యాలయాలు
  • సంక్రాంతికి సిద్ధం కానున్న టీడీపీ కార్యాలయం
  • దసరా లక్ష్యంగా వైసీపీ నిర్మాణ పనులు
  • నిదానంగా జనసేన.. సన్నాహాల్లో బీజేపీ
మంగళగిరి/అమరావతి: వచ్చే ఏడాదిలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాలు సన్నద్ధమవుతున్నాయి. దాదాపు అన్నీ రాజకీయ పక్షాలు మంగళగిరి మీదుగా వెళ్లే 16వ నెంబరు జాతీయ రహదారి పక్కగా రాజకీయ పార్టీలు తమ కార్యాలయాలను నిర్మించుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీలు గతేడాదే తమ కార్యాలయ భవనాలకు నిర్మాణ శ్రీకారం చుట్టగా జనసేన మాత్రం ఆలస్యంగా ఈ ఏడాదే నిర్మాణ పనులను ఆరంభించింది. బీజేపీ కూడా తన రాష్ట్ర కార్యాలయ భవనాన్ని పాత సిమెంటు ఫ్యాక్టరీ సమీపాన నిర్మించుకునేందుకు సన్నద్ధమవుతోంది. 
 
tdp-bhavan.jpgతెలుగుదేశం సౌధం
మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో హ్యాపీ రిసార్ట్సుకు ఎదురుగా హైవే వెంబడి 3.9 ఎకరాల విస్తీర్ణంలో టీడీపీ తన కేంద్ర కార్యాలయ భవనాన్ని నిర్మిస్తోంది ఈ కార్యాలయ భవన నిర్మాణానికి గతేడాది నవంబరు 26న పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. మొత్తం రెండు బ్లాకులుగా రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. పెద్ద కాన్ఫరెన్స్‌ హాలు, మినీ మీటింగ్‌ హాలుతో పాటు డైనింగ్‌ హాలు, లైబ్రరీ, అతిథి గృహం వంటి అన్నీ సదుపాయాలను ఇం దులో అధునాతనంగా ఏర్పాటు చేస్తున్నారు. సంక్రాంతి లక్ష్యంగా ప్రారంభోత్సవం చేయాలన్న పట్టుదలతో పనులను జరిపిస్తున్నారు. 
 
ysrcp-b.jpgవైసీపీ కార్యాలయ భవనం
వైసీపీ కొంచెం ముందుగా తాడేపల్లి పట్టణ ప్రాంతంలో తన కేంద్ర కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపట్టింది. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా శంకుస్థాపన చేసుకుని నిర్మాణ పనులను చేపట్టింది. పార్టీ కార్యాలయంతో పాటే అధినేత వైఎస్‌ జగన్‌ నివాసాన్ని కూడా ఆ పక్కనే నిర్మిస్తున్నారు. ఈ రెండింటి నిర్మాణ పనులు వేగంగానే జరుగుతున్నాయి. దసరా నాటికి వైసీపీ కార్యాలయ భవన నిర్మాణ పనులు ముగిసే అవకాశం ఉందంటున్నారు.
 
ఎయిమ్స్‌ సమీపంలో బీజేపీ..
భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో బలం పుంజుకోవాలని యోచిస్తున్న నేపథ్యంలో తన రాష్ట్ర కార్యాలయాన్ని మంగళగిరి పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. ఎయిమ్స్‌కి సమీపంలో పాత సిమెంటు ఫ్యాక్టరీ వద్ద అరెకరంలో పార్టీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని నిర్మించాలని ఇటీవల నిర్ణయించారు. కొలనుకొండ వద్ద హైవే నుంచి సుమారు 800 మీటర్ల దూరంలో వున్న ఈ స్థలాన్ని చేరుకునేందుకు రహదారి ఏర్పాటు చేసుకోవలసి వుంది. ఈ స్థలాన్ని బీజేపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ మాదల శ్రీనివాస్‌ పార్టీకి ఉచితంగా అందజేశారు. కొద్దిరోజుల వ్యవధిలోనే దీనికి శంకుస్థాపన చేసే అవకాశం వుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
 
janasena.jpgజనసేన కార్యాలయం
జనసేన పార్టీ తన ప్రధాన కార్యాలయ భవనాన్ని తొలుత చినకాకానిలో నిర్మించాలని భావించినప్పటికీ లీజుకు తీసుకున్న స్థలం విషయంలో వివాదం చెలరేగడంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. చినకాకాని పక్కనే వున్న కాజ పరిధిలో హైవే వెంబడి సాహితి సంస్థ నిర్మిస్తున్న భారీ వెంచర్‌లో ఓ రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటుగా నివాస భవన నిర్మాణాన్ని కూడా చేపట్టారు. ఈ నిర్మాణ పనులు నాలుగు మాసాల కిందటే ఆరంభమయ్యాయి. ప్రస్తుతానికి ఈ పనులు కొంత మందకొండిగా జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఏదేమైనా మిగతా పార్టీలకు దీటుగా ఎన్నికల నాటికి పార్టీ కార్యాలయాన్ని ఆరంభించి ఇక్కడినుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని జనసేన నాయకులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
19 minutes ago, swarnandhra said:

solar baagane vundi kani endi idi hostel building laga vundi. deeni kante Guntur office front-view baaguntundi. NTR bhavan tho ayithe asalu comparison waste.

Solar panels valla look thaggindi.. But energy conservation wise good thing.. 

Link to comment
Share on other sites

  • 2 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...