Jump to content

life is becoming cheap - just 18000 Rs


Recommended Posts

చంపించింది నవ వధువే
09-05-2018 02:15:42
 
636614289417139706.jpg
  • పెళ్లయిన పదిరోజులకే భర్త హత్య
  • ఫేస్‌బుక్‌ ప్రియుడితో కలిసి కుట్ర
  • కిరాయి హంతకులకు సుపారీ
  • వీడిన విజయనగరం మర్డర్‌ మిస్టరీ
  • గంటల్లోనే ఛేదించిన పోలీసులు
విజయనగరం క్రైం/వీరఘట్టం, మే 8: ‘బావను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగితే మారు మాట్లాడకుండా అంగీకరించింది! 10 రోజుల క్రితం తాళి కట్టించుకుంది. అంతలోనే... ‘ఫేస్‌బుక్‌ ప్రియుడి’తో కలిసి భర్తను చంపించేసింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఘోరమిది. హత్య జరిగిన గంటల్లోనే పోలీసులు హంతకులను అరెస్టు చేశారు. విజయనగరం ఎస్పీ పాలరాజు మంగళవారం ఈ వివరాలను మీడియాకు వివరించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టపుడివలసకు చెందిన గౌరీశంకర్‌ బీటెక్‌ పూర్తి చేసి వరంగల్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన మరదలు సరస్వతి కూడా బీటెక్‌ చదివింది. ఇరు కుటుంబాల పెద్దలు గతనెల 28న గౌరీశంకర్‌, సరస్వతిల వివాహం జరిపించారు. బావతో పెళ్లికి ఆమె ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే... పెళ్లయినప్పటి నుంచి కాస్త ముభావంగా ఉంటోంది. చివరికి... భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని పన్నాగం పన్నింది. సరస్వతికి విశాఖ జిల్లా రోలుగుంట మండలం సంతబైరు గ్రామానికి చెందిన మడ్డు శివతో ‘ఫేస్‌బుక్‌’ పరిచయం ఉంది. తర్వాత అతడితోనే ప్రేమలో పడింది. భర్త అడ్డుతొలగించేందుకు అతని సహకారం
కోరింది. అతను... విశాఖపట్నంలోని కిరాయి హంతకుడు గోపి, ఆరిలోవకు చెందిన పాత నేరస్థుడు సారేపల్లి రామకృష్ణను శివ సంప్రదించాడు. గోపికి రూ.10వేలు అడ్వాన్సుగా ముట్టచెప్పాడు. ఆ తర్వాత అందరూ కలిసి గౌరీశంకర్‌ హత్యకు ‘స్కెచ్‌’ వేశారు.
 
ఇలా చంపేశారు...:
గౌరీశంకర్‌ తన భార్య సరస్వతితో కలిసి సోమవారం పార్వతీపురం పట్టణానికి వచ్చి బైక్‌ను సర్వీసింగ్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ఇంటికి వచ్చి... బైక్‌ తీసుకునేందుకు సాయంత్రం మళ్లీ పార్వతీపురం వచ్చారు. బైక్‌ తీసుకున్న తర్వాత కూడా సరస్వతి చీకటిపడేదాకా అక్కడే ఉండేలా అటూఇటూ తిప్పించింది. ఆ తర్వాత వాళ్లు బైక్‌పై చిట్టపుడివలసకు బయలుదేరారు. ఈ మొత్తం సమాచారాన్ని సరస్వతి రహస్యంగా తన ఫేస్‌బుక్‌ ప్రియుడు శివకు ఫోన్‌లు, ఎస్‌ఎమ్మె్‌సల ద్వారా ఎప్పటికప్పుడు చేరవేస్తూ వచ్చింది. పార్వతీపురంలో రాత్రి 7.30కి బైక్‌పై బయలుదేరతామని తెలిపింది. మార్గమధ్యంలో గరుగుబిల్లి మండలం ఐటీడీఏ పార్కు సమీపంలోకి వచ్చాక బైక్‌ను ఆపి... అక్కడే గౌరీశంకర్‌ను చంపేయాలని ప్లాన్‌వేశారు. హత్యకు ఒప్పందం కుదుర్చుకున్న గోపి, రామకృష్ణతోపాటు గుర్రాల బంగార్రాజు అనే మరోవ్యక్తితో కలిసి విశాఖకే చెందిన దేవరాపల్లి కిశోర్‌ ఆటోలో అందరూ ‘స్పాట్‌’కు చేరుకున్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం... ఐటీడీఏ పార్కు సమీపంలోని షెడ్డు వద్దకు రాగానే, మూత్ర విసర్జన పేరు చెప్పి బైక్‌ను ఆపాలని సరస్వతి కోరింది. సరేనంటూ గౌరీశంకర్‌ బండి ఆపాడు. అంతే... అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న నిందితులు గౌరీశంకర్‌ను ఇనుపరాడ్‌తో కొట్టి చంపేశారు. దొంగలే ఈ పని చేశారని చిత్రీకరించేందుకు... సరస్వతి వద్ద ఉన్న నగలను తీసుకుని ఆటోలో పారిపోయారు. తనపైకూడా దాడి జరిగిందని నమ్మించేలా సరస్వతి తన చేతి గాజులను ఛిద్రం చేసుకుని, కాస్త చిందరవందరగా తయారై... పథకం ప్రకారం అక్కడే ఏడుస్తూ కూర్చుంది. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న ఆర్‌ఐ, స్థానికులు వచ్చి పోలీసులకు ఈ సమాచారం అందించారు.
 
ఇలా బయటపడింది...
పోలీసులు సరస్వతిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏఎస్పీ దీపికా పాటిల్‌, ఇతర అధికారులు రంగంలోకి దిగారు. సంఘటన గురించి సరస్వతిని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడం... దొంగలు దోచుకున్న తర్వాత కూడా ఆమె వద్ద మరిన్ని నగలు ఉండటంతో పోలీసులకు అనుమానం తలెత్తింది. మరోవైపు... హంతకులను గుర్తించేందుకు ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో ఘటనా స్థలికి బయలుదేరిన ఎస్పీ పాలరాజు పెదమానాపురం వద్దకు చేరుకునే సరికి... ఆటోలో పరారవుతున్న హంతకులు ఎదురయ్యారు. ఆటోను ఆపి అందులో ఉన్న ముగ్గురు యువకులను ప్రశ్నించగా... వారూ తడబడుతూ, పొంతనలేని సమాధానాలు చెప్పారు. పోలీసులకు అనుమానం బలపడి తమదైన శైలిలో విచారించగా తామే హత్యచేసినట్లు వారు అంగీకరించారు. కిరాయి హంతకులకు యాప్‌ ద్వారా తొలుత తాను రూ.8వేలు బదిలీ చేశానని, ప్రియుడు శివ కూడా ముఠాకు రూ.10వేలు ఇచ్చాడని సరస్వతి చెప్పింది. నిందితులను పోలీసులు సోమవారం రాత్రే రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి ఆటో, ఇనుపరాడ్డు, సెల్‌ఫోన్‌లు, సరస్వతి వద్ద నుంచి పది తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే కేసును ఛేదించడంతోపాటు... హంతకులను కూడా అరెస్టు చేసిన ఏఎస్పీ దీపికా పాటిల్‌, ఓఎస్ డీ విక్రాంత్‌ పాటిల్‌, సీసీఎస్‌ డీఎస్పీ చక్రవర్తిని ఎస్పీ అభినందించారు.
Link to comment
Share on other sites

humans are intelligent ( all human in some angles ). For those who didn't get their fair minimum share of resources on earth, or if not properly educated(social values) treated, then 18k is also a big amount. our culture helped us(india) so far. else rich have to live in gated comm.. this is where proper wealth distribution and proper education for kids (including orphan) is your(those who get wealth) need n responsibility. if you are really intelligent live n 'let live'. (besides "balance of nature" and environment). we were blessed with our old culture / dharma sutra / life style close to nature etc, but unfortunately moving away from it, and not able to balance ourselves properly in this new era either.

 

Link to comment
Share on other sites

no amount of wealth distribution or best education is not going to stop these incidents (pre planned murders). deterrent of getting caught (like in this case) and punishment is also needed. this is where we are failing. in the last 10 years entire India there were only 3 death penalties executed one of them was Pakistani Terrorist.

 

Link to comment
Share on other sites

టీవీలో ఈ వార్త చూస్తున్నప్పుడే నాకు ఆ పిల్ల మీద అనుమానం వచ్చింది,ఈవిడే హంతకురాలు అని. ఎందుకో నేను ఊహించినవన్ని నిజం అవుతున్నాయ్

సీ సీ టు కె ఎ పాల్ @girikurnool

Link to comment
Share on other sites

5 minutes ago, John said:

టీవీలో ఈ వార్త చూస్తున్నప్పుడే నాకు ఆ పిల్ల మీద అనుమానం వచ్చింది,ఈవిడే హంతకురాలు అని. ఎందుకో నేను ఊహించినవన్ని నిజం అవుతున్నాయ్

సీ సీ టు కె ఎ పాల్ @girikurnool

Ah sufari tiskuni murder chesindi nuvvega

Link to comment
Share on other sites

facebook, whatsapp , chatting tho  vache premalu nilabadavu.

jio effect tho cell phone data cheap ayyindi.

cbn gaari fibernet tho inkaa data free ayipotundi . cbn cheppinatlu technology misuse ekkavavutundi. railway station lo free wifi pedithe janaalu porn choostunnaaru. fibernet pettaaka ide jaruguthundi. cbn intention correct gaa vunnaa people usage verugaa vuntudi.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...