Jump to content

West Godavari Politics


Recommended Posts

జనసేనాని సంచలన నిర్ణయం.. కాపేతరులకు టికెట్‌..!
01-08-2018 11:07:35
 
636687184566466131.jpg
  • అభ్యర్థుల వేటలో జనసేన
  • పవన్‌ను కలిసిన ఒక పారిశ్రామిక వేత్త
  • పాలకొల్లులో రసవత్తర రాజకీయం
పాలకొల్లు నియోజకవర్గంలో రసవత్తరమైన రాజకీయ పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ శ్రేణులు ధీమాతో ఉంటే, మరో వైపు వైసీపీ శ్రేణులు జగన్‌ పాదయాత్ర అనంతరం ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ రాకకై ఇక్కడి యువత ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో జిల్లాలో పవన్‌ పర్యటన అనంతరమే పరిణామాలు ఒక కొలిక్కి వస్తాయని అంచనా వేస్తున్నారు.
 
 
పాలకొల్లు, ప.గో.: పాలకొల్లు నియోజవర్గంలో అన్ని పార్టీలు సంప్రదాయం ప్రకారం కాపులకే టికెట్టు ఇస్తూ వస్తున్నాయి. అయితే 2009 ఎన్నికల్లో త్రిముఖ పోటీలో చిరంజీవి, డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణ మూర్తిలపై వైశ్య సామాజిక వర్గానికి చెందిన బంగారు ఉషారాణి గెలుపొందారు. ప్రస్తుత పరిణామాలలో జనసేన పార్టీ పొత్తులు లేకుండా పోటీ చేయదలచుకుంటే పాలకొల్లు నియోజక వర్గం క్షత్రియ లేదా కమ్మ కులస్థులకు కేటాయించడానికి పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. నియోజకవర్గంలోని 20 గ్రామాల్లో క్షత్రియ సామాజిక వర్గానికి మంచి పట్టు ఉండటంతో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పిస్తే సొంత ఓట్లే కాకుండా మిగిలిన సామాజిక వర్గాలు కూడా కలిసి వస్తాయనే లెక్క లేస్తున్నారు.
 
అలా కాకుంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పార్టీ ఉన్నత స్థాయి శ్రేణులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. పాలకొల్లు ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు 2014 ఎన్నికల సమయంలో వెన్నుదన్నుగా నిలిచిన ఒక పారిశ్రామిక వేత్త తనకు తగిన గుర్తింపువ్వడం లేదని ఆవేదనలో ఉన్న పరిస్థితుల్లో అతనితో వైజాగ్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చర్చించినట్టు సమాచారం. సిద్ధంగా ఉంటే టికెట్టు విషయం పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు.
 
వట్టి వస్తారా..!?
ఇదిలా ఉండగా ఇటీవల జనసేనానిని కలసిన వట్టి వసంతకుమార్‌ను పార్టీలోకి రావలిసిందిగా పవన్‌ ఆహ్వానించగా వట్టి చిరునవ్వుతో తిరస్కరించారని సమాచారం. ఇటీవల పాలకొల్లు వచ్చిన వట్టి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణ మూర్తి (బాబ్జీ)తో బేటీ అయి చర్చించినట్టు తెలిసింది. పాలకొల్లు నుంచి జనసేన అభ్యర్థిగా డాక్టర్‌ బాబ్జీ పోటీ చేయాలని వట్టి వసంతకుమార్‌ కోరినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న వట్టి వసంతకుమార్‌ వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరపున లేదా జనసేన పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. మొత్తంగా పాలకొల్లు నియోజకవర్గంలో సంప్రదాయానికి విరుద్దంగా ఇతర సామాజిక వర్గాల వారికి స్థానం కల్పిస్తారా... లేదంటే సొంత సామాజిక వర్గానికే కాపు కాస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అనే అంశంపై జనసేనాని నిర్ణయానికై నియోజకవర్గంలో ఆయన అభిమానుల ఎదురు చూస్తున్నారు.
Link to comment
Share on other sites

  • Replies 107
  • Created
  • Last Reply
జనసేనకు షాకిస్తున్న టీడీపీ, వైసీపీ నేతలు
02-08-2018 12:08:02
 
636688084834521482.jpg
  • తాడేపల్లిగూడెం జనసేనలో అభిమాన ధనం
  • నాయకత్వమే అసలు లోపం
  • ప్రజారాజ్యంలా పెద్దలు ఏరీ..?
  • క్రియాశీలక కార్యకర్తల కొరత
 
తాడేపల్లిగూడెం: జిల్లాలో జనసేన పవన్‌ కల్యాణ్‌ పర్యటనతో ఆ పార్టీ నాయకుల్లో అభిమానుల్లో మంచి ఊపు వచ్చింది. మూడు రోజులపాటు జిల్లాలోనే ఉండి వివిధ వర్గాలతో సమీక్షలు నిర్వహించారు. అధినాయకుని పోరాట యాత్రను జయప్రదం చేసేందుకు పార్టీ అభిమానులు, నాయకులు తాడేపల్లిగూడెంలోనూ సమీక్ష నిర్వహించారు. పార్టీ జిల్లా సమీక్షలకు, నియోజకవర్గ సమావేశాలకు గూడెం వేదిక అవుతోంది. ఇక్కడ పవన్‌ అభిమానులు పుష్కలంగా ఉన్నారు. ఎక్కడా లేనివిధంగా పవన్‌ కల్యాణ్‌ విగ్రహాన్ని అభిమానులు తాడేపల్లిగూడెంలో నెలకొల్పి తమ ప్రేమాభిమానాలు చాటుకున్నారు. పార్టీలో అభిమానులకు ఇక్కడ కొదువ లేదు. ఎక్కడ సమావేశాలు జరిగినా సరే తాడేపల్లిగూడెం నుంచి ర్యాలీగా అభిమానులు బయలుదేరి వెళ్లడం సర్వసాధారణం.
 
అయితే నాయకత్వలేమి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. కేవలం అభిమానులే పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇటీవల జనసేన పార్టీలో మాజీమంత్రి తనయుడు, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా నవీన్‌ ఆ పార్టీలో చేరారు. తాడేపల్లిగూడెం కేంద్రంగానే పార్టీ కార్యాకలాపాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అంతకుమించి నాయకులెవరూ పార్టీలో చేరలేదు. గత ఎన్నికల్లో బీజేపీ గెలుపులో జనసేన అభిమానుల పాత్ర అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా వారిదే హవా. యువత పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. అదే సందడి ఇప్పుడు కూడా అభిమానుల్లో కనిపిస్తోంది. కానీ పార్టీని నడిపే నాయకత్వం మాత్రం కొరవడింది.
 
ప్రజారాజ్యంలో రాజకీయ నాయకులే పెద్ద దిక్కు
ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ముందస్తుగా రాజకీయ నాయకులు చేరారు. రాజకీయ సందడి అప్పట్లో పెద్దగా ఉండేది. ఒకవైపు ఈలినాని, మరోవైపు తోట గోపిలు ఎవరికి వారే పార్టీకోసం పాటు పడేవారు. వారి అనుచర గణం కూడా పార్టీని ముందుండి నడిపింది. జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ నెగ్గిన ఏకైక నియోజకవర్గం తాడేపల్లిగూడెం. అటువంటిది జనసేన పార్టీకి వచ్చేసరికి అభిమానులు ఉన్నా సరే నాయకత్వ లోపం కనపడుతోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడు జనసేన భవితవ్యంపై సమాలోచనలు చేశారు. అయితే ఇక్కడ అభిమానులు కంటే రాజకీయంగా క్రియాశీలంగా ఉండే కార్యకర్తల కొరత ఉందన్న విషయాన్ని ఆ సమావేశంలో తేల్చారు. జనసేన అభిమానులు కూడా నియోజకవర్గంలోని పలువురు నాయకులను సంప్రదింపులు జరిపారు. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నాయకులను కలిశారు. అయినా వారినుంచి ఎటువంటి సానుకూలత లభించలేదు.
 
ప్రత్యర్థి పార్టీల వైపే చూపు
జనసేన కార్యకర్తలు, అభిమానులు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల కదలికలపైనే చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో టిక్కెట్‌ ఖరారును బట్టి జనసేనలోకి ఆ పార్టీ నాయకులు వచ్చే అవకాశం ఉంటుందన్న ఆశలు అభిమానుల్లో ఉంది. అదే ఇప్పుడు జనసేనను ముందుకు నడిపిస్తోంది. మున్ముందు నాయకత్వం కూడా బలపడుతుందన్న ఆశతో జనసేన అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా రాజకీయ నాయకులే చొరవచూపి పార్టీలోకి వచ్చే సంకేతాలు ఇక్కడ కనిపించడం లేదు.
Link to comment
Share on other sites

మనస్థాపంతో పదవికి రాజీనామా చేసిన టీడీపీ మహిళా నేత
02-08-2018 11:53:31
 
636688076120390461.jpg
పెనుగొండ, ప.గో.: పెనుగొండ మండల పరిషత్‌తో ఏడాదిన్నర కాలంగా సాగుతున్న పదవిపోరుకు తెరపడింది. ఎంపీపీ సురేఖకు వ్యతిరేకంగా గురువారం అవిశ్వాస తీర్మానంపై చర్చకు పిలుపునిచ్చారు. పెనుగొండ ఎంపీపీ సురేఖ బుధవారం సాయంత్రమే ఏలూరులో జడ్పీ సీఈవో నాగార్జున సాగర్‌కు రాజీనామా పత్రాన్ని అందించారు. పదవిలో కొనసాగడానికి హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేక పోవడంతో అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందుగానే ఆమె రాజీనామా పత్రం సమర్పించారు.
 
పదవి పంపకంపై వివాదం
ఎంపీపీ పదవిపై తెలుగు దేశంలో రెండువర్గాలు సిగపట్లు పట్టుకొన్నారు. ఎంపీటీసీల ఎన్నిక అనంతరం ఎంపీపీ పదవిపై ఇరువర్గాలు పోటీ పడ్డాయి. దీంతో మొదటి రెండున్నర సంవత్సరాలు పల్లి జూలీ సురేఖ, అనంతరం రెండున్నర సంవత్సరాలు చీకట్ల భారతిలు పదవిలో కొనసాగేలా పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. అయితే రెండున్నర సంవత్సరాలు అనంతరం సురేఖ రాజీనమా చేయడానికి ససేమిరా అనడంతో ఎంపీపీ పదవిపై చిక్కుముడి పడింది. ఎన్నికలకు ముందుగా తననే తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించారని ఎన్నికల ముందు ఎటువంటి ఒప్పందం లేదని రాజీనామా చేయడం కుదరదని చెప్పి పదవిలో కొనసాగారు. పంచాయతీ రాజ్‌ చట్ట ప్రకారం ఎన్నికైన అభ్యర్థిపై నాలుగు సంవత్సరాలు వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు లేపోవడంతో ఎంపీటీసీలు ఈ నాలుగు సంవత్సరాలు వేచి చూశారు.
 
జులై 4న ముగిసింది. దీంతో జూలై 5న కొవ్వూరు ఆర్‌డీవోకు అవిశ్వాస తీర్మానంపై లేఖ అందించారు. దీనిపై స్పందించిన ఆర్‌డీవో ఆగస్టు 2 అవిశ్వాస తీర్మానానికి ఆదేశాలు జారీ చేశారు. అవిశ్వాస తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ ఎంపీపీ సురేఖ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తొలి దశలోనే కోర్టు ఈ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. దీంతో ఆమె రాజీనామాకే నిర్ణయించుకుని బుధవారం సీఈవోకు రాజీనామా సమర్పించారు. ఎంపీపీ పదవికి ఎన్నిక నిర్వహించడానికి ఆదేశాలు జారీ అయ్యే వరకు వైఎస్‌ ఎంపీపీ చీకట్ల భారతి ఇన్‌చార్జి ఎంపీపీగా కొనసాగుతారు.
 
 
అవమానాలు తట్టుకోలేకనే : ఎంపీపీ సురేఖ
తనపై అకారణంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని,దళితవర్గానికి చెందడంతో అవమానాలు పాలు చేశారని దీంతో మనస్తాపం చెంది ఎంపీపీ పదవికి రాజీ నామా చేసి నట్టు పెనుగొండ ఎంపీపీ పల్లి జూలీ సురేఖ తెలి పారు. బుధవారం సాయంత్రం ఏలూరు జడ్పీ సీఈవో నాగార్జున సాగర్‌కు రాజీనామా పత్రాన్ని అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాము, తన తండ్రి పల్లి వర ప్రసాద్‌ బాబూరావు 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటూ అన్ని ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశామన్నారు. తాను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఎంపీపీ పదవి నుంచి దించి వేయడానికి మొదటి నుంచీ ప్రయత్నాలు చేస్తున్నా రన్నారు. తనకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి తెలిపినా పట్టించుకోలేదని ఆవే దన వ్యక్తం చేశారు. చివరకు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారని చెప్పారు. దీంతో తాను మనస్తాపం చెంది ఒకరోజు ముందుగానే రాజీనామా చేయాలని నిర్ణయించుకుని రాజీనామా చేసినట్టు ప్రకటించారు.
Link to comment
Share on other sites

మౌనమే ఆయన ఆయుధం.. ఈ టీడీపీ ఎమ్మెల్యే స్టైలే వేరు..!
03-08-2018 12:04:37
 
636688946790777735.jpg
భీమవరం: రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే భీమవరం అసెంబ్లీలో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ప్రతిపక్షం అధికారపక్షంపై నిరంతరం ఆరోపణలు చేస్తున్నా అధికార పక్ష సభ్యులు కిమ్మనడం లేదు. తమ పనేదో తాము చేసుకుంటూ ఆ విమర్శలతో తమకేం సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు 2009లో కాంగ్రెస్‌ తరపున గెలిచారు. 2014లో తెలుగుదేశం తరపున గెలిచారు. అయితే ఈ రెండు పాలనా కాలాల్లోనూ విపక్షాల విమర్శలకు ఆయన మాత్రం ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. ఈ నాలుగేళ్ళలో పలుమార్లు ప్రతిపక్ష వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విమర్శలు చేసినప్పుడు ఆయన ఖండించిన దాఖలాలు కూడా లేవు. మున్సిపాలిటీలో కూడా ప్రతిపక్షం ఆరోపణలు చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఎమ్మెల్యే సీరియస్‌గా స్పందించిన సంఘటనలు లేవు.
 
మే నెలలో ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో ఎమ్మెల్యేపై విమర్శలు చేశారు. మంచినీటి ప్రాజెక్టుల భూసేకరణ, యనమదుర్రు డ్రైయిన్‌ కాలుష్యం, అభివృద్ధి, కంపోస్టు యార్డు సమస్య, 9,500 గృహాల నిర్మాణం ప్రాజెక్టులపైనా జగన్‌మెహన్‌రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారం రోజుల కిందట జనసేన నేత పవన్‌కల్యాణ్‌ కూడా భీమవరం సభలో ఎమ్మెల్యేపైన, తెలుగుదేశం నాయకులుపైనా తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. మంచినీటి ప్రాజెక్టు కోసం అనాకోడేరు సరిహద్దులో చేపట్టిన భూసేకరణ వ్యవహారంపై పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యే పేరు ప్రస్తావిస్తూ విమర్శించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే ఒక్కమాట కూడా అనలేదు. అనుచరులు, పార్టీ నాయకులు దీనికి స్పందించాలని కోరినప్పటికి ఆయన చిరునవ్వుతోనే సమాధానం చెప్పారట.
 
ఎన్నికల వేళ వ్యూహాత్మకం..!
మంచినీటి పథకంపై చేసిన ఆరోపణలపై మాత్రం ఆయన పార్టీ నాయకుల వద్ద ఖండించినట్లు సమాచారం. అప్పట్లో రైతుల అభీష్టం మేరకే ప్రభుత్వం వదిలివేసిన 30 ఎకరాల భూమిని ఎకరం రూ.10 లక్షలు విలువ ఉండగా అదనంగా రూ.2 లక్షలు జోడించి రైతులు సంతృప్తి చెందాకే ఆ భూమిని తీసుకున్నానని, కానీ 60 ఎకరాలు భూమి అంటూ అవాస్తవాలను జగన్‌కు, పవన్‌కు వివరించడం వల్ల వారు కూడా వాస్తవాలకు దూరంగా మాట్లాడారని పార్టీ నాయకుల వద్ద అన్నారట. అయితే ఎన్నికల వేళ మాత్రం తన రాజకీయ ఎత్తుగడలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని ఆయన అనుయాయలు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

మరో పదిరోజులు అక్కడి నుంచే పవన్‌ రాజకీయ వ్యూహం అమలు
03-08-2018 12:06:52
 
636688948139010041.jpg
భీమవరం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భీమవరం రానున్నారు. మరో 10 రోజుల పాటు భీమవరం కేంద్రంగానే తన ప్రజా పోరాటయాత్ర పేరుతో రాజకీయ వ్యూహాలను అమలు చేయనున్నారని పార్టీ నాయకులు ప్రకటించారు. 4వ తేదీ సాయత్రం భీమవరం చేరుకుంటారని 13వ తేదీ వరకు భీమవరం పట్టణ శివారు కల్యాణ మండపంలో ఉంటారని ఆ పార్టీ నాయకులు యాతం నగేష్‌, బొమ్మదేవర బన్ను, మల్లినీడి తిరుమలరావు (బాబి)లు తెలిపారు. గత నెల 23 నుంచి 4 రోజుల పాటు భీమవరంలోనే పవన్‌ మకాం వేసిన సంగతి తెలిసిందే. భీమవరం, ఉండి నియోజకవర్గాల నుంచి మాత్రమే ప్రజా పోరాట యాత్రలు నిర్వహించారు. తాజాగా ఈ నెలలో 10 రోజులు కార్యక్రమాలు కొనసాగింపు భీమవరంలోనే ఉంటుంది. ఇక్కడ మకాం వేయడంతో పాటు సమీక్షలతో పాటు మిగిలిన 13 నియోజకవర్గాలలో యాత్ర నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ భీమవరం చేరుకునేలా కార్యక్రమం ఉంటుందన్నారు.
 
తాజాగా వస్తున్న రాజకీయ మార్పులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇక్కడి వేదిక ఉపయోగపడుతుందని అంటున్నారు. విద్యాసంస్థలు, యువత, మహిళలు, వివిధ వృత్తి సంఘాల వారు పవన్‌కు వారివారి సమస్యలను ఇప్పటికే విన్నవిస్తు వచ్చారు. ఇటువంటి విధానం మంచి ఫలితాలు ఇవ్వడంతో రాబోయే కాలంలో భీమవరం వేదికను చక్కగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. దీనికి తోడుగా యువతలో మార్పు కనిపిస్తుందని మొన్నటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీ వెనుక ఉన్న కొంత మంది యువత పవన్‌వైపు వస్తున్నారని ఇది తమకు సానుకూలమైన అంశమని జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పవన్‌కల్యాణ్‌ జిల్లా పోరాటయాత్ర భీమవరం నుంచి కొనసాగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Link to comment
Share on other sites

టీడీపీ సిట్టింగ్ స్థానంలో జనసేన, వైసీపీకి కష్టాలేనా..?
04-08-2018 12:14:01
 
636689816431708089.jpg
పాలకొల్లు, ప.గో.: ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ప్రధాన రాజకీయ పక్షాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది. పార్టీల వారీగా కూడికలు, తీసి వేతలతో తమ పార్టీ తరఫున ఏ అభ్యర్థిని నిలబెడితే గెలుపు సాధ్యమౌతుందా అని గణాంకాలు వేస్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో అధికార టీడీపీలో ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు పోటీలేదు. పార్టీ పరంగానూ, కేడర్‌ పరంగానూ ఇబ్బందులు ఏమీలేవు.
 
జనసేన విషయానికి వస్తే ఇక్కడ పార్టీలో యువత శాతం అధికంగా ఉండగా సీనియర్‌ కేడర్‌ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, జనసేన అభ్యర్థిగా మరో పార్టీలో కీలకంగా ఉన్నవారిని ఆహ్వానిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పాలకొల్లు పట్టణంలోని ఒక బీజేపీ నాయకుని వద్దకు వచ్చి జనసేనలో చేరమని చెప్పడం గమనార్హం.
 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్టు పోటీ గట్టిగానే ఉంది. ఇక్కడ వైసీపీ నాయకులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నప్పటికీ, ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి చెందిన ఒక నేతను పార్టీలోకి తేవడానికి ఆ పార్టీ ఉన్నత శ్రేణి నాయకులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వైసీపీకి ఇక్కడ అభ్యర్ధుల కొరత లేనప్పటికీ టిక్కెట్టు కోసం పోటీ గట్టిగా ఉంది.
 
కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ రాష్ట్రంలో పొత్తులు లేకుండా పోటీ చేస్తే పాలకొల్లు నియో జకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్థుత బీజేపీ నాయకుడు డాక్టర్‌ సిహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జి) పేరు వినిపిస్తున్నది. అయితే ఒకవైపు జనసేనానులు, మరోవైపు వైసీపీ వర్గీయులు డాక్టర్‌ బాబ్జీని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో డాక్టర్‌ బాబ్జీ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
 
రాష్ట్ర విభజన ఆశాస్త్రీయంగా జరిగిందనే కారణంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను పక్కన పెట్టారు. రాష్ట్రంలో ఒక్క టిక్కెట్టు కూడా పొందలేని కాంగ్రెస్‌ ఇప్పుడు కొత్త నెత్తురు నింపుకుని పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం తేవడానికి ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఆ పార్టీలో నాయకత్వ లేమితో ఇబ్బందులు పడుతుండగా ఎన్నికల సమయానికి బలమైన అభ్యర్థిని బరిలోకి తెస్తామని ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. మొత్తంగా పాలకొల్లు నియోజకవర్గంలో ఐదు పార్టీల కదలికలలో వివిధ స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
Link to comment
Share on other sites

నిడదవోలు నియోజకవర్గంలో నారా లోకేష్ సుడిగాలి పర్యటన
04-08-2018 17:41:45
 
636690013064232366.jpg
ఉండ్రాజవరం/పశ్చిమగోదావరి: నిడదవోలు మండలంలో పర్యటించేందుకు వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఉండ్రాజవరం మండలంలో నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. పాలంగి గ్రామం నుంచి వేలివెన్ను వరకు భారీ సంఖ్యలో కార్యకర్తలు మంత్రి వెంట ర్యాలీగా తరలివచ్చారు. దారిలో మహిళలు ఆపి తమ సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం ఉండ్రాజవరంలో గ్రామ మాజీ సర్పంచ్‌, టీడీపీ నాయకుడు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు.
 
ఉండ్రాజవరంలో పసుపు బెలూన్‌తో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం కార్యకర్తలను ఆకట్టుకుంది. మహిళలు పసుపురంగు చీరలు ధరించి మంత్రికి పూవులు జల్లుతూ స్వాగతం పలికారు. గ్రామంలో ఎన్‌టీఆర్‌ విగ్రహానికి, అంబేద్కర్‌ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మోర్త, దమ్మెన్ను మీదుగా వేలివెన్ను గ్రామానికి ర్యాలీ కొనసాగింది. వేలివెన్నులో దళితవాడలో ఉన్న అంబేద్కర్‌, జగజ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు ఆయన పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మోర్తలో వేలివెన్ను గ్రామంలో మహిళలు పూల వర్షంతో మంత్రికి స్వాగతం పలికారు. దారిపొడవునా హారతులు ఇచ్చారు.
 
 
ప్రారంభోత్సవాలు
mimi-300.jpgఉండ్రాజవరం గ్రామంలో ఉండ్రాజవరం నుంచి చిలకపాడు వెళ్లే రూ. 70లక్షలతో నిర్మించిన మెటల్‌ రోడ్డును మంత్రి లోకేష్‌ ప్రారంభించారు. వేలివెన్ను గ్రామంలో దళిత వాడలో రూ. 25 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ప్రారంభించి, సీతారామపురం ఏరియాలో అండర్‌ డ్రైయినేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. రూ. 58 లక్షలతో నిర్మించిన సొసైటీ గొడౌన్‌ సముదాయాన్ని గ్రామంలో శివారున రూ. 25లక్షలతో నిర్మించి న సాలిడ్‌వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్డును మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా ఒక కోటి 68 లక్షలతో నిర్మించిన మంచినీటి ట్యాంక్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, శశి విద్యా సంస్థల అధినేత బూరుగుపల్లి గోపాలకృష్ణ, జడ్పీటీసీ కొమట్లపల్లి వెంకట సుబ్బారావు, ఎంపీపీ తొర్లపాటి సర్వేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షుడు బూరుగుపల్లి శ్రీనివాస్‌, బలుసు వెంకటరత్నం, టీడీపీ మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, తహసీల్దార్‌ జాన్‌ రాజు, ఎంపీడీవో వీరాస్వామి, మండవల్లి సు బ్బారావు, బూరుగుపల్లి శ్రీనివాస్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 
రూ. 125 కోట్లతో అభివృద్ధి
నిడదవోలు రూరల్‌: ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అభివృద్ధి పనులకు నిధుల కోసం నిత్యం తన వెంట పడుతుంటారని మంత్రి లోకేష్‌ అన్నారు. నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి లోకేష్‌ రూ.7.60 కోట్లతో నిర్మించిన రావిమెట్ల మీదుగా తాళ్ళపాలెం ప్రత్తిపాడు రోడ్డును, తాడిమళ్ళలో రూ.13 లక్షలతో నిర్మించిన గ్రామ సమాఖ్య భవనాన్ని, రూ. 25లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవ నాన్ని ప్రారంభించారు.
 
 
వేలివెన్ను నుంచి సమిశ్రగూడెంలో అభివృద్ధి చేసిన చెరువు పనులను పరిశీలించి అనంతరం తాడిమళ్ళకు చేరుకుని, పలు అభివృద్ధి పనులను ప్రారంభించి అక్కడ సదస్సులో నారా లోకేష్‌ మాట్లాడారు. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నియోజకవర్గాన్ని రూ. 65 కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. మరో రూ.45 కోట్లతో నియోజక వర్గంలోని ప్రతీ ఇంటికి కుళాయి నీరు అం దించేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. ఒక్క తాడిమళ్ళలోనే రూ. 3.79 కోట్లతో 587మంది రైతులకు రుణమాఫీ చేశామన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్‌ పెనుగొండ సుబ్బలక్ష్మీ భరణి కోరిక మేరకు తాడిమళ్ళ- చిక్కాల రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయింపునకు అనుమతినిచ్చారు.
Link to comment
Share on other sites

లీన్‌స్వీప్ చేసిన జిల్లాలో టీడీపీకి కొత్త టెన్షన్
05-08-2018 12:09:06
 
636690677446483163.jpg
ఏలూరు: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు గడువు దగ్గర పడుతోంది. రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పక్షాలన్నీ బూత్‌ కమిటీలను ఏర్పాటుచేసి మరీ క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షణ చేపడుతున్నాయి. ఓటర్లను నేరుగా పోలింగ్‌ కేం ద్రాలకు చేరేలా ఇప్పటి నుంచే అప్రమత్తం చేస్తున్నారు. ఎన్ని కల నిర్వహణలో అందెవేసిన చేయి అయిన తెలుగుదేశం పార్టీ జిల్లాలో కొత్త సందిగ్దంలో పడింది. అదికూడా కొత్తగా చేరిన ఓటర్లు, ఓటర్ల జాబితా నుంచి గల్లంతైన ఓటర్ల సంఖ్య పై ఆందోళన చెందుతోంది.
 
2014 నాటికి ఎన్నికల ఓటర్ల జాబితాలో ఉన్నవారి సంఖ్యకు, ప్రస్తుతం పెరిగిన ఓటర్ల సంఖ్యతో పోలిస్తే 44 వేలకుపైగానే ఓట్లు పెరిగాయి. కాని ఇదే తరుణంలో ఏలూరు నియోజకవర్గంలో 29 వేలకుపైగా ఓట్లు నాలుగేళ్ల వ్యవధిలోనే గల్లంతయ్యాయి. అదికూడా జిల్లా కేంద్రం కావడం, రాజకీయంగా చైతన్యం కలిగి ఉండడం, ప్రధాన పార్టీల కసరత్తు అంతా ఈ కేంద్రంగానే ఉండడం ఆశ్చర్యకర పరిణామం. సాధారణంగా ప్రధాన పక్షాలన్నీ ఎన్నికలకు గడువు సంవత్సరం ఉందనగానే కొత్త ఓటర్లను జాబితాలో చేర్పించేందుకు పోటీలు పడతాయి. ఈసారి కూడా అదే జరిగింది. 2017 చివరి నాటికి కొత్త ఓటర్ల చేర్పింతకు వీలుగా అన్ని పక్షాల మధ్య పోటీ కొనసాగింది. కాని ఏలూరు నియోజకవర్గంలో మాత్రం ఎన్నికల ఓటర్ల జా బితాలో పెనుమార్పులు జరిగిన విషయాన్ని ఆఖరి క్షణంలో గుర్తించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరో నాలుగు నియోజకవర్గాల్లో కూడా 2014లో ఓటర్ల సంఖ్యకంటే ఈసారి తగ్గుముఖం పట్టినట్టు స్పష్టమైంది. ఇదెలా సాధ్య మైందంటూ కసరత్తు చేయనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఒక నియోజకవర్గంలో ఓటర్లు తగ్గుముఖం పట్టడం ఇదే ప్రఽథమం అని అధికారులు సైతం చెబుతున్నారు.
 
ఏ నియోజకవర్గంలో ఎలా..
జిల్లావ్యాప్తంగా మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉం డగా, వీటిలో 10 నియోజకవర్గాల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల చొరవ, మరోవైపు సామాజికవర్గాల వారీగా పార్టీ కార్యకర్తల ఉత్సాహం కలబోసి సంఖ్య పెరిగేందుకు దారితీసింది. ఈ లెక్కన పోలవరం నియోజకవర్గానిదే అన్ని నియోజకవర్గాల కంటే పైచేయిగా కనిపించింది. 2014లో ఈ నియోజకవర్గంలో లక్షా 85 వేల 836 మంది ఓటర్లు ఉండగా, అదే ఈ ఏడాది తుది జాబితా వెలువరించే నాటికి ఈ సంఖ్య కాస్తా 2,29,398కి ఎగబాకింది. 43,855 మంది ఓటర్లు జాబితాలో కొత్తగా చేరారు. కాకపోతే విలీన మండలాలు తాజాగా గుర్తించడం, అక్కడి ఓటర్లను ఈ నియోజకవర్గంలో చేర్చడం దీనికి ప్రధాన కారణం. అధికారులు కూడా ఈ విషయాన్నే గుర్తు చేస్తున్నారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో సహా బూర్గం పాడులో కొంత భాగం 2014లో తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతంలో విలీనమయ్యాయి. అక్కడ ఉన్న ఓటర్లను పోలవరం పరిధిలోకి తెచ్చారు. అందుకనే ఇప్పుడు అక్కడి ఓటర్ల సంఖ్య అంతలా పెరిగిపోయింది.
 
చింతలపూడిలో 8,082, గోపాలపురంలో 9,679, దెందులూ రులో 7,883, ఉంగుటూరులో 301, తాడేపల్లిగూడెంలో 3,245, ఉండిలో 3,243, భీమవరంలో 3,071, పాలకొల్లులో 5,235, ఆచంటలో 347 మంది ఓటర్లు అదనంగా జాబితాలోకి ఎక్కా రు. పోలవరం తదుపరి స్థానం చింతలపూడి నియోజక వర్గానిదే. ఈ నియోజకవర్గంలో 2014లో 2,30,29గా ఉండగా, అదే 2018 నాటికి 2,38,111కు ఓటర్ల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో 2014లో మొత్తం ఓటర్ల సంఖ్య 28,12,472 ఉండగా, ఇప్పుడు తాజాగా 28,56,565కు పెరిగింది. అప్పటికీ, ఇప్పటికీ పెరిగిన ఓటర్ల వ్యత్యాసం 44 వేల 93గా తేలింది.
 
ఏలూరులో లెక్క మారింది..
జిల్లా కేంద్రంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పడిపోయిం ది. ఉద్యోగులు, విద్యాధికులు, వ్యాపారులు అత్యధికంగా నివ సించే ఈ ప్రాంతంలో ఓటర్ల సంఖ్య తగ్గుముఖం పట్టడం, అదికూడా వేల సంఖ్యలోనే ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకానొకప్పుడు ఏలూరు నియోజకవర్గంలో తగ్గిన ఓటర్ల సంఖ్య కేవలం 20 వేలుగానే ప్రాధమికంగా గుర్తించారు. కాని తుది జాబితా విడుదలైన తరువాత గాని అసలు విషయం బయటపడలేదు. ఈ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నిక ల నాటికి, ఇప్పటికి ఓటర్లు పెరగాల్సింది పోయి ఏకంగా రికార్డు స్థాయిలో పడిపోయింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఇదే విషయాన్ని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చారు. కేవలం కొంతమంది తమ ఓటు హక్కును నమోదు చేయించుకోకపోవడమే కారణంగా కనిపిస్తుందని, మరికొందరు జాబితాలో లేకపోయినా పెద్దగా పట్టించుకోని దాఖలాలు కనిపించడంలేదని, తనకు ఉన్న పరిధిలో విశ్లేషిం చారు.
 
జిల్లా కేంద్రం కావడంతో జనాభా సంఖ్య కూడా మిగ తా ప్రాంతాల కంటే అత్యధికమే. ఏం జరిగింది, ఎలా జరి గిందనేదే పెద్ద తలనొప్పిగా మారింది. ఏలూరు నియోజక వర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 1,93,979గా ఉండగా, తాజాగా సవరించిన ఓటర్ల జాబితాలో నమోదైన వారు 1,64,767 ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి తగ్గిన ఓట ర్ల సంఖ్య ఒకటో, రెండో కాదు.. కళ్లుతిరిగేలా 29,232. ఈ విషయాన్ని ఆలస్యంగా అందరూ గ్రహించారు. ఇదే నియోజ కవర్గం నుంచి పెద్దగా వలసలు కూడా లేవు. అలాంటిది పట్టణ జానాభా తగ్గుముఖం పట్టిందిలేదు. మరి ఓటర్ల సంఖ్య సుమారు 30 వేల వరకు పడిపోవడమే ఆశ్చర్యకర పరిణామం. మరే నియోజకవర్గంలో ఒక్క మాటలో చెప్పా లంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏలూరులోనే ఈ పరిస్థితి తలెత్తినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అది కూడా తగ్గిన సంఖ్యను తలచుకుంటేనే బెంబేలెత్తిపోతున్నారు. సాధారణంగా ఉన్న ఓటర్ల జాబితా సవరించినప్పుడు ఎక్క డైనా అరకొర మాత్రమే మార్పులు, చేర్పులు ఉంటాయి. అం దులోనూ తెలుగుదేశంకు పూర్తిస్థాయిలో కమిటీలు ఉన్నాయి.
 
వీటి పర్యవేక్షణలోనే అంతా నడపాలని భావిస్తున్నారు. అలాం టి తరుణంలోనే ఉన్న ఓటర్లలోనే 29 వేలకుపైగా తగ్గు ముఖం పట్టడాన్ని ఇప్పుడు అంచనా కట్టలేకపోతున్నారు. అస లు ఏం జరిగిందో తెలుసుకోవడానికి నానాతిప్పలు పడుతు న్నారు. ఏలూరుతోపాటు తణుకులో 5,865, నరసాపురంలో 8,224, నిడదవోలులో 2,390, కొవ్వూరులో 3,316 మంది ఓ టర్లు గతంతో పోలిస్తే ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో తగ్గి పోయారు. ఈ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యే లే ప్రాతినిధ్యం వహించడం ఒక విశేషమైతే, కొవ్వూరు నుంచి అబ్కారీ మంత్రి కేఎస్‌.జవహర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Link to comment
Share on other sites

సమర్థుడే... కానీ విశ్వాస ఘాతకుడు
06-08-2018 02:54:08
 
  • మాటలు కాదు... చేతలతో నిరూపించుకోవాలి
  • చంద్రబాబుపై ఎంపీ గోకరాజు విమర్శ
భీమవరం, ఆగస్టు 5: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సమర్థుడే.. రాష్ట్రానికి గొప్ప వ్యక్తి కూడా. కానీ ఒక సాధారణ స్థాయి నుంచి ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా ఎదిగిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ప్రభుత్వం నుంచి సహాయం పొందిన తరువాత, దానిని మర్చిపోయి తెల్లారిన దగ్గర నుంచి బీజేపీ ప్రభుత్వంపై తెలుగుదేశం నాయకులు ఒక దండకంలా విమర్శలు చేయడం న్యాయం కాదు. దీనిని విశ్వాసఘాతుకం అంటారు’’ అని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘నేషనల్‌ లీడర్‌ అవ్వాలంటే ఒకరిని దూషిస్తే అవ్వలేం. మన గొప్పతనాన్ని నిరూపించుకుని, నరేంద్ర మోదీ కన్నా గొప్పవాడు అనిపించుకోవాలి తప్ప మాటల యుద్ధంతో కాదు’’ అని అన్నారు. ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా ఖర్చు చేసిన చంద్రబాబు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఆయనకి సమర్థత లేదని ఎవరూ అనలేరన్నారు. కానీ ఎవరి వల్ల ఆ అభివృద్ధి చేశామన్న విషయాన్ని టీడీపీ నాయకులు చెప్పి ఉంటే ఎంతో కొంత నీతి ఉందని భావించే వాళ్లమన్నారు. కేంద్రం నుంచి ఉపాధి నిధులను పూర్తిగా వాడుకున్నది మన రాష్ట్రమేనన్నారు.
Link to comment
Share on other sites

హీటెక్కిన ఏపీ పాలిటిక్స్.. బీజేపీ, జనసేన అండ లేని టీడీపీ ఏం చేయబోతోందంటే...
06-08-2018 16:08:36
 
636691685149794229.jpg
ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో, వలస నేతలను చేర్చుకోవడంలో బిజీగా ఉన్నాయి. నేతల విమర్శలుప్రతివిమర్శలతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఇక అభ్యర్థుల విషయానికొస్తే.. ఆశావహులు అధిష్టానం దృష్టిలో పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులు ప్రచార రథాలను సిద్ధం చేయించే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఇక పలు సర్వే సంస్థలు ఇప్పటికే వాటి పని మొదలుపెట్టేశాయి. ఈసారి మీ ఓటు చంద్రబాబుకా, జగన్‌కా, పవన్‌కా అంటూ ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇది ఏపీలో బయటకు కనిపిస్తున్న రాజకీయ పరిస్థితి. ఇక పార్టీలు అంతర్గతంగా ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నాయి? ఏఏ పార్టీ ఏ సామాజికవర్గం అండ కోరుకుంటోంది? అంతర్గతంగా పార్టీలు అనుసరించబోతున్న వ్యూహాలేంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఏపీ ఓటర్ల మదిలో మెదులుతున్న వేళ ప్రత్యేక కథనం.
 
 
గత ఎన్నికలతో పోలిస్తే ఏపీలో టీడీపీ పరిస్థితి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ 2014లో బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు టీడీపీకి బద్ధ శత్రువులుగా మారాయి. అయినప్పటికీ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. బీజేపీ, జనసేన పార్టీలతో తెగతెంపుల వల్ల కాస్తోకూస్తో వాటిల్లే నష్టాన్ని కూడా ముస్లిం ఓటర్లు, దళిత ఓటర్ల అండతో నివారించవచ్చనేది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఏపీలో దాదాపు 25శాతం ఓటు బ్యాంకు దళితులదే కావడం గమనార్హం. ముస్లిం ఓటర్లు కూడా 11శాతం మంది ఉన్నారు. అంటే.. దాదాపు 35శాతానికి పైగా ఓటు బ్యాంకు దళిత, ముస్లిం ఓటర్లదే కావడం విశేషం. దీంతో 2019 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేందుకు టీడీపీ దళిత, ముస్లిం ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా చంద్రబాబు సారథ్యంలో ఏ పార్టీతో పొత్తు లేకుండా టీడీపీ తొలిసారి ఎన్నికల బరిలో నిలవబోతుండటం విశేషం.
 
 
ఇక ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ విషయానికొస్తే... జగన్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకే సిద్ధపడుతోంది. అయితే జగన్ అతి విశ్వాసం పార్టీకి నష్టం చేస్తుందనేది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన. ఏ ప్రతిపక్షమైనా అవకాశం ఉన్నప్పుడు ఇతర పార్టీలను కూడా కలుపుకుని ఎన్నికల సమరంలో నిలవాలని భావిస్తోందని.. జగన్ పార్టీకి అలాంటి అవకాశం వచ్చినప్పటికీ కాదనుకోవడం అతి విశ్వాసమేనని అంటున్నారు. 2014లో పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో లెఫ్ట్ పార్టీలు జగన్ పార్టీ వైపు చూశాయని, అయితే జగన్ పొత్తుకు సుముఖత చూపకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాయని ఏఎన్‌యూకు చెందిన ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. 2014 ఎన్నికల్లో మాదిరిగానే జగన్ పార్టీ మళ్లీ అతి విశ్వాసంతో ముందడుగు వేస్తే రాజకీయంగా నష్టపోక తప్పదని అభిప్రాయపడ్డారు. పవన్ వ్యక్తిగత జీవితంపై జగన్ చేసిన వ్యాఖ్యలు, కాపు రిజర్వేషన్లపై చేసిన ప్రకటన.. ఈ రెండు అంశాలు ఎన్నికల్లో వైసీపీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
 
జనసేన విషయానికొస్తే.. 2019 ఎన్నికల్లో పవన్ లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే.. జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జనసేనలో పవన్ మినహా చెప్పుకోదగ్గ నేతలెవరూ లేకపోవడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేసే విషయం. అభ్యర్థులను అప్పటికప్పుడు హడావుడిగా ప్రజలకు పరిచయం చేసి కేవలం అధినేత చరిష్మాతోనే గెలుస్తామని జనసేన భావిస్తే ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురుకాక తప్పదనేది రాజకీయ విశ్లేషకుల వాదన. కాంగ్రెస్, బీజేపీ కూడా ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఇస్తామనే వాగ్దానంతో కాంగ్రెస్, తాము న్యాయంగా ఏపీకి రావాల్సినవన్నీ ఇస్తే టీడీపీ మోసం చేసిందనే ఒకేఒక్క నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలో నిలవబోతున్నాయి. అయితే ఏపీలో బీజేపీ మినహా ఇతర పార్టీలన్నీ ప్రత్యేక హోదా నినాదంతోనే ఎన్నికల బరిలో నిలవబోతుండటం విశేషం.
Link to comment
Share on other sites

ఎన్నికల నాటికి వాళ్లంతా జనసేనలోకి వస్తారా..?
06-08-2018 12:43:30
 
636691562090781659.jpg
  • ప్రజారాజ్యం శ్రేణులే జనసేన గూటికి
  • తెరముందుకు రాని మరికొంతమంది నాయకులు
  • ప్రధాన పార్టీ నాయకుల్లో అలజడి
  • తీరంలో మారుతున్న రాజకీయ సమీకరణలు
నరసాపురం/ఏలూరు: రెండు నెలల క్రితం వైసీపీ అధినేత జగన్‌ పర్యటన,ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఇటీవల భీమవరం వచ్చి వెళ్లడం వంటి పరిణామాలు తీర ప్రాంత రాజకీయాలను వేడెక్కించాయి. జనసేన పార్టీ ఆవిర్భావం తరువాత నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రభావం పెద్దగా కనిపించలేదు. మెగా, పవన్‌ అభిమానులు మినహా ముఖ్య నేతలెవరూ జనసేన కోసం బయటపడలేదు. అయితే పవన్‌ జిల్లా పర్యటనతో నియోజకవర్గంలో జన సేనకు జైకోట్టే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. వీరిలో ఎక్కువుగా గతంలో ప్రజా రాజ్యంలో చురుగ్గా వ్యవహరించిన నేతలు, పార్టీ శ్రేణులే ఎక్కువుగా కనిపిస్తున్నారు. మండలంలోని సీతారాంపురానికి చెందిన కలవకొలను తులసి చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేయగానే ఆ పార్టీలో చేరి కీలక బాధ్యతలు నిర్వహించారు. జిల్లా కన్వీనర్‌గా కూడా కొనసాగారు. ప్రస్తుతం ఈయనే జనసేనలో జిల్లా బాధ్యతలను మోస్తున్నారు.
 
 
ఇక మైలా వీర్రాజు ప్రజారాజ్యం పార్టీలో కృష్ణా జిల్లా పెడన నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం వీర్రాజు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. కొన్ని రోజుల నుంచి నియోజకవర్గంలో ప్రచార బాధ్యతల్ని ప్రారంభించారు. వీరిద్దరితో పాటు డాక్టర్‌ ఇలపకుర్తి ప్రకాష్‌, డాక్టర్‌ కోటేశ్వరరావు, డాక్టర్‌ అప్పాజీలు కూడా జనసేనకు జై కొట్టారు. గత ఎన్నికల్లో పవన్‌ టీడీపీకి మద్దతు తెలపడంతో వీరు ముగ్గురు ఎన్నికల ప్రచారాల్లో కూడా పాల్గొన్నారు. ఇక కేబుల్‌ టీవీ అధినేత కోటిపల్లి వెంకటేశ్వరావు, అన్నపూర్ణ థియేటర్‌ అధినేత అందే కవి, బాపూజీలు కూడా పవన్‌ సమక్షంలో జనసేనలో చేరారు. గతంలో వీరు ప్రజారాజ్యంలో కీలకంగా వ్యవహరించిన వారే. ఇక మెగా, పవన్‌ అభిమానుల్లో ఎక్కువశాతం జనసేన వైపు నడుస్తున్నారు. వీరిలో చాలామంది ఇప్పటివరకు అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. దీంతో రెండు పడవలపై నడుస్తున్నారన్న విమర్శలు రావడంతో వీరు జనసేన వైపే కదిలారు.గతంలో వీరంతా ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా వ్యవహించిన వారే.
 
 
తెర వెనుక మద్దతు...
జనసేనకు తెర వెనుక నుంచి మద్దతు తెలుపుతున్న నాయకుల సంఖ్య కూడా ఎక్కువుగా ఉంది. కొందరు మెగా అభిమానులు స్థానిక నాయకులకు భయపడి ముందుకు రావడం లేదు. వెనుకనుంచి మద్దతు నిస్తున్నారు. ఇటీవల పవన్‌ భీమవరం వచ్చినప్పుడు వీరంతా కలిసేందుకు వెళ్లారు. ఈ పరిణామాలు ప్రస్తుతం వీరు కొనసాగుతున్న పార్టీ నేతల్ని అయోమయానికి గురి చేస్తున్నారు. ఎన్నికల నాటికి వీరు ఎటువైపు మొగ్గు చూపుతారోనన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. జనసేనకు మద్దతు తెలుపుతున్న నాయకుల్లో ప్రజా రాజ్యంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు తెరవెనుక ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి వీరు ఆ పార్టీలో చేరతారని వారి అనుయాయులు చెపుతుండటం గమనార్హం.
Link to comment
Share on other sites

  • 1 month later...
ఆ మూడు నియోజకవర్గాలపై టీడీపీ దృష్టి.. సీక్రెట్‌గా సర్వే
20-09-2018 12:01:21
 
636730416784783368.jpg
  • తెలుగుదేశంలో అభ్యర్థుల కసరత్తు
  • పార్టీ శ్రేణులతో సంప్రదింపులు
  • జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో సర్వే
  • పార్టీ క్రియాశీల కార్యకర్తలను కలుస్తున్న వేగులు
  • ఆశావహుల పేరుతో పార్టీ శ్రేణుల అంతరంగం సేకరణ
తాడేపల్లిగూడెం/ఏలూరు: సాధారణ ఎన్నికలకు తెలుగుదేశం సమాయత్తమవుతోంది. గెలుపు గుర్రాలను అన్వేషిస్తోంది. నియోజకవర్గాల్లో అంతర్గత సర్వేలను నిర్వహిస్తోంది. పార్టీ క్రియాశీల కార్యకర్తల నుంచి వివరాలను రాబడుతోంది. అధిష్ఠానం నియమించిన దూతలు ఇప్పుడు నియోజకవర్గాల్లో రహస్యంగా కేడర్‌ను కలుస్తున్నారు. కొందరు ఆశావహుల పేర్లను ప్రస్తావిస్తున్నారు. వారిలో ఎవరైతే బాగుంటుంద న్న సమాచారాన్ని రాబడుతున్నారు. గెలుపు ఎవరికి దక్కుతుంది. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారని భావిస్తున్నారు? అన్న ప్రశ్నలను పార్టీ కేడర్‌ వద్ద అధిష్ఠాన దూతలు సంధిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ను సంప్రదింపులు జరిపారు. ముఖ్యమైన కార్యకర్తలు, నాయకులను కలుసుకున్నారు.
 
 
ఉంగుటూరు.. నలుగురి పోరు..
తాడేపల్లిగూడెం, నరసాపురం, ఉంగుటూరు తదితర నియోజకవర్గాలపై అధిష్ఠానం దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. జనరల్‌ స్థానాల్లో ఎవరికి టిక్కెట్‌ ఇస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి బాగుంటుందన్న విషయంపై దృష్టి సారించింది. పార్టీ శ్రేణుల మనోగతాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అధిష్ఠానానికి ఇప్పుడు క్రియాశీలకంగా మారింది. గత ఎన్నికల్లో అప్పటి మిత్రపక్షమైన బీజేపీకి తాడేపల్లిగూడెం స్థానాన్ని కేటాయించారు. అప్పట్లో స్థానిక టీడీపీ నాయకుల మధ్య వైరుధ్యాలు కూడా గూడెం నియోజకవర్గం బీజేపీకి దక్కేలా చేశాయి. తెలుగుదేశం మద్ధతుతో బీజేపీ గెలుపొందినప్పటికీ స్థానికంగా రెండు పార్టీల మధ్య దూరం కొనసాగుతూ వచ్చింది. పార్టీ శ్రేణులు రెండు పార్టీల మధ్య మధ్య నలిగిపోయాయి. తాజాగా తెలుగుదేశం, బీజేపీల మధ్య మిత్ర ధర్మం చెడిపోవడంతో రాబోయే ఎన్నికల్లో గూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనుంది.
 
అందుకు తగ్గట్టుగానే ఆశావహులు కూడా సిద్ధంగా ఉన్నారు. అధిష్ఠానం దిశానిర్దేశం చేసిన కార్యక్రమాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి టిక్కెట్‌ ఇస్తే తెలుగుదేశం విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి? ఎవరి అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారంటూ అధిష్ఠానం పంపిన దూతలు ఇప్పుడు పార్టీ కేడర్‌ వద్ద ప్రస్తావిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ముగ్గురు పేర్లతో ఇటువంటి సర్వే సాగింది. అందులో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, నియోజకవర్గ సమన్వయ కర్త ఈలి నాని, మునిసిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌లు ఉన్నారు. వారం రోజుల కితమే సర్వే బృందం నియోజకవర్గంలో పర్యటించింది.
 
 
ఉంగుటూరు నియోజకవర్గంలోనూ అధిష్ఠానం దూతలతో సర్వే నిర్వహించింది. రాజకీయాల్లో అనాదిగా ఉంగుటూరు నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్‌ ఉంది. ఎన్నికల్లో ఆ నియోజకవర్గం ఎవరి పక్షాన ఉంటే రాష్ట్రంలో వారిదే గెలుపు అన్న సెంటిమెంట్‌ అందరిలోనూ పాతుకుపోయింది. ఇప్పటిదాకా అటువంటి ఫలితాలు చవిచూశారు. దాంతో తెలుగుదేశం అధి ష్ఠానం ఉంగుటూరు నియోజకవర్గంపైనా ఆసక్తి కనబరుస్తోంది. అందులో భాగంగానే సర్వే నిర్వహించి వివరాలను రాబట్టింది. ఉంగుటూరు పరిధిలో నలుగురు పేర్లతో సర్వే సాగింది. వారిలో ప్రస్తుత ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఎంపీ మాగంటి బాబులు ఉన్నారు. అలాగే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు పేరుతో తాడేపల్లిగూడెంతోపాటు, ఉంగుటూరు నియోజకవర్గంలోనూ సర్వే సాగింది. మరోవైపు సామాజిక సమీకరణలను బేరీజు వేసుకుని ఎంపీ తోట సీతారామలక్ష్మి తనయుడు తోట జగదీష్‌ పేరును కూడా ఉంగుటూరులో చేర్చారు. నలుగురు అభ్యర్థిత్వాల్లో ఎవరు కావాలి. ఎవరైతే పార్టీకి విజయావకాశాలు ఉంటాయన్న దృష్టితో సర్వే సాగించారు.
 
 
నరసాపురంలో ఇరువురు కాకపోతే ఇంకెవరు ?
నర్పాపురం నియోజకవర్గంలో గెలుపు ఓటములు, ఓటింగ్‌ సరళిలో హెచ్చు తగ్గులు సామాజక సమీకరణలపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పటిదాకా గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ ప్రత్యర్థి సామాజిక వర్గ సమీకరణలపైనే ఆధారపడుతూ వస్తోంది. మరోవైపు నర్సాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోనే రెండు వర్గాలు ఉన్నాయి. ఒకరంటే ఇంకొకరికి పొసగదు. నియోజకవర్గ ముఖ్య నాయకుల మధ్య అంతరం అదే విధంగా ఉంది. ఇటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో తెలుగుదేశం అధిష్ఠానం నర్సాపురంలోనూ వివరాలను రాబట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ప్రస్తుత ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడుల పేరుతో సర్వే సాగింది.
 
 
వీరిద్దరిలో ఎవరు అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి సానుకూలంగా ఉంటుందన్న విషయంపైనే దూతలు దృష్టి పెట్టారు. వీరిద్దరు కాకపోతే ఇంకెవరైతే బాగుంటుందన్న కోణంలోనూ అంతర్గత సర్వే సాగింది. ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో ఆభ్యర్థుల పేరుతో సర్వే సాగింది. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో దూతలు సంప్రదించి నివేదికలు సిద్ధం చేశారు. ఎమ్మెల్యేల పని తీరు, వచ్చే ఎన్నికల్లో వారి భవితవ్యం ఎలా ఉంటుందనే విషయంలోనూ అధిష్టానం దృష్టి సారించింది. గతంలోనే కొన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి సర్వే పూర్తి చేసింది. తాజాగా మూడు నియోజకవర్గాల్లో చేపట్టారు.
 
Tags : telugudesam, secret survey

Advertisement

Link to comment
Share on other sites

3 hours ago, RKumar said:

Ee saari Narsapuram MP seat TDP Kaps ki isthene better. Any of present MLAs.

Kakinada Parliament lo raju population in 1998 20000. To30000..

Kaps 3 lakhsss alanti seat lo krishnam raju defeated mudragada ....

Mp ki caste pedda patinchukoruu mla la 

Link to comment
Share on other sites

19 minutes ago, Godavari said:

Kakinada Parliament lo raju population in 1998 20000. To30000..

Kaps 3 lakhsss alanti seat lo krishnam raju defeated mudragada ....

Mp ki caste pedda patinchukoruu mla la 

Brother appudud BJP kargil wave vundindi kada..

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Thota is rogue bridge between bjp-jsp and jaffas....he is the most corrupt fellow and worst guy...PK pavala knowledge ni eedu baga vadutunnadu....

Thota was the one that put case on Amaravati....He is meeting even jaffas and not sure PK is encouraging(I give benefit of doubt for now) this....

Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

Thota is rogue bridge between bjp-jsp and jaffas....he is the most corrupt fellow and worst guy...PK pavala knowledge ni eedu baga vadutunnadu....

Thota was the one that put case on Amaravati....He is meeting even jaffas and not sure PK is encouraging(I give benefit of doubt for now) this....

He contested as YSRCP MP from Eluru, tried for entry in TDP later.

Link to comment
Share on other sites

ట్రెండింగ్: ఎస్.. జనసేన ఆఫర్ ఇచ్చింది కానీ...: ఎమ్మెల్సీ
09-10-2018 14:59:24
 
636746940468036431.jpg
 
ఏలూరు: ఒకప్పుడు ఆయన సాధారణ లెక్చరర్‌ మాత్రమే. పేరొందిన కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ. ప్రభుత్వాసుపత్రికి మకాం మార్పు. తెలతెలవారకమునుపే ఆసుపత్రిలోని రోగులకు సేవ. తక్షణ వైద్యం అందేలా అందరి మెప్పు. రోజంతా ఇదే పని. ఇంతకంటే మించి ఆర్థికంగా స్తోమత లేని, పల్లెల నుంచి వచ్చిన పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు తన నివాసాన్నే హాస్టల్‌గా మార్చేసిన పెద్ద మనసు.
 
రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది.. అనుకున్నదే తడవుగా ఆయనను ఒప్పించి, మెప్పించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోటా కింద బరిలోకి దింపింది మార్కిస్టులు. యూటీఎఫ్‌ టీచర్స్‌ యూనియన్‌ది దీని వెనుక ఉన్న అసలుసిసలైన పాత్ర. మూడున్నరేళ్ళ క్రితం టీచర్స్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక. ఆనాడు ఆయన ఎన్నిక రాష్ట్రాన్నే ఊపేసింది. ప్రత్యర్థుల ఎన్నికల ఖర్చు ముందు ఒకటో వంతు కూడా భరించకుండానే నేరుగా ఉపాధ్యాయుల మద్దతును కూడగట్టుకున్న ఏకైక వ్యక్తి. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజాప్రతినిధిగా ఒకవైపు, సామాజిక సేవా కార్యకర్తగా మరోవైపు ఆయన దూసుకుపోతున్నారు. ఎన్నికల కాలం దగ్గరపడుతున్న వేళ ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి ఎమ్మెల్సీ రాము సూర్యారావు (ఆర్‌ఎస్ఆర్‌)పై పడింది. నలుగురి నోట వినిపిస్తున్న మంచితనం, సేవా దృక్ఫథం ఆయనకు ప్లస్‌ మార్కులు కాగా.. అంతకంటే మించి ఇలాంటి వ్యక్తిని బరిలోకి దింపితే పార్టీ ఇమేజ్‌ పెరగడంతో పాటు తటస్తంగా ఉన్న ఓటర్ల మద్దతును కూడగట్టుకోవచ్చుననే వ్యూహంలో పార్టీలు ఉన్నాయి.
 
 
అసలేం జరుగుతుందంటే..
వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాల్లో రాణించిన ఎమ్మెల్సీ రాము సూర్యారావును వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికే కొన్ని పార్టీల్లో లోతైన కసరత్తు. అంతకంటే మించి పట్టణ ప్రాంత ఓటర్లు అత్యధికంగా ఉన్న ఏలూరు నియోజకవర్గంలో తగిన అభ్యర్థుల కోసం అన్వేషిస్తూనే మరోవైపు రాము సూర్యారావు వైపు పార్టీలు దృష్టి పెట్టాయి. గడచిన ఆరు మాసాలుగా ప్రధాన రాజకీయ పక్షాల్లో ఈయన పేరు నానుతూనే వచ్చింది. ఎటుతిరిగి వామపక్షాల అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఆయనను నేరుగా దానికే కట్టిపడేయకుండా.. తమవైపు మొగ్గు చూపితే టికెట్‌ విషయాన్ని పరిశీలిస్తామని మధ్యవర్తుల ద్వారా సంకేతాలను అందించారు. అధికార పక్షం నుంచి బీజేపీ వరకు ఇలాంటి సంకేతాలు ఇచ్చిన పార్టీలే. ఏ పార్టీకి ఆర్‌ఎ్‌సఆర్‌ తన అభిప్రాయాలను ఇప్పటి వరకు వెల్లడించలేకపోయారు.
 
 
మా పార్టీలోకి రావచ్చుగా : జనసేన ఆఫర్‌
‘మీరు మా పార్టీలో చేరితే.. సాదరంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మిమ్మల్ని పూజిస్తాం’ ఇటీవల జనసేనాధిపతి పవన్‌ నేరుగా రాము సూర్యారావుకు ఇచ్చిన ఆఫర్‌ ఇది. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు, మారుతున్న పరిణామాలపై 15 రోజుల క్రితం ఆర్‌ఎస్ఆర్‌, పవన్‌కల్యాణ్‌ భేటీ అయినప్పుడు ఈ ఆఫర్‌ వచ్చింది. కాని దీనిపై ఇప్పటిదాకా ఎటూ తేల్చుకోలేకపోయారు. వాస్తవానికి వైసీపీ సైతం కొద్ది నెలల క్రితం ఆర్‌ఎస్ఆర్‌ అభ్యర్థిత్వంపై కాస్తాంత మొగ్గు చూపింది. కాని పరిణామాల క్రమంలో ఏలూరు నుంచి ఎమ్మెల్సీ ఆళ్ల నానిని నియోజకవర్గ కన్వీనర్‌గా ఇటీవలే ఖరారు చేసింది. వైసీపీలో ఉన్న సానుకూల దృక్ఫథాన్ని ఆర్‌ఎస్ఆర్‌ సకాలంలో వినియోగించుకోలేకపోయారు. తాజాగా బీజేపీ, జనసేన నుంచి సానుకూల సంకేతాలు రాగా వీటి పట్ల ఎమ్మెల్సీ ఆర్‌ఎస్ఆర్‌ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
 
 
అడిగిన మాట నిజమే..
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా కొన్ని పక్షాలు కోరిన మాట నిజమేనని ఎమ్మెల్సీ ఆర్‌ఎస్ఆర్‌ స్పష్టం చేస్తున్నారు. పరిశీలిస్తానని చెప్పానే తప్ప, ఎవరికీ నా అభిప్రాయాన్ని చెప్పనేలేదు. ‘నాకు ఉన్న ఆస్తి సేవ చేయడమే. పేద విద్యార్థులు సమాజంలో ఎదిగేలా ఉచితంగా చదువులు చెప్పించాను. ఆసుపత్రిలో పేద రోగులకే సేవలు చేశాను. పరిస్థితులను పూర్తిగా ఆకళింపు చేసుకున్నా’ ఆయన తెగేసి చెప్పారు. మారుతున్న రాజకీయ పరిణామాలపై దృష్టి లేకపోలేదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నాకైతే రాజ్యసభకు వెళ్ళాలన్న ఆకాంక్ష ఉంది. ఇది కూడా సేవల విస్తృతిలో భాగంగానే.. అంటున్నారు ఆర్‌ఎస్ఆర్‌ .
Link to comment
Share on other sites

పవన్ పశ్చిమగోదావరి జిల్లా యాత్రపై ప్రత్యేక విశ్లేషణ
11-10-2018 12:24:23
 
636748574639969307.jpg
ఏలూరు: దాదాపు నెల రోజులపాటు జనసేనాధిపతి పవన్‌ జిల్లాలో నిర్వహిం చిన ప్రజాపోరాట యాత్ర బుధవారంతో ముగిసింది. పవన్‌ యాత్ర రాజకీయాలను వేడెక్కించింది. విమ ర్శలు, ఆరోపణలు బుల్లెట్‌ల్లా దూసుకుపోయాయి. దీనికి విరుగుడుగా తెలుగుదేశం నుంచి ప్రతి ఆరో పణలు, విమర్శలు నేరుగా వెలువడ్డాయి. బీజేపీ, వైసీపీ పట్ల తనకేమీ మెతకతనం లేదని ప్రజలకు వివ రించేందుకు పవన్‌ పశ్చిమ యాత్రను కేంద్రంగా చేసు కున్నారు. తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్‌గా ఎంచుకున్నారు. వారి వ్యవహార శైలిపై విరుచుకు పడుతూనే 2014 ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు కుదు ర్చుకున్నది ఇందుకోసమా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
 
జిల్లాలో మూడు విడతలుగా సాగిన ప్రజా పోరాట యాత్రలో ప్రజలను కలుసు కోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరంలలో బస చేసి సుమారు 45 సంఘాలతో ముఖాముఖి చర్చలు జరి పారు.పార్టీ కేడర్‌ను ఈ యాత్రలో కొంత కదిలించారు. కాని నాయ కత్వ లోపం కొన్ని చోట్ల బయటపడింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్‌ ప్రసం గాలను ఆలకించేందుకు బహిరంగ సభలకు జనసేన ఆశించిన దానికంటే భిన్నంగా జనం హాజరయ్యారు. దీంతో కాస్తంత కుదుటపడిన పవన్‌కళ్యాణ్‌ నేరుగా విమర్శ నాస్త్రాలను తెలుగుదేశంపై ఎక్కువగా గురి పెట్టారు. ఇసుక, మట్టి మాఫియాలను ప్రస్తావించారు. బీజేపీతో తనకున్న బంధంపై మిగతా పార్టీలు చేస్తున్న విమ ర్శలను తిప్పికొట్టేందుకు పవన్‌ పశ్చిమ పర్యటనలో సాహసించారు.
 
చింతమనేనిపై చిందులు
ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌పై పవన్‌ నేరుగా చిందులు తొక్కారు. దాదాపు అన్ని బహిరంగ సభల్లోనూ చింతమనేని ప్రస్తావన చోటు చేసుకుంది. వీధి రౌడీ, ఆకు రౌడీ అంటూ సంభోదిస్తూనే చింత మనే నిపై విరుచుకుపడే ప్రయత్నం చేశారు. ఆయన సొంత నియోజకవర్గమైన దెందులూరులోనూ ప్రభాకర్‌ను తిట్టిపోశారు. దీనికి విరుగుడుగా చింతమనేని తగు రీతిలో బదులిచ్చారు. ‘నాణేనికి ఒకవైపే చూస్తున్నారు. రెండో వైపు చూస్తే తట్టుకోలేవు’ అంటూ చింతమనేని ఘాటుగా పవన్‌ వ్యాఖ్యలపై స్పందించినా.. యాత్ర ముగిసేంత వరకు చింతమనేనిపై నిప్పులు చెరు గుతూనే ఉన్నారు. తెలుగుదేశంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న ప్రభాకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తే రాజకీయంగా పార్టీ ఇమేజ్‌ మరింత పెరుగుతుందన్న సలహాదారుల సూచనలతోనే ఆయన ఈవిధంగా విరుచుకుపడినట్టు చెబుతున్నారు. కానీ ప్రతిగా చింతమనేని సంధించిన అంశాలకు మాత్రం పవన్‌ సూటిగా బదులు ఇవ్వలేకపోయారు.
 
తెలుగుదేశం అసలు లక్ష్యం
తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా ఎంచుకుని పశ్చిమ యాత్రలో పవన్‌ తనదైన రాజకీయ వ్యూహాన్ని నడి పారు. బీజేపీ, వైసీపీలను నేరుగానే పక్కనపెట్టి తెలు గుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ను లక్ష్యంగా ఎంచు కున్నారు. మంత్రి జవహర్‌, జడ్పీ చైర్మన్‌ బాపిరాజు, మిగతా ఎమ్మెల్యేలపైనా ఆయా నియోజకవర్గాల సభల్లో పవన్‌ నేరుగానే ఆగ్రహం ప్రదర్శించారు. ప్రతిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కౌంటర్‌ దాడి జరిపారు. కొన్ని చోట్ల తడబడడం, ఇంకొన్నిసార్లు పొరబడడంతో పవన్‌ ప్రసంగం వివాదాలకు దారితీసింది. కాని దీనిని పవన్‌ మాత్రం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనపడలేదు. ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్ళను ధ్వంసం చేస్తే పోలవరం నిర్వాసితులు పడుతున్న బాధ ఏ పాటిదో వారికి తెలిసి వస్తుందని పేర్కొనడం ద్వారా పవన్‌ నిర్వాసితుల మెప్పు పొందే ప్రయత్నం చేశారు.
 
అధికారంపై ప్రస్తావన
జనసేన మిగతా పార్టీల మాదిరిగా కాదు. ఇరవై ఐదేళ్ళపాటు పోరాటాలకు సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం.. అంటూ జిల్లాలో జరిగిన తొలి ఐదు బహిరంగ సభల్లో చెప్పిన పవన్‌కళ్యాణ్‌ ఆ తరువాత స్వరం మార్చారు. అధికారంలోకి రావడం.. రాకపోవడం అంతా దైవకృప అంటూ వేదాంతంలోకి వెళ్ళారు. ఇదే తరు ణంలో జనసేన అధికారంలోకి వస్తే.. కులాల వారీగా సెల్‌లు ఉండబోవని బుధవారం మరోమాట చెప్పడం ద్వారా పార్టీ అంతర్గత వైఖరిని చెప్పకనే చెప్పారు. జగన్‌ నాకేమైనా శత్రువా అనడం ద్వారా తాజా రాజకీయ పరిణామాలపై ఆచితూచి వ్యవహరించారు.
 
అందరికీ ధన్యవాదాలు
ప్రజా పోరాట యాత్రకు సహకరించిన వారందరికీ ఆ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్‌ తుల సీరావు బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల భేటికి, బహిరంగ సభకు కలిసి వచ్చిన ప్రజలకు, సభ, సమావేశాలకు సహకరించిన కనకరాజు సూరి,యిర్రింకి సూర్యారావు,యర్రా నవీన్‌లను అభినందించారు.
Link to comment
Share on other sites

నేను ముఖ్యమంత్రినో, లేక మంత్రినో తెలియడం లేదా: పవన్‌ను ప్రశ్నించిన మంత్రి
11-10-2018 12:26:57
 
636748577118760330.jpg
ఏలూరు: ‘నేను ముఖ్యమంత్రినో, లేక మంత్రినో తెలియకుండానే పవన్‌ కళ్యాణ్‌ నన్ను ముఖ్యమంత్రిగా సంబోధించి మాట్లాడు తున్నారని.. అవగాహన లోపమా, లేక ఎద్దేవా చేయ డానికా..అంటూ ఎక్సైజ్‌ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ సూటిగా ప్రశ్నించారు. కొవ్వూరు బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ముగిసిన వెంటనే ఆయన విమర్శలు, ఆరోపణలపై మంత్రి జవహర్‌ బుధవారం సాయంత్రం నేరుగా స్పందించారు. విలేకరులతో మాట్లాడారు. పవన్‌ కళ్యాణ్‌ అర్థం పర్దం లేకుండా మాట్లాడుతున్నారని, ఎవరి హోదా ఏపాటిదో తెలియని అమాయకత్వం అనుకోవాలా.. లేక కావాలని పలచన చేసే విధంగా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. కొవ్వూరులో డిగ్రీ కాలేజీ లేదంటూ పవన్‌ చేసిన విమర్శలను నేరుగా తిప్పికొట్టారు.
 
ఇరవై సంవత్సరాల క్రితమే ఏబీఎన్‌ డిగ్రీ కాలేజీ ఉండగా, కొవ్వూరుకు అతి సమీపాన ఉన్న రాజ మహేంద్రవరం లోను డిగ్రీ కాలేజీలు ఉన్నాయని, త్వరలోనే మరో డిగ్రీ కాలేజీ అదనంగా కొవ్వూరుకు వస్తుందని మంత్రి జవహర్‌ చెప్పారు. పవన్‌ సీఎం చంద్రబాబును, నారా లోకేష్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, అంతేతప్ప తెలుగుదేశం పనితీరును పరిగణనలోకి తీసుకోవడంలేదని తప్పుపట్టారు. తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలోనూ పవన్‌ ఇష్టాను సారంగా మాట్లాడితే బహిరంగ లేఖ రాసామని, దీనిపై పవన్‌కళ్యాణ్‌ బదులు ఇవ్వలేకపోయారని జడ్పీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు అన్నారు. కేవలం బీజేపీకి, జగన్‌కు అనుకూలంగా మారిన పవన్‌ నేరుగా తెలు గుదేశంపై విరుచుకుపడుతున్నారని స్పష్టమవు తుందని చెప్పారు. ‘ఎక్కడో కాదు... తెలుగుదేశం స్వయంగా కవాతుకు దిగితే కొవ్వూరు గోదావరి బ్రిడ్జిపై నాలుగున్నర కిలోమీటర్ల మేర జనంతో నిండిపోతుంది. అదికూడా మంత్రి జవహర్‌ నాయకత్వాన.. కొవ్వూరు వాసులతోనే’ అని బాపిరాజు సవాల్‌ విసిరారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...