Jump to content

West Godavari Politics


Recommended Posts

బీజేపీ సిట్టింగ్ స్థానంపై టీడీపీ, వైసీపీ దృష్టి
11-10-2018 12:18:10
 
636748570917329281.jpg
తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి: జిల్లా నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెం నియోజక వర్గంపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. ఆశావహులపై విడతల వారీగా సర్వేలు చేపడుతున్నాయి. తాజాగా తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బృందాలు తాడే పల్లిగూడెంలో సర్వేకు దిగాయి. 15 ఏళ్లుగా ఈ నియో జకవ ర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోవ డంతో ఈసారి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ముగ్గురు అభ్యర్థులు రేసులో ఉన్నారు. వారిపైనే దఫదఫాలుగా అధిష్టానం వివిధ రూపాల్లో సర్వే నిర్వహించి ఒక అంచనాకు వస్తోంది. గెలుపు గుర్రాల కోసమే అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లు ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో తెలుగుదేశంపార్టీ తమ అభ్యర్థులపై ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి నివేదికలను రాబట్టింది.
 
ఇతర ప్రాంతాలకు చెందిన వేగులు తాడేపల్లిగూడెంలో సర్వే నిర్వహిం చాయి. అధిష్ఠానానికి నివేదిక సమర్పించాయి. అప్పట్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సెలర్‌ లు వంటి ముఖ్యుల నుంచి సమాచారాన్ని రాబట్టాయి. ఎవరిని కోరుకుంటు న్నారనే విషయాన్ని సర్వే ద్వారా ఒక కొలిక్కి రాగలిగారు. ముగ్గురు అభ్యర్థుల్లోనూ ఎవరి బలమెంత అనే విషయం పైనే అధిష్టానానికి నివేదికలు వెళ్లాయి. సర్వే బృందాలు సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరపున జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, నియోజకవర్గ సమన్వయ కర్త ఈలినాని, మున్సిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ల పేర్లతో సర్వే చేపట్టారు. తాజాగా ఏడుగురు బృందం గూడెంలో మకాం వేసి వివరాలు సేకరించి పనిలో నిమగ్నమయ్యాయి. వీరంతా సామాజికవర్గాల ప్రముఖులతో పాటు, ఇతర వర్గాల నుంచి వివరాలను రాబడుతున్నారు. ఎవరికి టిక్కెట్‌ ఇస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? ప్రత్యర్థి పార్టీకి బలం చేకూరు తుందా? అనే అంశాలపైనా ఆరా తీస్తున్నారు.
 
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోనూ గుబులు
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇటీవల పార్టీ వర్గాలతో సర్వే నిర్వహించింది. ముఖ్యంగా ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త కొట్టు సత్యనారాయణ బలబలాలపై పార్టీ వర్గాలు దృష్టి పెట్టాయి. గడచిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు పనిచేసి ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న పార్టీ సానుభూతి పరులను కలుసుకుని వివరాలను రాబట్టారు. నియో జకవర్గంలో పార్టీ పరిస్థితి ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ప్రత్యక్షంగానే వర్గ విభేధాలు ఉన్నాయి. కలసికట్టుగా నాయకులు పయనించడం లేదు. ఎవరికి వారే వైఎస్‌ఆర్‌ జయంతి, వర్ధంతి వేడకులు నిర్వహిస్తూ వస్తున్నారు.
 
ఇప్పటిదాకా సమన్వయకర్త చేపట్టిన కార్యకలపాలకు రెండు వర్గాలు దూరంగా ఉంటున్నాయి. ఇది పార్టీ జయాపజయాలపై ప్రభావం చూపుతుందే మోనన్న ఆందోళన అధిష్టానంలో ఉంది. ఆ దిశగానే కొందరు ప్రముఖులు అధినేత వద్దే తాడేపల్లిగూడెంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిపై ఇటీవల కుండ బద్దలు కొట్టినట్టు సమాచారం. ఆ తర్వాతే సర్వే బృందాలు నియోజకవర్గంలో జల్లెడ పట్టాయి. పార్టీ సానుభూతి పరుల నుంచి వివరాలను సేకరించి అధిష్ఠానానికి నివేదిక సమర్పించాయి. ఇలా రెండు పార్టీలు నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి.
Link to comment
Share on other sites

  • Replies 107
  • Created
  • Last Reply
జగన్ పార్టీలో రహస్యం
13-10-2018 08:08:25
 
636750149069178724.jpg
  • ఎవరికీ తెలియదు.. చెప్పరు
  • అందరిదీ మూగ భాష
  • పెదవి దాటని మనోభావం
  • అన్వేషణ లేదు, అంతా సైలెంట్‌
  • అభ్యర్థి దొరకకా.. కావాలనే వ్యూహమా
  • నరసాపురం లోక్‌సభలో వి‘చిత్రం’
 
 
ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక ఓ దేవ రహస్యం. పేరు, ఊరు మచ్చుకైనా చెప్పరు.. తెలియదు. ఏ సామాజిక వర్గమో అంతకంటే తెలియదు. చెప్పే నాయకులంతా ప్రస్తుతానికి సైలెంట్‌. అధినాయకుడు మాట పెదవి దాటదు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. వైసీపీలో ఇదొక కొత్త గందరగోళం. నియోజకవర్గాల పార్టీ కన్వీర్లకు ఒక ఫజిల్‌. ఇంకో విశేషం ఏమిటంటే మాకు ఆ సీటు ఇవ్వండి అంటూ ఆశావహులెవరూ ఇప్పటివరకూ కన్నెత్తి చూడలేదు. ఇది మరో విచిత్రం. అసలు ఏమా నియోజకవర్గం.. ఏంటా కథ..
 
 
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
వైసీపీ రాజకీయాల్లో చిత్ర, విచిత్ర విన్యాసాలు. అంతకంటే మించి కనీవినీ ఎరుగని రాజకీయ పోకడలు. సీనియర్లకు కూడా తెలియని చిదంబర రహస్యం. ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. నెలల తరబడి సాగే సస్పెన్స్‌. పార్టీ అధ్యక్షుడు జగన్‌ను నోరు తెరిచి అడగాలంటేనే అందరికీ హడల్‌. సీనియర్లు సైతం ఎక్కడికక్కడే గప్‌చుప్‌. సమయం వచ్చినట్టు చూద్దాంలే అన్నట్టుగా చాటుమాటు వ్యవహారం. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఎంపికలో సాగుతున్న కథ ఇది. చాలా కాలం క్రితమే అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లను వైసీపీ ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులు వీరే అన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. వారందరికీ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. కార్యకర్తలతో కలిసిమెలిసి కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. తగ్గట్టుగానే అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు ఇప్పటికే తమ సత్తా ప్రదర్శించేందుకు నియోజకవర్గాల్లో పోటీలు పడుతున్నారు. ఓటర్లను కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే పోటీ చేయబోతున్నట్టు.. తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కాని అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లలో ఆలోచనలో మాత్రం ఒక అలజడి దాగి ఉంది. అంతకంటే మించి ఆర్థికపరమైన అవకాశాలపై ఉత్కంఠత లేకపోలేదు. ఎందుకనంటే.. పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఖరారైతే, భారమంతా ఆయనపై వేసి మిగతా పనులన్నీ తాము చేసుకోవచ్చేనది నియోజకవర్గాల కన్వీనర్ల ఆశ. కాని ఈ విషయంలో పార్టీ కింది స్థాయి నుంచి, పై స్థాయి వరకు నాయకత్వం అంతటా మౌనం దాలుస్తున్నారు. పెదవి విప్పడానికి సాహసించడం లేదు.
 
 
ఏమిటా రహస్యం.. ఎందుకని ..
పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిని ఖరారు చేయలేక వైసీపీ నాయకత్వం గత ఏడాది నుంచి ముప్పుతిప్పలు పడుతోంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థిని నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలనేది పార్టీ అధ్యక్షుడు జగన్‌ అంతర్గత ఆలోచన. ఈ ఆలోచనకు లోబడి ఎక్కడైనా అన్వేషణ జరుగుతుందా అంటే.. అదీలేదు. పోని పార్టీ నాయకత్వాన్ని మెప్పించి, ఒప్పించే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అదీలేదు. మరి ఎందుకని వైసీపీ నాయకత్వం నరసాపురం విషయంలోనే ఎందుకిలా మౌనం దాలుస్తుంది. ఒకవేళ అన్ని హంగులు కలిగిన అభ్యర్థి ఎవరైనా జగన్‌ మనసులో ఉన్నారా, సమయం వచ్చినప్పుడు బయట పెడదామనుకుంటున్నారా, అప్పటి వరకు అందరికీ ఇలాంటి సస్పెన్సే పెట్టబోతున్నారా .. అనేది ఇప్పుడు వైసీపీ నేతల మది తొలుస్తున్న ప్రశ్నలు.
 
 
2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త వంకా రవీంద్ర బరిలోకి దిగారు. కావాలని, అన్ని సమీకరణలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే రవీంద్రకు అవకాశం ఇచ్చారు. కాని ఈసారి మాత్రం రవీంద్ర పోటీకి సిద్ధంగానే ఉన్నా.. ఇప్పటివరకు ఆయనకు లోక్‌సభ నియోజకవర్గ కన్వీనర్‌ హోదా కల్పించలేదు. దీంతో రవీంద్ర మాత్రం పార్టీ నాయకత్వానికి విధేయుడిగా తన పని తాను చేసుకుపోతున్నారు. భీమవరంనకు చెందిన తవుడుకొట్టు సుబ్బరాజు పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది. కాని సుబ్బరాజు ఇప్పటికే భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకే మొగ్గు చూపుతూ వచ్చారు. అక్కడ వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను నేరుగా జగన్‌ ప్రకటించారు. ఇప్పుడు సుబ్బరాజును నరసాపురం లోక్‌సభ నుంచి పోటీలోకి దింపుతారనే ప్రచారం ఉన్నా.. తగినంత స్పష్టత లేదు. జగన్‌కు అనుకూలురైనవారు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి మాత్రమే అభ్యర్థి ఎంపిక చివరి క్షణంలో పూర్తి చేయడానికే జగన్‌ సానుకూలంగా ఉన్నారనేది మరో సమాచారం. ఎన్‌ఆర్‌ఐకి చెందిన ఒకరు ఈ విషయంలో జగన్‌ మదిలో ఉన్నారనేది ఇంకో ప్రచారం. కాని ఒకవైపు అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లను ఇప్పటికే ఖరారు చేయగా, అదే పార్లమెంటు విషయానికి వచ్చేసరికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారనేదే వైసీపీలో ఇప్పుడు అందరి ప్రశ్న. సమాధానం మాత్రం లేనేలేదు. ఈ విషయంపై పలుమార్లు పరోక్షంగా పార్టీ అధ్యక్షుడు జగన్‌ దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన నుంచి చిరునవ్వే సమాధానంగా వచ్చింది. అంతకంటే మించి ఎలాంటి చర్చకు ఆస్కారమే లేకుండా పోయింది.
 
 
ఎన్నికలు ముంచుకొస్తున్నా..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏలూరు లోక్‌సభలో కోటగిరి శ్రీధర్‌కు ఎలాంటి బాధ్యతలు అప్పగించారో, అదే రీతిలో అర్హులైన ఒకరి ఎంపిక పూర్తి చేసి, ఇప్పటి నుంచే ప్రజలకు చేరువ చేస్తే ప్రయోజనం ఉంటుందే తప్ప.. కావాలని అంతా సస్పెన్స్‌ కొనసాగిస్తే పార్టీకి వచ్చే కొత్త మైలేజి ఏమిటనేది మరోప్రశ్న. ‘సాధారణంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు ఆర్థికపరమైన వ్యవహారాల్లో లోక్‌సభ అభ్యర్థిని బట్టి వ్యవహారం ఉంటుంది. కాని అలాంటి అభ్యర్థి ఎంపిక ముందుగా చేయాల్సింది పోయి, తీరుబడిగా అభ్యర్థిని అన్వేషిస్తున్నట్టుగా సీను క్రియేట్‌ చేసి, ఇదంతా ప్రజల్లోకి వెళ్ళిన తరువాత ఏదో జరగబోతుందన్నట్టుగా వ్యవహరించడం వెనుక ఎవరి పాత్ర ఉందో తెలియడం లేదు. అంతకంటే మించి రాజకీయాల్లో ఇలాంటి సస్పెన్స్‌లు మంచికంటే ఎక్కువగా చెడునే చేస్తాయి’ వైసీపీ వర్గాల నుంచి విన్పిస్తున్న వ్యాఖ్యలివి. సీనియర్లు సైతం పార్టీ అనుసరిస్తున్న వైఖరిని ఒకవైపు సమర్థిస్తూనే లోలోన మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ఇష్టం ఉండి, ఆర్థికంగా స్తోమత కలిగి, ప్రజా జీవితంలో అలిసిపోవడానికి ఇష్టపడే వారిని లోక్‌సభకు పంపాలి. ఆ మేరకు పోటీకి దింపాలి. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి అభ్యర్థులు దొరకడం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాయి. ఇది ఏమాత్రం పార్టీకి మంచిదికాదు అనేది మరికొందరి అభిప్రాయం. ఈ అభిప్రాయానికే పార్టీలో అత్యధికులు మద్దతు పలుకుతున్నారు. కాని పార్టీ అధ్యక్షుడు జగన్‌ మాత్రం నరసాపురం లోక్‌సభ అభ్యర్థి విషయంలో మాత్రం ఇప్పటివరకు మౌనం వీడలేదు.
Link to comment
Share on other sites

బీజేపీ సిట్టింగ్ స్థానంలో ఈ టీడీపీ నేత పోటీ చేస్తున్నారా..?
20-10-2018 12:26:53
 
636756352954887951.jpg
  • బీజేపీ రంగు అప్పుడే బయటపడింది
  • అదే రాష్ట్రమంతా పాకింది
  • ప్రజా క్షేత్రంలో ఉంటా
  • నా పోటీపై సీఎందే తుది నిర్ణయం
  • చైర్మన్‌గా సంతృప్తినిచ్చింది
  • కులం అడ్డుగోడ కాదు
  • కాపుల్లోను స్నేహితులు ఉన్నారు
  • జడ్పీ చైర్మన్‌ బాపిరాజు
ఏలూరు: వచ్చే ఎన్నికల క్షేత్రంలో నేను కూడా ఒకడిగా ఉండాలనుకుంటున్నా. ఇప్పటికే పార్టీపరంగా చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నా. ప్రభుత్వానికి మచ్చ తేకుండా జాగ్రత్త పడ్డా. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తాడేపల్లిగూడెంలో బీజేపీ గడచిన నాలుగేళ్ళల్లో గిల్లికజ్జాలు పెట్టుకుంది. తెలుగుదేశంతో విభేదాలు కొని తెచ్చుకుంది. అప్పట్లో బీజేపీ ఎత్తుగడలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాం. కాని ఈరోజు రాష్ట్రమంతటా తాడేపల్లిగూడెంలో పాటించిన విధానాలనే బీజేపీ నేరుగా తీసుకువెళ్ళింది. ప్రోత్స హించిన తెలుగుదేశంనే యాగీ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈసారి గూడెంలో తప్పని సరిగా అభ్యర్థి ఎవరైనా.. తెలుగుదేశం పార్టీదే విజయం.. జడ్పీచైర్మన్‌ బాపిరాజు ధీమా ఇది. వచ్చే ఎన్నికల బరిలో ఉండాలనే ఆకాంక్ష ఆయన వ్యక్తం చేశారు. కాని పోటీ చేయాలా, వద్దా అనేది ముఖ్యమంత్రి చంద్ర బాబు నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉందని తేల్చి చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖిలో అనేక అంశాలను వెల్లడించారు.
 
చైర్మన్‌తో సరిపెట్టుకుంటారా.. లేక పోటీకి దిగుతారా ?
ప్రజలు, మా పార్టీ ఈ విషయం త్వరలోనే తేల్చనుంది. ప్రజలు ఇప్పటికే నా వెంట ఉన్నారు. సీఎం ఆదేశిస్తే నేను ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమే. తాడేపల్లిగూడెం, మరేదైనా నియోజకవర్గమా అనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. లేదంటే పార్టీ మాటకు అన్ని విధాలా కట్టుబడి ఉంటా. పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిని. నిబద్దతో పనిచేశాను. పార్టీ నిర్ణయాన్ని మొదటి నుంచి గౌరవిస్తూనే ఉన్నా.
 
తాడేపల్లిగూడెం టికెట్‌ ఆశిస్తున్నారా ?
మొదటి నుంచి పార్టీ నిర్ణయమే శిరోధార్యం. 2009లో పార్టీ ఆదేశిస్తేనే పోటీ చేశా. అప్పట్లో చివరి క్షణంలోనే రంగంలోకి దిగా. పార్టీ కేడర్‌ తగినంతగా ఉన్నంతలోనే కలిసొచ్చింది. అప్పట్లో పార్టీని లేకుండా చేద్దామనుకున్నారు. సీనియర్లు కొందరు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారు. పెంటపాడు మండ లంలో భారీగా పార్టీ నుంచి వలస వెళ్ళారు. కాని పార్టీ ఆదేశం మేరకు దేనికీ వెరవకుండా చివరి వరకు సుశిక్షితుడైన సైనికుడిగా పోరాడా. ఇప్పుడు కూడా పార్టీ పోటీ చేయమంటే నేను సిద్ధంగానే ఉన్నా. నేనైనా, మరెవరైనా పార్టీ నిర్ణయం తుది నిర్ణయం. దీనికి కట్టుబడి వ్యవహరిస్తా. 2014లో ప్రజలు నన్ను జడ్పీటీసీగా 20 వేల భారీ మెజార్టీతో గెలిపించారు. నా మీద ఉన్న అభిమానాన్ని చెప్పకనే చెప్పారు.
 
బీజేపీతో మీకు ఎలాంటి తగువు ?
రాజకీయాల్లో ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా కొన్ని, వ్యవహారపరంగా మరికొన్ని విభేదించవచ్చు. తాడేపల్లిగూడెంలో జరిగింది ఇదే. బీజేపీ తనంతట తానుగా బలపడేందుకు తెలుగుదేశంతో విభేదిస్తూ వచ్చింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళాం. అప్పట్లో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అంతా సంయమనంతో వ్యవహ రించాం. బీజేపీది తప్పు అని తేలినా మౌనంగా ఉన్నాం. మా అభ్యర్థన కంటే బీజేపీ అభ్యర్థనకే సీఎం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇక్కడ బీజేపీ ఏదైతే నాటకమాడిందో.. అదే పద్ధతిని రాష్ట్రంలోనూ ఆ పార్టీ పాటించింది. ఇప్పుడు బీజేపీ అంటరాని పార్టీగా మిగిలిపోయింది. గూడెంలో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ఖాయం.
 
కులమే అడ్డుగా ఉందా ?
నేనైతే దీనిని నమ్మను. ఒక బలమైన సామాజిక వర్గంలో ఉన్న వారు కూడా నాకు స్నేహితులుగా, మిత్రులుగా, సన్నిహితులుగా ఉన్నారు. వారంతా నామేలు కోరుకుంటారు. ఇది మాత్రం స్పష్టం. ఎవరూ కావాలని ఒక కులం కోరుకుని పుట్టరు. కుల బేషిజాలకు పూర్తిగా వ్యతిరేకిని. ఇదేదీ అడ్డంకి కాబోదు. రాజకీయపరంగా మా కుటుంబానికి తెలుగుదేశం ఊపిరి పోసింది. అనేక పదవులు చేశాం. ఇదంతా కార్యకర్తలు, పార్టీ సహకారంతోనే.
 
జిల్లా అభివృద్ధిలో మీ కృషి .. ?
గడచిన నాలుగున్నరేళ్ళల్లో జిల్లాను అభివృద్ధి చేయడంలో తిరుగులేని విజయం సాధించాం. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య కారణం. ఆయన ప్రోత్సహించి నిధులకు లోటు రానివ్వలేదు. సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణంలో పశ్చి మను రాష్ట్రానికి ఆదర్శం చేశాం. ఇది ఎవరైనా ఒప్పు కుని తీరాల్సిందే. సీఎం చంద్రబాబు నాయ కత్వంలో పనిచేయడం పూర్వజన్మ సుకృతం. జడ్పీ ద్వారా 300 కోట్లు అభివృద్ధి పనులు చేయగలిగాం. స్నేహితులు, దాతల సహకారం అందింది. అమెరికాలో ఉన్న స్నేహితులు ఈ మధ్యనే కేన్సర్‌ నిర్ధారణకు ప్రత్యేక వాహనం సమకూర్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించేలా ప్రజలంతా మనస్ఫూర్తిగా సీఎం చంద్ర బాబును ఆశీర్వదించాలి. అభివృద్ధి ఆయన వలనే సాధ్యం. ఇప్పుడు జరిగిన అభివృద్ధి ప్రత్యక్షంగా మీ కళ్ళ ముందే ఉంది. మరింతగా అభివృద్ధి పరిచేందుకు సీఎం చంద్ర బాబుకు అన్ని వర్గాలు సహకారం అందించాలి.
Link to comment
Share on other sites

32 minutes ago, Ntrforever said:

Bolisett bc kada

వీళ్ళు కాపులే లే 

29 minutes ago, Paruchuri said:

Evaru potential candidate annai..Eeli nani vunnada leda party lo..

Bolisetty Srinivas, Bapi in the race

Nani - funds problem - not too interested - wants nominated post - may jump to janasena

Okati kaadu nani meeda rumors :D

Party lone vunnadu. Party convenor ippudu

Link to comment
Share on other sites

  • 2 weeks later...
టీడీపీలో సిట్టింగ్‌ల సీట్లపై అనుమానాలు
30-10-2018 10:51:39
 
636764937844314181.jpg
 
  • క్షేత్రస్థాయి కేడర్‌ తర్జనభర్జనలు
  • ఎదురుదాడులపై చర్చోపచర్చలు
  • సీఎం అనుభవంపైనే గురి
  • తేరుకుంటామనే స్థైర్యం
  • కొన్ని నియోజకవర్గాల్లో తెరపైకి కొత్త ముఖాలు
  • నెలపాటు ఇంతేనంటూ సర్దుబాటు
ఏలూరు: ‘రాష్ట్రానికి న్యాయం చేయాల్సింది పోయి ప్రతీ అంశంలోనూ విపక్ష పార్టీల నుంచి ఎదురుదాడి కనిపిస్తోంది. అధికార తెలుగుదేశానికి చేటు తెచ్చే ఎత్తుగడలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇంతకుముందు ఏదొక పార్టీతో మిత్రత్వం ఉండేది. మాటకు చేయూత అన్నట్టు రాజకీయ స్నేహం ఉండేది. ఇప్పుడు ఆ పార్టీని ఒంటరితనం ఆవహించింది. అయినప్పటికీ అధినేత చంద్రబాబు ఏదొకటి చేయకపోరు’ ఇదీ తెలుగుదేశం వర్గాల్లో నెలకొన్న అంతర్గత నిస్తేజం. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆ పార్టీకి ఎదురవుతున్న రాజకీయ చిక్కులను, సవాళ్లపై క్షేత్రస్థాయిలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. సుదీర్ఘ కాలంపాటు పార్టీని నమ్ముని ప్రయాణం చేసిన సీనియర్లు అధిష్టానం పెద్దలతో మాట్లాడి ఆరా తీస్తున్నారు.
 
 
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బలహీనంగా ఉన్నా బీజేపీ, జనసేన కలిసొచ్చి రాజకీయంగా కొత్త ఊపును తెచ్చాయి. గ్రామీణ స్థాయిలో తెలుగుదేశం పార్టీకివున్న బలానికితోడు ఈ రెండు పార్టీల నుంచి వచ్చిన అదనపు బలం కలిసొచ్చింది. వామపక్షాలు అండగా లేకపోయినా, వైసీపీ శత్రుపక్షంగా విర్ర వీగుతున్నప్పుడు.. గెలుపు మాదే అనే ధీమాను తెలుగుదేశం వ్యూహాత్మకంగా అమలు పరిచింది. అప్పట్లో టికెట్ల గొడవ పెద్దగా లేదు. పార్టీ నాయకత్వానికి ఎదురొడ్డి సవాళ్లు విసిరే ధైర్యం క్షేత్రస్థాయి నాయకత్వానికి అసలే లేదు. రానురాను రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, పార్టీకి తిరుగులేదనే భావన ఉన్నా.. తెలుగుదేశంలో ఎక్కడో వెలితి కనిపిస్తోంది.
 
 
గ్రామదర్శినిలో ఉత్సాహమేదీ ?
గ్రామస్థాయిలో పార్టీ మరింతగా బలపడేందుకు గ్రామదర్శినికి పిలుపునిచ్చింది. రాజకీయంగా కార్యకర్తలకు ఇది దైర్యాన్ని ఇస్తుందని, ప్రజల్లోకి వెళ్లేందుకు ఉపయోగపడుతుందనే ఎత్తుగడతో ప్రభుత్వపరంగా ఆరంభించారు. తొలినాళ్లలో అసలు విషయం తెలిసి తెలుగుదేశం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలంతా ఉత్సాహంతో గ్రామదర్శినికి హాజరయ్యేవారు. వారి వెంటే మిగతా బలగమంతా. పట్టణ ప్రాంతాల్లోనూ నగర దర్శినికి, వార్డులు, డివిజన్ల వారీగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. ఎమ్మెల్యేలకు ఇది ఉత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాలు తూచా తప్పడం లేదన్నట్టు వారు ఈ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మొదట్లో ఉన్నంత ఊపు రానురాను తగ్గుముఖం పట్టింది. ఎందుకనంటే వచ్చే ఎన్నికల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని, సీట్లు మారవచ్చనే ఊహాగానాలు రావడమే దీనికి ప్రధాన కారణం.
 
 
సీనియర్లలో అభద్రతా భావం
‘పార్టీపై ప్రజల్లో చెక్కు చెదరని అభిమానం ఉంది. లోతట్టుగా పార్టీకి పూర్తిస్థాయి అనుకూలత కనిపిస్తోంది. ప్రభుత్వ సర్వేల్లో ఎనలేని ప్రజాదరణ నెలకొంది. ఇంకేం కావాలి. అధికార పక్షానికి ఈ మాత్రం మద్ధతు ఉంటే చాలదా ? దూసుకుపోతాం’ అన్నట్టు ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాని, జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం వున్న సిట్టింగ్‌ల్లో కొందరికి మార్పులు, చేర్పులు తప్పకపోవచ్చని ఈ మధ్యన ప్రచారం ఊపందుకుంది. పార్టీ అంతర్గత వేదికల్లోనూ ఇలాంటి చర్చే జరుగుతోంది. ఒకవేళ సీఎం చంద్రబాబు మనసులో ఏముంది..? తమకు సీటును కొనసాగిస్తారా ? లేదంటే కొత్త వారిని తెరపైకి తెస్తారా ? అనే సవాలక్ష సందేహాలతో ఎమ్మెల్యేలు కొందరు కుదురుగా ఉండలేకపోతున్నారు.
 
 
అధిష్టానాన్ని ఈ విషయంపై ప్రశ్నించలేకపోతున్నారు. తమకున్న శక్తియుక్తులను ఉపయోగించి, పార్టీలో తమ శ్రేయోభిలాషులు, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగే నాయకుల నుంచి అసలు పరిస్థితి ఆరా తీసే పనిలో ఎమ్మెల్యేలు నిమగ్నమై ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో నాలుగేళ్లుగా క్షణం తీరిక లేకుండా గడిపామని, నియోజకవర్గ స్థాయిలో భేదాభిప్రాయాలు తలెత్తకుండా, రెండో పవర్‌ పాయింట్‌కు స్థానం లేకుండా ఏకపక్షంగా తాము తీసుకున్న నిర్ణయాలు సక్సెస్‌ అయ్యాయే తప్ప.. ఎలాంటి అసంతృప్తికి గురి చేయలేదనేది ఎమ్మెల్యేల వాదన. ఇప్పటికే ఎంపీల విషయంలో కుండబద్దలు కొట్టినట్టు సీఎం చంద్రబాబు మనసులో ఏముందో కొంతలో కొంత బయటపడిందని, ఎమ్మెల్యేల విషయంలో గుంభనంగా ఉండడంతో తమ భవిష్యత్తుపై పూర్తిస్థాయి ధీమాతో తాము ఉండలేకపోతున్నామని కొందరు ఎమ్మెల్యేలు తమ సహచరుల వద్ద వాపోతున్నారు. కనీసం రెండు, మూడుచోట్ల ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పోటీగా కొత్తముఖాలు రంగంలోకి దిగడం, వీరంతా సీఎం చంద్రబాబు, పంచాయతీరాజ్‌ మంత్రి లోకేష్‌తో తామంతా ‘టచ్‌’లో ఉన్నట్టు నియోజకవర్గాల్లో చేస్తున్న ప్రచారం సరికొత్త ఉత్కంఠకు గురిచేస్తోంది. రిజర్వుడు నియోజకవర్గాల్లో మాత్రం ఈ పరిస్థితి మరింత తీవ్రస్థాయికి చేరింది. పదేపదే రోజుకో కొత్తముఖం బయటకు రావడం, రకరకాల వాదనలు, ప్రచారాలు జరగడం.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు చికాకు తెప్పిస్తోంది.
 
 
మరో నెలపాటు ఇంతే
ప్రస్తుత రాజకీయ సంక్షోభం సమయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం అధిష్టానం కీలక నిర్ణయాలను తీసుకోలేకపోతోందని ఎమ్మెల్యేలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరో నెలపాటు ఇలాంటి పరిస్థితే కొనసాగే అవకాశం ఉంది. ఇంతకుముందు పార్టీపరంగా ఏమైనా అంతర్గత నిర్ణయాలు తీసుకున్నా.. కొంత లీకేజీలు ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. పటిష్టమైన నిర్ణయాలకు మాత్రమే ఆస్కారం ఉన్నట్టు భావిస్తున్నామని, మిగతా పక్షాల ఎత్తుగడలకు అనుగుణంగానే పార్టీ నిర్ణయాలు ఉంటాయే తప్ప భిన్నంగా ఉండబోవని మరికొందరు ధీమాతో ఉన్నారు. దీనిలో భాగంగానే సీట్లు మార్చబోతున్నారంటూ విపరీత ప్రచారం జరుగుతుందన్నదే వీరి వాదన. ఎవరెవరు సీట్లు కోల్పోబోతున్నారో ఇప్పట్లో తెలిసే అవకాశం లేదని సీనియర్లు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
వట్టి వసంత్ కుమార్‌ వైసీపీలో చేరనున్నారా..!?
27-11-2018 14:09:26
 
636789246889813743.jpg
  • డిసెంబర్ 3న భవిష్యత్తుపై వట్టి వసంత్‌‌ కీలక నిర్ణయం
  • హాజరు కావాల్సిందిగా అభిమానులకు సమాచారం
ఏలూరు: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్‌ నేత వట్టి వసంతకుమార్‌ వచ్చేనెల 3న ఎం.ఎం.పురంలో తన అనుయాయులతో భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలోనే మరేదైనా పార్టీలో చేరాలా, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే అంశాలపై అంతర్గతంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్‌నే నమ్ముకుని ఉన్న ఆయన ఈ మధ్యనే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తెలుగుదేశంతో పొత్తు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన తమలాంటి వారికి ఏ మాత్రం అంగీకారం కాదని అప్పట్లోనే వసంత్‌ తెగేసి చెప్పారు. అప్పటి నుంచి తన శ్రేయోభిలాషులతో అంతర్గత చర్చలు కొనసాగిస్తూనే, ఉంగుటూరు నియోజక వర్గానికి చెందిన అభిమానులు, జిల్లాలో తనతో సాన్నిహిత్యంగా ఉంటున్న కొందరు నేతలతో వచ్చే నెలలో భేటీ కావాలని తాజాగా నిర్ణయించారు.
 
 
ఈ భేటీలోనే తన భవితవ్యాన్ని నిర్ధారించుకునే వీలుగా కసరత్తు ప్రారంభించారు. జనసేన పార్టీకి చేరువ అవుతారా.. లేదా వైసీపీకి దగ్గర కానున్నారా..? అనే అంశాలపై జిల్లాలో సాగుతున్న ప్రచారానికి నేరుగానే పుల్‌స్టాప్‌ పెట్టబోతున్నారు. ఈ రెండు పార్టీల్లో ఏదొక దానిలో చేరడం, నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనే తన ఆకాంక్షను అభిమానుల ఎదుటే వ్యక్తీకరించి ఆ తదుపరి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాలో ఆయనతో పాటు మరికొందరు కాంగ్రెస్‌కు దూరం అవుతారని అంచనా వేసినా దీనికి విరుద్దంగా కాంగ్రెస్‌లో మిగిలిన సీనియర్లందరూ వసంత్‌కు దూరంగానే మిగిలిపోయారు. వచ్చేనెలలో జరగబోతున్న భేటీకి హాజరు కావాల్సిందిగా వసంత్‌కు సన్నిహితులుగా ఉన్న వారందరికీ వర్తమానం అందింది.
Link to comment
Share on other sites

ఆమె ఎంట్రీతో.. టీడీపీ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ మధ్య వివాదానికి చెక్!
27-11-2018 14:21:01
 
636789253973075215.jpg
  • పాలకొల్లు ప్లెక్సీ వివాదానికి తెర
  • భీమవరం చేరిన తగవు
  • ఎమ్మెల్సీ అంగర,ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మలతో..
  • మాట్లాడిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట 
 
భీమవరం: పాలకొల్లులో ప్లెక్సీ వివాదంపై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ల మధ్య తలెత్తిన మాటల వివాదంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. అధికార పక్షంలో ఇటువంటి వివాదాలు సర్వసాధారణమేనని అయితే వారిమధ్య ఎటువంటి విబేధాలకు తావులేదని జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ తెలిపారు. ఇరువురు ప్రజాప్రతినిధులతో చర్చించడంతో సమస్యకు తెరపడినట్లు ప్రకటించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ రాజకీయ వివా దాన్ని ముగించేందుకు తోట సీతారామలక్ష్మీ సోమవారం చర్చించారు. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ రామానాయుడుతో ఆమె మాట్లాడారు. స్వయంగా ఎమ్మెల్సీ అంగర భీమవరంలోని సీతారామలక్ష్మీ నివాసానికి చేరుకొన్నారు. కొన్ని కార్యక్రమాల కారణంగా పాలకొల్లులో ఉండిపోయిన ఎమ్మెల్యేతో ఫోన్‌ ద్వారా ఈ అగాధానికి గల కారణాలను తెలుసుకొన్నారు.
 
 
ఇందులో ఎటువంటి విబేధాలు లేవని అది యాధృచ్ఛికంగా జరిగిన సంఘటనగానే ఈ చర్చలలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంగర రామ్మోహన్‌కి తెలుగుదేశం పార్టీలో తొలుత నుంచి వివాదరహితుడిగానే పేరుంది. ఆ కారణంగానే ఆయన పార్టీలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలోను పార్టీ పరంగా కూడా అధిస్టానం సూచించిన విధంగానే కొనసాగుతూ వచ్చారు. ఇలా వ్యవహరిస్తున్న ఆయన తొలిసారిగా ప్లెక్సీ తొలగింపుపై పార్టీ కార్యాలయ ఇన్‌చార్జ్‌ ఎమ్మెల్సీ జనార్ధన్‌ సమక్షంలోనే వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశమైంది. అయితే ఎమ్మెల్యే రామానాయుడు కూడా పార్టీకి నిబద్దుడుగానే ఉంటూ ఎటువంటి వివాదాలు లేకుండా అభివృద్ధిలోను, పార్టీ కార్యక్రమాలలోను వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపై చర్చించినప్పుడు ఎమ్మెల్సీ పదవీ ఇవ్వాలని నిర్ణయించినప్పుడు అంగరకు తన సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు సమాచారం. ఇరువురి అభిప్రాయాలతో సీతారామలక్ష్మీ చర్చించినప్పుడు ఇక వివాదానికి ముగింపు పలకాలని నిర్ణయించడంతో మొత్తం మీద ఈ అంకానికి తెరపడింది.
 
 
seetha-rama-laxmi.jpgవారి మధ్య ఎటువంటి వివాదం లేదు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీఅధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న అంశాలు సర్వసాధారణం. ఇవి పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇరువురితో చర్చించాను. ఇద్దరి మధ్య ఎటువంటి వివాదాలు, మనస్పర్ధలు లేవు. ఇరువురు కూడా వివాదాలకు వెళ్లేవారు కాదు.. ఇక్కడితో ఈ వివాదం సమసినట్టే..
 
 
 
 
అంగరకు నాకూ విభేదాల్లేవ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల
‘ఎమ్మెల్సీ అంగర రామ్మో హన్‌తో నాకు వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎటువంటి విభేదాలు లేవు. చిన్న ఫ్లెక్సీ వివాదం పార్టీ అధి ష్టానం వద్దకు విచారకరం. దీనిని ప్రతిపక్షం అవకాశంగా తీసుకుని చిలువలు పలవలుగా చేసి, పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. కాబట్టి మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తున్నాను’ అని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన ఫ్లెక్సీ వివాదంపై ఆయన సోమవారం ఏఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం కుటుంబంలో విడిపోయేంత విభేదాలు ఉండవన్నారు.
 
 
చిన్న ఫ్లెక్సీ వివాదాన్ని పెద్దదిగా బూతద్దంలో చూడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన బీసీ నాయకుడు కావడం, తనకు ఎంతో ఆప్తుడు అవడం వల్ల రెండుసార్లు ఎమ్మెల్సీ కావడంలో తాను కృషి చేశానని చెప్పారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లానని తెలిపారు. ఇప్పుడు చిన్న ఫ్లెక్సీ వివాదం అధిష్టానానికి చేరిందని, వారి ఆదేశాల మేరకు నడుచు కుంటానని ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. బీసీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, తన కృషిలో లోపం ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
  • 2 weeks later...
క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాలో టీడీపీ సర్వేలు.. అసలేం చేయబోతున్నారు..?
10-01-2019 12:34:11
 
636827205410353204.jpg
  • రాజకీయం.. రిజర్వుడు!
  • టీడీపీలో పాత ముఖాలకు దిగులు
  • రంగంలోకి ఆశావహులు
  • రిజర్వుడు నియోజకవర్గాల్లో పోటీ
  • గుట్టుగా సర్వేలు.. తెరముందుకు సిత్రాలు
 
ఏలూరు: సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. పోటీ చేసే అభ్యర్థులు ఎవరు ? ప్రస్తుత సిట్టింగ్‌ల పరిస్థితి ఏంటి? మార్పులు, చేర్పులు జరుగుతాయా? ఆ దిశగానే తెలుగుదేశం అధిష్ఠానం ఒకింత సీరియస్‌గానే ఉందా ? ఎప్పటిలోపు తుది నిర్ణయం తీసుకుంటారు ? లేదా త్వరలోనే బరిలోకి దింపే వారిని తేల్చబోతున్నారా ? నేరుగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? అనే శరపరంపర ప్రశ్నలు తెలుగుదేశం సిట్టింగ్‌లను నిద్ర పోనివ్వడం లేదు. ఒకవైపు ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు, మరో వైపు ప్రభుత్వ నిఘా వర్గాల సమాచారం, మరోవైపు అంతర్గత సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టు సమాచారం.
 
తెలుగుదేశంకు ఆయువు పట్టు అయిన నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ బలంగానే ఉన్నా.. సిట్టింగ్‌లపై ఉన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు జరగబోతున్నాయి. ఆ దిశగానే అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేయనుంది. కొందరు బరి తెగించి, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం పట్ల ఒకింత సీరియస్‌గానే ఉంది. కాని ఇప్పటి వరకు ఏ నియోజక వర్గంలో ఎలాంటి చర్యకు దిగబోతున్నారో అనేది.. అంతా గుట్టుగానే సాగుతోంది. దీంతో సిట్టింగ్‌ల్లో అలజడి. ఎవరికీ చెప్పుకోలేని అధైర్యం. పైకి ఈసారి కూడా టికెట్‌ మాకేనంటూ పైపైన ప్రచారం. కాని లోతట్టుగా సాగుతున్న కసరత్తు ఫలితం ఏమిటోననేదే ఉత్కంఠ.
 
అసలేం చేయబోతున్నారు..?
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లాలో మిగతా పార్టీలను ఊడ్చేసి మరీ 14 స్థానాలను ఆక్రమించింది. పశ్చిమ తిరుగులేని విజయాన్ని ఏకపక్షంగా అందించింది. కాని ఐదేళ్ళల్లోనే దాదాపు ఒంటరి పోటీకి తెలుగుదేశం సన్నాహాలు చేస్తోంది. సిట్టింగ్‌ల పనితీరుపై బేరీజు వేస్తోంది. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలతో ఎప్పటికప్పుడు సిట్టింగ్‌ల జాతకాలను పరిశీలిస్తోది. సామాజిక వర్గాల వారీగా మార్పులు, చేర్పులకు సిద్ధమయ్యే పరిస్థితి స్పష్టంగా ఉంది. ముఖ్యంగా రిజర్వు స్థానాలు నాలుగింటిలోనూ అసలు ఈసారి సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తారా.. మార్చి కొత్త ముఖాలకు చోటు ఇస్తారా.. అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
 
చింతలపూడి నియోజకవర్గానికి రికార్డు స్థాయిలో ఆశావహులు రంగంలోకి దిగారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పీతల సుజాత స్థానంలో పోటీ చేసేందుకు వీరంతా ఉవ్విళ్ళూరుతున్నారు. చింతలపూడిలాంటి ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో ఆశావహులు పుట్టుకురావడం ఇదే ప్రథమం. ఎమ్మెల్యే సుజాత మాత్రం సీటు తిరిగి తనకే కేటాయిస్తారనే ధీమాతో ఉన్నా.. ప్రత్యర్థులు మాత్రం మార్చడం ఖాయమంటూ ఏడాదిగా ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి తగ్గట్టుగానే పార్టీ అంతర్గతంగా ఆరా తీస్తోంది. రకరకాల సర్వేలు, విశ్వసనీయుల సమాచారం, ప్రభుత్వ వేగులు నుంచి గెలుపోటములపై పూర్తి స్థాయి నివేదికలను రప్పిస్తున్నారు. దీంతో చింతలపూడిలో ప్రస్తుతానికి ‘హైటెన్షన్‌’ నెలకొంది. సీఎం చంద్రబాబును కలిసి నేరుగా తమ దరఖాస్తులను అందించేందుకు ఇప్పటికే కొందరు సిద్ధంగా ఉన్నారు. మాజీ జడ్పీ చైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ, గుడిపూడి రవిబాబు, దాసరి ఆంజనేయులు, ఆకుమర్తి రామారావు, సొంగా రోషన్‌కుమార్‌ వంటి వారు ఆశావహులుగా ఉన్నారు. పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో నాయక గణం ఉన్నా.. ఇక్కడ స్థానిక నేతలకు ఎవరు నచ్చుతారనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న.
 
గోపాలపురంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా స్థానిక నేతలు కొందరు ఇటీవలే రహస్యంగా సమావేశమయ్యారు. స్థానికంగా అనేక విషయాలను పట్టించుకోకుండా ఉంటున్న వెంకటేశ్వరరావును ఈసారి తప్పించి కొత్త ముఖానికి చోటు ఇవ్వాలని ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. తెలుగుదేశంలో కొందరు సీనియర్‌ నేతలు సైతం ఈ రహస్య సమావేశానికి హాజరయ్యారు. తొలిసారిగా ముప్పిడిపై ముప్పేట దాడికి దిగింది ఇదే ప్రథమం. దీంతో ఇప్పటివరకు గోపాలపురం నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారనే ప్రశ్న ఉండగా.. అధిష్ఠానం ఆశీస్సులు ఉన్నాయంటూ మద్దిపాటి వెంకట్రాజు నియోజకవర్గం అంతటా ఫ్లెక్సీలు పెట్టారు. అందరి నోట నానేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యనే జరిగిన ప్రత్యేక సమావేశంలోనూ యువత అత్యధికంగా పాల్గొనడం తన అనుకూలతను సాటి చెప్పేదిగా ఉందని రాజు భావిస్తున్నారు. అధిష్ఠానం పెద్దల నుంచి మద్దిపాటికి ఒకింత సానుకూలత ఉన్నట్టు ప్రచారం. దీంతో గోపాలపురం సైకిల్‌పై అందరి దృష్టి పడింది. ఎవరంతట వారుగా తమ ప్రయత్నాల్లో మరింత స్పీడు పెంచబోతున్నారు. ఎమ్మెల్యే ముప్పిడి మాత్రం తాజా పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
 
పోలవరం నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావును కొనసాగిస్తారా, లేదా అనేది త్వరలోనే తేలబోతుంది. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా శ్రీనివాసరావు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకానొక దశలో మంత్రి పదవి ఆశించినా.. ఈయనకు బదులుగా విశాఖకు చెందిన కిడారి శ్రావణ్‌కుమార్‌కు ఛాన్స్‌ వచ్చింది. శ్రీనివాసరావుకు పోటీగా కొందరు ఇప్పటికే సీటు కోసం అంతర్గతంగా పోటీ పడుతున్నారు. కాని పోలవరం నియోజకవర్గంలో కుక్కునూరు, వేలేరుపాడు ముంపు మండలాలు కలిసిన తర్వాత పార్టీకి కలిసివస్తుందా.. అనేది తేల్చుకోలేకపోతున్నారు. కాని ఇప్పటికే ఈ రెండు ముంపు మండలాల్లో ఫిఫ్టీ.. ఫిఫ్టీ అన్నట్టుగా పార్టీ అనుకూలత ఉందనే సమాచారం పార్టీకి అందుతోంది. ఈ విషయంపై త్వరలోనే మరింతగా విశ్లేషించబోతున్నారు.
 
లోక్‌సభ అభ్యర్థిని బట్టి అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మార్పులు, చేర్పులు ఖాయమని తెలుగుదేశంలో ప్రచారం. ఎంపీ మాగంటి బాబును కొందరు ఆశావహులు ఇప్పటికే కలిశారు. తెలుగుదేశం అధిష్ఠానానికి దరఖాస్తు చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో రిజర్వుడు స్థానాల్లో మార్పులు, చేర్పులు ఖాయమనే ప్రచారం తెలుగుదేశంలో ఊపందుకుంది. ప్రత్యేకించి ఈ మూడు నియోజకవర్గాల్లోనూ రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. రాజకీయపరంగా జరుగుతున్న ఎత్తుగడలను సిట్టింగ్‌లు అంతా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూనే మరోవైపు తమ సీటు పదిలంగా ఉండేలా సరికొత్త ఎత్తుగడకు దిగారు.
 

Advertisement

Link to comment
Share on other sites

  • 2 weeks later...
డాక్టర్‌ బాబ్జి సొంతగూటికి వస్తారా..?
25-01-2019 10:53:46
 
636840104274519411.jpg
విజయవాడ: పాలకొల్లు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారనున్నాయా... ?అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. పదిరోజులుగా పట్టణంలో వివిధ రాజకీయ పరిణామాలు చోటుచేసుకోగా తాజాగా గురువారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జి)ని ఇక్కడి టీడీపీ శ్రేణులు కలసి పార్టీలోకి ఆహ్వానించినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, ఏఎంసీ చైౖర్మన్‌ గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, మున్సిపల్‌ చైర్మన్‌ వల్లభు నారాయణమూర్తి, కౌన్సిలర్లు జీవీ, పెచ్చెట్టి బాబు తదితరులు డాక్టర్‌ బాబ్జీని కలసి తెలుగుదేశం పార్టీలోనికి రావాల్సిందిగా కోరినట్లు సమాచారం. అయితే ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటానని డాక్టర్‌ బాబ్జీ చెబుతూ పార్టీ అంటే తనకు అభిమానమేనని, అయితే ఆలోచించి తన నిర్ణయం చెబుతానని చెప్పినట్లు తెలిసింది.
 
కాగా ఇప్పటికే సీఎం పేషీ నుంచి డాక్టర్‌ బాబ్జీకి ఆహ్వానం వచ్చినట్లుగా పట్టణంలో ప్రచారం జరుగుతోంది. నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే డాక్టర్‌ బాబ్జి పార్టీలో ఉంటే పార్టీ ఇమేజ్‌ మరింతగా పెరుగుతుందన్న ఉద్దేశంతో పేషీ నుంచి ఆహ్వానం పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. డాక్టర్‌ బాబ్జీ సానుకూలంగా స్పందించి పాతగూటికి వస్తే పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పించే దిశలో పార్టీ ఉన్నత స్థాయి శ్రేణులు ఇప్పటికే రూపకల్పన చేసినట్లు సమాచారం.
 
డాక్టర్‌ బాబ్జీ ప్రస్తుతం బీజేపీ స్వచ్ఛభారత్‌ రాష్ట్ర కన్వీనర్‌గా పార్టీలో మంచి పేరు పొంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని నెలలుగా ఒకవైపు వైసీపీ, మరోవైపు జనసేన పార్టీలు డాక్టర్‌ బాబ్జీని తమ పార్టీలలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతూనే ఉంది. మొన్నామధ్య రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ నేరుగా డాక్టర్‌ బాబ్జీని కలిసి జనసేనలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. ఆయన రెండ్రోజుల క్రితం జనసేనలో చేరారు. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో డాక్టర్‌ బాబ్జీని పార్టీలోకి రావాల్సిందిగా నేరుగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఆహ్వానించినట్లు తెలియడంతో ఒకవైపు బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతుండగా మరోవైపు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. డాక్టర్‌ బాబ్జీ పాత గూటికి వస్తే నియోజకవర్గంలో టీడీపీకి భారీ మెజారిటీ వస్తుందని, ఈ ప్రభావం జిల్లా అంతటిపైనా కనిపిస్తుందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
నర్సాపురం పరిధిలో దాదాపు సిట్టింగ్‌లకే టికెట్లు!

02602brkk147a.jpg

అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు జరుపుతున్నారు. మంగళవారం అమరావతి ప్రజావేదికలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని నేతలతో సీఎం భేటీ అయ్యారు. ఏలూరు, నర్సాపురం పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని మొత్తo 14 అసెంబ్లీ స్థానాల్లో అధిక శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పలువురు సిట్టింగ్‌లను మార్చే యోచనలో తెదేపా అధినేత ఉన్నట్లు సమాచారం. పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముడియం శ్రీనివాస్ ఉండగా.. అదే స్థానాన్ని బొరగం శ్రీనివాస్ ఆశిస్తున్నారు. చింతలపూడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి పీతల సుజాత ఉన్నారు. అయితే అదే టికెట్‌ను కర్రా రాజారావు, నాగరాజు, సొంగా రోషన్ ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లా కైకలూరు నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా భాజపా అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌ పోటీచేసి గెలిచారు. ఈసారి కైకలూరు స్థానానికి జయమంగళ వెంకట రమణ, చలమల శెట్టి రామాంజనేయులు, సీఎల్ వెంకటరావుల మధ్య పోటీ నెలకొంది. కృష్ణా జిల్లాలోనే మరోస్థానం నూజివీడు టికెట్‌ కోసం ముదరబోయిన, అట్లూరి రమేష్, దేవినేని అపర్ణ పోటీ పడుతున్నారు.

మరోవైపు నర్సాపురం పార్లమెంట్ పరిధిలో దాదాపు సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. నర్సాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాధవ నాయుడు ఉండగా.. అదే స్థానాన్ని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆశిస్తున్నారు. తాడేపల్లిగూడెం టికెట్ కోసం బాపిరాజు, ఈలి నానిల మధ్య పోటీ నెలకొంది. నేతలతో సమీక్ష సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా అంటే తనకు ప్రాణంతో సమానమని చెప్పారు. గత ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో ప్రజలు తెదేపాను గెలిపించారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అక్కడి ప్రజలు ఆదరించారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే ఎక్కువసార్లు పర్యటించానని నేతలతో చంద్రబాబు చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...