Jump to content

West Godavari Politics


Recommended Posts

మాజీలపై వైసీపీ వల
07-05-2018 14:53:18
 
636613015969179424.jpg
  • జగన్‌ యాత్రలో తిరిగి పార్టీలో రప్పించుకునేందుకు మంతనాలు
  • చెక్‌ పెట్టే వ్యూహాల్లో టీడీపీ
(నరసాపురం)(పశ్చిమగోదావరి జిల్లా)
నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు వైసీసీ ముమ్మర యత్నాలు మొదలెట్టింది. గతంలో పార్టీకి విధేయులుగా ఉండే, ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతోన్న మాజీలను తిరిగి పార్టీలో రప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొందరితో ఇప్పటికే మంతనాలు జరుపు తోంది. ఈసారి అధికారంలోకి వచ్చింది వైసీపీనే.. పార్టీలోకి వస్తే పదవితో పాటు సముచిత స్థానం కల్పిస్తామంటూ వల విసురుతోంది. వచ్చే నెలలో జగన్‌ నియోజక వర్గంలో చేపట్టే పాదయాత్రలో తిరిగి వీరందరికి పార్టీ కండువాలు కప్పే లక్ష్యంతో పావులు కదువుతోంది. అయితే వైసీపీ వ్యూహన్ని పసి గట్టిన టీడీపీ అప్రమత్తమైంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే. పార్టీలో మీకు ఎప్పుడు సముచిత స్ధానమేనంటూ భరోసా ఇస్తోంది. దీంతో ఎన్నికల సమయంలో వలస వచ్చిన నాయకుల్లో ఎవరెవరూ వెళ్లతారన్నది రాజకీయంగా హాట్‌ టాఫిక్‌ అయింది. జిల్లాలో నరసాపురం నియోజకవర్గానికి రాజకీయంగా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పార్టీ కంటే కులాల పోరే ఎక్కువుగా ఉంటుంది. మొత్తం ఓటర్లలో సగ భాగం రెండు సామాజిక వర్గాలదే. ఇక మిగిలిన కూలలు గెలుపు ఓటమిని నిర్ణయిస్తాయి.
 
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్నది. అయితే మాజీ ఎమ్మెల్యే ముదునూరి రాకతో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఆయనకు కుల ఓట్‌ బ్యాంకు లేకపోయినప్పుటికి కొన్ని సామాజిక వర్గాల్లో మంచి పట్టు పెంచుకోగలిగారు. ఫలితంగా 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ ఆభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2012 ఉప ఎన్నికలో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌కు గట్టి పోటి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కేవలం 3200 ఓట్లు తేడాతో కాంగ్రెస్‌ గెలుపొందింది.
 
 
గత ఎన్నికలతో మారిన పరిణామాలు
అయితే గత ఎన్నికలతో నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపో యింది. చివరి నిమిషంలో వైసీపీలో వచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడుకి నరసాపురం టిక్కెట్‌ ఇచ్చారు. అప్పటి వరకు ఇక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న ముదునూరిని ఆచంట పంపారు. దీంతో ఆయన వర్గీయులు చాలామంది పార్టీ మీద కినుక వహించారు. కొందరు స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండటంగా మారి కొందరు తెలుగుదేశంలో చేరారు. ఈ పరిణామాలు టీడీపీకి బాగా కలసొచ్చాయి. భారీ మోజార్టీతో విజయం సాధించేలా చేశాయి.
 
 
మారిన సమీకరణలు
రెండేళ్ల క్రితం కొత్తపల్లి టీడీపీలోకి చేరడంతో మళ్లీ నరసాపురానికి వైసీసీ ఇన్‌చార్జ్‌గా ముదనూరిని పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో ముదునూరి వర్గీయులు మళ్లీ పాత గూటికి చేరతారని అందరూ భావించారు. అయితే ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడం, అభివృద్ధికి పెద్ద పీట వేయడంతో పార్టీలో ఉన్నా కొత్తపల్లి వర్గంతో కలవకపోవడం వంటి పరిణామాలతో పగడిచిన రెండేళ్ల కాలంలో పార్టీ ఫిరాయింపులు పెద్దగా జరగలేదు.
 
తాజాగా వైసీపీ వ్యూహం మార్చింది. వచ్చే నెలలో నియోజక వర్గంలో వైసీసీ అధినేత జగన్‌ యాత్రలో పార్టీకి చెందిన మాజీలను తిరిగి సొంత గూటికి రప్పించేందుకు విశ్వప్రయత్నాలు మొదలేట్టింది. కొందరు స్థానిక సంస్ధల ప్రజా పతినిధులు, నాయకులతో తరుచూ మంత నాలు సాగిస్తోంది. దీంతో రాజకీయం ఒక్క సారిగా వేడెక్కింది. అయితే ఈ వ్యూహానికి టీడీపీ చెక్‌ పెడుతూ వస్తోంది. వైసీసీ నేతలు మంతనాలు జరిపిన నాయకులతో టీడీపీ నేతలు వెంటనే సమావేశ మవుతున్నారు. వైసీసీ అధికారంలోకి రావడం కల అంటూ విస్తృత ప్రచారంతో పాటు అభివృద్ధిలో కలసి పనిచేద్దా, పార్టీకి అండగా ఉంటూ వస్తున్న మీకు ఎప్పుడు సముచిత స్ధానం ఉంటుందంటూ భరోసా ఇస్తోంది.
Link to comment
Share on other sites

  • Replies 107
  • Created
  • Last Reply
ఏపీలోని ప్రధాన పార్టీల పరుగులు
14-05-2018 13:09:20
 
636619002729309289.jpg
(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి)(పశ్చిమగోదావరి జిల్లా): ఒకవైపు ప్రతిపక్ష నేత జగన్‌ పాదయాత్ర, మరోవైపు అధికార తెలుగుదేశం నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాలకు సన్నద్దం. ఇంకోవైపు పవన్‌ బస్సు యాత్ర సన్నాహం.. అంతటా రాజకీయ ఉత్కంఠే. గడచిన కొద్ది రోజులుగా కేంద్రం వైఖరిపై తెలుగుదేశం గుక్క తిప్పుకోనీయకుండా నేతలను పోరాట బాటను పట్టించింది. ఒక కార్యక్రమం తర్వాత మరొకటి వచ్చి పడుతూనే ఉన్నాయి. అసలే వేసవి కావడంతో మండుటెండల్లో పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూనే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రత్యేక హోదా పేరిట పార్టీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు సైకిల్‌ యాత్రలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేల మధ్య పార్టీ పోటీ వాతావరణం సృష్టించింది. ఈలోపే జిల్లాస్థాయిలో, నియోజకవర్గస్థాయిలో మినీ మహానాడు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 20వ తేదీ నాటికల్లా మినీ మహానాడు పూర్తి చేయాల్సిందిగా కోరింది. దీంతో మినీ మహానాడులు పార్టీకి ప్రతిష్టాత్మ కంగా, ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనంగా మారాయి. వాస్తవానికి ముందస్తుగా ఉన్న తేదీలలో మార్పులు, చేర్పులు చేశారు.
 
 
దేశంలో మినీ మహానాడు
14న పాలకొల్లు నియోజకవర్గ మినీ మహా నాడును అట్టహాసంగా నిర్వహించాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు భావిస్తు న్నారు. పాలకొల్లులో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నారు.
 
 
16న తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణ, భీమ డోలులో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, బుట్టాయిగూడెంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు మినీ మహానాడుకు సిద్ధపడుతున్నారు.
 
 
19న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీ కన్వీనర్‌ ఈలి నాని, జడ్పీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారు.
 
 
20న ఏలూరులో ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నరసాపురంలో ఎమ్మెల్యే మాధవనాయుడు, ఆచంట నియోజకవర్గం పెనుగొండలో మం త్రి పితాని సత్యనారాయణ, నిడద వోలులో ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నాయ కత్వంలో మినీ మహానాడు జరగనుంది.
 
 
24న ఉండి నియోజకవర్గంలో జిల్లాస్థాయి మినీ మహానాడును నిర్వహించబోతున్నా రు. ఎమ్మెల్యే శివరామరాజు ఈ బాధ్యతను భుజానకెత్తుకున్నారు.
 
 
నియోజకవర్గస్థాయి మినీ మహానాడులో రాష్ట్రంపై కేంద్రం అనుచిత వైఖరి, ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రతిపక్షాలైన వైసీపీ, బీజేపీలు చేస్తున్న రాజకీయ దుమారంపై ప్రధానంగా దృష్టి పెడతారు. రాజకీయ తీర్మానాలను ఆమోదించి టీడీపీ కార్యాల యానికి పంపుతారు. ప్రతీ మినీ మహా నాడుకు మూడు నుంచి ఐదు వేల మంది కార్యకర్తలు హాజరు కానున్నారు.
 
 
బస్సు యాత్రపై ఉత్కంఠ
అన్ని పార్టీలు ఏదొక కార్యక్రమంలో బిజీబిజీగా గడుపుతుండగా తాము కూడా రెట్టించిన ఉత్సాహంతో పాల్గొనాలని జనసేన కార్యకర్తలు ఉబలాటపడుతున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే బస్సు యాత్ర షెడ్యూల్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ లేమితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనసేనకు బస్సు యాత్ర ఒక సవాలే. పార్టీ కార్యకర్తలుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న కార్యకర్తలంతా తాము మెచ్చిన జనసేన పార్టీకి అంకితమై పనిచేస్తామని చెబుతున్నారు. ఇదే తరుణంలో యాత్ర నిర్వహణ తర్వాత జనసేనకు ఊహించిన దానికంటే మరింత ఆదరణ లభించడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. ప్రత్యేకించి ఏ ఒక్కరికో పార్టీ నాయకత్వ పగ్గాలు అప్పగించకుండా కాలయాపన చేయడం తగదని, సాధ్యమైనంత త్వరగా నియోజకవర్గ స్థాయి కన్వీనర్లను నియమించాలని డిమాండ్‌ పెరుగుతోంది.
 
 
వైసీపీలో తీరని తగవులు
వైసీపీలో జగన్‌ పాదయాత్ర తర్వాతైనా నియోజకవర్గస్థాయి తగవులు ఒక కొలిక్కి రాకపోతాయా అని ఆశాభావం వ్యక్తమవు తోంది. నెల రోజులపాటు జగన్‌ పాదయాత్ర సాగనున్నందున దీనిని అవకాశంగా తీసుకుని ఉన్నది ఉన్నట్టుగా జగన్‌ చెవిలో వేసేందుకు కొందరు సీనియర్లు ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. కొత్త ముఖాలు పార్టీలో ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి.
 
ఆచంట నియోజకవర్గంలో వైసీపీ సీను ఎప్పటికప్పుడు మారుతోంది. నిన్నా మొన్నటి వరకూ ఆచంట నుంచి ఎవరికి అవకాశం కల్పిస్తారోనని ఎదురుచూస్తుండగా మాజీ ఎమ్మెల్యే చెరుకు వాడ శ్రీరంగనాధరాజును నేరుగా పార్టీలో చేర్చు కుని ఆయనకే అభ్యర్ధిత్వం ఇవ్వడానికి సిద్ధపడు తున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గాల్లోను తీవ్రమైన గందరగోళం నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఎవరనేది సూచాయిగా నిర్ధారించలేదు. ఏలూరు, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రధానంగా అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే వారి విషయంలో పదే పదే వదంతులు వ్యాప్తి చెందడం ప్రస్తుత నాయకుల్లోనే సస్పెన్స్‌కు గురిచేస్తోంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
 
వైసీపీలోకి రంగరాజు.. భీమవరంలో 27న చేరిక
25-05-2018 09:16:15
 
636628365773645262.jpg
(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి)
మాజీ ఎమ్మెల్యే రంగరాజు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ నెల 27న భీమవరంలో చేరేం దుకు నిర్ణయించారు. జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా కొనసాగుతున్న ఆయన తొలిసారిగా అత్తిలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. నియో జకవర్గాల పునర్విభజనలో అత్తిలి కనుమరుగు కావడంతో కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించారు. అనంత రం వైసీపీలో చేరి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
 
గత ఎన్నికల్లో జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా పనిచేశారు. నాలుగేళ్లు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. కొద్దిరోజుల క్రితం పార్టీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖపంపారు. రంగరాజు విలేఖరులకు వివ రాలను వెల్లడించారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ గౌరవంగా చూసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు తగిన గౌరవం ఇచ్చారన్నారు. పార్టీ కార్యకర్తలు, తన అభిమానులు, జగన్‌ ఒత్తిడి మేరకు వైసీపీలో చేరుతున్నట్టు రంగరాజు తెలిపారు.
Link to comment
Share on other sites

‘పశ్చిమ’ లోక్‌సభ స్థానాలకు కొత్త ముఖాలు!
25-05-2018 03:55:57
 
636628173594264043.jpg
నరసాపురంలో టీడీపీ తరఫున రఘురామకృష్ణంరాజు...
బీజేపీ నుంచి ఎంపీ గోకరాజు పోటీ అనుమానమే
  • ఏలూరు స్థానంపై మాగంటి బాబు నిరాసక్తత
  • బోళ్ల బుల్లిరామయ్య మనవడికి చాన్స్‌
  • ఈ రెండు చోట్ల వైసీపీ బరిలో కనుమూరి, శ్రీధర్‌?
  • టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో అత్యధికులకు మళ్లీ అవకాశం
  • తాడేపల్లిగూడెం కోసం ఆ పార్టీలో గట్టి పోటీ
  • ఇక్కడ బీజేపీ నుంచి గెలిచిన మాణిక్యాలరావు
  • కొవ్వూరు వర్గపోరులో జవహర్‌ సతమతం
ఏలూరు, మే 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజకీయ పవనాలు ఎటు వీస్తున్నాయో స్పష్టమైన సంకేతాలిచ్చే జిల్లాల్లో పశ్చిమగోదావరి ఒకటి. జిల్లాలో ఈసారి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ జిల్లా సంపూర్ణంగా టీడీపీ వైపు నిలబడింది. వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. గతంలోలా బలం నిలుపుకోవాలని టీడీపీ తహతహలాడుతుండగా.. కొంతైనా ఆ పార్టీని దెబ్బ తీయాలన్న ప్రయత్నంలో వైసీపీ ఉంది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ మద్దతుతో నరసాపురం లోక్‌సభ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలను బీజేపీ గెలుచుకొంది. ఈసారి ఆ సీట్లలో కూడా టీడీపీనే పోటీ చేయనుంది. ఫలితంగా ఎంపీ సీట్లు రెంటిలోనూ రెండు పార్టీల తరఫునా కొత్త ముఖాలు రంగంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
 
ఏలూరు పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులపై స్పష్టత..
అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లలో ఈ రెండు పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులపై కొంత స్పష్టత కనిపిస్తోంది. ఏలూరు అసెంబ్లీ సీటుకు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మళ్లీ పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అంతర్గత సమస్యలు కొన్ని ఉన్నా ఆయనకు నియోజకవర్గంలో పోటీ లేదు. వైసీపీ అభ్యర్థిత్వం మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మధ్యాహ్నపు ఈశ్వరికి దక్కుతుందని అంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నానికి ఈ సీటుపై ఆసక్తి ఉన్నా విభేదించకుండా సర్దుకుపోతున్నారు. దెందులూరులో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మళ్లీ పోటీ చేయనున్నారు. ప్రభాకర్‌ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నా నియోజకవర్గంపై గట్టి పట్టున్న నాయకుడు కావడంతో అధినాయకత్వం కూడా మరో ఆలోచన చేయడం లేదు. వైసీపీ తరఫున కొఠారు అబ్బయ్య చౌదరిని రంగంలోకి దించనున్నారు. ఆయన అమెరికాలో ఉద్యోగం వదులుకుని తిరిగొచ్చారు. ఉంగుటూరులో టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులే మళ్లీ బరిలోకి దిగుతారు. ఆయన పార్టీ కార్యక్రమాలు తు.చ. తప్పకుండా నిర్వహిస్తుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా మంచి మార్కులు పొందారు. వైసీపీ తరఫున ఈ నియోజకవర్గంలో పుప్పాల వాసుబాబు పోటీ చేయనున్నారు. చింతలపూడిలో టీడీపీ అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాత మరోసారి పోటీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ పార్టీలోని మరో వర్గంతో ఆమెకు సమస్యలు ఉన్నాయి. వ్యతిరేక వర్గంతో సఖ్యత కుదుర్చుకుని అందరినీ కలుపుకొని పోవాలని పార్టీ నాయకత్వం ఆశిస్తోంది. ఆమె కాని పక్షంలో తమకు అవకాశం ఇవ్వాలని డాక్టర్‌ కర్రా రాజారావు, జడ్పీ మాజీ చైర్మన్‌ జయరాజు కోరుతున్నారు. వైసీపీ తరపున ఐఆర్‌ఎస్‌ మాజీ అధికారిణి ఎలీజా పోటీ చేస్తారని అంటున్నారు. పోలవరం (ఎస్టీ)లో కూడా టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావుతో ఒక వర్గం విభేదిస్తోంది. కొన్ని ఆరోపణలు కూడా ఆయన్ను చుట్టుముట్టాయి. ఆయనకు ఇవ్వకపోతే తమకు అవకాశం ఇవ్వాలని బొరగం శ్రీనివాస్‌, కుంజా సుభాషిణి, మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాస్‌ కుమార్తె కోరుతున్నారు. ఈ నియోజకవర్గంలో వర్గాల సమస్యలను ఎలా పరిష్కరించాలన్నదానిపై టీడీపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఇక్కడ వైసీపీ టికెట్‌ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకే దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
 
నరసాపురం పరిధిలో ఆసక్తికరం...
నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమీకరణలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ ఆచంటలో తిరిగి పోటీ చేయనున్నారు. వైసీపీ తరఫున ఇక్కడ నియోజకవర్గ కన్వీనర్‌ కారు శ్రీనివాస్‌ పేరు వినిపిస్తోంది. ఇంకా బలమైన అభ్యర్థి కోసం ఆ పార్టీ అన్వేషిస్తోందని చెబుతున్నారు. నరసాపురంలో టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మరోసారి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరినా అసెంబ్లీకి ఆయన పేరును పరిశీలించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. నరసాపురం లోక్‌సభ స్థానానికి ఏ కారణం వల్లనైనా రఘురామ కృష్ణంరాజు పేరు వెనక్కి వెళ్తే సుబ్బారాయుడిని నిలిపే అవకాశం ఉందంటున్నారు. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు తిరిగి పోటీ చేయనున్నారు. పాలకొల్లులో సిటింగ్‌ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తిరిగి పోటీ చేయనున్నారు. ఆయనకు టీడీపీలో పెద్దగా పోటీ కూడా లేదు. వైసీపీ నుంచి సీనియర్‌ నేత నాగబాబుకు అవకాశం వస్తుందని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు కూడా బరిలో ఉన్నారు. భీమవరంపై కొంత ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే రాజ్యసభ ఎంపీ సీతారామలక్ష్మి తనయుడు జగదీశ్‌కు అవకాశం రావచ్చని అంటున్నారు. అంజిబాబు ప్రస్తుతానికి పోటీపై ఆసక్తి చూపుతున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివా్‌సకు అవకాశం రావచ్చంటున్నా.. గాదిరాజు సుబ్బరాజు, ఏఎస్‌ రాజు వంటి వారు కూడా పోటీలో ఉన్నారు. ఉండిలో ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు మరోసారి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సమస్యలు ఉన్నా ఆ పార్టీలో బలమైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదని అంటున్నారు. వైసీపీలో మొదట మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కీలకంగా కనిపించారు.
 
ఆరు నెలల కింద యండగండి నరసింహరాజును నియోజకవర్గ ఇన్‌చార్జిగా పెట్టారు. టికెట్‌ ఈయనకేనని ప్రచారం జరుగుతోంది. తణుకులో టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ మళ్లీ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వంకా రాజకుమారి, ఆమె భర్త వంకా రవీంద్ర కూడా టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ టికెట్‌ కోసం త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యేగా బీజేపీకి చెందిన మాజీ మంత్రి మాణిక్యాలరావు ఉన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ చార్జిగా ఉన్న ఈలి నాని తనకే టికెట్‌ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నా.. ఆయనకు మునిసిపల్‌ చైౖర్మన్‌ బోలిశెట్టి శ్రీనివాస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. జడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు కూడా బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణకు టికెట్‌ వస్తుందని అంటున్నారు. వలవల బాబ్జీ కూడా పోటీదారుగా ఉన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన వద్ద పనిచేసి ప్రస్తుతం వేరే రాష్ట్రంలో పనిచేస్తున్న ఒక ఐఏఎస్‌ అధికారి పేరు కూడా ఇక్కడ వినిపిస్తోంది. ఆయన ఆసక్తి చూపితే వైసీపీ టికెట్‌ ఆయనకే వస్తుందని అంటున్నారు.
 
మొత్తం స్థానాలు: 15
టీడీపీ: 14.. బీజేపీ: 1
వైసీపీ: 0
 
శేషారావుకు సోదరుడి నుంచే పోటీ..
 
ఈ జిల్లాలోని నిడదవోలు, కొవ్వూరు (ఎస్సీ), గోపాలపురం అసెంబ్లీ స్థానాలు రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి. టీడీపీ టికెట్‌ విషయంలో నిడదవోలు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు ఆయన సోదరుడి నుంచే పోటీ ఎదురవుతోంది. ఆ సమస్య పరిష్కారమైతే శేషారావుకే తిరిగి టికెట్‌ వస్తుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కుందుల సత్యనారాయణ అనే టీడీపీ నేత కూడా పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి సీనియర్‌ నేత జీఎస్‌ రావు కుమారుడు శ్రీనివాసనాయుడికి టికెట్‌ వస్తుందని చెబుతున్నారు. ఆలపాటి నరేంద్ర కూడా రేసులో ఉన్నారు.
 
కొవ్వూరు(ఎస్సీ)లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కేఎస్‌ జవహర్‌ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు టీడీపీ వర్గాల మధ్య నెలకొన్న వైరం ఆయన తలకు చుట్టుకొంది. ఆయన తటస్థంగా ఉండకుండా ఓ వర్గం వైపు ఉంటున్నారన్న విమర్శ ఎదుర్కొంటున్నారు. ఈ గొడవల నేపథ్యంలో ఆయన ఈసారి కృష్ణా జిల్లా తిరువూరు (ఎస్సీ) వెళ్లిపోతారని ప్రచారం మొదలైంది. ఆయన మాత్రం ఖండిస్తున్నారు. తాను కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని గట్టిగా చెబుతున్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వనిత పోటీ చేయనున్నారు. గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యేగా ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇతర రిజర్వుడు నియోజకవర్గాల మాదిరిగా ఇక్కడ గొడవలు లేవు. కానీ ఆయన నియోజకవర్గంపై పట్టు సాధించలేదన్న అభిప్రాయంలో కొందరు నేతలు ఉన్నారు. ఏ కారణం వల్లనైనా వెంకటేశ్వరరావుకు అవకాశం రాకపోతే మద్దిపాటి వెంకట్రాజు పేరు పరిశీలనకు రావచ్చని అంటున్నారు. వైసీపీ నుంచి తలారి వెంకట్రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ముప్పిడి సంపత్‌కుమార్‌ కూడా పోటీలో ఉన్నారు.
 
 
నరసాపురంలో కొత్తవారే! 23.jpg
బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ఇటీవల పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఇటీవల టీడీపీలో చేరారు. ఆయన ఈ స్థానంలో పోయినసారి బీజేపీ టికెట్‌ ఆశించారు. కాని అనూహ్యంగా గోకరాజుకు లభించి ఆయన గెలిచారు. ఈసారి గోకరాజు పోటీ చేయడం నమ్మకం తక్కువేనని అంటున్నారు. టీడీపీ టికెట్‌ ఈసారి రఘుకు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ కూడా ఈసారి కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. కాంగ్రె్‌సలో ఉన్న మాజీ మంత్రి కనుమూరి బాపిరాజును పార్టీలోకి తీసుకొచ్చి నిలపాలని ఆ పార్టీ నేతలు కొందరు ప్రయత్నిస్తున్నారు.
 
 
యువ నేతల బరి.. ఏలూరు1212.jpg
ఏలూరు సిట్టింగ్‌ టీడీపీ ఎంపీ మాగంటి బాబు ఈసారి ఎంపీగా పోటీ చేస్తారా అన్నది అనుమానంగా కనిపిస్తోంది. ఎంపీ పోటీ ఆర్థికంగా తలకు మించిన భారం కావడం, కొన్ని నియోజకవర్గాల్లో వర్గాల సమస్యలు ఎదురు కావడంతో ఆయన కొంత నిరాసక్తత కనబరుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎంపీగా పోటీ చేయకపోతే ఆయన కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే లోక్‌సభ సీటు యువ నేత బోళ్ల రాజీవ్‌కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈయన కేంద్ర మాజీ మంత్రి, దివంగత టీడీపీ సీనియర్‌ నేత బోళ్ల బుల్లిరామయ్య మనవడు. రాజకీయాలపై తనకున్న ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనలు జరుపుతున్నారు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన తోట చంద్రశేఖర్‌ ఆ పార్టీకి దూరమై ఇటీవల జనసేనలో చేరారు. దీంతో వైసీపీ నుంచి మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు పోటీ చేయడం ఖాయమేనని చెబుతున్నారు.
Link to comment
Share on other sites

జగన్‌కు.. చిక్కేదెవరు?
01-06-2018 12:56:54
 
636634546219191114.jpg
పాలకొల్లు(పశ్చిమగోదావరి జిల్లా): వైసీపీ అధినేత జగన్‌ పశ్చిమగోదావరి జిల్లాలో చేస్తున్న పాదయాత్రతో రాజకీయంగా వేడెక్కింది. రాబోయే ఎన్నికల్లో గెలుపొందేందుకు తగిన వ్యూహ రచన చేస్తున్నారు. ఇందు కోసం జిల్లాలోని ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన కొందరు ప్రముఖులు వైసీపీలోకి వెళ్లిపోతున్నారని ప్రచారం జోరందుకుంది.
 
ఇందులో పాలకొల్లు నియోజకవర్గంలో ఓ జాతీయ పార్టీకి చెందిన నాయకుడు, డెల్టాలోని అధికార పార్టీ కి చెందిన ఒక ప్రజా ప్రతినిధి వైసీపీ తీర్థం తీసుకుంటారని ముమ్మర ప్రచారం జరుగుతోంది. జగన్‌ జిల్లాలో ప్రవేశించడానికి ముందే మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్యను వైసీపీలోకి ఆహ్వానించారు. ఆయన సున్నితంగా తిరస్కరించి, తాను తటస్థంగానే ఉంటానని చెప్పారు. రాయబారం నడిపిన నేతలు మాత్రం మీరు తటస్థంగానే ఉండండి.. మీ కుమారుడు సూర్యప్రకాష్‌కు డెల్టాలో ఆచంట లేదా నరసాపురంలలో టిక్కెట్టు ఇప్పిస్తా మని, తమ పార్టీ విజయానికి సహకరించాలని కోరుతు న్నారు. మెట్టలో పట్టున్న కరాటం రాంబాబును వైసీపీ శ్రేణులు ఆహ్వానించారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తే సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన.. ఆలోచిద్దాం.. సమయం ఉందిగా అంటూ బదులిచ్చినట్లు సమాచారం.
 
 
పాలకొల్లులో పొలిటికల్‌ వేడి
పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీలో సమీకరణలపై ప్రచారం ఊపందుకుంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి వైసీపీలోకి వస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2004లో తటస్థంగా ఉన్న డాక్టర్‌ బాబ్జీని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలిచి టిక్కె ట్‌ ఇచ్చి పాలకొల్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అనం తరం 2009లో జరిగిన త్రిముఖ పోటీలో ఓటమి పాల య్యారు. అప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బంగారు ఉషారాణి విజయం సాధించగా, ప్రజారాజ్యం పార్టీ అధినే త మెగాస్టార్‌ చిరంజీవి, డాక్టర్‌ బాబ్జీ ఓటమి పాలయ్యారు. తర్వాత 2014లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యం లో డాక్టర్‌ బాబ్జీకి టీడీపీ టిక్కెట్‌ లభించలేదు. దీంతో బాబ్జీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. వైసీపీ నుంచి మేకా శేషుబాబు పోటీ పడినప్పటికీ టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు విజయం సాధించారు. 2014 ఎన్నికల సమయంలో డాక్టర్‌ బాబ్జీకి టిక్కెట్‌ ఇవ్వనప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సముచితంగా గౌరవిస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ ఆయన మనస్థాపం తో బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు చెడటంతో నేరుగా బీజేపీ బరిలోకి దిగితే పాలకొల్లు నియోజకవర్గం నుంచి డాక్టర్‌ బాబ్జీ గెలుపు సునాయసమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీ, వైసీపీ పొత్తు పెట్టుకుంటే డాక్టర్‌ బాబ్జీ గెలుపు మరింత సునాయాసమని వైసీపీ శ్రేణుల్లోని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పాలకొల్లు నుంచి వైసీపీలో గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు టిక్కెట్టు ఆశిస్తున్నారు. వర్గపోరు జగన్‌ దృష్టికి వెళ్ళడంతో తృతీయ ప్రత్యామ్నాయంగా డాక్టర్‌ సత్యనారాయణమూర్తికి అవకాశం కల్పిస్తారనే ప్రచారంతో పాలకొల్లులో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
 
 
టీడీపీ ప్రజా ప్రతినిధికి గేలం..!
డెల్టాలో బీసీ వర్గానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధికి వైసీపీ గేలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెనుకబడిన వర్గాల్లో మంచి పట్టుకలిగిన ఆ ప్రజా ప్రతినిధిని పార్టీలోకి తెచ్చుకుని నరసాపురం పార్లమెంటరీ స్థానంలో తమ అభ్యర్థిగా నిలిపితే మంచి మెజారిటీతో గెలుస్తారని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీకి ఉన్న ఫిక్స్‌డ్‌ ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతోపాటు సంఖ్యాపరంగా అధికంగా ఉన్న బీసీ వర్గాలలోని ఓట్లు సొంతం చేసుకుంటే గెలుపొందవచ్చనేది వ్యూహం. ఆ ప్రజా ప్రతినిధిని ఏదో ఒక విధంగా పార్టీలోకి తెచ్చుకోవడం మంచిదనే జగన్‌కు ఆ పార్టీలోని కొందరు సీనియర్లు సూచించినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

So Jagan trying for TDP-MLA & Minister - Pithani Satyanarayana? 

Any other BC MLAs in TDP West Godavari?

 

I thought BCs mainly Gowda's & Yadav's will stick to TDP mostly this time. Hope Pithani will not jump.

Godavari BCs lo pattu kosame CBN Pithani ki ministry ichhindi.

Both Gowda's & Yadav's have ministries from Godavari Districts.

 

Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

So Jagan trying for TDP-MLA & Minister - Pithani Satyanarayana? 

Any other BC MLAs in TDP West Godavari?

 

I thought BCs mainly Gowda's & Yadav's will stick to TDP mostly this time. Hope Pithani will not jump.

Godavari BCs lo pattu kosame CBN Pithani ki ministry ichhindi.

Both Gowda's & Yadav's have ministries from Godavari Districts.

 

yes

Link to comment
Share on other sites

13 minutes ago, sonykongara said:

yes

Monnati daka YCP lo unna oka achanta BC nayakudini ticket ledu ani chepparu

Athanu TDP loki jump. So BC andaru okate party ippudu acharya lo. If they hold together until elections Pitani easy win

Link to comment
Share on other sites

1 minute ago, AbbaiG said:

Monnati daka YCP lo unna oka achanta BC nayakudini ticket ledu ani chepparu

Athanu TDP loki jump. So BC andaru okate party ippudu acharya lo. If they hold together until elections Pitani easy win

tambayya na bro

Link to comment
Share on other sites

2 minutes ago, AbbaiG said:

Yes

Naade ticket ani chaala aasalu pettukunnadu. Ippudu ranga raju ki antunnaru

mana daggara nundi poyinode ga prp loki poyadu malli tdp ki vacchadu taruvtha ycp ki velladu malli tdp ki vacchada villu eddaru chuttalu anukunta bro

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఆ ఒక్క సీటుపై ఎటూ తేల్చుకోలేక పోతున్న ఏపీ పార్టీలు
14-06-2018 13:09:48
 
636645786005026555.jpg
  • సీటు ఎవరికో..?
  • ప్రధాన పార్టీల అభ్యర్థులపై జోరుగా చర్చలు
  • ఏడాది ముందుగానే వేడెక్కిన తీరప్రాంత రాజకీయం
(నరసాపురం)(పశ్చిమగోదావరి జిల్లా)
ఎన్నికలకు ఇంకా పది నెలలు గడువుంది. ముందస్తు వచ్చే అవకాశాలు కూడా లేవు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జగన్‌ పాదయాత్ర పూర్తయిన తరువాత ఇక్కడ రాజకీయ వేడి పెరిగింది. రానున్న ఎన్నికల్లో సీటు ఎవరికీ దక్కతుందన్న దానిపై ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు. వారికి అనుకూలమైన నేతకే ఈసారి టిక్కెట్‌ వస్తుందని లెక్కలు గట్టి చూపిస్తున్నారు. చర్చలో పాల్గొన్న వారి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీతో పాటు వైసీపీ, జనసేన పార్టీల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయమై ఈ చర్చలు కొనసాగుతుండటం గమనార్హం.
 
 
అధికార పార్టీలో గ్రూపులు
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే మాధవనాయుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు రెండు గ్రూప్‌లుగా కొనసాగుతున్నారు. వీరి మధ్య పరస్పర విభేదాలు, ఆరోపణలు లేనప్పటికీ ఒకరు చేపట్టే కార్యక్రమాల్లో మరొకరు పాల్గొన్నారు. దీంతో పార్టీ శ్రేణులు కూడా రెండు వర్గాలుగా మిగిలిపోయారు.ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో టిక్కెట్‌ ఆధిష్ఠానం ఎవరికి ఇస్తుందన్నది పెద్ద సస్పెన్‌గా మారింది.
 
 
వైసీపీలో తొలగని అయోమయం
ఇక వైసీపీ విషయాన్నికి వస్తే ఇటీవల జగన్‌ పర్యటనలో అభ్యర్థిని ప్రకటిస్తారని ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూశారు. కానీ జగన్‌ ఆదిశగా ప్రకటన చేయకపోవడంతో పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో రెండు సామాజిక వర్గాలదే పైచేయి. 90 వేల మంది ఓటర్లు ఈ రెండు వర్గాల్లోనే ఉన్నాయి. దీంతో ఈ కులాలకు చెందిన వారికే రానున్న ఎన్నికల్లో సీటు వస్తుందని విసృత్తంగా ప్రచారం జరుగుతోంది. దీన్ని ముదునూరి వర్గీయులు ఎప్పటి కప్పడు ఖండిస్తున్నా...చెక్‌ మాత్రం పడలేదు. దీంతో గతంలో వైసీపీలో చక్రం తిప్పిన మాజీలు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సందిగ్థంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన పేరును వారు విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు.
 
 
బలం పెంచుకునే పనిలో జనసేన
ఇక జనసేన విషయానికి వస్తే.. నియోజకవర్గంలో మెగా అభిమానులు భారీగానే ఉన్నారు. గతంలో ప్రజారాజ్యానికి ఈ నియోజకవర్గంలో 45 వేలు ఓట్లుపైనే వచ్చాయి. ఇప్పుడిప్పుడే జనసేనను పట్టణ, మండలాల్లో బలోపేతం చేసేందుకు నాయకులు గట్టిగా కృషి చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో కొనసాగిన కలవకొలను తులసీ కీలక బాధ్యతలు మోస్తున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు డాక్టర్లు కూడా జనసేనకు జై కొట్టారు. ఇదిలా ఉంటే డెల్టా ప్రాంతం లోని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒకరు జనసేన తరపున పోటీ చేసేందుకు అసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఈ నేత ఆ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకుల్ని కలసి వారి ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా మూడు పార్టీల్లో నెలకొన్న పరిణామాలతో తీర ప్రాంత రాజకీయం వేడెక్కింది.
Link to comment
Share on other sites

పశ్చిమాన జగన్ పాదయాత్రలో శ్రుతిమించింది ఏమిటి..?
13-06-2018 10:47:20
 
636644836525807898.jpg
రాజకీయాల్లో ఎవరి అంచనాలు వారివి. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ అంచనాలు భారీగానే ఉంటాయి. "పక్క పార్టీ నాయకులు మా పార్టీలోకి వచ్చేస్తారు. పక్క పార్టీకి పుట్టగతులుండవు'' వంటి కామెంట్లు గట్టిగానే వినిపిస్తుంటాయి. ఇలాంటివి ఊహాగానాల వరకు పరిమితమైతే ఫర్వాలేదు. అవి శ్రుతిమించితేనే చిక్కులు వస్తాయి. వైఎస్‌ జగన్ పాదయాత్రలో అక్షరాలా అదే జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర మొదలయ్యే సమయంలో "జగనన్న పాదయాత్ర సమయంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. అధికారపార్టీలో ఉన్న పెద్దపెద్ద నేతలే మా పార్టీలోకి వచ్చేస్తారు'' అంటూ వైసీపీ నాయకులు భారీగా ప్రచారాలు చేశారు. తీరా చూస్తే, వారి ఆశలు ఏమాత్రం తీరలేదు. ఇంతకీ వారి ప్రచారార్భాటాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
         ఏ పార్టీ నాయకులకైనా ఆ పార్టీ అధినేతపై అపారమైన విశ్వాసం ఉండటం సహజం. తమ జిల్లాకో, నియోజకవర్గానికో తమ పార్టీ అధ్యక్షుడు వస్తే రాజకీయంగా ఎంతో లాభిస్తుందని ఆయా నేతలు నమ్ముతారు. కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితి కొంత ఉండవచ్చు. కానీ అన్ని సందర్భాల్లోనూ అదే జరుగుతుందనుకుంటే పొరపాటే! ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో ఇదే జరిగింది. తమ పార్టీ అధినేత జగన్ పశ్చిమలో పాదయాత్ర చేస్తే మొత్తం పార్టీ పరిస్థితే మారిపోతుందని కొందరు వైకాపా నేతలు సంబరపడ్డారు. అదే సమయంలో అధికార టీడీపీకి చెందిన బడాబడా నేతలంతా తమ అధినేత సమక్షంలో పార్టీలో చేరడానికి క్యూకడతారని భారీగా ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే "తామొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు'' అంటారే.. అలాగే మారిందట వారి పరిస్థితి!పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర ముగిసింది. కానీ వారి అంచనాలు మాత్రం బాక్సాఫీసు వద్ద కొన్ని సినిమాలు బోల్తా కొడతాయి చూడండి- అలాగే బోల్తాకొట్టాయి.
 
 
     పశ్చిమలో జగన్ పార్టీ తీవ్రమైన కష్టాల్లో ఉంది. 2014 ఎన్నికల వరకు జిల్లాను బాగా నమ్ముకున్న ఆ పార్టీ నేతలకు ఇక్కడి ఓటర్లు గట్టి షాకిచ్చారు. జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలనూ టీడీపీకే కట్టబెట్టారు. దాంతో ఆ షాక్ నుంచి తేరుకోవడానికి వైకాపా నేతలకు చాలాకాలం పట్టింది. అంతకు ముందు వరకూ పార్టీ పక్షాన ఏ కార్యక్రమం చేపట్టినా ఈ జిల్లా నుంచే మొదలుపెట్టేవారు జగన్‌. అలాంటిది 2014 షాక్‌ తర్వాత కొంత కాలంపాటు ముఖం చాటేశారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. అవి అతి స్వల్పమే! జగన్ వైఖరితో పార్టీ శ్రేణుల్లోనూ కొంత నిరుత్సాహం ఏర్పడింది.
 
 
     ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఆ పార్టీకి జోష్‌ పెంచే సంఘటన ఒకటి జరిగింది. గత ఏడాది ద్వారకా తిరుమలలో జరిగిన ఒక కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. ఆ సమావేశం విజయవంతం కావడంతో మళ్లీ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఊపొచ్చింది. అక్కడనుంచి వారిలో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా జగన్ పాదయాత్ర చేపట్టడంతో.. పశ్చిమలో మరింత కదలిక వచ్చింది. జిల్లాలో జగన్ పాదయాత్ర జరిగితే చాలా మార్పు వస్తుందని వైకాపా నేతలు అంచనాలు వేసుకున్నారు. ఒక దశలో "ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయనీ, టీడీపీకి చెందిన కొంతమంది బడా నేతలు మా పార్టీలోకి వచ్చేస్తున్నారనీ'' కొందరు నేతలు భారీగా ప్రచారాలు కూడా చేశారు. అయితే వారి ఊహలు తారుమారు కావడం గమనార్హం!
 
 
        పశ్చిమగోదావరి జిల్లాలో కాస్తోకూస్తో పేరున్న ఇద్దరు నాయకులు మాత్రమే జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. మరెవరూ ఆ పార్టీ వైపు తొంగి చూడలేదు. పార్టీలో చేరిన ఇద్దరు నేతల్లో ఒకరు కాంగ్రెస్‌పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన చెరువకువాడ శ్రీరంగనాథరాజు కాగా, మరొకరు అప్పుడెప్పుడో టీడీపీలో చేరి, ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విద్యావేత్త గుబ్బల తమ్మయ్య. వీరు తప్ప ఇంకెవరూ జగన్ పార్టీలో చేరలేదు. విచిత్రం ఏమిటంటే పార్టీలో చేరిన ఈ ఇద్దరు నేతలు ఆచంట టిక్కెట్ ఆశిస్తున్న వారే కావడం. వారిలో శ్రీరంగనాథరాజుకు కచ్చితంగా టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ఆయన వైసీపీలో చేరినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆ కథ ఎలా ఉన్నా.. ప్రస్తుతం వైసీపీ నేతలే మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. జగన్ అన్న సమక్షంలో అద్భుతాలు జరుగుతాయనుకుంటే.. "ఇదేంటి చెప్మా, ఇలా జరిగింది'' అంటూ వారిలో వారే తెగ గుంజుకుపోతున్నారట! అందుకే "విశ్వాసం మంచిదే, అతివిశ్వాసం మంచిది కాదు'' అని పెద్దలు అంటారు!
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
మిగతా పార్టీలకు ఇప్పటి నుంచే చెక్‌ ఏపీ మంత్రి సూపర్ ప్లాన్
11-07-2018 12:16:01
 
636669081607147435.jpg
ఏలూరు: ఎన్నికల కాలం దగ్గర పడింది. ఎత్తులకు, పైఎత్తులకు పదునెక్కింది. వ్యూహ, ప్రతివ్యూహాలు మారుతున్నాయి. అందునా రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియో జకవర్గంలో సీన్‌ ఎలా ఉండబోత్నుది... అంచనాలు ఎలా వేస్తున్నారు.. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి పితాని సత్య నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజక వర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలోనే ఒక్కసారిగా కేడర్‌ను ఒక వేదికగా రప్పించి, సాదక బాధకాలను తెలుసుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తక్షణ చర్యలకు దిగే అవకాశం ఉంది. ప్రభుత్వ శాఖల పరంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ ఒక దారికి తెచ్చేందుకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయని మంత్రి భావి స్తున్నారు. ఆచంట నియోజకవర్గం నుంచి ఎదురులేని బీసీ నాయకుడిగా వరుసగా నెగ్గు కుంటూ వస్తున్న ఆయన ఈసారి కూడా రికార్డు సృష్టిం చాలన్న భావనలో ఉన్నారు.
 
అందుకనే గడచిన నాలుగేళ్ళు ఒక ఎత్తు, ఈ చివరి ఏడాది మరో ఎత్తు.. అనే వ్యూహానికి ఆయన పదును పెట్టారు. వాస్తవానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఇప్పటిదాకా కేడర్‌ను కలుపుకు పోవడంలో సంతృప్తికర విజయం సాధించినా చాలా చోట్ల అధికార పార్టీలో ఉండి కొన్ని పనులను చేయించుకోలేక పోతున్నామన్న బెంగ, అసంతృప్తి కార్యకర్తల్లో గూడు కట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తించగలిగారు. అందు కనే నేటి నుంచి రెండు రోజులపాటు నాలుగు మండలాల తెలుగుదేశం కేడర్‌ను ఒక వేదిక మీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. అత్యంత కీలకమైన ఈ సమావేశంలో కార్యకర్తల మాట వేద వాక్కు అయ్యేలా ముందు జాగ్రత్త పడుతున్నారు. అప్పటికప్పుడే రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో పెండింగ్‌కు బూజు దులపాల్సిందేనని మంత్రి పితాని ఒక నిర్ణయానికి వచ్చారు.  
 
ఆచంటలో ఏం జరుగుతోంది
ఆచంట నియోజకవర్గం తొలుత ఎస్సీ రిజర్వుగా ఉండి, ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో జనరల్‌ కోటాలోకి వచ్చింది. ఈ నియోజకవర్గంలో బీసీ నాయ కుడిగా పగ్గాలు చేపట్టిన పితాని సత్యనారాయణ ఆ తరు వాత అంచెలంచెలుగా ఎదిగి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకోగలిగారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రి వర్గంలో నెంబర్‌-2గా ఎదిగారు.ఆ తరువాత జరిగిన పరిణామాల క్రమంలో టీడీపీలో చేరారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ఉన్న అత్యధిక బీసీలకు ఆయన మొదటి నుంచి నాయకత్వం వహిస్తున్నారు. అయితే పితానిని ఢీ కొనేందుకు వైసీపీ గతంలోనూ, ఇప్పుడు తన ప్రయత్నాలను ఆరంభించింది. తాజాగా ఆచంట నియోజకవర్గ వైసీపీ కన్వీనర్‌గా రంగనాధరాజు ఇటీవలే నియమితులయ్యారు. మొన్నటి వరకు ఆచంటలో ఉన్న రాజకీయాల్లో కొంత మార్పులు,చేర్పులకు అవకాశం వస్తుందని అందరూ అంచనా వేస్తుండగా, మంత్రి పితాని మాత్రం అలాంటి దేమీలేదు...నా పట్టు నాదే అన్నట్టుగా వ్యవహా రాలకు పదునుపెట్టారు.
 
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనను ఢీకొనేందుకు రకరకాల ఎత్తుగడలకు మిగతా పార్టీలు సంసిద్ధం అవుతున్నాయి. దీనికి విరుగుడిగా నియోజక వర్గంలో తనకంటూ ఉన్న కేడర్‌ సంతృప్తికర స్థాయిలో ఉండాలని, తగ్గట్టుగానే వ్యవహార శైలిని పూర్తిగా మార్చివేయాలని మంత్రి భావిస్తున్నారు. మరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా పెండింగ్‌ పనులకే ప్రస్తుతం దృష్టి పెట్టారు. పనిలోపనిగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు, సర్పంచ్‌లు, బూత్‌ కమిటీల నేతలు, యావత్‌ పార్టీ బాధ్యతలు, స్థానిక సంస్థల బాధ్యతలు కలిగిన వారం దరినీ మండలాల వారీగా గుర్తించి వారికి ఆహ్వానం పంపారు. ప్రతీ గ్రామంలోనూ సమస్యను గుర్తించడం, పరిష్కారం ఎప్పటిలోపు జరగాలో ఒక నిర్ణయానికి రావడం, వీటిని క్రోడీకరించి అధికారుల చేత పరిష్క రించేలా జాగ్రత్త పడడం ప్రస్తుతం మంత్రి పితాని చేస్తున్న రాజకీయ వ్యూహంలో భాగం. మిగతా పార్టీల నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు తనను తప్పు పట్టకుండా, పార్టీని ఇబ్బంది పెట్టకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా వైసీపీకి ఏమాత్రం చోటు ఇవ్వ కుండా చూడాలన్నదే మంత్రి తపన. దీనినే లక్ష్యంగా ఎంచుకుని తనకు అనుకూలంగా ఉంటున్న ముఖ్య కేడర్‌ను అప్రమత్తం చేయగలిగారు.
 
 
రెండు రోజులపాటు సమావేశాలు
నాలుగేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా చర్చించేందుకు, పరిష్కరించేందుకు బుధ, గురువారాల్లో రోజుకు రెండు మండలాలు చొప్పున కేడర్‌ను సమావేశాలకు ఆహ్వానించారు. ఆచంట, పోడూరు మండలాలను తొలిరోజు బుధవారం ఆచంట ఏఎంసీ ప్రాంగణంలో పరస్పరం సమావేశం అవుతారు. ఈ రెండు మండలాల్లో ఉన్న ముఖ్యులందరితోనూ ముఖాముఖి భేటీ అవుతారు. ఇప్పటిదాకా గళం విప్పని ముఖ్య నేతలు కూడా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. నేరుగా సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారు. జిల్లా స్థాయిలో కొన్ని పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా.. ఇంకా పెండింగ్‌లోనే ఉంటున్న విషయాన్ని ఆయన దృష్టిలోకి తీసుకువెళ్ళబోతున్నారు. గురువారం పెనుమంట్ర, పెనుగొండ మండలాల కేడర్‌తో సమావేశం అవుతారు. ‘ఇప్పటికైనా మంత్రి పితాని తీసుకున్న నిర్ణయం సమ ర్ధనీయం. నేరుగా కూర్చొని మాట్లాడుకుంటేనే బాగుం టుంది. మాకూ విషయాలు ఆయన దృష్టికి తీసుకు వెళ్ళేందుకు వీలు ఉంటుంది. అధికారంలో ఉండి పనులు చేయించుకోకపోతే ఇంక మేమెందుకు. జనం అడగక ముందే అప్రమత్తమైతే మంచిది. అని పార్టీ నాయకులు నేరుగానే చెబుతున్నారు.
Link to comment
Share on other sites

‘మేము మీ అభిమానులం. ఎన్నికల్లో మీ వెంటే ఉంటాం’
12-07-2018 13:17:27
 
636669982467593683.jpg
  • ఆ ముగ్గురి చుట్టూ ప్రదక్షణాలు
  • జంప్‌ జిలానీల కుప్పిగంతులు
  • నరసాపురంలో రసవత్తర రాజకీయం
నరసాపురం: ఆసక్తికర రాజకీయాలకు నిలయంగా మారిన నరసాపురంలో ఈసారి ఎన్నికల ముందు నుంచే రసవత్త రాజకీయం నెలకొంది. ఎలక్షన్‌ ముందు పార్టీలు ఫిరాయించే జంపు జిలానీలు నేతల్ని ఇప్పటి నుంచే మభ్య పెడుతున్నారు. మేము మీ అభిమానులం. ఎన్నికల్లో మీ వెంటే ఉంటామంటూ కప్ప గంతులు వేస్తున్నారు. ఎవరికి చెప్పాల్సింది వారికి చెబుతూ పార్టీలో పబ్బం గడిపేస్తున్నారు. ఈ కొత్త రాజకీయం అధికార పార్టీ నేతల్నే కాకుండా వైసీపీనీ తాకింది. ఈ పరిణామాలు పార్టీ నేతలతో పాటు కేడర్‌ను సైతం అయోమయం, గందరగోళానికి గురిచేస్తున్నాయి.
 
కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే మాధవనాయుడు, ఇటు కొత్తపల్లి వర్గాలు పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారే నిర్వహించడం పరిపాటిగా మారింది. రెండు గ్రూప్‌లుగా ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా ముందుకెళ్లుతున్నారు. దీన్ని కొందరు తటస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రెండు వర్గాల్లో తిరుగుతూ ఎక్కడ పెట్టే ముగ్గులు అక్కడ పెడుతున్నారు. అక్కడ అంతా అసంతృప్తిగా ఉన్నారని పార్టీ శ్రేణులంతా మిమ్మల్నే కోరుకుంటున్నారని ఒక నేతకు చెబుతున్నారు. ఇదే జిలానీలు ఇటువైపు వచ్చి ఇదే సీన్‌ను ఇటువైపు రిపీట్‌ చేస్తున్నారు. దీంతో వీరి వ్యవహారం ముఖ్య నేతల్ని సైతం గందరగోళానికి గురి చేస్తున్నది. ఇప్పటికే వీరి పిల్లిగంతుల్ని గుర్తించిన నేతలు ఈ జంపు జిలానీల వద్ద ఆచితూచి మాట్లాడుతున్నట్లు సమాచారం.
 
ఇక వైసీపీ నుంచి వచ్చిన కొందరు మాజీలు రెండు పడవలపై కాళ్ళు పెడుతున్నారు. టీడీపీకి సీన్‌ లేదంటూ వైసీపీ నేతలకు చెబుతూ ఇటు సీటు ముదునూరికి రాదంటూ టీడీపీ నాయకుల్ని నమ్మిస్తున్నారు. ఇదిగో... వచ్చేస్తున్నాంటూ... అదిగో వచ్చేస్తున్నామంటూ వైసీపీ నేతల్ని నమ్మిస్తున్నారు. వీరి వ్యవహారం వైసీపీ నేతల్ని సైతం విస్మయానికి గురిచేస్తున్నది. ఇప్పటికే ఇటువంటివారి కప్పగంతుల్ని గుర్తించి ఇరు పార్టీల నేతలు అప్రమత్తమయ్యారు. వీరి వద్ద అచితూచి నడుస్తున్నారు. ఇలా ఎన్నికల ముందు నుంచే జంప్‌ జిలానీలు గోడ మీద పిల్లలా వ్యవహరించడం రెండు ప్రధాన పార్టీల్లో హాట్‌ టాఫిక్‌ అయింది. వీరిపై రకరకాల సైటైర్లు వేస్తున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని జిలానీలు మాత్రం వారి పబ్బం వారు గడుపుకుంటున్నారు.
Link to comment
Share on other sites

మాజీ ఎమ్మెల్యేపై మూడు పార్టీల కన్ను.. ఎందుకాయన అంత స్పెషల్
12-07-2018 12:58:26
 
636669971061373408.jpg
పాలకొల్లు: రాజకీయ చైతన్యం కలిగిన పాలకొల్లు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణల వేడి మొదలైంది. దీటుగా పోటీ ఇచ్చే అభ్యర్థులకై పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (అబ్బాయిగారి అబ్బాయి) రాజకీయ పయనంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు బీజేపీలో కీలకమైన నాయకత్వం వహిస్తున్న డాక్టర్‌ బాబ్జీని తమ అభ్యర్థిగా బరిలో దింపడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం జరుగుతోంది.
 
2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయాలంటే తెలియని వ్యక్తి డాక్టర్‌ బాబ్జీ. వైద్య వృత్తిలో రాణిస్తూ అబ్బాయిగారి అబ్బాయిగా నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులైన ఆయనకు నేరుగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి పిలుపు వచ్చింది. తటస్తుల కోటాలో డాక్టర్‌ బాబ్జీకి పాలకొల్లు అభ్యర్థిత్వాన్ని ఇచ్చారు. అప్పటివరకూ ఏకఛత్రాధి పత్యంగా సాగుతున్న అల్లు వెంకట సత్యనారాయణను కాదని డాక్టర్‌ బాబ్జీని బరిలోకి దింపంగా ఆ..ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. 2009 ఎన్నికలలో త్రిముఖ పోటీలో డాక్టర్‌ బాబ్జీ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండి పరాజయం పొందారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగాస్టార్‌ చిరంజీవి పాలకొల్లు బరిలో ఉండటంతో సామాజిక వర్గ పరంగా ఓట్లు చీలి కాంగ్రెస్‌ అభ్యర్ధి బంగారు ఉషారాణి విజయం సాధించారు.
 
అనంతరం 2014లో పాలకొల్లు టిక్కెట్టుకు ధర్మారావు ఫౌండేషన్‌ అధినేత డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అడ్డు తగలడంతో డాక్టర్‌ బాబ్జీకి టికెట్‌ దక్కలేదు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండి గట్టి పోటీ ఇచ్చారు. అయితే వైసీపీ అభ్యర్థి మేకా శేషుబాబు, డాక్టర్‌ బాబ్జీల త్రిముఖ పోటీలో నిమ్మల గెలుపొందారు. దీంతో డాక్టర్‌ బాబ్జీ టీడీపీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆపార్టీ రాష్ట్ర స్వచ్ఛభారత్‌ కన్వీనర్‌గా పనిచేస్తూ పార్టీలో గుర్తింపు పొందారు. మొన్నటి వరకూ టీడీపీతో పొత్తు కొనసాగినప్పటికీ ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో స్వయంగా బరిలో దిగే పరిస్థితి ఉంటే ఆ పార్టీ అభ్యర్థిగా పాలకొల్లు నియోజకవర్గంలో డాక్టర్‌ బాబ్జీ అవకాశం పొందుతారని ఆపార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి.
 
అయితే ఇటీవల అనేక రకాల సమీకరణలు వినిపిస్తున్నాయి. పరోక్షంగా వైసీపీకి, బీజేపీ మద్దతు ఇస్తే డాక్టర్‌ బాబ్జీ వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జనసేన కదలికలూ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటే నియోజకవర్గంలో సమీకరణలు మరో విధంగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. టీడీపీ విషయానికి వస్తే నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడుకే టిక్కెట్‌ దాదాపు ఖరారైనట్లు తెలుస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తులు లేకుండా ఎన్నికలు జరిగితే పంచముఖ పోటీ అనివార్యమని భావిస్తున్నారు.
 
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో పుంజుకోవడానికి ఇప్పటికే పావులు కదుపుతూ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్‌ పుంజుకుంటే ఐదు పార్టీల మధ్య పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల రసవత్తరమైన పోరు జరిగే అవకాశాలపై రచ్చబండ రాజకీయాలలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Link to comment
Share on other sites

పవన్‌ కోరితే టీడీపీకి రాజీనామా చేయిస్తా: జనసేన నేత
12-07-2018 12:09:56
 
636669941958275947.jpg
నరసాపురం, ప.గో.: నేను జనసేనలో ఉన్నా... నా భార్య వెంకట రమణ కాళ్ళ జడ్పీటీసీ. ఆమె టీడీపీ తరపున గెలిచారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత పవన్‌కు చెప్పాను. ఇద్దరు వేర్వేరు పార్టీలో కొనసాగుతున్నాం.. విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మీరు కోరితే ఆమెతో పార్టీకి రాజీనామా చేయిస్తానని జనసేన అధినేత పవన్‌కు చెప్పినట్లు బర్రె జయరాజు వెల్లడించారు. బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ టిక్కెట్‌ ఇస్తే తాను జనసేన తరుపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జనసేన అధినేత ఎవరికి అవకాశం కల్పించినా వారి విజయానికి కృషి చేస్తానన్నారు. టిక్కెట్‌ ఆశించి పార్టీలో చేరలేదన్నారు. పవన్‌ సిద్ధాంతాలు, అభిమానం మీద ఆ పార్టీలో చేరానన్నారు. ఆయన ఆదేశించిన క్షణంలో నా భార్య వెంటక రమణ చేత టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయిస్తానని విలేకర్లకు చెప్పారు.
 
Tags : Janasena, Pawan Kalyan, leader, tdp leader, Resignation
Link to comment
Share on other sites

పరిస్థితులు మారిపోయాయంటూ టీడీపీ నేతలకు మంత్రి క్లాస్
14-07-2018 12:13:52
 
636671672320207985.jpg
  • గత పరిస్థితులు వేరు..ఇప్పుడు వేరు..
  • ప్రజల సమస్యలు పరిష్కరిస్తేనే గుర్తింపు
  • ప్రతీ ఒక్కరినీ కలవండి
  • టీడీపీ కేడర్‌కు దిశా నిర్దేశం
  • ఆచంటలో నియోజవర్గ నాయకులు, కార్యకర్తలతో మంత్రి పితాని సమీక్ష
ఆచంట, ప.గో.: రానున్నది ఎన్నికల కాలం వచ్చే ఎన్నికలకు ప్రతీఒక్కరూ సమాయత్తం కావాలి. బూత్‌ లెవిల్‌ స్థాయి నుంచి ప్రతీవీధికి ప్రతీ వార్డుకు ఒక లీడ ర్‌ను పెట్టి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి. గత ఎన్నికలు వేరు.. ప్రస్తుతం వస్తున్న ఎన్నికల తీరు వేరు. ప్రతీ గ్రామంలో ప్రతీ ఒక్కరినీ కలవాలి. పరిస్థితులకు అనుగుణంగా పార్టీ కేడర్‌ మారాలి.. ప్రజ లకు చేరువకావాలి. ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడే ప్రజలు మనల్ని గుర్తిస్తారు... అంటూ మంత్రి పితాని సత్యనారాయణ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఆచంటలో పోడూరు మండలంలోని ఎని మిది గ్రామాలుతో పాటు ఆచంట మండలంలోని అయోధ్య లంక, ఆచంట గ్రామాల కార్యకర్తలతో మంత్రి పితాని ఉదయం నుంచి సాయం త్రం వరకూ ఒక్కొ గ్రామంలోని కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. ప్రతీఒక్కరినీ కలుపు కుంటూ పార్టీని ముందుకు తీసుకొని వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రఽథసారిధిగా నేనంటా..మీరంతా ఉత్సాహంగా పనిచేస్తే పార్టీకి మరింత వైభవం తీసుకొస్తానని కార్యకర్తలతో అన్నారు.
 
సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యత మీదే
నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ప్రస్తుతం అభి వృద్ధి పనులు, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు, ఎన్ని కల్లో మనం ఇచ్చిన హామీలు వాటిని ఎన్ని నెరవేర్చాం.. ఎన్ని నెరవేర్చలేదు అనే విషయాలపై మంత్రి సుదీర్ఘంగా పోస్టుమార్టం నిర్వహించారు. అభివృద్ధి పనులకు నిధులు నేను తెస్తా..వర్గ వైశమ్యాలు లేకుండా అందరినీ కలు పుకొని సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యత మీమీదే ఉందన్నారు. ప్రతీ గ్రామంలో కులాలు వారీగా వార సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారం కోసం అక్కడి నుంచే అధికారులు మాట్లాడి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేశారు. పార్టీ నిర్మాణం పార్టీ కార్యకర్తల పనితీరుపై కొందరి పనితీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పద్ధతులు మార్చు కోవాలని పాతవారితో పాటు కొత్తవారిని కలుపు కొని ముందుకు వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
 
కార్యకర్తలు ఏమన్నారంటే...
ఈ సమావేశంలో ఆయా గ్రామాల కార్యకర్తలు మాట్లా డుతూ ఇంకా కొన్నిచోట్ల సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా ఇళ్లు కట్టుకున్న వాళ్లకు మరో రూ.50 వేలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉండటంతో దీంతో లబ్ధ్దిదారులు కొన్ని విమర్శలు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇటీవల జరిగిన వివిధ రుణాలు కోసం జరిగిన ఎంపికలో గ్రామంలో ఎటువంటి సమాచారం లేకుండానే గుట్టుచప్పుడుగా లబ్ధిదారులు ఎంపిక జరిగిపోయిందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కొన్నిచోట్ల గ్రూప్‌ రాజకీ యాలు కూడా పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉందని అన్నారు.
 
అయోధ్యలంకలో వారది నిర్మాణానికి వెంటనే నిధులు మంజూరు చేసి అయోద్యలంక పుచ్చలలంక బ్రిడ్జ్‌ను నిర్మించాలని అలాగే కొత్తపడవలు ఏర్పాటు చేయాలని ఆగ్రామ పార్టీ కార్యకర్తలు కోరారు. సమా వేశంలో ఆయాగ్రామాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు ఆచంట పెనుగొండ ఏఎంసీ చైర్మెన్‌లు ఉప్పలపాటి సురేష్‌బాబు, గోపాలకృష్ణ, ఎంపీపీ మేకా పద్మకుమారి, కేతా మీరయ్య, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, జడ్పీటీసీ బండి రామారావు, బొక్కా నాగేశ్వరరావు, కొరిపల్లి రామచంద్రరావు, సర్పంచ్‌ బీరా తిరుపతమ్మ, రుద్రరాజు రవి, సూర్యనారాయణరాజు, కంచుస్తంభం రాజా, ప్రభాకరరావు, నర్శింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

సీపీలోకి ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లా కీలక నేతలు.?
15-07-2018 13:38:31
 
636672587082073101.jpg
  • ఎవరికివారే..
  • బాబుల మధ్య సఖ్యత కుదిరేనా!
  • తాతాజీ వేరు కుంపటి పెడతారా!
  • అయోమయంలో పార్టీ కేడర్‌
 
పాలకొల్లు/పశ్చిమ గోదావరి : నాయకుల అంతర్గత పోరుతో నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఎవరి బాట వారిదేనంటూ మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, నియోజకవర్గ కన్వీనర్‌ గుణ్ణం నాగబాబులు జగన్‌ పాదయాత్రలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. ఇద్దరూ వేర్వేరుగా జగన్‌కు స్వాగతం పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన మేకా శేషుబాబు మళ్లీ తనకే టిక్కెట్‌ వస్తుందని ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా గడపగడపకు పర్యటన, రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాల్లో పాల్గొంటూ కేడర్‌ను బలోపేతం చేసుకుంటున్న గుణ్ణం నాగబాబు రానున్న ఎన్నికల్లో టిక్కెట్‌ కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. అలాగే ఆపార్టీ పంచాయతీ రాజ్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యడ్ల తాతాజీ కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నట్టు ఆయన మిత్రులు చెబుతున్నారు.
Untitled-51.jpg 
 
 
కాగా.. ఇటీవల జగన్‌ పాదయాత్రలో ఆయనతో పాటు నడక సాగించిన చేగొండి సూర్య ప్రకాష్‌ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇందుకై ప్రకాష్‌ తండ్రి మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామ జోగయ్యను సలహాకోరగా ముందు టిక్కెట్‌ తెచ్చుకో... గెలుపు విషయం చూద్దామని ప్రకాష్‌ తండ్రి సలహా ఇచ్చినట్టు సమాచారం. మరో వైపు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సి.హెచ్‌.సత్యనారాయణమూర్తి(బాబ్జి) వైసీపీలో చేరతారనే విస్తృత ప్రచారం నేపథ్యంలో ఆయనకే టిక్కెట్‌ వస్తుందని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ అయోమయానికి గురవుతోంది. కొందరైతే ఏ ఎండకాగొడుగు పట్టేస్తూ పబ్బం గడిపేసుకుంటున్నారు.
Link to comment
Share on other sites

సీక్రెట్ చెప్పేసిన టీడీపీ ఎమ్మెల్యే..
15-07-2018 12:51:43
 
636672559007963784.jpg
  • సమస్య ఉంటే నిద్రపట్టదు..
  • నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో..
  • ‘ఆంధ్రజ్యోతి’ చిట్‌చాట్‌
పట్టువదలని విక్రమార్కుడు..ఈ పేరు నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు అతికినట్టు సరిపోతుంది.. ఎందుకంటే ఏదైనా పని గురించి ఆలోచించారంటే ఆ పని తక్షణం పూర్తిచేయించాల్సిందే. సమస్య లేకుండా చేయాల్సిందే. నియోజకవర్గంలో ఇప్పటి వరకూ అటువంటి పనులు ఎన్నో చేశారు.. మిగిలిన ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలిచారు.. దానికి నిదర్శనమే రోడ్‌ కం రైలు బ్రిడ్జి.. ఉన్నత నాయకులు ఆశలు వదిలేసినా ఆయన మాత్రం పట్టువదలకుండా ప్రయత్నించారు. సాధించారు..ఇక నియోజకవర్గంలో రోడ్లదీ అదే పరిస్థితి.. నేడు 53వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’ చిట్‌చాట్‌..
 
 
మీ విజయ రహస్యం ఏమిటి?
నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను.. వ్యవసాయం కూడా చేశాను. ఎవరి సమస్యలు ఎలా ఉంటాయో నాకు తెలుసు.. ఆ సమస్య వారి వద్దకు చేరకుండా చేయడమే నాయకుల లక్ష్యం.. నేను అదే చేస్తున్నా.. తొలిసారి అలాగే ఆలోచించా.. రెండో సారి కూడా అలాగే ఆలోచిస్తున్నా. నా ఆలోచన ధోరణిలో ఎప్పుడూ మార్పురాదు. సమస్యలు సశేషంగా ఉండాలన్నదే నా లక్ష్యం. అందుకే ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నా. ఈ నేపథ్యంలోనే ప్రజలు నన్ను రెండోసారి ఆశీర్వదించారు.
 
 
హామీలన్నీ అమలు చేశారా ?
ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశా. నిడదవోలు పట్టణంలోని ఆర్టీసీ డిపోను పునఃప్రారంభించి రవాణా సౌకర్యా లను అందుబాటులోకి తెచ్చా. నిడదవోలు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సామర్థ్యం పెంచి రూ. 2.97 కోట్లతో ఆధునీకరించి సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్పు చేసి నూతన భవనాన్ని నిర్మించాం. దీంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో వైద్యం చేయించుకోవాలంటే రాజమండ్రి పరుగుపెట్టాల్సి వచ్చేది. నిడదవోలు ఆసుపత్రిని ఆధునీకరించడంతో ఆ సమస్య తీరింది. వేలివెన్ను గ్రామాన్ని రాష్ట్రంలోనే తొలి స్మార్ట్‌ విలేజ్‌గా అభివృద్ది చేశాం. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.త్వరలోనే రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు ప్రారంభమవుతాయి. ఇలా నేనిచ్చిన హామీలన్నీ అమలు చేశా.
 
 
ఈ నాలుగేళ్ళలో ఎంత ఖర్చు చేశారు ?
సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో నియోజక వర్గంలో ప్రాఽథమిక వైద్య శాలలు, బీసీ బాలుర, బాలికల వసతి గృహాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాలు, పక్కా రోడ్లతో ఎన్నో అభివృద్ధి పనులు నిర్వహించాం.
 
 
ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా ?
ఉభయగోదావరి జిల్లాల వాహనదారులకు ప్రధాన సమస్య అయిన నిడదవోలు పట్టణలోని ఆర్వోబీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఎన్నో అడ్డంకులను జయించి నిడదవోలు పట్టణంలో ఆర్వోబీ నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూ. 201 కోట్లతో అనుమతులు మంజూరయ్యాయి.
 
 
సీఎం సహాయం ఎంత చేశారు..
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 300 మందికి సుమారు రూ. 5 కోట్లను స్వయంగా ఇంటింటికి వెళ్లి అందజేశాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబ బాగోగులు తెలుస్తాయన్నదే నా లక్ష్యం. అందుకే ఇంటి వరకూ వెళతా.. నా నియోజకవర్గ ప్రజలంతా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు.. ఇది దేవుడిచ్చిన భాగ్యం. ఎవరింటికి వెళ్లి వచ్చినా ఆనందంగా ఉంటుంది.
Link to comment
Share on other sites

జనసేనలోకి మాజీ మంత్రి వారసుడు
18-07-2018 10:44:46
 
636675074874184298.jpg
తాడేపల్లిగూడెం, ప.గో.: సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీతో మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామికి ఉన్న అనుబంధం తెగిపోయింది. ఆయన తనయుడు, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా నవీన్‌ తెలుగుదేశం పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. తాడేపల్లిగూడెంలో విలేఖరుల సమావేశంలో ఆయన తన భవిష్యత్‌ రాజకీయ వివరాలను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలగేందుకు గల కారణాలను వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని , కాపులకు రిజర్వేషన్‌ హామీని నెరవేర్చలేకపోవడం అందులో బాగమేనన్నారు.
 
కాపు కార్పొరేషన్‌ ఏర్పాటులో జాప్యం కారణంగా కేవలం 3208 కోట్లు మాత్రమే రుణాలు రూపేణా ఇవ్వగలిగారని తెలిపారు. అవినీతి లేని రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఇటీవల తమ సొంతూరులో సమీక్ష నిర్వహించినప్పుడు వైఎ్‌సఆర్‌,జనసేన పార్టీల నుంచి నాయకులు వచ్చి కలిశారు. అయితే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తనను ఆహ్వానించడంతో ఆ పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. తాడేపల్లిగూడెం కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మైలవరపు రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

నేతల్లో సర్వేల టెన్షన్.. ఏపీలో ఇప్పుడిదే సెన్సేషన్
18-07-2018 11:41:57
 
636675109185039971.jpg
  • అభ్యర్థులపై జిల్లాలో ప్రధాన పార్టీల ఆరా
  • గెలుపు గుర్రాల కోసం సర్వేల బాట
తాడేపల్లిగూడెం, ప.గో.: కొద్ది నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో రాజకీయ పక్షాలు అప్రమత్తమయ్యాయి. ప్రధానపార్టీలు సొంత సర్వేలు నిర్వహిస్తున్నాయి. పార్టీల్లో ముఖ్య నాయకుల బలాబలాలపై ముమ్మరంగా సర్వేలు చేపడుతున్నాయి. ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి నివేదికలు రప్పించుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఇదేపనిలో ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉన్న విధానాలలో సర్వేలు చేసుకుంటున్నాయి.
 
నియోజకవర్గాల్లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్న నాయకుల స్థితిగతులపై ఆయా పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఆర్థిక స్థితిగతులపైనా దృష్టి పెట్టాయి. ముఖ్యంగా తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు వేగవంతంగా కదులుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్‌ ద్వారా నాయకులపై ఆరా తీస్తోంది. ఎవరైతే నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని కేడర్‌ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధుల బలం, బలహీనతలపైనా దృష్టి పెట్టింది. జిల్లాలో సొంత సర్వేలతో పాటు, కేడర్‌కు ఫోన్‌లు చేస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు అఽధికార పార్టీ నియోజకవర్గాల వారీగా ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా అభ్యర్థులపై వాకబు చేస్తోంది.
 
పోటీకు అర్హులైన జాబితాలతోపాటు, రేసులో ఉండే అభ్యర్థులపై ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ వర్గాలు నివేదిక సిద్ధం చేశాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ జిల్లాలో పక్కా ప్రణాళికతో వెళుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు, వారి బలం, పోటీ చేస్తే వ్యతిరేకత వ్యక్తమయ్యేందుకు గల కారణాలపైనా పార్టీ వివరాలు రాబడుతోంది.వ్యతిరేకత వచ్చే అంశాలను సరిదిద్దుకోవాలంటూ కొందరు నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. రిజర్వ్‌డ్‌ స్థానాలైన గోపాలపురం, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లోనూ పార్టీ పరిస్థితి, అభ్యర్థుల బలాలపైనా తెలుగుదేశం వివరాలను రాబట్టుకుంటోంది.
 
జిల్లాలో వైసీపీ సొంత బృందాలు
ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే సార్వత్రిక ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి జిల్లాలో చేదు అనుభవమే ఎదురైంది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. వాస్తవానికి జగన్‌పాదయాత్ర అనతరం ఆ పార్టీలో కాస్త కదలిక వచ్చింది. అయితే ఇప్పటిదాకా జిల్లాలో ఒక్క భీమవరం నియోజకవర్గం నుంచి మాత్రమే జగన్‌ పాదయాత్రలో అభ్యర్థిని ప్రకటించారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఆశావహులపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంత బృందాలతో సర్వే చేపడుతోంది. ప్రశాంత్‌ కిశోర్‌ కమిటీ బృందం విడతల వారీగా సర్వేలు నిర్వహిస్తోంది. వివిధ వర్గాల నుంచి వివరాలను సేకరించే పనిలో ఆ బృందం నిమగ్నమైంది.
 
జగన్‌ పాదయాత్ర అనంతరం పార్టీ పరిస్థితిపై జిల్లాలో సర్వే నిర్వహించారు. కొన్ని చోట్ల ప్రస్తుతం నియోజకవర్గ కన్వీనర్‌లుగా ఉన్న వారిపై వ్యతిరేకత ఉన్నవిషయాన్ని సర్వేలో గమనించినట్టు సమాచారం. అటువంటి నియోజకవర్గాలపై పార్టీ తర్జన భర్జన పడుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరినుంచి ముగ్గురు అభ్యర్థులపై సర్వే చేపడుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థుల వేటను కొనసాగిస్తున్నారు. రిజర్వ్‌డ్‌ స్థానాల విషయానికొచ్చేసరికి కొన్ని చోట్ల కొత్త అభ్యర్థులకు స్థానం కల్పించేలా సర్వే నిర్వహించారు.
 
సామాజిక అంశాలకు ప్రాధాన్యం
పార్టీలు నియోజకవర్గాల్లో సామాజిక అంశాలకు సర్వేల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. రిజర్వ్‌డ్‌ స్థానాల మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లోనూ సామాజిక వర్గాలే కీలక భూమిక వహిస్తున్నాయి. ఆ సామాజిక వర్గానికి టిక్కెట్‌ ఇస్తేనే ఫలితం ఉంటుందన్న భావనకు అన్ని రాజకీయ పార్టీలు వచ్చేశాయి. ఆ దిశగా కొన్ని నియోజకవర్గాలు ముద్ర పడ్డాయి. ఆ జాబి తాలో ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు నియోజకవర్గాలు చేరిపోయాయి. ఆ దిశగానే ప్రస్తుతం పార్టీలు సర్వేలను చేపడుతున్నాయి. ఆయా సామాజిక వర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి.
 
అభ్యర్థుల వేటలో జనసేన
మరోవైపు జనసేన కూడా అభ్యర్థుల వేటలో పడింది. పార్టీ ముఖ్య కార్యకర్తలు నియోజకవ ర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులను టచ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ జనసేన అధ్యక్షుడు పర్యటనపైనే దృష్టిపెట్టింది. ఇటీవల తాడేపల్లిగూడెంలో జిల్లా సమావేశం ఏర్పాటు చేసి పవన్‌ కళ్యాణ్‌ పర్యటనపై చర్చించారు. ఇప్పటిదాకా ఆ పార్టీలోకి తెలుగుదేశం నుంచి యర్రా నవీన్‌ మాత్రమే చేరనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతానికి పార్టీ అభిమానులే ముందుండి నడిపిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు చెందిన నాయకులపై దృష్టి సారించారు.
 
 
అభ్యర్థుల సొంత సర్వేలు
సర్వేలు కేవలం పార్టీలకే పరిమితం కాలేదు. బరిలో నిలిచేందుకు తహతహలాడుతున్న అభ్యర్థులు కూడా సొంత సర్వేలు నిర్వహించుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలించేందుకు ఆర్థికంగా, సామాజికంగానూ బలమైన వ్యక్తి ఇటీవల సొంత సర్వే చేపట్టారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నర్సాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా సంకేతాలిస్తూ రఘురామకృష్ణంరాజుకు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించింది. అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఎంపీ బరిలో దింపాలన్న యోచనతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉంది. భీమవరం ప్రాంతంలో వందల ఎకరాల్లో ఆక్వా చెరువులు సాగు చేస్తున్న వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న సంకేతాలు పార్టీ నుంచి వెలువడడంతో సదరు నాయకుడు నియోజక వర్గాల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులపైనా ఆ సర్వే సాగింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...