Jump to content

Modalettadu....


Recommended Posts

కేంద్రం పరిధిలోకి టీటీడీ?
05-05-2018 16:52:11
 
636611359359512980.jpg
ఢిల్లీ: టీటీడీ పరిధిలో తిరుమలలో ఉన్న అన్ని ఆలయాలను తన పరిదిలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆలయాలన్నింటినీ రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పురావస్తుశాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. ఆయా దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు.. కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది. నిజంగానే రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే కేంద్రం చేతిలోకి టీటీడీ వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టరేట్ నుంచి... విజయవాడలోని అమరావతి సర్కిల్‌కు ఆదేశాలు అందాయి. కేంద్ర ఆదేశాల మేరకు టీటీడీకి అమరావతి సర్కిల్‌ లేఖ పంపింది.
 
 
తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని, పురాతన కట్టడాలు తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ చెబుతోంది. భక్తులు ఇచ్చిన కానుకలు సరిగా భద్రపరచడం లేదనే ఫిర్యాదుల వస్తున్నాయట. పూర్వకాలంలో రాజులు ఇచ్చిన ఆభరణాలు భద్రతకు నోచుకోలేదని పురావస్తు శాఖ చెబుతోంది. త్వరలో పురావస్తు శాఖ అధికారులు తిరుమలను సందర్శించనున్నారు. టీటీడీ నుంచి జాబితా అందిన తర్వాత కేంద్ర అధికారులు సందర్శించే అవకాశం ఉంది. ఈ తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తీసుకునే అవకాశం ఉంది. టీటీడీ బోర్డు మెంబర్లను నామినేట్ చేసే అధికారం కూడా రాష్ట్రానికి లేకుండా పోతుంది. అంటే టీటీడీ మొత్తం కేంద్ర చేతుల్లోకి పోతుంది.
Link to comment
Share on other sites

Satish Chaganti @SatishChaganti5 12m12 minutes ago

 
 

IYR Krishna Rao is responsible for opening doors for central interference in Tirumala #savetirumalafrommodi

Satish Chaganti @SatishChaganti5 12m12 minutes ago
 
 

IYR Krishna Rao is responsible for opening doors for central interference in Tirumala #savetirumalafrommodi

DcbwBiKU8AAjO1G.jpg
DcbwBiKU8AAjO1G.jpg
Link to comment
Share on other sites

Ee IYR gadu okatokati chesukoni pothunnadu ga

Aa governor dude medha anavasaramga ee AJ gadu articles raasi kelikaru, last week Delhi vellinappudu ee fitting set chesinattu unnadu?

Link to comment
Share on other sites

NTV Breaking News
సమాచార లోపంతో ఉత్తర్వులు జారీ చేశామని.. ఈవో సింఘాల్ కు వివరణ ఇచ్చిన పురావస్తు శాఖ. అరగంటలో ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటామన్నా పురావస్తు శాఖ. #TTD
 
 
 
 
 
Link to comment
Share on other sites

4 hours ago, Kiran said:

Ee IYR gadu okatokati chesukoni pothunnadu ga

Aa governor dude medha anavasaramga ee AJ gadu articles raasi kelikaru, last week Delhi vellinappudu ee fitting set chesinattu unnadu?

e tootti batch leader governor

Link to comment
Share on other sites

రగంటలోనే కేంద్రానికి కౌంటర్ ఇచ్చిన టీటీడీ
05-05-2018 19:28:21
 
636611453054193378.jpg
తిరుపతి: తిరుమలలోని ఆలయాలను పురావస్తుశాఖకు అప్పగించాలనే ఆలోచన టీటీడీకి లేదని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. టీటీడీ పరిధిలోని తిరుమలలోని ఆయా దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది. కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టరేట్ నుంచి విజయవాడలోని అమరావతి సర్కిల్‌కు శనివారం ఈ లేఖ చేరింది. ఈ లేఖ రాష్ట్రం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. టీటీడీ పరిధిలోని దేవాలయాలను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందన్న వివాదం మొదలైంది. దీంతో ఈ వివాదంపై టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ వివరణ ఇచ్చారు. గత అధికారులు రాసిన ఉత్తరం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. గతంలో కేంద్ర ఆర్కియాలజీ పరిధిలోకి టీటీడీ ఆలయాలను ఇచ్చే ఆలోచన చేసినా.. ఆ తరువాత దానిని విరమించుకున్నట్టు రికార్డుల్లో ఉందని తెలిపారు. దీని ప్రకారం.. పురావస్తు శాఖకు టీటీడీ ఆలయాలను ఇచ్చే ప్రసక్తే లేదని సింఘాల్ స్పష్టం చేశారు.
 
 
తిరుమలలో పురాతన కట్టడాలు తొలగిస్తున్నారని, రాజుల కాలం నాటి నగలకు రక్షణ కరువైందని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ పరిధిలో తిరుమలలో ఉన్న ఆయా ఆలయాలను సందర్శించి ఫోటోలు తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాసింది. అయితే తిరుమలలోని దేవాలయాలను రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే టీటీడీ కేంద్రం చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Link to comment
Share on other sites

టీటీడీలో పురావస్తు శాఖ హస్త క్షేపాన్ని అంగీకరించం: కమలానంద భారతి
05-05-2018 19:24:59
 
636611451041854417.jpg
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న ఆలయాలన్నింటినీ కబ్జా చేయాలని కేంద్ర యోచిస్తోందా..?. ఏళ్ల కిందట వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పురావస్తు శాఖ ఇప్పుడు రంగంలోకి దిగడానికి కారణమేంటి..?. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి పురావస్తు శాఖ లేఖ రాయడంలో ఆంతర్యమేంటి..?. అనే అంశంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్చా కార్యక్రమం చేపట్టింది.
 
 
ఈ కార్యక్రమంలో కమలానంద భారతి మాట్లాడుతూ ‘‘ కేంద్ర పురావస్తు శాఖ నుంచి ఉత్తరంలో వాళ్లు వస్తారు. పరిశీలిస్తారు. అడిగిన సమాచారం అందజేయండి. అదే విధంగా ఫొటోలు తీసుకుంటారు అని మాత్రమే రాశారు. ఆ తర్వాత పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవడం అనే అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. ఇది రొటీన్‌గా జరిగే కార్యక్రమం కాదు. అయ్యంగారు అనే భక్తుడు వేసిన పిల్ ద్వారా కేంద్ర పురావస్తు శాఖ సభ్యులు లేఖ రాసినట్టుగా తెలిసింది. ఎటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పురావస్తు శాఖ హస్త క్షేపాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. అక్కడ సంబంధించిన ప్రతిదాన్ని కూడా టీటీడీ కాపాడుతోంది.
 
800 శాసనాలను ఫొటోలు తీశారు. ఫిల్మ్ చేశారు. అక్కడే ఉన్న మ్యూజియంలో వాటిని భద్రపర్చారు. టీటీడీకి సంబంధించిన వెబ్‌సైట్‌లో పెట్టారు. వాటన్నింటినీ పుస్తగాలుగా ముద్రించారు. గత సంవత్సరం తిరుమలలో జరిగిన మఠాధి, పిఠాధిపతుల థార్మిక సదస్సులో ఆ పుస్తకాలన్నీ పెట్టి అందించారు. కాబట్టి అక్కడ శాసనాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ప్రతీదినం ఒక లక్ష మంది భక్తులు వచ్చేటప్పుడు అక్కడ చాలా నిర్మాణాలు నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఇతరత్రా కార్యక్రమాలు కావచ్చు, ప్రతీరోజు అక్కడ ఏదో ఒక మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి.’’ అని అన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...