Jump to content

Bhudar


Recommended Posts

మనిషికి ఆధార్‌.. భూమికి భూధార్‌
ప్రతి ఆస్తికి 11 అంకెల నెంబరు
రెండేళ్లలో మ్యూటేషన్‌ ధ్రువీకరణ పత్రాలు సిద్ధం!
భూ-సేవపై సంయుక్త కలెక్టర్లకు రాష్ట్రస్థాయి శిక్షణ
పేదలకు ఇళ్ల పట్టాలివ్వలేకపోతే ఎలా?
అధికారులను ప్రశ్నించిన మంత్రి దేవినేని
ఈనాడు - అమరావతి
3ap-main7a.jpg

మనిషికి ఆధార్‌ తప్పనిసరి అయినట్లే వచ్చే రెండేళ్లలో భూమికి భూధార్‌ తప్పనిసరి చేసే దిశగా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూ-సేవను విస్తృతంగా అమలు చేయనున్నారు. భూదార్‌ ఆధారంగా భూమి ఉప విభజన(సబ్‌ డివిజన్‌) రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ తదితరాలన్నీ అందుబాటులోకి రానున్నాయి. రియల్‌టైమ్‌లో మ్యూటేషన్‌ ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుదారులకు అందించగలిగే పరిస్థితి వచ్చే రెండేళ్లలో రానుంది. భూ-సేవ, భూధార్‌ అమలుపై జిల్లాల సంయుక్త కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని గురువారం విజయవాడలో నిర్వహించారు. సాగునీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) అనిల్‌చంద్ర పునీఠ, ఈ-ప్రగతి సంచాలకుడు విజయ్‌మోహన్‌, సహాయ పునరావాస కమిషనర్‌ రేఖారాణి తదితర ఉన్నతాధికారులు అంశాలవారీగా వివరించారు. ప్రతీ ఆస్తికి 11 అంకెలతో కూడిన భూధార్‌ నెంబరును జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుల జె.సత్యనారాయణ వెల్లడించారు. అక్టోబరు 2నాటికి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ భూములకు ప్రత్యేకంగా..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.58 కోట్ల ఉపవిభజన(సబ్‌ డివిజన్స్‌)లకు తొలుత తాత్కాలిక నెంబరు జారీ చేసి, ఆయా భూముల యజమానులు కోరినపుడు స్థలం సర్వేచేసి శాశ్వత భూధార్‌ నెంబరు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వభూమికి ప్రత్యేక భూదార్‌ నెంబర్లుంటాయని, అందువల్ల ఆ భూములు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించుకునే అవకాశం ఉంటుందన్నారు.
388 జీఓ స్ఫూర్తినెందుకు తీసుకోలేకపోతున్నారు..
మంత్రి దేవినేని మాట్లాడుతూ...‘‘భూముల క్రమబద్ధీకరణకోసం జారీ చేసిన 388జీఓ విప్లవాత్మకమైంది...ఆ జీఓ స్ఫూర్తితోనే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో 1150, మైలవరంలో 1500ఇలా మొత్తమ్మీద జిల్లాలోనే 70వేలకుపైగా పట్టాలివ్వగలిగాం.  ఆ స్ఫూర్తితో ఇతర జిల్లాల్లో ఎందుకు చేయలేకున్నారు’ ’అని అన్నారు.

నెలాఖరులోగా 22(ఎ) దరఖాస్తును పరిష్కరించాలి
సీసీఎల్‌ఏ అనిల్‌చంద్ర మాట్లాడుతూ..22(ఎ)నిబంధన కింద అమ్మకం నిషేదిత జాబితాలో ప్రైవేట్‌ ఆస్తులను జత చేశారంటూ వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణాలో 27, పశ్చిమగోదావరిలో 50, తూర్పుగోదావరిలో 42 ఇలా జిల్లాల్లో అరకొరగా దరఖాస్తులను పరిష్కరించారు..ఇలాగైతే ప్రజలకు ఏం న్యాయం చేయగలం..ఈ నెలాఖరులోగా దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు.

Link to comment
Share on other sites

భూధార్‌ పైలెట్‌ పరుగులు
11-05-2018 02:27:53
 
  • 87.65 శాతం తాత్కాలిక నంబర్ల కేటాయింపు
  • నెలాఖరుకల్లా కృష్ణా జిల్లాలో పూర్తి
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): భూవివాదాలను తొలగించి ఆస్తులకు సాంకేతిక రక్షణ కల్పించే ప్రతిష్ఠాత్మకమైన భూధార్‌ ప్రాజెక్టులో కీలకఘట్టం మొదలైంది. పట్టాదారులు, ఆస్తులున్నవారికి తాత్కాలిక భూధార్‌ నంబర్ల కేటాయింపు శరవేగంగా ముందుకు సాగుతోంది. మీ-భూమి(వెబ్‌ల్యాండ్‌)తో ఇదివరకే ఖాతాదారుల ఆధార్‌, మొబైల్‌ నంబర్లు అనుసంధానించడంతో ఈ ప్రక్రియ జోరందుకుంది. మే నెలాఖరుకల్లా జగ్గయ్యపేట మండలంలో కొనసాగుతోన్న పైలెట్‌ ప్రాజెక్టును పూర్తిచేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించగా... అంతకు ముందుగానే ఇది కొలిక్కిరానుంది. అంతేకాదు... మే నెలాఖరు నాటికి కృష్ణాజిల్లాలోనే తాత్కాలిక భూధార్‌ నంబర్ల కేటాయింపును పూర్తిచేస్తామని రెవెన్యూశాఖ చెబుతోంది. రెవెన్యూ, సర్వే, ఎన్‌ఐసీ అధికారులు, సిబ్బంది అహర్నిశలు శ్రమించడం వల్లే గడువులోగా ప్రాజెక్టును కొలిక్కి తీసుకురాబోతున్నామని భూపరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) అనిల్‌ చంద్రపునేఠా చెప్పారు. ప్రతీ వ్యక్తికి ఆధార్‌ గుర్తింపు ఉన్నట్లుగానే రాష్ట్రంలోని సాగు, ప్రైవేటు భూములు, ఆస్తులకు 11 అంకెల విశిష్ఠ సంఖ్యను ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన భూధార్‌ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని భూముల వివరాలన్నీ రెవెన్యూ శాఖ డిజిటలైజ్‌ చేసి మీ-భూమి వెబ్‌సైట్‌(వెబ్‌ల్యాండ్‌)లో పొందుపరిచింది. వెబ్‌ల్యాండ్‌ రికార్డులకు ఇప్పటికే ఖాతాదారుల ఆధార్‌, మొబైల్‌ నంబర్లను అనుసంధానించారు. అయితే, ఇప్పటికీ అనేక చోట్ల భూ వివాదాలు, తగాదాలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ భూమి ఎవరిది? ప్రభుత్వ భూమి ఏది? ప్రైవేటు ఆస్తులు ఏవో ముందుగానే తేల్చి వాటికో శాశ్వత నంబర్‌ను కేటాయించి పబ్లిక్‌డొమైన్‌లో ఉంచితే అక్రమాలకు ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావించి... ఈ-ప్రగతి ప్రాజెక్టులో భాగంగా భూధార్‌ను చేపట్టారు. గత ఏడాది డిసెంబరులో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం, మున్సిపాలిటీ పరిధిలో పైలెట్‌ ప్రాజెక్టును చేపట్టారు. దీంట్లో భాగంగా ప్రతీ సర్వే నంబర్‌ పరిధిలోని భూమికి 11అంకెల భూధార్‌ను కేటాయించారు. ఆధార్‌ నంబర్‌తో ఇప్పటికే రెవెన్యూ రికార్డులను అనుసంధానించడం వల్ల భూధార్‌ను జనరేట్‌ చేయడం సులువుగా మారింది. ఇప్పటి వరకూ జగ్గయ్యపేట మండలంలో 87.65శాతం భూములు, ఆస్తులకు భూధార్‌ నంబర్లు కేటాయించారు. ఇందులో 25.12శాతం మ్యుటేషన్లనూ చేర్చారు. అయితే, భూములకు సంబంధించి వెబ్‌ల్యాండ్‌లో 95శాతానికిపైగానే ఖాతాదారుల ఆధార్‌ నంబర్లను అనుసంధానించారు. ఈ నేపఽథ్యంలో దాని ఆధారంగా ఆటోమెటిక్‌గా భూధార్‌ జనరేట్‌ కావాలి. అయితే ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం అందిస్తున్న ఎన్‌ఐసీ కొన్ని సాంకేతిక చిక్కులను ఎదుర్కొంటోందని, అందుకే భూధార్‌ జనరేట్‌లో జాప్యం ఉన్నట్లు తెలిసింది. అయితే, ఇది తాత్కాలికమేనని, సాంకేతిక చిక్కులు తొలగిన వెంటనే మిగిలిన 13శాతం భూములకూ భూధార్‌ జనరేట్‌ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
 
99 సిరీస్ తో తాత్కాలిక భూధార్‌
తాత్కాలిక భూధార్‌ను 99 సిరీ్‌సతో జారీ చేస్తున్నారు. శాశ్వత భూధార్‌ 28 సిరీ్‌సతో ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కల ప్రకారం సెన్సెస్‌ కోడ్‌ 28 కాబట్టి భూధార్‌ నంబర్‌ను 28తో ప్రారంభమయ్యేలా జనరేట్‌ చేయనున్నారు. మిగిలిన 9 అంకెలు యాదృచ్ఛికంగా ఉంటాయు. అయితే, ఇది ఇంకా పైలెట్‌దశలోనే ఉంది కాబట్టి 99 సిరీ్‌సతో యాదృచ్ఛికంగా తాత్కాలిక భూధార్‌ను జనరేట్‌ చేస్తున్నారు. తాత్కాలిక భూధార్‌లో ఎలాంటి ప్రత్యేకతా లేదు. కానీ శాశ్వతంగా ఇచ్చే 11 అంకెల భూధార్‌లో అనేక ప్రత్యేకతలు ఉంటాయి. 11 అంకెల్లో తొలి రెండు అంకెలు ఏపీని, తర్వాతి రెండు అంకెలు జిల్లాను, ఆ తర్వాతి రెండు రెవెన్యూ డివిజన్‌, మండలాన్ని సూచించేవిగా ఉంటాయి. మిగతా ఐదు అంకెలు యాదృచ్ఛికంగా జనరేట్‌ చేస్తారు. తాత్కాలిక భూధార్‌ను కూడా భూ-సేవ సర్వర్‌లో పొందుపరుస్తారు. వాటికి వెబ్‌ల్యాండ్‌ రికార్డులతో అనుసంధానం చేస్తారు. రాష్ట్రం అంతా భూధార్‌ ప్రాజెక్టు ఆరంభమయ్యాక భూములను జియోట్యాగింగ్‌ చేస్తారు. అప్పుడు తాత్కాలిక భూధార్‌ స్థానంలో 11 అంకెల శాశ్వత నంబర్‌ను కేటాయిస్తారు. ఇందుకోసం రెవెన్యూశాఖ రూ.26 కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోనుంది. విప్రో వంటి దిగ్గజ ఐటీ సంస్థలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోబోతున్నాయి. రియల్‌టైమ్‌ జియోట్యాగింగ్‌ కోసం ఖరీదైన కార్స్‌ టెక్నాలజీని వినియోగించుకోబోతున్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
శరవేగంగా భూధార్‌
02-06-2018 03:43:01
 
  •  ఆగస్టు 2 నాటికే తాత్కాలిక కేటాయింపు
  •  ముఖ్యమంత్రికి రెవెన్యూశాఖ నివేదిక
అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకమైన భూధార్‌ ప్రాజెక్టులో తాత్కాలిక భూధార్‌ల కేటాయింపు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెవెన్యూశాఖ నివేదించింది. కృష్ణాజిల్లాలో చేపట్టిన పైలెట్‌ ప్రాజెక్టును దాదాపుగా పూర్తిచేశామని, ఇక మిగతా జిల్లాల్లోనూ ఆగస్టు 2 నాటికి కొలిక్కి తీసుకొస్తామని వివరించింది. భూధార్‌ ప్రాజెక్టు అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కృష్ణాజిల్లాలో కొనసాగుతున్న పైలెట్‌ ప్రాజెక్టుతోపాటు భూసేవలోని సర్వీసుల అమలు గురించి రెవెన్యూశాఖ నివేదిక ఇచ్చింది. ఇప్పటి వరకూ కృష్ణాజిల్లాలో 72 శాతం తాత్కాలిక భూధార్‌లను కేటాయించినట్లు వివరించింది. జగ్గయ్యపేట మండలంలో 42,712 భూముల ఖాతాలకు 31,947 తాత్కాలిక భూధార్‌లు కేటాయించామని, ఉయ్యూరు మున్సిపాలిటీలో 4,219 ఖాతాలకు భూధార్‌లు ఇచ్చినట్లు అధికారులు వివరించారు. కృష్ణాజిల్లాలో 13,66,893 భూముల ఖాతాలు ఉంటే 9,90,456 మేరకు రిజిస్టర్‌ చేశామని, వాటికి కూడా తాత్కాలిక భూధార్‌లు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎంపిక చేసిన మండలాలు, మున్సిపాలిటీల్లోనూ పైలెట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ... అటవీ భూమి రికార్డులను కూడా డిజిటలైజేషన్‌ చేయాలని ఆదేశించారు. వీటిని ఆర్‌వోఎ్‌ఫఆర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. భూసేవ పరిధిలోని సర్వీసులను జూలై నాటికి సిద్ధం చేస్తామని ఎన్‌ఐసీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించగా... సింగపూర్‌లో రియల్‌టైమ్‌ భూరికార్డుల ఇంటిగ్రేషన్‌ కొనసాగుతోందని, దీనిపై అధ్యయనం చేయాలని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) అనిల్‌చంద్ర పునేఠా, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌, కృష్ణా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
వేగంగా ఈ-ప్రగతి ఇంటిగ్రేషన్‌
ఈ-ప్రగతి ఇంటిగ్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసి అన్ని శాఖల్లో అమలుచేసేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. శుక్రవారం ఈ-ప్రగతిపై సచివాలయంలో సమీక్షించారు. ఆర్‌టీజీ, ఈ-ప్రగతి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, అంతిమంగా ప్రజా సంతృప్తి కోసం పనిచేయాలని స్పష్టంచేశారు. విద్యాశాఖలో ఈ-అడ్మిషన్‌, ఈ-అప్లికేషన్‌ మాడ్యుల్స్‌ తయారుచేశామని, సెప్టెంబరు 30 నాటికి అమల్లోకి తీసుకొస్తామని అధికారులు సీఎంకు వివరించారు. రవాణా శాఖలో జూలై నాటికి అన్ని సేవలను ఈ-ప్రగతి ద్వారానే అందిస్తామని అధికారులు తెలిపారు
Link to comment
Share on other sites

Polam vere valla peruto (official ga )undi manam saagu cheskuntu unte (Dabbulicchi konukkoni).. ippudu vallandariki pattukocchi boodhar ivvalnaaa :atwitsend: 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
తుది దశకు భూధార్‌
11-06-2018 09:47:28
 
636643072600977169.jpg
  • 85 శాతం ప్రక్రియ పూర్తి
  • 15 శాతం నోషనల్‌ ఖాతాలు, అన్‌ రిజిస్టర్డ్‌ భూములు
  • వివాదాలు తేలితే.. తాత్కాలిక భూధార్‌ నిర్వహణకు సన్నద్ధం
  • శాశ్వత భూధార్‌ ఆదేశాల కోసం ఉత్తర్వులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అమరావతి రాజధాని ప్రాంతంలో విజయవాడ రెవెన్యూ డివిజన్‌ కీలకమైనది. అమరావతి నగరానికి కృష్ణానది ఈవలవైపు విస్తరించిన ప్రాంతం అంతా రాజధాని పరిధిలోకి వస్తుంది. భూముల వివాదాలకు చెక్‌పెట్టడానికి, భూముల వివరాల్లో పారదర్శకత తెచ్చేందుకు విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోనే పైలట్‌ ప్రాజెక్టుగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఒక మునిసిపాలిటీ, ఒక మండల పరిధిలో చేపట్టారు.
 
 
ఈ క్రమంలో తర్వాత ప్రభుత్వం జిల్లా మొత్తంగా ఈ ప్రక్రియను నిర్వహించాల్సిందిగా సూచించింది. విజయవాడ రెవెన్యూ డివిజన్‌లో విజయవాడ అర్బన్‌, విజయవాడ రూరల్‌, వీరులపాడు, వత్సవాయి, తోట్లవల్లూరు, పెనుగంచిప్రోలు, పెనమలూరు, నందిగామ, మైలవరం, కంకిపాడు, కంచకచర్ల, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, జి. కొండూరు, చందర్లపాడు మండలాలున్నాయి. ఈ మండలా ల పరిధిలో మొత్తం 2,74,139 భూ విభాగాలున్నాయి. వీటిలో 1,80, 353 ప్రైవేటు, 19,968ప్రభు త్వ భూ విభాగాలున్నా యి.విస్తీర్ణంలో మొత్తం 15మండలాల్లో 42, 441 ఎకరాల ప్రైవే టు భూములు, 35,542 ప్రభుత్వ భూములున్నాయి. మే 20 నాటికి ప్రభుత్వ, ప్రైవేటు భూ విభాగాలు మొత్తం 2,00,321 ల కు అంటే దాదాపుగా 67.52 శాతం తాత్కాలిక భూధార్‌ ప్రక్రియ నిర్వహించారు. మే 31నాటికి ఈ మొత్తం 85 శాతానికి చేరుకుంది. మిగిలిన 15 శాతం భూ విభాగాలకు సంబంధించి వివాదాలు ఉండటం వల్ల పూర్తి కాలేదు. వివాదాలు తేలితే తక్షణం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
bza1.jpg
 
 
నోషనల్‌ ఖాతాల వ్యవహారం తేలాలి
నోషనల్‌ ఖాతాలంటే కుటుంబ వివాదాలుగా చెప్పుకోవాలి. తల్లి, తండ్రి నుంచి పిల్లలకు సంక్రమించిన భూములకు సంబంధించి వారి మధ్య వివాదాలు ఉంటే వాటిని నోషనల్‌ ఖాతాలుగా పరిగణిస్తారు. వారి వంశీయుల మధ్య అవగాహన కుదిరి డీడ్‌ రాసుకుంటే తప్ప వీటికి తాత్కాలిక భూధార్‌ నిర్వహించే పరిస్థితి ఉండదు. విజయవాడ రెవెన్యూ డివిజన్‌లో ఇలాంటి నోషనల్‌ ఖాతాలు 10 శాతం మేర ఉన్నాయి.
 
 
అన్‌ రిజిస్టర్‌ భూములకూ జరగాలి
డివిజన్‌లో అన్‌రిజిస్టర్‌ భూములు 5 శాతం మేర ఉన్నాయని గుర్తించారు. ఇక్కడ అన్‌ రిజిస్టర్డ్‌ అంటే .. భూమిని కొని రిజిస్ర్టేషన్‌ చేయకుండా వాటిని అనుభవించటం, భూములను అమ్మి వాటిని రిజిస్ర్టేషన్‌ చేయకుండా అనుభవించటం వంటివి వస్తాయి. వీటికి సంబంధించి రిజిస్ర్టేషన్‌ జరగాల్సి ఉంది. రిజిస్ర్టేషన్‌ జరిగితే తప్ప వీటికి తాత్కాలిక భూధార్‌ నిర్వహించటం సాధ్యం కాదు.
 
పర్మినెంట్‌ భూధార్‌ నిర్వహించటానికి ప్రభుత్వం ఆదేశాల కోసం ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగానే పర్మినెంట్‌ భూధార్‌ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. వారికి భూధార్‌ కార్డులను జారీ చేయటం జరుగుతుంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

does bhudar applicable to plots(house sites) . will they link house sites with aadhar.

i have one peculiar problem.

i bought plot in 2014 . my father attended on behalf me in register office . i gave passport as proof.  my name was wrongly typed by computer operator(may be he typed telugu name with wrong spelling instead of checking passport proof) in registration office. my father didn't check mistake  at that time. later i contacted sub registrar, he said it is not possible to correct name in  property document and ec(encumbrance certificate) . 

i try to send my problem to http://registration.ap.gov.in/feedback.jsp , but it is giving error after clicking submit button.

if anybody knows procedure to correct name in documents and ec please reply

 

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...
  • 1 month later...
ఆధార్‌లా.. భూధార్‌ కార్డు
27-10-2018 02:54:21
 
  • ఎవరి భూమి నంబరు వారి దగ్గరే... వచ్చే నెల నుంచి పైలట్‌
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి భూమికీ ఒక నంబర్‌ ఇచ్చే కార్యక్రమం ‘భూధార్‌’ను అమలుచేస్తున్నామని...దీంతో భూములన్నింటికీ రక్షణ లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. భూధార్‌ ప్రాజెక్టు పూర్తయితే ఎవరి భూమికి సంబంధించిన కార్డును వారు జేబులో పెట్టుకుని వెళ్లొచ్చని పేర్కొంది. వ్యక్తులకు ఆధార్‌ కార్డులా, భూములకు భూధార్‌ కార్డు ఉంటుందని వ్యాఖ్యానించింది. శుక్రవారమిక్కడ ఉండవల్లిలోని ప్రజావేదిక మందిరంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ అంశంపై భూసేవ, భూధార్‌ అధికారులు ఓ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘‘భూధార్‌ ప్రాజెక్టుతో సమూల మార్పులు రానున్నాయి. నవంబరులో ఈ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం ఆస్తుల సంఖ్య 3.47కోట్లు. అందులో రెవెన్యూ ఆస్తులు 32.37లక్షలు, గ్రామీణ ఆస్తులు 84.21లక్షలు. ఇప్పటికే భూసేవలో వీటిలో 98.81శాతం నమోదయ్యాయి’’ అని వివరించారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
భూధార్ వల్ల ప్రయోజనాలేంటి..!
ఒక్క క్లిక్‌తోనే భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు.
ఆధార్‌ తరహాలో భూమికి భూధార్‌ కింద 11 అంకెల విశిష్ట సంఖ్యలు ఉంటాయి.
ఈ భూ సేవ ప్రాజెక్టు 20 రకాల సేవలు అందించనుంది.
భూసేవలో భాగంగా సెక్యూరిటీ పాలసీని ఆవిష్కరించడం జరిగింది.
రైతుల భూకమతాలను సురక్షితంగా ఉంచేందుకు సెక్యూరిటీ పాలసీ ఉపయోగపడుతుంది.
భూసేవలో భాగంగా ఈ-భూధార్‌, మొబైల్‌ ఆధార్‌ కార్డులు ఉంటాయి.
భూసేవ ద్వారా రాష్ట్రంలోని ప్రతి స్థలానికి ఆధార్‌ తరహాలో ప్రత్యేక నెంబర్‌ ఇవ్వనున్నది.
రెవెన్యూ శాఖ పైలట్‌ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లాలో ప్రభుత్వం అమలు చేసింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...