Jump to content

దాచేపల్లి అత్యాచార నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య..?


Recommended Posts

దాచేపల్లి సంఘటన బాలిక తండ్రి తనకు న్యాయం జరిగిందని చెప్పిన మాటలు వింటే తెలుస్తుంది చంద్రబాబు ఈ సంఘటనని ఎంత సీరియస్ గా తీసుకున్నారో.

అమ్మ రోజా అసెంబ్లీ ముందు నీతోటి MLAలకు నిన్ను రేప్ చేసే దమ్ము ఉందా అని నీచమైన సవాలు విసిరిన నువ్వు, ఒక చిన్న పసిబిడ్డకు జరగరాని సంఘటన జరిగితే, ఆ పసిబిడ్డ ఉన్న హాస్పిటల్ కి వెళ్లి నీచ రాజకీయం చేస్తావా. నీ నీచ రాజకీయం చూసి సమాజం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు.

రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగాలని, దానిని రాజకీయం చేసి లాభం పొందాలని ప్రతి రోజు ఎదురుచూసే మీ ysrcp పార్టీని ఏమని పిలవాలి ? సిగ్గుండాలి మీకు.

మేము ఎన్నికల్లో ఓడిపోవడానికైనా సిద్ధం, కానీ ఇలాంటి నీచ రాజకీయం ఎప్పుడు చేయం...That is TDP.

Link to comment
Share on other sites

సొంత డబ్బులతో బాలికను చదివిస్తాం: చంద్రబాబు
05-05-2018 12:20:26
 
636611196718573283.jpg
గుంటూరు: దాచేపల్లిలో అత్యాచారానికి గురైన బాలికను సొంత డబ్బులతో చదివిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన శనివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... బాధిత కుటుంబానికి ఇప్పటికే రూ. 5 లక్షలు ఇచ్చామని, మరో రూ. 5 లక్షలు చిన్నారి పేరు మీద డిపాజిట్‌ చేస్తామన్నారు. టెక్నాలజీని కొందరు చెడుకు ఉపయోగించకుంటున్నారని, అనుకోని ఘటనలు జరిగినప్పుడు బాధ్యతతో మాట్లాడాలని, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని సీఎం అన్నారు. ఇది తీవ్రమైన నేరం..., నాగరిక ప్రపంచం సిగ్గుపడే ఘటన అని, ఫిర్యాదు వచ్చిన వెంటనే 15 టీంలను రంగంలోకి దింపామన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే అదే వారికి చివరి రోజు అన్నారు. అలాగే అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయనే భయం రావాలన్నారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు శిక్షలు పడేలా చూస్తామని, కామాంధులపై ప్రజలు తిరగబడాలని, ఇలాంటి ఘటనల పట్ల ప్రజల్లో చైతన్యం రావాలని, ఇలాంటి ఘటనలను రాజకీయం చేయడం సరికాదని చంద్రబాబు అన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...