Jump to content

ONGC Nagayalanka


Recommended Posts

నాగాయలంకలో చమురు, వాయు నిక్షేపాల వెలికితీత
02-05-2018 02:14:39
 
636608240832789036.jpg
  • వచ్చే మార్చి నుంచి ప్రారంభం
  • రోజుకు 450 క్యూబిక్‌ మీటర్ల ఆయిల్‌
  • లక్షా 50 వేల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ వెలికితీత లక్ష్యం
  • రవాణాకు మూడు సంస్థలతో ఒప్పందం
  • కృష్ణా జిల్లాకు మెగా ఇంజనీరింగ్‌ సంస్థ ద్వారా పంపిణీ
రాజమహేంద్రవరం, మే 1(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా నాగాయలంకలో చమురు, సహజ వాయువుల వెలికితీత ప్రారంభం కానుంది. 10 రోజుల్లో ఉత్పత్తి చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఓఎన్జీసీ అధికార వర్గాలు తెలిపాయి. మార్చిలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి అన్ని అనుమతులూ వచ్చాయి. కృష్ణాజిల్లా నాగాయలంకలో అత్యధిక చమురు, సహజ వాయువులు ఉన్నట్టు 2014లోనే ధ్రువీకరించారు. అక్కడ డ్రిల్లింగ్‌ కూడా చేశారు. అక్కడ బావికి 1-జడ్‌ఎస్‌ అని పేరు పెట్టారు. రోజుకు 150 ఎంఎం క్యూబిక్‌ మీటర్ల చమురు, 40 వేల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ వెలికి తీయాలని నిర్ణయించారు. మొదట్లో ఓఎన్జీసీ, కెయిర్న్‌ ఎనర్జీ సంస్థ ఉమ్మడిగా ఇక్కడ తవ్వకాలు జరిపాయి. తర్వాత పూర్తి ఆపరేషన్‌ బాధ్యతను ఓఎన్జీసీ తీసుకుంది. ఇది అత్యంతలోతు, అత్యంత ఉష్ణ ప్రాంతంగా గుర్తించి దానికి అనుకూలమైన రిగ్గును కూడా తీసుకువచ్చారు. పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. కానీ ఓఎన్జీసీకి గ్యాస్‌ సరఫరా పైప్‌లైను లేకపోవడంతో మెగా ఇంజనీరింగ్‌ సంస్థ, రాక్‌ సిరామిక్‌, సెంటినీ శానిటరీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
 
 
గ్యాస్‌ రవాణాకు అవసరమైన గ్యాస్‌ క్యాష్‌కేర్‌, గ్యాస్‌ కంప్రెజర్‌లను ఈ సంస్థలే సమకూర్చుకోవడానికి అంగీకరించాయి. కానీ, ఈ సంస్థలకు ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనేది ఓఎన్జీసీ నిర్ణయించనుంది. ముందుగా మెగా ఇంజనీరింగ్‌ సంస్థకు చెందిన సిటీ గ్యాస్‌ ఏజెన్సీ ద్వారా కృష్ణా జిల్లాకు గ్యాస్‌ సరఫరా చేయనుంది. మూడు నెలల్లో కృష్ణా జిల్లాలో వాహనాలకు అవసరమైన గ్యాస్‌ను ఈ సంస్థ సమకూర్చనుంది. నాగాయలంక చమురు క్షేత్రంలో ఇప్పటికే ఒక బావి ఉండగా, మరో మూడు బావులు డ్రిల్లింగ్‌ చేయవలసి ఉంది. ఈ నెలాఖరుకి ఒక బావిని సిద్ధం చేస్తారు. వచ్చే ఏడాది మార్చిలోపు మూడు బావుల నుంచి రోజుకు 450 క్యూబిక్‌ మీటర్ల చమురు, లక్షా 50 వేల స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల సహజవాయువును వెలికి తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక సంవత్సరం పాటు ఇక్కడ పరిస్థితిని పరిశీలించి మరింత విస్తరించడానికి ఓఎన్జీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. రూ.420 కోట్లతో ప్రాజెక్టును చేపట్టారు. వేదాంత లిమిటెడ్‌ కూడా భాగస్వామిగా ఉంది. సాధారణంగా 2,500 మీటర్ల నుంచి 3,500 మీటర్లలోపు డ్రిల్లింగ్‌ చేయవలసి ఉండగా ఇక్కడ 4,600 మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేయవలసి ఉంది.
 
 
దీనికోసం అడ్వాన్స్‌ టెక్నాలజీతో కూడిన జాన్‌-16 అనే రిగ్గును సిద్ధం చేశారు. ఇది 5వేల మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్‌ చేయగలదు. కృష్ణా జిల్లాలో బంటుమిల్లి క్షేత్రం కూడా అతి ముఖ్యమైనది. ఇది చాలా కాలం క్రితమే గుర్తించారు. ఇది తొలిసారిగా ఇండియన్‌ డ్రిల్లింగ్‌ టెస్ట్‌లో చేసిన బావి. ఇక్కడ రోజుకు 1.50 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఈ బావికి వినియోగించిన టెక్నాలజీపై త్వరలో రాజమహేంద్రవరంలో ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఓఎన్జీసీ రాజమహేంద్రవరం ఎసెట్‌ పరిధిలో 3.5 మిలియన్ల గ్యాస్‌, 850 టన్నుల చమురు ఉత్పత్తి చేస్తోంది. టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్టక్చర్‌ సహకారంతో 4 మిలియన్ల గ్యాస్‌, వెయ్యి టన్నుల చమురు ఉత్పత్తికి ఓఎన్జీసీ ప్రయత్నం చేస్తోంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
రేపటి నుంచి నాగాయలంకలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌

0703152105BRK133.JPG

నాగాయలంక: ఆంధ్రప్రదేశ్‌లో చమురు అన్వేషణ ఊపందుకోనుంది. ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తి అయిన నాగాయలంక ప్రాంతంలో రేపటి నుంచి ఓఎన్‌జీసీ డ్రిల్లంగ్‌ ప్రారంభించనుంది. మంగళవారం మధ్యాహ్నం అధికారికంగా ఈకార్యక్రమం మొదలుకానుంది. ఇప్పటికే ఇక్కడ డ్రిల్లంగ్‌కు పర్యావరణ, పెట్రోలియం శాఖలు అనుమతి ఇచ్చాయి. సీఎం చంద్రబాబునాయుడు చొరవ చూపడంతో కేంద్రం త్వరితగతిన అనుమతులు మంజూరు చేసింది.

నాగాయలంక ప్రాంతంలో చమురు, గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్లుగా ఓఎన్‌జీసీ గుర్తించింది. రోజుకు 450 క్యూబిక్‌ మీటర్ల చమురు ,1.5 లక్షల ఘనపుటడుగుల గ్యాస్‌ నిక్షేపాలు వెలికి తీయవచ్చని గుర్తించారు. నాగాయలంక నుంచి 4.4 కిలోమీటర్ల దూరంలో ఈ నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. తొలిదశలో మూడు బావుల ద్వారా గ్యాస్‌ వెలికితీయాలని ఓఎన్‌జీసీ నిర్ణయించింది. రెండోదశలో వీటి సంఖ్యను 29కు పెంచనుంది. ఈ ప్రాజెక్టు కోసం ఓఎన్‌జీసీ రూ.420 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. పరికరాల కొరత, అత్యధిక ఉష్ణోగ్రతలు, లోతు ఎక్కవగా ఉండటం వంటివి డ్రిల్లింగ్‌కు ప్రధాన సమస్యలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రిల్లంగ్‌ కోసం ఓఎన్‌జీసీ వేదాంత గ్రూప్‌తో జట్టుకట్టింది.

Link to comment
Share on other sites

మహర్దశ
నాగాయలంకలో చమురు తవ్వకాలు
నేడు ప్రారంభించనున్న ఓఎన్‌జీసీ సీఎండీ
ఎట్టకేలకు సాకారమవుతున్న కల
ఈనాడు, అమరావతి
amr-top1a.jpg

నాగాయలంక తీరప్రాంతంలోని చమురు నిక్షేపాలను వెలికితీసే మహా ప్రక్రియకు నేడు అంకురార్పణ జరగనుంది. తీరప్రాంతంలో సుదీర్ఘ కాలం వెతుకులాటకు తెరపడింది. సుమారు ఆరేళ్లకు పైగా ఇక్కడ చమురు నిక్షేపాల కోసం వెతుకులాట, అనుమతుల ప్రక్రియ నడుస్తోంది. ఈ ప్రాంతంలో 450 మిలియన్‌ బారెల్‌ చమురు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. సముద్రానికి పాతిక కిలోమీటర్ల దూరంలోని తీరప్రాంతంలో నాగాయలంకకు ఆనుకుని ఉన్న వక్కపట్లవారి పాలెంలో ప్రస్తుతం ఈ తవ్వకాలు చేపట్టనున్నారు. ఇక్కడే చాలాకాలంగా ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో భూగర్భ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఓఎన్‌జీసీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశి శంకర్‌ మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు గ్యాస్‌ నిక్షేపాలను వెలికితీసేందుకు ఇక్కడ తవ్వకాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్థానికంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఓఎన్‌జీసీ అనేక హామీలను ఇచ్చింది. దీనిలో భాగంగా ఓఎన్‌జీసీ సామాజిక బాధ్యత కింద మండలంలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకోనున్నట్టు ప్రకటించింది. తవ్వకాలు జరుగుతున్న యూనిట్‌కు సమీపంలోని వక్కపట్లవారి పాలెం, నంగేయగెడ్డ, బావదేవరపల్లి, నాగాయలంక సహా చుట్టుపక్కల ఉండే గ్రామాలు, ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కూడా కల్పించనున్నారు. మండలంలోని ఇతర గ్రామాల్లోనూ మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. స్థానిక యువతకు ఇక్కడి యూనిట్‌లో కొలువులను సైతం ఇచ్చేందుకు సంస్థ ఇప్పటికే అంగీకారం తెలిపింది. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో స్థానిక ప్రజలు కోరిక మేరకు.. దీనికి అంగీకరించారు. స్థానిక గ్రామాలలో ఉండే కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు వంటి వాటిని సైతం దత్తత తీసుకోనున్నారని నాగాయలంక తహసీల్దార్‌ నర్సింహారావు ‘ఈనాడు’కు వెల్లడించారు.

అనేక ఏళ్లుగా తవ్వకాలు.. వక్కపట్లవారి పాలెంలో ఓఎన్‌జీసీకి చెందిన స్థలంలో చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి చాలా ఏళ్ల కిందటే పరీక్షల కేంద్రాన్ని నెలకొల్పారు. అప్పటినుంచి ఇక్కడ తవ్వకాలు జరుపుతూ.. చమురు నిక్షేపాల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం 450లో.. 40 మిలియన్‌ బారెల్‌ చమురు నిక్షేపాల వరకూ తవ్వేందుకు అనుమతులు   తీసుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. తొలి దశలో గ్యాస్‌, తర్వాత చమురు నిక్షేపాలను వెలికితీయనున్నారు. నాగాయలంకలో ఇప్పటికే క్షిపణి పరీక్ష కేంద్రం రాబోతోంది. ప్రస్తుతం చమురు నిక్షేపాల తవ్వకాలు సైతం ఇక్కడే ప్రారంభమవ్వడంతో.. నాగాయలంకతో పాటు కృష్ణా జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.

Link to comment
Share on other sites

CBN endi saami.  Final year lo kuda rajakeeyam cheyada. Asalu ilanti vaatini operation kuda avvakunda  election year lo addukoni rajakeeyam seyyali...ONGC vaadu ikkada dobbi think gujarat lo investments peduthunnadu. Okkosari ilanti I choosthe aa PK correct anipisthundi.

Link to comment
Share on other sites

సామాజిక సేవలకు ఏటా రూ.64కోట్లు: ఓఎన్జీసీ చైర్మన్
22-05-2018 13:51:47
 
636625939086762833.jpg
రాజమండ్రి: ఓఎన్జీసీ కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో ఏటా రూ.64 కోట్లు సామాజిక సేవలకు వినియోగిస్తున్నామని ఓఎన్జీసీ చైర్మన్ శశి శంకర్‌ తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి రూ.352 కోట్లు రాయల్టీ చెల్లిస్తున్నామన్నారు. ఈ ఏడాది చమురు, గ్యాస్‌ ఉత్పత్తికి 35వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఏటా 500 చమురు, గ్యాస్‌ బావులు తవ్వుతున్నామని వివరించారు. వచ్చే ఏడాదికి రెట్టింపు ఉత్పత్తే లక్ష్యమని ఓఎన్జీసీ చైర్మన్‌ శశి శంకర్‌ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

Seems like it's a small well(450 million barrel). Worlds average consumption per day is 90 million barrel. 

My assumption, World will be moving towards natural gas and the demand for NG will be higher than oil in future. Hope we had more gas reserves.

 

 

 

 

Link to comment
Share on other sites

7 hours ago, Bollu_Boss said:

I just want to know whats the use for AP with this..

CBN e project kosam antha care tisukovtam deniki 

Mana gas tisukuni velli malli manake tax vestaru..

E news paper vallu mahardasa antaru..

Confused.....Please enlighten..

They said they will use gas & oil first in Ap & then will supply to all other states fingers crossed 

Link to comment
Share on other sites

19 hours ago, sonykongara said:
సామాజిక సేవలకు ఏటా రూ.64కోట్లు: ఓఎన్జీసీ చైర్మన్
22-05-2018 13:51:47
 
636625939086762833.jpg
రాజమండ్రి: ఓఎన్జీసీ కార్యకలాపాలు జరిగే ప్రాంతంలో ఏటా రూ.64 కోట్లు సామాజిక సేవలకు వినియోగిస్తున్నామని ఓఎన్జీసీ చైర్మన్ శశి శంకర్‌ తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి రూ.352 కోట్లు రాయల్టీ చెల్లిస్తున్నామన్నారు. ఈ ఏడాది చమురు, గ్యాస్‌ ఉత్పత్తికి 35వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఏటా 500 చమురు, గ్యాస్‌ బావులు తవ్వుతున్నామని వివరించారు. వచ్చే ఏడాదికి రెట్టింపు ఉత్పత్తే లక్ష్యమని ఓఎన్జీసీ చైర్మన్‌ శశి శంకర్‌ స్పష్టం చేశారు.

eppudo annaru... ONGC office TN lo vundatam valana AP ki ravalsina money edho TN ki velutondani... is it still happening after GST?

Link to comment
Share on other sites

నాగాయలంక’ గ్యాస్‌ ఏపీకే
23-05-2018 02:48:27
 
636626405086769381.jpg
  • ఆ తర్వాతే వేరే రాష్ట్రాలకు సరఫరా
  • చంద్రబాబు వల్లే ప్రాజెక్టు సాకారం
  • రోజుకు 400 టన్నుల మేర గ్యాస్‌
  • 2లక్షల క్యూ.మీ.ల ఆయిల్‌ తీస్తాం
  • ‘వేదాంత’ భాగస్వామిగా ముందుకి
  • ఓఎన్‌జీసీ చైర్మన్‌ శశిశంకర్‌ వెల్లడి
  • నాగాయలంకలో వెలికితీత ప్రారంభం
  • ఆయిల్‌ విడుదల చేస్తున్న సీఎండీ శశిశంకర్‌
(నాగాయలంక నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
నాగాయలంక ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాల సరఫరాలో ఆంధ్రప్రదేశ్‌ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ‘ఓఎన్‌జీసీ’ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శశిశంకర్‌ వెల్లడించారు. దివిసీమ ప్రజలకు అందించిన తరువాతే, వేరే ప్రాంతాలకు, రాష్ట్రాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నాగాయలంక క్షేత్రం వద్ద మంగళవారం ఎర్లీ ప్రొడక్షన్‌ సిస్టమ్‌ను(ఈపీఎస్‌) శశిశంకర్‌ ప్రారంభించారు. నాగాయలంక క్షేత్రంలోని 33 బావులకు అటవీ, పర్యావరణ అనుమతులు తెప్పించడంలో, కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ నుంచి వాణిజ్య సమ్మతిని రప్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషి అభినందనీయమని ఈ సందర్భంగా శివశంకర్‌ అన్నారు. భూములను ఇచ్చిన నాగాయలంక గ్రామంలో సామాజిక బాధ్యత కింద అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు. ‘‘గ్యాస్‌, ఆయిల్‌ నిక్షేపాల వెలికితీతని ఒక పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఈ ప్రాజెక్టులో 49 శాతం వాటాతో వేదాంత భాగస్వామిగా ఉంటుంది. ప్రాజెక్టు వ్యయం 400 మిలియన్‌ డాలర్లు. రోజుకు 400 టన్నుల గ్యాస్‌, రెండు లక్షల స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల అయిల్‌ నిక్షేపాలను వెలికి తీయనున్నాం. దీనికి సంబంధించిన విస్తరణ పనులు మొదలయ్యాయి’’ అని శశి శంకర్‌ వివరించారు. ఒక్కో ఆఫ్‌షోర్‌లో ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాల వెలికితీత కోసం రూ.35,000 కోట్ల దాకా వ్యయం అవుతుందన్నారు. ఆన్‌షోర్‌ చమురు, గ్యాస్‌ ఉత్పత్తులుపై ఈ ఏడాది రూ.352 కోట్లను రాయల్టీగా ఏపీకి చెల్లిస్తున్నామని చెప్పారు. ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌ విలీనం అంశంపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఒక ప్రశ్నకు జవాబుగా అన్నారు. సహజ వాయు, చమురు నిక్షేపాల వెలికితీత కార్యక్రమాలలో వేగాన్ని పెంచి వచ్చే ఏడాదినాటికి ఉత్పత్తిని రెట్టింపుజేస్తామని ప్రకటించారు. ‘‘దేశంలో ఈ ఏడాది రూ.35000 కోట్లను చమురు, గ్యాస్‌ ఉత్పత్తి అన్వేషణ కోసం వ్యయం చేశాం. ఏటా 500 చమురు, గ్యాస్‌ బావుల తవ్వకాలు చేపడుతున్నాం. దేశీయంగా ఉత్పత్తిని పెంచి దిగుమతులను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నామ’’ని శివశంకర్‌ వివరించారు. కాగా, నాగాయలంకలో వెలికితీసిన చమురు నిక్షేపాల ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ను సరఫరా చేసే బాధ్యతను మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాకు అప్పగించామన్న ఆయన, మరో రెండు సంస్థలకు కూడా ఆ పనులు ఇవ్వనున్నామని చెప్పారు. కృష్ణాజిల్లాలోని పట్టణాలు, నగరాల్లో గ్యాస్‌ సరఫరాను ‘మేఘా’ చేపడుతుందని వివరించారు.
 
మా గ్యాస్‌ మాకే ఇవ్వండి: కొనకళ్ల
దివిసీమలో వెలికి తీస్తోన్న నిక్షేపాలను రాష్ట్ర అవసరాల కోసమే కేటాయించాలని ఓఎన్‌జీసీ చైర్మన్‌ శశిశంకర్‌ను ఎంపీ కొనకళ్ల నారాయణ కోరారు. నాగాయలంక ప్రాజెక్టు నిలిచిపోతుందనుకున్న తరుణంలో, ముఖ్యమంత్రి చొరవే కాపాడిందని గుర్తు చేశారు. ప్రజాభిప్రాయసేకరణలో పాల్గొని, తమ భూములను స్వచ్ఛందంగా అప్పగించిన నాగాయలంక ప్రజలను అన్నివిధాలా ఆదుకోవాలని, వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌.. ఓఎన్‌జీసీ మేనేజ్‌మెంటును కోరారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...