Jump to content

kurnool development


Recommended Posts

కర్నూల్ లో మూడు వేలకోట్ల పెట్టుబడితో స్థాపించనున్న జయరాజ్ ఇస్పాత్ కి.........
ఈ నెల పదిన భూమిపూజ చేయనున్న సియం చంద్రబాబు???

Link to comment
Share on other sites

కర్నూలు జిల్లా ప్రగతి ఓ మెట్టు పైకి చేరుకుంది. గతంతో పోల్చుకుంటే పారిశ్రామిక అభివృద్ధి మెరుగుపడింది.

అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో ఆయా జిల్లాల్లో స్థూల ఉత్పత్తి(జిడిడిపి), స్థూల ఆదాయం విలువ(జివిఎ), తలసరి ఆదాయం(పిసిఐ) లో సాధించిన ప్రగతి పై చర్చించారు.

2016-17 సంవత్సరంలో వ్యవసాయం, పారిశ్రామిక సేవల్లో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు.

2015-16 లో స్థూల ఉత్పత్తిలో జిల్లా 9 వ స్థానంలో ఉంటే ఇప్పుడు 8వ స్థానంలో నిలిచింది.

https://pbs.twimg.com/media/DcxW_2KV0AA4cjW.jpg

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
మాటిచ్చి.. మనసు గెలిచి
నాలుగేళ్లలో ప్రగతికి 159 వరాలు
83 హామీలు పూర్తి... మరో 63 అమలు దశలో...
నేడు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన
ఈనాడు డిజిటల్‌ - కర్నూలు
knl-top1a.jpg
వ్యాంధ్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు తొలిసారి జిల్లాకు 2014, ఆగస్టు 15న వచ్చారు. అప్పటి నుంచి జిల్లాలో పాతిక సార్లు పర్యటించారు. ప్రతి పర్యటనలో జిల్లాకు వరాల జల్లులు కురిపించారు. ఇచ్చిన హామీలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించి అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించారు. ఈ నాలుగేళ్లలో 159 హామీలివ్వగా... వాటిలో 83 పూర్తిచేశారు. 63 ప్రగతి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 13 హామీలు అమలు చేయాల్సి ఉంది. సీఎం తాను ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ జిల్లాలో ప్రగతి బాటలు వేస్తున్నారు. ప్రస్తుతం హంద్రీనీవా నీటితో 68 చెరువులు నింపే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికారు. పశ్చిమ రైతుల కష్టాలను గట్టెక్కించడానికి శ్రీకారం చుట్టారు. ‘నీటి భద్రత..కరవు రహిత రాష్ట్రం’ నినాదంతో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆదివారం సీఎం జిల్లా గడప తొక్కనున్నారు. సుమారు ఏడు గంటల సమయం ప్రజల మధ్య గడపనున్న చంద్రబాబు దృష్టికి జిల్లాలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది.

ఆ.. పదమూడు
ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు ఇచ్చిన వరాల్లో ఈ ఏడాది జనవరి 7న సిద్ధాపురం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి వచ్చినప్పుడు (మిగతా 2లో) ప్రకటించిన వరాల జల్లులో ఆరు హామీలు అమలు కావాల్సి ఉంది. వీటిలో ఎత్తిపోతల పథకం వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించాల్సిన ‘ఎన్టీఆర్‌ స్మృతివనం’ అపరిష్కృతంగా ఉంది. సిద్ధాపురం నుంచి 4 వేల ఎకరాలకు ఇందిరేశ్వరం కెనాల్‌ ఏర్పాటు, ఆత్మకూరు నుంచి ఓంకారం గ్రామానికి రెండు లైన్ల రహదారి, ఐటీడీఏ ద్వారా ఇళ్లు మంజూరైన చెంచులకు అదనంగా ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద అదనంగా నగదు, చెంచు కాలనీలకు ఓవర్‌హెడ్‌ ట్యాంకు ద్వారా ఇంటింటి కుళాయి, సిద్ధాపురం గ్రామంలో అంతర్గత రహదారులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, మురుగు కాల్వలు వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది దీనిపై కసరత్తు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రాలకు రహదారులు, దోబీ ఘాట్లు(చాకిరేవు)లు ఏర్పాటు చేస్తామన్న హామీ ఇంకా ఆచరణలోకి రాలేదు. ఎమ్మిగనూరులో అప్పారెల్‌ పార్కులో సీసీ కెమెరాలతో అంగన్‌వాడీ కేంద్రాలు, హాస్పిటల్‌, దుకాణ సముదాయం వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురాలేదు. మైనార్టీ శాఖ పరిధిలో వెలుగోడులో ఈద్గా నిర్మాణం, మైనార్టీ జూనియర్‌ కళాశాల, రెసిడెన్షియల్‌ స్కూలు వంటి హామీలు ఇంకా పట్టాలెక్కలేదు. నంద్యాల ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం చామకాల్వ నీటిని రీసైక్లింగ్‌ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం స్థల సేకరణ దశలో ఉన్నట్లు సమాచారం. పాత్రికేయులకు త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు హామీకి నేటికీ అడుగులు పడలేదు.

ముఖ్యమంత్రి వర్యా.. మీరు దృష్టిపెడితేనే
* 2015, మే 4న బనవాసి వద్ద చేనేత కార్మికులతో చర్చించిన చంద్రబాబు 97 ఎకరాల స్థలం టెక్స్‌టైల్‌ పార్కుకు కేటాయించిన విషయం విదితమే. ఈ పార్కులో చిన్నచిన్న పరిశ్రమలు నెలకొల్పి పదివేల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రకటించారు. మౌలిక సదుపాయాలకు డీపీఆర్‌ సిద్ధం చేసి రూ.44 కోట్లు మంజూరుకు ప్రతిపాదనలు ప్రభుత్వ స్థాయిలోనే నిలిచిపోయాయి. 2006 నుంచి 2014 వరకు జిల్లాలో 22 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరి కుటుంబాలకు పరిహారం నేటికీ అందకపోవడం విచారకరం. నేత నేసిన కార్మికులకు కూలి గిట్టుబాటు గాక, నేసిన వస్త్రాలకు మార్కెట్‌ వసతి లేక మగ్గాలనే వదిలేస్తున్న పరిస్థితి జిల్లాలో ఉంది. జిల్లాలో 27 వేల మగ్గాలుండగా ప్రస్తుతం వీటి సంఖ్య పది వేలకు పడిపోయిందంటే ఎంతటి సమస్యలు చేనేతలు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
* తెలుగు రాష్ట్రాలను కలిపే తుంగభద్రపై రూ.42 కోట్లతో చేపట్టిన నాగులదిన్నె వంతెన నిర్మాణం నేటికీ కొలిక్కి రాలేదు. తెలంగాణ వైపు రెండు ఎకరాల భూసేకరణే ప్రధాన సమస్యగా ఐదేళ్ల నుంచి పనులు జాప్యమవుతున్నట్లు చెబుతున్నారు.
* కర్నూలు నగర కేంద్రంలో గత 2009 వరదల బీభత్సం పునరావృతం కాకుండా ఉండటానికి వరద పరిరక్షణ గోడ ఆవశ్యకత ఎంతైనా ఉంది. 2008లో హంద్రి, సుద్దవాగు, వక్కెరవాగు, తుంగభద్ర నదుల రక్షణ గోడలకు రూ.244 కోట్లతో శ్రీకారం చుట్టినా అడుగులు పడలేదు. ప్రస్తుతం కాంక్రీటుతో నిర్మాణం చేపట్టాలంటే వ్యయం నాలుగింతలు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై సీఎం హామీ ఇస్తే వర్షాల సమయంలో  ప్రాణ నష్టాన్ని ఆపొచ్చు.
* ఆర్డీఎస్‌ కుడి కాల్వను ప్రాధాన్య ప్రాజెక్టులో చేర్చడం సంతోషకరమైన అంశం. ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో 50 వేల ఎకరాలకు సాగు, తాగునీటి సమస్యలు తీరనున్నాయి. రూ.1700 కోట్లతో డీపీఆర్‌ నివేదికలు ప్రభుత్వానికి అందాయి. నిధులు విడుదల చేస్తే నిర్మాణ పనులు చేపట్టవచ్చు. నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి జిల్లా నేతలతో కలిసి పలుమార్లు సీఎం దృష్టికి ప్రాజెక్టు విషయం తీసుకెళ్లడమే కాకుండా ప్రాధాన్య ప్రాజెక్టుల్లో చేర్పించడం విజయంగా రైతులు చెబుతున్నారు.

 
 

 

Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...