Jump to content

Kolleru Lake


Recommended Posts

1 hour ago, sonykongara said:

godavari water kolleru loki pamlema

it can be done very easily.

Polavaram Right main canal passes over Tammileru near Janampeta (north of Eluru). akkada kontha water aa vaagu loki vadilithe sari. but there is no water (extra) for this.

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

godavari water kolleru loki pamlema

CBN start chesina(last months release 15 crore for the small diversion) Polavaram Right canal direct drop to Eluru canal purpose lo KOlleru fill cheyyatam okati main purpose.....

RIght now water has to travel to Prakasam barrage before it goes to kolleru after serving 3 lakh acres....With the new "Direct link" water goes to Kolleru 60 KM before prakasam barrage...

 

 

Link to comment
Share on other sites

గోదారి నీరు నేరుగా కృష్ణా కాలువకు
పోలవరం కుడి కాలువ నుంచి ఏలూరు కాలువకు సంధానం
  80 వేల ఎకరాల స్థిరీకరణ లక్ష్యం
  రూ.15.45 కోట్ల అంచనా వ్యయం
  ఆర్థిక శాఖకు చేరిన దస్త్రం
ఈనాడు-అమరావతి
31ap-main6a.jpg

పోలవరం కుడి కాలువను, కృష్ణా ఏలూరు కాలువతో అనుసంధానించి ఆ కాలువ కింద ఉన్న 80 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో భాగంగా పోలవరం కుడి కాలువ 137.290 కిలోమీటరు వద్ద ఉన్న అండర్‌టన్నెల్‌ సమీపం నుంచి ఏలూరు కాలువ 36వ కిలోమీటరు వద్దకు మరో కాలువ తవ్వనున్నారు. ఇలా చేయడం వల్ల కృష్ణాలో నీళ్లు లేని సమయంలో గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజీకి వెళ్లి మళ్లీ ఏలూరు కాలువకు తిరిగి ప్రయాణించి వచ్చేవరకు అయ్యే ఆలస్యాన్ని నివారించవచ్చని అధికారులు యోచిస్తున్నారు. ఏలూరు కాలువ ఆధునికీకరణ పూర్తి కాని పరిస్థితుల్లో పైనుంచి జరుగుతున్న ప్రవాహ నష్టాలను కూడా నివారించవచ్చనేది జలవనరుల శాఖ ప్రణాళిక. దీనికి అనుగుణంగా అధికారులు రూపొందించిన అంచనాల నివేదిక ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. మొత్తం రూ.15.45 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపుదిద్దుకుంది.

ప్రస్తుత పరిస్థితి
* 1957లో ప్రకాశం బ్యారేజీ నిర్మించిన సమయంలో కృష్ణా డెల్టా ఆయకట్టును 13.08 లక్షల ఎకరాలకు పెంచారు. ఏలూరు కాలువ కింద నీరందించే ఆయకట్టును 1,15,000 ఎకరాలకు పెంచారు. మొత్తం 1643 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లాలన్నది ఆలోచన. ఆ స్థాయిలో నీటిని తీసుకువెళ్లేలా సీఎంసీడీ పనులు చేపట్టలేదు. ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయి నీరున్న సమయంలోనూ చివరి ఆయకట్టుకు నీరందడం ఇబ్బందిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఏలూరు కాలువలో 1300 క్యూసెక్కులకు మించి నీటిని వదిలితే ఎనికేపాడు అక్విడక్టు వద్ద పొంగి పొర్లి వృథా అవుతోంది.
* 2008లో చేపట్టిన కృష్ణా డెల్టా ఆధునికీకరణలో భాగంగా మట్టి పనులు మాత్రమే చేపట్టారు. దీంతో ఆయకట్టుదారులు ఇబ్బంది పడుతున్నందున తాజా ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది.
* పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాలోని 13.08 లక్షల ఎకరాల ఆయకట్టుకు 80 టీఎంసీల నీటిని ఇస్తున్నారు. ప్రస్తుతం ఏలూరు కాలువ కింద ఉన్న 1,15,000 ఎకరాలు ఇందులోకి వస్తుంది. అంపాపురం దిగువన ఏలూరు కాలువలో 80 వేల ఎకరాల ఆయకట్టుంది. ఈ ఆయకట్టుకు 100 డ్యూటీ కింద 800 క్యూసెక్కుల నీరు మళ్లించగలిగితే ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందన్నది తాజా ప్రణాళిక. ఇందులో భాగంగా పోలవరం కుడి కాలువను, ఏలూరు కాలువను దిగువ పేర్కొన్న తరహాలో అనుసంధానిస్తారు.
1. పోలవరం కుడి ప్రధాన కాలువ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బండారిగూడెం గ్రామం మీదుగా ప్రవహిస్తోంది. అక్కడ 137.315 కిలోమీటరు వద్ద స్థానిక వాగును ఈ కాలువ దాటేలా అండర్‌టన్నెల్‌ ఇప్పటికే నిర్మించారు. ఈ వాగు పోలవరం కాలువపై ఉన్న అండర్‌టన్నెల్‌ ద్వారా కాలువను దాటి అంపాపురంలోని మల్లిగని చెరువులోకి నీటిని చేరుస్తుంది. ఈ అండర్‌టన్నెల్‌ నుంచి చెరువు వరకు 3.4 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
2. తాజా ప్రణాళికలో భాగంగా పోలవరం కుడి కాలువ ఎడమ వైపున 137.290 కి.మీ. వద్ద ఒక ఎస్కేప్‌ నిర్మించి పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి నీటిని ఈ వాగులోనే పోసి అంపాపురం వద్దకు మళ్లిస్తారు. ప్రస్తుతం వాగు నాలుగు మీటర్ల వెడల్పున ఉంటుంది. స్థానిక ప్రవాహాలతో పాటు కలిపి 800 క్యూసెక్కులను తీసుకెళ్లేలా ఈ కాలువను వెడల్పు చేస్తారు. తిరిగి ఆ చెరువు నుంచి రెండు కి.మీ. పొడవునా కాలువ తవ్వి ఏలూరు కాలువలో 37.208 కి.మీ.వద్ద ఉన్న వీరవల్లి అండర్‌టన్నెల్‌ వద్ద కలుపుతారు. భారీ వర్షాల సమయంలో అదనపు జలాలుంటే బుడమేరు డ్రెయిన్‌కు మళ్లిస్తారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...
కొల్లేరు సరస్సుపై సీఎం చంద్రబాబు సమీక్ష
14-06-2018 16:43:10
 
636645914032527310.jpg
అమరావతి: కొల్లేరు సరస్సుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పితాని, ఎంపీలు మాగంటిబాబు, గోకరాజు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, చింతమనేని, గన్ని వీరాంజనేయులు హాజరైయ్యారు. కొల్లేరు పరిధి తగ్గింపు, సరస్సు పరిరక్షణ, డ్రైనేజీల ఆధునీకరణ పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.
Link to comment
Share on other sites

కొల్లేరులో పంట కల
15-06-2018 01:58:01
 
636646246935970222.jpg
  • వన్యప్రాణి సంరక్షణ పరిధి నుంచి 20వేల ఎకరాలకు మినహాయింపు
  • 15రోజులకొకసారి సమీక్షిస్తానన్న సీఎం
ఏలూరు, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): కొల్లేరువాసులు ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దాదాపు 20 వేల ఎకరాలను కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ పరిధి నుండి మినహాయిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. కొల్లేరు అంశంపై గురువారం సంబంధిత అధికారులతో అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. కొల్లేరులో మూడో కాంటూరు నుండి ఐదో కాంటూరు వరకు గల జిరాయితీ, డీ పట్టా భూములను రైతులకే చెందేలా చూడాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. ఈ సమస్యపై స్వయంగా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల డీ పట్టా కింద 5,600 ఎకరాలు, జిరాయితీ భూముల పరిధిలో మరో 15 వేల ఎకరాలు కింద సన్న, చిన్న కారు రైతులు లబ్ధి పొందనున్నారు.
 
 
‘‘రైతులు కోరుకున్నట్టుగానే అంతా జరిగి తీరాలి. గత ఎన్నికల ముందే తమ ఆశలు, ఆకాంక్షలను రైతులు నా దృష్టికి తీసుకువచ్చారు. అప్పట్లోనే వారికి మాట ఇచ్చాను’’ అని సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలుచేసి తీరతామన్నారు. స్థానికులను సంతోషపరుస్తూనే, కొల్లేరు పరిరక్షణకూ గట్టి చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ‘‘కొల్లేరు అతి పెద్ద మంచినీటి సరస్సు. అది ఎప్పుడూ నిండుగా నీటితో సమృద్ధిగా ఉండాలనేది నా కోరిక. దానికోసం కొన్ని చర్యలు అవసరం. ఇకముందు పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కొల్లేరుకు మళ్లించే ప్రక్రియను చేపట్టాలి’’ అని ఆదేశించారు.
 
 
రెగ్యులేటర్‌కూ ఓకే..
దశాబ్దాలకాలంగా పెండింగ్‌లో ఉన్న రెగ్యులేటర్‌ అంశంపైనా నిర్ణయం తీసుకొన్నారు. కొల్లేరు పరిధిలోని కొట్టాడ వద్ద ఈ రెగ్యులేటర్‌ని నిర్మించే ప్రతిపాదనను సీఎం ఆమోదించారు. ‘‘మనకు రెండు రెగ్యులేటర్లు అవసరం. కొట్టాడ వద్ద రెగ్యులేటర్‌ నిర్మాణాన్ని వెంటనే మొదలుపెట్టండి. చినగొల్లపాలెం దగ్గరలో తలపెట్టిన రెగ్యులేటర్‌ విషయమై త్వరగా అధ్యయనం పూర్తి చేయండి. ఇక నుంచి ప్రతి 15 రోజులకొకసారి కొల్లేరు సమస్యపై సమీక్షిస్తాను’’ అని వెల్లడించారు. కొల్లేరును సుందుర పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పర్చనున్నట్టు సీఎం ప్రకటించారు.
Link to comment
Share on other sites

కొల్లేరులో ‘మినహాయింపు’
20,600 ఎకరాలను డీనోటిఫై చేయించేందుకు చర్యలు
ముఖ్యమంత్రి ఆదేశం
ఈనాడు - అమరావతి
14ap-main5a.jpg

కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య ప్రాంతం నుంచి 20,600 ఎకరాల జిరాయితీ, డీ పట్టా భూములను మినహాయించేందుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డుకు చెందిన స్థాయీ సంఘం ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తదనుగుణంగా కొత్త సరిహద్దులను గుర్తించనుంది. అభయారణ్య ప్రాంతం నుంచి మినహాయించాల్సిన భూములను డీనోటిఫై చేయించే ప్రక్రియను ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన
గురువారం కొల్లేరుపై జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సరస్సులో మూడో కాంటూరు నుంచి అయిదో కాంటూరు వరకూ ఉన్న 20,600 ఎకరాల డీ పట్టా, జిరాయితీ భూములను మినహాయించగా మిగిలిన 58 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సరస్సును కాపాడేందుకు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కొల్లేరు సరస్సు మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జిరాయితీ, డీ పట్టా భూములు కలిగిన యజమానులకు ఒకే ప్రాంతంలో భూములు ఉండేలా చూడాలన్నారు.

సీఎం ఇంకా ఏమన్నారంటే!
* కొల్లేరు ఎప్పడూ నీటితో సమృద్ధిగా ఉండాలి. పట్టిసీమ నుంచి గోదావరి జలాలను తరలించాలి. కొల్లేరుకు నీటిని తరలించే కాలువలు, అంతర్గత మురుగు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచి ఆధునికీకరించాలి. కొట్టాడ దగ్గర తక్షణం రెగ్యులేటర్‌ నిర్మించాలి. చిన్న గొల్లపాలెం వద్ద తలపెట్టిన రెగ్యులేటర్‌పై అధ్యయనాన్ని త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించాలి.
* ఇకపై ప్రతి 15 రోజులకోసారి కొల్లేరుపై సమీక్షస్తా. కొల్లేరు అభివృద్ధికి ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుతో పాటు పనుల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా ఆర్డీవోను నియమించాలి.
* పర్యాటకాభివృద్ధికి రహదారి మార్గాలను పటిష్టపరిచి.. శాశ్వత ప్రాతిపదికన బృహత్‌ ప్రణాళిక రూపొందించాలి. అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి.
* సమీక్ష అనంతరం కొల్లేరు రైతులు ముఖ్యమంత్రిని కలిసి ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రుణం తీర్చుకుంటామన్నారు.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...