Jump to content

East Godavari Politics


Recommended Posts

  • Replies 346
  • Created
  • Last Reply

2009 XXXXX vachinappude East 4 west 5 vachyi (after 1 term rule by INC). PK effect vunna, paina brother cheppinattu 15 varaku vesukovachu anukuntunna. 14 difference vunnai. Vaatini vere chota cover chesukovachu. We have to go with full force in campaign in districts where we got mass majority and there is scope for improvement in kurnool, nellore, prakasam and chittur.

I don't know much about first 3 districts (kurnool, nellore, prakasam) but chittor district people mindset looks to be typical. I have friends and collegues from these districts and they have some other complaint in whatever CBN do!!!

Link to comment
Share on other sites

వైసీపీకి గుడ్‌బై చెప్పిన నేత కోసం టీడీపీ, జనసేన పోటీ
20-12-2018 09:59:04
 
636808969310472936.jpg
  • టిక్కెట్టు ఇస్తాం.. రండి!
  • చలమలశెట్టి సునీల్‌కి టీడీపీ, జనసేన ఆఫర్‌
  • తటస్థ వైఖరితో ఎటూ తేల్చుకోని సునీల్‌
  • సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం
కాకినాడ: ‘మా పార్టీలోకి రండి.. ఎంపీ టిక్కెట్టిస్తాం..’ ఇదీ చలమలశెట్టి సునీల్‌కి టీడీపీ, జనసేనల నుంచి వస్తున్న ఆఫర్‌. అయితే సునీల్‌ మాత్రం ఏ పార్టీలో చేరాలనే దానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. 2019 ఎన్నికల నాటికి ఇంకా రాజకీయ సమీకరణలు మారతాయేమోనని కొంత ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేపథ్యం ఉన్న సునీల్‌ కాకినాడ లోక్‌సభ నుంచి వరుసగా రెండు దఫాలు ఓటమిపాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీచేశారు. 2014లో టీడీపీ హవాలోనూ సుమారు 3 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే తర్వాత పరిస్థితులను అంచనా వేసుకుని ఆ పార్టీకి కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. నాలుగు నెలల కిందట వైసీపీకి గుడ్‌బై చెప్పిన చలమలశెట్టి సునీల్‌ టీడీపీలో చేరాలని భావించారు.
 
అప్పట్లో సీఎం చంద్రబాబును కూడా కలిశారు. తర్వాత ఏం జరిగిందో ఏమో... బిజినెస్‌ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు కొంత సమయం కావాలని అడిగారు. రెండు నెలల కిందట జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ని కలిశారు. అంటే నాలుగు నెలల వ్యవధిలోనే టీడీపీ, జనసేన అధినేతలను కలవడంతో కాకినాడ పార్లమెంటు రాజకీయాల్లో చర్చకు ఛాన్స్‌ ఇచ్చారు. చలమలశెట్టి సునీల్‌కి పార్టీలకతీతంగా మంచి వ్యక్తిగా పేరుంది. కాకినాడ లోక్‌సభ పరిధిలో సునీల్‌కి బంధుత్వాలు ఉన్నాయి. కాకినాడలో వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతోనూ సత్సంబంధాలు ఉన్నాయి.
 
ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో సునీల్‌ బలమైన అభ్యర్ధి అవుతాడన్న అంచనాలు ప్రధాన పార్టీల్లో ఉన్నాయి. దీనిని గమనించిన టీడీపీ సునీల్‌కి ఎంపీ టికెట్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఇదే సమయంలో సామాజికవర్గ నేతల ఒత్తిడితో జనసేన వైపూ ఓసారి ఆలోచించారు. జనసేన నుంచి కాకినాడ ఎంపీగా పోటీచేస్తే జగ్గంపేట టికెట్‌ ముత్యాల శ్రీనివాస్‌ అనే తన బంధువుకి ఇవ్వాలని షరతు కూడా పెట్టారని ప్రచారం జరిగింది. ఏ పార్టీలో చేరేదీ సంక్రాంతి తర్వాతే నిర్ణయం తీసుకుంటారని సునీల్‌ ముఖ్య అనుచరులు చెప్తున్నారు.
Link to comment
Share on other sites

983 నుంచీ టీడీపీలో ఉన్న ఈ ఎమ్మెల్యేలకు నో టికెట్
21-12-2018 10:21:24
 
636809847149896362.jpg
  • మావాడికి వస్తుందా.. టిక్కెట్టు!
  • టీడీపీ ముందస్తు ఎంపికపై కేడర్‌లో జోరుగా చర్చ
  • జిల్లాలో ఐదుగురు సిట్టింగ్‌లకు ఖాయమైన సీట్లు
  • రెండు అసెంబ్లీ సీట్లలో కొత్త వారికి అవకాశం
  • ఏడెనిమిది స్థానాల్లో అభ్యర్థుల మార్పుపై కసరత్తు
  • సంక్రాంతి వెళ్లిన వెంటనే తొలి జాబితా
 
కాకినాడ: రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలుకాబోతోంది. మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. సంక్రాంతి వెళ్లిన వెంటనే తొలి జాబితా అభ్యర్థులను ప్రకటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనతో కేడర్‌లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా కావడంతో ప్రధాన పార్టీలు ఈ జిల్లాపై ఎక్కువగా దృష్టిసారించడం పరిపాటి. వైసీపీ ఇప్పటికే 15 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. టీడీపీ సంక్రాంతి తర్వాత విడుదల చేసే తొలి జాబితాపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. 19 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ ఐదుగురు సిట్టింగ్‌లకు మళ్లీ టిక్కెట్లు ఖాయమని ఇంతకు ముందే స్పష్టత ఇచ్చారు. జగ్గంపేట, మండపేట, రామచంద్రపురం, ముమ్మిడివరంలలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చినట్టు తెలుస్తోంది.
 
మరో మూడు చోట్ల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయినా.. ఇంకా పూర్తి నిర్ణయానికి రాలేదు. అవినీతి ఆరోపణలతోపాటు.. కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్న ఎమ్మెల్యేలను తప్పించాలని పార్టీలోనే అసంతృప్తి రగులుతోంది. వీటన్నింటినీ సమన్వయం చేసుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌లలో ఒక చోట కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. సిటింగ్‌ ఎంపీ మాగంటి మురళీమోహన్‌కి భవిష్యత్తులో రాజ్యసభ లేదా పార్టీలో ముఖ్య సలహాదారుని పదవి ఇచ్చి.. ఆయన కోడలు మాగంటి రూపాదేవికి అసెంబ్లీ టికెట్‌ ఇచ్చే ప్రతిపాదన మళ్లీ వచ్చినట్టు తెలుస్తోంది. రూపాదేవి టీడీపీ స్టేట్‌ సోషల్‌ మీడియాలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ లేదా సిటీలలో ఏదొక చోట నుంచి అవకాశం ఇవ్వాలని ఆమె సీఎంకి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి... అక్కడ కొత్తవారికి అవకాశం కల్పించాలనే ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది.
 
అక్కడ అన్వేషణ
కోనసీమలో మూడు స్థానాల్లో ధీటైన అభ్యర్థుల కోసం టీడీపీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఒక దఫా సర్వే నిర్వహించిన పార్టీ ఈ నెలాఖరునాటికి ఓ నిర్ణయానికి రావచ్చని అంటున్నారు. కోనసీమలో ఒక ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలపై ఒక వ్యక్తి కోర్టుకెక్కడంతో ప్రత్యామ్నాయంపై దృష్టిసారించాల్సిన పరిస్థితి తలెత్తింది. కోనసీమలో ఓ సీనియర్‌ ఎమ్మెల్యే తనకు టీడీపీ టిక్కెట్టు రాదని భావించి.. జనసేనతో టచ్‌లో ఉన్నారు. గన్నవరంలో బలమైన అభ్యర్థి కోసం పార్టీ సీరియ్‌సగా దృష్టిసారించింది. అలాగే కాకినాడ పార్లమెంటు పరిధిలో మూడు చోట్ల, రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో రెండు స్థానాల కోసం అన్వేషణ సాగుతోంది.
 
వృద్ధ నేతలకు ఎమ్మెల్సీ, పార్టీ పదవులు..
టిక్కెట్టు దక్కని ఎమ్మెల్యేల్లో సీనియర్లైన కొందరికి ఎమ్మెల్సీ, పార్టీలో క్రియాశీలక పదవులు ఇవ్వాలని భావిస్తున్నారు. 1983 నుంచీ రాజకీయాలలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను ఈ దఫా తప్పించనున్నారు. వీరిలో ఒకరికి ఎమ్మెల్సీ, ఒకరికి ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి, మరొకరికి పార్టీలో క్రియాశీల పదవి ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. నేనే పోటీచేస్తానంటూ ఎవరికి వారు ప్రకటించుకున్న ఎవరికీ టిక్కెట్లు ఖరారు కాలేదు. సంక్రాంతి వెళ్లిన వెంటనే తొలి జాబితా విడుదల చేస్తారు.
 

Advertisement

Link to comment
Share on other sites

టీడీపీలో మరో సర్వే.. ఎమ్మెల్యేల్లో టెన్షన్‌.. టెన్షన్‌
28-12-2018 12:57:45
 
636815986966192359.jpg
  • అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాన పార్టీల కసరత్తు
  • రెండు దఫాలుగా సర్వే చేసిన వైసీపీ
  • టీడీపీ కోసం రెండో విడత సర్వే చేపట్టిన బృందం
 
వచ్చే ఎన్నికల్లో జనం ఎవరిని గెలిపిస్తారు.. వారి అభిప్రాయం ఎలా ఉంది.. ఎవరికి ఎందుకు మద్దతు పలుకుతున్నారు? అన్ని పార్టీల్లోనూ ఇదే ప్రశ్న తొలిచేస్తోంది. జనం నాడిని తెలుసుకుంటే ఇప్పటి నుంచే జాగ్రత్తపడవచ్చన్న ఆలోచనతో అందరూ సర్వేలకు దిగారు. కొందరు నేరుగా చేస్తుంటే, మరికొందరు ఆన్‌లైన్‌ ద్వారా, ఇంకొందరు సెల్‌ ఫోన్లతో ఆరా లాగుతున్నారు. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. తమ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగేందుకు పోటీపడుతున్న వారిలో సమర్థులు ఎవరు? అనేదానిపైనా టీడీపీ, వైసీపీ సర్వేలపైనే ఆధారపడుతున్నాయి.
 
 
కాకినాడ: జగన్‌ ఈ జిల్లాలో పాదయాత్ర చేపట్టడానికి ముందు.. వైసీపీ ఓ దఫా సర్వే నిర్వహించింది. 2019 ఎన్నికల్లో అన్నిచోట్లా పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించిన తర్వాత మరో దఫా ఇక్కడ సర్వే చేశారు. టీడీపీ తరపున నాలుగు నెలల కిందట ఒక సర్వే నిర్వహించగా.. ప్రస్తుతం రెండవ విడత సర్వే జోరుగా సాగుతోంది. నెల కిందట మెట్ట ప్రాంతంలో సర్వే నిర్వహించిన బృందాలు.. వారం కిందట కోనసీమలో నాలుగు నియోజకవర్గాల పరిధిలో సర్వే పూర్తి చేసినట్టు సమాచారం. జిల్లాలో వైసీపీ తరపున తొలి విడత సర్వే నిర్వహించిన ఒక బృందం ఇచ్చిన నివేదిక తర్వాత ఆ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లను మార్చడం ప్రారంభించారు. కాకినాడ సిటీ కోఆర్డినేటర్‌గా ఉన్న ముత్తా శశిధర్‌, ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న బాలకృష్ణ, జగ్గంపేట కోఆర్డినేటర్‌గా ఉన్న ముత్యాల శ్రీనివాస్‌ తదితరులను వైసీపీ అధినేత జగన్‌ తొలగించారు.
 
రెండో విడత సర్వే తర్వాత పెద్దాపురం, మండపేట పార్టీల కోఆర్డినేటర్లను మార్పు చేశారు. జిల్లాలో వైసీపీ తరపున నిర్వహించిన తొలి సర్వే తర్వాత జగన్‌ ఈ జిల్లాలోనే పాదయాత్ర సమయంలో జనసేన అధినేతపవన్‌కల్యాణ్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. నాలుగు రోజుల వ్యవధిలో కాపు రిజర్వేషన్ల హామీ ఇవ్వలేనని ఘంటాపథంగా చెప్పారు. కాపు సామాజికవర్గంలో మెజారిటీ పవన్‌ వైపే ఉంటారని, కాపులకు వ్యతిరేకంగా మాట్లాడితే బీసీలను ఆకట్టుకోవచ్చన్న ఎత్తుగడతోనే జగన్‌ ఇలా చేశారని అప్పట్లో చర్చ నడిచింది. పవన్‌కల్యాణ్‌పైనా, కాపులపైనా జగన్‌ కామెంట్స్‌, సర్వే నివేదికల ఆధారంగానే చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
 
టీడీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌..టెన్షన్‌..
ప్రస్తుతం జిల్లాలో టీడీపీ తరపున సర్వే జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల్లో టెన్షన్‌ నెలకొంది. సామాన్య జనంతోపాటు టీడీపీ కేడర్‌ నుంచీ ఆ పార్టీ సర్వే టీమ్‌ అభిప్రాయ సేకరణ చేస్తోంది. సర్వే జరుగుతున్న విషయాన్ని పసిగట్టిన కొందరు నాయకులు సర్వే ప్రతినిధులను కలసి.. తమ గురించి జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రయత్నించినా.. టీమ్‌ సభ్యులు మాత్రం గోప్యత పాటిస్తున్నట్టు తెలుస్తోంది. టిక్కెట్ల కోసం పోటీపడుతున్న ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువ శాంపిల్స్‌ కోసం సర్వే బృందం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.
 
టీడీపీ సర్వేలో అనేక కీలక అంశాలపై అభిప్రాయాలు అడుగుతున్నారు. బీజేపీతో దూరమైన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఇపుడు కాంగ్రె్‌సతో జతకట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి? జనసేన ప్రభావం ఈ జిల్లాలో ఏ మేరకు ఉంటుంది? వైసీపీ రెబల్స్‌ ఉన్న చోట.. టీడీపీకి ఏమేరకు లాభిస్తుంది? టీడీపీపై అసమ్మ తి, అసంతృప్తి ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీకి జరగబోయే నష్టం ఏ మేరకు ఉంటుంది? వంటి అంశాలపై సర్వే బృందం ప్రతినిధులు ఆరేడు కేటగిరిలలో అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు.
 
సర్వేల పేరుతో బురిడీ..
ప్రధాన పార్టీలు ప్రజలలో సానుకూలత ఉన్న అభ్యర్థుల కోసం సర్వేలు నిర్వహిస్తుండగా.. ఇదే అదునుగా ప్రైవేటు ఏజెన్సీల పేరుతో కొందరు ప్రధాన పార్టీల నాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సర్వే రిపోర్ట్‌ పాజిటివ్‌గా ఇస్తామని బేరాలు చేసుకుంటున్నట్టు ఆరోపణ లు వస్తున్నాయి. యూట్యూబ్‌ ఛానల్స్‌,ఇతర సోషల్‌ మీడియాల తరపున కూడా కొన్ని ఏజెన్సీలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ సర్వే నివేదికల ఆధారంగా ప్రధాన పార్టీలు రేండమ్‌ చెక్‌ చేసుకుని.. అభ్యర్థుల వడపోత కార్యక్రమం చేపడతాయి.
 
ఇద్దరు, ముగ్గురు బలమైన అభ్యర్థులు టిక్కెట్టు రేసులో ఉన్న నియోజకవర్గాల్లో సర్వే శాంపిల్స్‌ కూడా ఎక్కువ సేకరిస్తున్నట్టు తెలుస్తోం ది. టీడీపీ, వైసీపీల తరపున జిల్లాలో జోరుగా సర్వేలు సాగుతుండగా.. జనసేన తరపున మా త్రం ఇంకా కన్పించడంలేదు. పవన్‌కల్యాణ్‌ మూడో విడత జిల్లా పర్యటన తర్వాత సర్వే చేపడుతుందని చెప్తున్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
టీడీపీ నుంచి అర్బన్ టికెట్ రేసులో నేనూ ఉన్నా: శంకరరావు
26-01-2019 12:51:24
 
636841039904295319.jpg
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గంనుంచి టీడీపీ టిక్కెట్‌లు ఆశించేవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆర్యాపురం కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు తాను సైతం టిక్కెట్‌ రేసులో ఉన్నానని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తనకు టిక్కెట్‌ ఇవ్వాల్సిందిగా కోరడంతోపాటు బయోడేటా ఇచ్చినట్టు ఆయన చెప్పారు. చల్లా శంకరరావు తండ్రి చల్లా అప్పారావు మునిసిపల్‌ చైర్మన్‌గా చేశారు. ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ నాయకుడిగా కూడా ఆయనకు పేరు ఉంది.
 
2009లో మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరుపున సిటీ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేశారు. 1230 ఓట్ల తేడాతో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు చేతిలో ఓడిపోయారు. అప్పట్లో శంకరరావుకు 43వేల ఓట్లు లభించాయి. ప్రస్తుతం ఆయన ఆర్యాపురం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా వ్యవహరించడంతో పాటు రాజమహేంద్రవరం వెలమ కమ్యూనిటీ గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తనకు అవకాశమివ్వాలని కోరానని చెప్పారు.
Link to comment
Share on other sites

ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే రాజీనామా: డాక్టర్‌ అప్పారావు
26-01-2019 12:55:20
 
636841041907423491.jpg
రాజవొమ్మంగి, తూర్పుగోదావరి: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకే తన ఉద్యోగానికి రాజీనామా చేశానని మాజీ ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కోసూరి అప్పారావు వెల్లడించారు. రాజవొమ్మంగి విచ్చేసిన ఆయన విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ ఇప్పటికే అధిష్ఠానం నుంచి వచ్చిన కొన్ని సంకేతాలతో గత ఏడాది జూన్‌ 22న తన రాజీనామా పత్రాన్ని విజయవాడ హైల్త్‌ డైరైక్టర్‌కు అందజేసినట్లు చెప్పారు. ఫిబ్రవరి 28కి తన రాజీనామాకు అమో దం వస్తుందని అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా నన్నా రు. మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగలలో 14 ఏళ్ల నుంచి వైద్యుడిగా పనిచేసి టీడీపీ నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే గెలుపే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
9 minutes ago, Nandamuri Rulz said:

XXXXX gaadu okka pani cheyyaledu rjy ki... Mm family candidate ayithe vote veyyam mp ki... Nota ke ani clear ga mokam meeda cheppesthunnaru

Mm selfish emi cheyadu cadre ki.chinna pensions pani meedha evaranna osthe time kooda ivvadu and andhubaatulo undadu better to change candidate

Link to comment
Share on other sites

Na varku

RJY MM- none from MM family

Pithapuram - Varma should be changed/ Thota Narasimham wife or Chinnarajappa(if PEddapuram given to Boddu)

Rajanagaram - Pendurthy Venkatesh should be changed.

Tuni - None from Yanamala Family

ivi must and should ga change cheyyali

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...