Jump to content

East Godavari Politics


Recommended Posts

విలక్షణ స్థానంలో టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ ప్లాన్
04-08-2018 12:19:44
 
636689819862137355.jpg
  • సామాజికవర్గాల పోరే కీలకం
  • ‘దేశం’లో మూడు కేంద్రాలు
  • పట్టుకోసం ‘వైసీపీ’ ఆరాటం
  • జనసేనలో కేడర్‌ ఫుల్‌.. నాయకత్వం నిల్‌
  • కేడర్‌లేని కాంగ్రెస్‌.. బలంలేని బీజేపీ
అమలాపురం: రాజకీయ పార్టీలకు భి న్నంగా సామాజికవర్గాల సమీకరణలతో జరిగే ఎన్నికల పోరులో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు ఇచ్చే తీర్పు ఎప్పుడూ విలక్షణమైనదే. ఆరు దశాబ్ధాలకాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు సామాజికవర్గాలకు చెందిన వ్యక్తుల ఏలుబడిలోనే నియోజకవర్గ పాలన సాగింది. రాజకీయపార్టీల ప్రభంజనంలోను ఐదుసార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా నాలుగుసార్లు కుడుపూడి ప్రభాకరరా వు, మూడుసార్లు మెట్ల సత్యనారాయణరావు ప్రాతినిధ్యం వ హించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఎస్‌సీలకు రిజర్వ్‌ అ యిన స్థానం తిరిగి 2009లో ఎస్‌సీలకు రిజర్వ్‌ అయ్యింది.
 
అమలాపురం మున్సిపాలిటీ, అల్లవరం, అమలాపురం రూర ల్‌, ఉప్పలగుప్తం మండలాలతో కలిసి ఈ నియోజకవర్గం ఆ విర్భవించింది. అయినా ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన సామాజిక వర్గీయుల ఓట్ల తీర్పు ఆధారంగానే అభ్యర్థి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అమలాపురం రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార టీడీపీ, వైసీపీలతోపాటు వివిధపక్షాల తరపున పోటీచేసేందుకు ఆశావహులైన అభ్యర్థులు తమదైన శైలిలో ఉవ్విళ్లూరుతున్నారు.
 
టీడీపీలో ముగ్గురు ఆశావహులు
అధికార టీడీపీలో మూడు రాజకీయ కేంద్రాలు పనిచేస్తున్నా యి. ఒక కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వర్గీయులు సారథ్యం వహిస్తుంటే, మరో కేంద్రం దివంగత నేత మెట్ల సత్యనారాయణరావు వర్గం ఏలుబడిలో ఉంది. ఈ రెండు వర్గాలను సమన్వయం చేసుకుంటూ మూడో వర్గంగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చెలామణీ అవుతున్నారు. టీడీపీలో ఒకట్రెండు ప్రధాన సామాజిక వర్గాలు మినహా మిగిలిన సామాజికవర్గ నేతలు కొంచెం దూరంగానే ఉండడం పార్టీ ప్రముఖులకు ఇబ్బందికరంగా మారడంతోపాటు కేడర్‌పట్ల సానుకూలత కూడా కరువైందనే అభియోగాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేరుతోపాటు మరో ఇద్దరు ఆశావహుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అమలాపురం పురపాలక సంఘం అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తి ఉంది. ఎవరి సొంత నిర్ణయాలతో వారే పాలనలు సాగిస్తుండడంతో నియోజకవర్గ కేడర్‌లో సమన్వయలోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
 
పట్టు సాధించే పనిలో వైసీపీ
ఇక వైసీపీ నాయక త్వం ప్రజల్లో పట్టుసాధించే దిశగా ప్రయత్నాలను తీవ్రతరం చేసిం ది. గతంలో ఎంపీ అ భ్యర్థిగా పోటీచేసి ఓటమిచెందిన పినిపే విశ్వరూప్‌ ఈసారి అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీకి గట్టిపోటీనిచ్చే అభ్యర్థిగా విశ్వరూప్‌ ఈసారి పోటీకి దిగుతారన్న ప్రచారంతో ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆశలు పెట్టుకున్న ఆశావహులు ప్రత్యామ్నాయ రాజకీయమార్గాలను అన్వేషిస్తున్నారు. గతంలో ఇక్కడినుంచి అసెంబ్లీ స్థానానికి పోటీచేసిన గొల్ల బాబూరావు ప్రస్తుతం ఈ ప్రాంత రాజకీయాలకు దూరంగా గడుపుతున్నారు. విశ్వరూప్‌ అయితే వివిధ సామాజికవర్గాల్లో పట్టు సాధించే దిశలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
 
జనసేనకు దిశానిర్దేశం లేక..
జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నియోజకవర్గంలో పటిష్టమైన కేడర్‌ ఉన్నప్పటికీ ఆశావహుల అడ్ర స్‌లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం దిశానిర్ధేశం లేని రీతిలో పార్టీపరమైన కార్యక్రమాలు అమలాపురం కేంద్రంగా జోరుగా సాగుతున్నాయి. ద్వితీయశ్రేణి కేడర్‌తోపాటు ఒకే సామాజికవర్గానికి చెందిన యువకులు ఈ పార్టీవైపు ఆకర్షితులవుతున్నట్టు కనిపిస్తోంది. నాయకత్వ లేమితో నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్న కేడర్‌లోనే వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి.
 
కేడర్‌లేని కాంగ్రెస్‌.. బలం లేని బీజేపీ
జాతీయ పార్టీలైనప్పటికీ కాంగ్రె్‌సపార్టీకి కేడర్‌ కరువైంది. బీజేపీకి ఆశించిన మేర బలంలేదు. ప్రస్తుతం కాంగ్రె్‌సపార్టీలో ఇద్దరు ముగ్గురు ఎస్సీ అభ్యర్థులు రంగంలో దిగేందుకు సి ద్ధంగా ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి పదవి హోదాలో ఉన్న గి డుగు రుద్రరాజుతోపాటు ఆ పార్టీ తరపున కొందరు కీలక నా యకులు ఉన్నప్పటికీ కేడర్‌లేమితో ఆ పార్టీ సతమతమవుతోంది. ఇక బీజేపీ విషయానికొస్తే అంతా నాయకులే తప్ప కే డర్‌ నామమాత్రం కూడా లేదు. ఇదీ జాతీయపార్టీల పరిస్థితి.
 
 
నియోజకవర్గంలో ప్రత్యేకతలు
అమలాపురం ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం ఎన్నో ప్రత్యేకతలకు పెట్టింది పేరు. దేశంలోనే కీలకమైన చమురు నిక్షేపా లు ఓడలరేవు, ఎస్‌.యానాంల్లో ఉన్నాయి. కోనసీమ కేంద్రమై న అమలాపురం పట్టణంతోపాటు పర్యాటకపరంగా బీచ్‌లు, గోదావరి తీరాలు సొంతం. ఓడలరేవు, ఎస్‌.యానాం బీచ్‌లను ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తోంది.
Link to comment
Share on other sites

  • Replies 346
  • Created
  • Last Reply
వైసీపీకి షాక్‌.. పార్టీకి కీలక నేత గుడ్‌ బై
04-08-2018 12:12:00
 
636689815223486931.jpg
ప్రత్తిపాడు, తూ.గో.: ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్‌ ప్రజా సంకల్పయాత్ర చేపట్టనున్న తరుణంలో ఆపార్టీకి గట్టి షాకే త గిలింది. ఏలేశ్వరం మండలం వైసీపీ కన్వీనర్‌ కాశెపు నూకాపతిరావు పా ర్టీకి గుడ్‌బై చెప్పి 200మంది అనుచరులతో శుక్రవారం టీడీపీలోకి చేరారు. జగన్‌ ఈనెల 5న ప్రజాసంకల్పయాత్రను ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి నుంచి ప్రారంభిస్తున్న తరుణంలో వీరి రాజీనామా నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గాని కి చెందిన పర్వత, వరుపుల కుటుంబాలకు బంధువైన నూకాపతిరావు వై సీపీని వదిలివెళ్లడం పార్టీ శ్రేణులకు, నాయకులకు మింగుడు పడడంలేదు.
 
సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాశెపు నూకాపతిరావు తండ్రి కాశేపు సూ ర్యారావు భద్రవరం గ్రామానికి 35ఏళ్లపాటు ఏకగ్రీవ సర్పంచ్‌గా పనిచేశా రు. ఆయన పేరవరం, సిరిపురం, భద్రవరం గ్రామాలకు కలిపి సొసైటీకి మరో 25ఏళ్లపాటు ఏకగ్రీవ అధ్యక్షుడిగా పనిచేశారు. 25ఏళ్లుగా కాశెపు నూ కాపతిరావు రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. వైసీపీ మండల కన్వీనర్‌గా నియోజకవర్గ నాయకులు తనకు గుర్తింపు ఇవ్వడంలేదని ఆయన అసంతృప్తికి లోనై పార్టీ వ్యవహారాలను చూసే పీకే బృందానికి ఫిర్యాదు చేశారు. పార్టీకి గుడ్‌బై చెప్పిన తర్వాత పీకే బృందానికి చెందిన వ్యక్తులు కాశెపుతో ఫోన్‌ సంప్రదింపులు జరిపినా ఆయన టీడీపీలోకి చేరిపోయారు.
 
నాయకుల్లో అంతర్గత విభేదాలు
నియోజకవర్గ వైసీపీ నాయకుల్లో అంతర్గతంగా లుకలుకలు విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రత్తిపాడు వైసీపీ జడ్పీటీసీ సభ్యురాలు ముదునూరి లోవలక్ష్మి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన ముదునూరి మురళీ కృష్ణంరాజులకు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్‌ పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్‌తో విభేదాలు నడుస్తున్నాయి. రౌతులపూడి, శంఖవరం మండలాలకు చెందిన నాయకులు కొండమూరి వెంకటేశ్వరరావు తదితరులకు కూడా ఆయనతో విభేదాలు కొనసాగుతున్నాయి. వీరందరినీ కలుపుకుని నియోజకవర్గంలో పర్వత పర్యటనలు చేస్తున్న సందర్భాలు లేవు. అంతర్గతంగా కొన్నిగ్రామాల్లో కూడా నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఏలేశ్వరం మండల కన్వీనర్‌గా పనిచేసిన కాశెపు నూకాపతిరావు సరైన గుర్తింపు ఇవ్వడం లేదంటూ పార్టీ నుంచి వెనుదిరిగారు. ఇంకా కోఆర్డినేటర్‌ పర్వతను విభేదిస్తున్న నియోజకవర్గ నాయకులు ఎవరికి వారుగా పార్టీ అధినేత జగన్‌ నియోజకవర్గంలో పాదయాత్రకు స్వాగత సన్నాహాలపై సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఐదో తేదీ నుంచి నియోజకవర్గంలో జగన్‌ పాదయాత్ర ఎలా కొనసాగుతుందో అనేది ఆసక్తిదాయకంగా మారింది.
Link to comment
Share on other sites

టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు
04-08-2018 12:22:45
 
636689821670562531.jpg
రాజమహేంద్రవరం: రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించరించట్లేదని, అయినా సీఎం చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. శుక్రవారం 46వ డివిజన్‌లో వైసీపీ అధ్యక్షుడు గిడుతూరి గోవింద్‌, బీజేపీ ఇన్‌చార్జి పసుపురెడ్డి గోవింద్‌లతోపాటు వారి అనుచరులు టీడీపీలో చేరారు. ముఖ్యఅతిథిగా ఆదిరెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం మేయర్‌ పంతం రజనీశేషసాయి మాట్లాడారు.
 
డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు, యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు, టీడీపీ 46వ డివిజన్‌ నాయకుడు బొచ్చ శ్రీను, తురకల నిర్మల, పిడిమి ప్రకాష్‌, రవి, కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కోసూరి చండీప్రియ, పాలవలస వీరభద్రం, నాయకులు మళ్ల వెంకట్రాజు, మరుకుర్తి రవియాదవ్‌, తంగేటి సాయి, కడితి జోగారావు, బుడ్డిగ రవి, మేరపురెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం నగరదర్శినిలో భాగంగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీశేషసాయి 46వ డివిజన్‌లో పర్యటించారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి నిరుద్యోగ భృతి ప్రకటించిన సీఎం చంద్రబాబు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
 
టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేద్దాం: ఎమ్మెల్యే వరుపుల
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేసి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేద్దామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా పిలుపునిచ్చారు. ఏలేశ్వరం మండలం వైసీపీ మాజీ కన్వీనర్‌ కాశెపు నూకాపతిరావు, తన అనుచరులతో కలిసి శుక్రవారం టీ డీపీలో చేరారు. లింగంపర్తిలోని ఎమ్మెల్యే వరుపుల స్వగృహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమం లో నూకాపతిరావుతోపాటు కాటుపల్లి శ్యామ్యూల్‌, తలారి కృపానందం, వంగలపూడి వీర్రాజు, దా ళబాబ్జి, పోల్నాటి బుజ్జియ్య పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పేరవ రం గ్రామానికి చెందిన చెరకు శ్రీనుతోపాటు పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, ప్రత్తిపాడు ఏఎంసీ చైర్మన్‌ కొమ్ముల క న్నబాబు, గొంతిన సురేష్‌ కాశెపు వీరబాబు, బందిల అంకాలు, ఉగ్గిరాల రాజు, పర్వత సురేష్‌, కాశెపు సురేష్‌, బస్సా ప్రసాద్‌, సూతి బూరయ్య పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

వారిద్దరూ నాడు కళాశాల మిత్రులు.. నేడు రాజకీయ సహచరులు
05-08-2018 12:14:28
 
636690680675646406.jpg
సామర్లకోట, తూ.గో.: తెలుగుదేశం పార్టీలో మాజీ ఎమ్మేల్యే బొడ్డు భాస్కరరామారావు, కాకినాడ రూరల్‌ ఎమ్మేల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త పిల్లి సత్యనారాయణమూర్తిలు ఇద్దరు కాకినాడలో కళాశాల మిత్రులు. సుమారు నాలుగు దశాబ్దాల పైబడి సాన్నిహిత్యం వారిద్దరి మధ్య కొనసాగుతూ ఉంది. అయితే యాదృచ్ఛికంగా ఇద్దరూ రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. చాలాకాలం ఒకే పార్టీ గొడుగు నీడలో కూడా సాగడం వల్ల వారి స్నేహబంధం మరింత బలపడింది. అయితే ఎప్పుడు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా.. ఒకరికొకరు అండగా ఉండటం వారి స్నేహబంధానికి నిదర్శనరం.
 
రాజకీయాలలో సైతం అదే స్నేహ ఒరవడి కొనసాగించడం విశేషం. తెలుగుదేశం పార్టీని వీడి న స్నేహితుడు భాస్కరరామారావును తిరిగి పార్టీలోకి చేర్చడంలో పిల్లి సత్తిబాబు పాత్ర కీలకం. అంతే కాదు ఎమ్మేల్యే అనంతలక్ష్మి, సామర్లకోట మండలం నుంచి జెడ్పీటీసీగా గెలుపొందడం, ఎమ్మేల్యేగా గెలుపొందడం వెనుక, అసలు స్నేహితుడి భార్యను రాజకీయ ఆరంగ్రేటం చేయించిన విషయంలో, మాజీ ఎమ్మేల్యే భాస్కరరామారావు పాత్ర కీలకం. ఇలా ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం, ఒకరు రాజకీయాల్లో వెనుకబడుతుంటే..మరొకరు ముందుండి నడిపించడం ఇది వారికే చెల్లింది.
Link to comment
Share on other sites

వైసీపీ నేత చేరికతో జనసేనలో కొత్త హుషారు
09-08-2018 11:08:03
 
636694096830154516.jpg
కాకినాడ: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయులు వైసీపీకి వీడ్కోలు చెప్పి జనసేనలో చేరారు. ముత్తా కుటుంబం చేరికతో జనసేన కేడర్‌లో మంచి ఊపొచ్చింది. కాకినాడ సిటీలో ముత్తాకు రాజకీయంగా ఇమేజ్‌ ఉంది. గోపాలకృష్ణ తనయుడు శశిధర్‌కి జనసేన టికెట్‌ కోసం ముత్తా పార్టీలో చేరినట్టు ప్రచారం సాగుతోంది. టీడీపీలో మంత్రిగా, కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా పదవులు చేపట్టిన ముత్తా గోపాలకృష్ణకు కాకినాడ సిటీతోపాటు.. జిల్లాలో వైశ్య సామాజికవర్గంలో బలమైన పట్టుంది. అలాగే ఆయన తనయుడు శశిధర్‌ కూడా క్రియాశీల రాజకీయ నేతగా ఎదిగారు. ఈ కారణంగానే గతంలో జగన్‌ సొంత మనిషి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని కాదని.. కాకినాడ సిటీ వైసీపీ కోఆర్డినేటర్‌గా శశిధర్‌ని నియమించారు. ఇటీవల వరకు కాకినాడ సిటీ వైసీపీ అభ్యర్థి శశిధరే అన్న ప్రచారం జోరుగా సాగింది.
 
కొన్ని నెలల కిందట శశిధర్‌ని తప్పించి తిరిగి జగన్‌ సామాజిక వర్గానికి చెందిన ద్వారంపూడికి వైసీపీ కోఆర్డినేటర్‌ పదవి కట్టబెట్టడంతో ముత్తా కుటుంబం అలిగింది. ఇన్నాళ్లూ అవకాశం కోసం ఎదురుచూసిన ముత్తా కుటుంబం.. పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరిపోయారు. ముత్తా చేరికతో ఆయన వర్గంలో ఉన్న పలువురు నాయకులు, కార్యకర్తలు ముత్తా వెనుకే జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి ముత్తా గుడ్‌బై చెప్పడంతో సిటీలో ఆ పార్టీ కొంత బలహీనపడినట్టేనని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. 2014లో అసెంబ్లీ టికెట్‌ రాకపోవడంతో టీడీపీని వీడి ముత్తా శశిధర్‌ వైసీపీలో చేరారు. ఈ నాలుగేళ్లలో వైసీపీని తనవంతు బలోపేతం చేశారు. కాకినాడ సిటీలో కీలకమైన సామాజికవర్గంలో మెజార్టీని తమవైపు తిప్పుకోగల సామర్థ్యం ముత్తా కుటుంబానికి ఉంది. గతంలో తమతోపాటు వైసీపీలో ఉన్న కేడర్‌ని ఇప్పుడు జనసేనలోకి బదలాయించే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం ముత్తా గోపాలకృష్ణకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి జనసేన కార్యకర్తలు, ముత్తా అనుచరగణం పెద్ద ఎత్తున స్వాగతం పలకడం, అక్కడ నుంచి కాకినాడ వరకు బైక్‌ల ర్యాలీతో హంగామా చేశారు.
 
గౌరవం లేని చోట పనిచేయలేకే బయటకు వచ్చా
గౌరవం లేని చోట పనిచేయలేకే పార్టీల నుంచి బయటకు వచ్చానని మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ను కలిసి బుధవారం కాకినాడకు తిరిగి వచ్చిన ఆయనకు ఘనస్వాగతం లభించిం ది. ఈ సందర్భంగా నాగమల్లితోట జంక్షన్‌ సమీపంలోని హెలీకాన్‌టైమ్స్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తాను వేరే పనిమీద హైదరాబాద్‌ వెళ్లినప్పుడు పవన్‌కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. ఆయన రాష్ట్ర పరిస్థితులపై తనతో సుదీర్ఘంగా చర్చించారన్నారు. తాము ఏర్పాటు చేస్తున్న ఇంగ్లీష్‌ న్యూస్‌ ఛానల్‌ ద్వారా ప్రజాసమస్యలపై పోరాడడమే కాదు సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని పవన్‌ అన్నారన్నారు. అనుకోని పరిణామాల మధ్య ఆయన తనను పార్టీలోకి రావాలని కో రారన్నారు. మీ సేవలు మాకు చాలా అవసరమని, మీ అనుభవం పార్టీకి కావాలని పవన్‌ అడిగే సరి కి కాదనలేకపోయానని స్పష్టం చేశారు.
 
ఈ పరిణామానికి కాసేపు నిర్ఘాంతపోయానన్నారు. అంతలో నే పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యులను పిలిచి 35-40 ఏళ్లు రాజకీయ అనుభవం, అందరి రాజకీ య నాయకులతో పనిచేసిన అనుభవం ఈయనకు ఉన్నాయని వారికి పరిచయం చేశారన్నారు. రాష్ట్ర పొలిటికల్‌ అడ్వజైర్‌ కమిటీలో ప్రధానమైన స్థానం కల్పించాలని కమిటీ సభ్యులకు పవన్‌ సూచించగానే తాను నిర్ఘాంతపోయానని తెలిపారు. నేను న్యాయం చేయగలనా అనే సరికి ఎంతోమంది నాయకులతో పనిచేసిన మీకు ఇది కష్టమైన పనికాదని పవన్‌ పేర్కొన్నారన్నారు. గతంలో టీడీపీలో ఎన్టీఆర్‌తోను, కాంగ్రె్‌సలో వైఎ్‌సతోను పనిచేసిన అనుభవాన్ని జనసేనకు ఉపయోగించాలని కోరారన్నారు. ఆ షాఢం వెళ్లిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటానన్నారు. పార్టీ అధినేత పవన్‌ యాత్రలకు రాష్ట్రవ్యాప్తంగా తిరగాల్సి వస్తుందన్నారు. ముత్తా శశిధర్‌, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

జగన్ వైఖరి నచ్చక వైసీపీకి కీలక నేత రాజీనామా
09-08-2018 11:10:06
 
636694098059939890.jpg
కాకినాడ: వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడలో ఆ పార్టీ కీలకనేత సంగిశెట్టి అశోక్‌ వైసీపీ రాజీనామా చేసి జనసేనలో చేరారు. వైసీపీ మేయర్‌ రేసులో ముందు అశోక్‌ భార్య పేరే తెరపైకి వచ్చింది. అప్పట్లో వైసీపీలో వేర్వేరు వర్గాలుగా ఉన్న ముత్తా శశిధర్‌, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. ఇద్దరూ అశోక్‌ ప్రాతినిధ్యాన్ని అంగీకరించారు. తద్వారా అశోక్‌కు వైసీపీలో కీలక స్థాయి ఏర్పడింది. అనంతర పరిణామాల నేపథ్యంలో సంగిశెట్టి అశోక్‌ కూడా వైసీపీలో ఇమడలేక, అధినేత వైఖరి నచ్చక రాజీనామా చేసినట్టు చెప్తున్నారు.
Link to comment
Share on other sites

కీలక స్థానంలో గెలిచేందుకు ఆపరేషన్ మొదలుపెట్టిన టీడీపీ
13-08-2018 11:34:11
 
636697568517110817.jpg
రంపచోడవరం, తూ.గో.: టీడీపీ రంపచోడవరం నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచీ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థులు ఎవరైనా సునాయాసంగా గెలవడమే లక్ష్యంగా కసరత్తు సాగిస్తోంది. పార్టీ ఆవిర్భాం నుంచీ వరుస విజయాలతో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన పార్టీ 2009, 2014 ఎన్నికల్లో వరుస వైఫల్యాలను ఖాతాలోకి వేసుకోవడానికిగల కారణాలను తీవ్రంగా అన్వేషించిన అధిష్ఠానం అనేక లోపాలను గుర్తించింది. ఆది నుంచీ పార్టీకి ఉన్న స్థిరమైన ఓటు బ్యాంకు మినహా నియోజకవర్గంలో పెరుగుతున్న ఓటర్లకు అనుగుణంగా పార్టీకి ఓటు బ్యాంకు పెరగకపోవడం, పార్టీలో నాయకుల మధ్య సమన్వయలోపాలే ఈ వైఫల్యాలకు కారణంగా గుర్తించారు. ఓటు బ్యాంకు పెరగకపోవడానికి గానీ, నాయకుల మధ్య సమన్వయం లోపించడానికి గానీ గల కారణాలను ఇంతకాలం పార్టీ అన్వేషించలేకపోయింది.
 
వైసీపీని నిలబెట్టిన కాంగ్రెస్‌ పథకాలు
2014 ఎన్నికల వైఫల్యం అనంతరం ఈ కారణాలపై దృష్టిసారించిన పార్టీ 2019 ఎన్నికలే లక్ష్యంగా దఫదఫాలుగా పలు పరిశీలనలు సాగిస్తూ వచ్చింది. గిరిజనేతర ఓటు బ్యాంకు కంటే గిరిజన ఓటు బ్యాంకు గతం కంటే బాగా పెరిగింది. గిరిజన ఓటు బ్యాంకు చీలిపోవడం కూడా పార్టీ విజయంపై ప్రభావాన్ని చూపింది. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌ను దాటి కిందకు వెళ్లకపోవడంతోపాటు దివంగత ఎన్టీఆర్‌ స్థాయిలో గిరిజన ఆకర్షక విధానాలు మారిన పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. విచిత్రమేమంటే అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గిరిజన నియోజకవర్గాల బెల్టు మొత్తం 2014 ఎన్నికల్లో ఒకే తీరుతో తెలుగుదేశానికి ప్రతికూలంగా మారడంపట్ల పార్టీ నిశిత పరిశీలనే సాగించింది. గిరిజనుల్లో పార్టీ పట్టు సడలిపోవడానికి గల కారణాలు, పెరిగిన గిరిజన యువత ఓట్లు ఆకర్షించలేకపోవడానికి గల కారణాలను ఆరు సెగ్మెంట్లలో పరిశీలిస్తే 1983 కాలంలో తెలుగుదేశం రావడంతో గతంలో ఎన్నడూ లేనంత లబ్ధిని గిరిజనులు ఐటీడీఏల ద్వారా పొందడం, అప్పట్లోని అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పథకాల ఫలాలను నేరుగా గిరిజనులకు అందేలా చూడడం వంటి పరిణామాలు పార్టీని మూడు దశాబ్ధాలపాటు నిలబెట్టాయి.
 
ఆనాటి సంస్కరణలు తప్పితే మారిన పరిస్థితుల రీత్యా కొత్త పరిణామాలు గిరిజనాభివృద్ధిలోను, వ్యక్తిగత అభివృద్ధిలోను చోటు చేసుకోకపోవడంతో ఆకర్షణ తగ్గింది. జాతీయ ఉపాధి హామీ పథకం కావడానికి కేంద్ర ప్రభుత్వ చట్టమే అయినా కాంగ్రెస్‌ హయాంలో దాన్ని గిరిజన ప్రాంతాల్లో అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ఆ పార్టీ 2009 ఎన్నికల్లో ఊహించని ఫలితాన్ని కాంగ్రెస్‌ పొందగలిగింది. ఉపాధి హామీ పథకం కేంద్ర చట్టమే అయినా వైఎస్‌ తీసుకువచ్చిన పథకంగా క్షేత్రస్థాయిలో ప్రచారం సాగింది. దీంతో వైఎస్‌ మరణానంతరం కేంద్ర పఽథకాలను ఆయన సొంత పథకాలుగా వైసీపీ క్షేత్రస్థాయిలో ఎన్నికలకు రెండున్నరేళ్ల నుంచి ప్రచారం చేసుకుని ఓటర్లను మలుచుకుంది. ఫలితంగా 2014లో వైసీపీ గెలుపు అరకు పార్లమెంటు పరిధిలో ఇతర సెగ్మెంట్లతోపాటు రంపచోడవరంలో కూడా సాధ్యమైంది. అంటే 2004 వరకూ ఉన్న గిరిజన ఓటులో చీలిక మొదలైందన్నది తేటతెల్లమైంది. ఇదే ప్రత్యర్థులకు అనుకూలంగా మారింది.
 
గిరిజనులకు లబ్ధి చేకూర్చే ఏర్పాట్లు
2009, 2014 వైఫల్యాలను నిశితంగా పరిశీలించి లోపాల ను అవగతం చేసుకున్న టీడీపీ అధిష్ఠానం పార్టీని తిరిగి గిరిజనులకు చేరువ చేసే ప్రయత్నాలను ఆరంభించింది. గిరిజనులకు అవసరమైన ఆర్థిక ఊతాన్నిచ్చే శాశ్వత ప్రణాళికలు, ఏఏ అంశాలు వారికి నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయో పార్టీ గు ర్తించింది. గిరిజన ప్రాయోజిత కార్యక్రమాల కింద లబ్ధి నేరు గా గిరిజనులకే చేరేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం తీరు తో గిరిజన వర్గాల్లో నెలకొంటున్న అసమానత్వాన్ని తొలగిం చే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగానే పీవీటీజీలకే పరిమితమైన 50ఏళ్ల పింఛనును ఎటువంటి వివక్ష లే కుండా అన్ని గిరిజన జాతులకు వర్తించేలా వ్యవహరిస్తోంది. గిరిజన ఓటును చీలనీయకూడదని, పోయిన ఓటుబ్యాంకును తిరిగి సమీకరించుకోవాలని అన్నికోణాల్లోను అన్వేషిస్తోంది. ఎప్పటికపుడు పరిశీలనలతోపాటు క్షేత్రస్థాయి నేతల సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని ప్రతి ఫలితాన్ని అందరు గిరిజనులకు సమానత్వంతో అందించేదిశగా చర్యల్ని చేపడుతోంది.
 
 
విలీన మండలాలపై దృష్టి
11 మండలాలతో 2019 ఎన్నికలను రంపచోడవరం నియోజకవర్గంలో ఎదుర్కొనాల్సి రావడం కూడా పార్టీకి ప్రతి ష్ఠాత్మకంగా మారింది. దీంతో ఏడు మండలాల పరిస్థితిపై స్పష్టమైన అంచనాకు వచ్చిన అధిష్టానం నాలుగు విలీన మండలాల విషయంలో కూడా స్పష్టతకు ప్రయత్నిస్తోంది. ఈ నాలుగు విలీన మండలాల్లో మెజారిటీ ప్రజలు పోలవ రం ముంపు పరిధిలో ఉండడంతో వారిలో ప్రతికూల పరిస్థితులను నెలకొనకుండా చూడడం పైనే పార్టీ దృష్టి సారించింది. ఈ కారణంగానే ముంపు పరిహారం, పునరావాస అంశాల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తోంది. నిర్వాసితులకు చేరాల్సిన ప్రయోజనాలన్నీ వివాదరహితంగా వారికి చేర్చడంకోసం ఈ మండలాల పాలనపై కూడా ప్రాధాన్య దృష్టి ని సారించింది.
 
తెలుగుదేశం ప్రభుత్వంపై విశ్వాసం పెరిగే చర్యలను అమలు చేయాలని చూస్తోంది. తద్వారా ప్రతికూ ల పరిస్థితులకు తావులేకుండా వ్యవహరించాలన్నదే పార్టీ కీలక నిర్ణయం. ఇందుకోసం పార్టీ శ్రేణులను సైతం బలోపే తం చేయడం, పార్టీని క్షేత్రస్థాయిలో బలపర్చడం ద్వారా పార్టీయే కీలకంగా 2019 ఎన్నికల్లో ఏ అభ్యర్థిని బరిలో దిం చినా 1983 నుంచి 2004 వరకూ సాధించిన స్థాయి విజయాలు ఏకపక్షంగా సాధించాలని యోచిస్తోంది. అరకు పా ర్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని సెగ్మెంట్లు తమ పార్టీ శిగలోకి చేరాలన్నది అధికార తెలుగుదేశం ఆకాంక్ష.
Link to comment
Share on other sites

నసేన సమన్వయ కమిటీ ఏర్పాటు
13-08-2018 11:23:09
 
636697561897208967.jpg
కాకినాడ: జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి ముగ్గురుతో జిల్లా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. మండల, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 15 రోజుల్లో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేసి నాయకులను ప్రకటించనున్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా పార్టీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నాయకులు మారిశెట్టి రాఘవయ్య, ముత్తా గోపాలకృష్ణ, అద్దేపల్లి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని సమష్టి కృషితో ముందుకు తీసుకెళ్ళాలన్నారు.
 
అధికారికంగా టీడీపీ, ఆర్థికంగా వైసీపీ ముందున్నప్పటికీ ప్రజల మన్ననలను పొందిన పార్టీగా జనసేన ముందుందన్నారు. సినీ పరిశ్రమలో ఎంతో రాబడి ఉన్నప్పటికీ పవన్‌ కల్యాణ్‌ వాటిని వదులుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు కదిలారన్నారు. బూత్‌ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ అధినేత పవన్‌ ఆమోదం పొందిన తర్వాత ప్రకటిస్తామన్నారు. జనసేన పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. ఆ ఆదరణను ఓట్లుగా మలుచుకోవడానికి సమష్టి కృషి చేయాలన్నారు. పవన్‌ సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలన్నారు. నియోజకవర్గానికి పది వేల ఓట్లను చేర్పించాలన్నారు.
 
జిల్లా సమన్వయ కమిటీ
జిల్లా కోఆర్డినేటర్‌గా మేడా గురుదత్త ప్రసాద్‌, కోఆర్డినేటర్లుగా ప్రెసంగి ఆదినారాయణ, శెట్టిబత్తుల రాజబాబును పార్టీ అధినేత పవన్‌ నియమించినట్లు రాఘవయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పెద్దల సూచనల మేరకు పార్టీ బలోపేతానికి పార్టీ సభ్యత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామన్నారు.
Link to comment
Share on other sites

జగన్‌ దిష్టిబొమ్మ దహనం
13-08-2018 11:20:45
 
636697560463969901.jpg
కోటనందూరు, తూ.గో.: ప్రతిపక్ష నేత జగన్‌ అవినీతిపరుడంటూ కోటనందూరులో బస్టాండ్‌లో దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు గాడి రాజుబాబు ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజామన్ననలు పొందిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుపై జగన్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు దాచుకుని ప్రతివారం కోర్టుకు వెళ్తున్న వ్యక్తి జగన్‌ అన్నారు. అవినీతి గురించి ఆయన మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జడ్పీటీసీ లగుడు శివకుమారి, పెంట కోట భాస్కర సత్యనారాయణ, డి.చిరంజీవిరాజు, పోతల సూరిబాబు, యర్రచిన సత్య నారాయణ, గెడ్డం కొండయ్యనాయుడు, సామినీడి కృష్ణార్జున, రుత్తల శ్రీనువాస్‌, బోడపాటి సత్యనారాయణ, పెనుముచ్చు నాగేశ్వరరావు, చింతల వెంకట రమణ, లగుడు సత్యనారాయణమూర్తి, అంకంరెడ్డి రమేష్‌, చింతకాయల రవికుమార్‌, పల్లి నాగేశ్వరరావు, లెక్కల భాస్కరరావు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

సెల్ఫ్ గోల్‌తో జగన్ ప్లాన్ ఫెయిల్.. వైసీపీలో కలవరం..!
14-08-2018 12:17:51
 
636698458725287664.jpg
  • కొన్నిచోట్ల బహిర్గతమైన వర్గవిభేదాలు
  • కాకినాడలో జంపింగ్‌లు.. ‘ముత్తా’ జనసేనలోకి
  • రామచంద్రపురంలోనూ తీవ్రమైన పోరు
  • సామర్లకోటలో పవన్‌పై జగన్‌ వ్యాఖ్యల రభస
  • జగ్గంపేటలో వైసీపీ అధినేతపై కాపుల కన్నెర్ర
  • లాభమెంత, నష్టమెంత..? సాగుతున్న విశ్లేషణలు
జగన్‌ పాదయాత్ర మొదలు పెట్టిన నాటి నుంచి ఒకెత్తు, తూర్పుగోదావరి కొచ్చేసరికి మరొక ఎత్తు. రెండు నెలలపాటు నిర్విరామంగా సాగిన యాత్ర ఇది. కచ్చితంగా చెప్పాలంటే మొత్తం యాత్ర నేటికి 237 రోజులు జరిగితే.. 63 రోజులు మన జిల్లాలోనే సాగింది. కోర్టుకు హాజరయ్యే శుక్రవారాలు మినహాయిస్తే మిగతా అన్ని రోజులూ ఇక్కడే ఉన్నారు. అయితే టీడీపీకి కోటగా ఉన్న జిల్లాలో వ్యూహాత్మకంగా పట్టు సాధించాలన్న ఆయన ఎత్తుగడ అంతగా పారినట్టు కనిపించలేదు. తమ అధినేత పాదయాత్రతో తూర్పు రాజకీయాలు మలుపు తిరుగుతాయని ఆశపడిన ఆ పార్టీ నాయకులకూ ఇప్పుడు అర్థంకాని గందరగోళ పరిస్థితి. ఎందుకంటే ప్రజా సంకల్ప యాత్రకు చాపకింద నీరులా చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి వెంటాడింది. ఆయా చోట్ల నాయకుల్లో ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. తెర వెనుక పెద్దలు రంగంలోకి దిగి బుజ్జగింపులు చేసినా లెక్కచేయలేదు. కొందరైతే ఆయన జిల్లాలో ఉండగానే జెండా మార్చేశారు. ఇవన్నీ ఒకరకం తప్పిదాలు. ఏ పార్టీలోనైనా సహజంగా ఉండేవే.
 
కానీ స్వయంగా అధినేత జగన్‌ వ్యూహాత్మకంగానో, ఆవేశపూరితంగానో చేసిన వ్యాఖ్యానాలు పార్టీ నాయకులకు ముచ్చెమటలు పట్టించాయి. సామర్లకోటలో పవన్‌కల్యాణ్‌పై చేసిన కామెంట్లు పెను దుమారాన్నే రేపాయి. జగ్గంపేటలో కాపు రిజర్వేషన్లపై చేతులెత్తేసిన వైనం ఇప్పటికీ ఆ పార్టీలో వణుకు పుట్టిస్తోంది. తుని ఘటనలో సీఎం చంద్రబాబే రైలు తగుల బెట్టించారన్న ఆరోపణ సైతం పేలలేదు. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి నుంచీ స్పందన కరువు. అందుకేనేమో జగన్‌ బస చేసినచోట విలేకరుల సమావేశం పెట్టిన వైసీపీ ఎమ్మెల్సీ ఫ్లోర్‌లీడర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేరుగా ముద్రగడపై ఎవరి కోసం ఉద్యమం చేస్తున్నావంటూ అక్కసు వెళ్లగక్కారు. మొత్తం మీద ‘తూర్పు’ పర్యటన.. జగన్‌లో నెలకొన్న అసహనాన్ని బయటపెట్టింది.
 
 
కాకినాడ: జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలో సుదీర్ఘంగా సాగింది. శుక్రవారాలు కోర్టుకు మినహాయిస్తే మిగిలిన సమయమంతా జగన్‌ జిల్లాలోనే గడిపారు. పగలు నడవడం, రాత్రిపూట నాయకులతో సమాలోచనలు, అప్పుడప్పుడు పార్టీ ముఖ్యులతో భేటీలు.. ఇలా కార్యక్రమాల ప్రణాళిక ఉండేది. వర్షాలతో కొన్ని చోట్ల యాత్రలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. శుక్రవారం కోర్టుకెళ్లేందుకు గురువారం కూడా రెండు కిలోమీటర్ల దూరంతోనే సరిపెట్టేవారు. మిగతా రోజులు ఏడు కిలోమీటర్లకు తగ్గకుండా ముందుకు సాగేవారు. జూన్‌ 12న రోడ్‌ కం రైలు బ్రిడ్జి మీదుగా ఆయన జిల్లాలోని రాజమహేంద్రవరం నగరంలో అడుగుపెట్టారు. మంగళవారం కోటనందూరు మండలం కాకరాపల్లితో ముగిసి విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. మొత్తం జిల్లాలో రెండు నెలలపాటు జగన్‌ పర్యటించారు.
 
జిల్లాలో ప్రవేశించిన తొలి రోజునే రాజమహేంద్రవరంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఉన్న జక్కంపూడి రాజా అలిగారు. సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్నది ఆయన మనస్తాపానికి కారణం. అంతేగాకుండా జగన్‌ ఆరోజు సభలో పోలవరం అంశాన్ని ప్రస్తావిస్తూ దివంగత వడ్డి వీరభద్రరావును ఆకాశానికెత్తేశారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, వడ్డికి మధ్య పొసిగేది కాదు. దాంతో ఇది జక్కంపూడి వర్గీయులకు ఇది రుచించలేదు. తర్వాత కోనసీమ పాదయాత్రలో కూడా అనుకున్నంత లాభపడలేదని ఆ పార్టీలో కొందరు తేల్చేశారు. ప్రధానంగా ఇక్కడ కాపులు కలసిరాకపోవడం మరో కారణంగా కొందరు చెబుతున్నారు.
 
రామచంద్రపురం నియోజకవర్గం వచ్చేసరికి బీసీలకు ప్రధాన నేతగా ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్సీ బోసు అలిగారు. నియోజకవర్గంలో పర్యటన సాగుతున్నా తొలి రెండు రోజులూ పాదయాత్రకు సైతం రాలేదు. దీనికి నియోజకవర్గంలో చెల్లుబోయిన వేణుకు బాధ్యతలు అప్పగించడం, తన కుమారుడికి టిక్కెట్టు అడిగితే నిరాకరించడం, చివరకు రాజమహేంద్రవరం ఎంపీ టిక్కెటు బోసుకు ఇస్తామంటూ మళ్లీ మాటమార్చడం కారణాలని రాజకీయ వర్గాల్లో కోడై కూసింది. ఇది పత్రికల్లో కూడా రావడంతో రెండు రోజుల తర్వాత బోసును ముందు పెట్టి నడిపించారు. బీసీలపై ప్రభావం పడుతుందన్న భావనతోనే పెద్దలు రంగంలో దిగారని సమాచారం.
 
కాకినాడ వచ్చేసరికి అంతర్గత వైరాలు కాస్తా రోడ్డుకెక్కాయి. కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిలకు ప్రాధాన్యం ఇచ్చారన్న కారణంతో గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన సునీల్‌, పార్టీ మాజీ కోఆర్డినేటర్‌ ముత్తా శశిధర్‌లు మొహం చాటేశారు. అంతేగాకుండా శశిధర్‌ తన తండ్రితోపాటు మూడు రోజుల కిందట జనసేనలో చేరిపోయారు. అలాగే వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వైసీపీ శెట్టిబత్తుల రాజబాబు కూడా రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. ఇవన్నీ ఒకవిధంగా ఉంటే.. జూలై 24న సామర్లకోటలో సాక్షాత్తూ జగన్‌ మరో కొత్త వివాదానికి తెరదీశారు. అక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నేరుగా జనసేన అధినేతపై కత్తిదూశారు. ‘పవన్‌కల్యాణ్‌కి నలుగురు నలుగురు పెళ్లాలు. అదే పని వేరే ఎవరైనా చేస్తే.. నేను చేసినా బహుభార్యత్వం అంటూ బొక్కలో వేసేవాళ్లు. అలాంటి వ్యక్తి గురించి నేను మాట్లాడటమా..’ అంటూ వెటకారంతో కూడిన వ్యాఖ్యానాలు చేయడంతో టీడీపీ సహా అన్ని పార్టీలూ అభ్యంతరం చెప్పాయి. పవన్‌ అభిమానులైతే సోషల్‌ మీడియా వేదికగా రచ్చరచ్చ చేశారు. ఇది అనుకోని విధంగా జగన్‌ను ఇరుకున పెట్టింది.
 
ఇక తన టూర్‌ షెడ్యూల్లో లేకపోయినా జగ్గంపేట వెళ్లాలని జగన్‌ నిర్ణయించడం మరో అంశం. ఇక్కడ జ్యోతుల నెహ్రూను టార్గెట్‌ చేసుకుని బహిరంగ సభ ప్లాన్‌ చేశారు. అయితే ఇది కూడా మరో వివాదానికి దారితీసింది. ‘కాపు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేను. అది కేంద్రం పరిధిలో అంశం. నేను చేయలేనివి చెప్పలేను.’ అంటూ కాపుల బీసీ రిజర్వేషన్‌ హామీపై ఆయన కుండబద్దలుకొట్టారు. గోరుచుట్టుపై రోకటిపోటు.. చందాన కాపు సామాజికవర్గం జగన్‌పై కన్నెర్ర చేసింది. కాపు యువత, మహిళలు గ్రామగ్రామాన జగన్‌ పాదయాత్రలో నిరసనలు తెలిపారు. కాపు నిరసనల సెగ జగన్‌ని ఉక్కిరిబిక్కిరి చేయడంతో.. వారం రోజులలోపే.. పిఠాపురం సభలో కాపు రిజర్వేషన్ల అంశంపై తన మాట వక్రీకరించారంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మాట మార్చారు. ఈ వ్యవహారంతో వైసీపీ కేడర్‌లో అయోమయం నెలకొంది.
 
తుని వెళ్లేసరికి మరొక అంశం భగ్గుమంది. తుని కాపు ఉద్యమ ఘటనలో చంద్రబాబే రైలు తగులబెట్టించారని జగన్‌ చేసిన ఆరోపణలు పేలకపోగా విమర్శలకు దారితీసింది. ఇక్కడ కాపు నాయకుల మద్దతు లభిస్తుందనే వ్యూహంతోనే ఆయన మాట్లాడినా ఎవరి నుంచీ ప్రతి స్పందన రాలేదు. దాంతో ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నేరుగా ముద్రగడపై విరుచుకుపడ్డారు.
 
జగన్‌ సెల్ఫ్‌గోల్‌
మొత్తం మీద జగన్‌ పాదయాత్ర అనుకూల ప్రభావం చూపించడంకన్నా తలనొప్పులు తెప్పించిందనే అభిప్రాయాన్ని పలువురు విశ్లేషిస్తున్నారు. బీసీలను దరి చేర్చుకుందామన్న ప్రయత్నం రామచంద్రపురంలో గందరగోళానికి గురిచేయగా, జగ్గంపేటకు చేరేసరికి కాపులపై తన ద్వంద్వం వైఖరితో మరింత నష్టపోయారని కొందరు చెబుతున్నారు. ఇక పవన్‌కల్యాణ్‌పై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు అన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తంకాగా, సొంత పార్టీ నాయకులను ఇబ్బందిలో పడేసిందని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు రైలు తగులబెట్టించారన్న ఆరోపణలు కూడా కలిసిరాకపోగా చవుకబారు రాజకీయంగా ఉందని మరికొందరు చెబుతున్నారు. ఇక వైసీపీ నుంచి జిల్లాలో ముగ్గురు కీలక నేతలు త్వరలో గుడ్‌బై చెప్పనున్నారు. రాజమహేంద్రవరంలో కీలక నేత ఒకరు, కడియానికి చెందిన మరో నేత, ముమ్మిడివరం నుంచి ఇంకొకరు.. త్వరలో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
Link to comment
Share on other sites

ఛాన్స్‌ ఇవ్వకపోతే జనసేనలోకి వెళ్తానంటున్న టీడీపీ కీలక నేత
18-08-2018 11:42:29
 
636701893511931244.jpg
  • ఆ నేతల చూపు..‘జనసేన’ వైపు!
  • వైసీపీ కీలక నేతల జంప్‌ సెప్టెంబరు మొదటివారంలో చేరిక?
కాకినాడ: జిల్లాలో వైసీపీ, బీజేపీల నుంచి పలువురు కీలక నేతలు జనసేన వైపు చూస్తున్నారు. ఆయా పార్టీలలో తమకు రాజకీయ భవిష్యత్‌ ఉండదని భావిస్తున్న సదరు నేతలు పవన్‌ కల్యాణ్‌ పార్టీలో చేరడానికి ఉవ్విళ్లూరుతున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో సెప్టెంబరు నెలలో నిర్వహించనున్న ప్రజాపోరాట యాత్రలో వీరు జనసేనలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘కాపు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేను. అది కేంద్ర పరిధిలో అంశం. ఇది సాధ్యం కాదు..’ అంటూ కాపులను బీసీ జాబితాలో చేర్చే అంశంపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ గత నెలలో జగ్గంపేటలో వ్యతిరేఖ గళం వినిపించిన తర్వాత ఆ పార్టీ నుంచి బయటకుపోయేందుకు చూస్తున్నారు. వైసీపీకి గుడ్‌బై చెప్పే వారిలో ఎక్కువమంది జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
 
రాజమహేంద్రవరం రూరల్‌ కడియం మండలానికి చెందిన వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ కోసం కేసులను సైతం లెక్కచేయకుండా పార్టీపట్ల కమిట్‌మెంట్‌తో పనిచేసిన మరో నాయకుడు కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. సదరు నాయకుడు కూడా వైసీపీ నుంచి జనసేన వైపు దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. ముమ్మిడివరం నుంచి వైసీపీలో టికెట్‌ ఆశించిన మరో నేత జనసేనలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన సదరు నేతకు ముమ్మిడివరం టికెట్‌ ఇస్తారన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది. రాజమహేంద్రవరంలో బీజేపీ ప్రజాప్రతినిధి, కాపు సామాజికవర్గంలో మంచి గుర్తింపు ఉన్న నేత కూడా జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నటు సమాచారం. సదరు బీజేపీ నేత భార్య ఇప్పటికే జనసేనకు బహిరంగమద్దతు ప్రకటించారు. బీజేపీ నేత.. కొన్ని నెలల క్రితం టీడీపీలో చేరతారని రాజమహేంద్రవరం రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం సాగింది. టీడీపీ నుంచి రాజమహేంద్రవరం లోక్‌సభ సీటు ఇస్తారని ప్రచారమూ జోరుగాసాగింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపధ్యంలో జనసేన వైపు ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరతారని చెప్తున్నారు.
 
టీడీపీ నుంచీ జనసేన వైపు చూపు..
టీడీపీకి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధి తనకు టికెట్‌ హామీ ఇవ్వకపోతే నెల రోజులలో బయటకు వెళ్లిపోవడానికైనా సిద్ధమేనంటూ ఇప్పటికే అనుచరుల వద్ద క్లారిటీ ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే తనకు సీఎం టికెట్‌ హామీ ఇచ్చారని పార్టీమారే యోచనలేదంటూ బయటకు మాత్రం గంభీరంగానే చెప్తున్నారు. మొత్తం మీద జిల్లాలో వైసీపీ, బీజేపీ కీలక నేతలతోపాటు.. ఒకరిద్దరు టీడీపీ నాయకులూ జనసేనలోకి జంప్‌ చేయాలన్న కుతూహలంతో ఉన్నారు. అయితే ఇలాంటి వలసలు సాధారణమేనంటూ ఆయా పార్టీల నాయకులు పెద్దగా పట్టించుకోవడంలేదని చెప్తున్నారు.
Link to comment
Share on other sites

వైసీపీ మరో కీలక నేత గుడ్‌బై.. నేడు అధికారిక ప్రకటన
18-08-2018 11:37:21
 
636701890433248723.jpg
రాజమహేంద్రవరం: జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజా సంకల్పయాత్ర ద్వారా గెలుపు అవకాశాలను మెరుగుపరచుకోవాలని భావించి వైసీపీ అధినేత జగన్‌కు జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. రాజమహేంద్రవరంలో పేరున్న నాయకుడు మాజీ ఎమ్మెల్సీకందుల దుర్గేష్‌ వైసీపీకి రాజీనామా చేశారు. ఈవిషయాన్ని శనివారం ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నట్టు వర్గీయులు తెలిపారు. ఆయన ఇంటి వద్ద శనివారం ఉదయం 9 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జనసేనలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

చ్చే ఎన్నికల్లో శెట్టిబలిజలకు ప్రాధాన్యం
21-08-2018 04:03:29
 
  •  బీసీలకు అండగా ఉంటా: పవన్‌
  • జనసేనానితో వైసీపీ నేత పితాని భేటీ
హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో శెట్టిబలిజలకు జనసేన సరైన ప్రాధాన్యాన్ని ఇస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. శెట్టిబలిజలతోపాటు వెనుకబడిన కులాలకు అండగా ఉంటానన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైసీపీ మాజీ సమన్వయకర్త పితాని బాలకృష్ణ.. తన అనుచరులు, శెట్టిబలిజ నేతలతో కలిసి సోమవారమిక్కడ మాదాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో పవన్‌తో భేటీ అయ్యారు. త్వరలో పవన్‌ గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు జనసేనలో చేరతానని బాలకృష్ణ ఆయనతో చెప్పారు. శెట్టిబలిజ వర్గీయులకు రాజకీయాల్లో సరైన ప్రాధాన్యం దక్కడంలేదన్నారు.
 
పవన్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నానని తెలిపారు. జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన ‘కులాలను కలిపే ఆలోచన’ను తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
టీడీపీ సంచలన నిర్ణయం.. 6గురు ఎమ్మెల్యేలకు టికెట్లు గల్లంతు
05-09-2018 12:02:22
 
636717457413443793.jpg
  • బుచ్చయ్య, గొల్లపల్లికి నియోజకవర్గ మార్పు?
  • అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు
 
2019 ఎన్నికలకు టీడీపీ కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లాలో అరడజనుమంది ఎమ్మెల్యేలను తప్పించి.. వారి స్థానంలో సమర్థులను నిలపాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పక్కన పెట్టాలని భావిస్తున్న వారికి పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నట్టు తెలుస్తోంది. టిక్కెట్టు దక్కని నేతలు పార్టీ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నిస్తే అతని బలం సరిపోతుందా? అనేదానిపైనా పార్టీ లోతుగా పరిశీలన చేస్తోంది. టిక్కెట్టు దక్కదన్న సంకేతాలు ఉన్న నేతలు ఇతర పార్టీలలోకి వెళ్లేందుకు మార్గాలు అన్వేషించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఎలాగైనా సీటు సంపాదించే గట్టి ప్రయత్నాలు చేస్తున్న వారూ ఇందులో ఉన్నారు. ప్రజా వ్యతిరేకత, కేడర్‌లో అసమ్మతి ఎక్కువ ఉన్నవారు, వయో భారంతో ఉన్నవారు, పార్టీపట్ల పెద్దగా కమిట్‌మెంట్‌లేకుండా సాదాసీదాగా ఉన్న నేతలూ ఈ జాబితాలో ఉన్నారు.
 
 
కాకినాడ: కాకినాడ లోక్‌సభ పరిధిలో ఉన్న ప్రత్తిపాడులో అభ్యర్థి మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి 75 ఏళ్ల వయస్సులో టిక్కెట్టు దక్కకపోవచ్చని చెబుతున్నారు. ఈయన స్థానంలో ఆయన అన్న, మాజీ ఎమ్మెల్యే వరుపుల జోగిరాజు మనవడు వరుపుల రాజాకి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. కుటుంబంలో వ్యక్తికే టిక్కెట్టు వస్తే సుబ్బారావు నుంచి వ్యతిరేకత ఉండకపోవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు సుబ్బారావుకి కూడా సంకేతాలు వచ్చినట్టు చెబుతున్నారు. కాకినాడ రూరల్‌లో అభివృద్ధి పనులు చెప్పుకోదగ్గ రీతిలో చేసినా పిల్లి అనంతలక్ష్మి కుమారులపై వస్తున్న ఆరోపణలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎంపీగా ఉన్న తోట నరసింహాన్ని తప్పిస్తే ఏదో అసెంబ్లీ నుంచి టిక్కెట్టు ఇస్తారన్న ప్రచారం ఉంది. దీంతో మరో ఎమ్మెల్యేని పక్కనపెట్టాల్సిన పరిస్థితి. పెద్దాపురం నుంచి హోంమంత్రి చినరాజప్ప, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ టిక్కెట్టు మాత్రం దాదాపు ఖాయంగా కనినిస్తున్నాయి.
 
అమలాపురం లోక్‌సభ పరిధిలో..
ఇక్కడ నాలుగు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ సర్వేలో వెల్లడైనట్టు సమాచారం. అయితే ముమ్మిడివరంలో ఇబ్బందులు ఉన్నా, ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ అభ్యర్థిని తెరపైకి తేవడం కష్టంగా కనిపిస్తోంది. దీంతో పార్టీలో సమన్వయం చేసుకుని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. మిగిలిన మూడు అసెంబ్లీలలో ఖచ్చితంగా ఇద్దరిని తప్పించాలని భావిస్తున్నారు. అమలాపురం లోక్‌సభ నుంచి దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కుమారుడు బరిలోకి వస్తే సమీకరణలు ఇంకొంత మారవచ్చు.
 
రాజమహేంద్రవరం సిటీ నుంచి బుచ్చయ్య?
రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి సీటు మార్పు ఉంటుందని చెబుతున్నారు. 1983 నుంచీ రాజమహేంద్రవరం సిటీలో మంచి పట్టున్న బుచ్చయ్యను ఈసారి సిటీకి మారిస్తే మంచి మెజారిటీ వస్తుందని ఒక వాదన వినిపిస్తోంది. రూరల్‌ నుంచి కొత్తవారికి అవకాశం కల్పించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలో మరో అసెంబ్లీకి బలమైన అభ్యర్థి కోసం టీడీపీ భారీ కసరత్తే చేస్తోంది. అయితే టీడీపీ నుంచి ఆహ్వానం ఉన్నా.. సదరు నేత ఇంకా తన అభిప్రాయం వెల్లడిచేయడంలేదు.
 
గొల్లపల్లికి నియోకవర్గ మార్పు?
రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుని వేరే నియోజకవర్గం నుంచి పోటీచేయిస్తే ఎలా ఉంటుంది? అనేదానిపై మల్లగుల్లాలుపడుతున్నారు. రాజోలు కాకుండా మరో రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీకి దింపితే సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. రాజకీయ పరిణామాలలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటే సూర్యారావుకి టిక్కెట్టు ఇవ్వకుండా పార్టీలో క్రియాశీల పదవిని కట్టబెట్టే అవకాశమూలేకపోలేదు. రాజోలు నుంచి మాజీ ఎమ్మెల్యే ఒకరిని పార్టీలోకి తీసుకోవాలని ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఓకే అయితే సూర్యారావుకి మార్పు కానీ, పార్టీ పదవి కానీ ఉండవచ్చు. ఆరుగురిని పూర్తిగా పక్కనపెట్టడం, ఇద్దరికి నియోజకవర్గ మార్పులు.. ప్రస్తుతానికి టీడీపీ అధిష్ఠానం జిల్లాలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు అని తెలుస్తోంది. రాజకీయ పరిణామాలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలలో మార్పులు ఉంటే.. టీడీపీ అభ్యర్థుల ఎంపిక, తప్పించే వాటిల్లోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు.
Link to comment
Share on other sites

ముందస్తుకు సిద్ధంగా ఉన్నాం: టీడీపీ ఎంపీ మురళీమోహన్
05-09-2018 11:35:54
 
636717441541555602.jpg
ఏలూరు: ముందస్తు ఎన్నికలు రావు, వస్తే సిద్ధంగానే ఉన్నామని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్‌, గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో దేవినేనివారిగూడెం, రామన్నగూడెం ఎస్సీ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం ప్రారంభించారు. రూ.70 లక్షలతో నిర్మించిన సొసైటీ కార్యాలయంను ప్రారంభించారు. సొసైటీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని, పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఉంటాయని, పార్లమెంటు ఎన్నికలు ముందస్తుగా వచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధవంతుడైన నాయకుడన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి ఇవ్వగలిగితే కేంద్రంలో ప్రధాన మంత్రి అభ్యర్థిని డిసైడ్‌ చేసే అవకాశం చంద్రబాబుకి ఉంటుందన్నారు.
 
బీజేపీతో కలిసింది రాష్ట్రాభివృద్ధి కోసమేనని, అభివృద్ధికి సహకరించకపోవడంతో విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అమరావతి శంకుస్థాపనకు మనీ ఇవ్వకుండా, మట్టి, నీళ్లు ఇచ్చారన్నారు. రూ.లక్ష కోట్లు దోచుకున్న జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దోచుకోవడంలో జగన్మోహన్‌రెడ్డి డాక్టరేట్‌ పొందారన్నారు. సినిమాల్లో నుంచి వచ్చిన వ్యక్తికి మంచి ఆలోచన, ప్రజలకు ఏదో చేయాలనే తాపత్రయం ఉందని, అనుభవం కూడా ఉండాలన్నారు. అనుభవజ్ఞులు, నీతిపరుడు, నిజాయితీపరుడైన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని, మరలా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
 
ఎంపీపీ వడ్లపూడి ప్రసాద్‌, టీడీపీ మండల అధ్యక్షుడు సుంకవల్లి బ్రహ్మయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లిపెద్ది వెంక టేశ్వరరావు, మొగతడకల శ్రీనివాసరావు, జడ్పీ టిసి సభ్యురాలు మొగతడకల లక్ష్మీరమణి, పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పాకలపాటి గాంధీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని సోం బాబు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు గుణ్ణం రవి కుమార్‌, మండల యువత అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రవీణ్‌కుమార్‌, టీటీడీ బోర్డు సలహా దారుడు మద్రాసు రాము, మాజీ ఎంపీపీలు కేతా పుల్లయ్య, ఏపూరి దాలయ్య, ఈడ్పుగంటి భాస్కర రావు, ఘంటా బాబ్జీ, సొసైటీ అధ్యక్షుడు ఘంటా శ్రీనివాసరావు, మాచిరెడ్డి హరిబాబు, మాకిరెడ్డి దొరారెడ్డి, పోలిన శ్రీను, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రంపచోడవరం టీడీపీ అభ్యర్థి ఎవరు?
09-09-2018 12:21:12
 
636720924698455052.jpg
  • ముందస్తు జాబితాలో ఖరారవుతుందా?
  • ఉనికి కోసం ఆశావాహుల పోటీ
  • అధిష్ఠానం పరిశీలనలో నేతల జాతకాలు
 
రంపచోడవరం/తూర్పు గోదావరి: వచ్చే ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరు...? చర్చనీయాంశంగా మారిన ఈ ప్రశ్నకు తెలుగుదేశం అధిష్ఠానమే పరోక్షంగా తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఈ దిశగా చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గం కూడా అందులో ఉంటుందా అన్నది క్యాడర్‌లోనే కాకుండా అన్ని వర్గాల్లో కూడా చర్చనీయాంశగా మారింది. ముందస్తు అభ్యర్థిత్వాల ఖరారు తెలుగుదేశంలో భిన్నమైన ప్రక్రియే అయినా కొన్ని బలమైన కారణాల రీత్యా ఆయా నియోజకవర్గాల విషయంలో ఈ ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్న విషయం తెలిసిందే! రంపచోడవరం విషయంలో ముందస్తుగా అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది కూడా అధిష్ఠానం పరిశీలిస్తోంది.
 
 
Untitled-37.jpgరంపచోడవరం విషయానికి వస్తే...ఇక్కడ ఉన్నది వైసీపీ ఎమ్మెల్యేనే అయినా ఆ పార్టీ నుంచి వంతల రాజేశ్వరి టీడీపీలోకి రావడంతో ఇది ఆ పార్టీ తన ఖాతాలోనే వేసుకోవడంతో మొదటి ప్రాధాన్య అంశం పరిధిలోకి రాకపోవచ్చు. ఇక్కడ ఊహించని రీతిలో 2019 ఎన్నికలకు నియోజకవర్గం 11 మండలాలతో పునర్విభజించబడి ఉండడంతో తెలంగాణనుంచి వచ్చిన నాలుగు విలీన మండలాలతో పార్టీ పరిస్థితులు అంతు చిక్కనివిగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ నాలుగు మండలాలను ప్రభావితం చేయడం కూడా విజయాన్ని నిర్ధేశిస్తాయన్నది అన్ని పార్టీల్లోను నిర్వివాదాంశం. దీంతో 11 మండలాలుగా పునర్విభజించిన ఈ నియోజకవర్గంలో పార్టీ బలం ఎలా ఉందన్నది నిర్ధారించుకోవడం కష్టంగా మారింది. దీంతో ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని మైదాన ప్రాంతాల మాదిరిగా ఎన్నికలకు వారమో, ఐదు రోజుల ముందో ఖరారు చేయడం ద్వారా సదరు అభ్యర్థిని 11 మండలాల్లోని 353 పోలింగ్‌ కేంద్రాలస్థాయికి విస్తరింపచేయడం అసాధ్యమైన ప్రయోగమే అవుతుంది. దీంతో ఈ అంశమే ముందస్తుగా అభ్యర్థిని ఖరారు చేయడానికి ప్రాధాన్యంగా తీసుకోవడానికి అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
 
 
ఎవరి ధీమా వారిది...
కొన్ని నెలలుగా ఇక్కడి అభ్యర్థిత్వం కోసం వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ప్రయత్నాలతోపాటు ధీమాగా ఉన్నారు. టికెట్‌ ఖరారు హామీతోనే వైసీపీనుంచి ఆమె ఇక్కడకు వచ్చారని, ఆ మాట మేరకే చంద్రబాబు తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని ఆమె భావిస్తున్నారు. సీనియర్‌ నేతగా మూడుసార్లు వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించిన మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు కూడా ధీమాగానే ఉన్నారు. 11 మండలాల నియోజకవర్గానికి తనకు ఉన్న రాజకీయ అనుభవం, గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్న బంధుత్వాలు, పార్టీ క్యాడర్‌తో ఉన్న అనుబంధాలు తనకు అవకాశాన్ని తెచ్చిపెడతాయని ఆయన భావిస్తున్నారు. రంపచోడవరం మరో మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూ రమేష్‌ కూడా అంతే ధీమాతో ఉన్నారు. జిల్లాలో ఉన్న ఒక ముఖ్యనేత ఆశీస్సులు, పార్టీలో ఉన్న పట్టు తనకు అవకాశాన్ని తెచ్చిపెడతాయని భావిస్తున్నారు.
 
 
కొత్త వారికి ఇస్తే ...
కొత్తవారి నుంచి చూస్తే ఒక మాజీ మంత్రి కుమార్తె, ప్రభుత్వంలో పట్టు ఉన్న ఒక ఐఏఎస్‌ అధికారి సోదరి అయిన గొర్లె సునీత కూడా కొత్త తరాన్ని ప్రోత్సహించే చంద్రబాబు తనకే అవకాశం కల్పిస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యుడు డాక్టర్‌ కోసూరి అప్పారావు కూడా పార్టీలో పావులు కదుపుతూ ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో తనకు ఉన్న పరిచయాలు, పార్టీలోని కొందరు నాయకులతో ఉన్న సాన్నిహిత్యాలతో తన పేరు ఖరారు కాగలదని భావిస్తున్నారు. వై.రామవరం మండలానికి చెందిన గొర్లె శ్రీకాంత్‌, గంగవరం నుంచి తీగల ప్రభ, రాజవొమ్మంగి నుంచి కోసూరి బుజ్జి చిన్నాలమ్మ తదితరులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.
 
 
పార్టీ అధిష్ఠానం ఇప్పటికే తమ వద్దనున్న ఆశావాహుల జాతకాలను వడకడుతోంది. ఆయా ఆశావహుల్లో కీలకంగా ఉండే వారిపై ఇప్పటికే నిఘాను ఉంచి వారి తీరుతెన్నులను, నియోజకవర్గంలో వారికి ఉన్న ఛరిష్మాను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రులు, పలువురు ముఖ్యనేతలకు కూడా ఇక్కడి అభ్యర్థిత్వం విషయంలో సూచనప్రాయంగా సంకేతాలను ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది. రంపచోడవరం నియోజకవర్గ తాజా పరిస్థితుల రీత్యా అభ్యర్థిత్వాన్ని ముందుగానే ప్రకటించాలన్న అంశంపై సర్వత్రా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 
Tags : rampachodavaram, telugudesam, vantala rajeswari, mla ticket
Link to comment
Share on other sites

వైసీపీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ సంచలన ప్రకటన
10-09-2018 11:56:01
 
636721773618188754.jpg
రామచంద్రపురం, తూ.గో.: వైసీపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆపార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ సమక్షంలోనే ఆపార్టీ కేడర్‌ రెండుగా విడిపోయి బాహాబాహీ తలబడ్డాయి. వారి మధ్య తోపులాటలూ జరిగాయి. కోఆర్డినేటర్‌గా వేణు నియామకాన్ని వ్యతిరేకిస్తున్న వర్గానికి, వేణుకు మద్దతుగా నిలిచిన వర్గానికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వేణు నియామకాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా బోస్‌తనయుడు సూర్యప్రకాష్‌ను కోఆర్డినేటర్‌గా నియమించాలని డిమాండ్‌ చేశారు.
 
స్థానికేతరుడిని ఒప్పుకోమని వారు అనడంతో వేణు నియామకాన్ని సమర్ధిస్తున్న పార్టీ పట్టణ కన్వీనర్‌ గాదంశెట్టి శ్రీధర్‌, కొసనా ప్రసాద్‌, కుడుపూడి గణేష్‌, చింతపల్లి నాగేశ్వరరావు తదితరుల వ్యాఖ్యలపై అభ్యంతరం వెలిబుచ్చడంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఒకరినొకరు గెంటుకుంటూ దుర్భాషలాడుకున్నారు. చివరికి వేణు నియామకాన్ని వ్యతిరేకిస్తూ ద్రాక్షారామలో బహిరంగ విమర్శలు చేసిన వారందరినీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్న ప్రధాన డిమాండ్‌ను బోస్‌వద్ద ఉంచారు. పార్టీ మండల కన్వీనర్‌ పంతగడ ప్రసాద్‌ నివేదిక తయారుచేసి అధిష్ఠానానికి పంపాలని తద్వారా తగిన చర్యలు తీసుకుంటామని బోస్‌ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.
 
పోటీచేసే ఆర్ధిక స్థోమత లేదు
ఈ సమావేశంలో బోస్‌ మాట్లాడుతూ తనకుగాని తన కుమారిడికిగాని వచ్చే ఎన్నికలలో పోటీచేసే ఆలోచనే లేదని తనకు అప్పులు ఉన్నాయని వేణు అభ్యర్ధిత్వాన్నే బలపరచాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలలో ఐక్యంగా ముందుకు సాగి వేణు గెలుపునకు కృషి చేయాలని కోరారు. తన కుమారుడు పోటీ చేస్తాడని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌...వేణును కోఆర్డినేటర్‌గా నియమించారని ఆయనను వ్యతిరేకించడం సరైన విధానం కాదని ఐక్యంగా ముందుకుసాగి పార్టీ ప్రతిష్టను పెంచాలన్నారు. సమావేశానికి హాజరైన చెల్లుబోయిన గోపాలకృష్ణతో కలిసి వారంతా ఐక్యతను చాటారు. సమావేశం లో కొప్పిశెట్టి వీరభద్రరావు, మాగాపు అమ్మిరాజు, దొమ్మలపాటి సత్యనారాయణ పెట్టా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 
చర్యలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది: వేణు
పార్టీకి నష్టం కల్గిస్తూ ప్రకటనలు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెల్లుబోయిన వేణు తెలిపారు. ఆదివారం ఆయన ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తన నియామకం పార్టీ నిర్ణయమని పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని నాయకులు బోస్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఈనెల 5న ద్రాక్షరామలో విమర్శలు చేసిన వారంతా ప్రత్యర్ధికి కోవర్టులుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చర్యలపై పార్టీ నిర్ణయమే తన నిర్ణయమన్నారు. తనకుంటూ వర్గమేదీ లేదని తాను కూడా బోస్‌ వర్గమేనని తెలిపారు. సమావేశంలో నాయకులు గాదంశెట్టి శ్రీధర్‌, కుడుపూడి గణేష్‌, చింతపల్లి నాగేశ్వరరావు, దొమ్మలపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

పవన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే.. త్వరలో జనసేనలో చేరిక
13-09-2018 11:39:15
 
636724355563511740.jpg
మలికిపురం, తూ.గో.: రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిశారు. ఆయన మర్యాద పూర్వకంగా కలిసినప్పటికీ రాజోలు నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని దాదాపుగా ఆయన అభ్యర్థిత్వం ఖాయమైనట్టు రాపాక అభిమానులు తెలిపారు. రెండు రోజుల క్రితం జిల్లాకు చెందిన ఒక కీలక నేత జనసేన శ్రేణులకు మీరంతా వెళ్లి రాపాకను కలిసి పార్టీలోకి ఆహ్వానించమని సలహా ఇవ్వడం జరిగింది.
 
అదేవిధంగా జనసేన నాయకులు వివిధ గ్రామాల నుంచి చింతలమోరి వెళ్లి రాపాకను కలిశారు. అయితే రాపాక రెండు రోజులు గడువు కోరడం, తదుపరి పవన్‌కల్యాణ్‌తో అపాయింట్‌మెంట్‌ ఖరారు కావడంతో బుధవారం హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా త్వరలో పార్టీలో చేరతారని రాపాక అభిమానులు వెల్లడించారు. పవన్‌కల్యాణ్‌ను రాపాకతో కలిసినవారిలో మలికిపురానికి చెందిన కేఎస్‌ఎన్‌ రాజు తదితరులున్నారు. రాపాకతో తమ గెలుపు ఖాయమంటూ జనసేన శ్రేణులు మంచి ఉత్సాహంగా ఉన్నారు.
 

Advertisement

Link to comment
Share on other sites

జిల్లాలో 16 సీట్లు గెలుస్తాం.. పవన్‌ను సీఎం చేస్తాం’
13-09-2018 11:52:12
 
636724363337411687.jpg
మండపేట, తూ.గో.: జనసేన పార్టీ జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో జనసేన అధినేత వపన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావటం ఖాయమని జనసేన జిల్లా కోఆర్డినేటర్‌ మేడా గురుదత్తప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. మండపేట నియెజకవర్గ సమన్వయకమిటీ సమావేశం బుధవారం స్థానిక లయన్స్‌క్లబ్‌ సమావేశ మందిరంలో జరిగింది. నియెజకవర్గ పరీశీలకుడు పిల్లా సత్యనారాయణ మర్రెడ్డి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో గురుదత్తప్రసాద్‌ కార్యకర్తలకు దిశానిర్దేశాలు చేశారు. పవన్‌కళ్యాణ్‌ ప్రజల కోసం తన సినీ జీవితాన్ని వదులకుని రాజకీయ రంగప్రవేశం చేసి ప్రశ్నించటం ద్వారా అనేక సమస్యలను పరిష్కరించగలిగారని, ఆయన స్పూర్తితో నేటి యువత జనసేనకు ఆకర్షితులవుతున్నారన్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 11 నియెజకవర్గాల్లో తాను సమన్వయకమి టీల సమావేశాల్లో పాల్గొన్నానని గురదత్త ప్రసాద్‌ తెలిపారు. మరో నాయకుడు డేవిడ్‌ మాట్లాడుతూ సమాజంలో అన్నివర్గాల అభ్యున్నతిని కోరుకునే వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అని ఆయనను నేడు మనమంతా కులమతాలకు అతీతంగా బలపరచాల్సిన అవసరం ఉందన్నారు.
 
పిరమిడ్‌ పార్టీ నాయకుడు నల్లమిల్లి విజభాస్కరరెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పుకోసం నైతికత వున్న వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని పవన్‌కళ్యాణ్‌కు తమ పార్టీ తరపున మద్దతు ప్రకటించారు. జనసేన నాయకుడు పిల్లా సత్యనారాయణ మాట్లాడుతూ మండపేట నియెకవర్గంలో జనసేన జెండాను ఎగరేస్తామన్నారు. మరోనాయకుడు మర్రెడ్డి శ్రీనువాస్‌ మాట్లాడుతూ జనసేన కులమతాలకు అతీతమైన పార్టీఅన్నారు. సమాజంలో అన్నివర్గాలకు సమప్రాధాన్యం ఇవ్వటమే జనసేన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో తొలి సీటు బీసీలకు కేటాయించిన పవన్‌కు సభలో నాయకులు ధన్యవాదాలు తెలి పారు. అన్నివర్గాలకు న్యాయం చేయ్యటమే జనసేన లక్ష్మమన్న మెనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకువెళ్లటం ద్వారా జనసేనను గెలిపించాలని నాయకులు కోరారు. సమావేశంలో జనసేన నాయకులు సంగిత సాయిగుణరంజన్‌, గింజాల శ్రీనివాస్‌, .పార్థసారథి, గోళ్ల శ్రీను, మండా వీరభద్రరావు, చిక్కాల శ్రీను, గోళ్ల శ్రీను, గంధం సూరిబాబు, పిల్లి పోతురాజు, సలాది లక్ష్మీనారాయణ, అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
 
నవంబర్‌లో జిల్లాకు పవన్‌రాక
నవంబర్‌నెలలో జనసేనాని పవన్‌కళ్యాణ్‌ జిల్లాలో పర్యటించనున్నారని, ఆయన పర్యటనకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ ఖారారు కావలసి వుందని జిల్లా కన్వీనర్‌ గురుదత్తప్రసాద్‌ తెలిపారు. సమావేశంలో మండపేట నియెజకర్గానికి సంబంధించిన అడహక్‌ కమిటీ సభ్యులను గురుదత్తప్రసాద్‌ నియమించారు. కమిటీ ఆధ్వర్యంలో మండల, పట్టణ, గ్రామ, కమిటీలను నియమించనున్నట్లు గురుదత్తప్రసాద్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

నా ఆశ ఆశయంపైనే! సీఎం పదవిపై కాదు
13-09-2018 03:00:29
 
636724044299051820.jpg
  •  దాని కోసం రాజకీయాల్లోకి రాలేదు
  •  వందమంది ఎస్సీ పారిశ్రామికవేత్తలను తయారుచేస్తా: పవన్‌కల్యాణ్‌
  • జనసేనలో చేరిన తూర్పుగోదావరి నేతలు
హైదరాబాద్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘నాయకుడికి దేనిమీదా ఆశ ఉండకూడదు. నా ఆశ ఆశయం మీద ఉంది.. సీఎం పదవిపై కాదు.. సీఎం ఆకాంక్షతో రాజకీయాల్లోకి వస్తే.. వేరుగా ఉండేది’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన కో-కన్వీనర్‌ శెట్టిబత్తుల రాజబాబు నేతృత్వంలో ఆ జిల్లాకు చెందిన నాయకులు బుధవా రం ఇక్కడ మాదాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... ఏమీ ఆశించకుండా రాజకీయాలు చేయాలని చెప్పారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని లారీ టైర్లతో చెప్పులు కుట్టించుకున్న మహానుభానుడు బీఎస్పీ అధ్యక్షుడు కాన్షీరాం తనకు ఆదర్శమన్నారు. అందుకే పార్టీ కోసం విరాళాలను అడగడం లేదని.. ఎవరైనా వాళ్ల ఇష్టంతోనే ఇవ్వాలని చెప్పారు.
 
‘బలమైన నాయకులు లేకపోతే ఆశయాలను ముందుకు తీసుకెళ్లలేం. అందుకే నాయకుల కోసం వేచి చూస్తున్నాను. కులాలను వాడుకుని కొందరు వ్యక్తులు, వాళ్ల కుటుంబాలే ఎదుగుతున్నాయి. ఆ కులాల ప్రజలు మాత్రం ఎదగలేదు. వాళ్లను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు’ అని ఆరోపించారు. ‘నేను ముఖ్యమంత్రిని కావచ్చు... కాకపోవచ్చు. కానీ జనసేన సిద్ధాంతాల కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేస్తాను’ అని స్పష్టం చేశారు. రాజకీయ పోరాటాల ద్వారా అన్ని సమస్యలకూ పరిష్కారం కనుక్కోగలమన్నారు. జనసేనలో చేరిన వారిలో మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, పాకా శ్రీనివాసరావు, మైరెడ్డి గంగాధరరావు, రాయపురెడ్డి చిన్నా, కడియం మాజీ ఎంపీటీసీ గెడ్డం శివరత్నగణపతి తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

పార్టీ మారబోయే నేతలపై దృష్టి ఇంటెలిజెన్స్‌ ఆరా
16-09-2018 12:02:47
 
636726961636544735.jpg
కాకినాడ: ‘‘ఏ పార్టీ అయినా పర్వాలేదు. టికెట్‌ ఇస్తామంటే వెళ్లిపోవడమే మేలు. ఇన్నాళ్లూ ఆ పార్టీలో ఉన్నా ఏమీ పట్టించుకోలేదు. టికెట్‌ ఇవ్వకపోగా, పార్టీలో తగిన ప్రాధాన్యం కూడా ఇవ్వట్లేదు. ఇంకా పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ఏంటి లాభం..?’’ ఇదీ జిల్లాలో ప్రధాన పార్టీల్లో పలువురి నేతల యోచనగా కనిపిస్తోంది. పార్టీలు మారబోయే నాయకుల గురించి జిల్లా ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఏ నేత.. ఏ పార్టీ నుంచి, ఏ పార్టీలో చేరాలని దృష్టిసారించారు? ఆ పార్టీలో చేర్చేందుకు ఎవరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు? తదితర అంశాలపై ఇంటెలిజెన్స్‌ దృష్టి కేంద్రీకరించింది. స్టేట్‌ ఇంటెలిజెన్స్‌తోపాటు.. ఐబీ అధికారులు కూడా జంప్‌ జిలానీలపై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ పార్టీల మార్పు ప్రభావం ఎవరికి లాభం? ఏ పార్టీకి మైనస్‌ అవుతుందనేదానిపైనా రాజకీయ విశ్లేషకులతోపాటు.. ఇంటెలిజెన్స్‌ విభాగం కూడా లెక్కలు వేస్తోంది.
 
2014 ఎన్నికల నుంచి ఇటీవల వరకు జిల్లాలో టీడీపీ, వైసీపీలే ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇటీవల జనసేన చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవ్వడంతో జిల్లాలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎక్కువగా వైసీపీ నుంచీ, కాంగ్రెస్‌ నుంచీ జనసేనలోకి చేరికలు జరుగుతున్నాయి. గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయినవారు, టికెట్‌ కోసం ప్రయత్నించి విఫలమైనవారు, ఈ దఫా టికెట్‌ దక్కదని భావిస్తున్న వారు వైసీపీ నుంచి జనసేనలోకి క్యూకట్టారు. వాస్తవానికి జిల్లాలో 2009 నుంచీ పార్టీలు మారే సంస్కృతి ఎక్కువైంది. అప్పట్లో జిల్లాలో టీడీపీ నుంచి ఎక్కువగా కొత్తగా ఆవిర్భవించిన ప్రజారాజ్యంలో చేరారు. ఆ ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ మెజార్టీ సీట్లు గెలుస్తుందంటూ జిల్లాలో రాజకీయ విశ్లేషకులతోపాటు.. పలు సర్వేలతో హడావుడి చేశారు. అయితే ప్రజారాజ్యం రాకతో టీడీపీకి గట్టి దెబ్బపడింది. తర్వాత పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆ శకం ముగిసింది.
 
వాళ్లే ఎక్కువ..
అప్పట్లో ప్రజారాజ్యంలో చేరిన కేడరే ఇప్పుడూ జనసేనలో ఎక్కువగా చేరుతున్నారు. టికెట్లు దక్కనివారు, ఉన్న పార్టీలో గౌరవం లేక వస్తున్నవారే ఎక్కువగా జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలుగా పదవులు చేసిన రాపాక వరప్రసాద్‌, పాముల రాజేశ్వరి, అనిశెట్టి బుల్లబ్బాయ్‌రెడ్డి, వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన గిరిజాల స్వామినాయుడు, కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ చేసి, ఇటీవల వైసీపీలోకి వెళ్లిన కందుల దుర్గేష్‌.. ముత్తా కుటుంబం.. ఇలా పలువురు కాంగ్రెస్‌, వైసీపీల నుంచే జనసేనలో చేరారు. టీడీపీ నుంచి మాత్రం ఇప్పటి వరకు బలమైన నాయకుడెవరూ జనసేనలో చేరలేదు. టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాత్రం జనసేనలో చేరతారని విస్తృతమైన ప్రచారం సాగుతోంది.
 
వేగం పెంచిన ఇంటెలిజెన్స్‌..
జిల్లాలో ఇంటెలిజెన్స్‌ అధికారులు తమ సిబ్బందితో ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలలో ప్రభావం చూపగల నాయకులు ఉన్న పార్టీ నుంచి ఇతర పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారు? పార్టీ మారితే టికెట్‌ వస్తుందన్న గ్యారంటీ ఉందా? లేక ఆ పార్టీకి భవిష్యత్‌ ఉంటుందనుకుంటున్నారా? వాళ్లు ఏమని భావిస్తున్నారు? ఆయా నాయకుల రాజకీయ అంచనాలు ఎలా ఉంటున్నాయి.. వంటి అంశాలపై ఇంటెలిజెన్స్‌ విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఏరోజు ఏ నాయకుడు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి జిల్లా రాజకీయాలలో నెలకొంది. ఒకప్పుడు పార్టీ మారితే జనం, కేడర్‌ ఏమనుకుంటుందోనని కాస్త తడబడే నేతలు సైతం ఇప్పుడు.. ధైర్యంగా, ధీమాగా పార్టీ మారుతున్నట్లు ప్రకటిస్తున్నారు. అన్ని పార్టీలూ ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నట్టుగానే క్షేత్ర స్థాయిలోనూ కనిపిస్తోంది.
Link to comment
Share on other sites

వైసీపీ, టీడీపీ నేతలపై జనసేన దృష్టి
21-09-2018 12:28:55
 
636731297325956228.jpg
కాకినాడ: వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి పూర్తి స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసేందుకు జనసేన ఉవ్విళ్లూరుతోంది. జిల్లాలో ఆ పార్టీ మార్క్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సమర్థులైన నాయకుల కోసం పార్టీ యంత్రాంగం అన్వేషణ ప్రారంభించింది. ఇందులో భాగంగా వైసీపీ, టీడీపీలలో అసంతృప్తి, అసమ్మతి నేతలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఏ పార్టీలో చేరేదీ తన నిర్ణయం ప్రకటిస్తానని అనుచరులతో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం కూడా జనసేనలో చేరతారని రాజమహేంద్రవరంలో ప్రచారం సాగుతోంది.
 
రోశయ్య సీఎంగా ఉన్నపుడు అంతకుముందు కాంగ్రెస్‌ కార్పొరేటర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యానికి కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌ అవకాశం కల్పించారు. ఇటీవల వరకు సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరాలని ఉత్సాహపడ్డారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ని కూడా కలిశారు. ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే రాజమహేంద్రవరం సిటీ వైసీపీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావుతో ఉన్న రాజకీయ వైరం కారణంగా సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరాలన్న నిర్ణయాన్ని చివరి నిమిషంలో మార్చుకున్నారు. ఇపుడు జనసేన వైపు చూపు సారించినట్టు తెలుస్తోంది.
 
జనసేన ఎఫెక్ట్‌ ఎంత?
రాబోయే ఎన్నికలలో జనసేన ప్రభావం జిల్లాలో ఏ మేరకు ఉంటుంది? అనేదానిపై రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల నేతలు దృష్టిసారించారు. 2009లో పీఆర్పీ గెలుపొందిన పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కొత్తపేట అసెంబ్లీలో ఈ దఫా కూడా జనసేన ఎఫెక్ట్‌ ఉంటుందంటున్నారు. ఆ టైమ్‌లో చిరంజీవి సభలకు వచ్చినంత జనం ఇప్పుడు పవన్‌ సభలకు రావడంలేదని, ప్రభావం ఎంత ఉంటుందనేదానిపై ఇప్పుడు ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. తుని, జగ్గంపేట, కాకినాడ సిటీ, రాజానగరం, ముమ్మిడివరం అసెంబ్లీల స్థానాలలోనూ జనసేన చీల్చే ఓట్ల ప్రభావం వల్ల ఏ పార్టీకి నష్టం జరుగుతుంది? ఏ పార్టీకి లాభిస్తుంది? అనేదానిపైనా విశ్లేషణలు సాగుతున్నాయి.
 
ఆ ప్రభావం ఇంకా కొనసాగుతుంది..
జిల్లాలో పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు నలుగురు పెళ్లాలంటూ.. సామర్లకోటలో వ్యక్తిగతంగా చేసిన విమర్శల ప్రభావం ఇంకా కన్పిస్తోంది. జగన్‌ కామెంట్ల తర్వాత చాలామంది వైసీపీ నుంచి జనసేన వైపు మళ్లుతున్నారని ఆ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత వ్యాఖ్యానించారు. టీడీపీపై ఉన్న వ్యతిరేకతతో వైసీపీలోకి వెళ్లామని, ప్రత్యామ్నాయం జనసేన కన్పించడంతో ఇటు వచ్చేశామంటూ కాకినాడకు చెందిన మాజీ మంత్రి కుటుంబీకులు బాహాటంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన చీల్చే ఓట్ల ప్రభావం టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ ఉంటుందని కొందరు, అదేంలేదు.. ఇరుపార్టీలకూ సమానంగానే ఉంటుందని ఇంకొందరు వాదిస్తున్నారు.
 
అసంతృప్తి, అసమ్మతివాదులపై ఫోకస్‌
వైసీపీ, టీడీపీల్లో ఉన్న అసంతృప్తి, అసమ్మతివాదులపై జనసేన దృష్టి సారించింది. ఇప్పుడిప్పుడే ఆయా నేతల అభిప్రాయాలను తెలుసుకుంటూ పార్టీ ముఖ్యులు మారిశెట్టి రాఘవయ్య తదితరులకు సమాచారం చేరవేసే పనిలో జనసేన టీమ్‌ బిజీగా ఉంది. టీడీపీలో టికెట్‌ ఇస్తామని ఇప్పుడు ఎటూ తేల్చడం లేదని భావిస్తున్న ఒక నేత పార్టీలో చేరితే పెద్దాపురం నుంచి టికెట్‌ ఆఫర్‌ చేసినట్టు సమాచారం. మండపేటలో వైసీపీలో ముసలం నెలకొంది. ఆ పార్టీ కోఆర్డినేటర్‌కి టికెట్‌ రాని పక్షంలో జన సేనలోకి వచ్చే ఛాన్స్‌ ఉందన్న ప్రచారం జోరుగా నడుస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...