Jump to content

East Godavari Politics

Recommended Posts

వైసీపీ నుంచి జగ్గిరెడ్డికి ఇస్తారో లేదో..?
16-07-2018 12:42:36
 
636673417569167070.jpg
  • ఆది నుంచి వర్గపోరే..
  • కొత్తపేటలో బండారు, చిర్ల మధ్య ప్రధాన పోటీ
  • టీడీపీ టిక్కెట్‌కు ఆశావహుల పోటీ లేనట్లే.. సత్యానందరావుకే దక్కే అవకాశం
  • వైసీపీ నుంచి జగ్గిరెడ్డికి ఇస్తారో లేదో..?
  • జనసేన తరఫున ఇద్దరు ఆశావహులు
కొత్తపేట(తూర్పుగోదావరి జిల్లా): కొత్తపేట నియోజకవర్గం ఆది నుంచి వర్గపోరుకు నిలయంగా ఉంది. నియోజకవర్గానికి తొలి శాసనసభ్యుడిగా కళా వెంకట్రావు ఎన్నికయ్యారు. ఆయన హయాంలో కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల మధ్య జరిగిన పోటీ తర్వాత 1962 నుంచి వర్గపోరుగా మారింది. అప్పటినుంచి ఎంఏ సుబ్బరాజు, ముత్యాల సుబ్బారాయుడు మధ్య ఏర్పడిన వర్గపోరు నేటికీ కొనసాగుతోంది. సుబ్బారాయుడు అనంతరం ఆయన వర్గానికి చిర్ల సోమసుందరరెడ్డి, సుబ్బరాజు వర్గానికి బండారు సత్యానందరావులు నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు రెండూ ఈ వర్గాలకు సంబంధించిన నేతలకే అభ్యర్థిత్వాలు కట్టబెడుతున్నాయి.
 
నాలుగు మండలాలు.. వేటికవే ప్రత్యేకం
కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా అవి నాలుగు రకాల ప్రత్యేకతలను చాటుకుంటున్నాయి. కొత్తపేట, ఆలమూరు మండలాల్లో కులాలు ప్రాబల్యం వహిస్తుండగా రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లో స్వాతంత్య్రం ముందునుంచి ఉన్న పెత్తందారీ వర్గాలే ప్రభావం చూపుతున్నాయి. వ్యవసాయరంగంతోపాటు వాణిజ్యపరంగాను ఈప్రాంతం ప్రసిద్ధికెక్కింది.
 
టీడీపీలో బండారుకే అవకాశం
2009 మినహా 1989 నుంచి 2014 వరకు వరుస అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకే మరోసారి టిక్కెట్‌దక్కే అవకా శం ఉంది. గతఎన్నికల్లో ఆయన స్వల్పతేడాతో ఓడిపోయారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన రెడ్డి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీగా, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికలపట్ల ఆసక్తి కనబర్చకపోవడం, బండారును గెలిపించాలని కోరుతుండడంతో పార్టీలో వర్గపోరు లేనట్టే ఉంది.
 
మరోసారి జగ్గిరెడ్డికేనా?
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చిర్ల జగ్గిరెడ్డి పార్టీని అంటిపెట్టుకుని ఉండడం, బలమైన అనుచరవర్గం కలిగి ఉండడంతో మరోసారి ఆయనకే అభ్యర్థిత్వం దక్కుతుందని భావిస్తున్నారు. ఇటీవల కొత్తపేట నియోజకవర్గ పర్యటనలో వైసీపీ అధినేత జగన్‌ జగ్గిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా ప్రకటించకపోవడంతో ఆయన వర్గీయులు ఒకింత అసహనానికి గురయ్యారు. అమలాపురం పార్లమెంటు పరిధిలో కాపు కులస్తుల్లో ఒకరికి వైసీపీ టిక్కెట్‌ ఇవ్వాలని భావిస్తుండడంతో జిల్లాకు చెందిన ప్రముఖ కాపునేత దృష్టి కొత్తపేటపై పడినట్టు చెబుతున్నారు. ఆయన ముఖ్య అనుచరుడు, ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.
 
జనసేన గురి ఇక్కడే..
జిల్లాలో ప్రజారాజ్యంపార్టీ గెలిచిన సీట్లలో కొత్తపేట కూడా ఉంది. దీంతో జనసేన ఈ స్థానంపై గురిపెట్టింది. ఇప్పటికే ఈ పార్టీ తరపున గతంలో గెలిచిన బండారు సత్యానందరావు సోదరుడు శ్రీనివాసరావును పార్టీలోకి తీసుకున్నారు. మరో బలమైన సామాజికవర్గానికి చెందిన బండి రాధమ్మను కూడా తీసుకున్నారు. వీరిద్దరూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. కాపు యువకులపైనే జనసేన ఎక్కువగా గురిపెట్టింది. కాంగ్రెస్‌, బీజేపీల పాత్ర ఈ నియోజకవర్గంలో అంతంతమాత్రంగానే ఉంది. కాంగ్రెస్‌ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆకుల రామకృష్ణ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు తమనంపూడి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కిసాన్‌మోర్చా సభ్యుడు పాలూరి సత్యానందం అసెంబ్లీ టిక్కెట్‌కై ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు.
Link to comment
Share on other sites

  • Replies 346
  • Created
  • Last Reply
3 hours ago, sonykongara said:

Jaggireddy ki ivvakapothe seat potadi jaggireddy malli gelchela unnadu J's chilcheee kap votes tho 

Link to comment
Share on other sites

పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేకు 2019లో చంద్రబాబు టికెట్ ఇస్తారా..?
17-07-2018 14:06:32
 
636674331934587648.jpg
  • ఇప్పటికి 13 ఎన్నికలు..
  • ముద్రగడ, పర్వత, వరుపుల కుటుంబాలదే పాలన
  • ఈసారి త్రిముఖ పోటీ
  • టీడీపీ టిక్కెట్‌పై సందిగ్ధం.. వరుపుల, పర్వత కుటుంబీకుల్లో ఎవరికో?
  • వైసీపీ నుంచి ఇద్దరు ఆశావహులు
  • జనసేన నుంచి పోటీకి వరుపుల కుటుంబం ఆసక్తి
  • ముద్రగడ ఈసారి పోటీ చేస్తారో.. లేదో?
ప్రత్తిపాడు/తూర్పుగోదావరి: ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ, పర్వత, వరుపుల కుటుంబాలకే నియోజకవర్గ పాలన, పగ్గాలు లభించాయి. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆరుసార్లు ముద్రగడ కుటుంబీకులు, నాలుగుసార్లు పర్వత కుటుంబీకులు, మూడుసార్లు వరుపుల కుటుంబీకులు విజయం సాధించారు.
 
వరుపులకే ఇస్తారా..?
2014లో వైసీపీ అభ్యర్థిగా వరుపుల సుబ్బారావు, అప్పటి టీడీపీ అభ్యర్థి పర్వత చిట్టిబాబుపై 3,413 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రెండేళ్ల తర్వాత పర్వత చిట్టిబాబు హఠాన్మరణం చెందారు. కొన్నాళ్లకు వరుపుల టీడీపీలో చేరారు. దీంతో ఎమ్మెల్యే వరుపుల, పర్వత చిట్టిబాబు వర్గీయులు రెండేళ్లుగా కలిసి పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన వరుపుల సుబ్బారావు రాబోయే ఎన్నికల్లో కూడా మూడోసారి ఎమ్మెల్యేగా నెగ్గాలని పట్టుదలతో ఉన్నారు. 76ఏళ్ల వయసు మీదపడినప్పటికీ ఆయన నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో చలాకీగా పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయనకు టీడీపీ అధిష్ఠానంవద్ద ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. దీంతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బరిలో టీడీ పీ టికెట్టు వరుపులకే లభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
 
టీడీపీలో ఆశావాహులు
టీడీపీ అభ్యర్థిగా వరుపుల సుబ్బారావే 2019 ఎన్నికల బరి లో నిలుస్తారనే వాదన గట్టిగా వినిపిస్తున్నా ఆ పార్టీలో టికెట్టు ఆశించే ఆశావాహులు కూడా ఉ న్నారు. ఎమ్మెల్యే వరుపుల మనవడు, డీసీసీబీ చైర్మన్‌ వరుపు ల రాజా కూడా టిక్కెట్టు రేస్‌లో ఉన్నారనే ప్రచారం ఉంది. ఎమ్మెల్యే వరుపులతో రాజా కలిసికట్టుగానే నియోజకవర్గంలో పర్యటిస్తున్నా టిక్కెట్‌ వ్యవహారంపై గుంభనంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు తన తండ్రి పేరున వరుపుల తమ్మారావు ఫౌండేషన్‌ స్థాపించి వైద్యశిబిరాలు, జాబ్‌మేళాలు, లైసెన్స్‌ మేళాలు వంటివి నిర్వహిస్తూ సేవా కార్యక్రమాల్లో పా ల్గొంటున్నారు. నియోజకవర్గ కేడర్‌తోను సత్సంబంధాలు పెం పుదల చేసుకోవడం వంటి వాటితో వరుపుల రాజా బిజీగా ఉండడంతో ఆయన అనుచరులు ఈసారి టీడీ పీ టిక్కెట్‌పై రాజా పోటీ చేస్తారనే ఆశాభావంతో ఉ న్నారు. దివంగత పర్వత చిట్టిబాబు కుటుంబీకులు కూడా టీడీపీ టిక్కెట్టు సా ధించే ప్రయత్నంలో ఉన్నారు. పర్వత రాజుబాబు, ఆయన స తీమణి జానకిదేవి, మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వచ్చారు. పర్వత కుటుంబానికి అన్యాయం జరగదని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్టు నియోజకవర్గంలో ప్రచారం ఉంది.
 
వైసీపీ సీటు ఎవరికో?
నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్‌, బీజే పీ, సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ పార్టీలు ఎన్నికల బరిలో నిలిచి నా ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య పోటీ ఉంటుంది. వైసీపీ నుంచి నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్‌కు టిక్కెట్టు ఖరార య్యే అవకాశాలున్నా యి. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు టిక్కెట్టు ప్రయత్నం లో ఉన్నప్పటికీ సామాజికవర్గ సమీకరణల నే పథ్యంలో పర్వత ప్రసాద్‌కే లభించే అవకాశా లు అధికంగా ఉన్నాయి.
 
చాపకింద నీరులా జనసేన
నియోజకవర్గంలో జనసేన పార్టీ చాపకింద నీరులా ఉంది. ప్రధాన పార్టీలపై అసంతృప్తితో ఉన్నవారు, యువత, పవన్‌ అభిమానులు, కొందరు కాపు సామాజిక వర్గీయులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో జనసేన జెం డా ఆవిష్కరణలు కోలాహలంగా జరిగాయి. ఆ పార్టీ టిక్కెట్టుకోసం వరుపుల కుటుంబానికి చెందిన ఏలేశ్వరం మండల మాజీ అధ్యక్షుడు వరుపుల తమ్మయ్యబాబు గట్టి ప్రయత్నా లు చేస్తున్నారు. జనసేన టికెట్టు ఆశిస్తున్న ఆయన వరుపుల కుటుంబానికి చెందిన వారు కావడం ఆయనకు రేస్‌లో కలిసి వచ్చే అంశంగా మారింది. ఇంకా ఈ టిక్కెట్టు కోసం నియోజకవర్గంలో పలువురు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 
కాంగ్రెస్‌, బీజేపీ, లిబరేషన్ల నుంచి కూడా..
నియోజకవర్గంలో కాంగ్రెస్‌, బీజేపీ, లిబరేషన్‌ పార్టీలు పోటీ చేయనున్నప్పటికీ ఆ పార్టీ తరుపున బరిలో నిలిచేదెవరనేది స్పష్టత లేదు. కాంగ్రెస్‌ తరుపున ఉమ్మిడి వెంకటరావు, ధరణాలకోట శ్రీను ప్రస్తుతం నియోజకవర్గంనుంచి పీసీసీ మెంబర్లుగా పనిచేస్తుండగా వీరిలో ఒకరికి టిక్కెట్టు లభించే అవకాశాలున్నాయి. బీజేపీ తరపున అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడు పింగిలిదేవి సత్తిరాజు, లిబరేషన్‌ తరపున బుగతా బంగార్రాజు అభ్యర్థులుగా తలపడే అవకాశాలున్నాయి.
 
ముద్రగడ పోటీ చేస్తారా..?
ఈ నియోజకవర్గానికి అత్యధికంగా ఆరు విడతలు ఎమ్మెల్యేగా కొనసాగిన ముద్రగడ పద్మనాభం రానున్న ఎన్నికల్లో మళ్లీ నిల్చుంటారా.. లేదా? అనే అంశంపై నియోజకవర్గంలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కేవలం 10వేల ఓట్లు సాధించి ఘోర పరాజయం చవిచూశారు. ఈ నేపథ్యంలో ఆయన రాబోయే ఎన్నికల బరిలో ఉంటారా? లేక తనయుడు ముద్రగడ గిరిని రంగంలోకి దింపుతారా వంటి ప్రశ్నలు నియోజకవర్గ ప్రజల్లో తలెత్తుతున్నాయి.
 
బీసీల నియోజకవర్గం.. బీసీలకే ఇవ్వాలని..
బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు బీసీలకే అవకాశమివ్వాలనే వాదన కూడా వినబడుతోంది. 50శాతం పైబడి నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గానికి ఎప్పుడూ కాపులే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో మార్పుకోసం మహా ఉద్యమం అంటూ కొందరు ఎస్సీ, బీసీ వర్గాలను కలుపుకుని ప్రచారాలు, పర్యటనలు జరిపినా అది కార్యరూపం దాల్చలేదు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు అవకాశమివ్వాలని ఇప్పటికే జిల్లా బీసీ నాయకుడు జిల్లా యాదవ మహాసభ అధ్యక్షుడు కుండల సాయికుమార్‌ యాదవ్‌ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు.
Link to comment
Share on other sites

పోటీ స్థానంపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే గోరంట్ల
17-07-2018 14:24:02
 
636674342434798322.jpg
  • మళ్లీ రూరల్‌ నుంచే పోటీ చేస్తా..
  • పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల
కడియం/రాజమండ్రి: రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని, అభివృద్ధిలో మూడో స్థానంలో నిలిచిన ఈ నియోజకవర్గం నుంచే తిరిగి పోటీ చేస్తానని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. సోమవారం కడియంలో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పరిచానన్నారు. కోట్లాది రూపాయల నిధులతో సీసీరోడ్లు, డ్రైన్లు, చంద్రన్నబాట రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల అభివృద్ధి పనులు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.
 
సీఎం చంద్రబాబునాయుడు కాపుల అభ్యున్నతికి రూ.3,160 కోట్ల రుణాలను అందజేసి కాపుల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. అలానే ముస్లిం ల అభ్యున్నతికి ఎన్నడూ లేని విధంగా రూ.1,350కోట్ల కేటాయించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అన్నారు. రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం దళితులకు రూ.2లక్షల సబ్సిడీతోను, మిగిలిన వర్గాల వారికి రూ.లక్షా 50వేల సబ్సిడీతో ట్రాక్టర్లు అందచేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో అధికారులు, నాయకులు, బూత్‌కమిటీ సభ్యులు, జన్మభూమి కమిటీ సభ్యులు సమన్వయంతో మెలగుతూ గ్రామాభివృద్దికి కృషి చేయాలని ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. అలానే నేటి నుండి గ్రామదర్శిని కార్యక్రమంలో బాగంగా గ్రామంలో ఉన్న సమస్యలు గుర్తించడం, జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం టీడీపీ కేడర్‌పై ఉందన్నారు.
 
రూరల్‌ నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు వెలుగుబంటి నాని, జెడ్పీటీసీ పాలపర్తి రోజా, టీడీపీ నాయకులు అన్నందేవుల చంటి, ప్రత్తిపాటి రామారావుచౌదరి, గుత్తుల హరిప్రసాద్‌, దొంతంశెట్టి వీరభద్రయ్య, గుర్రపు సత్యనారాయణ, వారా రాము, యన్నమని లక్ష్మిపతి, వరగోగుల రుద్రయ్య, రంపం గోపాలకృష్ణ, వరగోగుల వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి వీరశివాజీ, షేక్‌ సిద్దయ్య, పాలపర్తి ప్రకాష్‌కుమార్‌, నేలపూడి కింగ్‌మోజస్‌, మర్రెడ్డి రమేష్‌, పడమటి పట్టాభి, గోరు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

విలక్షణ నియోజకవర్గంలో టీడీపీ మరోసారి జెండా ఎగరవేస్తుందా..?
18-07-2018 11:49:19
 
636675113599922585.jpg
  • పెద్దాపురంలో.. స్థానికేతరులకే పట్టం!
  • టీడీపీ టిక్కెట్‌కు ఆశావహులు లేనట్లే..
  • మళ్లీ పోటీకి హోంమంత్రి రాజప్ప ఆసక్తి
  • వైసీపీ సీటుకోసం ఇద్దరి ప్రయత్నాలు?
  • జనసేన అభ్యర్థిపై కానరాని స్పష్టత
  • ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నియోజకవర్గం
సామర్లకోట, తూ.గో.: ఏడాదికాలంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983, 1985 ఎన్నికలు మినహా తదనంతరం జరిగిన వరుస ఎన్నికల్లో ఆయా పార్టీలకు సంబంధించి స్థానికేతరులకే పట్టం కట్టడం ఈ నియోజకవర్గం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం, సామర్లకోట రెండు మున్సిపాల్టీలు. అత్యధిక మేజర్‌ పంచాయతీలు కలిగిన రెండు మండలాలు కలిగి ఉండడంతో ఇక్కడ ఎన్నికల పోరు టీడీపీ వైసీపీ, జనసేనల మధ్య ప్రతిష్టాత్మకం కానుంది.
 
టీడీపీ టిక్కెట్‌ మళ్లీ రాజప్పకేనా?
సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో గతంలో ఎన్నడూలేని రీతిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేశారు. అమలాపురం ప్రాంతంలోని ఉప్పలగుప్తం మండలానికి చెందిన వారైనప్పటికీ ఆయన రెండేళ్ల కాలంలోనే నియోజకవర్గంలోని అచ్చంపేటలో స్థిర నివాసం ఏర్పరుచుకోవడం, గెలుపొందిన నాటినుంచి పెద్దాపురంలో క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసుకుని ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉంటూ సంక్షేమ ఫలాలు అందరికీ అందించగలిగామ న్న సంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. రాబో యే ఎన్నికల్లో ఆయన ఇక్కడినుంచే పోటీ చే స్తాననే ధీమాతో టీడీపీకే ఓట్లు వేయాలని ఏడాదిగా ప్రచా రం చేస్తున్నారు.
 
తద్వారా టిక్కెట్‌ రేసులో మరెవ్వరూ లేరన్న సంకేతాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లడం విశేషం. మూడు దశాబ్ధాలపాటు రాజప్పకు అత్యంత సన్నిహితుడిగా మెలిగి టీడీపీని వీడి మళ్లీ పార్టీలోకి చేరిన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావును ఆయన దూరం పెట్టడం గమనార్హం. టిక్కెట్‌ రేసులో తనకు పోటీ ఉండకూడదనే ఆయన్ను దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బొడ్డు వర్గీయులు ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సోషల్‌ మీడియాలో హోం మంత్రి రాజప్పపై తరచూ అక్షర యుద్ధాలు చేస్తున్నప్పటికీ హోంమంత్రి వర్గీయులు మౌనంగా వీక్షించడం మినహా స్పందించకపోవడం విశేషం.
 
వైసీపీలో వర్గ పోరు
పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ నేతల పోరు తారా స్థాయికి చేరింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే తోట గోపాలకృష్ణ తనయుడు తోట సుబ్బారావు నాయుడు పొరుగున ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కిర్లంపూడికి చెందిన వారు కాగా ఆయనకు పార్టీ అధినేత జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఆయన వ్యవహార శైలివల్ల వైసీపీలో అసంతృప్తి అధికంగా ఉందని ఆ పార్టీలోనే రెండోవర్గ నాయకులు ప్రచారం చేస్తుండడం గమనార్హం. నియోజకవర్గంలో నాయుడు వర్గం, ఆయన వ్యతిరేక వర్గంగా ఉన్నాయి. మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ గోలి వెంకట అప్పారావు చౌదరి, మాజీ ఎంపీపీ అత్తిలి వెంకట సీతారామస్వామి అసమ్మతి వర్గంగా పేరుగాంచారు. ప్రవాస భారతీయుడు దవులూరి దొరబాబు జగన్‌ సమక్షంలో ఈనెల 21న అచ్చంపేటలో వైసీపీలో చేరుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
 
ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా, ఒక ప్రధాన సామాజికవర్గం నాయకుడిగా పేరుగాంచారు. గతంలో రెండు దఫాల ఎన్నికల్లో సీటు సాధించేందుకు విఫలయత్నం చేశారు. తొలుత ప్రజారాజ్యం పార్టీ టికెట్‌ ఆశించి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించారు. కానీ సీటు గాంధీమోహన్‌కు దక్కడంతో మళ్లీ సాఫ్ట్‌వేర్‌ రంగానికి వెళ్లారు. తదనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున సీటు సాధించేందుకు ఎంతో శ్రమించారు. మున్సిపల్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో ఎంతో ఖర్చు చేసినప్పటికీ చివరి నిమిషంలో టిక్కెట్‌ చినరాజప్పను వరించింది. దీంతో విసుగు చెంది మూడున్నరేళ్లపాటు టీడీపీకి దూరంగా ఉండి అంతర్గంతంగా వైసీపీ, జనసేన నాయకులతో పరిచయాలు పెంచుకుని చివరకు వైసీపీలో చేరి సీటు సాధించేందుకు ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో సీటు ఎవరిని వరిస్తుందనేది ప్రశ్నార్థకంగా ఉంది.
 
జనసేనలో హడావిడి మాత్రమే
పవన్‌కళ్యాణ్‌ స్థాపించిన జనసేనలో పోటీచేసే నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం హడావిడి వాతావరణం అధికమైంది. తమ ప్రాభల్యాన్ని ఫోకస్‌ చేసుకునేందుకు పోటీ కార్యక్రమాల జోరు పెరిగింది. పార్టీ ఆదిలో పెద్దాపురం నియోజకవర్గంనుంచి పోటీ బరిలో ఉంటానని కొన్ని రోజులు హడావిడి చేసిన ప్రముఖ పబ్లిషర్‌ నార్ని రవిప్రసాద్‌ ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడా కానరావడంలేదు. మరోపక్క పెద్దాపురం మండలం సొసైటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న తుమ్మలబాబు సైతం కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వస్తున్నప్పటికీ ఆయన గతంలో టీడీపీలో ఉండడంతో కార్యకర్తలు అధికశాతం వెంబడించలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి.
 
విలక్షణ నియోజకవర్గంగా స్థానం
పెద్దాపురం నియోజకవర్గం జిల్లాలో ఒక విలక్షణమైన ప్రాధాన్యాన్ని సంతరించుకోవడం విశేషం. రోడ్డు, రైలు మా ర్గాలు ఈ నియోజవర్గం మీదుగా ఉండడంతో వ్యవసాయపరంగాను, పారిశ్రామికపరంగాను మాత్రమేకాక వ్యాపారపరంగా నియోజకవర్గం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ రాష్ట్రస్థాయి శిక్షణ కేంద్రాలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, చక్కెర, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు, సిరమికల్‌ టైల్స్‌ ఉత్పత్తి కేంద్రాలతో విరాజిల్లుతూ మరోపక్క ఇత్తడి, అల్యూమిలియం, బియ్యం, సగ్గుబియ్యం, పంచదార, తవుడు, నూనె వ్యాపారాలు సాగుతూ రాష్ట్రస్థాయిలోనే ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది.
Link to comment
Share on other sites

వైసీపీలో ఉత్కంఠ.. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఎందుకా ప్రకటన చేశారు..?
21-07-2018 11:42:16
 
636677701381656091.jpg
  • సామాజిక వర్గాలే.. ఇక్కడ కీలకం
  • టీడీపీ టిక్కెట్‌పై త్రిమూర్తులు దిగుతారా?
  • వైసీపీ సీటుపై వేణు రెడీ?
  • జనసేన అభ్యర్థిపై కానరాని స్పష్టత
  • పోటీకి దూరంగా ఎమ్మెల్సీ బోస్‌తో పాటు తనయుడు
 
రామచంద్రపురం: రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీల ప్రభావం కంటే కుల సామాజిక వర్గాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పార్టీల అభ్యర్ధుల కంటే అత్యధికంగా స్వతంత్రులకే ఇక్కడి ప్రజలు పట్టం కట్టడం ద్వారా విలక్షణమైన తీర్పులను ఇస్తూ వర్గ ప్రాబల్యాన్ని పెంచారు. ప్రతీ ఎన్నికలలోను పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొంత గందరగోళం ఏర్పడుతోంది. ప్రస్తుతం ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలకు అభ్యర్ధులు సిద్ధ్దంగానే ఉన్నా ఎన్నికలు దగ్గరపడేకొద్దీ రాజకీయ పరిణామాలు మారతాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నియోజకవర్గంలో రామచంద్రపురం మున్సిపాలిటీ, రామచంద్రపురం రూరల్‌, కె.గంగవరం, కాజులూరు మండలాలు ఉన్నాయి.
 
టీడీపీ టిక్కెట్టుపై త్రిమూర్తులు పోటీ చేస్తారా
అభివృద్ధ్ది, సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నాలుగు సంవత్సరాలుగా ఎన్నడూ లేనంతగా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను చేపట్టి నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యారు. ప్రతీ గ్రామంపైనా పట్టు సాధించడమే కాకుండా అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించి వారిని ఆకట్టుకున్నారనటంలో సందేహం లేదు. ఆయన దగ్గరకు వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు న్యాయం చేయడమే కాకుండా ఆయనను నమ్ముకున్న వ్యక్తులకు వెన్నంటి ఉంటారన్న పేరును పొంది వచ్చే ఎన్నికలలో పోటీకి సిద్ధ్దపడుతున్నారు. ఆయన ఆరుసార్లు పోటీచేసి నాలుగు పర్యాయాలు గెలుపును సొంతం చేసుకున్నారు. గెలుపొందిన నాలుగు పర్యాయాలలో మూడు గుర్తులపై ఆయన గెలవడం గమనార్హం.
 
స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్‌ పార్టీ తరపున మరోసారి రెండుసార్లు తెలుగుదేశం పార్టీ గుర్తుపైన ఆయన గెలుపొందారు. ఈసారి ఏపార్టీ తరపున పోటీ చేస్తారన్న విషయంలో కొంత రాజకీయ వర్గాలలో చర్చకు తెరలేపింది. వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది. రామచంద్రపురం పర్యటన సందర్భంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఇక్కడ అభివృద్ధి జరగలేదని చేసిన విమర్శలను తోట త్రిమూర్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. అవగాహన లేమితో జగన్‌ మాట్లాడుతున్నారని ఎద్ధేవా చేసి ఆపార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారానికి పులుస్టాఫ్‌ పెట్టారు. దీంతో తిరిగి సైకిల్‌ ఎక్కే అవకాశాలే ప్రస్తుతం కనబడుతున్నాయి.
 
వైసీపీ తరఫున వేణు పోటీ..
వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తానుగాని తన కుమారుడుగాని పోటీ చేయడానికి సుముఖంగా లేమని ఇప్పటికే ప్రకటించడంతో ఆపార్టీ నుంచి పోటీ చేయడానికి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఆయన నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమించబడ్డారు. అప్పటి నుంచి అనేక గ్రామాలు, మున్సిపాలిటీలోను పర్యటించి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడంపైన దృష్టిని సారిస్తూ ప్రజలతో సంబంధాలను మెరుగుపరుచుకొనే పనిలో ఉన్నారు. ఆయన నియోజకవర్గేతరుడు కావడంతో ఇక్కడి ప్రజలతో సంబంధాలు తక్కువే. బోస్‌ సహకారంతో పాటు, ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి పర్యటిస్తూ నియోజకవర్గలో పట్టు సాధించాలన్న తపనలో ఉన్నారు.
 
జనసేన వైపు ఇద్దరు
జనసేన పార్టీకి నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు కాకపోయినా విశ్రాంత రైల్వే ఉద్యోగి నారపరెడ్డి పార్ధసారధి పార్టీ ఆవిర్భా వం నుంచి జనసేన బాధ్యతలు తీసుకొని పార్టీ పిలుపునిచ్చే ప్రతీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. యువత ఆపార్టీ వైపు మొగ్గు చూపుతుండటంతో ఆయనకు పార్టీ కేడర్‌ సమస్య లేదు. అలాగే నియోజకవర్గ స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ ఆయన ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కూడా తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న చింతపల్లి అర్జున్‌ కూడా టిక్కెట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామం రామచంద్రపురం మండలం హసన్‌బాద కాగా ప్రస్తుతం కాకినాడలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు.
 
కాంగ్రెస్‌ పార్టీలో...
కాంగ్రెస్‌ పార్టీకి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న జాన్‌విక్టర్‌నందా గత ఎన్నికలలో పోటీ చేశారు. తిరిగి వచ్చే ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి ఆయన సన్నద్ధమవుతూ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

lol .. TT YSRCP aa ??

Link to comment
Share on other sites

జగన్‌ పాదయాత్రకు కీలక నేతలు దూరం.. వైసీపీలో ఏం జరుగుతోంది..?
22-07-2018 11:15:38
 
636678549368050529.jpg
కాకినాడ: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో జిల్లాలో ఒక బలమైన నేతగా గుర్తింపు పొందిన చలమలశెట్టి సునీల్‌ జగన్‌ పాదయాత్రకు దూరంకావడంపై ఆ పార్టీ శ్రేణులలో జోరుగా చర్చ సాగుతోంది. జిల్లా రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సామాజిక వర్గానికి చెందిన సునీల్‌ గత మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కాకినాడలో జగన్‌ పాదయాత్ర సమయానికి సునీల్‌ని రప్పించాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు భావించారు. ఈ మేరకు సునీల్‌ వద్దకు దూతలను పంపినా ప్రయోజనం లేకపోయింది. దీంతో జగన్‌ స్వయంగా రంగంలోకి దిగి.. వైయస్సార్‌ కాంగ్రెస్‌లో ఒకప్పుడు కీలక నేత, మాజీ మంత్రి ఒకరిని సునీల్‌ వద్దకు పంపించారు.
 
అయినా సునీల్‌ని పాదయాత్రకు రాలేదు. ‘కాకినాడ సిటీ కోఆర్డినేటర్‌ అంటే ఆ పరిధిలోనే పెత్తనం చేయాలి. తనకు సంబంధంలేని ఏరియాలో రాజకీయాలు చేస్తే మేమెందుకు? ఈ విషయం పార్టీ అధ్యక్షుడికి చెప్పండి..’ అంటూ తన వద్దకు దూతగా వచ్చిన డెల్టా ప్రాంత నేతకు సునీల్‌ సీరియస్‌గా చెప్పినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని పార్టీ అధినేత జగన్‌ దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. వైసీపీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. ముందు నుంచీ వైఎస్‌ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. దీంతో జగన్‌ సైతం ఆయన్ని వారించలేకపోతున్నారని పార్టీలో చెప్పుకుంటూ ఉంటారు.
 
సునీల్‌కి సామాజికవర్గం దన్ను..
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ లోక్‌సభ కోఆర్డినేటర్‌గా ఉన్న చలమలశెట్టి సునీల్‌.. జిల్లా రాజకీయాలలో ప్రాధాన్యం ఉన్న సామాజిక వర్గం. పార్టీలకు అతీతంగా సునీల్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పారిశ్రామిక కుటుంబానికి చెందిన సునీల్‌కి ఈ జిల్లాలో ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో మంచి పట్టుంది. ఇవన్నీ జగన్‌కి తెలిసినా.. పరోక్షంగా ద్వారంపూడికే సపోర్టు చేస్తున్నట్టు సునీల్‌ వర్గం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్‌ పాదయాత్రకు సునీల్‌ దూరంగా ఉన్నారనే వాదన వినిపిస్తోంది.
 
ముత్తా కుటుంబం కూడా ..
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కాకినాడ సిటీ టిక్కెట్టు ఇస్తామని హామీ ఇచ్చి కోఆర్డినేటర్‌గా నియమించారని.. తర్వాత తప్పించారని అలక చెందిన ముత్తా శశిధర్‌ కూడా జగన్‌ పాదయాత్రకు గైర్హాజరయ్యారు. తొమ్మిది నెలలపాటు వైసీపీ సిటీ స్థానానికి కోఆర్డినేటర్‌ పదవి నిర్వహించిన తనను అర్ధాంతరంగా తప్పించారని కలత చెందారు. కాకినాడ సిటీలో ముత్తా కుటుంబానికి రాజకీయంగా బలమైన నేపథ్యం ఉంది. అంతేకాకుండా నగరంలో రాజకీయాలను ప్రభావితం చేసే బలమైన సామాజిక వర్గానికి చెందిన శశిధర్‌ కూడా పార్టీ కార్యక్రమాలకు నాలుగైదు నెలలుగా దూరంగానే ఉన్నారు. శశిధర్‌తోపాటు.. ఆయన వర్గీయులూ జగన్‌ పాదయాత్రకు వెళ్లలేదు. చలమలశెట్టి సునీల్‌, ముత్తా శశిధర్‌లతోపాటు.. మరికొంతమంది నగర స్థాయి వైయస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు కూడా జగన్‌ పాదయాత్రకు దూరంగా ఉన్నారు. తమ తమ నేతల బాటలోనే తామూ నడుచుకుంటామంటూ సునీల్‌, ముత్తాలకు మద్దతుగా ఉంటూ పాదయాత్రకు దూరంగా ఉన్నారు. ఎవరెవరు పాదయాత్రకు హాజరుకాలేదన్న దానిపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు.
Link to comment
Share on other sites

సీఎం దృష్టికి రాజమహేంద్రవరం వివాదం
23-07-2018 12:15:39
 
636679449383104283.jpg
  • గోరంట్లను కలిసిన కార్పొరేటర్లు
  • నేడు టీడీ పీ కార్పొరేటర్ల సమావేశం
  • ఆదిరెడ్డి, గన్ని హాజరయ్యే అవకాశం
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం మేయర్‌, కార్పొరేటర్‌ల మధ్య ఏర్పడిన విభేదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి చేరాయి. మేయర్‌ పంతం రజనీశేషసా యి మౌనం వహించగా కార్పొరేటర్లు మాత్రం తమ పట్టు విడవకుండా నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. మేయర్‌ను అయినా తీసివేయండి లేదా స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటు చేసి తమ డివిజన్‌ల్లో ప్రతిపాదించిన పనులకైనా ఆమోదం తెలపండని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చొరవ తీసుకుని సోమవా రం సాయంత్రం 4గంటలకు మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆవరణలో ఉన్న గుడా జోనల్‌ కార్యాలయంలో కార్పొరేటర్లతో మీటింగ్‌ ఏర్పాటు చేయనున్నారు.
 
దీనికి హాజరుకావాల్సిందిగా గుడా చైర్మన్‌ గన్నికృష్ణకు ఆహ్వానం అందింది. కానీ రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మా త్రం ఈ విషయం తనకు తెలియదని చెప్పడం విశేషం. సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు రాజమహేంద్రవరం రానున్నారు. ఆయన దృష్టికి ఇప్పటికే ఈ విష యం చేరింది. ఆయన కూడా ఇక్కడ పార్టీ వర్గాలకు కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. డి ప్యూటీ సీఎం చినరాజప్ప ఆదివారం రాజమహేంద్రవరం వచ్చి ముఖ్యనేతలకు కొన్ని సూచనలు చేశారు. సామరస్యంగా సమ స్య పరిష్కారం కావాలని పార్టీకి ఇబ్బంది కలిగించడం మంచిది కాదని సూచించినట్టు తెలిసింది.
 
గోరంట్లను కలిసిన కార్పొరేటర్లు
కొందరు తెలుగుదేశం కార్పొరేటర్లు ఆదివారం ఉదయం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని కలిశారు. మళ్లీ తమ ఆవేదనను ఏకరవు పెట్టారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడు తూ మేయర్‌ను దించేయడం అనేది అధిష్ఠానం తీసుకోవాల్సిన నిర్ణయమని, త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అందరూ కలిసి అభివృద్ధి పనులు చేసి పార్టీ ప్రతిష్టను మరింత పెంచడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. త్వరగానే సమస్య పరిష్కారం అవుతుందని, డివిజన్‌లో ఉన్న పెండింగ్‌ పనులు వివరాలు తనకు రాతపూర్వకంగా ఇస్తే ఆమోదింపచేస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీకి ఇబ్బంది క లిగించే ప్రయత్నాలు చేస్తే అధిష్ఠానం సహించదని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ విషయమంతా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు గోరంట్ల స్పష్టం చేశారు.
 
ఈ వారంలోనే స్టాండింగ్‌ కమిటీ సమావేశం
వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చి ఈ వా రంలోనే స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదించిన పనులకు ఆమోదం తెలిపేలా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు స్టాండింగ్‌ కమిటీకి చేరని రెండు, మూడు పనులను స్టాండింగ్‌ కమిటీ ముందుంచడానికి కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
 
పార్టీ నిర్ణయమే శిరోధార్యం: వర్రే
ప్రస్తుత పరిస్థితుల్లో మేయర్‌ను పదవినుం చి దించడం సాధ్యం కాదని, అందరూ కలిసి వచ్చే ఎన్నికలకు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, పార్టీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని, పైగా ఇది కౌన్సిల్‌ మధ్య ఏర్పడిన గొడవ కాదని, స్టాండింగ్‌ కమిటీ గొడవ కాబట్టి మేయరే పరిష్కారం చూపితే బాగుంటుందని టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ వర్రే శ్రీనివాస్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

టీడీపీ ప్రజాప్రతినిధుల దందాలకు చెక్‌పెట్టే యోచనలో అధిష్టానం
23-07-2018 12:12:25
 
636679447447950276.jpg
  • ప్రజలు చూస్తున్నారు.. బ్రేక్‌లు వేయాలి!
  • కొడుకులు, సోదరుల ఆగడాలపై అధిష్టానం దృష్టి
  • అభివృద్ధి పనులలో పర్సెంటేజీలపై చెడ్డపేరు
  • గ్రామస్థాయి పనుల్లోనూ ఎమ్మెల్యేల ప్రమేయం
కాకినాడ: జిల్లాలో కొంతమంది ప్రజాప్రతినిధులు సంపాదనపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధి పనులపై పెట్టడం లేదంటూ సొంత పార్టీ కేడర్‌ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ఏడాదిలోపే సమయం ఉండటంతో ఇప్పటికైనా ప్రజాప్రతినిధుల, నేతల దందాలకు బ్రేక్‌ వేయాలని టీడీపీ అధిష్టానం కూడా యోచిస్తోంది. ఈ మేరకు జిల్లాలో ఇసుక, గ్రావెల్‌ మైనింగ్‌, ల్యాండ్‌ సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా ఉంటున్న ప్రజాప్రతినిధుల పై పార్టీ కార్యాలయ ప్రతినిధులు ఆరా తీస్తున్నారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఎన్డీయే నుంచి విడిపోయిన తర్వాత జిల్లాలో టీడీపీకి మంచి జోష్‌ వచ్చిందని, అయినా కొందరు ప్రజాప్రతినిధులపై ఉన్న వ్యతిరేకత వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఇటీ వల నిర్వహించినసర్వేలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
 
నియోజకవర్గ స్థాయిలో వచ్చే అభివృద్ధి నిధులతో చేసే పనులలో పర్సెంటేజీలతోపాటు.. గ్రామ, మండల స్థాయిలలో జరిగే పనులలోనూ తమకే పర్సెంటేజీలు ఇవ్వాలంటూ కొంతమంది ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లు, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించడం వల్లే చెడ్డ పేరొచ్చిందని పార్టీ సీనియర్లు గుర్తుచేస్తున్నారు.
 
ఎన్నికల ఖర్చు కోసమే ..
వచ్చే ఎన్నికలలో ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని దీనికోసమే సంపాదనపై దృష్టి పెడుతున్నామని కొంతమంది ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు బాహాటంగానే చెప్తున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి బాగా ఖర్చు పెరుగుతుందని ఆ మేరకు జాగ్రత్తపడేందుకు వెనకాడటంలేదు. కొంతమంది ఎమ్మెల్యేలతోపాటు.. ఎమ్మెల్సీ లు, ఇతర ప్రజాప్రతినిధులదీ ఇదే బాట.
 
పర్సెంటేజీ ఇవ్వకపోతే బ్రేక్‌ పడుతుంది..
రాజమహేంద్రవరం మున్సిపల్‌ పరిధిలో రోడ్డు పనులకు తనకు 3.5 శాతం పర్సెంటేజీ ఇవ్వకపోతే పని చేయడం కుదరదంటూ ఓ ప్రజాప్రతినిధి (ఎమ్మెల్యే కాదు) కాంట్రాక్టరుపై ఒత్తిడి తెచ్చారు. టెండరులో రోడ్డు పని దక్కినా తనతోపాటు.. లోకల్‌ కార్పొరేటర్‌కీ పర్సెంటేజీ ఇవ్వకపోతే పని ఎలా చేస్తావో చూస్తా..? అంటూ సదరు పార్టీమారి వచ్చిన ప్రజాప్రతినిధి బెదిరించడంతో కాంట్రాక్టరు టీడీపీ అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. కోనసీమలో ఓఎన్జీసీ పనికి సంబంధించి ఓ కాంట్రాక్టరుకు, సబ్‌కాంట్రాక్టరుకు మధ్య ఆర్ధికలావాదేవీల విషయంలో వివాదం తలెత్తింది. చేసిన పనికంటే ఎక్కువ సొమ్ము ఇప్పించాలని సబ్‌కాంట్రాక్టరు తరపున ఓ ప్రజాప్రతినిధి సోదరుడు వకాల్తా పుచ్చుకున్నారు. ఇలాంటి వాటిపై పార్టీ కూడా సీరియస్‌గా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
 
ఇసుక అక్రమాలతో చెడ్డపేరు..
ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చినా జిల్లాలో ఇసుక ధరలు పెంచి విక్రయించి పలువురు ఎమ్మెల్యేలు భారీగా ఆర్జించారు. ఈ వ్యవహారంతో పార్టీకి కొంత చెడ్డపేరు వచ్చిందన్న అభిప్రాయం ఉంది. అలాగే మైనింగ్‌ వ్యవహారాలు, ఇతర వ్యాపార భాగస్వామ్యంలో వైసీపీ నేతలతో చేతులు కలపడంపైనా కీలక ప్రజాప్రతినిధులపై పార్టీ కార్యాలయానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. కార్యాలయ ప్రతినిధులు వాటిపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలతోపాటు.. ఎమ్మెల్సీల దందాలపైనా కేడర్‌ నుంచే పలు ఫిర్యాదులు వెళ్లడంతో వారిపైనా పార్టీ దృష్టిసారించింది. తాజాగా ఇసుక నిబంధనలు మార్చినా.. జిల్లాలో ఇసుక అక్రమాలకు బ్రేక్‌పడలేదు. ఇది కూడా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందన్న అభిప్రాయం నెలకొంది.
 
జిల్లాలో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పోస్టులలోనూ మామూళ్లు తీసుకున్నారని వెళ్లిన ఫిర్యాదులపైనా పార్టీ ప్రతినిధులు ఆరా తీశారు. ఒక ఎమ్మెల్సీ ట్రస్టు భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి లే అవుట్‌ వేయించి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.అమలాపురం లోక్‌సభ పరిధిలో జరిగిన ఈ వ్యవహారంపైనా పార్టీ పెద్దలు దృష్టిసారించారు. ఇలాంటి వ్యవహారాలు జిల్లాలో పలుచోట్ల ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు.. వైసీపీ నేతలూ ఇలాంటి దందాలలో ఉన్నట్లు ఇంటిలిజెన్స్‌ వర్గాల నుంచీ ప్రభుత్వానికి నివేదిక వెళ్లినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపైనా దృష్టిసారించి మితిమీరి దందాలు చేస్తున్నవారికి వార్నింగ్‌ ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
Link to comment
Share on other sites

ఏపీలో తక్కువ మంది ఆశావహులు గల విశిష్ట నియోజకవర్గం ఇదేనట
23-07-2018 12:18:10
 
636679450891505581.jpg
  • ఎయిర్‌పోర్ట్‌, ‘నన్నయ’, పురుషోత్తపట్నం, ‘పోలవరం’.. ఇక్కడే
  • ప్రధాన పార్టీల్లో మళ్లీ పాత ముఖాలదే సందడి
  • టీడీపీ నుంచి ఎమ్మెల్యే వెంకటేష్‌
  • జనసేనకు ఎవరో తెలీదు
  • వైసీపీ నుంచి జక్కంపూడి విజయలక్ష్మి లేదా రాజా
రాజమహేంద్రవరం: రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడినప్పటినుంచి టీడీపీ ప్రాతినిధ్యంలోనే ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన రాజానగరం నియోజకవర్గంలో తొలి ఎన్నికలు 2009లో జరిగాయి. అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగుదేశం ప్రాతినిధ్యంలోనే ఈ నియోజకవర్గం ఉంది.
 
టీడీపీ నుంచి మళ్లీ ఆయనే..
రాజకీయాల విషయానికి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ 2009 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కూడా ఆయనే గెలిచారు. 2019 ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీల నుంచి గతంలో పోటీ చేసిన వారే మళ్లీ తెరమీదకు వస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత తెలుగుదేశం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటే్‌షను కాదని ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం టిక్కెట్‌ అడిగే ధైర్యం చేసే నాయకులు పెద్దగా లేరు. లోపాయికారీగా చాలామంది టిక్కెట్‌పై ఆశ పెట్టుకున్నప్పటికీ ఎవరూ ముందుకు వచ్చే అవకాశం కనపడడంలేదు. నియోజకవర్గ పరిధిలో అంతస్థాయికి ఎదిగిన నాయకులు కూడా పెద్దగా కనిపించడం లేదు. కొంతమంది ఉన్నా యాక్టివ్‌ రాజకీయాల్లో లేరు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటే్‌షకే ముచ్చటగా మూడోసారి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఇటీవల పార్టీలో కొందరు అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం చేస్తున్నారు.
 
వైసీపీ సీటు జక్కంపూడి కుటుంబానికే..
వైసీపీ నుంచి జక్కంపూడి రామ్మోహనరావు సతీమణి విజయలక్ష్మి మళ్లీ పోటీ పడే అవకాశం ఉంది. ఆమె పోటీ చేయకపోతే ఆమె తనయుడు జక్కంపూడి రాజా పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి వీరు తప్ప ఇంకెవ్వరూ టిక్కెట్‌ ఆశించే పరిస్థితి కనిపించడం లేదు. మాజీ మంత్రి చిట్టూరి రవీంద్రను వైసీపీ నుంచి పోటీ చేయమని కొందరు అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన ఇంతవరకు ఓకే చెప్పినట్టు లేదు. కనీసం చూద్దాం, చేద్దాం అని కూడా చెప్పినట్టు లేదు. కానీ వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్ర రాజమహేంద్రవరం నుంచి వెళ్లిన తర్వాత నియోజకవర్గంలో జక్కంపూడి విజయలక్ష్మి గానీ, ఆమె తనయుడు కానీ పెద్దగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వెళ్లినా కొందరిని కలిసి రావడం తప్ప అంత యాక్టివ్‌గా కార్యక్రమాలు నిర్వహించడం లేదు. అంతకు ముందు తరచూ ఏదో కార్యక్రమం నిర్వహించే వారు. అయినా జక్కంపూడి కుటుంబాన్ని కాదని జగన్‌ వేరే వాళ్లకు సీటిచ్చే ధైర్యం చేయరనే ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది.
 
అలికిడి లేని జనసేన
జనసేన అలికిడి ఇక్కడ పెద్దగా లేదు. కొంతమేర ఓటర్లు ఉన్నారు. పోటీ చేసే నాయకులు పెద్దగా కనిపించడం లేదు. నరేంద్రపురానికి చెందిన వడ్డీ శ్రీనివా్‌సనాయుడు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన అంకం గోపి తిరిగి పోటీ చేసే అవకాశం ఉంది. కానీ ఏఐసీసీ కార్యవర్గ సభ్యుడు మార్టిన్‌ లూధర్‌ అనే ఎస్సీ వర్గ నేత కూడా ఇక్కడ టిక్కెట్‌ ఆశించడం గమనార్హం. బీసీ వర్గాలకు ఇస్తే అంకం గోపి, ఎస్సీలకు ఇస్తే మార్టిన్‌ లూధర్‌కు టిక్కెట్‌ లభించే అవకాశం ఉంది. బీజేపీ తరుపున ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఏపీఆర్‌ చౌదరి, మోదీ సత్తిబాబు టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఈ నియోజకవర్గంలో ప్రస్తుత నేతను కాదని బయటకు వచ్చి టిక్కెట్‌ ఆశించే నేతలు తక్కువే. బయట నేతలెవరైనా సాహసం చేస్తే చేయవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఇతర పేర్లు ఏమీ వినిపించడం లేదు. టీడీపీ నేత యనమల కృష్ణుడు వియ్యంకుడు బర్ల బాబూరావు తాను కూడా పోటీలో ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక సందర్భంలో కృష్ణుడు దోసకాయలపల్లి వచ్చినప్పుడు మళ్లీ ఇక్కడ పెందుర్తి వెంకటేషే పోటీలో ఉంటారని ప్రకటించడం గమనార్హం.
 
మూడు మండలాలు
నియోజకవర్గ పరిధిలో రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాలున్నాయి. రాజానగరం, కోరుకొండ మండలాల్లో అనేక గ్రామాలు రియల్‌ ఎస్టేట్‌ ద్వారా వెలుగులోకి రాగా సీతానగరం ఇసుక వ్యాపారం ద్వారా ప్రచారంలోకి వచ్చింది. సీతానగరం మండలంలో జరిగిన ఇసుక తవ్వకాల్లో భారీ అవినీతి కూడా జరిగినట్టు ప్రచారం ఉంది. ఇక నియోజకవర్గంలో మెట్టప్రాంతం ఎక్కువ. కానీ గోదావరి ఒడ్డున ఉండడంవల్ల సీతానగరం మండలంలో ఎత్తిపోతల పథకాలతో ఎక్కువ పొలాలు సాగులోకి వచ్చాయి. మిగతా ప్రాంతాల్లో విద్యుత్‌ ఆధారిత వ్యవసాయం ఎక్కువ. ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయా ప్రాంతాల్లో కూడా కొంతమేర సాగు ఉంది. ఖరీఫ్‌ సాగు ఈ ప్రాంతమంతా బాగానే ఉంటుంది. రబీ వచ్చేసరికి బాగా తగ్గిపోతుంది.
 
ఎన్నో ప్రత్యేకతలు
పురుషోత్తపట్నం వంటి ఎత్తిపోతల పథకాలు ఈ నియోజకవర్గంలోనే మొదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టు కూడా ఈ నియోజకవర్గం చివరిలోనే నిర్మిస్తున్నారు. విమానాశ్రయం కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. నన్నయ యూనివర్సిటీ, గైట్‌, జీఎ్‌సఎల్‌ వంటి విద్యా, వైద్య సంస్థలు, పలు ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరంలో భాగంగా ఈ నియోజకవర్గం కూడా అభివృద్ధి పథంలో పయనిస్తోంది.
Link to comment
Share on other sites

ఆమెను దింపాలా వద్దా అన్నది చంద్రబాబే చూసుకుంటారు.. మనకొద్దు!
24-07-2018 11:11:49
 
636680275081775800.jpg
  • అధిష్ఠానం ఆదేశంతో బుజ్జగింపు చర్యలు
  • పట్టు వీడని మేయర్‌
  • రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో తొలగని ప్రతిష్టంభన
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో స్టాండింగ్‌ కమిటీ విషయంలో మేయర్‌, కార్పొరేటర్లకు మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడానికి అధిష్ఠానం నడుం బిగించింది. ఈ నేపథ్యంలో అర్బన్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ సోమవారం సాయంత్రం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని గుడా జోనల్‌ ఆఫీసులోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో టీడీపీ కార్పొరేటర్లతోను, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాస్‌లతో వేరు వేరుగా భేటీ అయ్యారు. కార్పొరేటర్లకు నచ్చచెప్పగలిగారు. కాని మేయర్‌ తాను ప్రతిపాదించిన రెండు పనులు చేస్తేనే స్టాండింగ్‌ కమిటీ నిర్వహిస్తానని వాదననే కొనసాగించడంతో సమస్య మరింత జటిలమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి మేయర్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, కాని ఆమె వినకపోతే ఇక్కడ పరిణామాలను పార్టీ అథిష్టానం ముందు పెట్టి వారి నిర్ణయానికే సమస్య వదిలేస్తామని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఆంధ్రజ్యోతికి తెలిపారు.
 
కార్పొరేటర్లకు బుజ్జగింపు
మొదట కార్పొరేటర్లను ఆదిరెడ్డి, గన్ని బుజ్జగించారు. ఈ సమావేశానికి మేయర్‌ పంతం రజనీ శేషసాయి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబును పిలవలేదు. 24 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. రూరల్‌ నియోజకవర్గం పరిధికి చెందిన 8 మంది కార్పొరేటర్‌లలో ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. కాని ఈ సమావేశంలో కొందరు కార్పొరేటర్ల తరుపున వారి భర్తలు హాజరు కావడం గమనార్హం. సాయంకాలం 5 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి 7 గంటలకు ముగిసింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ కార్పొరేటర్ల వాదనలు విన్నారు. అందరూ గతం నుంచి మేయర్‌ వైఖరి మీద ముఖ్యంగా తమ వార్డులలో పనులు జరగకపోవడం వల్ల ఏకరువు పెట్టారు. ఇక 7, 8 నెలలో ఎన్నికలు రాబోతున్నాయని, ఈ సందర్బంగా పట్టుదలకు పోయి డివిజన్‌లో పనులు జరగకుండా చేయడం వల్ల తామెవ్వరమూ వార్డులో తలెత్తుకు తిరగలేకపోతున్నామని, ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నామని వాపోయారు.
 
ఒక సందర్బంలో.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను పదవుల నుంచి దించేస్తేనే మంచిదని అభిప్రాయానికి వ్యక్తం చేయడంతో పెద్దలైన గన్ని, ఆదిరెడ్డి జోక్యం చేసుకుని దించేయడమనేది మన పరిధిలో పని కాదని, దానికి ఒక విధానం ఉంటుందని, దానిపై నిర్ణయం తీసుకోవలసింది ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని వారు స్పష్టం చేశారు. అందరూ పట్టుదలకు పోతే సమస్య పరిష్కారం కాకపోగా, పార్టీకి ఇబ్బందులు వస్తాయని కూడా వారికి నచ్చచెప్పారు. దీంతో కార్పొరేటర్లు అంతా ముక్తకంఠంతో స్టాండింగ్‌ కమిటీ సమావేశం నిబంధనల ప్రకారం వారం వారం జరగాల్సి ఉండగా మేయర్‌ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని గతంలో కూడా కొన్ని నెలల పాటు స్టాండింగ్‌ కమిటీ ఆమోదించిన పనులపై సంతకాలు చేయలేదని, చివరికి ఎంక్వయిరీ వరకు దారి తీసిన విషయాన్ని గుర్తు చేశారు. మాకు మేయర్‌ పైనా, డిప్యూటీ మేయర్‌ పైన కోపంమేమీ లేదని, అందరం కలసి వార్డులలో అభివృద్ధి పనులు చేయడం ముఖ్యమని వారు స్పష్టం చేశారు.
 
దీనిపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ మాట్లాడుతూ కార్పొరేటర్లు చెప్పినవన్నీ న్యాయమైనవేనని, తాము మేయర్‌తో మాట్లాడి నచ్చచెబుతామని, ఆమె వినకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు కమిషనర్‌కు ఉన్న అధికారాలతో స్టాండింగ్‌ కమిటీ ఆమోదం కోసం ప్రతిపాదించిన పనులన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని ఆమోదింపచేస్తామని హామీ ఇచ్చారు. మేయర్‌ తమ ప్రతిపాదనలు వింటే సమస్య ఉండదని, ఇక ప్రతినెల వారం వారం నిబంధనల ప్రకారం స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు జరుగుతాయని, మేయర్‌ వార్డుల్లోకి వచ్చేముందు కార్పొరేటర్‌లకు సమాచారం అందించేటట్టు చేస్తామని వారు హామీ ఇవ్వడంతో కార్పొరేటర్లందరూ మెత్తబడినట్టు సమాచారం. అంతకు ముందు కార్పొరేటర్‌ సింహా నాగమణి మాట్లాడుతూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో పాటు ముగ్గురు నేతలు కలసి ఉంటే ఏ సమస్యలు ఉండవని చెప్పడంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు జోక్యం చేసుకుని ముగ్గురు కలసి ఉండాలో, ఇద్దరు కలసి ఉండాలో మాకు తెలుసునని, ఇక్కడ సంబంధం లేని విషయాలు ప్రస్తావించవద్దని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
 
ఈ సమావేశంలో కార్పొరేటర్లు, వారి భర్తలు పాల్గొన్నారు. వారిలో కడలి రామకృష్ణ, పితాని లక్ష్మీకుమారి, మజ్జి రాంబాబు, కోరుమిల్లి విజయశేఖర్‌, కోసూరి చండీప్రియ, గగ్గర సూర్యనారాయణ, పాలిక శ్రీను, దంగేటి పార్వతి, కొమ్మా శ్రీనివాసరావు, ఇన్నమూరి రాంబాబు, మళ్ళా నాగలక్ష్మి, రెడ్డి పార్వతి, ద్వారా పార్వతి సుందరి, బెజవాడ రాజ్‌కుమార్‌, కురగంటి ఈశ్వరి, బూరా దుర్గాంజనేయులు, పెనుగొండ రామకృష్ణ, కరగాని భారతి వేణు, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, మర్రి దుర్గాశ్రీనివాస్‌, మళ్లా వెంకట్రాజు, కురగంటి సతీష్‌, కంటిపూడి పద్మావతి, పాలవలస వీరభ్రదం, మజ్జి పద్మ, కో-ఆప్షన్‌ సభ్యులు కప్పల వెలుగు, చాన్‌ భాషా, తదితరులు పాల్గొన్నారు.
 
మేయర్‌తో మరోసారి మాట్లాడతాం 
ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ
కార్పొరేటర్లు చెప్పిన విషయాలన్నీ విన్నామని, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, కార్పొరేటర్ల వాదన న్యాయమైనదేనని వారికి నచ్చచెప్పామని మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాస్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యామని, కాని అక్కడ మేయర్‌ తన వాదనను వినిపించారని, తాను ప్రతిపాదించిన రెండు పనులు చేయాల్సిందేనని చెప్పారని తెలిపారు. మంగళవారం మరోసారి ఆమెతో మాట్లాడి సమస్య పరిష్కారానికి మరోసారి ప్రయత్నిస్తామన్నారు.
 
వినకపోతే అథిష్టానం దృష్టికి తీసుకువెడతామన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కొన్ని పనులకు టెక్నీకల్‌ సమస్యలు ఉంటాయని వాటినే చెయ్యాలని మొండి పట్టు పట్టడం సరికాదన్నారు. స్టాండింగ్‌ కమిటీ తప్పనిసరిగా నిబంధనలు నిర్వహించాలని అలా చేయకపోవడం వల్లే సమస్య తలెత్తిందని, మేయర్‌ను దించేయాలనే ఆలోచన కార్పొరేటర్లకు లేదని కాని పనులు కాకపోవడంతో సంతకాలు సేకరించారని కొందరి వల్ల అది వేరేగా పరిణమించిందని తెలిపారు.
 
తనకు తెలిసిన సమాచారం ప్రకారం వార్డులలో నిర్మించే కమ్యూనిటీ హాల్‌కు సెంట్రల్‌ ఏసీ పెట్టడం సాధ్యం కాదని, పార్కులలో వాకింగ్‌ ట్రాక్‌కు టైల్స్‌ వేయడం కూడా సరికాదని ఆయన అన్నారు. గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ మాట్లాడుతూ కార్పొరేటర్లు చెప్పిన విషయాలన్నీ తాను విన్నానని, అందరినీ ఒప్పించామని, మేయర్‌కు కూడా మరోసారి నచ్చచెబుతామని స్టాండింగ్‌ కమిటీ సక్రమంగా జరగడం లేదని వంద శాతం వాస్తవమన్నారు. ఎన్నికలు దగ్గర పడే సమయంలో పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని అందరూ చూస్తారని ఆయన అన్నారు.
 
కమిషనర్‌తో భేటీ
ప్రస్తుతం ఏర్పడిన సమస్య గురించి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, కమిషనర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీని కలిశారు. మేయర్‌ ప్రతిపాదించిన పనుల విషయాన్ని ప్రస్తావించగా కమిషనర్‌ తన వాదన వినిపించినట్టు తెలిసింది. కాని చివరకు ఈ వారంలోనే స్టాండింగ్‌ కమిటీ తప్పనిసరిగా నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

వంతల రాజేశ్వరి నియోజకవర్గంలో గెలిచి చూపిస్తామంటున్న వైసీపీ!
24-07-2018 11:51:40
 
636680298993366343.jpg
  • ముంపు మండలాలు.. ముంచేది ఎవరినో?
  • విలీన మండలాల కలయికతో అతిపెద్ద నియోజకవర్గంగా రంపచోడవరం
  • సంక్లిష్టంగా మారిన నియోజకవర్గ పునర్విభజన
  • ఎమ్మెల్యే రాజేశ్వరి చేరికతో ధీమాగా టీడీపీ
  • తమ పార్టీ ప్రజల్లో నిలిచిపోయిందంటున్న వైసీపీ
  • క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో జనసేన
  • సీపీఎంకు ముంపు మండలాల్లో మంచి పట్టు
  • గెలుపుపై ప్రధాన పార్టీల్లో సర్వత్రా ఉత్కంఠ
రంపచోడవరం/కాకినాడ: రాష్ట్ర పునర్విభజనతో తెలంగాణ నుంచి తూర్పు మన్యంలోకి విలీనమైన నాలుగు పోలవరం ముంపు మండలాలు ఎవరిని ముంచుతాయోనని ఇప్పటినుంచి ప్రధాన పార్టీల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న రాష్ట్ర పునర్విభజన పరిణామాలతో నాలుగు తెలంగాణ మండలాలు కలవడంతో 11 మండలాల నియోజకవర్గంగా రంపచోడవరం పునర్విభజించారు. కొత్తరూపుతో 2019లో జరగబోయే ఈ ఎన్నికలు రాజకీయ, అధికార యంత్రాంగాలకు సంక్లిష్టంగా మారాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఏడు మండలాలతో తెలుగుదేశానికి కంచుకోటగా నిలిచిన ఈ నియోజకవర్గంలో 2009, 2014 సంవత్సరాల్లో ఆ పార్టీ వైఫల్యాలను చూసినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌, వైసీపీలు ఇక్కడ విజయం సాధించినా నాలుగు విలీన మండలాల్లో 2014 ఎన్నికల్లో సీపీఎం జయకేతనం ఎగురవేసినా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఆయా పార్టీలకు అంతుచిక్కడం లేదు. దీంతో 11 మండలాల్లో తమ పార్టీలను ఎలా మెజారిటీ పథంలో నడిపించాలన్న ఎత్తులు, పైఎత్తులకు ఆయా పార్టీల ఆశావాహులు ఇప్పటినుంచీ మల్లగుల్లాలు పడుతున్నారు.
 
కలవరపరుస్తున్న విలీన మండలాలు
ఏడు మండలాలతో ఉండే రంపచోడవరం నియోజకవర్గంపై ప్రధాన పార్టీల్లో ఒక స్థిరమైన అభిప్రాయం ఉంది. ఆయా పార్టీలు సాగించుకున్న సర్వేలు, విశ్లేషణలతో ఈ నియోజకవర్గం ఎటు ఉంటుందన్నది కూడా వారికి అంచనా ఉంది. నాలుగు మండలాల విలీనం మాత్రం ఆయా పార్టీలను కలవరపరుస్తోంది. ముఖ్యంగా ఆయా పార్టీల నుంచి ఇక్కడ బరిలో నిలవాలని ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమదైన వర్గాలను సమీకరించుకుంటున్నారు. 11 మండలాల్లో ఏఏ మండలాలు ఎటు ఉంటాయో, ఏ మండలాల్లో మెజారిటీ ఎవరికి అధికంగా ఉంటుందో, అన్ని మండలాల్లో వెరసి మెజారిటీ నియోజకవర్గ స్థాయిలో ఎలా ఉంటుందో చెప్పలేని, అంచనా వేయలేని స్థితే ఇక్కడ సంక్లిష్టం. ఈ పరిస్థితిని కూడా ఆయా పార్టీల అధిష్ఠానాలు గుర్తించి ఇప్పటినుంచీ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయా ఆశావాహులను పురిగొల్పుతున్నాయి. ఎవరైతే బలమైన నేతగా అధిష్ఠానాల దృష్టికి చేరతారో వారే ఇక్కడ లీడర్‌. ఇంచుమించుగా టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం అధిష్ఠానాలు ఇదే తరహాలో యోచిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో నేతల కంటే పార్టీల ప్రభావమే క్షేత్రంలో ఉంటుందన్నది సుస్పష్టం. దీంతో పార్టీని బలోపేతం చేసే దిశగానే ప్రస్తుత కార్యక్రమాలు ఉండాలని సంకేతాలను ఇస్తున్నారు.
 
ధీమాగానే టీడీపీ, వైసీపీ
రంపచోడవరం నియోజకవర్గ పునర్విభజనతో మొత్తంగా 11 మండలాలస్థాయిలో తమ బలాబలాలను అంచనా వేసుకోవడం ఆయా పార్టీలకు కత్తిమీద సామే అవుతోంది. ఏడు మండలాల విషయానికి వస్తే ఉండే ధీమా 11 మండలాల విషయంలో ఎవరికీ లేదు. విలీనమైన నాలుగు మండలాలు భద్రాచలం నియోజకవర్గంలో భాగంగా ఉండి 2014 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి సుండం రాజయ్యకు అండగా నిలిచాయి. రంపచోడవరం నియోజకవర్గం విషయానికి వస్తే దేశం కంచుకోటకు బీటలు వేసి 2009 ఎన్నికల్లో సాధించుకున్న విజయాన్ని 2014లో కాంగ్రెస్‌ నిలుపుకోలేకపోయింది. ఇదే విధంగా 2014 ఎన్నికల్లో రంపచోడవరాన్ని కైవసం చేసుకున్న వైసీపీ తన ఎమ్మెల్యే రాజేశ్వరిని నిలుపుకోలేకపోయింది. దీంతో 2014 ఎన్నికల్లో పరాజయం పొందినా రాజేశ్వరి ద్వారా రంపచోడవరానికి తెలుగుదేశం ఎమ్మెల్యేను పొందగలిగింది. కానీ ఈ రెండు పార్టీలు ఏడు మండలాల విషయంలో ఎవరికి వారు ఎంతో ధీమాతోనే ఉన్నారు. రాజేశ్వరి వెళ్లిపోయినా తమ పార్టీ ప్రజల్లో ఉండిపోయిందని, అభ్యర్థితో సంబంధం లేకుండానే పార్టీ తిరిగి విజయం సాధిస్తుందన్నది వైసీపీ నేతల ధీమా! కాగా తెలుగుదేశం కూడా అంతకుమించిన ధీమాతో ఉంది. తమ పార్టీ కూడా ప్రజల్లో బలంగానే ఉందని, పార్టీ కార్యక్రమాలను గతం కంటే మెరుగుపర్చామని, ప్రజల్లో పార్టీ బలం పుంజుకుందని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
సీపీఎం, జనసేన కలిస్తే..
పునర్విభజనతో బలంగా ఉన్న భద్రాచలం నియోజకవర్గం విచ్ఛిన్నం కావడంతో సీపీఎం నేతల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు పట్టు ఉన్న విలీన మండలాలకు తోడు, మునపటి రంపచోడవరం ఏడు మండలాల్లో కూడా పట్టు సాధించడంపై నేతలు దృష్టి సారిస్తున్నా భవిష్యత్తులో చోటు చేసుకునే పొత్తు రాజకీయంతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తీసుకునే నిర్ణయాల మేరకే ఇక్కడ ప్రభావం ఉంటుందని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏడు మండలాలు సీపీఎంకు కొత్త ప్రాంతంగానే చెప్పుకోవాలి. ఏడు మండలాల్లో భద్రాచలం పార్లమెంటు సభ్యుడిగా మిడియం బాబూరావు ఉన్నప్పుడు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లినా తదనంతర కాలంలో సీపీఎం నాయకులు దృష్టి అంతా నాలుగు విలీన మండలాలపైనే ఉంచారు. ఈ విలీన మండలాల్లో ఏకపక్షంగా పూర్తి మెజారిటీగల పట్టు సాధిస్తే ఏడు మండలాల్లో విజయానికి సరిపడ ఓట్లు దక్కుతాయని భావిస్తున్నారు.
 
జనసేన పార్టీకి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు సాగుతున్నాయి. అభ్యర్థిత్వం కోసం కొందరు ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. జనసేన రాష్ట్రస్థాయిలో కొనసాగించే పొత్తుల నేపథ్యంలోనే ఇక్కడ పోటీ అనేది నిర్ధారించబడుతుంది. కమ్యూనిస్టులతోనే పొత్తు ఉండవచ్చునని భావిస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్టులు, జనసేనా జట్టు కడితే విలీన మండలాల్లోను, ఏడు మండలాల్లోను ఆ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని భావిస్తున్నారు. అది ఎలా ఉంటుందన్నది కూడా అంచనాలకు అందడంలేదు. 11 మండలాల రంపచోడవరంపై ఎవరికి వారికి ధీమా ఉన్నప్పటికీ విజయావకాశాలు, అపజయాలు ఎవరిని పట్టుకుంటాయో మాత్రం అంచనా వేయలేని సంక్లిష్టతను పునర్విభజన కల్పించిందన్నది మాత్రం నిజం.
 
Tags : vantala rajeswari, rampachodavaram, East godavari, telugudesam, Janasena, ysrcp
Link to comment
Share on other sites

Kakinada lo atm fakestart dwarampudi gaadi di mottam ycp anta......Sunil jump confirm along with Kaapu other leaders.....Thota.N and sunil are close relatives and will adjust among themselves who gets what.....

Sunil valla anna GREENKO ki 2 billion dolalrs solar project vachindi AP lo.

Link to comment
Share on other sites

కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి ఫిక్స్.. మరి టీడీపీ నుంచి ఎవరో..!?
30-07-2018 14:52:47
 
636685591681581350.jpg
  • కాకినాడ రూరల్‌.. ఎవరో రూలర్‌..!
  • టీడీపీలో నలుగురు ఆశావహులు
  • అభ్యర్థి ఎవరో తెలియని జనసేన
  • త్రిముఖ పోటీకి అవకాశం
కాకినాడ : కాకినాడ బీచ్‌, పెద్ద పెద్ద పరిశ్రమలు, భవన్నారాయణస్వామి ఆలయం వంటి ప్రత్యేకతలతో కాకినాడ నియోజకవర్గం ప్రత్యేకమైనది. పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. కాకినాడ రూరల్‌, కరప మండలాలతోపాటు కార్పొరేషన్‌కు చెందిన ఆరు డివిజన్లతో కలిపి రూరల్‌ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. తొలిసారిగా ఇక్కడినుంచి పీఆర్‌పీ అభ్యర్థి విజయం సాధించగా అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రెండోస్థానంలో నిలిచారు. టీడీపీ మూడో స్థానానికి పరిమితమైంది. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించగా వైసీపీ ద్వితీయం, ఇండిపెండెంట్‌ అభ్యర్థి మూడోస్థానంలో నిలిచారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతోపాటు జనసేన పార్టీల మధ్యే త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
 
ఎమ్మెల్యేతోపాటు మరో ముగ్గురు ఆశావహులు
అధికార టీడీపీకి చెందిన పిల్లి అనంతలక్ష్మి రూరల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటినుంచి నాలుగేళ్లలో నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం, తాగునీటి ప్రాజెక్టులు, బ్రిడ్జిలు, సిమెంట్‌ రోడ్ల నిర్మాణం, సామాజిక భవనాలు, ఇళ్ల పట్టాల పంపిణీ వంటి పనులే తమను ఈసారి గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ‘ఆడపడచుగా వస్తున్నా.. ఆశీర్వదించండి’ అంటూ చేపట్టిన అభివృద్ధి పనులపై ఆమె కరపత్రాలు పంచుతూ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 61,144 ఓట్లు సాధించి 36.98శాతంతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ 52,096 ఓట్లతో 31.51శాతం ఓట్లతో ద్వితీయస్థానం సాధించారు.
 
ఈ దఫా ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపు సాధిస్తామనే ధీమాలో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే భర్త పిల్లి సత్యనారాయణమూర్తి ఈ దఫా ఎలాగైనా తనకే టిక్కెట్‌ అధిష్ఠానం కేటాయిస్తుందనే ధీమాలో ఉన్నారు. ఎమ్మెల్యే భర్త పార్టీలో సీనియర్‌ నేతలను కాదని, కొంతమంది నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుకోని పరిస్థితుల్లో అభ్యర్థి మార్పు జరిగితే తమకే వస్తుందన్న ధీమాతో ఎమ్మెల్యే సామాజికవర్గానికే చెందిన ముగ్గురు నేతలు అధిష్ఠానంవద్ద పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
 
వైసీపీలో ఆయనకే..
వైసీపీనుంచి ఆ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు, రూరల్‌ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బరిలోకి దిగుతున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి 53,494 ఓట్లు సాధించి అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిపై 8,037 ఓట్ల మెజారిటీతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేయకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 43,742 ఓట్లు సాధించి మూడోస్థానానికి పరిమితమయ్యారు. తదనంతరం వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
 
అప్పటినుంచి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ కాకినాడ రూరల్‌ పరిధిలోని కాకినాడ రూరల్‌, కరప మండలాలతోపాటు కార్పొరేషన్‌ పరిధిలోని ఆరు డివిజన్లలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల వరకు వైసీపీకి మంచి పట్టు ఉందన్న అంచనాతో ఉన్న నేతలకు ఆ ఎన్నికల ఫలితాలు షాకివ్వడం, ఆరు డివిజన్లలో అభ్యర్థులు ఓటమి పాలవడంతో గెలుపుపై సందిగ్ధత నెలకొంది. నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరించడంతోపాటు తన గెలుపుపై కన్నబాబుపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలను బుజ్జగిస్తూ వైసీపీలో చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక్కడ కన్నబాబుకే వైసీపీ అభ్యర్థిత్వం ఖరారవ్వడం, పోటీదారులు లేకపోవడంతో అంతా తానై వ్యవహరిస్తూ గెలుపుకోసం వ్యూహాలు రచిస్తున్నారు.
 
అయోమయంలో జనసేన
జనసేన పార్టీ నుంచి పోటీ ఎవరు చేస్తారో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో బీసీ సామాజికవర్గానికి చెందిన ఓటర్ల తర్వాత స్థానంలో కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఉండడంతో ఇక్కడ ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలియని సందిగ్ధంలో ఉన్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు, యువత ఉన్నారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపుపై అడపాదడపా ఆందోళనలు, నిరసనలు చేయడం, సామాజిక కార్యక్రమాలు చేపట్టడం వంటి పనులకే ఆ పార్టీ నేతలు పరిమితమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జనసేన స్థాపించిన తర్వాత నేటి వరకు ఏ ఒక్క పెద్ద నాయకుడు ప్రధాన పార్టీల నుంచి రాకపోవడంతో ద్వితీయశ్రేణి నాయకులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజారాజ్యం స్థాపించి ఆ పార్టీ తరపున పోటీ చేసినప్పుడు అప్పట్లో పెద్ద నాయకులు లేకపోయినా ఆ పార్టీ వ్యక్తి ఎమ్మెల్యేగా నెగ్గడంతో జనసేన పార్టీ నేతలు తమ పార్టీ అభ్యర్థి తప్పకుండా విజయం సాధిస్తారనే ఆశల పల్లకిలో ఉన్నారు.
 
కాంగ్రెస్‌ పోటీకి ఒకరు
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసే వారే కరువయ్యారు. రెండుసార్లు కాంగ్రె్‌సపార్టీ నుంచి జడ్పీటీసీగా పనిచేసిన నులుకుర్తి వెంకటేశ్వరరావు ఈ దఫా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. రాష్ట్ర బీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసుకునే పనిలో ఉన్నారు.
 
నియోజకవర్గ ప్రత్యేకతలు
ఎన్టీఆర్‌ బీచ్‌ కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఉండడంతో ప్రభుత్వం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కోట్లాది నిధులతో బీచ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఎన్‌ఎ్‌ఫసీఎల్‌, కోరమండల్‌ ఎరువుల కర్మాగారాలు ఉన్నాయి. తీరానికి ఆనుకుని పలు ఆయిల్‌ రిఫైనరీ కంపెనీలు ఉన్నాయి. జిల్లా పరిశ్రమల కేంద్రం రమణయ్యపేటలో ఉంది. ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ ఉంది. జిల్లాలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీరాజ్యలక్ష్మి భావనారాయణస్వామి ఆలయం సర్పవరంలో ఉంది. దేశంలోనే ఎత్తైన 116 అడుగుల విగ్రహం రేపూరులో ఉంది.
Link to comment
Share on other sites

టీడీపీలో గుర్తింపు లేదు.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నా’
30-07-2018 14:38:30
 
636685583109649140.jpg
  • వైసీపీలోకి అనుబాబు
పిఠాపురం/కాకినాడ: చేబ్రోలు ఆదర్ష్‌ ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌, వాణిజ్యవేత్త బుర్రా అనుబాబు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పిఠాపురం పట్టణంలోని పాతబస్టాండువద్ద గల ఫంక్షన్‌హాలులో ఆదివారం ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్ప టికే జగన్‌ను కలిసి తన నిర్ణయాన్ని తెలపగా పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. పిఠాపురం మండలం విరవ వద్ద జగన్‌ సమక్షంలో సోమవారం మధ్యాహ్నం 3.30కు పార్టీలో చేరతానని చెప్పారు. తాను టిక్కెట్టు ఆశించి పార్టీలో చేరడంలేదని, సామాన్య కార్యకర్తగానే చేరుతున్నట్లు తెలిపారు.
 
సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామని ఇప్పటికే జగన్‌ చెప్పిన విషయాన్ని గర్తుచేశారు. తన తండ్రి బుర్రా శ్రీఆంజనేయకామరాజు టీడీపీలో ఉంటూ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారని, తాను ఇటీవల వరకూ టీడీపీలోనే ఉన్నానని తెలిపారు. టీడీపీలో గుర్తింపులేకపోవడంతో ఆ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. జగన్‌ ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా కలసి పార్టీ విజయానికి పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో ఏలేరు నీటి సంఘం మాజీ అధ్యక్షుడు పేకేటి బాబు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయనకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
31-07-2018 15:11:42
 
636686467031391341.jpg
  • వచ్చే ఎన్నికలలో పోటీపై విశ్రాంత అధికారుల కన్ను
  • కోనసీమలో వైసీపీ తరపున రిటైర్డ్‌ ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ ఆసక్తి
  • టీడీపీ కాకినాడ రూరల్‌ సీటు కోసం ఎన్‌ఆర్‌ఐ పోటీ
  • గన్నవరం వైసీపీ కోసం రిటైర్డ్‌ ఇంజనీర్‌ చూపు
కాకినాడ: 2019 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ల కోసం పలువురు రిటైర్డ్‌ అధికారులు, రిటైర్డ్‌ జడ్జిలు దృష్టిసారించారు. ముఖ్యంగా కోనసీమలో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు విశ్రాంత అధికారులు ఇప్పటి నుంచీ సీటు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉండి.. సీటు ఖాయమైతే వీఆర్‌ఎస్‌ తీసుకుని ఎన్నికల బరిలోకి దిగుదామని మరికొంతమంది వెయిట్‌ చేస్తున్నారు. విదేశాలలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఇంకొందరూ ఆయా పార్టీలు అవకాశం కల్పిస్తే ఎన్నికల బరిలోకి దిగాలని తహతహలాడుతున్నారు.
 
అమలాపురం లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు రిటైర్డ్‌ ఐపీఎస్‌.. సుందర కుమార్‌ దాస్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కోనసీమకు చెందిన రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి మనుమడు.. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఐఆర్‌ఎస్‌ అధికారి వీఆర్‌ఎస్‌ తీసుకుని పోటీచేస్తానని వైసీపీ తరఫున ముందు కొచ్చినట్లు సమాచారం. గత 2014 ఎన్నికలలో ఐఆర్‌ఎస్‌ అధికారి పండుల రవీంద్రబాబు ఉద్యోగానికి రాజీనామా చేసి అమలాపురం లోక్‌సభ నుంచి టీడీపీ టికెట్‌పై పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. అమలాపురం అసెంబ్లీ నుంచి జెడ్పీ మాజీ సీఈవో గొల్ల బాబూరావు, రాజోలు అసెంబ్లీ నుంచి బొంతు రాజేశ్వరరావు వైసీపీ తరపున పోటీచేసి ఓటమి పాలయ్యారు. రాజోలు వైసీపీ టికెట్‌ మళ్లీ తనకేనంటూ బొంతు రాజేశ్వరరావు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. గన్నవరం అసెంబ్లీ సీటు కోసం రిటైర్డ్‌ ఇంజనీర్‌ వి. వేణుగోపాలరావు ఈదఫా సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. 2014లోనూ వేణుగోపాల్‌ సీటు చివరి నిమిషంలో మార్చారు. రంపచోడవరం అసెంబ్లీ నుంచి టీడీపీ తరపున జెడ్పీ మాజీసీఈవో ఒకరు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అతనిపై విధులలో ఉండగా ఏసీబీ కేసులు ఉండటంతో టీడీపీ టికెట్‌ వస్తుందో? లేదోనన్నది సందిగ్దమే. జనసేన నుంచి పోటీచేసేందుకు పిఠాపురం నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్‌ అధికారి ఒకరు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
 
కాకినాడ రూరల్‌ నుంచి..
కాకినాడ రూరల్‌లో తెలుగుదేశం తరపున టికెట్‌ కోసం బలమైన నేపథ్యం ఉన్న ఎన్‌ఆర్‌ఐ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సదరు ఎన్‌ఆర్‌ఐ ఆర్ధికంగా, మేథోపరంగా బలమైన నేపథ్యం ఉండటంతో సీటు ఖాయమంటూ ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం ఏడాది, రెండేళ్లుగా ఇద్దరు, ముగ్గురు ఎన్‌ఆర్‌ఐలు కాకినాడ రూరల్‌ సీటు కోసం ఆశపడుతున్నవారూ ఉన్నారు. కొత్తగా బలమైన అభ్యర్ధి పోటీకి సిద్ధమంటూ అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ, టీడీపీ, జనసేనల నుంచి వచ్చే ఎన్నికలలో టికెట్ల కోసం రిటైర్డ్‌ అధికారులు, ఎన్‌ఆర్‌ఐలు దృష్టిపెట్టడం జిల్లా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది
Link to comment
Share on other sites

జగన్ వ్యాఖ్యలపై తూర్పుగోదావరి జిల్లా నేతలు ఏమంటున్నారంటే..
31-07-2018 14:47:55
 
636686452758692928.jpg
తూర్పుగోదావరి జిల్లాలో మాటలు మంటలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాపు రిజ్వరేషన్లకు సంబంధించి జగన్‌ వ్యాఖ్యలపై కాపు సామాజికవర్గీయులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వివిధ పార్టీల నాయకులు కూడా జగన్‌ స్వరం మార్చడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రిజర్వేషన్‌ అంశం కేంద్రం పరిధి అయితే విభజన హామీలు ఎలా సాధిస్తామంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై వివిధ పార్టీలు, కాపు ఉద్యమ నేతలు, ప్రజల అభిప్రాయాలు.. ఈ వారం వర్తమానంలో..
 
వైఎస్‌ హయాం నుంచి కాపులకు ద్రోహం
అమలాపురం: గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి మోసం చేశారు. ఇండియన్‌ ఎకనామిక్స్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూట్‌ సంస్థ ద్వారా కాపుల స్థితిగతులపై సర్వేకు నాడు వైఎస్‌ రూ.45లక్షలు విడుదల చేయలేకపోయారు. నేడు వైసీపీ అధినేత జగన్‌ కాపుల ఓట్లు అవసరం లేదన్న తీరుతో వ్యవహరిస్తున్నారు. కాపుల బీసీ రిజర్వేషన్‌ ప్రక్రియను అడ్డుకునేవిధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి భవిష్యత్‌ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.జగన్‌కు కాపులంతా బుద్ధిచెప్పడం ఖాయం. - నల్లా విష్ణుమూర్తి, కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకుడు, అమలాపురం
 
జగన్‌ వాస్తవమే మాట్లాడారు
పిఠాపురం: కాపు రిజర్వేషన్లకు సంబంధించి వైసీపీ అధినే త జగన్‌ వాస్తవాలే మాట్లాడారు. ఇప్పటికే కాపు రిజర్వేషన్ల విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినందున రాష్ట్ర పరిధిలో లేదని మాత్రమే చెప్పారు. తమ పరిధిలో ఉండే అధిక మొత్తంలో నిధులను కాపులకు కేటాయిస్తానన్నారు. జగన్‌కాపులను కించపరచలేదు. కొందరు కావాలనే ఆయన చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు.-మాజీ మంత్రి, వైసీపీ నేత కొప్పన మోహనరావు.
 
రిజర్వేషన్‌లకు వ్యతిరేకమని జగన్‌ అనలేదు
రాజమహేంద్రవరం: కాపు రిజర్వేషన్‌లకు వ్యతిరేకమని జగన్‌ అనలేదు. ఆ అంశం రాష్ట్ర పరిధి కాదని, కేంద్రం పరిధిలోనిది అని మాత్రమేనన్నారు.కేంద్రంలో నాలుగేళ్లపాటు కలిసిఉన్న చంద్రబాబు తనకు శక్తి ఉన్నా చేయలేదని మాత్రం చెప్పారు. జగన్‌పై మాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. కాపుల చిరకాల కోరిక తీర్చాలనే విషయాన్ని మా నాయకుడి దృష్టికి తీసుకువెళ్తాం. -జక్కంపూడి రాజా, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు.
 
జగన్‌ మాటలు వక్రీకరిస్తున్నారు
సామర్లకోట: కాపుల రిజర్వేషన్లపై మా అధినేత జగన్‌ ప్రసంగాన్ని కొన్ని పార్టీల నాయకులు వక్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ అధికారంలోకి వస్తే కాపులకు అన్ని విధాలా మేలు కల్పిస్తామని జగన్‌ ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. ప్రస్తుత వాస్తవ పరిస్థితులపై పేర్కొన్న మాటలను తప్పుదోవ పట్టేలా ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాపులను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రూ.5వేలకోట్లు కేటాయిస్తామని ప్రకటించడం తెలిసిందే. పార్టీలో వర్గాలను పోషించే సంస్కృతి మా నాయకుడికి లేదు. - తోట సుబ్బారావునాయుడు, వైసీపీ పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి
 
 జగన్‌కు గుణపాఠం చెబుతాం
సర్పవరం జంక్షన్‌: కాపు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు, కేంద్ర పరిఽధిలో ఉంది. సుప్రీంకోర్టు 50శాతం దాటితే అంగీకరించదంటూ జగన్‌ ప్రసంగం రాష్ట్రంలో ఉన్న 1.10 కోటిమంది కాపుల మనోభావాలను దెబ్బతీసింది. కాపులకు 1966 వరకు కొనసాగిన రిజర్వేషన్లను అమలు చేయాలని కో రాం. వైసీపీని ఏనాడు రిజర్వేషన్‌ కల్పించమని కాపు జేఏసీ కోరలేదు. తునిసభ తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టి పూర్వం కాపులకు కల్పించిన రిజర్వేషన్‌పై మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని డి మాండ్‌ చేసిన విషయం మరచిపోకూడదు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్‌, పోర్ట్‌, ఉక్కు ఫాక్టరీ వంటి కేంద్ర పరిధిలోని వాటిపై పార్లమెంట్‌ , బయటా మాట్లాడుతూ, ఎంపీలతో రాజీనామా చేయించిన జగన్‌ ఇప్పుడు రిజర్వేషన్‌ కేంద్ర పరిధిలోనిది, రాష్ట్ర పరిధికాదంటూ యూటర్న్‌ తీసుకున్నారు. జగన్‌ సీఎం కుమారుడిగా ఎదిగారు తప్ప ప్రతిపక్ష నేతగా అపరిపక్వస్థితిలో ఉన్నారు. - ఏసుదాసు, కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌
 
జగన్‌ యూటర్న్‌ తీసుకోవడం బాధాకరం
రావులపాలెం రూరల్‌: వైసీపీ అధినేత జగన్‌ గతంలో కాపు రిజర్వేషన్‌లకు మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కాపు రిజర్వేషన్‌ రాష్ట్ర పరిధిలోనిది కాదనడం యావత్తు కాపు జాతిని అవమానపర్చినట్టుగా ఉంది. ఇది చాలా బాధాకరం. కాపు జేఏసీ నాయకుల ఉద్యమాలు, అరెస్ట్‌లు జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీనిచ్చారు, ఆ హామీ నెరవేర్చాలని డిమాండ్‌ చేసిన జగన్‌ యూటర్న్‌ తీసుకోవడం ఏంటి. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాలు కేంద్ర పరిధిలో ఉన్నాయి. ఎంపీలను రాజీనామా చేయించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిన ఆయన కాపు రిజర్వేషన్‌ అంటే సమస్య కాదా? కాపుల హక్కుల కోసం పోరాడరా, నిన్నటి దాకా మద్దతు ఇచ్చిన జగన్‌ నేడు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు. - ఆకుల రామకృష్ణ, కాపు జేఏసీ నాయకుడు
 
జగన్‌ వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యం
సామర్లకోట: రాష్ట్రంలో కాపుల అభివృద్ధికి తొలి నుంచి కృషిచేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే. కాపుల రిజర్వేషన్‌ అంశంపై వైసీపీ అధినేత జగన్‌ వాఖ్యలు అవగాహన రాహిత్యంగా ఉన్నాయి. జగన్‌ చేసిన ప్రకటనను సమర్ధించేందుకు ఆ పార్టీ నాయకుడు కురసాల కన్నబాబు సహా ఏదోదేదో మాట్లాడుతున్నారు. 2004లో జగన్‌ తండ్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో కాపుల సర్వేకోసం రూ.40లక్షలు ఖర్చు మినహా కాపులకు ఒరిగేది ఏమీ లేకపోవడం అందరికి తెలిసిందే. కాపులకు రిజర్వేషన్‌ కల్పించే అంశంపై కమిషన్‌ రిపోర్ట్‌ను వేయడం ద్వారా సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కమిషన్‌ రిపోర్ట్‌ను కేంద్రం త్వరితగతిన ఆమోదించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు దశలవారీ కృషి చేశారు. అనుభవరాహిత్యంవల్లే జగన్‌ పాదయాత్ర ముందుకు సాగలేకపోతోంది. - నిమ్మకాయల చినరాజప్ప, హోంమంత్రి
 
మాటతప్పను.. మడం తిప్పను.. అని డైలాగ్‌లు కాదు..
జగ్గంపేట: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాపులను బీసీలో చేర్చే అంశంపై జగ్గంపేటలో మాట్లాడుతూ నేనేమీ చేయలేననడం సిగ్గుచేటు. మాటతప్పను మడం తిప్పను అని డైలాగ్‌లు చెప్పడం కాదు. ప్రత్యేకహోదాను కేంద్రం మెడలు వంచి తీసుకువస్తాం అంటున్న జగన్‌ కాపు రిజర్వేషన్‌పై పోరాటం చేస్తానని చెప్పుకోకపోవడం విడ్డూరం. ప్రభుత్వం ఇచ్చిన కార్పొరేషన్‌ కంటే రెట్టింపు నిధులు ఇస్తానంటున్నారు. బడ్జెట్‌ ఎలా ఉంటుందో తె లియదు. ఉద్యమం పుట్టిన ప్రాంతంలో కాపులను పాతాళానికి తొక్కుతాననడంతో నిన్ను నమ్ముకున్న కాపుజాతి అయోమయంలో పడ్డారు. నీ ప్రసంగంతో కాపు కులస్థులు ఉనికిని కోల్పోయేలా చేశావు. గతంలో నీ తండ్రి రెండు మతాల మధ్య చిచ్చు రేపేవారు. మీరు కులాల మధ్య చిచ్చు రేపడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నారు. - జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట ఎమ్మెల్యే
 
జగన్‌ కాపు ద్రోహి..
కాకినాడ సిటీ: జగన్‌ కాపు సామాజికవర్గ ద్రోహి. కాపు సామాజికవర్గానికి బీసీ జాబితా రిజర్వేషన్లు కల్పించడంపై ఏమీ చేయలేనని ఆయన ప్రకటించడం ఆయన రాజకీయ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. ఈ ప్రకటనతో ఆ పార్టీలో ఉన్న కాపు సామాజిక నేతలు పునరాలోచించుకోవాలి. సిగ్గుపడాలి. కాపు సామాజిక వర్గానికి కాంగ్రెస్‌, వైసీపీలు ఏమీ చేయలేకపోయాయని స్పష్టమైంది. - కటకంశెట్టి వెంకట సత్యప్రభాకర్‌, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు
 
బీజేపీతో జగన్‌ లాలూచీ బయటపడింది
కాకినాడ సిటీ: కాపు సామాజికవర్గానికి ఏమీ చేయలేనని జగన్‌ చేసిన ప్రకటన ద్వారా బీజేపీతో జగన్‌కు ఉన్న లాలూచీ బయట పడింది. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని చేసిన హామీ చిత్తశుద్ధితో అమలు పరిచారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబుకు కాపులు అనుకూలంగా ఉంటారన్న సాకుతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కావాలనే బిల్లును అడ్డుకున్నారు. దీని వెనక జగన్‌ కుట్రదాగి ఉంది. - నున్న దొరబాబు, కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడు.
 
జగన్‌ కాపులను మోసం చేశారు
కాకినాడ సిటీ: కాపులకు రిజర్వేషన్‌ కల్పించలేనని వైసీపీ అఽధినేత జగన్‌ ప్రకటించడం కాపు సామాజికవర్గాన్ని మోసం చేసినట్లే. గతంలో ఈ అంశాన్ని జగన్‌ మద్దతిచ్చారు. ఇప్పుడేమో చేయలేనంటున్నారు. సీఎం చంద్రబాబు కాపు సామాజికవర్గానికి బీసీ జాబితాలో చేర్చడాన్ని జగన్‌ వ్యతిరేకించడం సమంజసమా జగన్‌కు ఈ విషయంలో రాజకీయ అవగాహన లేదని తెలుస్తోంది. పాదయాత్రలో అనేక హామీలు ఇస్తున్న జగన్‌ వాటికి అయ్యే నిధులు కేంద్ర బడ్డెట్‌ కంటే ఎక్కువే.- ధూళిపూడి వెంకటరమణ, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి
 
అప్పుడు అనుకూలమన్నారు? మరి ఇప్పుడు?
నాగమల్లితోట జంక్షన్‌: మూడేళ్లక్రితం కాపు రిజర్వేషన్ల కోసం అనుకూలంగా మాట్లాడారు. కాపు రిజర్వేషన్లకు వైఎస్‌ఆర్‌సీపీ పాటుపడుతుందన్నారు. ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారు. కాపు రిజర్వేషన్‌ కుదరని పని అంటూ వ్యాఖ్యానించడం సరికాదు. ఎప్పటికప్పుడు తన వైఖరిని మార్చుకోవడం సరైన విధానం కాదు. -జ్యోతుల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు
 
జగన్‌ వాఖ్యలు వైసీపీ పతనానికి నాంది
నాగమల్లిన్‌ జంక్షన్‌: జిల్లాలో జగన్‌ పర్యటన చూస్తుంటే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన ఉంది. కాపు రిజర్వేషన్లపై జగన్‌ వ్యాఖ్యలకు ముందు అదే సామాజికవర్గానికి చెందిన జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చాలా హేయమైన చర్య. రోజురోజుకూ వైసీపీ పతనానికి ఇదే నాంది. నిన్నటివరకు రాష్ట్రంలో ఉన్న వైసీపీ గాలి జగన్‌ తొందరపాటు మాటలతో నీరు గారిపోయింది. ఇదే జిల్లాలో 19 నియోజకవర్గాల్లో కూడా అత్యంత ప్రభావితమైన కాపు సామాజికవర్గం ఓట్లు వైసీపీపై ప్రభావం చూపే అవకాశముంది. ఇదే జగన్‌ తునిలో ముద్రగడ కాపు ఉద్యమానికి మద్దతుగా నిలిచి ఇప్పుడు యుటర్న్‌ తీసుకోవడం ఆంతర్యం ఏంటో ఆయనకే తెలియాలి. - కడలి ఈశ్వరి, జనసేన పార్టీ మహిళా నాయకురాలు
 
హామీలన్నింటినీ అమలు చేయాలి
పెద్దాపురం రూరల్‌: ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ టీడీపీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. మ్యానిఫెస్టోలో కాపు రిజర్వేషన్ల అంశం కూడా ఉంది అని గ్రహించాలి. హక్కులను పోరాటాలు చేయడం ద్వారానే సాధించుకోవచ్చు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసిప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయి. జనసేన పార్టీ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుంది. - తుమ్మల రామస్వామి(బాబు), జనసేన నాయకుడు, పెద్దాపురం
 
జగన్‌ కాపులను కించపరిచాడు
జగ్గంపేట: కాపు రిజర్వేషన్‌ కోసం దశాబ్ధల నుంచి పోరాటం చేస్తుంటే ఉద్యమగడ్డలోకి వచ్చి నీకు స్వతంత్రం ఉందంటూ కాపులను బీసీలోకి చేర్చే అంశం నావద్ద లేదనడం హాస్యాస్పదంగా ఉండడంతోపాటు కాపు కులస్తులను అవమానపరిచిన వ్యక్తి జగన్‌.
- మాదారపు వీరబాబు, వీరవరం, కిర్లంపూడి మండలం
 
బహిరంగంగా మోసగించావు..
జగ్గంపేట: కాపులను ఆనాడు నీ తండ్రి 2004, 2009, సంవత్సరాల్లో బీసీలోకి చేర్చుతానని మోసం చేశారు. నేడు నీవు బహిరంగంగా మోసగించావు. నీవు కూర్చున్న చెట్టు కొమ్మను నీవే నరుకుంటున్నావు జగన్‌. కాపులను మోసపరిచిన నీవు భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకుంటావు. - గోకాడ ప్రసాద్‌, తామరాడ, కిర్లంపూడి మండలం
 
రిజర్వేషన్లతోనే అభివృద్ధి
రిజర్వేషన్ల ద్వారానే కాపులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. విద్య, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. జగన్‌ ప్రకటన అదే మాదిరిగా ఉంది. ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదు. ఒకసారి మరలా ఆలోచించుకోవాలి. రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించాలి. - మర్రి చిట్టాయామ్మ, గృహిణి, గొల్లప్రోలు
 
కాపులను మభ్యపెట్టడానికే..
పెద్దాపురం రూరల్‌: పార్టీలన్నీ కాపులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. జగన్‌ కాపుల రిజర్వేషన్ల కోసం ఏమీ చేయలేను అని చెప్పడం దారుణం. కేంద్రం పరిధిలోని అంశమైనప్పటికీ మా సామాజికవర్గానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యమం చేయడం ద్వారానే ఫలితాలు సాధించుకోవచ్చు. - కోన లోవరాజు, గోరింట, పెద్దాపురం
 
కాపులను పావులుగా వాడుకోవద్దు
సామర్లకోట: కాపులను రాజకీ యపార్టీలు స్వలాభం కోసం పావులుగా వాడుకోవద్దు. కాపులకు మే లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు వాగ్ధానం చేసిన అన్ని పా ర్టీల నాయకులు అధికారంలోకి వచ్చి న తర్వాత చేసిందేమీ లేదు. కాపులకు మేలు చేసే అంశాలను స్పష్టంగా అమలు చేయాల్సిన అవసరం అధికారంలోకి వచ్చే అన్ని పార్టీలపైన ఉంది. - అమజాల వీవీ సూర్యనారాయణ, గొంచాల.
 
లబ్ధి పొందేది రాజకీయ నాయకులే
సామర్లకోట: కాపు రిజర్వేషన్లు పేరిట తరచూ ఐదేళ్లకొకసారి ప్ర జల్లో ప్రచారం చేస్తూ రాజకీయ నాయకులు లబ్ధిపొందుతున్నారు మినహా కాపులకు చేసేదేమిలేదు. మూడు దశాబ్ధాలు పైబడి తాను ఓటుహక్కు వినియోగించుకుంటుండగా నాటి రోజుల నుంచి నేటి వరకు కాపుల్లో అభివృద్ధి చెందిన దాఖలాలు లేకపోవడం విచారకరం. - ఎస్‌.ఫణిశేఖర్‌, ఇంజనీర్‌
 
సాధ్యం కాదు అనడం హాస్యాస్పదం
కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని జగన్‌ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. కాపుల గడ్డ మీద జగన్‌ చేసిన ప్రకటన కాపులను అవమానపరచడమే. మా మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారు. ఇన్నాళ్లు పోరాటానికి మద్దతు తెలిపి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడారో ఆయనే చెప్పాలి. - కొండేపూడి శంకరరావు, కాపు ఐక్య వేదిక, పిఠాపురం
Link to comment
Share on other sites

జగన్ తీరుపై గోదావరి జిల్లాల్లో ఆగ్రహం
01-08-2018 17:43:36
 
636687422172095064.jpg
ఆంధ్రజ్యోతి: మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదనే జగన్.. కాపు రిజర్వేషన్ల అంశంలో ఐదు రోజుల్లోనే ఎందుకు మాట మార్చారు? తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేని మొహమాటం లేకుండా చెప్పిన జగన్... పిఠాపురం వెళ్లేసరికి మద్దతు ఇస్తామని ఎలా చెప్పారు? ఎందుకు చెప్పారు? బీసీల ఆదరణ దక్కలేదనా? కాపు నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతారనా? ఇప్పుడిదే తూర్పుగోదావరి జిల్లాలో హాట్‌టాపిక్‌ అయింది.
 
ఏపీలో కాపు రిజర్వేషన్ అంశం... ఎన్ని ఉద్రిక్తతల్ని రాజేసిందో తెలుసు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం నుంచి ఇంకా నిర్ణయం రాలేదు. కానీ ఇంతలోనే కాపు రిజర్వేషన్ల అంశంపై కాక రేపారు విపక్ష నేత జగన్‌. కాపు రిజర్వేషన్ల డిమాండ్‌తో ఉద్యమానికి పురిటిగడ్డగా నిలిచింది తూర్పుగోదావరి జిల్లా. జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం పోరాడారు. అలాంటి జిల్లాకు, అందునా జగ్గంపేటకొచ్చి మరీ కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని తేల్చేశారు వైసీపీ అధినేత.
 
గత నెల 27న ఈ ప్రకటన చేశాక రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజికవర్గంలో కలకలం రేగింది. జగన్‌ వైఖరేంటో తేటతెల్లమైపోవడంతో... వైసీపీలోని కాపు నేతలు సైతం
నివ్వెరపోయారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అయితే జగన్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్లను సీఎం చంద్రబాబే అమలుచేస్తారని  ధీమా కనబర్చారు. కాపు రిజర్వేషన్ల అంశంలో సెల్ఫ్‌గోల్‌ చేసుకుంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి ప్లస్ అయ్యాయి. డిప్యుటీ సీఎం చినరాజప్ప సహా పలువురు కాపు నేతలు జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. కాపుల్ని జగన్ తీవ్రంగా అవమానించారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. చంద్రబాబు వల్లే కాపు రిజర్వేషన్లు సాధ్యమని అధికారపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
 
అధికారపార్టీ నేతలే కాదు...కాంగ్రెస్‌ నేతలు సైతం జగన్‌పై ధ్వజమెత్తారు. బీసీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లు సాధించే సత్తా తమకే ఉందన్నారు ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్ చాందీ. ఇదే విషయాన్ని జిల్లా కాపుల దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఇటు జనసేన కార్యకర్తలు కూడా జగన్‌పై విరుచుకుపడ్డారు. పెద్దాపురంలో పవన్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలతో జగన్‌పై భగ్గుమన్న జనసేన శ్రేణులు... కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదంటూ విపక్షనేత చేసిన కామెంట్లతో మరింతగా మండిపడ్డారు.
 
పలు పార్టీల నేతలు... జగన్‌పై ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే.. తూర్పుగోదావరి జిల్లాలోని మధ్యతరగతి కాపు వర్గీయుల ఆలోచనలు మరొక అడుగు ముందుకే సాగుతున్నాయి. కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరిలో తలో స్టాండ్‌ తీసుకున్న జగన్‌ తీరును తామంతా నిశితంగా గమనించామన్నారు. కాపు రిజర్వేషన్ల అంశంలో చొరవ చూపింది, చిత్తశుద్ధి కనబరుస్తున్నది చంద్రబాబేనని అభిప్రాయపడుతున్నారు. కాపు రిజర్వేషన్ల అమలయ్యేలా చూడగల సత్తా ముఖ్యమంత్రికే ఉందంటున్నారు. జగ్గంపేటలో చేసిన ప్రకటనతో ఈ స్థాయిలో నిరసనగళం వినిపించడంతో కాదు... ప్రజాసంకల్పయాత్రలో అడుగడుగునా జగన్‌కు నిరసనసెగలు తగులుతూనే ఉన్నాయి. కాపుల్ని మోసం చేయవద్దు, కాపు రిజర్వేషన్లపై నీ వైఖరి మార్చుకో అంటూ మహిళలు, పిల్లలు సైతం ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి తోడు... వైసీపీలో కాపు నేతలు కూడా జగన్‌కు మొరపెట్టుకున్నారు. నష్ట నివారణ చర్యలు తీసుకోకపోతే, తాము మునిగిపోతామంటూ జగన్‌ దగ్గర గోడు వెళ్లబోసుకున్నారు. ఇలా అయితే కాపు  సామాజిక వర్గం ఓటర్ల దగ్గరకు వెళ్లే ఓట్లడిగే సాహసం చేయలేమని తేల్చిచెప్పేశారు. వీటన్నిటికీ తోడు కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదన్నా... బీసీల నుంచి స్పందన రాలేదు. రోజుల గడిచేకొద్దీ కాపులకు దూరం కావడం, బీసీలకు దరిచేరలేకపోవడంతో... 31 వ తేదీన పిఠాపురం పాదయాత్రలో మళ్లీ కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. తాను యూ టర్న్‌ తీసుకోలేదన్నారు. జగ్గంపేటలో తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆరోపించారు. బీసీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లకు వైసీపీ మద్దతిస్తోందన్నారు.
 పిఠాపురంలో జగన్ ఏం చెప్పారన్నది ఇప్పుడు కాపులు కానీ, కాపు నేతలు కానీ పట్టించుకోవట్లేదు. ఇవ్వలేను అనే స్థాయి నుంచి మద్దతిస్తాను అనే స్థాయికి వచ్చినా విశ్వసించట్లేదు. ఎందుకంటే... జగ్గంపేటలో చెప్పిందే జగన్ మనసులో మాట అని భావిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబే కాపు జాతికి న్యాయం చేస్తాడని బలంగా నమ్ముతున్నారు.
 
మొత్తంగా చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర జగన్‌కు కలసిరాలేదనే చెప్పాలి. జిల్లాలో కాపు సామాజికవర్గం నుంచి జగన్‌ సమక్షంలో వైసీపీలోకి చేరికలు ఉంటాయని అంతా భావించారు. కానీ పవన్‌పై విమర్శలు, కాపు రిజర్వేషన్లపై కామెంట్స్‌తో... జగన్ చేతులారా వైసీపీకి షాకిచ్చినట్లు పొలిటికల్ సర్కిళ్లలో డిస్కషన్ జరుగుతోంది. జగన్ వైఖరిని గమనించిన ఇద్దరు నేతలు, కాస్త పేరున్న కార్యకర్తలు వైసీపీలో చేరే ఆలోచన విరమించుకున్నారు. చివరాఖరికి వైసీపీ నేతల ఫోన్లు కూడా లిఫ్ట్  చేయట్లేదని తూర్పుగోదావరి జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

జగన్ అనుకున్నది ఒకటి.. అయినది మరొకటి..!
01-08-2018 11:23:11
 
636687193920335571.jpg
  • కాపులకు రిజర్వేషన్లపై వ్యాఖ్యలతో జగన్‌ పాదయాత్రను అడ్డుకుంటున్న కాపు సామాజికవర్గీయులు
  • వ్యతిరేకత పెరుగుతుండటంతో మాటమార్చిన వైసీపీ అధినేత
  • ఆందోళన చెందుతున్న ఆ పార్టీ ఆశావహులు
 
కాకినాడ: ‘‘ఇన్నాళ్లూపడ్డ కష్టమంతా తుడిచిపెట్టుకుపోయింది... పది రోజుల క్రితం సామర్లకోటలో పవన్‌కల్యాణ్‌పై వ్యక్తిగతంగా చేసిన విమర్శలు... నాలుగు రోజుల క్రితం జగ్గంపేటలో కాపులకు రిజర్వేషన్‌ హామీ ఇవ్వలేనని చెప్పడం.... ఈ రెండు అంశాలతో ఇంత కాలం పడ్డ శ్రమంతా బూడిదలోపోసిన పన్నీరైపోయింది’ అంటూ వైసీపీ ఆశావహులంతా తీవ్ర నైరాశ్యంలో పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఆశలలో విహరిస్తున్న వైసీపీ కాపు నేతలు జగన్‌ అనుసరిస్తున్న వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారు. 2014 ఎన్నికల ముందు రైతు రుణమాఫీ సాధ్యం కాదంటూ జగన్‌ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రతికూల ఫలితాలకు కారణమయ్యాయి.
 
ఇప్పుడు కాపులకు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేనని, అది పూర్తిగా కేంద్రం పరిధిలో అంశమని జగ్గంపేట బహిరంగ సభలో జగన్‌ స్పష్టం చేయడంపై కాపు సామాజికవర్గంలో ఆగ్రహావేశాలకు కారణమైందని ఆ పార్టీకి చెందిన కో-ఆర్డినేటర్లు, ఆశావహులు కలత చెందుతున్నారు. 2016లో కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడిన తమ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు, కేంద్రం పరిధిలో అంశమంటూ తేల్చిచెప్పడం ద్వారా పార్టీ పట్ల జనంలో అపనమ్మకం ఏర్పడిందని అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
పుండు మీద కారం చల్లినట్టు
‘నలుగురు పెళ్లాలు.. కొత్త కారు మార్చినట్టు పెళ్లాలను మారుస్తారు..’ అంటూ ఈ నెల 23న సామర్లకోటలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై జగన్‌ వ్యక్తిగతంగా చేసిన విమర్శల దుమారం చల్లారకముందే.. జగ్గంపేటలో కాపులకు రిజర్వేషన్ల హామీ ఇవ్వలేనంటూకుండబద్దలుకొట్టారు. తద్వారా వైసీపీ ఆశావహులు, క్యాడర్‌పై పుండుమీద కారంచల్లినట్లయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాపు ప్రాబల్యం ఉన్నచోటే వ్యాఖ్యలు
కాగా సామర్లకోట, జగ్గంపేటలలో కాపుల ప్రాబల్యం ఎక్కువ. 2014 ఎన్నికల్లో పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, వైసీపీ తరపున కాపులే తలపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇరు పార్టీల తరపున కాపు సామాజికవర్గీయులే పోటీలో ఉండే పరిస్థితి. ఇన్ని ప్రాధాన్యతలు ఉన్నా జగన్‌ ధైర్యంగా ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వ్యూహంలో భాగమేనని కొంతమంది విశ్లేషిస్తున్నారు.
 
కాపులపై యూటర్న్‌తో బీసీల్లో ఆందోళన
జగ్గంపేట బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై జగన్‌ యూటర్న్‌ తీసుకున్నారు. మంగళవారం పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో కాపు రిజర్వేషన్లపై తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ జగన్‌ మాట మార్చారని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతోంది. కాపు సామాజికవర్గం నుంచి ఎదురవుతున్న తీవ్ర నిరసనలతో జగన్‌ వైఖరి మార్చుకున్నట్టు తెలుస్తోంది. కాపులకు రిజర్వేషన్‌ హామీ ఇవ్వలేనని జగ్గంపేటలో జగన్‌ చేసిన ప్రకటన తర్వాత బీసీ సామాజికవర్గంలో వైసీపీపట్ల కాస్త మొగ్గు కన్పించింది. ఇదే తరుణంలో వైసీపీలో బీసీ కీలక నేతలు.. కొత్తపేట, ముమ్మిడివరం, రామచంద్రపురం తదితర నియోజకవర్గాల్లో బీసీలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మళ్లీ కాపుల హామీపై మాటమార్చడంతో బీసీ నేతలు.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ వైఖరిపై మరోమారు ఆలోచనలోపడ్డారు.
 
కాపులలో వ్యతిరేకత పెరుగుతుండటంతో జగన్‌ యూటర్న్‌ తీసుకుంటే... ఇపుడు బీసీలంతా జగన్‌ వైఖరిని తూర్పారబడతారు.. అంటూ వైసీపీకి చెందిన ప్రముఖ బీసీ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ పరిణామాలు రాజకీయంగా ఇంకెన్ని మలుపులకు కారణాలవుతాయోనంటూ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Link to comment
Share on other sites

అశోక్‌బాబుకు కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి ఫోన్‌
03-08-2018 12:12:32
 
636688951540061969.jpg
తొండంగి, తూ.గో.‌: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తుని రాజకీయాల్లో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఏపీ విభజనతో రాష్ట్రంలో నామమాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్‌పార్టీ ఇక్కడా అదేలా ఉంది. కాంగ్రెస్‌లోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రీ ఎంట్రీ ఇచ్చాక ఆ పార్టీలో ఒక్కసారిగా కదలిక మొదలైంది. గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌ బీసీ వర్గానికి చెందిన డాక్టర్‌ పాండురంగారావుకు ఇచ్చిన నేపథ్యంలో మాజీ ఎమ్యెల్యే రాజాఅశోక్‌బాబు స్తబ్ధుగా ఉండిపోయారు. రాష్ట్రస్థాయిలో కిరణ్‌కుమార్‌రెడ్డి రాక, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా ఊమెన్‌చాందీ పగ్గాలు చేపట్టడంతో పలుచోట్ల పాత నేతలపై దృష్టిసారించారు.
 
దీనిలోభాగంగా తునిపైనా దృష్టిపెట్టారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కిరణ్‌కుమార్‌రెడ్డితో అప్పట్లో ఎమ్యెల్యేగా ఉన్న అశోక్‌బాబు సన్నిహిత సంబంధాలు నెరిపారు. పక్కన ఉన్న విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఎన్నికల బాధ్యతలను అశోక్‌బాబుకే అప్పగించారు. నీలం తుఫాను సంభవించినపుడు సైతం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తుని వచ్చి అశోక్‌బాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే రూ.100కోట్లను తుపాను సహాయక నిధులుగా అందజేశారు. దీంతో అప్పటి స్నేహాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి ఇపుడు తునిలో పార్టీ బలోపేతానికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కిరణ్‌ అశోక్‌కు ఫోన్‌ చేసి ఓసారి కలవాలని కోరినట్లు సమాచారం.
 
జనసేన వైపు ఆకర్షితులైనా..
ఇటీవల అశోక్‌బాబు జనసేన వైపు ఆకర్షితులై ఉన్న సమయంలో కిరణ్‌ పిలుపు మేరకు తిరిగి ఆలోచనలో ప డ్డారు. గత ఎన్నికలనుంచి స్తబ్ధుగా ఉన్న ఆయన ప్రస్తుతం పాత క్యాడర్‌ను తిరిగి చేరదీసే పనిలో చురుగ్గా ఉన్నారు. కొన్నిరోజులుగా అశోక్‌బాబు గ్రామాలవారీ పాత నాయకు లు, కార్యకర్తలకు ఫోన్లు చేస్తూ ఏదొక మంచి రోజు చూసుకుని సమావేశమవుదామని కోరుతుండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన కుటుంబం కాంగ్రెస్‌లో ఆరు దశాబ్ధాలు గా కీలకపాత్ర పోషిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో కార్యకర్తల్లోను ఆయనకు మంచి పట్టు ఉండడంతో అధిష్ఠానం తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని చూస్తున్న ట్లు తెలుస్తోంది. ముందుగా అశోక్‌బా బు జనసేన వైపు చూసినా రాష్ట్రంలో ఆయన సామాజికవర్గానికి చెందిన నే తలు కొంతమంది వైసీపీలో చేరడంతో అశోక్‌ను ఆ పార్టీలోకి వెళ్లకుండా నిలువరించారు.
 
ఆయన వైసీపీలోకి రావడానికి స్థానిక నేతలనుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రయత్నాలు మధ్యలోనే నిలిచిపోయాయంటున్నారు. అయి నా ఆ పార్టీలో బొత్స సత్యనారాయణ వంటి వారితో అశోక్‌బాబుకు ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఇంకా వైసీపీ అవకాశాలు సజీవంగానే ఉన్నాయని ఆయన అభిమా నులు చెబుతున్నారు. ఈలోగా కాంగ్రెస్‌లో జరిగిన మార్పు లతో ఆయన నిర్ణయం ఇపుడు రాజకీయవర్గాల్లో ఆసక్తిని రే కెత్తిస్తోంది. ఆయన మాత్రం మొన్నటివరకు తన పయనం పై అక్కడక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇప్పుడు గుం భనంగా ఉంటున్నారు. మరికొద్దిరోజుల్లోనే ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై బహిరంగ ప్రకటన చేస్తారంటున్నారు. అదే జరిగితే తుని రాజకీయాల్లో ఒక్కసారిగా భారీమార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా ఉంది.
Link to comment
Share on other sites

బాలింతను తన కారులో తీసుకువెళ్లిన ఎమ్మెల్యే రాజేశ్వరి
03-08-2018 12:16:17
 
636688953786178229.jpg
మారేడుమిల్లి, తూ.గో.: ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల ఆరోగ్య భద్ర తపై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వ్యవహరిస్తున్న నిర్లక్ష్యవైఖరి మరోసారి బయట పడింది. ప్రభుత్వ లక్ష్యాన్ని అధికారులు పెడదోవ పట్టిస్తున్న తీరు గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మరణానికి చేరువ చేస్తోంది. బోదులూరు పీహెచ్‌సీలో మూడు రోజుల క్రితం ప్రసవించిన బంద గ్రామానికి చెందిన కలుముల దుర్గను తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో బాలింత స్వగ్రామానికి చేర్చవలసిఉంది. కాని మరో ఏడు కిలోమీటర్ల దూరం వుండగా మార్గ మధ్యంలోనే ఆకుమామిడికోట గ్రామం వద్ద మూడు రోజుల పసిబిడ్డతో సహా బాలింతను వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
 
దీంతో వేరే గత్యంతరం లేక కాలి నడకన వెళ్తున్న ఆమెను రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గమనించారు. దీంతో కారు దిగి ఏ జరిగిందని ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని బాలింత ఎమ్మెల్యేకు వివరించింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన ఎమ్మెల్యే హుటాహుటిన సదరు బాలింత దుర్గను తన కారులో ఎక్కించుకుని బోదులూరు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. దగ్గరుండి బాలింతకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు రెండువేల రుపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం బాలింతను అంబులెన్సులో స్వగ్రామానికి చేర్చారు. వైద్యాధికారుల తీరుపై ఆమె అసహనం వ్య క్తం చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Link to comment
Share on other sites

అక్కడ వైసీపీలో వర్గపోరు.. టీడీపీకి ప్లస్ అవుతుందా..?
03-08-2018 12:09:43
 
636688949844458272.jpg
  • అభ్యర్థులు ఎవరైనా.. పార్టీకే పట్టం!
  • టీడీపీ సీటు సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే దక్కే ఛాన్స్‌
  • వైసీపీలో రెండు వర్గాల పోరు
  • జనసేనలో ఇద్దరు ఆశావహులు
  • కాంగ్రెస్‌, బీజేపీ నామమాత్రమే
రాజోలు, తూ.గో.: రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన నాటినుంచి కాంగ్రెస్‌ ఆరుసార్లు, టీడీపీ ఐదుసార్లు ఇక్కడ ప్రాతినిధ్యం వహించాయి. 2009 నుంచి ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయ్యింది. అత్యధికసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అభ్యర్థులు ఎవరైనా ఇక్కడి ప్రజలు పార్టీకే ప్రాధాన్యం ఇస్తారు. రాజోలు నియోజకవర్గంలో సఖినేటిపల్లి మండలంలో 16 గ్రామాలు, మలికిపురం మండలంలో 20 గ్రామాలు, రాజోలు మండలంలో 16 గ్రామాలు, మామిడికుదురు మండలంలో ఏడు గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈసారి టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలే ప్రధానంగా పోటీపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
టీడీపీ రేసులో ముగ్గురు..
అధికార పార్టీ విషయానికి వస్తే రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు కార్యకర్తలను, నాయకులను పార్టీ ఆదేశాలనుసారం సమన్వయపరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. కానీ ఎన్నికల సమయం లో వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నాయకులను అక్కున చేర్చుకుని అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయినా టీడీపీ టిక్కెట్‌ మళ్లీ గొల్లపల్లి సూర్యారావుకే దక్కే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయనకు తన సామాజికవర్గం నుంచి మంచిపట్టు ఉంది. ఆయన పోటీ చేయని పక్షంలో మరో ఇద్దరు ఆశావహులు టిక్కెట్‌కోసం పోటీపడనున్నారు. 2009 అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్‌ గేదెల వరలక్ష్మి, అదే సంవత్సరంలో రాజోలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన బత్తుల రాము టిక్కెట్‌ రేసులో ఉన్నారు.
 
వైసీపీలో వర్గపోరు..
ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలో రెండువర్గాల్లో వర్గపోరు కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బొం తు రాజేశ్వరరావుకు ఈసారి కూడా టిక్కెట్‌ లభించే అవకాశాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు వర్గీయులు రాజేశ్వరరావుకు టిక్కెట్‌ దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జగన్‌ పాదయాత్రలో ఫ్లెక్సీల్లో కృష్ణంరాజు వర్గం రాజేశ్వరరావు ఫొటోలేకుండా వేయడంతో వైసీపీలో వర్గపోరు బహిర్గతమైంది. కృష్ణంరాజు వర్గం మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు టిక్కెట్‌కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కాగా, ఏ పార్టీకి సంబంధంలేని రాపాక వరప్రసాదరావు ఏ పార్టీ తరపున పోటీచేసినా బలమైన ప్రత్యర్థిగా ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
స్పష్టత లేని జనసేన
జనసేన పార్టీకి నియోజవర్గంలో ఓట్లు ఉన్నప్పటికీ అభ్యర్థి విషయంలో కార్యకర్తల్లో స్పష్టత లేకుండా పోయింది. మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, అభ్యర్థి విషయంలో స్పష్టత వస్తే టీడీపీ, వైసీపీలకు గట్టిపోటీ ఇవ్వనుంది. జనసేనలో జనాకర్షణ గల నాయకులు ఉన్నప్పటికీ ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే గెడ్డం మహలక్ష్మి మనుమడైన గెడ్డం మహాలక్ష్మీప్రసాద్‌తోపాటు మత్తి జయప్రకాష్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
 
కాంగ్రెస్‌, బీజేపీలు అంతంతమాత్రం
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా బలహీనపడింది. కాంగ్రెస్‌ నాయకులు ఇతర పార్టీల్లోకి వలస పోవడంతో కార్యకర్తలు కరువయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ పోటీలో ఉన్నా నామమాత్రం కానుంది. కాంగ్రెస్‌, బీజేపీల తరపున బరిలో నిలిచేదెవరనేది స్పష్టత లేదు.
 
నియోజకవర్గానికి ప్రత్యేకతలు
అంతర్వేదిలో మినీ షిప్పింగ్‌ హార్బర్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఉంది. దిండిలో రిసార్ట్స్‌ పర్యాటకులను ఆకర్షిస్తుంది. మోరిలో జీడిపప్పు పరిశ్రమ అంతర్జాతీయంగా గుర్తింపుపొందింది.
 
Advertisement

Link to comment
Share on other sites

వాళ్లిద్దరి గొడవ వల్ల టీడీపీకి చెడ్డపేరు వస్తుందా..?
03-08-2018 11:51:08
 
636688938697008586.jpg
రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల మధ్య వివాదం తెలుగుదేశంపార్టీకి చెడ్డపేరు తీసుకువస్తోందా? మేయర్ తీరుపై కార్పొరేటర్లు ఎందుకు మండిపడుతున్నారు? అసలు ఈ వివాదం ఎప్పుడు, ఎందుకు మొదలైంది? గత కొన్నేళ్లుగా మేయర్ల వల్ల టీడీపీకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? తాజా వివాదంపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందించింది? రాజమహేంద్రి కార్పొరేషన్‌లో అంతర్గత విభేదాలపై ప్రత్యేక కథనం మీకోసం!
 
     రాజమహేంద్రవరం కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. వరుసగా మూడుసార్లు టీడీపీ ఇక్కడ విజయం సాధించి కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టంకట్టినా మేయర్ల పనితీరు వల్ల పార్టీకి ప్రయోజనం చేకూరటం లేదన్న భావన ఏర్పడింది. పార్టీకన్నా ఆధిపత్యపోరుకే ప్రాధాన్యం ఇవ్వటం వల్ల తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత పాలకవర్గంతో పాటు గత పాలకవర్గంలోను మేయర్ల తీరు వల్ల టీడీపీ కార్పొరేటర్లలో అసమ్మతి చెలరేగింది. ఫలితంగా మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దించాలన్న ఆలోచన కార్పొరేటర్లకు వచ్చింది. గత రెండు దఫాలుగా టీడీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు టీడీపీకి మచ్చతెచ్చిన మాట వాస్తవం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మేయర్లను తొలగించాలన్న ఆలోచనకు ఏమాత్రం అవకాశం ఇవ్వరని తెలిసినా కార్పొరేటర్లు మాత్రం తగ్గడం లేదు. మేయర్‌ను తొలగించాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.
 
    గత పాలకవర్గంలో కార్పొరేటర్లకు స్థానిక సీనియర్ నేతలు మద్దతు పలికినా చంద్రబాబు వ్యతిరేకించడంతో నాటి మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మను పదవి నుంచి దించటం సాధ్యపడలేదు. ప్రస్తుతానికి వస్తే.. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ మేయర్ పంతం రజనీశేషసాయి, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబుపై కార్పొరేటర్లు అసంతృప్తిని వ్యక్తంచేస్తూ వారిని పదవుల నుంచి దించాలని ప్రయత్నిస్తున్నారు.
 
     మేయర్ పంతం రజనీశేషసాయి, టీడీపీ కార్పొరేటర్ల మధ్య స్టాండింగ్ కమిటీ సమావేశాలు వివాదానికి దారితీశాయి. మేయర్ సక్రమంగా స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించటం లేదనీ, వార్డుల్లో పనులు ఆగిపోతున్నాయనీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని కోరారు. అయితే మేయర్ ధోరణి వేరుగా ఉంది. తన వార్డులో రెండు పనులకు సంబంధించిన ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీ అజెండాలో అధికారులు చేర్చలేదని మేయర్‌ కినుక వహించారు. దీంతో స్టాండింగ్ కమిటీ సమావేశాలను చేపట్టడం లేదు. ఫలితంగా గత కొంతకాలంగా టీడీపీ కార్పొరేటర్లు, మేయర్ మధ్య అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీ కార్పొరేటర్లంతా ప్రత్యేకంగా సమావేశమై.. మేయర్, డిప్యూటీ మేయర్లను దించేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ విషయాన్ని స్థానిక టీడీపీ ముఖ్యనేతల దృష్టికి తీసుకువెళ్ళారు.
 
    మేయర్, టీడీపీ కార్పొరేటర్ల మధ్య నెలకొన్న వివాదంపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ గన్ని కృష్ణ సీరియస్‌గా స్పందించారు. అటు మేయర్, ఇటు కార్పొరేటర్లతో అత్యవసరంగా భేటీ అయ్యారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. విషయాన్ని అధిష్టానం దృష్టికీ తీసుకువెళ్ళారు. ఈ అంశంపై పార్టీ హైకమాండ్‌ కూడా వేగంగా స్పందించింది. మేయర్, కార్పొరేటర్ల మధ్య వివాదాన్ని చక్కదిద్దే బాధ్యతను మంత్రులకు అప్పగించింది. ఈ తరుణంలోనే మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కిమిడి కళావెంకట్రావు రాజమహేంద్రవరం మేయర్‌తో చర్చించి సమస్యను కొలిక్కి తెచ్చారు. కార్పొరేటర్లు డిమాండ్ చేసిన విధంగా స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని నిర్దేశించారు. అందరూ ఐకమత్యంతో పనిచేసి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. దీంతో స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు మేయర్ అంగీకరించారు.
 
    మంత్రుల జోక్యంతో మేయర్, టీడీపీ కార్పొరేటర్ల మధ్య సమస్య తాత్కాలికంగా పరిష్కారమైనప్పటికీ అంతర్గత విభేదాలు మాత్రం కొనసాగుతునే ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మేయర్, కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం కూడా పార్టీ పెద్దలకు మింగుడు పడటంలేదు. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుతానికి మేయర్, టీడీపీ కార్పొరేటర్లు మౌనంగా ఉంటున్నారు. ఇదండీ రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న రగడ! ఇప్పటికైనా మేయర్, కార్పొరేటర్లు తమ ఆధిపత్యపోరుకి స్వస్తిచెబుతారా? లేక నిప్పుల కుంపటిని మరింత రాజేసి.. అధిష్టానం ఆగ్రహాన్ని చవిచూస్తారా? అన్న అంశాలపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే!
Link to comment
Share on other sites

విలక్షణ స్థానంలో టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ ప్లాన్
04-08-2018 12:19:44
 
636689819862137355.jpg
  • సామాజికవర్గాల పోరే కీలకం
  • ‘దేశం’లో మూడు కేంద్రాలు
  • పట్టుకోసం ‘వైసీపీ’ ఆరాటం
  • జనసేనలో కేడర్‌ ఫుల్‌.. నాయకత్వం నిల్‌
  • కేడర్‌లేని కాంగ్రెస్‌.. బలంలేని బీజేపీ
అమలాపురం: రాజకీయ పార్టీలకు భి న్నంగా సామాజికవర్గాల సమీకరణలతో జరిగే ఎన్నికల పోరులో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు ఇచ్చే తీర్పు ఎప్పుడూ విలక్షణమైనదే. ఆరు దశాబ్ధాలకాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు సామాజికవర్గాలకు చెందిన వ్యక్తుల ఏలుబడిలోనే నియోజకవర్గ పాలన సాగింది. రాజకీయపార్టీల ప్రభంజనంలోను ఐదుసార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా నాలుగుసార్లు కుడుపూడి ప్రభాకరరా వు, మూడుసార్లు మెట్ల సత్యనారాయణరావు ప్రాతినిధ్యం వ హించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఎస్‌సీలకు రిజర్వ్‌ అ యిన స్థానం తిరిగి 2009లో ఎస్‌సీలకు రిజర్వ్‌ అయ్యింది.
 
అమలాపురం మున్సిపాలిటీ, అల్లవరం, అమలాపురం రూర ల్‌, ఉప్పలగుప్తం మండలాలతో కలిసి ఈ నియోజకవర్గం ఆ విర్భవించింది. అయినా ఈ నియోజకవర్గంలో రెండు ప్రధాన సామాజిక వర్గీయుల ఓట్ల తీర్పు ఆధారంగానే అభ్యర్థి భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అమలాపురం రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార టీడీపీ, వైసీపీలతోపాటు వివిధపక్షాల తరపున పోటీచేసేందుకు ఆశావహులైన అభ్యర్థులు తమదైన శైలిలో ఉవ్విళ్లూరుతున్నారు.
 
టీడీపీలో ముగ్గురు ఆశావహులు
అధికార టీడీపీలో మూడు రాజకీయ కేంద్రాలు పనిచేస్తున్నా యి. ఒక కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వర్గీయులు సారథ్యం వహిస్తుంటే, మరో కేంద్రం దివంగత నేత మెట్ల సత్యనారాయణరావు వర్గం ఏలుబడిలో ఉంది. ఈ రెండు వర్గాలను సమన్వయం చేసుకుంటూ మూడో వర్గంగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చెలామణీ అవుతున్నారు. టీడీపీలో ఒకట్రెండు ప్రధాన సామాజిక వర్గాలు మినహా మిగిలిన సామాజికవర్గ నేతలు కొంచెం దూరంగానే ఉండడం పార్టీ ప్రముఖులకు ఇబ్బందికరంగా మారడంతోపాటు కేడర్‌పట్ల సానుకూలత కూడా కరువైందనే అభియోగాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేరుతోపాటు మరో ఇద్దరు ఆశావహుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అమలాపురం పురపాలక సంఘం అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్న అసంతృప్తి ఉంది. ఎవరి సొంత నిర్ణయాలతో వారే పాలనలు సాగిస్తుండడంతో నియోజకవర్గ కేడర్‌లో సమన్వయలోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
 
పట్టు సాధించే పనిలో వైసీపీ
ఇక వైసీపీ నాయక త్వం ప్రజల్లో పట్టుసాధించే దిశగా ప్రయత్నాలను తీవ్రతరం చేసిం ది. గతంలో ఎంపీ అ భ్యర్థిగా పోటీచేసి ఓటమిచెందిన పినిపే విశ్వరూప్‌ ఈసారి అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీకి గట్టిపోటీనిచ్చే అభ్యర్థిగా విశ్వరూప్‌ ఈసారి పోటీకి దిగుతారన్న ప్రచారంతో ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆశలు పెట్టుకున్న ఆశావహులు ప్రత్యామ్నాయ రాజకీయమార్గాలను అన్వేషిస్తున్నారు. గతంలో ఇక్కడినుంచి అసెంబ్లీ స్థానానికి పోటీచేసిన గొల్ల బాబూరావు ప్రస్తుతం ఈ ప్రాంత రాజకీయాలకు దూరంగా గడుపుతున్నారు. విశ్వరూప్‌ అయితే వివిధ సామాజికవర్గాల్లో పట్టు సాధించే దిశలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు.
 
జనసేనకు దిశానిర్దేశం లేక..
జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నియోజకవర్గంలో పటిష్టమైన కేడర్‌ ఉన్నప్పటికీ ఆశావహుల అడ్ర స్‌లు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం దిశానిర్ధేశం లేని రీతిలో పార్టీపరమైన కార్యక్రమాలు అమలాపురం కేంద్రంగా జోరుగా సాగుతున్నాయి. ద్వితీయశ్రేణి కేడర్‌తోపాటు ఒకే సామాజికవర్గానికి చెందిన యువకులు ఈ పార్టీవైపు ఆకర్షితులవుతున్నట్టు కనిపిస్తోంది. నాయకత్వ లేమితో నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్న కేడర్‌లోనే వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి.
 
కేడర్‌లేని కాంగ్రెస్‌.. బలం లేని బీజేపీ
జాతీయ పార్టీలైనప్పటికీ కాంగ్రె్‌సపార్టీకి కేడర్‌ కరువైంది. బీజేపీకి ఆశించిన మేర బలంలేదు. ప్రస్తుతం కాంగ్రె్‌సపార్టీలో ఇద్దరు ముగ్గురు ఎస్సీ అభ్యర్థులు రంగంలో దిగేందుకు సి ద్ధంగా ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి పదవి హోదాలో ఉన్న గి డుగు రుద్రరాజుతోపాటు ఆ పార్టీ తరపున కొందరు కీలక నా యకులు ఉన్నప్పటికీ కేడర్‌లేమితో ఆ పార్టీ సతమతమవుతోంది. ఇక బీజేపీ విషయానికొస్తే అంతా నాయకులే తప్ప కే డర్‌ నామమాత్రం కూడా లేదు. ఇదీ జాతీయపార్టీల పరిస్థితి.
 
నియోజకవర్గంలో ప్రత్యేకతలు
అమలాపురం ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం ఎన్నో ప్రత్యేకతలకు పెట్టింది పేరు. దేశంలోనే కీలకమైన చమురు నిక్షేపా లు ఓడలరేవు, ఎస్‌.యానాంల్లో ఉన్నాయి. కోనసీమ కేంద్రమై న అమలాపురం పట్టణంతోపాటు పర్యాటకపరంగా బీచ్‌లు, గోదావరి తీరాలు సొంతం. ఓడలరేవు, ఎస్‌.యానాం బీచ్‌లను ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...