Jump to content

East Godavari Politics


Recommended Posts

1 hour ago, Godavari said:

apdu guarantee ga seat potadi ...they cant win against Reddys in anaparthi..Kothapeta lo.kap 62k reddy 17k akkada candidate ne kottalekapothunaru easy ga

Anaparthi Reddy 50k kap 35k kamma 13k

annay tanuku paristhithi enti ela undhi local ga manaku party ki 

Link to comment
Share on other sites

  • Replies 346
  • Created
  • Last Reply
55 minutes ago, RKumar said:

KKD City candidate meeda anti baaga vundi it reflected in Kakinada Corporation elections not sure about KKD Rural. Both are BCs, both communities important for TDP along with Kaps in EG. 

akkada option ledu ah caste ki ivadame Btr vallaki ivakapothe vallu ekkuva Dwarampudi ki guddutaru...

Link to comment
Share on other sites

6 hours ago, RKumar said:

KKD City candidate meeda anti baaga vundi it reflected in Kakinada Corporation elections not sure about KKD Rural. Both are BCs, both communities important for TDP along with Kaps in EG. 

kkd city bc votes polarise avvali.....fisherman community ki pension scemes baga work ayyai....rural kastam  emo kani compare chesthe urban easy win

Link to comment
Share on other sites

1 hour ago, Bezawadabullo said:

annay Rajamundry MP seat jaffa gadu bc ki isthanu annadu evaru ycp lo candidate ,manaki Murali mohan garu ani telusu .Ela untundhi antav contest

shettibalija ke istadu emo may be bose...e strategy workout avvadu ...indirectga bjp ki odulestademo :dream:

Link to comment
Share on other sites

2014 158 Peddapuram GEN Nimmakayala China Rajappa Male TDP 75914 Thota Subbarao Naidu Male YSRC 65251

2009 158 Peddapuram GEN Pantham Gandhi Mohan M PRAP 46211 Boddu Bhaskara Ramarao M TDP 43155

2004 43 Peddapuram GEN Thota Gopala Krishna M INC 56579 Boddu Bhaskara Rama Rao M TDP 45995

1999 43 Peddapuram GEN Boddu Bhaskara Rama Rao M TDP 55878 Pantham Gandhi Mohan M INC 50572

1994 43 Peddapuram GEN Boddu Bhaskara Ramarao M TDP 55148 Pantham Padmanabham M INC 42690

1989 43 Peddapuram GEN Pantham Padmanabham M INC 56237 Boddu Bhaskara Rama Rao M TDP 38348

 

Link to comment
Share on other sites

4 hours ago, Godavari said:

Boddu Bhaskarama rao seriously trying Peddapuram Ticket ivvakapothe 2 peddapuram Anaparthi meda effect cbn rajappa boddu ni ela balance chestado :dream: rajappa kkd city ,rural :thinking:

 

Rajappa kkd rural isthe pilli gola vaduluddi manaki...eesari gelvaru ....urban konda babu gelustadu

Link to comment
Share on other sites

4 hours ago, subash.c said:

Rajappa kkd rural isthe pilli gola vaduluddi manaki...eesari gelvaru ....urban konda babu gelustadu

peddapuram seat kosam   edoka aitting seat lechipotadi ..rural isthe Better .Pilli chala baga works chesaru kkd rural lo but kannababu ni vodinchatam kastam antunaru 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
చంద్రబాబు చేతిలో అరడజను మంది ఎమ్మెల్యేల జాతకాల జాబితా..!
27-06-2018 11:51:04
 
636656970652714135.jpg
  • ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలకు చంద్రబాబు హెచ్చరిక
  • ప్రజాప్రతినిధుల దందాలపై సీఎం వద్ద చిట్టా
  • బ్రేక్‌వేయకపోతే చర్యలు తప్పవని వార్నింగ్‌
  • బాబు జాబితాలో తూ.గో ఎమ్మెల్యేలు అరడజను మంది?
‘‘ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారు.. గెలవడానికి కారణమైన ప్రజలను పట్టించుకోరు.. ఎమ్మెల్యే పదవంటే దందాలు చేసుకునేందుకే అని కొందరు భావిస్తున్నారు.. ఇప్పటివరకు ఇలాంటి వ్యవహారాలపై వార్నింగ్‌లు ఇచ్చి ఊరుకునేవాళ్లం. ఇప్పటికైనా తీరుమారకపోతే చర్యలు తప్పవ్‌...’’ ఇదీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలకు సీఎం చంద్రబాబు ఘాటైన హెచ్చరిక. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిలతో ప్రత్యేకంగా సమావేశమై.. పనితీరు, ఇతర అంశాలపై కూలంకుషంగా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు నాలుగైదు జిల్లాల నేతలతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిల జాబితాలనూ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
 
 
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)
గతంలో ప్రజావ్యతిరేకత, పార్టీ కేడర్‌లో అసమ్మతి మూటగట్టుకున్న వారికి ఒకటి, రెండు దఫాలు చిన్నపాటి హెచ్చరికలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. దందాలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలల కిందట జిల్లా నుంచి వెళ్లిన ఎమ్మెల్యేల నివేదికలపై మరోమారు సర్వే చేయించుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం జిల్లాలో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిల పనితీరుపై ఇటీవల ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు ఇప్పటికే క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న అర డజను మంది ఎమ్మెల్యేలపై సీరియస్‌గా దృష్టి సారించారు. తమకు ఆశించిన పదవులు ఇవ్వలేదని పార్టీ ముఖ్యనేతలపై విష ప్రచారం చేయడం వంటి అంశాలపై ఇప్పటికే సీఎం ఒక స్పష్టతకు వచ్చారు. మెట్ట ప్రాంతంలో పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యే తమ వెంట వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ముందు నుంచీ టీడీపీ జెండా మోసిన వారిని పార్టీ నుంచి వెళ్లగొట్టి, పార్టీలు మారేవారిని ప్రోత్సహిస్తున్నారంటూ ఇటీవల పార్టీ అధిష్ఠానానికి పలు ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపైనా సీఎం దృష్టిసారించినట్టు సమాచారం. అసలు, సిసలు కార్యకర్తలకు గౌరవం ఇవ్వకపోయినా పా ర్టీని నష్టం వాటిల్లుతోందని, ఇటువంటి వాటిని సెట్‌ చేసుకోవాలంటూ ఇటీవల జిల్లాకు చెందిన ఒక మంత్రి వద్ద చంద్రబాబు ప్రస్తావించినట్టు సమాచారం. ఒంటెద్దు పోకడలు సరికాదని సంకేతాలు ఇచ్చారు.
 
 
కుటుంబ పాలన వద్దు..
జిల్లాలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేల కొడుకులు, సోదరులు, బంధువుల ప్రమేయం ఎక్కువగా ఉంటోందని సీఎంకు సమాచారం వెళ్లింది. కొడుకులు తిరిగే కార్లకు ఎమ్మెల్యే స్టిక్కర్లు అతికించి హంగామా చేయడాన్ని కట్టడిచేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాలని పార్టీ కార్యాలయంకు అధిష్ఠానం నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. అలాగే బినామీల పేర్లతో కాంట్రాక్టులు చేపడుతున్నారని, పార్టీ కార్యకర్తలను కాదని, వైసీపీ వాళ్లతో కలసి ఇసుక, మైనింగ్‌ దందాలు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని, యువనేత పేరు కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని ఆధారాలతో నివేదిక వెళ్లింది.
 
వారం, పది రోజులలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలతో సీఎం సమావేశం కానున్నారు. వీరిలో పనితీరు బాగాలేని వారికి హెచ్చరికలు చేయనున్నారు. మరీ బరితెగించిన జాబితాలో ఉన్న వారి స్థానంలో కొత్తవారి పేర్ల పరిశీలన కూడా చేసే అవకాశం కన్పిస్తోంది. తమ జాతకాలు ఎలా ఉన్నాయో, నివేదికలలో తమపై ఏం రాసి ఉంటారోనంటూ.. పలువురు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు టెన్షన్‌తో ఉన్నారు.
Link to comment
Share on other sites

వైసీపీలో ముసలం.. రెండు వర్గాలుగా చీలిన పార్టీ
02-07-2018 12:03:11
 
636661297895997266.jpg
  • రాజమహేంద్రవరంలో రెండు వర్గాలుగా చీలిన పార్టీ
  • తనను అడ్డుకున్నారంటూ శ్రీఘాకోళ్లపు బల ప్రదర్శన
  • అన్ని పార్టీల నుంచి పిలుపు ఉందంటూ ప్రకటన
రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం వైసీపీలో ముసలం మొదలైంది. ఏపీఐసీసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం ఇటీవల తాను బేషరతుగా వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీలో మరోవర్గం అప్రమత్తమైంది. ఆయనను అడ్డుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. దీంతో ఆత్మీయమిత్రుల సమ్మేళనం పేరిట చెరుకూరి కల్యాణమండపంలో ఆదివారం శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం బల ప్రదర్శన చేశారు. కొందరు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సుమారు 33 డివిజన్‌ల నుంచి వచ్చిన నాయకులు, ప్రజలతో హాలంతా నిండిపోయింది. సుబ్రహ్మణ్యంతోనే తామంతా ఉంటామని ఇక్కడకు వచ్చిన నాయకులంతా ప్రకటించారు.
 
 
తారస్థాయికి విభేదాలు
ప్రస్తుతం రాజమహేంద్రవరంలో వైసీపీ అంటే ఒకప్పుడు కాంగ్రెస్‌ వర్గీయులే.ముఖ్యంగాజక్కంపూడి వర్గీయులే అధికంగా ఉన్నారు.మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు బతికి ఉన్న రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్‌ అంటే జక్కంపూడి, మాజీ ఎంపీ అరుణకుమార్‌ వర్గంగానే ఉండేది. వీరిద్దరు ఒకే వర్గంగా ఉంటూ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అనుచరులుగా ఉండేవారు. వీరికి పోటీగా కొంతకాలం ఏసీవై రెడ్డి వర్గం ఉండేది. వి హనుమంతరావు వర్గం కూడా కొంత ప్రభావం చూపేది. కాని ఎక్కువగా జక్కంపూడి, ఉండవల్లి వర్గమే అధికారం పొందేది, పెత్తనం చేసేది. ప్రస్తుతం ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఏ రాజకీయ పార్టీలోను లేకుండా వివిధ అంశాలపై వివిధ పార్టీలకు సలహాలు ఇస్తూ తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. ఇక రూరల్‌, సిటీలో కూడా జక్కంపూడి కుటుంబసభ్యుల ప్రభావం కొంతమేర ఉంది. కాని అప్పట్లో జక్కంపూడికి సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యే సిటీ వైసీపీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాష్‌రావు ప్రత్యేక వర్గంగా ఎదిగారు. ఆయనకు వెనుక కొందరు పెద్దలు మద్ధతు కూడా ఉన్నట్టు ప్రచారం. ఇటీవల జక్కంపూడి కుటుంబ సభ్యులకు, రౌతుకి మధ్య కూడా పెద్ద సంబంధాలు లేనట్టు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అప్పట్లో జక్కంపూడి రామ్మోహన్‌కు బాగా సన్నిహితంగా ఉన్న వాళ్లను కొందరు అణచివేసినట్టు కూడా ప్రచారం ఉంది. శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం చాలా కాలం నుంచి ఏదో పార్టీలో చేరడానికి ఆలోచిస్తున్నారు. ఇటీవల జక్కంపూడి కుటుంబ సభ్యులతో పాటు, వైసీపీ పెద్దలు కూడా ఆయనను పిలవడంతో పాటు పార్టీలో బేషరతుగా చేరడానికి నిర్ణయించుకున్నారు. కాని తాను తన ఆఫీసులో మిత్రులతో కలసి సరదాగా చేసిన సంభాషణను రికార్డు చేసి వైసీపీ అధిష్టానం దగ్గర చూపించి తనను బ్యాడ్‌ చేస్తున్నారని శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్యణ్యం ఓ బాంబ్‌ విసిరారు. చెరుకూరి కల్యాణ మండపంలో ఆత్మీయ మిత్రుల సమ్మేళనంతో బలప్రదర్శన చేశారు.
 
 
నన్ను అడ్డుకుంటున్నారు: శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం
నాకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉంది. కాని కొందరు మిత్రులు, పెద్దలు సూచన మేరకు వైసీపీలో బేషరతుగా చేరాలని నిర్ణయించుకున్నాను. కాని నన్ను అడ్డుకుంటున్నారు. నేను మిత్రులతో సరదాగా మాట్లాడిన విషయాలను వీడియోగా తీసి అధిష్టానం వద్ద పెట్టి నన్ను బ్యాడ్‌ చేయాలని చూస్తున్నారని ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. చెరుకూరి కల్యాణమండపంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన తీవ్ర స్వరంతో మాట్లాడారు. సోషల్‌ మీడియాలో రాజకీయాలు చేసేవాళ్లు, ప్రజల కోసం పని చేయని వాళ్లు తనను అణచాలని చూస్తే అణచలేరని, తాను జనం కోసం, జనం నుంచే వచ్చానని ఆయన స్పష్టం చేశారు. కొందరికి తాను పోటీ అవుతాననే తనకు ఆటంకం కల్పిస్తున్నారని రాజమహేంద్రవరంలో 23 వార్డులలో వైసీపీకి సరైన ప్రాతినిధ్యం కూడా లేదని, పార్టీని బలోపేతం చేయాలని, ఫోన్‌లలోను, సోషల్‌ మీడియాలోను రాజకీయం చేస్తూ ఇంట్లో కూర్చుంటే పార్టీకి మేలు జరగదన్నారు. 24 గంటల్లో 10 వేల మంది సభ్యత్వంతో తాను పార్టీలో చేరగలనని, తనను తీసుకుంటే వైసీపీకి అదృష్టమని, లేకుంటే దురదృష్టమని ఆయన స్పష్టం చేశారు.
 
నేను నోరు విప్పితే ఇక్కడ నాయకుల గురించి చెప్పడానికి మైదానం కూడా సరిపోదని 10ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఓవ్యక్తి అవినీతికి సంబంధించిన ఆధారాలు నావద్ద ఉన్నాయని ఆయన పరోక్షంగా రౌతు మీద ధ్వజమెత్తారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ రెండుసార్లు గెలవడానికి, రౌతు రెండు సార్లు గెలవడానికి తాను కూడా కారణమేనని స్పష్టం చేశారు. తనకు జన బలం ఉందని, తాను ఏ పార్టీలో చేరినా, చేరకపోయినా రాబోయే ఏ ఎన్నికలలోనైనా తన మిత్రులను పోటీ పెడతానని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మొకమాటి సత్యనారాయణ, అజ్జరపు వాసు, బూర రమేష్‌, ప్రస్తుత కార్పొరేటర్లు నండూరి రమణ, అగురు పద్మావతి, తాడి మరియ, ఐఎన్‌టీయుసీ నాయకులు దాసు, గౌరీశెట్టి సత్తిబాబు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు అడపారాజు, యువజన నాయకులు సత్తి సందీప్‌, కందకం శ్రీను, కోరుమళ్ల రఘు, మహేష్‌బాబు ఫ్యాన్స్‌ షాజహాన్‌, అడ్వకేట్స్‌ దూడల త్రినాధ్‌, చిట్టూరి వాసు, బీసీ నాయకులు మార్గాని రామకృష్ణ గౌడ్‌, కొనకం సుబ్బారావు, వడ్డీ మురళి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

బోస్‌ పయనమెటు..?
02-07-2018 11:48:17
 
636661288963411354.jpg
  • రామచంద్రపురం వైసీపీ టికెట్‌పై జగన్‌ క్లారిటీ
  • జెడ్పీ మాజీ చైర్మన్‌ వేణుకి ఖరారు
  • కులసంఘం సమావేశం తర్వాత బోస్‌ మౌనం?
ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ: వైసీపీ కీలక నేత, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆ పార్టీ కేడర్‌లో ఇటీవల ఇదే చర్చ. రామచంద్రపురం అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున తన కుమారుడిని పోటీచేయించాలని బోస్‌ ఆశపడ్డారు. బోస్‌ కుటుంబం ఆర్థికంగా సరిపోదని భావించిన వైసీపీ అధినేత జగన్‌.. ఆ స్థానంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ వేణుగోపాలకృష్ణను బరిలోకి దింపాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.ఇదే సమయంలో ముమ్మిడివరం అసెంబ్లీ సీటు శెట్టిబలిజలకు ఇవ్వాలని బోస్‌ పట్టుపట్టారు. అది కుదరదని.. అక్కడ మత్స్యకార సామాజికవర్గానికి చెందిన పొన్నాడ సతీష్‌ని అభ్యర్థిగా దాదాపు ఎంపిక చేశారు.ఈ రెండు పరిణామాలతో పార్టీ అధినేత వైఖరిపై బోస్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.నెలరోజుల క్రితం..వైసీపీలో మరో బీసీనేత కుడుపూడి చిట్టబ్బాయ్‌తో కలిసి..వైసీపీ సామాజిక అన్యాయం చేస్తుందంటూ కులసంఘం సమావేశంలో ధ్వజమెత్తారు.ఆ సమయంలో బోస్‌ వైసీపీని వీడతారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది.
 
జగన్‌ వద్దకు వెళ్లి తేల్చుకుంటామంటూ బోస్‌, చిట్టబ్బాయ్‌ వర్గీయులు హడావుడి చేశారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు జగన్‌ వద్దకు తీసుకువెళ్లారు. జగన్‌..ఈ కులసంఘాల సమావేశాలు పట్టించుకోలేదు.ఇదే సమయంలో తెలుగుదేశంపార్టీ నుంచి పిలుపు వస్తుందని పలువురు ఆశించారు. అటు టీడీపీ పెద్దగా స్పందించలేదు. దీంతో బోస్‌, చిట్టబ్బాయ్‌ కొన్నాళ్లు రాజమహేంద్రవరం లోక్‌సభ వైసీపీ ఇన్‌ఛార్జిగా పిల్లిసుభాష్‌ చంద్రబోస్‌ను నియమించే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 13 లేదా 14 తేదీలలో జగన్‌..రాజమహేంద్రవరం పాదయాత్రలో ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక్కడ నుంచి సినీ డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ పోటీచేస్తారంటూ ఇటీవల ప్రచారం సాగుతోంది. అప్పటి వరకు బోస్‌ను ఇన్‌ఛార్జిగా నియమిస్తారా? అన్న చర్చ సాగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ, జనసేన, బీజేపీ లోపాయికారి ఒప్పందం పెట్టుకుని పోటీచేసే పక్షంలో బోస్‌ని నామ్‌కే వాస్తేగా రాజమహేంద్రవరం వైసీపీ కేండెట్‌గా నిలబెట్టే అవకాశాలూ ఉండవచ్చంటూ వైసీపీ వర్గాలలోనే చర్చించుకుంటున్నారు. మొత్తం మీద పార్టీ అధినేత జగన్‌ వైఖరిపై కాస్త అసహనంగా ఉన్నా.. బోస్‌ పార్టీ మారే పరిస్థితి లేదని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...