Jump to content

Check dams


Recommended Posts

చక చకా..చెక్‌ డ్యామ్‌లు
25-04-2018 01:18:34
 
636602159136386501.jpg
  • ఉద్యమ వేగంతో జల సంరక్షణ పనులు
అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): జల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో చెక్‌ డ్యామ్‌లు, పంట కుంటల నిర్మాణం ఉద్యమ వేగంతో సాగుతోంది. 116 రోజుల్లో 4,209 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని జల వనరుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ఏప్రిల్‌ 23 నాటికి 2,724 చెక్‌డ్యామ్‌లు నిర్మించాల్సి ఉండగా.. దీనిని అధిగమించి 3,141 చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. పంట కుంటల తవ్వకంలోనూ జల వనరులశాఖ లక్ష్యాలను అధిగమించింది. రాష్ట్రంలో 50866 పంట కుంటలు తవ్వాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ మేరకు ఈ నెల 23 నాటికి 32,913 పంట కుంటలు తవ్వాల్సి ఉండగా.. రికార్డు స్థాయిలో 74,294 పూర్తి చేశారు. కాగా, 1991 చెరువుల్లో పూడిక తీయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంటే.. కేవలం 494 చెరువుల్లోనే పూడిక తీశారు. కాగా, భూగర్భ జలాలను పెంచేందుకు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ సాగునీటి ప్రాజెక్టులతోపాటు చిన్నతరహా నీటి పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రధానంగా చెక్‌ డ్యామ్‌ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొండలు, కోనలు, ఎత్తయిన ప్రాంతాల నుంచి కిందకు వచ్చే వర్షపు నీటిని నిల్వ చేసేలా చెక్‌ డ్యామ్‌లు నిర్మిస్తున్నాయి.
 
రాష్ట్రంలోనూ చిన్న, మధ్య, భారీ తరహా సాగునీటి ప్రాజెక్టులకే గతంలో ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే వర్షాభావ పరిస్థితులతో భారీ ప్రాజెక్టుల్లోకి నీరు చేరడం లేదు. వాటిపై ఆధారపడ్డ చెరవులూ నిండటం లేదు. దీంతో కరువు పరిస్థితులను తట్టుకోవాలంటే కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో మన రాష్ట్రంలోనూ చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని గతంలో ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. వీటిపై స్పందించిన ప్రభుత్వం నీరు ప్రగతి-116 రోజుల జల సంరక్షణ ఉద్యమంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 1 month later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 4 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
  • 5 weeks later...
  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...