Jump to content

పవన్‌కు ఆర్కే లీగల్‌ నోటీసు


Recommended Posts

పవన్‌కు ఆర్కే లీగల్‌ నోటీసు
25-04-2018 02:31:11
 
636602213661070925.jpg
  • ఆరోపణల ట్వీట్లు తొలగించి లిఖితపూర్వక బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
  • లేదా సివిల్‌, క్రిమినల్‌ పరువు నష్టం దావాకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిక
  • పవన్ కల్యాణ్‌కు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఎండీ లీగల్‌ నోటీసు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24: తన పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించే విధంగా ట్విటర్‌లో అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేసిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం దావా వేస్తానని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఎండీ వేమూరి రాధాకృష్ణ హెచ్చరించారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా పవన్‌కు లీగల్‌ నోటీసు పంపించారు. తనపైనా, తన సంస్థపైనా చేసిన ఊహాజనిత, నిరాధార ఆరోపణలను, ట్వీట్లను బేషరతుగా ఉపసంహరించుకుని (ట్విటర్‌ నుంచి తొలగించి), బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్‌ చేశారు.
 
లేనిపక్షంలో తాను తీసుకోబోయే సివిల్‌, క్రిమినల్‌ పరువు నష్టం దావాను ఎదుర్కోవడానికి.. పవన్‌కల్యాణ్‌, ఆయన వెనుక ఉన్నవారు సిద్ధంగా ఉండాలన్నారు. తన వ్యక్తిగత, రాజకీయ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు.. పవన్‌ కావాలని, ఉద్దేశపూర్వకంగా చేసిన ఆ ట్వీట్లలో వీసమెత్తయినా వాస్తవం లేదని అందులో ఆర్కే స్పష్టం చేశారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ వార్తా సంస్థలు నియంత్రణ సంస్థల నిబంధనలకు లోబడి పనిచేస్తాయని అందులో గుర్తు చేశారు. పవన్‌ ఆరోపించినట్టు టీఆర్పీ కోసం మహిళలను దూషించే అలవాటు వాటికి లేదని తేల్చిచెప్పారు.
 
సమాజానికి మీడియా చేసే మేలును తగ్గించి చూపడం రాజకీయనాయకులకు అలవాటైన పనేనని.. అయితే, లింగ అసమానతపై ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ చేసిన పోరు గురించి మరిచిపోవడం పవన్‌కల్యాణ్‌కు తగదని అభిప్రాయపడ్డారు. పవన్‌ ఆరోపిస్తున్నట్టు తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు గానీ, ఏ పార్టీ వైపూ మొగ్గు గానీ లేదని స్పష్టం చేశారు. ట్విటర్‌లో అనుచిత యుద్ధం ప్రకటించిన పవన్‌ కొద్దిరోజులుగా వరుస ట్వీట్లతో తన అభిమానుల్లో అసహనం పెంచారని, దీంతో పవన్‌ మద్దతుదారులు/అభిమానులు ‘ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌’ రిపోర్టర్లపై దాడి చేసి గాయపరిచారని, ఓబీవ్యాన్‌ను ధ్వంసం చేశారని ఆర్కే గుర్తుచేశారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి పవన్‌ ట్విటర్‌లో తనపై నిర్లక్ష్యపూరిత ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
 
పడిపోతున్న రాజకీయ ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవడానికే పవన్‌ తనపై ఊహాజనిత, వండివార్చిన ట్వీట్లను పోస్ట్‌ చేస్తున్నారని తెలిపారు. నేరపూరిత కుట్రలో భాగంగానే పవన్‌, మరికొందరితో కలిసి ఈ ట్వీట్లు చేస్తున్నారని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ ట్వీట్ల వల్ల తనకు, తన సంస్థలకు తీవ్ర నష్టం కలిగిందని, ఎన్నో ప్రశ్నలను, అవహేళనలను ఎదుర్కోవాల్సి వచ్చిందని, తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని నోటీసులో పేర్కొన్నారు. అందువల్ల ఆ ట్వీట్లపై తగు వివరణ ఇచ్చి బేషరతుగా, రాతపూర్వకంగా, బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ట్వీట్లను తొలగించాలని డిమాండ్‌ చేశారు.
Link to comment
Share on other sites

పవన్, అతని అనుచరులపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు
25-04-2018 13:32:13
 
636602599331381871.jpg
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, అతని అనుచరులపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్‌మీడియాలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై తప్పుడు ప్రచారం చేయడంతో పాటు వ్యక్తులను టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేయడంపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది. మీడియాపై పవన్ కల్యాణ్ ధోరణిని ఎండగడుతూ జర్నలిస్ట్ సంఘాల నేతలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి మద్దతుగా నిలిచారు. మీడియాపై పవన్ కల్యాణ్ బెదిరింపు ధోరణి సరైనది కాదని, తన ధోరణి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జర్నలిస్టులు హెచ్చరించారు. ఒక మీడియాను టార్గెట్ చేస్తే మిగిలిన వాళ్లు సైలెంట్‌గా ఉండడం మంచిది కాదని, పవన్ చేస్తున్న దాడి అన్ని మీడియా సంస్థలకూ వర్తించే విధంగా ఉందని, ఈ విషయంపై అందరూ కలిసికట్టుగా పోరాడాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
 
 
ఈ కార్యక్రమంలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రతినిధులు కృష్ణప్రసాద్, నవీన్, కవిత, మెండు శ్రీనివాస్, వేముల సత్యనారాయణ, మురళి, వెంకట్, సంపత్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ సంఘాల నేతలు విరహత్ అలీ, క్రాంతి కిరణ్, రమేష్ దొంతి, బాలకృష్ణ, శ్యాంసుందర్ తదితరులు హాజరై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి సంఘీభావం ప్రకటించారు.
Link to comment
Share on other sites

మీడియాను బెదిరించే ధోరణిలో పవన్ కల్యాణ్...
25-04-2018 15:52:20
 
636602683396380407.jpg
హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి జర్నలిస్టుల సంఘాల నేతలు మద్దతు పలికారు. మీడియాపై దాడికి నిరసనగా అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం అసన్నమైందని పిలుపు ఇచ్చారు. మీడియాను బెదిరించే ధోరణిలో పవన్ కల్యాణ్ వ్యవహరించడం సరైంది కాదని జర్నలిస్టుల సంఘాల నేతలు అన్నారు. మీడియాను బ్యాన్ చేయాలంటూ కొన్ని రోజులుగా పవన్, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న దాడులు, ప్రతి దాడులకు సంబంధించి ఇవాళ సీసీఎస్‌లో ఏబీఎన్ టీమ్‌తోపాటు ఇతర జర్నలిస్టుల మిత్రులు, టీవీ9, ఇతర సంఘాల నేతలు డీసీపీ మహంతిని కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
 
ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం నేత క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ‘‘మీడియాను పవన్ తన చెప్పుచేతుల్లో ఉంచుకునే విధంగా ప్రవర్తన ఉందని, మీడియా ఆయన మాట వినకపోతే బ్లాక్ మెయిల్ చేస్తాను, వాళ్లకు సంబంధించిన పర్సనల్ వ్యవహారాలను బహిర్గం చేస్తాను...’’ అన్న తీరుగా పవన్ గత నాలుగు రోజులుగా వ్యవహరిస్తున్నారని, ఇది సరికాదని, పవన్ మీడియాను బ్లాక్ మెయిల్ చేయడానికి ట్విట్టర్, సోషల్ మీడియాను ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారని కిరణ్ అన్నారు. పవన్ పర్సనల్ వ్యవహారం గురించి అభ్యంతరకరమైన విషయాలు ప్రసారం చేస్తే.. తన వర్సెన్ చెప్పాలని.. వాటిని కూడా టెలీకాస్ట్ చేస్తామని ఆయన అన్నారు. అంతేకానీ మీడియా ఏదీ ప్రసారం చేయవద్దని, తాను చెప్పిందే ప్రసారం చేయాలంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఏ మీడియాను అయితే బ్యాన్ చేయిస్తామని అన్నారో ఆ మీడియాకు తామంతా అండగా ఉంటామని కిరణ్ అన్నారు. పార్టీ పెట్టిన పవన్... ఎలా నడపాలో తెలుసుకోవాలన్నారు. ఆయన పరువును ఆయనే తీసుకుంటున్నారని, ఇప్పటికైనా పవన్ మారాలని కిరణ్ సూచించారు. పవన్ ధోరణి ఇలాగే ఉంటే ఆయనను హైదరాబాద్ నుంచి పంపివేయాలని జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. పవన్ వల్ల ఇక్కడ శాంతభద్రతల సమస్య వస్తుందని అన్నారు.
Link to comment
Share on other sites

పవన్‌కు పిచ్చి ముదిరింది: విరహత్ ఆలీ
25-04-2018 16:57:10
 
636602722302319813.jpg
 
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు, అనుచరులు చేస్తున్న దాడులు దుర్మార్గాలకు సంబంధించి గతంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాహనాలపై దాడి జరిగింది. జర్నలిస్టులు, మీడియా యాజమాన్యాల మీద పవన్ చేస్తున్న దాడులపై స్పందించిన జర్నలిస్టు సంఘం నేత విరహత్ ఆలీ మాట్లాడుతూ ఇదొక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9, మీడియా... పవన్ కల్యాణ్ మధ్య జరిగిన ఘర్షణ అని అనుకోవడం లేదని, యావత్ భావప్రకటన స్వేచ్ఛ, మీడియాపై జరుగుతున్న దాడిగానే భావిస్తున్నట్లు చెప్పారు. రోజు రోజుకు పవన్ ప్రవర్తన చూస్తుంటే... అతనికి ఎంత పిచ్చి ముదిరిందో అర్థమవుతుందని ఆయన అన్నారు.
 
పవన్ కల్యాణ్ 20 ఏళ్ల క్రితమే వాస్తవాలను బహిర్గతం చేసిన డక్కన్ క్రానికల్ పత్రికపై తన అనుచరులను ఉసిగొల్పి గోలీ సీసాలతో దాడి చేయించారని, అప్పటి నుంచే పవన్‌కు క్రిమినల్ చరిత్ర ఉందని, ఇవాళ కొత్త కాదని విరహత్ ఆలీ అన్నారు. నిజంగా చెప్పాలంటే పవన్ ఇక్కడ కిరాయి వ్యవస్థను నడుపుతున్నట్లు తాము భావిస్తున్నామని ఆయన అన్నారు. ఒక బృందం భౌతిక దాడులకు, మరో బృందం సోషల్ మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఉన్నాయని ఆయన విమర్శించారు. అలాగే ఆందోళనలు చేస్తున్న జర్నలిస్టుల సంఘాలను బ్లాక్ మెయిల్, కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పవన్ అనుచరులు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి పవన్ కల్యాణ్‌లను క్షమించుకుంటూ పోతే మీడియా, రాజకీయ వ్యవస్థకే ప్రమాదమన్నారు. అందుచేత అన్ని మీడియా వ్యవస్థలు అప్రమత్తమై సంఘటితంగా ఎదుర్కోవలసిన అవసరం ఉందని విరహత్ ఆలీ పిలుపు ఇచ్చారు.
Link to comment
Share on other sites

Anchor ravi cheppadu anta naa account kaadhu naa peru medha account open chesi buthulu thiduthunnaru ani. Same all are fake accounts first lo nenu anukonna ee hyper adhi and sudigali sudheer endhuku ee range lo rechi pothunnara ani all are fake and retweets are bots

Link to comment
Share on other sites

Guest Urban Legend
3 minutes ago, sagarkurapati said:

Anchor ravi cheppadu anta naa account kaadhu naa peru medha account open chesi buthulu thiduthunnaru ani. Same all are fake accounts first lo nenu anukonna ee hyper adhi and sudigali sudheer endhuku ee range lo rechi pothunnara ani all are fake and retweets are bots

shatagni team of janasena r running them 

Link to comment
Share on other sites

2 minutes ago, sagarkurapati said:

Anchor ravi cheppadu anta naa account kaadhu naa peru medha account open chesi buthulu thiduthunnaru ani. Same all are fake accounts first lo nenu anukonna ee hyper adhi and sudigali sudheer endhuku ee range lo rechi pothunnara ani all are fake and retweets are bots

Eedi labour batch  bots use chestunnaru ante bagane develop ayyaru social media vishyam lo.  

Link to comment
Share on other sites

3 minutes ago, sagarkurapati said:

Anchor ravi cheppadu anta naa account kaadhu naa peru medha account open chesi buthulu thiduthunnaru ani. Same all are fake accounts first lo nenu anukonna ee hyper adhi and sudigali sudheer endhuku ee range lo rechi pothunnara ani all are fake and retweets are bots

Avi ani fake accounts e hyper gadu facebook lo eppudo cheppadu naku fb tappa inko account ledhu ani motham social media wing vallu open chesaru

Link to comment
Share on other sites

పవన్ కల్యాణ్ ప్రజాస్వామ్యానికి విలన్: నవీన్ చందనాల
25-04-2018 17:25:35
 
636602739349192572.jpg
హైదరాబాద్: పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన కొత్తలోనే ఆయన, అతని అనుచరులు ఏ విధమైన దాడులకు పాల్పడుతున్నారో సభ్య సమాజం చూస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు చేపట్టాల్సిన పవన్.. ఈ విధమైన దాడులకు పాల్పడ్డం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అన్న విషయంపై తెలంగాణ బ్యూరో చీప్ నవీన్ చందనాల మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ముందు మీడియాకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన తన శ్రేణులను రెచ్చగొట్టినట్లు కాదని, భౌతిక దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. సినిమాల్లో హీరోనని, అలాగే బయట కూడా హీరో అని అనుకుంటున్నారని, కానీ ఆయన ప్రజాస్వామ్యానికి విలన్ అని నవీన్ విమర్శించారు.
 
మొన్నటివరకు రాజకీయంగా ప్రజల్లోకి వెళ్లలేక, దీన్ని ఒక అస్త్రంగా వాడుకుని ప్రజల్లోకి వెళ్లాలని పవన్ చూస్తున్నారని, పవన్ పిచ్చి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని నవీన్ అన్నారు. పవన్ ఒక రాజకీయవేత్తగా వ్యవహరించంలేదని, మీడియా సంస్థల అధిపతులు, యాజమాన్యాలను కించపరిచే విధంగా పోస్టుంగులు పెడుతున్న ఆయన మెచ్యూరిటీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని నవీన్ అన్నారు. మొత్తంగా వారం రోజులుగా పవన్ తీరును చూస్తే... రాజకీయంగా బలహీనమవుతున్నారని, కనుక ప్రజల్లోకి వెళ్లేందుకు, సానుభూతి పొందడానికి ఇటువంటి వ్యవహారాలు చేస్తున్నారని నవీన్ విమర్శించారు. కాస్తో... కూస్తో ప్రజల్లో పవన్‌కు కొంత క్రేజ్ ఉండేదని, ఇప్పుడు ఆయన చేష్టలతో ఇమేజ్ మొత్తం పోయిందన్నారు. ఇప్పటికైనా పవన్ తీరు మార్చుకోకపోతే తమ యాజమాన్యాల తరఫున ఎలా బుద్ది చెప్పాలో తెలుసునని, అందుకు సిద్ధంగా ఉన్నామని నవీన్ స్పష్టం చేశారు. పీఎస్‌లో ఫిర్యాదు చేసింది... ఇది తొలి మెట్టు మాత్రమేనని ఆయన అన్నారు.
Link to comment
Share on other sites

49 minutes ago, sonykongara said:

పవన్ కల్యాణ్ 20 ఏళ్ల క్రితమే వాస్తవాలను బహిర్గతం చేసిన డక్కన్ క్రానికల్ పత్రికపై తన అనుచరులను ఉసిగొల్పి గోలీ సీసాలతో దాడి చేయించారని, అప్పటి నుంచే పవన్‌కు క్రిమినల్ చరిత్ర ఉందని, ఇవాళ కొత్త కాదని విరహత్ ఆలీ అన్నారు. నిజంగా చెప్పాలంటే పవన్

Idi matram highlight

Link to comment
Share on other sites

పవన్ అనుచరులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు: జర్నలిస్టు కవిత
25-04-2018 18:43:49
 
636602786289669379.jpg
 
హైదరాబాద్: సంస్కారం.. సంస్కారం... అంటూ మాట్లాడే పవన్ కల్యాణ్ సంస్కార హీనంగా ట్విట్టర్‌లో పెడుతున్న కామెంట్స్... ఎంత వరకు సంస్కారవంతమవుతాయి? పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి ఏబీఎన్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ కవిత మాట్లాడుతూ నటి శ్రీరెడ్డి మొదలు పెట్టిన కాస్టింగ్ కౌచ్ అంశం, తర్వాత ‘మా’ చాంబర్ ముందు ఆమె చేసిన నిరసన ప్రదర్శన, బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ వద్ద ఆమె చేసిన వ్యాఖ్యలు... ఇలా ప్రతి చోట ఏబీఎన్ చాలా సంస్కారవంతంగానే వ్యవహరించిందని చెప్పారు. జర్నలిజం ఎథిక్స్‌ను కూడా ఫాలో అయ్యామని, శ్రీరెడ్డి ఉపయోగించిన కొన్ని అసభ్యకర పదాలను మ్యూట్ చేసి, బ్లర్ చేసి చూపించామన్నారు. అయితే పవన్ అభిమానులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు చేస్తూ, మార్పిడి వీడియోలను కూడా పోస్టు చేస్తున్నారని ఆమె చెప్పారు. అంతేకాకుండా ఒక మహిళా జర్నలిస్టునని కూడా చూడకుండా పోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని కవిత ఆరోపించారు. పవన్ తన అభిమానులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఏబీఎన్ జర్నలిజం, ఎథిక్స్‌ను సంస్కారవంతంగా ఫాలో అవుతున్న విషయాన్ని పవన్ గుర్తు పెట్టుకోవాలని కవిత సూచించారు.
Link to comment
Share on other sites

పవన్ కల్యాణ్‌కి ఏపీయూడబ్లూజే హెచ్చరిక
25-04-2018 20:09:51
 
636602837909198217.jpg
హైదరాబాద్: కొద్ది రోజులుగా మీడియా సంస్థలపై పవన్ కల్యాణ్‌ అవాకులు చవాకులు పేలడాన్ని ఖండిస్తున్నామని ఏపీయూడబ్లూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు, ఐవీ సుబ్బారావు అన్నారు. ఫిల్మ్ ఛాంబర్ వద్ద మీడియా వాహనాలపై దాడి, అనంతరం మీడియాపై పవన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పవన్‌ని చూసి ఆయన అభిమానులు కూడా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతున్నారని చెప్పారు. మీడియా సంస్థలు, మీడియా ప్రతినిధులపై తమ వైఖరి ఇలాగే ఉంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని నల్లి ధర్మారావు, ఐవీ సుబ్బారావు హెచ్చరించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...