Jump to content

AP's Teacher Eligibility Test, DSC schedule Announced


Recommended Posts

ఏపీ‌‌లో డీఎస్సీ, టెట్ షెడ్యూల్స్ విడుదల
28-04-2018 10:45:15
 
636605091149824699.jpg
విశాఖపట్నం: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఏపీ డీఎస్సీ షెడ్యూల్ విడుదలైంది. శనివారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 10,351 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జులై 7న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జూలై 7 నుంచి ఆగస్టు 9వరకు డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్‌లో డీఎస్సీ నిర్వహణ ఉంటుందని, ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహించాలని యోచిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
 
ఆగస్టు 1 నుంచి ఆన్‌లైన్‌లో మాక్ టెస్టు అందుబాటులో ఉంటుదని మంత్రి తెలిపారు. ఆగస్టు 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటలకు వరకు అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 10న ఫైనల్ కీని విడుదల చేస్తామని, అలాగే సెప్టెంబర్ 15న ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆరు కేటరగిల్లో డీఎస్సీ పోస్టుల భర్తీ చేయనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు.
 
 
 
 
 మే 4న టెట్ నోటిఫికేషన్
మరోవైపు ఏపీ టెట్‌ షెడ్యూల్‌ కూడా మంత్రి విడుదల చేశారు. మే 4న టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 5 నుంచి మే 22 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ఉండనుంది. అలాగే జూన్ 3 నుంచి టెట్ హాల్ టికెట్లు జారీ చేయనున్నారు. జూన్ 10 నుంచి 21వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయి. జూన్ 28న ఫైనల్ కీ, జూన్ 30న పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.
Link to comment
Share on other sites

10,351 టీచర్‌ పోస్టులు
29-04-2018 02:40:17
 
636605664172010123.jpg
  • జూలై ఆరున డీఎస్సీ ప్రకటన
  • తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షలు
  • ఏపీపీఎస్సీకి నిర్వహణ బాధ్యత
  • ఆగస్టు 23 నుంచి పరీక్షలు
  • మే 4న మరో టెట్‌ నోటిఫికేషన్‌
విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి నగారా మోగనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,351 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జూలై 6న అధికారిక ప్రకటన (నోటిఫికేషన్‌) విడుదల చేయనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆరు కేటగిరీలకు సంబంధించిన 10,351 టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తాం. ఆగస్టు 23 నుంచి 30 వరకు రాత పరీక్షలు నిర్వహిస్తాం. సెప్టెంబరు 15న ఫలితాలు విడుదల చేస్తాం’’ అని ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునన్నారు. సెకండరీ గ్రేడ్‌, స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లతోపాటు మోడల్‌ పాఠశాలల్లో మొత్తం 10,351 ఖాళీలు ఉన్నాయన్నారు. తొలిసారిగా డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌ విధానం లోనిర్వహిస్తున్నట్టు మంత్రి గంటా చెప్పారు. ఇప్పటివరకు డీఎస్సీని ప్రభుత్వం నిర్వహిస్తుండగా, ఈసారి ఏపీపీఎస్సీకి అప్పగించామన్నారు.
 
మరోసారి టెట్‌...
ఉపాధ్యాయ పోస్టులకు మరికొంతమంది దరఖాస్తు చేసుకునేలా మరోసారి టెట్‌ నిర్వహిస్తామని మంత్రి గంటా తెలిపారు. టెట్‌కు సంబంధించి మే 4న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. టెట్‌ జూన్‌ 10న ప్రారంభమై 21తో ముగుస్తుందని, ఫలితాలు జూన్‌ నెలాఖరున వెల్లడిస్తామని చెప్పారు. డీఎస్సీ, టెట్‌ సిలబ్‌సను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. ఈసారి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లకు కూడా టెట్‌ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి పాఠశాలలో వ్యాయామ విద్యను తప్పనిసరి చేస్తున్నట్టు చెప్పారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో టెట్‌కు సంబంధించి 150 మార్కులు ఉంటాయన్నారు. ఇందులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొన్న క్రీడాకారులు, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన అభ్యర్థులకు గరిష్ఠంగా 30 మార్కులు వెయిటేజీ కల్పిస్తున్నట్టు తెలిపారు. జాతీయ ఉపాధ్యాయ మండలి నిబంధనలకు లోబడి ఏడాదికి రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తున్నామని, డీఎస్సీలో దీనికి 30 మార్కులు కేటాయిస్తున్నామని మంత్రి వివరించారు.
 
మేనిఫెస్టో ప్రకారమే..!
‘బాబు వస్తే జాబు వస్తుంది’ అన్న టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీకి అనుగుణంగానే చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని గంటా తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా తమ ఐదేళ్ల పాలనలో ఇంత పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టలేదన్నారు. రూ.4,300 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. వేసవి తీవ్రత దృష్ట్యా ‘మన ఊరు-మన బడి’ని జూన్‌కు వాయిదా వేసినట్టు తెలిపారు.
 
 
ఖాళీలు ఇవీ..
 
జెడ్పీ, ఎంపీ పాఠశాలు - 5,614
మునిసిపల్‌ పాఠశాలు - 1,447
రద్దయిన వాటి స్థానంలో కొత్తవి - 3,290
ఎస్‌జీటీ పోస్టులు - 4,967
స్కూల్‌ అసిస్టెంట్లు - 2,978
భాషా పండితులు - 312
పీఈటీలు - 1,056
సంగీతం/నృత్యం - 109
మోడల్‌ పాఠశాలలు - 929
 
 
డీఎస్సీ షెడ్యూల్‌ ఇలా..
ప్రకటన విడుదల జూలై 6
ఫీజులు చెల్లించే తేదీలు-    6.7.18 నుంచి 8.8.18
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ -7.7.18 నుంచి 9.8.18 వరకు
హెల్ప్‌డెస్క్‌ సేవలు-      06.07.18 నుంచి 26.0918
ఫిర్యాదుల స్వీకారం -06.07.18 నుంచి 26.0918
ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టు -01.082018 నుంచి
హాల్‌ టికెట్లు- 15.08.18
రాత పరీక్ష -23.08.18 నుంచి 30.08.18 (ఉదయం 9.30 నుంచి 12.00 -
మధ్యాహ్నం -2.30 నుంచి 5.00)
ప్రాథమిక కీ విడుదల -31.08.18
కీపై అభ్యంతరాల స్వీకరణ -31.08.18 నుంచి
ఫైనల్‌ కీ -10.09.18
ఫలితాల వెల్లడి -15.09.18
f.jpg
Link to comment
Share on other sites

టెట్‌ ప్రకటన విడుదల
ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ప్రకటన(నోటిఫికేషన్‌)ను ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం జారీ చేసింది. ఈసారి టెట్‌లో కొత్తగా వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పేపర్‌-2(బీ)ని ప్రవేశపెట్టారు. గతంలో టెట్‌ను మూడుపేపర్లుగా నిర్వహించగా ఈసారి రెండు పేపర్లకే పరిమితం చేశారు. కానీ, పేపర్‌-2ను ఏ, బీగా విభజించారు. పేపర్‌-1ను ఎస్జీటీలకు, పేపర్‌-2(ఏ)ను గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం, భాషా పండితులకు, పేపర్‌-2(బీ)ని వ్యాయామ ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తారు.
మార్పులకు అవకాశం లేదు.. అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తును పూర్తి చేసి, ఆన్‌లైన్‌లో సమర్పిస్తే ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తులో తప్పుగా నమోదు చేస్తే మరోసారి కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇందుకు అదనంగా మరో రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ప్రవేశ పరీక్షల్లోనూ దరఖాస్తుల్లోని తప్పులను సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తుండగా.. పాఠశాల విద్యాశాఖ మాత్రం ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.

వ్యాయామ ఉపాధ్యాయులకు ఇలా..
వ్యాయామ ఉపాధ్యాయులకు రాష్ట్రంలో మొదటిసారిగా టెట్‌ నిర్వహిస్తున్నారు. వీరి కోసం పేపర్‌-2(బీ)ని ప్రవేశపెట్టారు. 150మార్కులకు ఇచ్చే ప్రశ్నపత్రంలో వ్యాయామ విద్య పెడగాజీకి 30మార్కులు, భాష-1కు 10మార్కులు, భాష-2కు 10మార్కులు, వ్యాయామ విద్య(కంటెంట్‌)కు 100మార్కులకు ప్రశ్నలు ఇవ్వనున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులకు వారు సాధించిన పతకాల ఆధారంగా మార్కులు అదనంగా కలపనున్నారు. అంతర్జాతీయ, జాతీయ, జోనల్‌, రాష్ట్ర స్థాయి పతకాల ఆధారంగా 30, 25, 20మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నారు. ఉదాహరణకు ఒక అభ్యర్థికి టెట్‌లో 150మార్కులకు గాను 60మార్కులు వచ్చాయనుకుంటే.. అతనికి వచ్చిన పతకాలకు 30మార్కులు వస్తే మొత్తం 90 మార్కులు వచ్చినట్లు పరిగణిస్తారు. మొత్తంగా మార్కులు మాత్రం 150కి మించవు.

షెడ్యూల్‌ ఇలా..
* ఆన్‌లైన్‌ దరఖాస్తు రుసుములు చెల్లింపు: శనివారం నుంచి ఈ నెల 22వరకు
* దరఖాస్తులు: శనివారం నుంచి ఈ నెల 23వరకు
* ఆన్‌లైన్‌ సన్నాహక పరీక్ష (మాక్‌టెస్ట్‌): 25నుంచి
* హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: జూన్‌ 3నుంచి
* పేపర్‌-1 పరీక్ష: జూన్‌ 10 నుంచి 12వరకు
* పేపర్‌-2(ఏ): 13నుంచి 15వరకు, 17నుంచి 19వరకు
* పేపర్‌-2(బీ): 21న
* ప్రాథమిక ‘కీ’ విడుదల: 22న
* అభ్యంతరాల స్వీకరణ: 26వరకు
* తుది‘కీ’ విడుదల: 28న
* ఫలితాలు: 30న

 

ముఖ్యాంశాలు

 
Link to comment
Share on other sites

  • 1 month later...
ఆగస్టు 24 నుంచి డీఎస్సీ 
పరీక్షలు ఆన్‌లైన్‌లో 
10,351 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ 
జులై 6న నోటిఫికేషన్‌ 
నేటి నుంచి 19 వరకు రెండో టెట్‌ 
113 కేంద్రాల్లో పరీక్ష 
వెంటనే మార్కుల వెల్లడి 
మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి 
ఈనాడు డిజిటల్‌ - విశాఖపట్నం 
9ap-main3a.jpg

రాష్ట్రంలో 10,351 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆగస్టు 24 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ-2018 పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విశాఖలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈసారి పరీక్షల నిర్వహణను ఏపీపీఎస్సీకి అప్పజెప్పినట్లు చెప్పారు. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం రాగానే ఏపీపీఎస్సీ అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటిస్తుందన్నారు. పరీక్షలు ఆన్‌లైన్‌లోనే ఉంటాయన్నారు.పిల్లలకు సంగీతం, నృత్యం నేర్పించడానికి వీలుగా ఆయా పోస్టులను తొలిసారిగా భర్తీచేస్తున్నట్లు గుర్తుచేశారు. ఈసారి ఉపాధ్యాయులుగా  ఎంపికైన వారితో ముఖ్యమంత్రి నేరుగా సమీక్షించి ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావాన్ని తెలియజేసేలా ప్రతిజ్ఞ చేయిస్తారని చెప్పారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సర్కారు ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరించింది. 2014 జూన్‌ 1 నుంచి 2018 మార్చి 31 వరకు ఉన్న ఖాళీలను ఆగస్టులో నిర్వహించబోయే డీఎస్సీ-2018 ద్వారా భర్తీ చేయనున్నారు. పురపాలిక, మోడల్‌ పాఠశాలల్లో ఖాళీలతో పాటు గతంలో కొన్ని పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా ఏర్పడిన కొత్త ఖాళీలను వేరుగా చూపించారు. వీటినీ జిల్లాల వారీగా విభజించి త్వరలోనే అధికారిక డీఎస్సీ ప్రకటనలో పూర్తిస్థాయిలో ఖాళీలను చూపించే అవకాశం ఉంది.

9ap-main3b.jpg 
9ap-main3c.jpg

రెండో టెట్‌కు 3,97,957 మంది.. 
ఆదివారం నుంచి ఈనెల 19 వరకు జరగనున్న రెండో టెట్‌కు 3,97,957 మంది దరఖాస్తు చేసినట్టు మంత్రి గంటా తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో మొత్తం 113 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 14,891 మంది కేంద్రాలు ఎక్కడ కావాలో ఆప్షన్‌ పెట్టుకోలేదు. వీరికి సమీప కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని మంత్రి పేర్కొన్నారు. టెట్‌ పరీక్షను రెండు విడతలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో విడతలో 27,495 మందికి అవకాశం ఉందని, ఇలా రోజుకు 54,990 మంది పరీక్షలు రాస్తారని గంటా వివరించారు. సందేహాల నివృత్తి కోసం 95056 19127, 95057 80616, 95058 53627 నంబర్లు హెల్ప్‌లైన్‌ కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సారి టెట్‌ ఫలితాలను ఆన్‌లైన్‌లో వెంటనే తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పరీక్ష పూర్తయ్యాక సబ్‌మిట్‌ బటన్‌ నొక్కగానే ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి మూడో తేదీ వరకు మొదటిసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి 4.46 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 4.10 లక్షల మంది పరీక్షలు రాశారు. డీఎస్సీ 2018లో ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం మరోసారి టెట్‌ నిర్వహించడానికి ముందుకొచ్చింది.

జిల్లాకు ఇద్దరు డీఈవోలు 
విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు వీలుగా జిల్లాకు ఇద్దరు డీఈవోలను నియమించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. డీఎస్సీ- 2014 ద్వారా పది వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో పది వేలు భర్తీ చేసి రాష్ట్రాన్ని విద్యా కూడలిగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలో మౌలిక వసతుల కోసం ఈ ఏడాది రూ.4,850 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. ఇకపై ఏ పాఠశాలలోను చెట్ల కింద తరగతలు నిర్వహించే పరిస్థితి, నేలపై విద్యార్థులు కూర్చొనే దుస్థితి ఉండదని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 
జిల్లాల వారీగా జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలల విభాగాల్లో ఖాళీల వివరాలు...

9ap-main3d-sml.jpg
Link to comment
Share on other sites

నేటి నుంచి టెట్‌
10-06-2018 02:38:31
 
విశాఖపట్నం, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఆదివారం నుంచి ఈ నెల 19 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాల అభ్యర్థుల కూడా పోటీ పడుతున్నారని తెలిపారు. మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకొన్నారని, వారి కోసం 113 పరీక్షా కేంద్రాలు కేటాయించామన్నారు. రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తొలి సెషన్‌, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5గంటల వరకూ రెండో సెషన్‌ పరీక్ష ఉంటుంది.
పరీక్ష ముగిసిన వెంటనే కంప్యూటర్‌ స్ర్కీన్‌పై సుమారుగా మార్కులు తెలిసిపోయేలా ఏర్పాట్లు చేశామని గంట్రా చెప్పారు. సందేహాలు 9505619127, 9505780616, 9505853627 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు.
 
రేపటి నుంచి టెన్త్‌ సప్లిమెంటరీ
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి గంటా చెప్పారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
850 పోస్టులతో స్పెషల్‌ డీఎస్సీ
04-07-2018 04:00:31
 
  • ఔట్‌ సోర్సింగ్‌లో మరో 250: ఆనందబాబు
 
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 850 ఉపాధ్యాయ పోస్టులను స్పెషల్‌ డీఎస్సీ నిర్వహించి ఏపీపీఎస్సీతో ద్వారా భర్తీ చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. మరో 250 ఉపాధ్యాయ పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయడానికి ఆర్థికశాఖ అనుమతి కోరామని, అనుమతి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామన్నారు. గురుకుల పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమని మంత్రి చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల 13 జిల్లాల కోఆర్డినేటర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
Link to comment
Share on other sites

ఆరునే డీఎస్సీ
04-07-2018 03:59:27
 
636662735687747910.jpg
  • 1-2 రోజుల్లో ఆర్థికశాఖ అనుమతులు: గంటా
  • డీఈడీ కళాశాలల పనితీరుపై కమిటీ
  • ప్రమాణాలు లేకపోతే మూసివేస్తామని హెచ్చరిక
 
 
విశాఖపట్నం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ-2018 ప్రకటనను ఈనెల ఆరో తేదీన విడుదల చేస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో మంగళవారం ఉదయం డీసెట్‌ ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. డీఎస్సీలో కొన్ని పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి రావలసి ఉందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి పేషీ అధికారులు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారన్నారు. బహుశా ఒకటి, రెండు రోజుల్లో అనుమతి వస్తుందని, ఆరున డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల చేస్తామని, దీనిపై సందేహాలు వద్దన్నారు.
 
కాగా, రాష్ట్రంలో 767 ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో చాలా వాటిలో కనీస ప్రమాణాలు పాటించడం లేదని, తరగతులకు విద్యార్థులు హాజరుకారని, అధ్యాపకులు ఉండరనేది వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. వీటిలో బోగస్‌ కళాశాలలు ఉన్నాయని, అయితే అనేక కారణాలతో ఇటువంటివి కొనసాగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డీఈడీ కళాశాలల్లో విద్యా ప్రమాణాల తనిఖీకి కమిటీ వేస్తామన్నారు. ప్రమాణాలు లేవని కమిటీ నిర్ధారిస్తే అటువంటి కళాశాలలను మూసివేస్తామన్నారు. బడిపిల్లల యూనిఫారాల నాణ్యతపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆప్కోకు ఆర్డర్‌ ఇస్తే...ప్రైవేటు మిల్లుల నుంచి కొనుగోలు చేసి యూనిఫారాలు సరఫరా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది నుంచి ఆప్కోను తప్పించి ముందుగా మిల్లుల నుంచి సరఫరా చేసేలా టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. లేదంటే తల్లిదండ్రులకే డబ్బులిచ్చి యూనిఫారాలు కొనుగోలు చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కమిషనర్‌ కె.సంఽధ్యారాణి, ఏయూ పాలకమండలి సభ్యుడు పి.సోమనాథ్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావు, డీసెట్‌ కన్వీనర్‌ పి.పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

రేపే డీఎస్సీ నోటిఫికేషన్‌!
05-07-2018 15:00:39
 
636663996404177553.jpg
  • బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ అవకాశం
  • కేంద్ర నిర్ణయంపై డీఈడీ అభ్యర్థుల్లో ఆందోళన
  • బ్రిడ్జి కోర్సు ఏంటని ప్రశ్నిస్తున్న నాయకులు
 
కాకినాడ: ఈ నెల 6న డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని విశాఖపట్టణంలో విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇందుకోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోపక్క డీఈడీ అభ్యర్థుల్లో ఆందోళన ఏర్పడింది. బీఈడీ అభ్యర్థులు కూడా సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రప్రభుత్వం గెజిట్‌ జారీచేయడంతో తమ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు పోటీ వస్తారని డీఈడీ అభ్యర్థులు సందిగ్ధంలో పడ్డారు. బీఈడీ అభ్యర్థులు డీఎస్సీలో పోస్టు సాధిస్తే, ఉద్యోగంలో చేరిన రెండేళ్లలో ఆరునెలల బ్రిడ్జికోర్సు చేయాలని కేంద్రం కొర్రీ పెట్టింది. ఇప్పటికే తాము క్వాలిఫైడ్‌ అని, బ్రిడ్జికోర్సు చేయమని బీఈడీ నిరుద్యోగుల రాష్ట్ర సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమకు ఎస్జీటీ అవకాశం కల్పించాలని పదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని, ఫలితం దక్కిందని సంబరపడుతోన్న నేపథ్యంలో ఇటువంటి అసంబద్ద నిర్ణయాలు ఏంటని వాపోతున్నారు. టీచర్‌ ఉద్యోగాలకు అర్హులైన తమకు మళ్లీ బ్రిడ్జికోర్సు ఏంటని సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
 
 
ఖాళీలపై అస్పష్టత
టీచర్‌ కొలువులకు అర్హతకు కీలక ఘట్టం టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌) ముగిసింది. ఇక నోటిఫికేషన్‌ మిగిలి ఉంది. జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయనే అంశంపై అస్పష్టత నెలకొంది. ఉపాధ్యాయ కొలువులు భర్తీచేసి నాలుగేళ్లు గడుస్తోంది. ఉమ్మడి ఏపీలో ఓ దఫా డీఎస్సీ నిర్వహించి ప్రభుత్వం మమ అనిపించేసింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 6 వేల టీచర్‌ కొలువులను భర్తీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత టీచర్‌ కొలువులను భర్తీ చేయలేదు. ఈసారి డీఎస్సీలో 14 వేలకు పైగా టీచర్‌ కొలువులు భర్తీ చేస్తామని, ఈ ప్రక్రియ ఏపీపీఎస్పీకి అప్పగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహిస్తే జిల్లాలో ఎన్ని టీచర్‌ పోస్టులు ఖాళీలున్నాయో ముందుగా ప్రకటించాల్సి ఉందని, కటాఫ్‌ మా ర్కులు రోస్టర్‌ వారీ పోస్టులను స్పష్టం చేయాలని అభ్యర్థులు పట్టుపడుతున్నారు. ఇవేమి ప్రకటించకుండా నోటిఫికేషన్‌ జారీ చేయవద్దని డిమాండ్‌ చేస్తున్నారు.
 
 
పోస్టులు పెరిగే అవకాశం
తెలుగు 74, హిందీ 70, ఇంగ్లీషు 47, సంస్కృతం 4, ఉర్దూ2, గణితం 45, పీఎస్‌ 31, ఎన్‌ఎస్‌ 60, సోషల్‌ 84, పీఈటీ 52, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ)-356, ఉర్దూ13, ఎల్‌పీ తెలుగు 54, ఎల్‌పీ హిందీ 94, ఎల్‌పీ సంస్కృతం 6, ఎల్‌పీ ఉర్దూ2, పీఈటీ 133. ఎల్‌పీ హిందీ, తెలుగు, ఎన్‌ఎస్‌ పోస్టుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. ఎల్‌పీ హిందీ సబ్జెక్టుకు సంబంధించి 400 మంది విద్యార్థులకు కొన్ని చోట్ల ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. దీంతో ఈ పోస్టులు కూడా పెరిగే సూచనలున్నాయి.
 
‘బీఏ లిట్‌’ వారినే అనుమతించాలి
స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) ఇంగ్లీష్‌ పోస్టులకు బీఏలో ఇంగ్లీష్‌ ఒక సబ్జెక్టుగా చదివిన వారికి అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎస్‌ఏ విభాగంలో లెక్కలు, తెలుగు, సోషల్‌స్టడీస్‌, ఫిజికల్‌ సైన్స్‌, బయాలజీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తుంది. వీటన్నింటికి సంబంధిత డిగ్రీలో ఒక సబ్జెక్టుగా ఆయా సబ్జెక్టులు చదివినవారినే అనుమతిస్తున్నారు. కానీ ఇంగ్లీష్‌ పోస్టులకు డిగ్రీలో లిటరేచర్‌ చదవకపోయినా, పీజీలో ఎంఏ చేసిన వారికి అవకాశం ఇస్తున్నారు. తదనుగుణంగా డిగ్రీ మూడు సంవత్సరాల ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చదివిన వారికి అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 
 
ఇవీ లెక్కలు
జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 3,917 పాఠశాలలున్నాయి. వీటిలో 2,734 ప్రాథమిక పాఠశాలలు, 364 ప్రాథమికోన్నత పాఠశాలలు, 534 ఉన్నత పాఠశాలలు, 285 పురపాలక, నగరపాలక సంస్థల పాఠశాలలు, 155 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 16,252 మంది ప్రస్తుతం ఉపాధ్యాయులున్నారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 2,094 మంది, ప్రాథమిక పాఠశాలలో 4584 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7672 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 2014 డీఎస్సీ తరువవాత ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు. పదోన్నతులు, ఉద్యోగ విరమణలు కారణంగా చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ విధంగా జిల్లాలో 1500కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటాయని ఉపాధ్యాయ సంఘనేతలు చెప్తున్నారు. గతంలో డీఎస్సీ ప్రకటనకు ముందు డీఈవో కార్యాలయం నుంచి ప్రభుత్వానికి 1150కి పైగా ఖాళీలు ఉన్నాయని నివేదిక వెళ్ళినట్టు సమాచారం. తాజా పరిస్థితి బట్టి ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చని సమాచారం.
Link to comment
Share on other sites

టీచర్‌ పోస్టులకు 2 నోటిఫికేషన్లు?
06-07-2018 02:23:49
 
  • ఎస్‌జీటీ పోస్టులకు ‘టెట్‌ కమ్‌ టీఆర్‌టీ’!..
  • ఇతర కేటగిరీలకు ‘డీఎస్సీ’
  • బీఎడ్‌లకు ఎస్‌జీటీ అర్హత కల్పించడంతో సర్కారు సరికొత్త ఆలోచన
  • నేడు కీలక ప్రకటన
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ) పోస్టుల వరకు ‘టెట్‌ కమ్‌ టీఆర్‌టీ’ విధానంలోను, ఇతర కేటగిరీ పోస్టులకు డీఎస్సీ రూపంలో నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఎస్‌జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులకూ అర్హత కల్పిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో ఈ విధమైన అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు కావాల్సిన టెట్‌లో అర్హత లేకపోవడంతో.. వారికి నష్టం లేకుండా ‘టెట్‌ కమ్‌ టీఆర్‌టీ’ పద్ధతిలో నోటిఫికేషన్‌ ఇచ్చి నియామకాలు చేయడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల సాంకేతికపరమైన సమస్యలు ఎదురుకాబోవని అనుకుంటున్నారు. డీఎస్సీ-2014లో పాఠశాల విద్యాశాఖ ఈ తరహాలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
 
ఇప్పుడు ఎస్‌జీటీ పోస్టుల వరకు అలాచేస్తే.. డీఎడ్‌లతో పాటు బీఎడ్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకుని మెరిట్‌ ప్రాతిపదికన నియమితులయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ అంశంపై శుక్రవారం కీలక ప్రకటన విడుదల కానుందని సమాచారం. ఇదిలా ఉండగా.. టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థికశాఖ గురువారం కసరత్తు ప్రారంభించింది. పాఠశాల విద్యాశాఖ గతంలో పంపిన ప్రతిపాదనలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్ర గురువారం విద్యాశాఖ అధికారులతో చర్చించారు. గతంలో ప్రతిపాదించిన కొన్ని పోస్టులకు సంబంధించి మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్న దానిపైనా చర్చించారు. ఈసారి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్యను పెంచేలా కసరత్తు జరుగుతోంది. టీచర్‌ పోస్టులకు సంబంధించి మరింత అదనపు సమాచారం కావాలని పాఠశాల విద్యాశాఖను ఆర్థికశాఖ కోరింది. శుక్రవారం మరోసారి చర్చించి భర్తీ చేయదలచిన పోస్టులకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది.
 
పాత పద్ధతిలోనే భర్తీ!
డీఎస్సీ -2018 నిర్వహణ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించాలన్న ఆలోచనను సర్కారు వెనక్కు తీసుకుంది. ప్రస్తుత అమలులో ఉన్న విధానంలోనే భర్తీ చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. విశ్వవిద్యాలయాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ భర్తీకి సంబంధించిన స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో డీఎస్సీ నిర్వహణ బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించరాదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Link to comment
Share on other sites

వారంలో డీఎస్సీ ప్రకటన
ప్రయత్నాలు సాగుతున్నాయని మంత్రి గంటా వెల్లడి
6ap-main3a.jpg

ఈనాడు, అమరావతి: వారం రోజుల్లో డీఎస్సీ ప్రకటన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి లభించకపోవడం, సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ వారికి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అవకాశం కల్పించిన నేపథ్యంలో శుక్రవారం ఇవ్వాల్సిన డీఎస్సీ ప్రకటన వాయిదా వేసినట్లు తెలిపారు. పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సఫ్లిమెంటరీ ఫలితాలు విడుదల సందర్భంగా ఆయన విలేకర్లతో  మాట్లాడారు. మొత్తం 10,351 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదానికి దస్త్రం పంపామని, ఆర్థిక శాఖ కొన్నింటిపై వివరణ కోరిందని వివరించారు. ఆ వివరాలను విద్యాశాఖ అధికారులు అందించారని వెల్లడించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పిలిచిన హైబ్రిడ్‌ యాన్యూటీ టెండర్లలో ప్రీమియం రేట్ల కంటే 15% అధికానికి బిడ్లు దాఖలు చేయడంతో రద్దు చేశామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి గెజిట్‌ నోటిఫికేషన్‌ నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) రెండు కలిపి నిర్వహించాలా? లేదా ఒకే సమయంలో టెట్‌, టీఆర్టీ వేర్వేరుగా నిర్వహించాలా? అనేదానిపై కసరత్తు చేస్తున్నామని ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు.

అదంతా మీడియా సృష్టే..: ముఖ్యమంత్రికి తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని, అదంతా మీడియా సృష్టేనని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి గంటా  తెలిపారు. రైల్వేజోన్‌ కోసం విశాఖపట్నంలో ఇటీవల ఎంపీలు నిర్వహించిన దీక్షకు ఉదయమే హాజరై, అల్లూరు సీతారామరాజు జయంతి కార్యక్రమం ఉండడంతో వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించారు. తాను పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూనే ఉన్నానని తెలిపారు.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
211 ఉర్దూ టీచర్‌ పోస్టుల భర్తీ 
టెట్‌, టీఆర్టీ కలిపి నిర్వహణ 
4 నుంచి దరఖాస్తుల స్వీకరణ 
రాతపరీక్ష  సెప్టెంబరు 16న

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)తో కలిపి నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ)-2014లో మిగిలిన సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల(ఉర్దూ) ఖాళీలను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో నిర్వహించినట్లే టెట్‌, టీఆర్టీ కలిపి 180మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరిలో మొత్తం 211 ఖాళీలను ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లా, మండలపరిషత్తు, పురపాలిక పాఠశాలల్లో ఖాళీలను జిల్లాలవారీగా వెల్లడించింది. విశాఖపట్నం, విజయవాడ, కడప జిల్లాల్లో సెప్టెంబరు 16న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)కు 20% వెయిటేజీ ఇవ్వనున్నారు. ప్రశ్నాపత్రం ఉర్దూ మాధ్యమంలోనే ఉంటుంది. బీసీలకు 50%, ఎస్సీ, ఎస్టీ, విభిన్నప్రతిభావంతులకు 40%, మాజీ సైనికోద్యోగులు కోటాకు 40% అర్హత మార్కులుగా నిర్ణయించారు. పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

దరఖాస్తు ప్రక్రియ.. 
* దరఖాస్తు రుసుము చెల్లింపు: ఆగస్టు 3వ తేదీ నుంచి 13వరకు 
* ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ: 4 నుంచి 14 వరకు 
* ఆన్‌లైన్‌ దరఖాస్తులపై ఫిర్యాదులు స్వీకరణ: 4-23వరకు 
* స్వీయ ధ్రువీకరణతో అర్హత ధ్రువీకరణ పత్రాలు, దరఖాస్తు డీఈవోలకు సమర్పణ: 25నుంచి 30 వరకు 
* హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌: సెప్టెంబరు 5నుంచి 
* రాత పరీక్ష: సెప్టెంబరు 16న 
* ప్రాథమిక ‘కీ’ విడుదల: సెప్టెంబరు 16న 
* ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు: 16 నుంచి 18వరకు 
* తుది ‘కీ’ విడుదల: 21న 
* ఫలితాలు విడుదల: సెప్టెంబరు 23న

31ap-main7a.jpg
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఎయిడెడ్‌ టీచర్లకు కామన్‌ టెస్ట్‌
10-08-2018 02:30:57
 
  •  కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహణ
  • ఇంటర్వ్యూల్లేవ్‌..మెరిట్‌ కమ్‌ రోస్టరే
  •  నోటిఫికేషన్‌ జారీ చేసేది కమిషనర్‌
  •  మేనేజ్‌మెంట్ల అధికారానికి కత్తెర
అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఇకపై ‘కామన్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌’ను నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయిలో కంప్యూటర్‌ ఆధారితంగా ఈ పరీక్ష జరపాలని సంకల్పించింది. మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ ప్రాతిపదికన టీచర్ల నియామకాలు పారదర్శకంగా చేపట్టదలచింది. ఇకపై టీచర్ల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు ఉండబోవని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలకు తెరదించుతూ.. పూర్తిగా పారదర్శకంగా ప్రక్రియను పూర్తిచేసేందుకు సన్నద్ధమైంది. అంటే ఇప్పటి వరకూ నియామకాల్లో ఎయిడెడ్‌ విద్యాసంస్థల మేనేజ్‌మెంట్లు చెలాయిస్తున్న అధికారాలకు కత్తెర పడిందన్న మాట. ఆయా నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యా కమిషనర్‌ విడుదల చేస్తారు.
 
ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఎస్టాబ్లి్‌షమెంట్‌, రికగ్నిషన్‌, అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ స్కూల్‌ అండర్‌ ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌) రూల్స్‌-1993కి అనుగుణంగా 1994లో విడుదల చేసిన జీ.వో.ఎం.ఎ్‌స.నం.1లోని రూల్‌-12ని పూర్తిగా సవరించింది. రూల్‌-13ని పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ గురువారం ఉత్తర్వులు (జీ.వో.ఎం.ఎ్‌స.నం.43) జారీచేశారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ అంతా ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మేనేజ్‌మెంట్ల పాత్ర ఉండదు. ఎయిడెడ్‌ స్కూళ్లలోని టీచర్‌ పోస్టులకు దరఖాస్తుచేసుకునే వారు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. విద్యార్హతలు, వయోపరిమితి నిబంధనలు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలకు మాదిరిగానే ఉంటాయి. రిక్రూట్‌మెంట్‌కు మార్గదర్శకాలను పాఠశాల విద్యా కమిషనర్‌ విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను పూర్తిచేసేందుకు టైమ్‌ షెడ్యూల్‌ను కమిషనర్‌ నిర్దేశిస్తారు.
 
పాఠశాల విద్యా కమిషనరేట్‌లో అడిషనల్‌ డైరెక్టర్‌ హోదాకు తక్కువ కాని అధికారిని ఎయిడెడ్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(ఏసీఆర్‌టీ) నిర్వహణకు కన్వీనర్‌గా నియమిస్తారు. పాఠశాల మేనేజ్‌మెంట్‌ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఖాళీ పోస్టులను జిల్లా విద్యాధికారి ఖరారు చేస్తారు. వాటిని ప్రభుత్వానికి పంపిస్తారు. పదోన్నతులు, రేషనలైజేషన్‌ ప్రక్రియలను పూర్తిచేసిన తర్వాతే ఖాళీ పోస్టులను నిర్ధారిస్తారు. 80ు పోస్టులను స్థానిక అభ్యర్థులతో, 20ు పోస్టులను స్థానిక, స్థానికేతర అభ్యర్థులందరిలో కలిపి మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. బోధనేతర పోస్టులను భర్తీ చేసేందుకు విడిగా పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఇచ్చిన ఆప్షన్‌ను బట్టి నియామకాలు చేపడతారు. ఎయిడెడ్‌ టీచర్ల రిక్రూట్‌మెంట్‌ కోసం కామన్‌టెస్ట్‌ నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ ఎయిడెడ్‌ టీచర్స్‌గిల్డ్‌ హర్షం వ్యక్తం చేసింది.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
డీఎస్సీపై 2 రోజుల్లో ప్రకటన
05-09-2018 03:01:37
 
636717132971528876.jpg
  • త్వరలో 1345 మంది ప్రొఫెసర్ల నియామకం: మంత్రి గంటా
మంగళగిరి, సెప్టెంబరు 4: డీఎస్సీకి సంబంధించి రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్సీపై గురువారం జరిగే కేబినెట్‌ సమావేశంలో చర్చించి స్పష్టమైన ప్రకటన ఇస్తామన్నారు. మునిసిపల్‌ పాఠశాలలకు, స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు, ఎస్‌ఏలు, ఎస్జీటీలు ఎంతమందిని కేటాయించాలనే దానిపై స్పష్టత రాలేదన్నారు. రాష్ట్రంలో 1,345 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త వర్సిటీలైన అంబేడ్కర్‌, యోగి వేమన, కృష్ణా, రాయలసీమ యూనివర్సిటీలలో 275 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా విద్యా రంగంలో 17వ స్థానంలో ఉన్న ఏపీని సీఎం చంద్రబాబు కృషితో మూడో స్థానానికి తీసుకువచ్చామన్నారు.
Link to comment
Share on other sites

10 వేల టీచర్‌ పోస్టులు
06-09-2018 03:15:32
 
  • త్వరలోనే డీఎస్సీతో భర్తీ చేస్తాం
  • గురువుకే అగ్ర తాంబూలం ఇస్తాం
  • రాష్ట్రంలో నేనే కూలీ నంబర్‌ 1: సీఎం
  • పిల్లల కోసం ఎంతైనా కష్టపడదాం
  • అలా శ్రమిస్తేనే విద్యలో ఫలితాలు
  • ప్రపంచాన్ని జయించే శక్తి వారికిద్దాం
  • ఒత్తిడి చదువుల పద్ధతిని వదిలేద్దాం
  • ఆ బృహత్తర బాధ్యత అధ్యాపకులదే
  • గురుపూజోత్సవంలో సీఎం ఉద్ఘాటన
  • 167మంది ఉత్తమ టీచర్లకు సత్కారం
అమరావతి, మంగళగిరి టౌన్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా, ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను రాష్ట్రంలో నంబర్‌ వన్‌ కూలీలా కష్టపడుతున్నానని, అందరం ఇదే స్థాయిలో శ్రమిస్తే అత్యుత్తమ ఫలితాలు తప్పక సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపేదిగా చదువు ఉండాలని ఆకాంక్షించిన ఆయన, ఒత్తిడి నడుమ విద్యను అభ్యసించే పరిస్థితి పోయి, ఆహ్లాదంగా, ఆనందంగా విద్యను అర్జించే పరిస్థితులను కల్పించాల్సి ఉన్నదన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరి (ఆత్మకూరు) సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించింది.
 
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి పాల్గొని, ఉత్తమ గురువులకు పురస్కారాలను అందించారు. ‘‘జీవితంలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసింది గురువులే. వారిపై నాకు అచంచల విశ్వాసం, నమ్మకం ఉంది. త్వరలో పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం. గత డీఎస్సీ ద్వారా 8,926 పోస్టులను భర్తీచేశాం. త్వరలో మరో పదివేల ఉపాధ్యాయ పోస్టులను నింపుతాం’’ అని టీచర్ల హర్షధ్వానాల మధ్య చంద్రబాబు ప్రకటించారు. ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం విద్యార్థులకు మాత్రమే ఉందని, ఆ దిశగా వారిని నడిపించే దిక్సూచిలా ఉపాధ్యాయులు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తెలుగు గడ్డపై పెరగడం గర్వకారణమన్నారు. ‘‘విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్రాన్ని మేలైన మానవ వనరులకు గమ్యస్థానంగా మలచాలి.
 
ఆ బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలి. అలాంటి ఉపాధ్యాయుల వెంట ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది. మానవ వనరుల అభివృద్ధికే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉపాధి హామీ నిధులతో ప్రహరీ గోడలు నిర్మించాం. 2022 నాటికి అన్ని జూనియర్‌ కళాశాలలకు సొంత భవనాలు సిద్ధం చేస్తాం. రాష్ట్రంలో కొత్తగా పది డిగ్రీ కళాశాలలు, 59 జూనియర్‌ కళాశాలలు, 65 బీసీ రెసిడెన్షియల్‌ కళాశాలలు, ఎస్సీ రెసిడెన్షియల్‌ కళాశాలలు 15, ఏకలవ్య కళాశాలలు పది చొప్పున నిర్మాణం జరుగుతున్నాయి. ఈ సంవత్సరమే వాటిని ప్రారంభిస్తాం. రాబోయే రోజుల్లో అమరావతిలో 15 మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు కానున్నాయని, దేశంలో ఏ రాష్ట్ర రాజధానిలోనూ ఇన్ని వైద్య కళాశాలలు లేవని చెప్పారు.
 
బంగారం’తో రావాలి: సింధుతో సీఎం
బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధును గురుపూజోత్సవం వేదికపై సీఎం చంద్రబాబు సత్కరించారు. ‘‘సింధు లాంటి పిల్లలు ప్రతి పాఠశాలలో తయారుకావాలి. ఆమెను ఎలా గౌరవించాలనేది కేబినెట్‌లో నిర్ణయం తీసుకొంటాం. సింధు... ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించాలని సీఎం ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్‌లో మరిన్ని పతకాలు సాధించి..రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తెస్తానని సింధు ప్రకటించారు.
 
ఉత్తమ టీచర్లకు ప్రధాని అభినందనలు
న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలను అందుకొన్న 45 మందిని ప్రధాని మోదీ అభినందించారు. అవార్డుల ప్రదానం సందర్భం గా ప్రత్యేకంగా వారితో భేటీ అయ్యారు. ఈ భేటీల ఫొటోలను జతచేసి, ట్విట్టర్‌ ద్వారా వారికి అభినందన లు తెలిపారు. తెలంగాణ నుంచి.. నిజామాబాద్‌కు చెందిన నర్రా రామారావు, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బీఎస్‌ రవి, వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన బండారు రమేశ్‌, బేగంపేట కేవీటీచర్‌ శేషప్రసాద్‌ జాతీయ అవార్డులను అందుకొన్నారు.
 
 
ఆన్‌లైన్‌లో ‘ఉత్తమ’ ఎంపిక..
ఎటువంటి సిఫారసులకు తావు లేకుండా ఆన్‌లైన్‌ విధానంలో వృత్తి నైపుణ్యమే ప్రామాణికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్టు సీఎం తెలిపారు. ఏపీని 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాలలో ఒకటిగా, 2029 నాటికి నంబర్‌ వన్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నత ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ మాదిరిగా... మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కాగా, ఈ భూప్రపంచంలో గురువును మించిన శక్తి మరోటి లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
Link to comment
Share on other sites

త్వరలో 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
గురువులు ఒత్తిడి లేకుండా చదువులు చెప్పాలి
ఒక్కొక్కరు ఒక్కో సింధులాంటి వారిని తయారు చేయాలి: సీఎం
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదాన కార్యక్రమంలో  సీఎం చంద్రబాబు
ఈనాడు - అమరావతి
5ap-main6a.jpg

పాధ్యాయ విద్య పూర్తిచేసుకుని, టెట్‌లో అర్హత సాధించి చాలాకాలంగా ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే తీపి కబురు అందనుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వారికి శుభ సమచారం అందించారు. త్వరలో పాఠశాల విద్య, సంక్షేమ శాఖల్లో కలిపి 10వేలు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నామని చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్యా కౌన్సిల్‌ తెలుగులోకి అనువదించిన ‘అనుభవాత్మిక అభ్యసనం-గాంధీజీ నయి తాలీమ్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును సన్మానించారు. 186మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందించారు.‘‘సమాజాన్ని, యువతను ప్రభావితం చేసే వ్యక్తులు గురువులే. నన్ను ప్రభావితం చేసిందీ చిన్ననాటి ఉపాధ్యాయులే. కొత్త సాంకేతిక విధానాలను ఉపాధ్యాయులు వినియోగించుకోవాలి. ఒత్తిడి లేకుండా చదువు చెప్పాలి. ఇప్పుడున్న ర్యాంకులు, గణాంకాలతో నేను సంతృప్తి చెందడం లేదు. దేశంలోనే నెంబర్‌ వన్‌గా రాష్ట్రం ఉండాలి. జ్ఞానభేరి కార్యక్రమంలో విద్యార్థుల ఆలోచనలు అద్భుతంగా ఉంటున్నాయని’’ వెల్లడించారు.

జూనియర్‌ కళాశాలలకు భవనాలు..
‘‘2022నాటికి అన్ని జూనియర్‌ కళాశాలలకు భవనాల నిర్మాణాలను పూర్తి చేస్తాం. 2014తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగాయి. మధ్యలో బడిమానేస్తున్నవారి సంఖ్య తగ్గింది. రాష్ట్రం విద్యా రంగంలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకులో ఉంది. ఈ రాష్ట్రంలో నంబర్‌ వన్‌ కూలీని నేనే. శ్రమకు ప్రత్యామ్నాయం లేదు. రాష్ట్రాన్ని నాలెడ్జ్‌, విద్యా హబ్‌గా చేసేందుకు మీరు కష్టపడండి. మీ సమస్యల పరిష్కార బాధ్యతను నేను తీసుకుంటాను.’’ అని అన్నారు.

కష్టపడందే ఏది రాదు..!
‘‘ఒక్కో ఉపాధ్యాయుడు తన జీవితంలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధులాంటి ఒక్కో విద్యార్థిని తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్‌ ఎక్కడ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సింధు ఈ గడ్డమీద పుట్టి ప్రపంచమంతా రాణిస్తోంది. రాష్ట్ర గౌరవాన్ని, ప్రతిష్ఠను పెంచుతోంది. 23ఏళ్లల్లోనే ఈస్థాయికి ఎదిగిందంటే దాని వెనుక ఆమె తల్లిదండ్రుల కఠోర శ్రమ ఎంత ఉందో గుర్తించాలి. కష్టపడితే గానీ ఏది రాదు. సింధు కుటుంబానికి ఆర్థికంగా చేయూత నిచ్చేందుకు ఏం చేయాలో కేబినెట్‌లో చర్చిస్తాం. మళ్లీ బంగారు పతకంతోనే రావాలని కోరుకుంటున్నాను’’ అని వెల్లడించారు.

విలువలతో కూడిన విద్యను అందించాలి
‘‘ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూ ఉండాలి. పిల్లలకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి. రాష్ట్రాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు పునరంకితం కావాలి’’ అని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రుల సందేశాలను వేదికపై చదివి వినిపించారు. ఈ సమావేశానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు హాజరయ్యారు.

- మంత్రి గంటా
Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ?

ఈనాడు, అమరావతి: పురపాలిక, జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలల్లో పోస్టుల భర్తీ డీఎస్సీ ద్వారానే చేపట్టే అవకాశం ఉంది. పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో శనివారం మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడనున్నారు. ఇప్పటికే మంత్రి గంటా ఉపాధ్యాయ నియామక పరీక్షపై ఏపీపీఎస్సీతో చర్చించారు. ఈ పరీక్ష ప్రక్రియ నిర్వహించేందుకు 115 రోజుల వరకు సమయం పడుతుందని వారు వెల్లడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ద్వారానే డీఎస్సీ నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయం విద్యాశాఖలో వ్యక్తమవుతోంది. పురపాలికలో 1100, జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు వేల పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లాలనుంచి ఖాళీల వివరాలు శనివారంనాటికి పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు చేరనున్నాయి. అత్యవసరంగా సమాచారం పంపించాలంటూ బుధవారం ఉన్నతాధికారులు జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమశాఖల్లోని ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...