Jump to content

Telangana TDP


Raaz@NBK

Recommended Posts

తెలుగుదేశం తెలంగాణ! అంటే మొన్నటిదాకా కొందరికి హాస్యాస్పదం. ఇంకా ఉందా!? ఎక్కడ ఉంది!? లాంటి అవాకులు చవాకులు పేలేవారు. 
అయినా సరే... తెలుగు తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అదరలేదు.. బెదరలేదు.. మొక్కవోని ధైర్యంతో 15 ఏళ్ళు అధికారంలో లేకపోయినా “మనకీ మంచిరోజులు వస్తాయి” అనే మొండి ధైర్యంతో పార్టీ జండా మోస్తూ ఉన్నారు.
ప్రతీ తెలుగుదేశం తెలంగాణ సభ్యుడూ గర్వపడే విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ కన్నా బలమైన, కరడుగట్టిన కార్యకర్తలు తెలంగాణ లోనే ఉన్నారని మన ఆంధ్రప్రదేశ్ సోదరులు ఒప్పుకున్నప్పుడు ఆ ఆనందానికి అవధులు ఉండవు. 
ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు కదా.. మనకీ మంచి రోజులు రానే వచ్చాయి. 
ఎన్నికల సమయం ఆసన్నమయింది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఏ రాజకీయ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఇప్పుడు మన వోట్లు కీలకం కానున్నాయి అని అర్థం అయ్యి, కొన్ని పార్టీలు మనతో పొత్తుకు పోటిపడుతున్నాయి అనేది వాస్తవం.
అందుకని కొంత స్తబ్దుగా ఉన్న మన కార్యకర్తలలో నూతనోత్సాహం నింపడానికి తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం (TSNV) ముందుకు వచ్చింది. 
సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యక్రమాలు ప్రచారం చెయ్యడానికి ఉమ్మడి 10 జిల్లాలలోనూ శిక్షణా తరగతులని నిర్వహిస్తున్నాము.
కావున, ఆసక్తి కలవారు జిల్లాల వారిగా ఈ క్రింది ఫార్మ్ నింపగలరు. 
నిబంధనలు:
1.    ఒక్కరు ఒక్క జిల్లాలో మాత్రమే నింపగలరు
2.    శిక్షణా తరగతుల తేదీలను త్వరలో తెలియజేస్తాము
3.    ప్రతి గడి తప్పని సరిగా, చదివి సరైన సమాధానం ఇవ్వగలరు
4.    దయచేసి ఈ సమాచారాన్ని పార్టీలు ఫిరాయించే వారికి కాకుండా... కరడుగట్టిన తెలుగుదేశం సభ్యులకి మాత్రమే పంపగలరు

ఇట్లు,
మీ సుభాషిణి
తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం

Google Forms: 
1.    Adilabad / ఆదిలాబాద్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSfCr4ie8_ovYmcyAxAg0zmo5O5pffg2axaqtxpzRUafPifI1g/viewform

2.    Nizamabad / నిజామాబాద్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSf3uAHsWbUjBl1i0Xi11clAhW-_1g3hxwja_wek3Ba54z58HA/viewform

3.    Karimnagar / కరీంనగర్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdywCkZ3doiy7Shgd-LjJLWtKkkkA5NVoyL5gLvgR8IJKL_lA/viewform

4.    Medak / మెదక్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSc_GifocZZ1jPKpGIbyu7hlx3opZCOe_5VtMNWwTA-O1F2i_A/viewform

5.    Warangal / వరంగల్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdhTBY4R4Cj5RJsEzbAf95XMlJ-tpyaXQuEFvtEA_XAzlcPHw/viewform

6.    Hyderabad / హైదరాబాద్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSejwGbRK6ER5ccjzqcZEdGo3awCvnih2gk-6W999IgJ79mhqA/viewform

7.    Rangareddy / రంగారెడ్డి: https://docs.google.com/forms/d/e/1FAIpQLSfVkPVK40HGqUB-Jr6ITDYzMAFBPNvWRd3He0pmdqo6qjm-kw/viewform

8.    Khammam / ఖమ్మం: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdqk1IM8jNWaSq5b8LohkYQJx3RZLnHGad3K1x7mp3VYHfF8Q/viewform

9.    Nalgonda / నల్గొండ: https://docs.google.com/forms/d/e/1FAIpQLSe7_8Qneprxx8dy6uW7foC-1trJGHURfN3cT5kF2ZzmnE6L1w/viewform

10.    Mehabubnagar / మెహబూబ్ నగర్: https://docs.google.com/forms/d/e/1FAIpQLSdeVR-7zVlJqIDx_dljStRYLSm9KdO0wqCx-vSkrvwFeFGHPA/viewform

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...