Jump to content

Governor

MVS

Recommended Posts

  • Replies 112
  • Created
  • Last Reply

Sir if you are carrying a message from center to Ncbn, with due respect do not expect Andhrites to calm down with respect to special status to AP. We have been betrayed by BJP and Narendra Modi and the emotions are running high. If you cannot understand the anguish of the people of AP and support them as their governor atleast donot try to douse their anger. 

????

Link to comment
Share on other sites

గవర్నర్‌-సీఎం మధ్య ఏం చర్చ జరిగింది?

03325122BRK93A.JPG

అమరావతి: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఆదివారం భేటీ అయ్యారు. నిన్న విశాఖ పర్యటన ముగించుకున్న గవర్నర్‌ నేరుగా హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ పర్యటనలో మార్పులు చేసుకుని రాత్రి పదకొండున్నర గంటలకు రైలులో విజయవాడ చేరుకున్నారు. నగరంలోని గేట్‌ వే హోటల్‌లో బస చేశారు. ఉదయం పదకొండు గంటల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు హోటల్‌కు చేరుకుని గవర్నర్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట 40 నిమిషాల పాటు ఇరువురు ఏకాంతంగా చర్చించుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

ప్రధాని నరేంద్ర మోదీపై తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా దూషణలకు దిగుతుండడం సరికాదని గవర్నర్‌ వారించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందడం లేదని, రాష్ట్ర విభజన అనంతరం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని,  నిధుల్లోనూ భారీగా కోత విధిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తరుణంలో కేంద్ర ఇంటలిజెన్స్‌ చీఫ్‌ కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఇంటలిజెన్స్‌ ఇచ్చిన నివేదికలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం.. గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి వాటిపై ముఖ్యమంత్రితో చర్చించాలని సూచించి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జరుగుతున్న ఆందోళనలు, స్వయంగా ముఖ్యమంత్రే ధర్మపోరాట దీక్ష పేరిట ఒక రోజంతా నిరసన తెలియజేయడం, ఆనాడు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధిగా తిరుపతి ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ వెంకటేశ్వరస్వామి పాదాల చెంత ఇచ్చిన హామీలు నెరవేరలేదంటూ అప్పటి దృశ్యాలను ప్రదర్శించి ఈనెల 30న బహిరంగ సభ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ బహిరంగ సభ గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

 కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తామని ప్రకటించిన వాటిలో ప్రాధాన్యంగా 18 అంశాలను పేర్కొంటూ వాటి సాధన కోసం తాము పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నందున ఆ హామీల పరిస్థితులను గవర్నర్‌ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని పేర్కొంటూ ఇటీవల కేరళలో ఆర్ధిక మంత్రుల సమావేశం జరిగింది. అలాంటి సమావేశం మరింత విస్తృత ప్రాతిపదికగా అమరావతిలో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కేంద్ర ఇంటలిజెన్స్‌ పేర్కొంది. ఉత్తరాది- దక్షిణాది రాష్ట్రాలు అనే వ్యత్యాసాలు, ఆందోళనలు, దేశ అంతర్గత భద్రతకు సరికాదని.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటే మేలని గవర్నర్‌ హితవు పలికినట్లు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి రాజధాని పనులకు సంబంధించి టెండర్లు, నిధుల వినియోగ పత్రాలపై భారతీయ జనతా పార్టీ నేతలు తమ సందేహాలు, అనుమానాలను ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించి వెళ్లింది. ఆ బృందం నివేదికలోని అంశాలను గవర్నర్‌కు కేంద్ర ప్రభుత్వం పంపి ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానిపై విజయవాడలో జరిగిన ధర్మపోరాట దీక్ష సమయంలో సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భాజపా ప్రజాప్రతినిధులకు గవర్నర్‌కు వినతిపత్రం అందించారు. బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పరిణామాలన్నింటిపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతుందనే ప్రచారాంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మొత్తంగా గంట 40 నిమిషాలు సమావేశం జరిగినా భేటీ అజెండా,  చర్చనీయాంశాలను బయటకు వెల్లడించేందుకు ప్రభుత్వ వర్గాలు విముఖత చూపాయి. సమావేశ వివరాలపై మీడియా ముఖ్యమంత్రిని ప్రశ్నించినప్పటికీ వివరాలు తెలిపేందుకు నిరాకరించి వెళ్లిపోయారు.

Link to comment
Share on other sites

అమరావతి: గవర్నర్ నరసింహన్‌తో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర సేపు వారు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల వ్యవహారానికి సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని సీఎం గవర్నర్‌కు వివరించినట్లు తెలియవచ్చింది. అలాగే ప్రధాని మోదీపై చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలియవచ్చింది.
 
మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకునే విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, పోరాటం ఆపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. చంద్రబాబు చేసిన దీక్షా ప్రభావం కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాపై పడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని ఒక ముఖ్యమంత్రి 12 గంటలపాటు నిరాహారదీక్ష చేయడం దేశవ్యాప్తంగా సంచలన వార్తగా నిలిచింది. ఈ ప్రభావం కర్నాటక ఎన్నికలపై కూడా పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్న నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు కర్నాటక ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ చర్చ జరుగుతోంది. మొత్తంగా అన్ని అంశాలపై ఇరువురూ చర్చించినట్లుగా తెలియవచ్చింది.
Link to comment
Share on other sites

3 hours ago, Suresh_Ongole said:

Eenadu lo article chooste some thing fishy. Bjp vallu babu gari ni corner cheyataniki intelligence reports teppinchukontunnaru ani rasadu. Oray Boooodi ga eppudu helicopteryekkutunnav ra?

No one can do anything to State CM. Antha cheyyagalige varu ayithe Mamatha ni Naveen P ni ee patiki chesevare.

Link to comment
Share on other sites

3 hours ago, Suresh_Ongole said:

Eenadu lo article chooste some thing fishy. Bjp vallu babu gari ni corner cheyataniki intelligence reports teppinchukontunnaru ani rasadu. Oray Boooodi ga eppudu helicopteryekkutunnav ra?

Ala chese antha seen unte governor Hyd rammani pilichevadu Vij radu 

Karnataka election kosam Edo kotha drama start chesaru

Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:
అమరావతి: గవర్నర్ నరసింహన్‌తో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర సేపు వారు మాట్లాడుకున్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర సంబంధాల వ్యవహారానికి సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని సీఎం గవర్నర్‌కు వివరించినట్లు తెలియవచ్చింది. అలాగే ప్రధాని మోదీపై చంద్రబాబు విమర్ళలు చేయడం సరికాదనే అభిప్రాయాన్ని గవర్నర్ చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలియవచ్చింది.
 
మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన అంశాలు సాధించుకునే విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, పోరాటం ఆపేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. చంద్రబాబు చేసిన దీక్షా ప్రభావం కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాపై పడినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని ఒక ముఖ్యమంత్రి 12 గంటలపాటు నిరాహారదీక్ష చేయడం దేశవ్యాప్తంగా సంచలన వార్తగా నిలిచింది. ఈ ప్రభావం కర్నాటక ఎన్నికలపై కూడా పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్న నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు కర్నాటక ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ చర్చ జరుగుతోంది. మొత్తంగా అన్ని అంశాలపై ఇరువురూ చర్చించినట్లుగా తెలియవచ్చింది.

ee governor meetings enduku Babu gaaru ... veellaki explain cheyyalsina avasaram manakenti ... even though a governor is a constitutional post (though meaningless) and supposed to be neutral ... we know where this Naramsimhan guy belongs ... we've seen too many of his kind over the years ... so, why bother ...

Babu garini question chese stature naaku ledu ... db friends, just take it as my personal opinion.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...