Jump to content

Kanna Lakshmi narayana in to YCP


Recommended Posts

  • Replies 71
  • Created
  • Last Reply
కన్నా వైపు చూడని వైసీపీ
27-04-2018 19:38:47
 
636604547267634662.jpg
 
గుంటూరు: మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మూడు రోజుల క్రితం అధిక రక్తపోటుతో ఆస్పత్రిలో చేరారు. అదే రోజున వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే అనారోగ్యానికి గురికావడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. కన్నా వైసీపీలో చేరేందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్న తర్వాత ఆయనకు హైబీపీ రావటంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజులుపాటు కన్నా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆయన వైద్యుల సూచనల మేరకు శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన పార్టీ మారడంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీడీపీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు కన్నా బీజేపీలోనే ఉంటారని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
 
 
ఈ నేపథ్యంలోనే కన్నా వైసీపీలో చేరటం వాయిదా పడడంతో ఆ పార్టీ నేతలు ఆయన దగ్గరకు రావటం పూర్తిగా తగ్గించారు. అయితే శుక్రవారం కావూరు సాంబశివరావు కన్నాను పరామర్శించారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకోగానే పలువురు బీజేపీ నేతలు కన్నా నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా కన్నాతో బీజేపీ నేతలు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చలకు సంబంధించి నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కన్నాతో రాజకీయపరంగా ఎలాంటి చర్చలు జరుపలేదని, ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధంవల్ల పరామర్శించడానికి వచ్చామని మాణిక్యాలరావు చెప్పారు. రాజకీయ కంటే ఆరోగ్యం ముఖ్యమని, ఇక ముందు ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ మీడియాను ఉద్దేశించి మాణిక్యాలరావు, సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు ఆయన్ను ఈ రోజు పరామర్శించడానికి రావడంతో కన్నా బీజేపీలోనే కొనసాగుతారనే ప్రచారం జరుగుతోంది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఏపీలో అన్ని పార్టీలు కన్నా లక్ష్మీనారాయణ వైపే.. కారణం ఇదేనా?
10-05-2018 09:54:00
 
636615428397294993.jpg
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌ అయ్యారు. ఒకరు తమ వైపు రమ్మని ఆహ్వానించారు. మరొకరు తమలో చేరితే ఏమిస్తామో కూడా చెప్పారు. ఇంకొకరు ఉన్న పార్టీలోనే ఉండమని వత్తిడి చేస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నా కమిట్‌మెంట్‌తో పాటు.. అధినేతకు విధేయుడిగా ఉండే కన్నా ఏ పార్టీలో చేరినా ఆయన వల్ల పార్టీకి ఉపయోగమేనని రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.. ఇంతకీ కన్నా మదిలో ఏముంది? ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో తెలుసుకోండి.
 
 
        కన్నా లక్ష్మీనారాయణ... గుంటూరు జిల్లా రాజకీయాలలో క్రెడిబులిటీకి ఈయన మారుపేరు.. ఏ పార్టీలో ఉన్నా... ఆ పార్టీ తరఫున పోరాడే వ్యక్తిగా పేరుంది ఆయనకు! 2014 వరకు కాంగ్రెస్‌పార్టీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితులు.. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావును రాజకీయ గురువుగా భావించే కన్నాకు రాజకీయ అనుభవం మెండు! 2014 ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తున్నప్పటికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం తర్వాత భారతీయ జనతాపార్టీలో చేరారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలతో సన్నిహితంగా మెలిగారు. మొదటి నుంచి చంద్రబాబుపై విరుచుకుపడే లక్ష్మీనారాయణ టీడీపీకి బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ ప్రభుత్వంలో జరిగే లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపారు. టీడీపీ నేతలు కూడా లక్ష్మీనారాయణకు కౌంటర్లిచ్చారు. కన్నాను వలస నేతగా ముద్రవేశారు. తనను ఇన్నేసి మాటలంటున్నా బీజేపీ నేతలెవరూ నోరు మెదపకోవడం కన్నాను బాధించింది. మనస్తాపానికి గురయ్యారు..
 
    అలాగే పార్టీ అధ్యక్ష పదవిని ఇస్తామని చెప్పిన హైకమాండ్‌ చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం కన్నాకు నచ్చలేదు. ఇదే మంచి తరుణం అనుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలు కన్నాపై దృష్టిసారించారు.. పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానించారు.. వరుసగా నాలుగుసార్లు గెలుపొందిన పెదకూరపాడు నియోజకవర్గంలోని నేతలతో పాటు.. అయిదోసారి పోటీ చేసి గెలుపొందిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నేతలతో సంప్రదింపులు జరిపారు కన్నా.. జిల్లాలో వివిధ నియోజకవర్గాలలో ఉన్న తన అనుచరులతో మంతనాలు జరిపారు. వీరి లో ఎక్కువమంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. దీంతో ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్‌ సమక్షంలో పార్టీలో చేరాలనుకున్నారు. ఈలోపు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. మధ్యలో టీడీపీ నేతలు టచ్‌లోకి వచ్చారు. ఇరువురు మంత్రులు కన్నాతో మాట్లాడారు. ఈ మానసిక సంఘర్షణను తట్టుకోలేక ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
 
   మూడు రోజులు చికిత్స అనంతరం డిస్‌ఛార్జ్‌ అయ్యారు. హైదరాబాద్ వెళ్లి పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్న అనంతరం రాజకీయ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈలోపు పుకార్లు షికార్లు చేశాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలకు బీజేపీ అగ్రనేతలు ఫోన్‌ చేసి తమ నేతను ఎలా చేర్చుకుంటారని నిలదీశారట! ఫలితంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో కన్నా చేరిక ఆగిపోయిందట! దీంతో మళ్లీ అటు బీజేపీ.. ఇటు టీడీపీ.. మధ్యలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు కన్నాను సంప్రదించారు. తమ పార్టీలోకి వస్తే గుంటూరు పశ్చిమతో పాటు ఆయన సూచించిన మరో వ్యక్తికి కూడా టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారట టీడీపీ నేతలు! వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా డిటోడిటో! పెదకూరపాడు టికెట్‌తో పాటు కన్నా అనుచరుడికి కూడా టికెట్‌ ఇస్తామని జగన్‌ దూతలు మాట ఇచ్చారట! బీజేపీలోనే ఉంటే రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా కేంద్రంలో కీలక పదవి ఇస్తామని కమలదళ అగ్రనేతలు చెప్పారట! ఇన్ని పార్టీల నుంచి ప్రతిపాదనలు రావడంతో కన్నా లక్ష్మీనారాయణ ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తికరంగా మారింది. తను ప్రాతినిధ్యం వహించిన రెండు నియోజకవర్గాలను కన్నా అభివృద్ధి చేశారు. పైగా బలమైన అనుచరగణం ఆయనకు ఉంది.. ఈ రెండు నియోజకవర్గాలలో రాజకీయాలకు అతీతంగా కన్నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి.. జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా కన్నాకు బలమైన అనుచరగణం ఉంది.
 
    అటు కులపరంగానూ, ఇటు రాజకీయంగానూ అనుచరులకు ఎప్పుడూ రక్షణ కవచంగా ఉండే కన్నా ఏ పార్టీలో చేరిన ఆ పార్టీకి ఉపయోగమేనని రాజకీయ నాయకులు చెబుతారు. ఇప్పుడు కన్నా రూట్ ఎటువైపు అనేది జిల్లాలో చర్చనీయాంశమయ్యింది. తన ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాతే రాజకీయంగా ఆలోచిస్తానని కన్నా తన అనుచరవర్గానికి చెబుతున్నారు. బీజేపీలో ఉండి ఎవరికీ సహాయం చేయలేకపోతున్నారని... ఆ పార్టీ కూడా రాష్ర్టంలో తీవ్రంగా దెబ్బతినడంతో ఉండి ఉపయోగం ఏమిటన్నది అనుచరుల ప్రశ్న! వీరంతా ఒత్తిడి తీసుకురావడంతో కన్నా రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే పది రోజుల్లో అంటే వచ్చే వారం తర్వాత ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Link to comment
Share on other sites

Kanna tried to jump to TDP in 2014 but due to issues with Rayapati not able to join.

Even Botsa, Parthasaradhi tried to jump to TDP but CBN did not accepted due to pressure from Ashok & Uma.

 

Kanna, Parthasaradhi some what better than Botsa i feel. Both of them can still be tried if CBN agrees. Useful in the Guntur & Krishna where TDP is strong but needs some other sections votes to sweep.

Link to comment
Share on other sites

2 minutes ago, Gunner said:

Guntur cadre lo 0.1%  kuda chepparu ee mata

JC gurinchi Anantapur Cadre lo 0.0001% positive ga cheppakapoyina teesukoleda, JC kanna ghoram ayithe kaadu kada Kanna on TDP.

JC thone badda satruvulu kalisi sail chesthunnaru because of CBN, i don't see much problem with Kanna. 

Ego feeling thappa emi ledu, Kanna tho emanna TDP leaders ki inka Kula tagadaalu vunnaya? We are passed 1980s. Sail with all sections.

Unless very bad no point in skipping Kanna. Need to sail with all sections of people in Capital region.

Kanna tho antha problem vunte 2-3 Guntur leaders tickets kooda ivvakoodadu. Only problem i see is Rayapati vargam CBN can make them silent till 2019.

Link to comment
Share on other sites

4 hours ago, RKumar said:

JC gurinchi Anantapur Cadre lo 0.0001% positive ga cheppakapoyina teesukoleda, JC kanna ghoram ayithe kaadu kada Kanna on TDP.

JC thone badda satruvulu kalisi sail chesthunnaru because of CBN, i don't see much problem with Kanna. 

Ego feeling thappa emi ledu, Kanna tho emanna TDP leaders ki inka Kula tagadaalu vunnaya? We are passed 1980s. Sail with all sections.

Unless very bad no point in skipping Kanna. Need to sail with all sections of people in Capital region.

Kanna tho antha problem vunte 2-3 Guntur leaders tickets kooda ivvakoodadu. Only problem i see is Rayapati vargam CBN can make them silent till 2019.

@Compaq @sonykongara 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...