Jump to content

RK weekend comment on PDPK sentiment


niceguy

Recommended Posts

Nagababu, allu aravind comment ... 

'pavan kalyan ki kopam vasthe ... andari charithra bayata pedethadu ...'

mundu ... mee muddi kadukkondira picchhi XXXXX kodukullara ... 

meeru inkokalla  charithra bayata pette vallu ... meekelagu siggu ledu ... maakaina undali kada siggu ... 

 

 

Link to comment
Share on other sites

text version...

conclusion super !!!

 

పాపం...పవన్‌ కళ్యాణ్‌!
22-04-2018 00:31:41
 
636599539028903056.jpg
పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయబోతున్నారో తెలియాలి. మీడియాతో యుద్ధం చేయాలనుకుంటే అది ఆయన ఇష్టం! తాను సుదీర్ఘ న్యాయ పోరాటం చేయనున్నట్టు ఆయన తాజా ట్వీట్లో పేర్కొన్నారు. ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే అన్నట్టుగా నన్ను, సాటి మీడియా సంస్థల మిత్రులను కుట్రదారులుగా అభివర్ణించిన పవన్‌ కల్యాణ్‌పై మేము న్యాయపోరాటం చేయాలే గానీ, మాపైన ఆయన న్యాయపోరాటం చేయడమేమిటి? అకారణంగా నన్ను, మా మీడియా సంస్థలను నిందించిన పవన్‌ కల్యాణ్‌పై నేను న్యాయపోరాటం చేయబోతున్నాను.
 
 జనసేన అధినేతగా పవన్‌ కల్యాణ్‌ కార్యక్రమాలకు విశేష ప్రచారం కల్పించిన మీడియా సంస్థలు ఇప్పుడు ఆయనకు చేదుగా మారాయి. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన సంస్థలు ఇప్పుడు తీయగా మారడం వెనుక మర్మం ఏమిటో తెలియాల్సి ఉంది. మొన్నటివరకు పవన్‌ కల్యాణ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు శ్రీమతి రోజా నిన్నటినుంచి మా పవన్‌ కల్యాణ్‌ అని సంబోధించడం వెనుక మతలబు ఏమిటో తెలియదు. అయితే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో చోటుచేసుకోబోయే మార్పులకు ఈ పరిణామాలన్నీ నాందిగా కనిపిస్తున్నాయి.
 
జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను ఈమధ్య పీడకలలు బాధిస్తున్నట్టున్నాయి. అందుకే కాబోలు తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయనీ, మీడియా సంస్థలు అందులో భాగస్వాములనీ కలవరిస్తున్నారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు ఆయనకు నాపైనా, సాటి మీడియా సంస్థ అధినేత శ్రీనిరాజుపైనా ఎందుకు ఆగ్రహం వచ్చిందో తెలియదు. శ్రీరెడ్డి వ్యవహారం ఇన్ని వికారపు మలుపులు తీసుకుంటుందని గానీ, సినిమారంగానికి చెందినవారు... ముఖ్యంగా పవన్‌కల్యాణ్‌ వంటివారు ఇంత సంకుచితంగా ఆలోచిస్తారనిగానీ ఎవరూ ఊహించి ఉండరు. పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలు, వ్యక్తిత్వం ఉన్నతంగా ఉంటాయనుకున్న నాలాంటి వారికి ఆయన శుక్రవారంనాడు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆయన అభిమానులు మా సంస్థ వాహనాలపైనా, సిబ్బందిపైనా చేసిన దాడితో నిరాశే మిగిల్చాయి. నిజానికి శ్రీరెడ్డి అంశంపై రోజుల తరబడి చర్చలు జరపడాన్ని నేను వ్యతిరేకించాను. ఏబీఎన్‌ సహచరులను కూడా మందలించాను. శ్రీరెడ్డి వంటివారు సమస్య ఉంటే పోలీసు స్టేషన్‌కో, న్యాయస్థానానికో వెళ్లాలని పవన్‌కల్యాణ్‌ చేసిన సూచన లో తప్పులేదని కూడా నేను సమర్థించాను. ఇదే విషయాన్ని సినిమా రంగానికి చెందిన కొంతమంది ప్రముఖులతో పంచుకు న్నాను కూడా! అంతేకాదు– క్యాస్టింగ్‌ కౌచ్‌ సంస్కృతి ఒక్క సినిమా రంగానికే పరిమితం కాదనీ, అన్ని రంగాలలోనూ ఉందనీ, సినిమా రంగాన్ని లోకువ చేసుకోవడం తగదని కూడా గత వారం నేను రాసిన వ్యాసంలో పేర్కొన్నాను. అలాంటి నన్ను పట్టుకుని తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న డ్రీమ్‌టీమ్‌తో నాకు సంబంధం ఉందని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించడం ఆశ్చర్యం కలిగించింది. శ్రీనిరాజుపైనా, నాపైనా ఆయన చేసిన ఆరోపణలను బట్టి పవన్‌ కల్యాణ్‌కు ఎవరు ఏమిటి? అన్న కనీస అవగాహనలేదని స్పష్టమవుతోంది. ఆవేశపడితే అనర్థమే మిగులుతుంది. రెచ్చిపోవడానికి అభిమానులు ఉన్నారన్న అహంకారంతో మీడియాపై దాడులు చేయించడం బలవంతుల లక్షణం కాదు.
 
బలహీనులు మాత్రమే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి పనులు చేస్తారు. శ్రీరెడ్డిని రెచ్చగొట్టి పవన్‌ కల్యాణ్‌ను తిట్టించడం తప్పు కాదా? అని 5454asdfsasdf.jpgరామ్‌గోపాల్‌వర్మను కూడా నేను ప్రశ్నించాను. మెగా ఫ్యామిలీకి, వర్మకు మధ్య ఏ గొడవలు ఉన్నాయో నాకు తెలియదుగానీ, వర్మ తరచుగా చిరంజీవి అండ్‌ కో ను ఎందుకు టార్గెట్‌ చేస్తారని సినీ పరిశ్రమలో తెలిసినవారిని ప్రశ్నించేవాడిని. ఒకప్పుడు దొరలంటే భూస్వాములు గానీ, ఇప్పుడు దొరలంటే మీడియా ఆసాములు అనీ, వారు చెప్పిందే వేదం– వారు పాడిందే నాదం అని కూడా ట్వీటమరాయుడు తాజాగా స్పందించారు. మీడియా నిర్వహణ ఎంత కష్టమో పవన్‌ కల్యాణ్‌కు తెలియకపోవచ్చుగానీ నాకు బాగా తెలుసు! పవన్‌ కల్యాణ్‌కు నలుగు పెడుతున్న మీడియా ఆసాములు ఎవరైనా దొరలుగా భావిస్తున్నారేమో తెలియదుగానీ నేను ఎప్పుడూ అలా భావించలేదు. భావించను కూడా! ‘‘రాజకీయ నాయకులకు జర్నలిస్టుల అవసరం ఉంటుంది. జర్నలిస్టులు లేకపోతే మీకు ఉనికే ఉండదు’’ అని కెమేరామెన్‌ గంగతో రాంబాబు సినిమాలో పవన్‌కల్యాణ్‌కు ఒక డైలాగ్‌ ఉంది. ఆ సినిమాలో ఆ డైలాగ్‌ చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ‘ఫలానా ఫలానా మీడియా సంస్థలను బహిష్కరించండి’ అని పిలుపులు ఇవ్వడం ఆశ్చర్యంగా అనిపించడం లేదా? పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు నటుడు మాత్రమే కాదు– రాజకీయ నాయకుడు కూడా! పీడకలల బారిన పడుతున్న ఆయన ఇప్పుడు మీడియాను దూరంచేసుకుంటే నష్టం ఎవరికి? చెరువు మీద అలిగిన సామెతలా ఉండదా? ఎక్కడో మొదలై ఎక్కడికో వెళుతున్న ఈ డ్రామా వెనుక ఎవరున్నారో కూడా తేలవలసి ఉంది. ఎవరిని టార్గెట్‌ చేసుకుని, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఆట మొదలైందో కూడా స్పష్టం కావలసి ఉంది.
 
ఆవేశం... నిగూఢ వ్యూహం!
శ్రీరెడ్డి తిట్టిన తిట్టుకు అర్థం కూడా తెలుసుకోకుండా, అమాయ కురాలైన మా అమ్మను తిట్టిస్తారా? అని పవన్‌ కల్యాణ్‌ అండ్‌ కో ఇంత యాగీ చేయడం కూడా ఆశ్చర్యంగా ఉంది. నిజానికి శ్రీరెడ్డి తిట్టింది పవన్‌కల్యాణ్‌నే గానీ, ఆయన మాతృమూర్తిని కాదు. సభ్య సమాజంలో ఒకరిపై మరొకరు దుర్భాషలు ప్రయోగించడం సమర్థనీయం కాదు. కానీ... శ్రీరెడ్డి ఉపయోగించిన ఆ పదాన్ని జన సామాన్యంలో అత్యంత యథాలాపంగా ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ ఆ పదాన్ని పట్టుకుని పవన్‌ కల్యాణ్‌ సినిమాలలో మించిన సెంటిమెంట్‌ను పండించారు. పవన్‌ కల్యాణ్‌లో రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని గతంలో నేను వ్యాఖ్యానించాను గానీ, ఇప్పుడు శ్రీరెడ్డి వ్యవహారంలో ఆయన ఫక్తు రాజకీయ నాయకుడిలా వ్యవహరించారు. ఒక వ్యక్తి క్యారెక్టర్‌ గురించి వర్ణించడా నికి శ్రీరెడ్డి వాడిన పదాన్ని ఉపయోగిస్తారు తప్ప అందులో తల్లులను నిందించడం ఉండదు. ఈ మాత్రం కూడా పవన్‌ కల్యాణ్‌కు తెలియదని అనుకోవాలా? తెలియకపోతే ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. తెలిసి కూడా సెంటిమెంట్‌ను పండించాలనుకుంటే ఎంతైనా ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడు కనుక ఆయన ఇష్టం అని అనుకుందాం. పవన్‌ కల్యాణ్‌లో ఆవేశం ఎక్కువ అని మాత్రమే అని అనుకుంటుంటారుగానీ ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి దాని వెనుక ఏదో నిగూఢ రాజకీయ వ్యూహం ఉందని భావించవలసి వస్తోంది. జనసేన అధినేతగా పవన్‌ కల్యాణ్‌ కార్యక్రమాలకు విశేష ప్రచారం కల్పించిన మీడియా సంస్థలు ఇప్పుడు ఆయనకు చేదుగా మారాయి. ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వార్తలు ప్రచురించిన, ప్రసారంచేసిన సంస్థలు ఇప్పుడు తీయగా మారడం వెనుక మర్మం ఏమిటో తెలియాల్సి ఉంది. మొన్నటివరకు పవన్‌ కల్యాణ్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకురాలు శ్రీమతి రోజా నిన్నటి నుంచి మా పవన్‌ కల్యాణ్‌ అని సంబోధించడం వెనుక మతలబు ఏమిటో తెలియదు. అయితే, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో చోటుచేసుకోబోయే మార్పులకు ఈ పరిణా మాలన్నీ నాందిగా కనిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తేలవలసి ఉంది.
 
పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర వత్తిడి తెచ్చి ఆయన కేంద్రాన్ని విమర్శించకుండా నిలువరించింది ఎవరో స్పష్టం కావలసి ఉంది. గవర్నర్‌ నరసింహన్‌– పవన్‌ కల్యాణ్‌ మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? వారి మధ్య అనుబంధం ఏర్పడటం వెనుక కేంద్రంలోని పెద్దల పాత్ర ఏమిటో కూడా వెల్లడైతే వ్యవహారం ఎటు పోతుందో తెలుస్తుంది. ఒకప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబాన్ని విమర్శించిన పవన్‌ కల్యాణ్‌ హఠాత్తుగా కేసీఆర్‌ను కలిసి పొగడ్తలతో ముంచెత్తడం వెనుక ఏమి జరిగిందో పవన్‌ కల్యాణ్‌ చెబితే బాగుంటుంది. ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి భవిష్యత్తులో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో పవన్‌ కల్యాణ్‌ చేతులు కలపడానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే, ఈ మొత్తం క్రీడ వెనుక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నారని భావించక తప్పదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌కు చెడి ఉండవచ్చు. ఆ విషయంలో నాకేమీ అభ్యంతరం ఉండదు. లేని కుట్రను తెరమీదకు తెచ్చి అందులో నన్ను ఇరికించడానికి ప్రయత్నించడంపైనే నా అభ్యంతరం! ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తున్న మీడియా సంస్థలనే పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌ చేసుకోవడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? శ్రీరెడ్డి తిట్టిన తిట్టును ఒక్కసారి కూడా ప్రసారం చేయలేదని ఏబీఎన్‌ ప్రతినిధులు నాకు చెప్పారు. అయినా, తన తల్లిని కించపరిచే తిట్టును పదేపదే ప్రసారం చేయడం ఏమిటని పవన్‌ కల్యాణ్‌ నిందించడంలోని ఆంతర్యం ఏమిటి? చీటికీ మాటికీ అందరి జాతకాలు బయటపెడతానని బెదిరించే పవన్‌ కల్యాణ్‌ తన జాతకాన్ని కూడా బయటపెట్టుకుంటే మంచిది. శ్రీరెడ్డి దూషణలను పదేపదే ప్రసారం చేసినవాళ్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎవరైనా తిడితే అలాగే ప్రసారం చేస్తారా? అని పవన్‌ కల్యాణ్‌ మమ్మల్ని ప్రశ్నించారు.
 
‘ఒక తల్లికి తండ్రికి పుట్టినవాడైతే’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యను కూడా మేము ప్రముఖంగా ప్రచురించి, ప్రసారం చేశాం. నిజానికి శ్రీరెడ్డి తిట్టిన తిట్టుకంటే విజయ సాయిరెడ్డి అన్న మాటలే తీవ్రమైనవి. ఆ వ్యాఖ్యలు చంద్రబాబు తల్లిదండ్రులకు తాకుతాయి.
 
మీ యుద్ధం ఎవరితో?
ఇకపోతే, సినిమా హీరోలు తామేదో దైవాంశ సంభూతులమని భ్రమిస్తుంటారు. ఈ విషయంలో పవన్‌ కల్యాణ్‌ను ఇంకొంచెం ఎక్కువ అని అనుకోవలసి ఉంటుంది. ఎందుకంటే శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందించిన నాగబాబు, అల్లు అరవింద్‌ వంటివారు కూడా పవన్‌ కల్యాణ్‌కు కోపం వస్తే అందరి దూల తీరుస్తారని హెచ్చరించారు. సినిమా నటులకైనా, మీడియా సంస్థలకైనా ప్రజల ఆదరణ ఉన్నంతవరకే సినిమా! ప్రజలకు వాస్తవాలు తెలిసినప్పుడు ఎవరిదైనా ‘సినిమా’ ఆడదు. అభిమానులను రెచ్చగొట్టే ధోరణిలో పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లు ఉన్నాయంటే ఆయన ఏదో వ్యూహంతోనే ముందుకు వెళుతున్నారనుకోవలసి వస్తుంది. తాను చనిపోవడానికి సిద్ధపడే పోరాటం మొదలెట్టానని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొన్నారు. పుట్టినవాడు గిట్టకమానడు! ఈ లోకంలోకి వచ్చినవారు ఎప్పుడో ఒకప్పుడు వెళ్లిపోవలసిందే! అయినా రాజకీయాలలో హత్యలు ఉండవు– ఆత్మహత్యలే! పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎవరితో యుద్ధం చేయబోతున్నారో తెలియాలి. మీడియాతో యుద్ధం చేయాలనుకుంటే అది ఆయన ఇష్టం! తాను సుదీర్ఘ న్యాయపోరాటం చేయనున్నట్టు ఆయన తాజా ట్వీట్లో పేర్కొన్నారు. ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే అన్నట్టుగా నన్ను, సాటి మీడియా సంస్థల మిత్రులను కుట్రదారులుగా అభివర్ణించిన పవన్‌ కల్యాణ్‌పై మేము న్యాయపోరాటం చేయాలే గానీ, మాపైన ఆయన న్యాయపోరాటం చేయడమేమిటి? అకారణంగా నన్ను, మా మీడియా సంస్థలను నిందించిన పవన్‌ కల్యాణ్‌పై నేను న్యాయపోరాటం చేయబోతున్నాను.
 
ఆయనలాగా అభిమానులను రెచ్చగొట్టి దాడులు చేయించడం మా సంస్కృతి కాదు. మా సంస్థలలో కూడా వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తమకు ఉపాధి కల్పిస్తున్న సంస్థలను కాపాడుకోవడం ఎలాగో వారికి కూడా తెలుసు. అయితే దాడులకు ప్రతిదాడి మా సంస్కృతి కాదు. సినిమా రంగానికి పరిమితమైన వారికి వివిధ కారణాల రీత్యా కొంత రక్షణ ఉంటుంది. మీడియా సంస్థలు వారిని విమర్శించవు. ఏదైనా సినిమాలో వారి నటన చెత్తగా ఉన్నా ఆ మాట చెప్పవు. దీంతో కొద్దిపాటి విమర్శలను కూడా భరించలేని స్థితికి వారు చేరుకుంటారు. అదేవిధంగా, సినిమా రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చినవారు ప్రారంభంలో విమర్శలను సహించ లేరు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ ప్రారంభించి ముఖ్యమంత్రి అయిన కొత్తలో పత్రికలలో వ్యతిరేక వార్తలు రావడాన్ని జీర్ణించుకోలేకపోయేవారు. విలేకరుల సమావేశంలో ఎవరైనా క్రిటికల్‌గా ప్రశ్నించినా ఆయనకు రుచించేది కాదు! చలనచిత్ర రంగంలో ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకున్నట్టుగానే రాజకీయాలలో కూడా జరగాలని ఎన్టీఆర్‌ కూడా తొలినాళ్లలో భావించేవారు. కొంతకాలానికి ఆయనకు తత్వం బోధపడింది. పత్రికలలో వచ్చే వ్యతిరేక వార్తలను వ్యక్తిగతంగా తీసుకోకుండా సంయమనంతో వ్యవహరించేవారు. అజ్ఞాతవాసి వంటి సినిమాలు సూపర్‌ ఫ్లాప్‌ అయినా పవన్‌ కల్యాణ్‌ను ఆ స్టార్‌ ఈ స్టార్‌ అంటూ విశేషణాలతో మీడియా కీర్తిస్తోంది. రాజకీయాలలో కూడా తనను అలాగే కీర్తించాలని పవన్‌ కల్యాణ్‌ కోరుకుంటూ ఉండొచ్చు కానీ అది కుదరదు! రాజకీయ నాయకుడు మొదటగా అలవర్చుకోవలసింది సహనాన్ని! పవన్‌ కల్యాణ్‌కు కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. అలా కాకుండా నా వెనుక అంతులేనంతమంది అభిమానులు ఉన్నారన్న భరోసాతో రెచ్చిపోతే పుచ్చిపోతారు. అజ్ఞా తవాసి సినిమాను ఆయన అభిమానులు విజయవంతం చేయలేకపోయారు కదా! రాజకీయాలలో కూడా అదే పరిస్థితి ఉంటుంది.
 
చెప్పేదేమిటి... చేసేదేమిటి?
పవన్‌ కల్యాణ్‌ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని తాజా ఎపిసోడ్‌తో స్పష్టమవుతోంది. సమస్యలు ఉంటే పోలీసు స్టేషన్‌నో, న్యాయస్థానాన్నో ఆశ్రయించాలని శ్రీరెడ్డికి సూచించిన ఆయన ఇప్పుడు చేసింది ఏమిటి? తనకు వ్యతిరేకంగా ఫలానా ఫలానా వారు కలిసి కుట్ర పన్నుతున్నారనుకుంటే ఆయన కూడా పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టవలసింది. లేదంటే తాజాగా ట్విట్టర్‌లో వ్యాఖ్యానించినట్టుగా న్యాయపోరాటానికి పూనుకోవలసింది. ఇవేమీ చేయకుండా మందీమార్బలంతో ఫిలిం చాంబర్‌కు వెళ్లి హంగామా సృష్టించడం ఏమిటి? శ్రీరెడ్డి ప్రవర్తనకు పవన్‌ కల్యాణ్‌ ప్రవర్తనకు తేడా ఏమి ఉంది? మీడియా సంస్థలను నడుపుతున్నారన్న కారణంగా నాపై కూడా సోషల్‌ మీడియాలో పలువురు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. కథనాలను పోస్టు చేస్తుంటారు. వాటిని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. సమాజంలో ఏదో ఒక స్థాయికి చేరుకున్న వారిపై విమర్శలు రాకుండా ఎలా ఉంటాయి? కొన్ని వెబ్‌ చానెళ్లు నాపై కథనాలను యూ ట్యూబ్‌లో పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకుంటాయి. నా వల్ల వారికి ఆదాయం వస్తున్నందున నేను గర్వపడతానే గానీ కుంగిపోను. పవన్‌ కల్యాణ్‌కు ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే! అలాంటప్పుడు ఆయనను ఆరాధించే వారితో పాటు వ్యతిరేకించేవారు కూడా ఉంటారు. రాజకీయాలలోకి వచ్చాక ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది. ఇవేమీ తెలియనట్టుగా మీడియాతో వైరం పెట్టుకుని కొరివితో తల గోక్కోవాలనుకుంటే ఎవరు మాత్రం ఏమిచేస్తారు? తనను వాడుకోవడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నించిందని శ్రీరెడ్డి స్వయంగా ప్రకటించింది.
 
శుక్రవారంనాటి పవన్‌ కల్యాణ్‌ హంగామా చూసి జగన న్నని చూసి సహనాన్ని నేర్చుకోమని కూడా సూచించింది. అలాంటప్పుడు పవన్‌ కల్యాణ్‌ అనుమానించదలచుకుంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీని, ఆ పార్టీ వాళ్లను అనుమానించాలే గానీ మీడియా సంస్థల అధిపతులపై నిందలు వేయడం ఏమిటి? శ్రీరెడ్డి నేరుగా పవన్‌ కల్యాణ్‌ను తిడితే, తన తల్లిని తిట్టిందనీ, తిట్టించారనీ ప్రచారం చేసుకోవడం ద్వారా ప్రజల సానుభూతి పొందాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారేమో తెలియదు. నిజానికి శ్రీరెడ్డి వాడిన పదాన్ని చాలా ప్రాంతాలలో ఊతపదంగా ఉపయోగిస్తారు. తల్లిని కూడా ‘ఆ దృష్టి’తో చూసేవాడు అని ఎవరినైనా అభివర్ణించడానికి సదరు పదం వాడతారు. ఫలానా వాడు మహాముదురు అని చెప్పడానికి కూడా ఆ పదాన్ని వాడతారు. తిట్టని తిట్టును తిట్టినట్టుగా హడావుడి చేసి ఆవేదన వ్యక్తంచేస్తున్న పవన్‌ కల్యాణ్‌కు, ఆయన అభిమానులమని చెప్పుకునే సమూహాలు ఇతరుల గురించి వాడే భాష దారుణంగా ఉంటుందన్న విషయం తెలియదా? అందరికీ తల్లులు, తోబుట్టువులు, కూతుళ్లు, కోడళ్లు ఉంటారు. మాతృమూర్తులను ఎవరైనా పూజించవలసిందే! పవన్‌ కల్యాణ్‌తో విభేదించే వారిని ఆయన అభిమానులు ఎంత దారుణాతి దారుణంగా తిడతారో అందరికీ తెలిసిందే!
 
దాల్‌మే కుచ్‌ కాలా హై...
చీటికీ మాటికీ మీడియా సంస్థలను నిషేధించాలని పిలుపు ఇవ్వడం ఫ్యాషన్‌గా మారింది. పవన్‌ కల్యాణ్‌ కూడా ఇప్పుడు ఈ ఫ్యాషన్‌ను అందిపుచ్చుకున్నారు. రాజకీయాలలోకి పూర్తిగా దిగకముందే మీడియా సంస్థలను బ్యాన్‌ చేయమని పిలుపు ఇచ్చే స్థితికి పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు. శభాష్‌! గతంలో కూడా చాలామంది ఫలానా మీడియాను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేయడం చూశాం! కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏబీఎన్‌ను నిషేధించినా... నేను న్యాయపోరాటం చేసి విజయం సాధించాను. పవన్‌ కల్యాణ్‌ ఇంకా అధికారంలోకి రాకుండానే నిషేధాజ్ఞలు విధిస్తున్నారు. పొరపాటున అధికారంలోకి వస్తే ఇంకేమి చేస్తారో తెలియదు. అయినా నిన్నటివరకు తనను తిట్టిన, తిట్టించిన జగన్మోహన్‌ రెడ్డికి చెందిన మీడియా పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన నిషేధ జాబితాలో ఎందుకు లేదో తెలుసుకోవాలనుకోవడం తప్పు కాదుకదా! ‘దాల్‌ మే కుచ్‌ కాలాహై’ అన్నట్టుగా ఈ ఎపిసోడ్‌ వెనుక ఇంకేదో ఉంది! పవన్‌ కల్యాణ్‌ నుంచి విడాకులు తీసుకున్న రేణూ దేశాయ్‌ తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ప్రకటించగానే పవన్‌ అభిమానులు ఆమెను దూషించి మానసిక క్షోభకు గురిచేయడాన్ని మనం ఇటీవలే చూశాం! రేణూ దేశాయ్‌ కూడా ఇద్దరు పిల్లలకు తల్లి, ఇంకొకరికి కూతురే కదా! విడాకులు ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ మరో పెళ్లి చేసుకున్నప్పుడు రేణూ దేశాయ్‌ చేసుకోకూడదా? పవన్‌తో విడాకులు ఎందుకు తీసుకున్నారని నా ఓపెన్‌ హార్ట్‌ షోలో ప్రశ్నించినప్పుడు ‘గాజు పెంకును ఎంతసేపని గుప్పిట ఉంచగలను? చేయి తెగదా?’అని రేణూ దేశాయ్‌ బదులిచ్చారు. అంటే పవన్‌ కల్యాణ్‌ను ఆమె గాజుపెంకుతో పోల్చారన్న మాట! రేణూ దేశాయ్‌ అనే ఒక ఆడకూతురును దారుణంగా దూషించిన తన అభిమానులను కట్టడిచేయని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు తన తల్లిని ఏమీ అనకపోయినా తిట్టారని హడావుడి చేసి సానుభూతి కోసం ప్రయత్నించడం అబ్బురపరుస్తోంది.
 
కత్తి మహేశ్‌, శ్రీరెడ్డి వెనుక ఎవరున్నారో పరిశోధించి కనిపెట్టకముందే... తానే ఉన్నట్టు స్వయంగా ప్రకటించుకుంటున్నానని రామ్‌గోపాల్‌ వర్మ చెప్పారు కదా! ఇప్పటికైనా అర్థమయ్యిందా.. పవన్‌కల్యాణ్‌! మీ కుట్ర థియరీ అంతా పీడకలే అని! బలవంతులనే వారు అయిన దానికీ, కానిదానికీ స్పందించరని పవన్‌ కల్యాణే చెబుతుంటారు. తాజా ఉదంతంతో పవన్‌ కల్యాణ్‌ బలవంతుడా? బలహీనుడా? అన్న సందేహం రాకుండా ఎందుకుంటుంది? మా వెనుక అభిమానులు ఉన్నారన్న ధీమాతో అందరినీ అదుపు చేయాలనుకోవడం అవివేకం. ఎవరిని ఎవరూ అదుపు చేయలేరు. మన అందరికంటే ప్రకృతి గొప్పది! ఎవరిని ఎక్కడ పెట్టాలో అది చూసుకుంటుంది. అకారణంగా కుట్ర వివాదంలోకి నన్ను లాగినందుకు పవన్‌ కల్యాణ్‌పై నాకు కోపం ఏమిలేదు. కాకపోతే... ఐ పిటీ హిమ్‌! 
యూట్యూబ్‌లో ‘కొత్త పలుకు’ కోసం
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...