Jump to content

విభజన సమస్యల పరిష్కారం చంద్రబాబుతోనే సాధ్యం: కోనేరు హంపి


KING007

Recommended Posts

విభజన సమస్యల పరిష్కారం చంద్రబాబుతోనే సాధ్యం: కోనేరు హంపి
20-04-2018 13:23:06
 
636598273879531078.jpg
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్లకు గుర్తింపు వచ్చిందని చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విభజన సమస్యల పరిష్కారం చంద్రబాబుతోనే సాధ్యమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పుట్టినరోజున మంచి కార్యక్రమం చేపట్టారని, రాష్ట్ర డిమాండ్లన్నీ నెరవేరుతాయని ఆశిస్తున్నానని కోనేరు హంపి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చేస్తోన్న పోరాటానికి అందరూ మద్దతు ఇచ్చి, ముందుకు తీసుకెళ్లి మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది కేవలం ఓ వ్యక్తికి, పార్టీకి ప్రయోజనం కలిగించడానికి చేసే కార్యక్రమం కాదని, ఇది ప్రజలందరికీ సంబంధించిన అంశమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని హంపి పిలుపునిచ్చారు.
 
ఏపీకి కేంద్రం చేస్తోన్న అన్యాయానికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష కొనసాగుతోంది. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో సాగుతున్న ఈ దీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలు ప్రతినిధులతోపాటు పారిశ్రామిక, సినీ, క్రీడా ప్రముఖులు కూడా శిబిరానికి విచ్చేసి తమ మద్దతు తెలియజేస్తున్నారు. కోనేరు హంపి కూడా దీక్షా స్థలికి విచ్చేసి ప్రత్యేక హోదా కోసం తన మద్దతు తెలిపారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...