Jump to content

orvakal mega industrial corridor kurnool


Recommended Posts

  • 2 weeks later...
కర్నూలు జిల్లాలో మూడు స్టీల్‌ ప్లాంట్లు
03-05-2018 03:18:05
 
  • 10న జైరాజ్‌ స్టీల్స్‌కు సిఎం శంకుస్థాపన
అమరావతి (ఆంధ్రజ్యోతి) : కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో మూడు స్టీల్‌ ప్లాంట్లు ఏర్పాటు కాబోతున్నాయి. జైరాజ్‌ మెగా స్టీల్స్‌ కంపెనీ రూ.3,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే స్టీల్‌ ప్లాంట్‌కు సిఎం చంద్రబాబు ఈ నెల 10న శంకుస్థాపన చేయనున్నారు. ఎపిఐఐసి ఇండస్ట్రియల్‌ హబ్‌లో 1,500 మందికి ఉపాధి కల్పించేలా రెండు దశల్లో ఈ సమగ్ర స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని కంపెనీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార పత్రాన్ని సమర్పించింది.
 
ఓర్వకల్లులోనే నాచూ కార్పొరేషన్‌ అనే కంపెనీ రూ.1,035 కోట్ల పెట్టుబడితో డక్ట్‌ ఐరన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దాదాపు 2,000 మందికి ఉపాధి కల్పించే ఈ ప్లాంట్‌కు సంబంధించిన ప్రతిపాదనని కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఈ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం ఓర్వకల్లులోనే 161 ఎకరాలను ఎకరా రూ.3.50 లక్షల చొప్పున కేటాయించేందుకు బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్‌ఎ్‌సఎల్‌ అనే కంపెనీ కూడా 2,000 మందికి ఉపాధి కల్పించేలా ఓర్వకల్లులోనే రూ.3,000 కోట్లతో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
Link to comment
Share on other sites

 కర్నూలు జిల్లా ఓర్వకల్లులో మెసర్స్‌ నాచు కార్పొరేషన్‌, స్టీల్‌ ఇండస్ట్రీ్‌సకు 161 ఎకరాల భూమి. ఎకరం ధర రూ.3.5 లక్షలు. ఇందులో... 1040 కోట్ల పెట్టుబడితో ఏడాదికి రెండున్నర టన్నుల సామర్థ్యంతో డీఐ పైపుల తయారీ కర్మాగారం నెలకొల్పుతారు.

Link to comment
Share on other sites

ఉక్కు పరిశ్రమకు సీఎం శంకుస్థాపన.. 5 వేల మందికి ఉపాధి: బాబు
10-05-2018 13:44:12
 
636615566521047870.jpg
కర్నూలు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు గుట్టపాడు సమీపంలో జయరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.3 వేల కోట్లతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకానుందని, తద్వారా 5 వేల మంది యువతకు ఉపాధి లభించనుందని సీఎం చెప్పారు. పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని ఆయన అన్నారు. అనంతరం పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తర్వాత ఉర్దూ వర్సిటీ, రూసా క్లస్టర్ వర్సిటీలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Link to comment
Share on other sites

ఉక్కు’ సంకల్పం
వెయ్యి మందికి నేరుగా.. 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి
ఈనాడు డిజిటల్‌ - కర్నూలు
knl-top1a.jpg

ర్వకల్లును ప్రభుత్వం మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌గా ప్రకటిచింది. దీనిలో భాగంగా జైరాజ్‌ ఇస్పాత్‌ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. వెయ్యి మందికి ప్రత్యక్షంగా... 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనున్న ఈ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు శంకుస్థాపన చేయనున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన మరికొన్ని కంపెనీలకు ఓర్వకల్లు పరిధిలోనే భూములు కేటాయించారు.

7 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా...
ఓర్వకల్లు పరిధిలోని గుట్టపాడు, ఎన్‌.కొంతలపాడు గ్రామాల సర్వేనెంబరు 181, 274లలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా తొలివిడతలో 415 ఎకరాలు భూసేకరణ జరిపి పరిశ్రమకు అప్పగించారు. దీనిలో 370 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎకరాకు రూ.3.50 లక్షలు, 45 ఎకరాల పట్టా భూమికి ఎకరాకు రూ.10.20 లక్షల చొప్పున చెల్లించి ఇచ్చారు. ప్రస్తుతం జైరాజ్‌ ఇస్పాత్‌ కంపెనీ రూ.1658 కోట్లు పెట్టుబడితో ఏడాదికి ఏడు లక్షల మెట్రిక్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంటులో టీఎంటీ బార్స్‌, పిగ్‌ ఐరన్‌ తయారు చేస్తారు. బళ్లారి, హోస్‌పేట నుంచి ఐరన్‌ ఓర్‌(ఇనుప ఖనిజం) వచ్చేలా ప్రణాళిక చేసుకున్నారు. ఓర్వకల్లు జాతీయరహదారి నుంచి ఎన్‌.కొంతలపాడు వరకు నాలుగులైన్ల రహదారికి ఇప్పటికే రూ.8 కోట్లు కేటాయించారు. చెన్నై-బెంగళూరు కారిడార్‌ ద్వారా కర్నూలు కోట్ల రైల్వేస్టేషన్‌ నుంచి గుట్టపాడుకు రైల్వే ట్రాక్‌ వేయాలని ప్రణాళిక చేస్తున్నారు. దీనికోసం ఆర్‌బీ అసోసియేట్స్‌ మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఓర్వకల్లు.. ప్రగతి పరవళ్లు
గని-శకునాల పరిధిలో ఆల్ట్రా సోలార్‌ పార్కు ఏర్పాటుకు 2.530.78 ఎకరాలు ఎన్‌ఆర్‌ఈడీసీఏపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు 1082.36 ఎకరాలు కేటాయించారు. 2,989.94 ఎకరాలు ఏపీఐఐసీ ద్వారా డీఆర్‌డీవోకు కేటాయించగా...భూమి నగదు చెల్లించారు. కానీ స్థాపనకు అడుగులు పడలేదు. దీంతోపాటు న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌కు 896 ఎకరాలు ప్రభుత్వం కేటాయింపులు చేసింది.

మరికొన్ని సంస్థలతో ఎంవోయూ...
ఓర్వకల్లు పరిశ్రమల కారిడార్‌లో ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్న ఐదు సంస్ధలకు భూమిని కేటాయించారు. ఐరన్‌ పైపులు తయారు చేసే హైదరాబాద్‌కు చెందిన ‘నాచు స్టీల్‌ కార్పొరేషన్‌’కు 250 ఎకరాలు, ఐవీ ఫ్లూయిడ్స్‌ తయారు చేసే ‘సిగాచి ఇండస్ట్రీస్‌’కు 60 ఎకరాలు, ఎన్‌ఎస్‌ఎల్‌ ఆస్ట్రేలియాకు చెందిన మైనింగ్‌ కంపెనీకి వెయ్యి ఎకరాలు ఇలా భూములు కేటాయించారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు సైతం పాణ్యం- ఓర్వకల్లు-బ్రాహ్మణపల్లెలో 80 ఎకరాలిచ్చారు.

నీటి సమస్య తీరితేనే... పరిశ్రమలకు రూపు
ఓర్వకల్లు మెగా ఇండిస్ట్రీయల్‌ పార్కు నీటి వసతి కల్పించగలిగినప్పుడే పరిశ్రమలకు ఓ రూపు వస్తుంది. దీనిలో భాగంగా 1.5 టీఎంసీల నీటిని నిల్వ చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీశైలం వెనుక జలాల నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా అక్కడక్కడా రిజర్వాయర్లు నిర్మించడానికి రూ.452 కోట్లతో డీపీఆర్‌ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. తొలివిడతగా రూ.180 కోట్లు దీనికి వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఐడీపీ ఆమోదం పొందితే ఈ నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

సెప్టెంబర్‌లో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభం: బాబు
10-05-2018 15:03:25
 
636615614054789576.jpg
కర్నూలు: సెప్టెంబర్ నెలలో ఓర్వకల్లులో ఎయిర్ పోర్టు ప్రారంభంకానుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... పరిశ్రమల స్థాపనతో కర్నూలు జిల్లా దశ తిరగనుందని, ఓర్వకల్లుకు పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు. విద్యావంతులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, రూ.85 వేల కోట్లతో పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని, 85 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • 7 months later...
రాయలసీమలో నాలుగో ఎయిర్‌పోర్టు.. ట్రయల్ రన్ సక్సెస్!
31-12-2018 13:22:01
 
636818593222402279.jpg
ఓర్వకల్లు: కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ట్రయల్ రన్ విజయవంతమైంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి పయనమైన విమానం ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులో విజయవంతంగా ల్యాండ్ అయింది. జనవరి 7 నుంచి ఈ విమానాశ్రయం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జనవరి 7న ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌పోర్టు రాయలసీమలో నాలుగో ఎయిర్‌పోర్టుగా రికార్డులకెక్కనుంది.
 
 
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌ కేంద్రంగా ఔత్సాహిక ప్రారిశ్రామికవేత్తలు రావాలంటే రవాణా మెరుగుపడాలని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 999.50 ఎకరాలను ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అధారిటీకి కేటాయించింది. రూ.90.5 కోట్లతో 2017 జూన్‌లో పనులు చేపట్టారు. కీలకమైన రన్‌వే, అప్రాన్‌, టర్మినల్‌, టవర్‌ భవనం, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
కర్నూలు ‘ఫార్మా క్లస్టర్‌’కు కేంద్రం సాయం
20-01-2019 03:53:13
 
న్యూఢిల్లీ, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కర్నూలులో ఏర్పాటు చేస్తున్న ఫార్మా క్లస్టర్‌ పార్కుకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు సంబంధిత లేఖను ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌కు శనివారం కేంద్రం అందించింది. అయితే, డీపీఆర్‌ను రూపొందించి 6 నెలల్లోపు స్కీమ్‌ స్టీరింగ్‌ కమిటీకి అందించాలని ఆదేశించిం ది. కాగా, విశాఖపట్నం మెడిటెక్‌కు సాయంపై వారంలో ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్టు ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...