Jump to content

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గ


vinayak

Recommended Posts

http://www.andhrajyothy.com/artical?SID=565680

 

హైదరాబాద్: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌‌లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విధించిన సభ్యత్వాల రద్దును హైకోర్టు ఎత్తేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలు కొనసాగుతాయని తీర్పు వెల్లడించింది. వారి సభ్యత్వం ఎప్పటి వరకు ఉందో...అప్పటి వరకు పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌‌పై దాడికి సంబంధించి క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ తీర్పు అడ్డంకి కాదని కోర్టు తెలిపింది.  హైకోర్టు తీర్పుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
 
అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సందర్భంగా దాడికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల శాసన సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పును వెలువరించింది 
 
 
 
Link to comment
Share on other sites

20 minutes ago, Hari Arla said:

Speaker is not the chair of the house during governer speech..So speaker ruling is invalid

They didn't give any show cause notice to MLAs for their explanation,they can't directly dismiss their membership

Link to comment
Share on other sites

http://www.eenadu.net/homeinner.aspx?category=politics&item=break93

కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల సస్పెన్షన్‌ ఎత్తివేత

02265617BRK93A.JPG

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారిపై విధించిన అసెంబ్లీ బహిష్కరణ ఉన్నత న్యాయస్థానం ఎత్తివేసింది. వారి శాసనసభ సభ్యత్వాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీచేసింది. వారు తప్పు చేశారని భావిస్తే ప్రభుత్వం  క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు గానీ.. అసెంబ్లీ బహిష్కరణ సరికాదని న్యాయస్థానం పేర్కొంది.

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళన చేశారు. గవర్నర్‌ ప్రసంగం ప్రతులను చించివేశారు. అదే సమయంలో కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్‌ఫోన్‌ను విసరగా అది శాసన మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి తగిలినట్లు ఆరోపణలు వచ్చాయి. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన వెంటనే స్వామిగౌడ్‌ సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి వెళ్ళి చికిత్స తీసుకున్నారు. ఈ ఘటనలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించారంటూ వారిపై అసెంబ్లీ బహిష్కరణ విధించారు. ఆ వెంటనే వారి శాసన సభ్యత్వాలు రద్దయినట్లు ప్రభుత్వం జీవో జారీచేసింది. ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది.

దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని కోర్టుకు విన్నవించారు. దీనిపై పలుమార్లు వాదనలు విన్న న్యాయస్థానం కాంగ్రెస్‌ సభ్యులకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవోలన్నీ రద్దయినట్లేనని కాంగ్రెస్‌ సభ్యుల తరపు వాదనలు వినిపించిన న్యాయవాది పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...