Jump to content

Anam Ramanarayana reddy into YCP? Anta nijamena


KaNTRhi

Recommended Posts

29 minutes ago, sonykongara said:

ante city aziz, rural,adala prabhakar, Sarvepalli somi ani mi uddesama bro

 

Yes bro .. adding Sarvepalli sure Somy will win ...last time varadapuram and some villages around that votes lose ayadu post elections ahh side jagad batch joined into TDP and also Somi Baga cehystunnadu we term minister Ayala....water was a big hit unanimous gana gelavali Kaani publicity too poor unndhi addhi overcome avvali eena 

Link to comment
Share on other sites

  • Replies 66
  • Created
  • Last Reply
1 hour ago, fan no 1 said:

Ee roju na neighbour , Sarvepalli resident to matlada, Somi kastam annadu...Ayana YCP batch kani he is very confident eesari kooda YCP ani akkada.

that is the difference between Jaffa batch and us... mana thoughts always pessimistic... vallu odipoye seat kuda confident ga gelustamu antaru... manam geliche seat ni kuda gelustama antu maname doubt padatamu.. time to start being optimistic anukunta....

Link to comment
Share on other sites

18 minutes ago, katti said:

that is the difference between Jaffa batch and us... mana thoughts always pessimistic... vallu odipoye seat kuda confident ga gelustamu antaru... manam geliche seat ni kuda gelustama antu maname doubt padatamu.. time to start being optimistic anukunta....

haha @nvkrishna bro eppudo chepparu idi :roflmao:,nandyal election appudu ayite ghoram,ycp vallu maku 30k majority vastadi ani cheppukuni tirigaru,manam emo ycp gelichiddi emo ani tirigamu:wall:

Link to comment
Share on other sites

6 hours ago, fan no 1 said:

Ee roju na neighbour , Sarvepalli resident to matlada, Somi kastam annadu...Ayana YCP batch kani he is very confident eesari kooda YCP ani akkada.

No chance bro Maadi addey niyogikavargam... Govigaadu entha extralu cheystunnadu anntey permissions techukunna canals ekkqdo okka 30cents littigation unna dha I malli leppi aapistunnadu addhi people ki teeskuni vella galaigitey enough ..this is just naa polam dhaggara sangatulu illa enno bad cheystunnadu vaadu sure shot looser eesari

Link to comment
Share on other sites

ఆనం కుటుంబ భవిష్య నిర్ణయంపై ఊహాగానాలు
19-04-2018 15:41:19
 
636597492804996435.jpg
  • రాక-పోకల లాభ నష్టాలపై జోరుగా చర్చలు
  • టీడీపీ, వైసీపీ శిబిరాల్లో లెక్కలే లెక్కలు!
  • పెద్దగా తేడా ఉండబోదని ఇరు వర్గాల ధీమా
  • అధినేతలకు తమతమ అంచనాలతో నివేదికలు
పార్టీ మారే యోచన నా దరిదాపుల్లో లేదని మాజీ మంత్రి, ఆత్మకూరు టీడీపీ ఇన్‌చార్జి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేసినా.. ఆ కుటుంబం ఏదో నిర్ణయం తీసుకోబోతోందనే ప్రచారాన్నే రాజకీయులు, ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఆనం సోదరులు పార్టీకి దూరమైతే సర్వేపల్ల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో టీడీపీ కొంత నష్టపోతుందని ఆ పార్టీ నేతలు కొందరు అంటుండగా, ఆ కుటుంబం పార్టీలో ఉన్నా వారికి తప్ప, పక్కవారికి ఉపయోగపడదని, ఆయా నియోజకవర్గాల్లో ఆనం వర్గం ఏనాడో విచ్ఛిన్నమైపోయిందని ఇంకొందరు వాదిస్తున్నారు. అటు వైసీపీలో ఆత్మకూరు, సర్వేపల్లి ఎమ్మెల్యేలు ఆనం రాకను స్వాగతిస్తున్నట్టు వార్తలు వస్తుండగా, నెల్లూరు నగర, రూరల్‌ ఎమ్మెల్యే అనుచర వర్గాలు ఆందోళనపడుతున్నట్టు సమాచారం. ఆనం కుటుంబాన్ని చేర్చుకోవడం వల్ల కొత్తగా బలపడేదంటూ ఏమి ఉండదని, ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని పలువురు వైసీపీ నాయకులు అధినేత దృష్టికి తీసుకెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది.
 
 
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘పార్టీ మారే యోచన నా దరిదాపుల్లో లేదు’’.. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి, ఆత్మకూరు టీడీపీ ఇన్‌చార్జి ఆనం రామనారాయణరెడ్డి అన్న మాటలివి. అయినా ఎందుకనో ప్రజలు, నాయకులు విశ్వసించడం లేదు. ఆనం కుటుంబానికి సంబంధించి ఏదో నిర్ణయం జరగబోతుందనే ప్రచారాన్నే గట్టిగా నమ్ముతున్నారు. ఈ ప్రచారాల నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలు ఆనం కుటుంబం రాక- పోకతో తమ పార్టీకి కలిగే లాభ నష్టాలపై అంచనా వేసుకొంటున్నాయి. నగరంలో రాజకీయాలపై ఆసక్తి ఉన్న నలుగురు ఎక్కడ కలసినా ఇదే చర్చ. ఎవరికి తోచినట్లు వారు విశ్లేషించుకొంటున్నారు. ప్రస్తుతం ఆనం కుటుంబ పెద్దగా ఉన్న రామనారాయణరెడ్డి పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేసినా ఈ చర్చలు ఆగడం లేదు. సుదీర్ఘ కాలం జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబం కావడంతో సహజంగానే ఆనం సోదరుల కదలికలను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు పార్టీ మారితే ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీలకు కలిగే లాభనష్టాలపై చర్చించుకొంటున్నారు. ఆ వివరాలను జిల్లా నేతలు ఆయా పార్టీల నేతలకు రహస్య నివేదికల ద్వారా తెలియజేస్తున్నారు.
 
 
తెలుగుదేశం లెక్కలు ఇవి..
ఆనం సోదరులు పార్టీకి దూరమైతే మూడు, నాలుగు నియోజకవర్గాల్లో పార్టీకి నష్టం జరుగుతుందని టీడీపీకి చెందిన కొందరు నేతలు అభి ప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో మంత్రి సోమి రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్ల్లి మొదటి వరు సలో ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. పూర్వపు రాపూరు నియోజకవర్గం పరిధిలోని మను బోలు, వెంకటాచలం, పొదలకూరు మండలాల్లోని కొన్ని ప్రాంతాలు ప్రస్తుతం సర్వేపల్లి నియోజక వర్గంలో కలిసిపోయాయి. ఈ మండలాల్లో ఆనం రామనారాయణరెడ్డికి బలమైన వర్గం ఉంది. ఈయనతో పాటు ఆ వర్గం కూడా పార్టీ మారితే మంత్రికి నష్టం జరుగుతుంది. విభజిత రాపూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న రాపూరు, కలువాయి మండలాలు వెంకటగిరి నియోజకవర్గంలో కలిసి పోయాయి. ఈ మండలాల్లో కూడా రామ నారాయణరెడ్డికి బలమైన వర్గం ఉంది. ఆయన పార్టీ మారితే ఆ నియోజకవర్గంలో కూడా టీడీపీకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఆనం కుటుం బంలో కీలక నేత వివేకానందరెడ్డి ప్రాబల్యం నెల్లూరు నగరం, రూరల్‌ నియోజకవర్గాలపై ఎక్కువ. ఈ రెండు నియోజకవర్గాల్లో సైతం పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితి లేకపోలేదని అంచనా వేస్తున్నారు.
 
 
అయితే ఈ వాదనలను కొంత మంది తెలుగు దేశం నాయకులు తేలిగ్గా తీసుకొంటున్నారు. ఆనం వర్గం ఏనాడో విచ్ఛిన్నమైపోయిందనేది వీరి వాదన. నెల్లూరు సిటీ, రూరల్‌ నియోజకవర్గంలో ఆనం వివేకానందరెడ్డి వెంట ఉన్న పలువురు కీలక నేతలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తరువాత తెలు గుదేశం పార్టీలో కలిసి పోయారు. పార్టీ తరుపున వీరిలో పలువురు కీలకపదవుల్లో కొన సాగుతున్నారు. ఈ క్రమంలో పై రెండు నియోజక వర్గాల్లో టీడీపీకి జరిగే నష్టం ఏమి లేదనేది ఆ పార్టీకి చెందిన కొందరు నేతల అభి ప్రాయం. పైగా ఆ కుటుంబం పార్టీలో ఉన్నా పక్క వారికి ఉపయోగ పడదని, తమ ప్రయోజనాల కోసమే తప్ప పార్టీ కోసం పని చేసిన దాఖలాలు లేవని టీడీపీ వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తు న్నాయి. పార్టీలో చేరిన రోజు నుంచి తమ కుటుంబ సభ్యులకు పదవుల కోసం తప్ప పార్టీ కోసం పని చేయలేదం టున్నారు. ఆనం సోదరుల మధ్య ఏకాభి ప్రాయం కుదరని కారణంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వకలేక పోయారని, నేటికి నగరపార్టీ అధ్యక్షునిగా నుడా చైర్మన్‌నే కొనసాగించాల్సి వస్తోందని అంటున్నారు. ఈ కుటుంబం పార్టీలో ఉంటే మంచి దేనని, ఒకవేళ నిష్కక్రమించినా పార్టీకి జరిగే నష్టం ఏమిలేదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తూ, ఇదే విషయాన్ని పార్టీ అధినేతకు వివరించినట్లు సమాచారం.
 
 
వైసీపీలో మోదం..ఖేదం
ఆనం కుటుంబం వైసీపీ తీర్థం పుచ్చుకొంటుందన్న ప్రచారం నేపథ్యంలో జిల్లా వైసీపీ నేతల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి రాకను కొంతమంది స్వాగతిస్తుండగా, పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఆనం కుటుంబాన్ని వైసీపీలోకి ఆహ్వానించడం వెనుక ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాత్ర ప్రముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత అనే విషయాన్ని పక్కనపెడితే ఆనం చేరిక వల్ల పై రెండు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి మెరుగుపడుతుందని విశ్వసిస్తున్నారు. మేకపాటి గౌతంరెడ్డి విషయానికి వస్తే ఈ చేరిక వల్ల ఆత్మకూరు నియోజకవర్గంలో తనకు బలమైన ప్రత్యర్థిగా ఉన్న రామనారాయణరెడ్డిని మిత్రునిగా మార్చుకొని బరిలో నుంచి తప్పించవచ్చు. పైగా ఆనం వర్గం పూర్తిగా వైసీపీకి మారితే ఇక గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని గౌతంరెడ్డి వర్గీయులు అంచనా వేస్తున్నారు.
 
 
ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా ఇదే లబ్ది పొందుతారు. మనుబోలు, పొదలకూరు, వెంకటాచలం మండలాల్లోని ఆనం వర్గం తనకు అండగా నిలబడితే మరింత బలం పుంజుకునే అవకాశం ఉందని కాకాణి వర్గీయుల అంచనా. ఆ క్రమంలోనే వీరిద్దరు ఆనం కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. విశేషమేమంటే ఈ ప్రచారాన్ని జిల్లా వైసీపీ నాయకులు సైతం బలపరుస్తున్నారు. అదే సమయంలో ఆనం కుటుంబ రాకను మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆనం కుటుంబం వల్ల ఏదో మేలు జరిగిపోతుందని ఇద్దరు ఎమ్మెల్యేలు భ్రమపడుతున్నారు, ఎన్నికల ఫలితాల తరువాత కాని వీరికి వాస్తవాలు బోధపడవని కొంత మంది వైసీపీ నేతలు వ్యాఖ్యానించడం విశేషం. ఆనం వర్గీయులను ఆహ్వానించే వారు ఉన్నట్లే.. రాకుంటే మంచిదని కోరుకునే వారూ ఉన్నారు. వెంకటగిరి టిక్కెట్టుపై జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఆనం కుటుంబం చేరికంటూ జరిగితే రామ నారాయణరెడ్డికి వెంకటగిరి టిక్కెట్టు ఇస్తారని ప్రచారం. దీంతో జెడ్పీ చైర్మన్‌ వర్గీయులు ఆనం చేరికను లోలోపల వ్యతిరేకిస్తున్నారు.
 
 
అలాగే సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌కు ఆనం కుటుంబానికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో అనిల్‌ వర్గీయులు సైతం ఆనం రాకను స్వాగతించడం లేదని చెబుతున్నారు. అలాగే ఆనం కుటుంబం చేరికంటూ జరిగితే రూరల్‌ నియోజకవర్గంపైనా పెత్తనం మొదలుపెడతారని సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అను చరులు ఆందోళన చెందుతున్నారు. వీరితో పాటు మరి కొందరూ రహస్యంగా తమ అభిప్రాయాలను పార్టీ అధినేత జగన్‌కు తెలియజేసినట్లు సమాచారం. ఆనం కుటుంబాన్ని చేర్చుకోవడం వల్ల కొత్తగా బలపడేదంటూ ఏమి ఉండదనేది వీరి వాదన. అనారోగ్య కారణంతో ఆనం వివేకానందరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. జనం ముందు వివేకానందరెడ్డి కనిపించని పక్షంలో ఆనం కుటుంబం వల్ల పార్టీకి ఒరిగేది ఏమీ ఉండదని, ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని పలువురు వైసీపీ నాయకులు అధినేత దృష్టికి తీసుకెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...