Jump to content

Trivi movie Eenadu article


SSR

Recommended Posts

రామోజీ ఫిలింసిటీలో రాయలసీమ వెలసింది
16tollywood5a.jpg

కళా దర్శకుల నైపుణ్యానికి తిరుగేముంది? సవాల్‌ విసిరితే... హైదరాబాద్‌లోనూ సముద్రం ‘సెట్‌’ వేయగలరు. అమీర్‌పేట్‌ సందుల్లోనే ఆగ్రాలోని తాజ్‌మహల్‌ని తెచ్చి నిలబెట్టగలరు. కళా దర్శకుడు ప్రకాష్‌ ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో రాయలసీమని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారాయన. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా హారిక హాసిని సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. త్రివిక్రమ్‌  దర్శకుడు. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో ఓ భారీ పోరాట సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళా దర్శకుడు ఓ సెట్‌ని రూపొందించారు. ఆ సెట్లో.. కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి  ఎస్‌.రాధాకృష్ణ నిర్మాత.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...