Jump to content

A moderate Hindu's frustration

NFans NRT

Recommended Posts

The below text is written by Nalamothu sridhar garu who works on Telugu tech magazine..!! He generally doesn't write about politics.., but present Gen polarization politics are becoming so dirty in the name of religion that lot of Hindus are frustrated with a party using them just as mere pawns in the name of religion and creating hatred for their benefits..!! 

The day is near ppl will respond with resounding verdict..!! 

9+
 
2 hours ago
హనుమాన్ బొమ్మ.. ప్రొఫైల్ ఫొటో! xyz Hindu అనే పేరు! ఈ మధ్య చాలామంది ప్రొఫైళ్లు ఇలా చూస్తున్నాను. అసలు జనాలు పిచ్చోళ్లవుతున్నారా?

వీళ్లు అసలు చదువుకున్నారా? కాస్తయినా విజ్ఞత ఉందా? నేనూ హిందువునే. నా జీవితకాలంలో హిందువుని అని ప్రత్యేకంగా చెప్పుకునేటంత ఎప్పుడూ దిగజారలేదు. కానీ ఈ మధ్య ఏంటి ప్రతీ ఒక్కరూ హిందూ అనీ, ముస్లిం అనీ, క్రిస్టియన్ అనీ... ఒకర్ని చూసి మరొకరు ఇలా అదేదో గొప్ప అన్నట్లు, పూనకం వచ్చినట్లు? హిందూ అని తగిలించుకుంటే.. ముస్లిం, క్రిస్టియన్ అని తగిలించుకుంటే.. చౌదరి, రెడ్డి, నాయుడు, శర్మ, వర్మ అని తగిలించుకుంటే ఎలాంటి ప్రత్యేకతలూ రావు. అలాంటి పేర్లు నీలోని సంకుచితత్వాన్ని తెలియజేస్తున్న విషయం అర్థం కావట్లేదా?

కులాల గురించి గతంలో పలుమార్లు రాశాను. కానీ మతాలు కూడా ఇంత దారుణంగా ఇంటి పేర్లు అయిపోతాయని నేను అస్సలు ఊహించలేదు. ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టి మనుషుల మధ్య హార్మోనీని దెబ్బతీసి ఎలాగైనా గెలవాలనుకునే రాజకీయ పార్టీలను చూసి ఎందుకు పిచ్చోళ్లవుతున్నారు? నేను హిందువునే అయినా నా చుట్టూ గొప్ప గొప్ప ముస్లిం సోదరులు, క్రిస్టియన్ మిత్రులూ ఉన్నారు. నా జీవితంలో ఎప్పుడూ మతం వల్ల నేను నష్టపోయింది లేదు. ఎక్కడో ఏదో సంఘటన జరిగితే దానికి కుల, మతాల బురద జల్లి జనాల్ని కొట్టుకు చచ్చేలా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తుంటే.. హిందూ అని పేరు తగిలించుకుంటే.. హనుమంతుడి ఫొటో పెట్టుకుంటే అది దేశభక్తి అనుకునే మూర్ఖులను ఏమనుకోవాలి? మనం మనుషులమా పశువులమా? కొట్టుకు చావడానికీ, తిట్టుకు చావడానికీ?

తోటి మనిషిని గౌరవించడం చేతగాని నీ కులాలెందుకు, మతాలెందుకు? దేవుడి ఫొటో పెట్టుకుని చివరకు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగడం సిగ్గనిపించడం లేదా? బ్రతుకు... నలుగుర్ని బ్రతకనివ్వు.. నువ్వు పద్ధతిగా మాట్లాడు, నలుగుర్ని పద్ధతిగా మాట్లాడనివ్వు, గౌరవం ఇవ్వు, గౌరవం పుచ్చుకో.. ఇంతకన్నా ఏం కావాలి? కులాలు, మతాల మధ్య? ఈ అండర్‌స్టాండింగ్‌ని నాశనం చేసి నా మతమే గొప్ప అని విర్రవీగే నీలాంటి వాళ్లని చూసి ఆయా మతాల్లో పుట్టినందుకు మాబోటి సామాన్యులం సిగ్గుపడుతున్నాం.

యెస్.. మతమంటే మాబోటి వాళ్లకి అదో గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు నేర్పే ఓ ప్లాట్‌ఫాం అని మాత్రమే తెలుసు. కానీ మీరూ, మీ రాజకీయ నాయకులూ మతాన్ని బ్రాండింగ్ చేసి పారేశారు. ఇంకెందుకు Amazonలోనో, Flipkartలోనో మత విశ్వాసాలను, దేశ భక్తినీ కేజీల్లెక్కన అమ్మేయండి..!

కొన్ని తరాల పాటు కులాలు, మతాలూ కలిసి ఉన్నా ఎన్ని చిన్న చిన్న గొడవలు వచ్చినా అందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ మెల్లగా మనలాంటి మూర్ఖుల వల్ల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య అగాధం పెరుగుతోంది. ఇది సమాజానికి మంచిది కాదు.. చదువుకున్న చదువునైనా గుర్తు తెచ్చకుని మూర్ఖులుగా కాకుండా మనుషులుగా బ్రతకండి.

- నల్లమోతు శ్రీధర్
2 hours ago
హనుమాన్ బొమ్మ.. ప్రొఫైల్ ఫొటో! xyz Hindu అనే పేరు! ఈ మధ్య చాలామంది ప్రొఫైళ్లు ఇలా చూస్తున్నాను. అసలు జనాలు పిచ్చోళ్లవుతున్నారా?

వీళ్లు అసలు చదువుకున్నారా? కాస్తయినా విజ్ఞత ఉందా? నేనూ హిందువునే. నా జీవితకాలంలో హిందువుని అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంతగా ఎప్పుడూ దిగజారలేదు. కానీ ఈ మధ్య ఏంటి ప్రతీ ఒక్కరూ హిందూ అనీ, ముస్లిం అనీ, క్రిస్టియన్ అనీ... ఒకర్ని చూసి మరొకరు ఇలా అదేదో గొప్ప అన్నట్లు, పూనకం వచ్చినట్లు? హిందూ అని తగిలించుకుంటే.. ముస్లిం, క్రిస్టియన్ అని తగిలించుకుంటే.. చౌదరి, రెడ్డి, నాయుడు, శర్మ, వర్మ అని తగిలించుకుంటే ఎలాంటి ప్రత్యేకతలూ రావు. అలాంటి పేర్లు నీలోని సంకుచితత్వాన్ని తెలియజేస్తున్న విషయం అర్థం కావట్లేదా?

కులాల గురించి గతంలో పలుమార్లు రాశాను. కానీ మతాలు కూడా ఇంత దారుణంగా ఇంటి పేర్లు అయిపోతాయని నేను అస్సలు ఊహించలేదు. ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టి మనుషుల మధ్య హార్మోనీని దెబ్బతీసి ఎలాగైనా గెలవాలనుకునే రాజకీయ పార్టీలను చూసి ఎందుకు పిచ్చోళ్లవుతున్నారు? నేను హిందువునే అయినా నా చుట్టూ గొప్ప గొప్ప ముస్లిం సోదరులు, క్రిస్టియన్ మిత్రులూ ఉన్నారు. నా జీవితంలో ఎప్పుడూ మతం వల్ల నేను నష్టపోయింది లేదు. ఎక్కడో ఏదో సంఘటన జరిగితే దానికి కుల, మతాల బురద జల్లి జనాల్ని కొట్టుకు చచ్చేలా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తుంటే.. హిందూ అని పేరు తగిలించుకుంటే.. హనుమంతుడి ఫొటో పెట్టుకుంటే అది దేశభక్తి అనుకునే మూర్ఖులను ఏమనుకోవాలి? మనం మనుషులమా పశువులమా? కొట్టుకు చావడానికీ, తిట్టుకు చావడానికీ?

తోటి మనిషిని గౌరవించడం చేతగాని నీ కులాలెందుకు, మతాలెందుకు? దేవుడి ఫొటో పెట్టుకుని చివరకు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగడం సిగ్గనిపించడం లేదా? బ్రతుకు... నలుగుర్ని బ్రతకనివ్వు.. నువ్వు పద్ధతిగా మాట్లాడు, నలుగుర్ని పద్ధతిగా మాట్లాడనివ్వు, గౌరవం ఇవ్వు, గౌరవం పుచ్చుకో.. ఇంతకన్నా ఏం కావాలి? కులాలు, మతాల మధ్య? ఈ అండర్‌స్టాండింగ్‌ని నాశనం చేసి నా మతమే గొప్ప అని విర్రవీగే నీలాంటి వాళ్లని చూసి ఆయా మతాల్లో పుట్టినందుకు మాబోటి సామాన్యులం సిగ్గుపడుతున్నాం.

యెస్.. మతమంటే మాబోటి వాళ్లకి అదో గొప్ప సంస్కృతీ సంప్రదాయాలు నేర్పే ఓ ప్లాట్‌ఫాం అని మాత్రమే తెలుసు. కానీ మీరూ, మీ రాజకీయ నాయకులూ మతాన్ని బ్రాండింగ్ చేసి పారేశారు. ఇంకెందుకు Amazonలోనో, Flipkartలోనో మత విశ్వాసాలను, దేశ భక్తినీ కేజీల్లెక్కన అమ్మేయండి..!

కొన్ని తరాల పాటు కులాలు, మతాలూ కలిసి ఉన్నా ఎన్ని చిన్న చిన్న గొడవలు వచ్చినా అందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ మెల్లగా మనలాంటి మూర్ఖుల వల్ల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య అగాధం పెరుగుతోంది. ఇది సమాజానికి మంచిది కాదు.. చదువుకున్న చదువునైనా గుర్తు తెచ్చకుని మూర్ఖులుగా కాకుండా మనుషులుగా బ్రతకండి.

- నల్లమోతు శ్రీధర్
This is visible to anyone who can see this post.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...