Jump to content

Chittoor Politics


Recommended Posts

మూడు చోట్ల సేఫ్.. కానీ చేయాల్సింది చాలా ఉంది !
27-09-2018 13:34:28
 
636736520697958262.jpg
  • మూడు చోట్ల కొలిక్కి వచ్చిన టీడీపీ ఇన్‌ఛార్జుల వ్యవహారం
  • మెజారిటీ సెగ్మెంట్లలో అస్పష్టతే
  • పలుచోట్ల లీకులతో గందరగోళం
  • గళం సవరిస్తున్న వెనుకబడిన కులాలు, మైనారిటీ వర్గాలు
(ఆంధ్రజ్యోతి, చిత్తూరు): తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జుల నియామకానికి సంబంధించిన వ్యవహారం జిల్లాలో క్రమంగా కొలిక్కి వస్తున్నట్టు కనిపిస్తోంది. మూడు నియోజకవర్గాల్లో పార్టీ పగ్గాలు అప్పగించినా, మెజారిటీ నియోజకవర్గాలలో ఇంకా అస్పష్టతే రాజ్యమేలుతోంది. టీడీపీలో 1997 తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ అభ్యర్థులను ముందుగా ప్రకటించింది లేదు. ప్రతిసారీ ఆఖరు క్షణంలో అభ్యర్థులను ప్రకటించడమే. దానివల్ల చాలాసార్లు పార్టీకి నష్టమే జరిగింది. అయితే ఈసారి అధిష్ఠానం గతానికి భిన్నంగా ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. అభ్యర్థులను ఖరారు చేసినా అధికారికంగా ప్రకటించకుండా అభ్యర్థులకు, పార్టీ వర్గాలకు స్పష్టత ఇచ్చేస్తోంది. ఇప్పటికే చంద్రగిరి, పీలేరు, పుంగనూరు సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. దీనివల్ల ఎన్నికల సమయానికి ఆయా చోట్ల అభ్యర్థులు తమ లోటుపాట్లను పూడ్చుకునే వీలు కలిగింది.
 
 
మెజారిటీ సెగ్మెంట్లలో ఇప్పటికీ అస్పష్టతే!
జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌ఛార్జుల మార్పు లేదా అభ్యర్థుల విషయంలో ఇప్పటికీ అస్పష్టతే కొనసాగుతోంది. ముందుగా టీడీపీ సిట్టింగ్‌ స్థానాల విషయానికొస్తే శ్రీకాళహస్తి నుంచీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేదెవరన్న దానిపై పార్టీ వర్గాల్లోనే సందిగ్ధత నెలకొని వుంది. బొజ్జలకు ఆరోగ్యం సహకరించని కారణంగా అక్కడ అభ్యర్థి మార్పు అనివార్యమవుతోంది. నియోజకవర్గ పార్టీపై బొజ్జల తరహాలో కుటుంబ సభ్యులు పట్టు సాధించలేకపోతున్నారనేది పార్టీ వర్గాల భావన. టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు రేసులో వున్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ రాజకీయ పరిణామాలు మాత్రం గణనీయ మార్పులకు లోను కావడం తధ్యమనిపిస్తోంది. ఇక కుప్పం, పలమనేరు మినహాయిస్తే మిగిలిన తంబళ్ళపల్లె, చిత్తూరు, సత్యవేడు, తిరుపతి సెగ్మెంట్లలో కూడా కొంతమేరకు అస్పష్టత వుంది.
 
తంబళ్ళపల్లెలో మాజీ ఎమ్మెల్యేలు ఏవీ లక్ష్మీదేవమ్మ, ఆమె తనయుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలను పార్టీలోకి చేర్చుకుని వారిద్దరిలో ఒకరికి టికెట్‌ ఇవ్వాలనే ప్రతిపాదన ఒకటి చాలాకాలంగా అధిష్ఠానం ముందు పరిశీలనలో వుంది. దానిపై తీసుకునే నిర్ణయం కూడా అక్కడి రాజకీయాలను ప్రభావితం చేయనుంది. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేనలో చేరబోతుండడం సంబంధిత సామాజికవర్గంలో చీలిక ప్రత్యర్థులకు మేలు చేసే పరిస్థితి వుంది. దీంతో ఈ పరిణామం పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. చిత్తూరులో పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆత్రుత, ఆరాటం పార్టీ ముఖ్యనేతలు ఎవరిలోనూ కనిపించడంలేదు. దీంతో అసలేం జరుగుతోంది, ఏ నేత మనసులో ఏం వుందో అంతుబట్టక శ్రేణులు అయోమయంలో పడుతున్నాయి. సత్యవేడులో టికెట్‌ ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది.
 
 
ప్రచారాలతో పలు సెగ్మెంట్లలో గందరగోళం
పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాలతో పలు సెగ్మెంట్లలో గందరగోళం నెలకొంటోంది. మదనపల్లె టీడీపీలో ముగ్గురు నేతలు కలసి తమకు తలా ఒక పదవి తీసుకుంటామని అధిష్ఠానం ఎదుట ఒప్పందం చేసుకున్నారన్న ప్రచారం దుమారం లేపుతోంది. దీన్ని అధిష్ఠానం ఎంతవరకూ ఆమోదించిందో తెలీదు గానీ స్థానికంగా కేడర్‌లో మాత్రం అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రధాన సామాజికవర్గాలకు చెందిన ముగ్గురు నేతలు తలా ఒక పదవి తీసుకునేలా పరస్పర అవగాహనకు రావడమంటే పార్టీలో మిగిలిన వర్గాలు, ఆశావహుల మాటేమిటన్న ప్రశ్న ఎదురవుతోంది. భూకబ్జాలతో పార్టీని భ్రష్టుపట్టించిన వారికి అవకాశం ఇస్తే పర్యవసానమూ అలాగే వుంటుందన్న హెచ్చరికలూ కార్యకర్తల నుంచీ వినిపిస్తున్నాయి.
 
గంగాధర నెల్లూరులో దీటైన అభ్యర్థిని నిలపాలన్న ప్రతిపాదన అధిష్ఠానం పరిశీలిస్తోందన్న ప్రచారమూ గందరగోళానికి దారి తీస్తోంది. కుతూహలమ్మ క్రియాశీలక రాజకీయాల నుంచీ తప్పుకున్నందున ఆమె కుమారుడు హరికృష్ణను అధిష్ఠానం ఇన్‌ఛార్జిగా నియమించింది. అయితే అక్కడ వైసీపీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్‌ నేత నారాయణస్వామి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా వున్నారు. ఆయన్ను ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థి అవసరమని అధిష్ఠానం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ కూడా ఆశావహులు తలెత్తుతున్నారు. పూతలపట్టులోనూ అదే పరిస్థితే వుంది. నగరి గురించి చెప్పాల్సిన పని లేదు. ఇన్‌ఛార్జిగా ఇతరుల్ని నియమిస్తే ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబీకుల ప్రతిస్పందన ఎలా వుంటుందనేది కీలకం కానుంది.
 
 
గళం సవరించుకుంటున్న బీసీ, మైనారిటీ వర్గాలు
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బీసీ, మైనారిటీ వర్గాలు రాజకీయ అవకాశాల కోసం గొంతు విప్పేందుకు సన్నద్ధమవుతున్నాయి. 2004, 2009 ఎన్నికల్లో వాయల్పాడులోనూ, 2014 ఎన్నికల్లో పీలేరులోనూ టీడీపీ అధిష్ఠానం ముస్లిం మైనారిటీలకు అవకాశమిచ్చింది. అయితే మూడుసార్లూ సొంతపార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారనేది మైనారిటీల ఆరోపణ. ఏ విధంగానూ అభ్యర్థులకు న్యాయం చేయలేదనే అసంతృప్తి వారిలో వుంది. ఇపుడు పీలేరులో ఇన్‌ఛార్జిగా వుండిన మైనారిటీ నేత ఇక్బాల్‌ అహ్మద్‌ను పక్కనపెట్టి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతిగా జిల్లాలో ఏదో ఒక సీటు తమకు కేటాయించాలనేది వారి డిమాండ్‌గా వుంది. పీలేరు తర్వాత అత్యధికంగా ముస్లిం మైనారిటీలున్నది మదనపల్లె, పుంగనూరు, పలమనేరుల్లో. ఇందులో పలమనేరు, పుంగనూరు స్థానాలు ఎవరికన్నది ఇప్పటికే ఖరారైపోయింది. ఇక మిగిలింది మదనపల్లె ఒక్కటే. అందుకే ముస్లిం మైనారిటీలు మదనపల్లె సీటుపై ఆశలు పెట్టుకుంటున్నారు. పార్టీకి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తలు ఇటీవలే సమావేశం ఏర్పాటు చేసుకుని సీటు తమకే కేటాయించాలంటూ అధిష్ఠానాన్ని డిమాండ్‌ చేశారు.అదే సమయంలో బీసీలూ గళం సవరించుకుంటున్నారు.
 
 
గత ఎన్నికల్లో తంబళ్ళపల్లె, పుంగనూరు నుంచీ బీసీలకు అవకాశమివ్వగా ఈసారి పుంగనూరు బీసీయేతరులకు ఖరారైపోయింది. తంబళ్ళపల్లెలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే తదుపరి అవకాశమన్న సంకేతాలు ఇప్పటి దాకా లేవు. చిత్తూరు జిల్లాలో బీసీ ఓటర్లు అధికంగా వున్నది కుప్పం, మదనపల్లె, పీలేరుల్లో. అయితే కుప్పం, పీలేరుల్లో అవకాశం కల్పించే పరిస్థితి లేదు. మిగిలింది మదనపల్లె ఒకటే. ఇక్కడ గత ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడడంతో పాటు ఎన్నికల తర్వాత గుర్తింపు లేకుండాపోయిందనే ఆవేదనతో బీసీ నేత వలిగట్ల రెడ్డెప్ప పార్టీకి రాజీనామా చేసిన నంగతి తెలిసిందే. బీసీ ఓటర్లు ఎక్కువున్న మదనపల్లె నుంచీ తమకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌ ఇపుడా వర్గాల నుంచీ వినిపిస్తోంది. కొందరు స్థానిక నేతలతో పాటు ఆర్థిక పరిపుష్టి కలిగి, బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న కొంతమంది కూడా ఆసక్తి చూపుతున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • Replies 144
  • Created
  • Last Reply
నగరి ఎమ్మెల్యే టికెట్ ఆయనకేనా!?
06-10-2018 13:59:38
 
636744313493755047.jpg
  • నేడు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ
  • ఉండవల్లి బయలుదేరిన టీడీపీ నేతలు
నాయకత్వ సమస్య తలెత్తిన నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ఒక్కొక్కరుగా తేల్చేస్తూ వస్తున్న చంద్రబాబు నగరిపైనా దృష్టి పెట్టారు. టిక్కెట్టు ఆశిస్తున్న వారితో పాటు టీడీపీ ముఖ్యులందరినీ శనివారం ఉండవల్లికి రావాలని ఆదేశించారు.
 
 
తిరుపతి: టీడీపీ సీనియర్‌ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతి చెందాక నాయకత్వ సమస్య, సమన్వయ లోపం ఏర్పడిన నగరి నియోజకవర్గంలో నాయక త్వాన్ని పటిష్టపరచడంపై అధిష్ఠానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం నగరి నియోజకవర్గ నేతలతో సమావేశమవుతున్నారు.ముఖ్య నేతలతో పాటు మండలస్థాయి నేతలను కూడా ఉండ వల్లిలో జరిగే సమావేశానికి హాజరుకావాలని చెప్పడంతో నాయకులంతా బయలుదేరి వెళ్లారు. ముద్దుకృష్ణమ హఠాన్మరణం తరువాత నియోజకవర్గంలో టీడీపీకి ఏకనాయకత్వం లేకుండా పోయింది.చివరకు ఆయన కుటుంబం లోనే విభేదాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీగా ఉండిన ముద్దుకృష్ణమ చనిపోయాక ఆ కుటుంబానికే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సంకల్పించారు.
 
 
కుమారులిద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతమ్మకు అవకాశమిచ్చారు. నగరి అసెంబ్లీ టిక్కెట్‌ కోసం ముద్దుకృష్ణమ తనయులు భానుప్రకాష్‌, జగదీష్‌ పోటీపడుతున్నారు.గాలి సరస్వతమ్మ చిన్న కొడుకు జగదీష్‌ వైపు మొగ్గు చూపుతుండగా పెద్ద కుమారుడు భానుప్రకాష్‌ టిక్కెట్‌ తనకే వస్తుందనే నమ్మకంతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరితో పాటు సిద్ధార్థ ఇంజనీరింగు కళాశాలల అధినేత అశోక్‌రాజు కూడా టిక్కెట్‌ రేసులో వున్నారు.దీంతో అందరినీ సమన్వయపర్చి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వాన్ని ఎవరికి ఖరారు చేయాలన్న అంశంపై పార్టీ అభిప్రాయ సేకరణ జరిపే అవకాశాలున్నాయి.
 
 
పుంగనూరులో వెంకటరమణరాజు టిక్కెట్‌ ఆశిస్తున్నా ఆయనకు అవకాశం లేకుండా పోయిన నేపథ్యంలో కుల సమీకరణల దృష్ట్యా అశోక్‌ రాజుకు నగరిలో అవకాశం కల్పిస్తారేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భానుప్రకాష్‌ విషయానికొస్తే ముద్దుకృష్ణమ తర్వాత ప్రజలతో ఎక్కువ సంబందాలు కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం జరిగే సమావేశంలో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉండకపోవచ్చని, అందరితో మాట్లాడి పార్టీ పటిష్టత, నాయకుల మధ్య సమ న్వయంపై, చంద్రబాబు మార్గదర్శనం చేస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Link to comment
Share on other sites

16 minutes ago, Seniorfan said:

BC , Muslim accommodation mostly loosing seats.... idhithe fact....

chooddam...punganur lo reddy ki isthe emanna peekatharemo... piler ithe peekutham...

peddi reddy gaadiki tough fight ivvakapithe vaadu pakka constituencies lo velu pedathadu...

Peddireddy peddireddy eeyana peru baga vintunna from our DB posts. Eyana cinemas lo chupinche antha Pedda n tough leader aa? 

Link to comment
Share on other sites

26 minutes ago, Seniorfan said:

BC , Muslim accommodation mostly loosing seats.... idhithe fact....

chooddam...punganur lo reddy ki isthe emanna peekatharemo... piler ithe peekutham...

peddi reddy gaadiki tough fight ivvakapithe vaadu pakka constituencies lo velu pedathadu...

Tough iche scene ledu le.. pedireddy ki bayapade ga amarnath reddy palamaner poyindi.. inka valla brother wife ante, asalu cake walk pedireddy ki

Link to comment
Share on other sites

మీకు వద్దంటే.. మరొకరికి ఇస్తా: చంద్రబాబు
06-10-2018 18:10:00
 
636744461997136398.jpg
అమరావతి: నగరి టీడీపీ నేతలతో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. గాలి ముద్దు కృష్ణమ ఇద్దరు కుమారుల్లో ఒకరికి నగరి ఇన్‌చార్జ్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు ఇన్‌చార్జ్‌గా ఉంటారో రెండు రోజుల్లోగా చెప్పాలన్నారు. లేదంటే మరొకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఇన్‌చార్జ్ పదవి కోసం ముద్దుకృష్ణమ కుమారులు జగదీష్, భాను పట్టుబడుతున్నారు. దీంతో వీరిని పిలిపించుకొని మాట్లాడిన చంద్రబాబు.. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. కాగా, ఈ సమావేశానికి ముద్దు కృష్ణమ భార్య ఎమ్మెల్సీ సరస్వతి, నియోజకవర్గం నేతలు హాజరయ్యారు.
Link to comment
Share on other sites

మీకు వద్దంటే.. మరొకరికి ఇస్తా: చంద్రబాబు
06-10-2018 18:10:00
 
636744461997136398.jpg
అమరావతి: నగరి టీడీపీ నేతలతో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. గాలి ముద్దు కృష్ణమ ఇద్దరు కుమారుల్లో ఒకరికి నగరి ఇన్‌చార్జ్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇద్దరిలో ఎవరు ఇన్‌చార్జ్‌గా ఉంటారో రెండు రోజుల్లోగా చెప్పాలన్నారు. లేదంటే మరొకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఇన్‌చార్జ్ పదవి కోసం ముద్దుకృష్ణమ కుమారులు జగదీష్, భాను పట్టుబడుతున్నారు. దీంతో వీరిని పిలిపించుకొని మాట్లాడిన చంద్రబాబు.. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. కాగా, ఈ సమావేశానికి ముద్దు కృష్ణమ భార్య ఎమ్మెల్సీ సరస్వతి, నియోజకవర్గం నేతలు హాజరయ్యారు.
Link to comment
Share on other sites

గాలి కుటుంబంలో కుదిరిన సయోధ్య
ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా కలిసి పనిచేస్తామని అన్నదమ్ముల స్పష్టీకరణ
01540807TDP84A.JPG

నగరి: చిత్తూరు జిల్లా నగరి తెదేపా అభ్యర్థి ఎవరనే విషయం నెలకొన్న సందిగ్ధత వీడనుంది. విజయవాడలో ప్రభుత్వ విప్‌ బుద్దా వెంకన్న నివాసంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం ఈరోజు సమావేశమైంది. కుటుంబంలోని విభేదాలు చక్కదిద్దుకునేందుకు గాలి ముద్దుకృష్ణమ సతీమణి, కుమారులు భాను, జగదీశ్‌ సమావేశమయ్యారు. వారితో బుద్ధా వెంకన్న చర్చించారు. నగరి టిక్కెట్‌ తమ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేయాలని వారు నిర్ణయించుకున్నారు. బయటివారికి ఇచ్చినా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని రేపు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి చెప్పనున్నారు.

నగరి నియోజకవర్గ అభ్యర్థిత్వంపై శనివారం చంద్రబాబు ఆధ్వర్యంలో సుదీర్ఘ సమావేశం జరిగింది. గాలి కుమారులు భాను, జగదీశ్‌.. టిక్కెట్‌ తమకే కావాలని పట్టుబట్టారు. అదే సమయంలో నియోజకవర్గం నుంచి వచ్చిన దాదాపు 350 మంది ముఖ్య నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు సేకరించారు. గాలి కుటుంబంలో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు. దీంతో బాను, జగదీశ్‌ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తూ ఇద్దరినీ ఒక్కతాటిపైకి రావాలని సూచించారు. పెద్దాయన ఉన్నంతవరకూ పార్టీ, కుటుంబం ఒక్కతాటిపైనే ఉన్నాయని.. ఆయన చనిపోయాక పరిస్థితులు అస్తవ్యస్తం కావడం మంచిది కాదని వారితో అన్నారు. ఆదివారంలోగా ఏకాభిప్రాయానికి రాకపోతే నియోజకవర్గ బాధ్యతలు వేరొకరికి అప్పగిస్తానని హెచ్చరించారు. దీంతో గాలి కుటుంబానికి మొదట్నుంచి సన్నిహితంగా ఉన్న బుద్ధా వెంకన్న నివాసంలో వారిద్దరూ సమావేశమై ఏకాభిప్రాయానికి వచ్చారు. మరోవైపు నగరి టిక్కెట్‌ తనకే కావాలంటూ విద్యాసంస్థల అధిపతి అశోక్‌రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఎవరిని ఇంఛార్జిగా నియమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Link to comment
Share on other sites

1 hour ago, Lokanadham said:

Ticket Gali family ke iste fight vuntundi...lekapothe tough seat kottadam..ee roju andariki ivrs calls vachayi..bhanu, jagadish or others ani...bhanu ayithe good.

Better give ticket outside gali family, veellaku ticket ichhina internal ga godavalu padataanike saripothundi. Family ne convince cheyalenollu 2L people ni ela convince chesthaaru. Nagari is lost seat no hope.

Better to give to BCs & Raju's.

 

Link to comment
Share on other sites

As of now Kuppam & Palamaneru only confirm win seats for TDP. 

Punganuru & Nagari are YSRCP confirm seats.

Other seats very tough fight.

PK ganaka TDP vote bank ni Chittoor, Tirupati, Chandragiri, Srikalahasti lo split chesthe even 10-20K with his Balija community votes YSRCP might even win 10 seats in CBN own district.

Chittoor & Tirupati ayithe naaku 90% doubt.

Link to comment
Share on other sites

6 minutes ago, RKumar said:

As of now Kuppam & Palamaneru only confirm win seats for TDP. 

Punganuru & Nagari are YSRCP confirm seats.

Other seats very tough fight.

PK ganaka TDP vote bank ni Chittoor, Tirupati, Chandragiri, Srikalahasti lo split chesthe even 10-20K with his Balija community votes YSRCP might even win 10 seats in CBN own district.

Chittoor & Tirupati ayithe naaku 90% doubt.

manam daridram lo unna 2009 lo kuda  6 seats vacchayi

Link to comment
Share on other sites

13 minutes ago, RKumar said:

As of now Kuppam & Palamaneru only confirm win seats for TDP. 

Punganuru & Nagari are YSRCP confirm seats.

Other seats very tough fight.

PK ganaka TDP vote bank ni Chittoor, Tirupati, Chandragiri, Srikalahasti lo split chesthe even 10-20K with his Balija community votes YSRCP might even win 10 seats in CBN own district.

Chittoor & Tirupati ayithe naaku 90% doubt.

deniki basis emanna vunda? ante Votes only TDP vi split avutayya? YSRCP vi avavva?

Link to comment
Share on other sites

15 minutes ago, Saichandra said:

Nagari definitely tough seat for Ycp, Gali family ki iste..Otherwise ycp ki cakewalk.. I prefer jagadish.. jagadish aythe Valla mother, sister blood pedtaaru..Bhanu aynaa kuda family tirigithe manchi fyt untaadi...

Chittoor tdp kodtundi.. C.K.Babu is going to contest from bjp or independent..Ycp 3rd place poyina no surprise...

Link to comment
Share on other sites

CBN & Lokesh ni sontha district lo 7+ MLA seats gelipinchukuntaaro ledo chooddam.

District ki 3 ministries, CM seat, major institutes & major development works chesi kooda 7 seats teka pothe inka maatladatam kooda anavasaram.

Link to comment
Share on other sites

5 minutes ago, RKumar said:

CBN & Lokesh ni sontha district lo 7+ MLA seats gelipinchukuntaaro ledo chooddam.

District ki 3 ministries, CM seat, major institutes & major development works chesi kooda 7 seats teka pothe inka maatladatam kooda anavasaram.

1989 lo TDP got 3 seats out of 17 in krishna district... So, NTR ni emandaam brother.. matludukodam anavasaram aah..

Link to comment
Share on other sites

13 hours ago, RKumar said:

As of now Kuppam & Palamaneru only confirm win seats for TDP. 

Punganuru & Nagari are YSRCP confirm seats.

Other seats very tough fight.

PK ganaka TDP vote bank ni Chittoor, Tirupati, Chandragiri, Srikalahasti lo split chesthe even 10-20K with his Balija community votes YSRCP might even win 10 seats in CBN own district.

Chittoor & Tirupati ayithe naaku 90% doubt.

Pileru is not that much tough for TDP!

Link to comment
Share on other sites

23 hours ago, RKumar said:

As of now Kuppam & Palamaneru only confirm win seats for TDP. 

Punganuru & Nagari are YSRCP confirm seats.

Other seats very tough fight.

PK ganaka TDP vote bank ni Chittoor, Tirupati, Chandragiri, Srikalahasti lo split chesthe even 10-20K with his Balija community votes YSRCP might even win 10 seats in CBN own district.

Chittoor & Tirupati ayithe naaku 90% doubt.

 Mari too much anipistundi..

Kuppam, palamaneru.. majority enta Anede pending.

Chandragiri, Chittoor,  Madanapalli, piler have good chances.

pungunur, putalapattu, GD Nellore, tirupati gone case. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...