Jump to content

Chittoor Politics


Recommended Posts

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు షాక్.. నగరి సీటు కోసం మరో నేత పావులు!
21-07-2018 12:58:21
 
636677747032476776.jpg
టీడీపీ: నేత కోసం నిరీక్షణ
తెలుగుదేశం పార్టీకీ, వ్యక్తిగతంగా దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడికీ కంచుకోటగా పేరుపడ్డ నియోజకవర్గం నగరి. ఇపుడు సమర్ధవంతమైన నాయకత్వం కోసం ఈ కంచుకోట ఎదురుచూస్తోంది. ముద్దుకృష్ణమ కుటుంబంలో తలెత్తిన నాయకత్వ సంక్షోభం శ్రేణుల్ని గందరగోళానికి గురి చేస్తోంది. అవకాశాల వేటలో పడి ఆశావహులు వర్గాలకు ఊపిరి పోస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం తీరు అడపా దడపా ఓ గడప అన్నట్టుగా తయారైంది. ఎన్నికలకు శ్రేణుల్ని సమాయత్తం చేయాల్సిన దశలో వారానికో పది రోజులకో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే అతిధిలా మారారు. కాంగ్రెస్‌, బీజేపీలకు స్థానికంగా నాయకత్వమున్నా రాజకీయంగా ప్రభావవంతమైన కదలికలైతే కనిపించడం లేదు. ఇక సరికొత్త పార్టీ జనసేన తరపున జనంలోకి వెళ్ళే సైనికులు ఇంకా తయారు కాలేదు.
 
వైసీపీ: అడపాదడపా ఓ గడప
ఆరు నెలల్లో జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని జనంలోకి వెళ్ళేందుకు వైసీపీ అధిష్టానం తలపెట్టిన గడప గడపకీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం నగరిలో మందగించింది. పార్టీకి, నియోజకవర్గానికీ ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా వృత్తి రీత్యా చెన్నై, హైదరాబాదులలో వుంటున్నారు. వారానికో పదిరోజులకో ఒక రోజు నియోజకవర్గానికి వచ్చి వెళుతున్నారు. దీంతో ఆ కార్యక్రమం కాస్తా అడపాదడపా ఓ గడప అన్నట్టుగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరుపడి అధికార పక్షంపై తరచూ వేడి పుట్టించే మాటల తూటాలు విసిరే రోజాకు కూడా సొంత నియోజకవర్గంలో వర్గపోరు తప్పడం లేదు.
 
నిండ్ర మండల ముఖ్యనేత, మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి సోదరుని కుమారుడు చక్రపాణిరెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఆశిస్తున్నారు. ఆయన తొలి నుంచీ రోజాకు ప్రత్యామ్నాయ వర్గం ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహిస్తున్నారు. రోజా స్థానికంగా అందుబాటులో వుండకపోవడంతో దాన్నే ఆయుధంగా మలచుకుని ఆమెకు ప్రత్యామ్నాయ నేతగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది పార్టీలో వర్గపోరుగా పరిణమిస్తోంది.
 
నగరి టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తుండిన మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు గత ఫిబ్రవరిలో అనారోగ్యంతో మృతి చెందడంతో అక్కడ పార్టీకి నాయకత్వ లోటు ఏర్పడింది. ఆయన రాజకీయ వారసత్వం కోసం ఇంటిలోనే పోరు మొదలైంది. ముద్దు మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని లేదా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవిని ఏదో ఒకటి మాత్రమే ఇస్తామని అధిష్టానం తేల్చి చెప్పడంతో కుమారులిద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో అధినేత చంద్రబాబే చొరవ తీసుకుని ముద్దు సతీమణి సరస్వతమ్మకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అప్పటి నుంచీ ఇన్‌ఛార్జి పదవి కోసం పోటీ తలెత్తింది. ముద్దు తనయులు భానుప్రకాష్‌, జగదీష్‌లతో పాటు సీనియర్‌ నేతలు గంధమనేని రమేష్‌ చంద్ర ప్రసాద్‌, రాధాకృష్ణ, సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత అశోక్‌రాజు, కర్నాటక తెలుగు ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు సురేష్‌ వర్మ, పాకా రాజా, పోతుగుంట విజయ్‌బాబు, సినీ నటి వాణీవిశ్వనాధ్‌ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. క్యాడర్‌ కూడా భానుప్రకాష్‌, జగదీష్‌ వర్గాల పేరిట చీలిపోతోంది.
 
ముద్దు మృతితో గత ఐదు నెలలుగా సెగ్మెంటులో పార్టీ కార్యకలాపాలు స్థంభించిపోయాయి. అధిష్టానం నిర్దేశించిన ఇంటింటికీ తెలుగుదేశం, దళిత తేజం వంటి కార్యక్రమాలు కూడా జరగలేదు. ముద్దు తనయులు జనంలోకి రాకపోగా ఎమ్మెల్సీ సరస్వతమ్మ సైతం పరిమితంగానే వస్తున్నారు. తాజాగా అధిష్టానం గ్రామ దర్శిని-గ్రామ వికాసం కార్యక్రమాన్ని చేపట్టగా నియోజకవర్గంలో గత నాలుగు రోజుల్లో కేవలం రెండు గ్రామాల్లో మాత్రమే జరిగింది. సరస్వతమ్మ జనంలోకి వెళ్ళినప్పుడల్లా చిన్న కుమారుడు జగదీష్‌ పేరు మాత్రమే ప్రస్తావించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అతడే అభ్యర్థని ప్రకటిస్తున్నారు. అతడికి మద్దతివ్వాలని పిలుపునిస్తున్నారు. ఈ పరిణామం నగరి టీడీపీని మరింత గందరగోళానికి గురి చేయడంతో పాటు పార్టీలో ఎన్నికల సన్నద్ధత అనేదే లేకుండా పోతోంది.
 
 
సేన లేని పార్టీలు
కాంగ్రెస్‌కు మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి కుమార్తె శాంతిస్వరూప ఇందిర, బీజేపీకి నిషిధా సురేంద్రరాజు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఆయా పార్టీలు సంస్థాగతంగా చాలా బలహీనంగా వుండడంతో పాటు రాజకీయంగా కూడా ప్రతికూలతనే ఎదుర్కొంటున్నాయి. దీంతో ఎన్నికలకు ఇప్పుడప్పుడే సమాయత్తమయ్యే పరిస్థితి కనిపించడంలేదు. అదే సమయంలో కొత్త పార్టీ జనసేనకు స్థానికంగా నాయకత్వం లేదు. సంస్థాగతంగానూ ఎలాంటి నిర్మాణం లేకపోవడంతో నియోజకవర్గంలో ఆ పార్టీ పేరు పెద్దగా వినిపించడం లేదు.
Link to comment
Share on other sites

  • Replies 144
  • Created
  • Last Reply
టీడీపీ, వైసీపీలో గుబులు పుట్టిస్తున్న ఎస్సీవీ నాయుడు
22-07-2018 09:10:46
 
636678474455213490.jpg
ముక్కంటి క్షేత్రంలో రాజకీయ సందడి మొదలైంది. ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. పార్టీల నేతలూ, శ్రేణులూ జనంలోకి దూసుకెళుతున్నారు. అధికార పార్టీలో నాయకత్వంపై స్పష్టత రావడంతో క్యాడర్‌లో ఉత్సాహం పెరిగింది. వైసీపీలోనూ ఇన్‌ఛార్జి ఏడాదిగా జనంలోనే వుంటున్నారు. జిల్లాలో ఎక్కడా లేనంత సందడి కాంగ్రెస్‌, బీజేపీల్లోనూ ఇక్కడ మొదలైంది. జనసేన జాడ మాత్రం లేదు.
 
 
టీడీపీ: బొజ్జల కుటుంబం సందడి
సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వయోభారం, అనారోగ్యం వంటి కారణాలతో గత ఏడాదిగా క్రియాశీలక రాజకీయాలకు కొంత దూరమైన సంగతి తెలిసిందే. మంత్రి మండలి నుంచి తప్పుకున్న తొలినాళ్ళలో కొంత నైరాశ్యానికి గురైన బొజ్జల కుటుంబం తర్వాత పుంజుకుంది. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు రంగంలోకి రావడంతో వర్గాలు తలెత్తి నాయకత్వం కోసం కొంత పోటీ ఏర్పడింది. శ్రేణుల్లోనూ అయోమయం నెలకొంది. ఆ నేపధ్యంలో బొజ్జల సతీమణి, కుమారుడు చురుగ్గా జనంలోకి వెళ్ళడం ప్రారంభించారు. పార్టీ కార్యక్రమాలను ఎవరో ఒకరు ముందుండి చేపడుతున్నారు. ఇటీవలి కాలంలో గోపాలకృష్ణారెడ్డి కూడా తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వర్గ పోరుకు చెక్‌ పెట్టడానికి, శ్రేణుల్లో గందరగోళం తొలగించడానికి ఇటీవల జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానీ శ్రీకాళహస్తి నుంచీ వచ్చే ఎన్నికల్లో గోపాలకృష్ణారెడ్డే పోటీ చేస్తారని, ఆయన్ను గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో ఆయన పోటీ చేసినా చేయకపోయినా తదుపరి ఎన్నికల్లో బొజ్జల కుటుంబం నుంచే అభ్యర్థి బరిలో వుంటారన్న భావన క్యాడర్‌లో కలుగుతోంది. ఈ ఏడాదిలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ, దళితతేజం వంటి కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. తాజాగా గ్రామదర్శిని పేరిట గోపాలకృష్ణారెడ్డి, ఆయన కుటుంబీకులు జనంలోకి వెళుతున్నారు. హైదరాబాదులోనే నివాసమున్నా తరచూ నియోజకవర్గానికి వచ్చి గ్రామాలు పర్యటిస్తున్నారు. అందువల్ల ఏడాది కిందటి ఉత్సాహం మళ్ళీ పార్టీలో కనిపిస్తోంది.
 
 
వైసీపీ: జనయాత్రల్లో బిజీ
వైసీపీలో వర్గాలు లేవు. కిందిస్థాయిలో వున్నా ఎమ్మెల్యే సీటు ఆశించే నేతలు లేరు. దీంతో ఇన్‌ఛార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి నిశ్చింతగా జనంలోకి వెళుతున్నారు. గడప గడపకూ వైసీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆయన తర్వాత పల్లె నిద్ర పేరిట గ్రామాలను రెండోసారీ చుట్టబెట్టారు. మన్నవరానికి పాదయాత్ర పేరిట సొంతంగా కార్యక్రమం చేపట్టి పూర్తి చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడినందున ఆ సానుభూతి ఈసారి లాభిస్తుందనే ధీమాతో వున్నారు. శ్రీకాళహస్తి పట్టణం, తొట్టంబేడు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి బలం పెంచుకునే ప్రయత్నాల్లో వున్నారు. తరచూ జనంలోకి వెళుతున్నందున క్యాడర్‌లో ఉత్సాహం నెలకొంది. తాజాగా మరోసారి పల్లెబాట పడుతున్నారు.
 
 
scb.jpgగుబులు పుట్టిస్తున్న ఎస్సీవీ
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు టీడీపీ, వైసీపీ రెంటింటి నేతల్లోనూ గుబులు పుట్టిస్తున్నారు. గతంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడుగా వున్న ఆయన తర్వాత ప్రత్యర్థిగా మారారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసి బొజ్జలను ఓడించారు. 2009లో కూడా పోటీ చేసినా బొజ్జల చేతిలో ఓటమి చవి చూశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ గెలుపునకు పనిచేశారు. ఎన్నికల తర్వాత రాజకీయంగా చురుగ్గా లేరు. గతేడాది బొజ్జలకు మంత్రి పదవి పోవడం, అనారోగ్యానికి గురి కావడంతో తదుపరి ఎన్నికల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లలో ప్రభావం చూపగల ఎస్సీవీ నాయుడు ఇప్పటికైతే టీడీపీ టికెట్‌ కోసమే ప్రయత్నిస్తున్నా వైసీపీ నుంచి కూడా పిలుపొచ్చే అవకాశాలున్నాయి. దీంతో రెండు పార్టీల శ్రేణులూ ఆయన కదలికలపై ఆసక్తి కనబరుస్తున్నాయి.
 
 
కాంగ్రెస్‌, బీజేపీ ఉనికి యత్నాలు
కాంగ్రెస్‌, బీజీపీల్లో జిల్లాలో ఎక్కడా లేనంత సందడి శ్రీకాళహస్తిలో మాత్రం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తెయ్యనాయుడు గెలుపోటములను పక్కనపెట్టి పార్టీని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తలమండలి మాజీ అధ్యక్షులు, బీజేపీ నేత కోలా ఆనంద్‌ సైతం పార్టీ ఉనికిని చాటడంతో పాటు బలం పెంచుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఏడాదిగా నియోజకవర్గంలో పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. బూత్‌ కమిటీ సమావేశాలు కూడా నిర్వహించారు. కాగా జనసేన నుంచీ మాత్రం ఎన్నికల సన్నద్ధత కనిపించడంలేదు. పవన్‌ అభిమాన సంఘం నేత చక్రధర్‌ ఆ పార్టీ ఉనికి కాపాడుతున్నారు.
Link to comment
Share on other sites

మదనపల్లె నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీలకు వింత పరిస్థితి!
23-07-2018 15:18:21
 
636679559008078941.jpg
  • మదనపల్లె వర్తమాన రాజకీయం
  • అవినీతి సుడిలో అందరూ
కత్తులు దూసుకునే స్థాయిలో వర్గ వైషమ్యాలే కాదు ఖరీదైన ప్రభుత్వ భూముల కబ్జా ఆరోపణలూ టీడీపీని చుట్టుముడుతున్నాయి. అధికార పక్షంతోనే చేతులు కలిపి అవినీతికి తెరతీస్తున్నారనే ఆరోపణలతో విపక్ష వైసీపీ సైతం జనంలో పలుచనవుతోంది. ఇక రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకుని తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లోనైనా ఉనికి చాటుకునేందుకు పోరాడుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బరిలో దిగి అదే పార్టీ నేతల సహాయ నిరాకరణతో ఓటమి పాలైన బీజేపీ ఇపుడు ఒంటరి పోరుకు సిద్ధపడుతోంది. ఇక మద్దతుదారులు గణనీయంగానే వున్నా రాజకీయంగా జనసేన కదలికలు మాత్రం కనిపించడంలేదు. ఇదీ పది నెలల్లో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మదనపల్లె నియోజకవర్గ తాజా రాజకీయ చిత్రం.
 
 
టీడీపీ: ఎవరికివారే!
టీడీపీ ఆవిర్భవించాక 8 సార్లు ఎన్నికలొచ్చాయి. 7 సార్లు పోటీ చేసిన టీడీపీ 5 సార్లు గెలిచింది. రెండు సార్లు కాంగ్రెస్‌ గెలిస్తే గత ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. 1994 నుంచీ మదనపల్లె టీడీపీలో బహునాయకత్వం వర్ధిల్లుతోంది. ఇపుడు కూడా మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్‌రెడ్డి, గంగారపు రామ్‌దాస్ చౌదరి, బోడపాటి శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ కొడవలి శివప్రసాద్‌, రాటకొండ బాబురెడ్డి, బొమ్మనచెరువు శ్రీరాములు టికెట్‌ రేసులో వున్నారు. బలమైన క్యాడర్‌ వున్నా ముఖ్యనేతల తీరు పార్టీని ఇబ్బందుల పాలు చేస్తోంది.
 
మదనపల్లెలో ఖరీదైన ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని, తప్పుడు రికార్డులతో వాటిని విక్రయించి అక్రమంగా కోట్లు దండుకుంటున్నారని వారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దానికితోడు వర్గ పోరు. అధిష్టానం ఏ పిలుపిచ్చినా వేర్వేరుగా పోటీ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేణులకు తలనొప్పి కలిగిస్తోంది. ఇంటింటికీ టీడీపీ, దళిత తేజం కార్యక్రమాలు కూడా వర్గాల వారీ విడిగానే చేపట్టారు. చివరికి అధినేత జన్మదినాన చేపట్టిన ధర్మపోరాట దీక్ష కూడా పోటాపోటీగా వేర్వేరు శిబిరాలు వెలిశాయి. తాజాగా గ్రామదర్శిని కార్యక్రమాన్ని ఓ వర్గం ఇంకా మొదలు పెట్టనేలేదు. ఎవరికి ఇన్‌ఛార్జి ఇచ్చినా, టికెట్‌ ఇచ్చినా మిగిలిన వర్గాలు సహకరించే పరిస్థితి కనిపించడంలేదు.
 
 
వైసీపీ: అవినీతిలో వాటాపై ఆరోపణలు
మదనపల్లె వైసీపీలో రెండు వర్గాలున్నా కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశాయ్‌ తిప్పారెడ్డిని ఎదుర్కొనే స్థాయిలో ప్రత్యర్థి వర్గం లేదు. వచ్చే ఎన్నికల్లో తిప్పారెడ్డే అభ్యర్థని ఇటీవలే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లెలోనే ప్రకటించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే స్పీడు పెంచారు. తరచూ జనంలోకి వెళుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంతవరకూ బాగానే వున్నా పార్టీలో కొందరు నేతలు అధికార పార్టీ నేతలతో కలసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతుండడం మొత్తంగా పార్టీని ప్రజల్లో పలుచన చేస్తోంది. ముఖ్యంగా పట్టణంలో పార్టీమీద ఈ అంశం గణనీయమైన ప్రభావం చూపుతోంది.
 
 
సేన ఉన్నా నేతల్లేరు
మదనపల్లె నియోజకవర్గంలో బలిజ సామాజికవర్గం గణనీయంగా వుంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు టికెట్‌ కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. ఇపుడు పవన్‌కళ్యాణ్‌ జనసేన ఏర్పాటు చేసినా నాయకత్వం కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. గణనీయంగా అభిమానులు, మద్దతుదారులున్నా పార్టీని జనంలోకి తీసుకెళ్ళేవారే కరువయ్యారు.
 
 
కాంగ్రెస్‌, బీజేపీ అంతంత మాత్రం
గత ఎన్నికల్లో జిల్లాలోని 13 సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ సిట్టింగు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు పార్టీని విడిచిపెట్టేశారు. కేవలం మదనపల్లెలో మాత్రమే సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా వుండిన షాజహాన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ బలాన్ని మరింత పెంచేందుకు శ్రమిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నేత చల్లపల్లె నరసింహారెడ్డి పోటీచేసి కొందరు టీడీపీ నేతల వెన్నుపోట్లతో ఓడిపోయారు. ఇపుడు ఇరు పార్టీల నడుమా మైత్రి చెడిపోవడంతో ఒంటరిపోరుకు సిద్ధపడుతున్నారు. తరచూ పార్టీ సమావేశాలు పెడుతూ జనంలోకి వెళుతున్నారు.
Link to comment
Share on other sites

ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు !
25-07-2018 11:31:23
 
636681150830379742.jpg
చిత్తూరు జిల్లా సత్యవేడు వర్తమాన రాజకీయం 
శ్రేణుల్లో అసంతృప్తి, నాయకుల మధ్య వర్గపోరుతో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ సతమతమైపోతున్నాయక్కడ. టీడీపీలో పనులు జరగడం లేదని కార్యకర్తలు వాపోతుంటే ముఖ్యనేతపై అవినీతి ఆరోపణలకు దిగుతున్నారు మండల స్థాయి నాయకులు. ఎప్పుడూ స్థానికేతరులకేనా అవకాశం ఈ పర్యాయం కుదరనివ్వమంటూ స్థానిక ఆశావహులు రంగంలోకి దిగి జబ్బలు చరుస్తున్నారు. ఇక వైసీపీలో నియోజకవర్గ నాయకత్వంపై శ్రేణుల్లో అసంతృప్తి రగులుతోంది. పలు మండలాల్లో వర్గాలు తలెత్తి ప్రత్యామ్నాయ నేతలను తెరపైకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
 
 
టీడీపీలో అసంతృప్తి సెగలు
టీడీపీలో నాయకత్వం పట్ల శ్రేణుల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ సుందరరామిరెడ్డి ముఖ్యనేతపై బహిరంగంగానే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. పలువురు మండలస్థాయి నాయకులు ముఖ్యనేతకు వ్యతిరేకంగా బహిరంగ ఆరోపణలకు దిగిన సందర్భాలూ వున్నాయి. నాగలాపురం జడ్పీటీసీ సుజాత తనకు ఎలాంటి గుర్తింపు, విలువ దక్కడం లేదని ఆరోపిస్తూ గత జడ్పీ సర్వ సభ్య సమావేశంలో నేలపై బైఠాయించారు. ఇక సాధారణ కార్యకర్తలు తమకు పనులు జరగడం లేదని వాపోతున్నారు. ఇంటింటికీ టీడీపీ ఓ మోస్తరుగా జరిగినా దళిత తేజం మాత్రం సక్రమంగా జరగలేదు.మరోవైపు ఆశావహుల హడావిడి అప్పుడే మొదలైంది.
 
 
సత్యవేడంటేనే స్థానికేతరులకే టికెట్‌ అనే నానుడి ఏర్పడిపోయిందని, దాన్ని తొలగించేందుకు ఈసారి స్థానికులకే టికెట్‌ కేటాయించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. నిండ్ర మండల టీడీపీ అధ్యక్షుడు దశరధ వాసు, శ్రీకాళహస్తికి చెందిన ఎండ్లూరి రాజేష్‌ కృష్ణ, తిరుపతికి చెందిన డాక్టర్‌ దగ్గుమాటి శ్రీహరి తదితరులు గట్టి ప్రయత్నాల్లో వున్నారు. మాజీ ఎమ్మెల్యే హేమలత తనకు గానీ లేదా తన కుమార్తె డాక్టర్‌ హెలెన్‌కు గానీ టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ అల్లుడు వేణు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. టికెట్‌ విషయంలో ఎంత అయోమయం నెలకొన్నా శ్రేణులు మాత్రం అధిష్ఠానం పిలుపు ఇచ్చిన మేరకు కార్యక్రమాలు విజయవంతం చేస్తుండడం ఒకటే ఇక్కడ పార్టీకి చెప్పుకోదగిన అనుకూలత.
 
 
వైసీపీ పుట్టి ముంచుతున్న అసంతృప్తి
సత్యవేడు వైసీపీకి ఆదిమూలం నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యర్థి పార్టీలకు దీటైన పోటీ ఇవ్వలేరన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. అందుకే జీడీనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి వచ్చే ఎన్నికల్లో సత్యవేడు నుంచీ పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. మండల స్థాయిలో వర్గాలు ఏర్పడ్డాయి. ఆదిమూలానికి ప్రత్యామ్నాయంగా ఇతర అభ్యర్థులను రంగంలోకి దించేందుకు పలువురు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సురాజ్‌, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ తనయుడు నవీన్‌ పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. సురాజ్‌ రెండు రోజుల కిందట నాగలాపురం మండలం కాళంజేరి గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో ఓ ముఖ్యమైన పార్టీ తరపున పోటీ చేస్తానంటూ ప్రకటించారు. ఇవెలా వున్నా ఎన్నికల వేళ అధిష్టానం ఆదేశించిన గడప గడపకీ వైసీపీ, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు మాత్రం మండల స్థాయి నాయకులు యధావిధిగా నిర్వహిస్తూ పార్టీని జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
 
 
ఇతర పార్టీల్లో నిస్తేజం
కాంగ్రెస్‌ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన పెనుబాల చంద్రశేఖర్‌ మరోసారి పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే పార్టీ కార్యక్రమాలేవీ చెప్పుకోదగిన స్థాయిలో జరగడంలేదు. ఇక జనసేనకు నియోజకవర్గంలో ఎలాంటి నిర్మాణం లేదు. తిరుపతికి చెందిన బోత్‌ హరిప్రసాద్‌ నెల కిందట సమావేశం ఏర్పాటు చేస్తే పవన్‌ అభిమానులు నామమాత్రంగానే వచ్చారు. ఇక బీజేపీ ఊసే నియోజకవర్గంలో వినిపించడంలేదు.
Link to comment
Share on other sites

ఫ్యామిలీ వార్‌... గాలి చిన్న కుమారుడికి చెక్ పెట్టేందుకు పెద్దకుమారుడి వ్యూహం
30-07-2018 12:26:02
 
636685503632386335.jpg
  • ఫ్యామిలీ వార్‌!
  • గడపదాటిన వారసత్వ పోరు
  • చిన్నకొడుకే నగరి అభ్యర్థి అంటూ ఇటీవల ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ ప్రకటన
  • ప్రతిగా పార్టీలో ఆధిపత్యం కోసం పెద్దకుమారుడి వ్యూహం
  • పుత్తూరులో భానుప్రకాష్‌ యువగర్జన
చిత్తూరు (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబంలో ఇంతకాలం చాపకింద నీరులా సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు ఇంటి గడప దాటింది. తన చిన్న కొడుకు జగదీషే వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అంటూ ముద్దుకృష్ణమ సతీమణి, ఎమ్మెల్సీ సరస్వతమ్మ చేస్తున్న ప్రచారానికి ఆమె పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్‌ విరుగుడు వ్యూహం రచిస్తున్నారు. కుటుంబ సభ్యుల వ్యతిరేకతను అధిగమించి జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నగరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీపై ఆధిపత్యమే లక్ష్యంగా ఆదివారం యువగర్జన పేరిట తొలి అడుగు వేశారు.
 
 
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఈ ఏడాది ప్రారంభంలో అనారోగ్యంతో మృతి చెందడంతో నగరి టీడీపీకి నాయకత్వం లేకుండాపోయింది. రాజకీయ వారసత్వం కోసం కుమారులిద్దరి నడుమ పోటీ నెలకొంది. కుటుంబంలో మెజారిటీ సభ్యుల మద్దతు చిన్న కొడుకు జగదీష్‌కు లభించినా.. సోదరులిద్దరూ ఏకాభిప్రాయానికి, రాజీకి రాలేకపోయారు. దీంతో మధ్యే మార్గంగా ఎమ్మెల్సీ పదవిని అధిష్ఠానం ముద్దుకృష్ణమ సతీమణి సరస్వతమ్మకు కట్టబెట్టింది. ఇన్‌ఛార్జిగా ఇతరులను నియమిస్తామని తేల్చి చెప్పింది. అయితే నియోజకవర్గ టీడీపీని తమ కుటుంబం పట్టు నుంచి చేజారనివ్వకూడదని గట్టిగా భావిస్తున్న వీరు నాయకత్వం కోసం కీచులాట మాత్రం ఆపడంలేదు. ఇటీవల ఎమ్మెల్సీ సరస్వతమ్మ తన చిన్న కుమారుడు జగదీషే వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, మద్దతివ్వాలని కార్యకర్తలకు బహిరంగంగా పిలుపునిచ్చారు. దీనిపై అధిష్ఠానం సీరియస్‌ అయినప్పటికీ తేలికపాటి హెచ్చరికలతో సరిపెట్టుకుంది. తల్లి ప్రకటనతో పెద్ద కుమారుడు భానుప్రకాష్‌ అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది.
 
 
ఇలాగే మౌనంగా ఉండిపోతే కుటుంబం మద్దతు జగదీష్‌కే ఉందంటూ పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతుందని, అది తన రాజకీయ అవకాశాలను దెబ్బతీసే ప్రమాదముందని భావించినట్టు తెలుస్తోంది. దీనికి విరుగుడుగా పార్టీ కార్యక్రమాల పేరిట నేరుగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అలా చేస్తే పార్టీ శ్రేణులకు, జనానికి కూడా దగ్గర కావచ్చని ఆయన భావిస్తున్నట్టు సన్నిహితుల కథనం. అందులో భాగంగానే తొలి ప్రయత్నంగా యువగర్జన పేరిట ఆదివారం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి యువతను సమీకరించి ర్యాలీ, సమావేశం జరిపారు. సమావేశంలో ఎక్కడా తన గురించి మాట్లాడకుండా, తనకు మద్దతివ్వాలని పిలుపునివ్వకుండా అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌ నాయకత్వం గురించే ప్రధానంగా ప్రస్తావించారు. వారి నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతోందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించే ప్రయత్నం చేశారు. వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 
 
యువత రాజకీయాల్లోకి రావాలని, లోకేశ్‌కు మద్దతివ్వాలని కోరడం ద్వారా అధిష్ఠానాన్ని ప్రసన్న పరిచే ప్రయత్నం చేశారు. కాగా, భానుప్రకాష్‌ తొలి కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా 500 మందికి పైగా యువకులు హాజరయ్యారు. దీనికి మించి మెజారిటీ నాయకులు పాల్గొన్నారు. ఐదు మండలాల, పుత్తూరు, నగరి పట్టణాల టీడీపీ అధ్యక్షులు, పుత్తూరు మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ కరుణాకర్‌, వైస్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌ రాజు, తుడా డైరెక్టర్‌ వడమాలపేట ధనుంజయనాయుడు తదితరులు హాజరయ్యారు.
 
 
నియోజకవర్గంలో నలుగురు ఎంపీపీలుంటే వారిలో పుత్తూరు, పుత్తూరు ఎంపీపీలు గంజి మాధవయ్య, వేణుగోపాలనాయుడు వచ్చారు. జడ్పీటీసీలు ఇద్దరూ కార్యక్రమంలో కనిపించారు. భానుప్రకాష్‌ చేపట్టిన కార్యక్రమం నియోజకవర్గవ్యాప్తంగా రాజకీయవర్గాల్లోనూ, టీడీపీ శ్రేణుల్లోనూ, సామాన్య జనంలోనూ చర్చనీయాంశమైంది. మొత్తమ్మీద ముద్దుకృష్ణమ కుటుంబంలో తలెత్తిన ఈ వారసత్వపోరు ఎక్కడికి దారితీస్తుందో, ముందుముందు ఎలాంటి పరిణామాలకు కారణమవుతుందో వేచి చూడాలి.
Link to comment
Share on other sites

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను
31-07-2018 16:17:59
 
636686506805963111.jpg
  • టీడీపీ విజయానికి కృషి చేస్తా
  • గ్రూపు రాజకీయాలు వదిలి పార్టీ పటిష్ఠతకు ముందుకెళ్లండి
  • బీసీ, ఎంబీసీల ఆత్మీయ అభినందన సభలో గల్లా అరుణకుమారి
 
 
చిత్తూరు: వచ్చే ఏడాది జరగబోయే సాధారణ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి మరోసారి స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా నియమితులైన ఆమెకు సోమవారం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో జిల్లాలోని బీసీ, ఎంబీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షణ్ముగం అధ్యక్షతన జరిగిన సభలో వేదపండితులు, క్రైస్తవ మతపెద్దలు ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ.. 23 బీసీ కుల సంఘాలను కూడగట్టి తనకు భారీ అభినందన సభ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి రాజగోపాల్‌నాయుడుతో బీసీలకున్న ఆత్మీయ సంబంధం ఇప్పటికీ కొనసాగు తోందన్నారు. జిల్లాలో గ్రూపు, కుల రాజకీయాలను విడనాడి 14 నియోజకవర్గాల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
ప్రతి నియోజకవర్గంలో అందరినీ కలుస్తానని తెలిపారు. బీసీలను ఆదరించింది తెలుగుదేశం పార్టీనేనని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణాన్ని ఆపేస్తాననని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించడం తగదన్నారు. పవన్‌, జగన్‌ లాంటి అవగాహన లేని నాయకులను ప్రజల్లోకి రానివ్వకుండా అడ్డుకోవాలని కోరారు. 30 ఏళ్ల పాటు రాజకీయంగా ఆదరించిన చంద్రగిరి ప్రజలను మర్చిపోలేనని, తనకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జిల్లా అంతటా పార్టీ అభ్యర్థుల గెలుపును శాసించేంత శక్తి, సామర్థ్యాలున్న నాయకురాలు అరుణకుమారి అని మంత్రి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జెండాను ఎగురవేయడానికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు.
 
సీఎం చంద్రబాబు కు గల్లా అరుణమ్మ తండ్రి రాజగోపాలనాయుడు రాజకీయ గురువని ఆర్టీసీ ఛైర్మన్‌ వర్ల రామయ్య పేర్కొన్నారు. జిల్లాలో గల్లా సేవలను వినియోగించుకుని పార్టీని పటిష్టత పరచాలన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని చెప్పారు. జిల్లా నుంచి సీఎంగా చంద్రబాబు, మంత్రులుగా అమరనాథరెడ్డి, నారా లోకేశ్‌, పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా గల్లా అరుణకుమారి ఉన్నతస్థాయిలో ఉన్నా రని ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ పేర్కొన్నారు. వీరి నాయకత్వం లో జిల్లాకు మేలు జరగాలని ఆకాంక్షించారు. బీసీ, ఎంబీసీల సంక్షేమానికి ప్రత్మేక కార్పొరేషన్లను సీఎం చంద్రబాబు ఏర్పాటుచేసి విరివిగా నిధులు కేటాయించి జీవనోపాధులను పెంపొందిస్తున్నారని టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షణ్ముగం వివరించారు.
 
ఆత్మీయ అభినందన సభను విజయవంతం చేసిన బీసీ, ఎంబీసీల 23 సంఘాల నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు పీసీఆర్‌ సర్కిల్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ్నుంచి భారీ ర్యాలీ తో నాగయ్య కళాక్షేత్రానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్‌ కఠారి హేమలత, మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ సూరా సుధాకర్‌రెడ్డి, తుడా చైర్మన్‌ నరసింహ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఇందిరమ్మ, కాజూరు బాలాజి, తెలుగు రైతు అధ్యక్షుడు పాచిగుంట మనోహర్‌నాయుడు, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నందగోపాల్‌, రావిళ్ల మాధవనాయుడు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దశరథాచ్చారి, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రామారావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు పుష్పావతి, ఉపాధ్యక్షురాలు చక్రాల ఉష, లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు అశోక ఆనంద్‌ యాదవ్‌, తెలుగుయువత అధికార ప్రతినిధి వల్లేరు అమరనాఽథ నాయుడు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్‌రాజ్‌, నేతలు చంద్రప్రకాష్‌, ఎన్‌పీ జయచంద్రనాయుడు, ఎన్‌పీ జయప్రకాష్‌, జనార్దన్‌యాదవ్‌, సుధాకర్‌ యాదవ్‌, కఠారి ప్రవీణ్‌, ఈశ్వర్‌, సెంథిల్‌, తారక, రవీంద్రరాజు, పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో కేడర్ రెడీ.. నేతలేరీ!?
04-08-2018 12:57:32
 
636689842540817265.jpg
  • జిల్లాలో పార్టీని చక్కదిద్దండి బాబూ
  • కేడర్ రెడీ.. నేతలేరీ?
  • చంద్రబాబుకు కార్యకర్తల వేడికోలు
కవచాలతో, ఖడ్గాలతో నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. సైన్యమూ సర్వసన్నద్ధంగా ఉంది. భేరీ మోగడమే తరువాయి. తేదీ మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా...? అన్నంత దూకుడూ, ఆత్మవిశ్వాసమూ అధినేతలో కనిపిస్తోంది. గ్రామదర్శిని, జ్ఞానభేరి, యువనేస్తం, జలభగీరధయత్నం.. నిరంతరం పరుగులు.. అలుపూసొలుపు లేదు, ఇల్లూపిల్లలూ విశ్రాంతి అనే ఆలోచన లేదు. అభివృద్ధి పతాకాన్ని చేతబట్టి పల్లెపల్లే చుట్టుముడుతున్నాడు. దన్నుగా, వెన్నుగా మారి వెంట పరుగులు తీయాల్సిన పెద్ద తమ్ముళ్లు కొందరు మాత్రం సొంత జిల్లాలో దారి తప్పుతున్నారు. తమకు అంటిన బురదని పార్టీకీ అద్దుతున్నారు. గ్రూపుగొడవలతో పరువు తీస్తున్నారు. పార్టీకి బలమైన అండదండలున్న జిల్లాలో ఓట్లకు గండికొడుతున్నారు. పెద్దాయన కాస్త పట్టించుకుని దారిలో పెట్టాలని కార్యకర్తలు వేడుకుంటున్నారు.
 
 
చిత్తూరు: పది నెలల దూరంలో ఎన్నికల మహా సంగ్రామం ముంచుకొస్తోంది. రాజ్యం మనుగడ దృష్ట్యా ఆ యుద్ధంలో గెలిచి తీరాలి. ఎదుర్కొనేందుకు సైన్యం సర్వ స్నద్ధంగా వుంది. అయితే దాన్ని ముందుకు నడిపించే సమర్థులైన సేనాధిపతులే కరువవుతున్నారు. గ్రూపులుగా విడిపోయి పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ కొందరు, అవినీతి బురదతో పార్టీకి నష్టం చేస్తున్నవారు మరికొందరు, అభిమానం దండిగా ఉన్నా నడిపించే నాయకులెవరో తెలియక అయోమయంలో కార్యకర్తలున్న తావులు కొన్ని... అధినేత దృష్టి సారిస్తే తప్ప జిల్లాలో పార్టీ గాడిలో పడదని తెలుగుదేశం కార్యకర్తలు భావిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నప్పటికీ పార్టీని చక్కదిద్దే పనిని సొంతజిల్లాలో చేపట్టాలని వారు కోరుకుంటున్నారు.
 
 
అయోమయం, గందరగోళం
మదనపల్లెలో టీడీపీ బలంగా వుంది. 1983 నుంచీ ఇప్పటిదాకా జరిగిన ఎనిమిది ఎన్నికల్లో టీడీపీ ఐదుసార్లు గెలిచింది. గత ఎన్నికల నుంచీ ఇన్‌ఛార్జి లేరు. బహునాయకత్వం, వర్గ వైషమ్యాలు పార్టీని పీడిస్తున్నాయి. ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ప్రస్తుత ప్రజాప్రతినిధి ఒకరు భూకబ్జాలు, అవినీతి ఆరోపణలకు గురై పార్టీ ప్రతిష్ట దెబ్బ తినడానికి కారణమవుతున్నారు. వర్గ విభేదాలు ముదిరి అధిష్టానం పిలుపిస్తున్న కార్యక్రమాలను విడివిడిగా చేపడుతున్నారు. ఇన్‌ఛార్జి లేకపోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరనేది ఊహామాత్రంగా కూడా చెప్పలేని పరిస్థితుల్లో పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
 
 
నగరిలో ముద్దుకృష్ణమ మృతితో ఇన్‌ఛార్జి పదవి ఖాళీ అయింది. ఆయన కుటుంబానికి అవకాశం లేదని అధిష్టానం తేల్చిచెప్పినా వారసులు పోటాపోటీగా ముందుకెళుతున్నారు. ఇతరులూ రేసులో వున్నారు. ఇక్కడా ఇన్‌ఛార్జి లేకపోగా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఎవరికనేది అంతుబట్టడం లేదు. చంద్రగిరిలో పార్టీతో పాటు నేత గల్లా అరుణకుమారి కూడా బలమైన వారే. తొలి నుంచీ పార్టీలో వున్న నేతలతో ఆమెకు సత్సంబంధాలు లేవు. తగిన గుర్తింపు లేదన్న అసంతృప్తితో ఇన్‌ఛార్జి పదవి నుంచీ తప్పుకున్న అరుణమ్మ వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచీ ఎవరూ పోటీచేయరని తేల్చి చెప్పేశారు. పొలిట్‌బ్యూరో సభ్యురాలు అయ్యాక కాస్త చురుగ్గానే ఉన్నా వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి అభ్యర్థి ఎవరో తెలియక శ్రేణుల్లో అయోమయం నెలకొంటోంది.
 
 
వీరిని పట్టించుకోండి
2004-14 నడుమ పదేళ్ళ పాటు టీడీపీ అధికారంలో లేదు. నేతలు, క్రియాశీలక కార్యకర్తలు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి. తంబళ్ళపల్లెలో నాటి ఎమ్మెల్యే ప్రవీణ్‌ వైసీపీలో చేరిపోవడంతో పార్టీకి దిక్కు లేకుండా పోయింది. మదనపల్లెకు చెందిన కోపూరి మల్లిఖార్జుననాయుడు సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకుని ఆర్థికంగా చితికిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగన్నరేళ్ళు అవుతున్నా ఆయన్ని పట్టించుకున్నవారే లేరు. పీలేరులో చింతల వైసీపీకి, ఇంతియాజ్‌ అహ్మద్‌ కాంగ్రె్‌సకూ వెళ్ళిపోయి పార్టీ గడ్డు స్థితిలో వుండగా మల్లారపు రవిప్రకాష్‌ సమన్వయకర్తగా పనిచేసి పార్టీని నడిపించారు. పార్టీ పవర్‌లోకి వచ్చినా ఆయన్ను గుర్తించిన వారే లేరు.
 
పుంగనూరులో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొని పార్టీ ఉనికిని కాపాడిన వెంకట్రమణరాజుకూ ప్రాధాన్యత లేదు. గతంలో చంద్రగిరిలో రామనాధం నాయుడు పరిస్థితీ అలాగే వుంది. పలమనేరులో నాటి ఎమ్మెల్యే అమర్‌ సైతం వైసీపీలోకి వెళ్ళగా అక్కడా సుభాష్‌ చంద్రబోస్‌ పార్టీకి నాయకత్వం వహించి భారం మోశారు. ఆయనకు ఆర్టీసీ జోనల్‌ ఛైర్మన్‌గా నామమాత్రపు పదవి దక్కింది. అధికారంలో లేనపుడు పార్టీ బాధ్యతలు మోసి కష్టనష్టాలకు గురైన వారికి సరైన గుర్తింపు లేకపోవడం సీనియర్‌ కార్యకర్తలకు నిస్పృహ కలిగిస్తోంది.
 
 
అసంతృప్తి, విభేదాలు
పలమనేరులో టీడీపీ బలంగా వున్నా మంత్రి అమర్‌, మాజీ ఇన్‌ఛార్జి సుభాష్‌ చంద్రబోస్‌ వర్గాల మధ్య సయోధ్య లేదు. శ్రీకాళహస్తిలోనూ పార్టీ పటిష్టంగా వున్నా వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో సమీకరణలు మారుతున్నాయి. ఆయన కుటుంబసభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ రెండు వర్గాలు కలసి పనిచేసే అవకాశాలు కనిపించడంలేదు. పీలేరులో మాజీ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ ప్రస్తుత ఇన్‌ఛార్జి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డితో దూరదూరంగా వుంటున్నారు. ఆయన తరచూ ప్రత్యేక సమావేశాలు నిర్విహిస్తూ వర్గాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్బాల్‌ కంటే ముందు సమన్వయకర్తగా పనిచేసిన మల్లారపు రవిప్రకాష్‌ కూడా ప్రత్యేక వర్గం నడుపుతున్నారు. సత్యవేడులో పార్టీ ముఖ్యనేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలువురు మండల స్థాయి నాయకులు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అందుబాటులో వుండడం లేదని క్యాడర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. చిత్తూరులో నేతలు ఎక్కువగా వున్నా పార్టీ క్యాడర్‌ను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వుంటున్నందున పనుల కోసం ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాక కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు.
 chandraba.jpg
నేతలందరూ వేర్వేరుగా కాక ఒకే చోట కార్యాలయం ఏర్పాటు చేసుకుని క్యాడర్‌కు అందుబాటులో వుండాలని స్వయంగా అధినేతే ఆదేశించినా వినిపించుకున్న దాఖలాలు లేవు. పూతలపట్టులో కూడా ముఖ్యనేతను పలువురు మండల స్థాయి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రతి మండలంలోనూ రెండు వర్గాలు తయారయ్యాయి. ఓ వర్గం మద్దతిస్తే మరో వర్గం వ్యతిరేకిస్తోంది. నిజానికి పార్టీ బలంగా వున్నప్పటికీ ఇక్కడ నేతల అనైక్యతే పుట్టి ముంచుతోంది. తంబళ్ళపల్లెలోనూ ఓ ముఖ్యనేత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నామినేటెడ్‌ పనుల కేటాయింపుల్లో పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారనేది కింది స్థాయి నాయకుల ఆరోపణ. ఇక ఆ నేత ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగత సహాయకులపై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులకు అంతే లేదు. జీడీనెల్లూరులో నాయకత్వం బలహీనంగా వున్నందున పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడంలో విఫలమవుతున్నారని పార్టీకి క్యాడర్‌ నుంచీ ఫీడ్‌బ్యాక్‌ అందుతోంది.
 
Tags : telugudesam, ap cm chandrababu, chittor
Link to comment
Share on other sites

  • 2 weeks later...
చిక్కున్న చోట ‘మదనపల్లె’ ఫార్ములా!
14-08-2018 03:04:46
 
636698126873564277.jpg
  • ముగ్గురు నేతల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి
  • ఇంకొకరికి అసెంబ్లీ టికెట్‌.. మూడోవారికి కార్పొరేషన్‌
  • తమలో తాము చర్చించుకుని ఒప్పందం
  • ఆమోదముద్ర వేసిన చంద్రబాబు
  • రాష్ట్రమంతా అమలుకు టీడీపీ యోచన
అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ‘మదనపల్లె ఫార్ములా’ చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లాలోని ఈ నియోజకవర్గంలో టికెట్‌ కోసం పోటీ పడుతున్న ముఖ్య నేతలు తమలో తాము ముందుగానే ఓ అంగీకారానికి వచ్చి.. అభ్యర్థిని నిర్ణయించే అధికారాన్ని నాయకత్వానికే అప్పగించారు. ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు. ఈ పరిణామం తెలుగుదేశం నాయకత్వానికి ఎంతో సంతృప్తినిచ్చింది. పోటీదారులు అధికంగా ఉన్న ఇతర నియోజకవర్గాల్లో ఇక ఇదే ఫార్ములా అమలు చేయాలని తాజాగా యోచిస్తోంది. మదనపల్లె సీటు కోసం టీడీపీలో గట్టి పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే దమ్మాలపాటి రమేశ్‌, మాజీ ఎమ్మెల్సీ నరేశ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేత రాందాస్‌ ఎవరికి వారు తమకే టికెట్‌ కావాలని ఒత్తిడి తెచ్చారు. అందరూ పట్టున్న నేతలే కావడంతో ఎవరికివ్వాలో నాయకత్వానికి అంతు చిక్కలేదు. ఈ నేపఽథ్యంలో జిల్లా నాయకత్వం చొరవ చూపి ముగ్గురితోనూ మాట్లాడింది. వారిలో వారే మాట్లాడుకుని నిర్ణయానికి రావాలని సూచించింది. దానిపై ఆ ముగ్గురు నేతలూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. ఒక అంగీకారానికి వచ్చారు. తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిశారు. వారి ఒప్పందం ప్రకారం.. టికెట్‌ రేసు నుంచి నరేశ్‌ వైదొలుగుతారు. ప్రతిఫలంగా ఆయనకు నాయకత్వం ఎమ్మెల్సీ ఇవ్వాలి. రమేశ్‌, రాందా్‌సల్లో ఒకరికి ఎమ్మెల్యే టికెట్‌, రెండో వారికి కార్పొరేషన్‌ అధ్యక్ష పదవి ఇవ్వాలి. వీరిద్దరిలో ఎవరికి టికెట్‌ ఇవ్వాలో అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారు. ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని, అందరం కలిసి పనిచేస్తామని ముగ్గురు నేతలూ లోకేశ్‌తో చెప్పారు. ఈ ఫార్ములా బాగుందని, అమలు చేస్తామని ఆయన వారికి తెలిపారు. ఈ ముగ్గురూ సోమవారమిక్కడ చంద్రబాబుతో సమావేశమై.. తమ ఒప్పందాన్ని వివరించారు. ఆయన ఆమోదించారు.
 
‘మీ ముగ్గురి ప్రయోజనాలు కాపాడతా. మీరు ముగ్గురూ కలిసి పనిచేసి మదనపల్లెలో ఈసారి పార్టీని గెలిపించుకుని రావాలి. అక్కడ గెలిస్తే మీ ముగ్గురికీ మంచి రాజకీయ భవిష్యత్‌ ఉంటుంది’ అని ఆయన వారితో అన్నారు. ఈ ఫార్ములా టీడీపీ అధినాయకత్వానికి నచ్చింది. నాయకులు తమలో తాము అంగీకారానికి వస్తే చాలా చోట్ల సమస్య పరిష్కారమవుతుందని.. వారడిగిన ప్రకారం చేయడానికి తమకూ ఇబ్బంది ఉండదని ఒక సీనియర్‌ నేత తెలిపారు. నాయకుల మధ్య తీవ్రంగా పోటీ ఉన్న నియోజకవర్గాలు పాతిక వరకూ ఉన్నాయని నాయకత్వం అంచనా వేస్తోంది. వీటిలో అధిక భాగం రాయలసీమలోనే ఉన్నాయి. ‘ఎమ్మెల్సీ పదవులు ప్రతి ఆరేళ్లకూ పెద్ద సంఖ్యలో ఖాళీ అవుతుంటాయి. వాటిని సర్దుబాటు చేయడం పెద్ద సమస్య కాదు. కార్పొరేషన్‌ పదవులు కూడా ఇవ్వవచ్చు. ఇటువంటి సర్దుబాటుకు నాయకులు అంగీకరిస్తే సమస్య తేలిగ్గా సర్దుబాటవుతుంది. ఇకపై ఈ మార్గంలోనే మిగిలిన చోట్లా ప్రయత్నం చేయాలనుకుంటున్నాం’ అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Link to comment
Share on other sites

  • 5 weeks later...
పుంగనూరు తెరపైకి అనూషారెడ్డి
19-09-2018 03:21:21
 
636729240785721075.jpg
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళా నేత అనూషారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆ జిల్లాకు చెందిన పరిశ్రమల మంత్రి అమరనాథ్‌రెడ్డికి ఆమె స్వయానా మరదలు. కొద్ది రోజుల క్రితం ఆమెను పార్టీ అధినేత చంద్రబాబు పిలిపించి మాట్లాడారని సమాచారం. ఆ నియోజకవర్గానికి వైసీపీ సీనియర్‌నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ గట్టి అభ్యర్థి కోసం టీడీపీ దృష్టి పెట్టింది. ఆ నియోజకవర్గంలోని మూడు మండలాలతో అమరనాథ్‌ కుటుంబానికి రాజకీయ సంబంధాలున్నాయి. నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఆయన పలమనేరు వెళ్లారు. పుంగనూరులోని ప్రాంతాలతో ఉన్న రాజకీయ సంబంధాలను దృష్టిలో ఉంచుకొని అమరనాథ్‌ కుటుంబం నుంచి ఎవరినైనా పోటీకి పెడితే బాగుంటుందని టీడీపీ అధిష్ఠానం భావించింది. ఆ కోణంలో అనూష పేరు తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆమెను... ఆమె భర్త శ్రీనాథరెడ్డిని చంద్రబాబు పిలిపించి వారి ఆసక్తి అడిగి తెలుసుకున్నారు. దీనికి ముందు ఆ నియోజకవర్గ నేత, టీటీడీ పాలకమండలి సభ్యుడు బాబురెడ్డిని కూడా పిలిపించి మాట్లాడారు. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా సహకరించాలని, ఆయనకు ఇతరత్రా అవకాశాలు ఇస్తామని చెప్పారు. దీనికి బాబురెడ్డి అంగీకరించారు.
Link to comment
Share on other sites

వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హవాకు చెక్ పెట్టేందుకు...
19-09-2018 14:28:08
 
636729640853811058.jpg
  • అనూషారెడ్డికే పుంగనూరు టికెట్‌
  • పచ్చజెండా ఊపిన చంద్రబాబు
  • పుంగనూరు రాజకీయాల్లో కీలక పరిణామం
 
చిత్తూరు (ఆంధ్రజ్యోతి): పుంగనూరు నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జిగా మంత్రి అమరనాథరెడ్డి మరదలు అనూషారెడ్డిని నియమించ డానికి అధినేత నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా ఆమెనే బరిలోకి దించుతున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చేశారు. దీంతో పదేళ్లుగా పుంగనూరును పెట్టని కోటగా మలచుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిని ఢీకొనడం అనివార్యమవుతోంది. పదేళ్ల విరామం అనంతరం పుంగనూరు బరిలో తిరిగి కెళవాతి కుటుంబం అడుగుపెట్టడం ఖాయమన్న సమాచారం నియోజకవర్గ రాజకీయాల్లో ఒక్కసారిగా కాక పుట్టిస్తోంది.
 
పదేళ్లుగా మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యక్తిగతంగా పెట్టని కోటగా మారిన పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీకి పూర్వవైభవం సాధించి తీరాలని అధిష్ఠానం పట్టుదలతో ఉంది. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి పెద్దిరెడ్డి ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి వ్యూహరచన చేసింది. దానికనుగుణంగా మంత్రి అమరనాథరెడ్డి సోదరుడు శ్రీనాథరెడ్డి సతీమణి అనూషారెడ్డి పేరు ఖరారు చేసింది.
 
ఈనెల ప్రారంభంలో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమీక్షలో అధినేత సీఎం చంద్రబాబు సూచనప్రాయంగా ఈ నిర్ణయాన్ని ముఖ్యనేతలకు వెల్లడించారు. ఇటీవల తిరుమలకు వచ్చిన సందర్భంలో తనను కలిసిన మంత్రి అమర్‌ సోదరుడు శ్రీనాథరెడ్డితో.. దంపతులిద్దరూ విజయవాడ వచ్చి కలవాలని సీఎం సూచించారు. ఆ మేరకు ఆదివారం శ్రీనాథరెడ్డి, అనూష విజయవాడ వెళ్లి అధినేతను కలిశారు. పుంగనూరు పార్టీ ఇన్‌చార్జిగా నియమిస్తామని, వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కూడా ఇస్తామని అనూషకు చెప్పిన చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని స్పష్టం చేశారు. పార్టీపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
 
 
అనూషారెడ్డి నేపథ్యం..
శ్రీనాథరెడ్డి భార్య అనూషా పుట్టినిల్లు కడప జిల్లా రాయచోటి మండలం గొర్ల ముదివేడు పంచాయతీ బాలిరెడ్డిగారిపల్లె. ముత్తాత గంగిరెడ్డి స్వాతంత్ర్యానికి పూర్వమే కడప జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పనిచేయగా.. తాత నారాయణరెడ్డి రాయచోటి సమితి అధ్యక్షుడిగా, తండ్రి రఘురామిరెడ్డి స్వగ్రామానికి సర్పంచిగానూ, సింగిల్‌విండో అధ్యక్షుడిగానూ పనిచేశారు. న్యాయశాస్త్రం అభ్యసించిన అనూషారెడ్డికి తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉంది. చొరవగా, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లేవారు. మామ రామకృష్ణారెడ్డి జీవించి ఉండగానే తన కుటుంబం నుంచి రాజకీయ వారసత్వానికి కోడలు అనూషయే తగిన వ్యక్తని బాహాటంగానే చెప్పేవారు. పునర్విభజనతో అమరనాథరెడ్డి 2009 ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఆ ఎన్నికల్లోనూ, తదుపరి 2014 ఎన్నికల్లోనూ అనూషరెడ్డి.. పుంగనూరు టీడీపీ టికెట్‌కోసం గట్టిగా ప్రయత్నించారు.
 
పుంగనూరు నియోజకవర్గంపై కెళవాతి రామకృష్ణారెడ్డి కుటుంబానికి విస్తృత పరిచయాలు, గట్టి పట్టు ఉన్న కారణంగా ఆ కుటుంబం నుంచి అనూషారెడ్డిని అభ్యర్థిగా పోటీ పెడితేనే పెద్దిరెడ్డిని దీటుగా ఎదుర్కోగలదని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఇన్‌చార్జి వెంకట్రమణరాజుకు దీనిపై స్పష్టత ఇచ్చేసినట్టు సమాచారం. అలాగే మరో కీలక నేత చల్లా రామచంద్రారెడ్డి సహా నియోజకవర్గంలోని ముఖ్యులందరినీ పిలిపించి మాట్లాడతానని, గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే కార్యరంగంలోకి దిగాలని అనూష, శ్రీనాథరెడ్డిలను ఆదేశించారు. మొత్తానికి ఈ పరిణామాలతో పుంగనూరు నియోజకవర్గ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకోనుంది. పదేళ్ల విరామం తర్వాత మరోసారి కెళవాతి కుటుంబం పుంగనూరు రాజకీయాల్లో క్రియాశీలం కానుండడం టీడీపీ వర్గాల్లో ఉత్సాహం నింపనుంది. కాగా తాజా మార్పుచేర్పులతో నియోజకవర్గంపై రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ, వైసీపీ నడుమ పోరు ముందుముందు మరింత ముదరనుంది.
Link to comment
Share on other sites

2 hours ago, Seniorfan said:

Punganur reddy ki isthe.... last time 2 ichharu....ippudu 1 avuthundhi.  bc ki..

Punganuru Raju akkada BCs ani cheppukuntaaru, bayata raajulu antaaru.

Tamballapalli MLA (BC-Yadav) ki kooda seat doubt ee, eppudu BNG lone vuntaadu ani janallo kopam, development emi chesaro choodali.

Link to comment
Share on other sites

55 minutes ago, RKumar said:

Punganuru Raju akkada BCs ani cheppukuntaaru, bayata raajulu antaaru.

Tamballapalli MLA (BC-Yadav) ki kooda seat doubt ee, eppudu BNG lone vuntaadu ani janallo kopam, development emi chesaro choodali.

Yadava Rajulu vundacchu....like raghuveera reddy...

Link to comment
Share on other sites

జనసేనలోకి చదలవాడ! 
విజయదశమి రోజు చేరేందుకు సన్నాహాలు 
ctr-sty2a.jpg

తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేనలోకి చేరనున్నట్లు సమాచారం. గురువారం విజయవాడలో ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను చదలవాడ కలిశారు. అక్టోబర్‌లో విజయదశమి రోజున అధికారికంగా జనసేనలో చేరనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తెదేపాలో సరైన గుర్తింపు లేకపోవడంతోపాటు ఇటీవల బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు సరైన గౌరవం ఇవ్వనందునే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యానని అనుచరుల వద్ద కృష్ణమూర్తి పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆయన 1973లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. 1976-77లో నెల్లూరు జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1981లో నాయుడుపేట పంచాయతీ సర్పంచిగా గెలిచారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1983లో ఉత్తమ సర్పంచిగా బహుమతి అందుకున్నారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1994లో తిరుపతి శాసనసభ ఎన్నికల బరిలో నిలవాలని భావించగా.. కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాళహస్తి టిక్కెట్టును కేటాయించింది. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తిరిగి 1999 లోనూ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి టిక్కెట్టు ఇచ్చేందుకు నిరాకరించడంతో తెలుగుదేశం పార్టీలో చేరి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2003లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అలిపిరి వద్ద నక్సలైట్లు చేసిన దాడిలో చదలవాడ కృష్ణమూర్తి సైతం గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక.. 2015 ఏప్రిల్‌లో ఆయణ్ను తిరుమల, తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా నియమించింది.

తాజా పరిణామాలతోనే..? 
ఇటీవల పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్న చదలవాడ కొంతకాలంగా క్రియాశీలంగా లేరు. తాజాగా కొన్ని పరిణామాలు కూడా ఆయన పార్టీని వీడేలా చేశాయని సమాచారం. బ్రహ్మోత్సవాల వేళ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం వచ్చినప్పుడు తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, కనీసం తనతో మాట్లాడలేదని చదలవాడ తన సన్నిహితుల వద్ద వాపోయారు. పార్టీలో గుర్తింపు లేదని ఆరోపిస్తూ.. జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దసరా రోజున జనసేన కండువా వేసుకుంటారని తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...