Jump to content

Chittoor Politics


Recommended Posts

41 minutes ago, niceguy said:

Ask annai nuvvu cheppedhi nijame kaavochu..Ground Reality matters..konthamandhi media and Jananni choosi Jagan ki chance vundhi anukunta vunnaru..maree theesi paaresthunte doubt koduthundhi..

Ground reality ayithe jaffa gone case...no value in non- party public

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • Replies 144
  • Created
  • Last Reply
చంద్రగిరి నుంచి సెలవివ్వండి!
ముఖ్యమంత్రికి విన్నవించిన అరుణకుమారి
అనూహ్య నిర్ణయంపై పార్టీలో చర్చ
పరిశీలనలో నాని, గాలి భాను పేర్లు
ctr-top2a.jpg

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే : ప్రత్యేక హోదా డిమాండ్‌తో రాజకీయాలు వేడెక్కిన వేళ.. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయాన.. తెలుగు దేశం పార్టీలో చిన్న కుదుపు.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరి ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తనను తప్పించాలంటూ గల్లా అరుణకుమారి ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. మంగళవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డితో కలిసి అరుణకుమారి అమరావతిలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. జిల్లా రాజకీయాలతో పాటు ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంపై చర్చించినట్లు సమాచారం. తన కుటుంబం నుంచి ఒక్కరే క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించామని, తన కుమారుడు జయదేవ్‌ గుంటూరు నుంచి ఎంపీగా ఉన్నందున తనను చంద్రగిరి పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలంటూ  ఆమె అధినేతను కోరారు. ఎన్నికల వరకూ మీరే కొనసాగాలని చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ఒకే కుటుంబం నుంచి వేర్వేరు జిలాల్లో ఇద్దరు రాజకీయాల్లో కొనసాగడం కష్టంగా ఉందని, చంద్రగిరికి వేరొకరిని నియమిస్తే మద్దతిచ్చి గెలిపించుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ అభ్యర్థిని మీరే సూచించాలంటూ చంద్రబాబు ఆమెకే ఆ బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. అరుణకుమారి కూమార్తె డాక్టర్‌ రమాదేవి పేరును భేటీలో పాల్గొన్న పార్టీ నాయకులు ప్రస్తావించగా.. అందుకు ఆమె విముఖత చూపారు. ఆమె వైద్యురాలిగా పెద్ద ఆస్పత్రిని నిర్మిస్తున్నారని, రాజకీయాలపై తన కూతురికి ఆసక్తి లేదంటూ దాటవేసినట్లు తెలిసింది.

తెరపైకి నాని పేరు..
చంద్రగిరి పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న చర్చలో ప్రధానంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాకాల మండలవాసి పులివర్తి శ్రీనివాస్‌ అలియాస్‌ నాని పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తర్వాత దివంగత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భాను పేరును పరిశీలించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన భానుకు సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఆయణ్ను కాదని తల్లి సరస్వతమ్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దింపుతున్నారు. మరోవైపు పార్టీ స్థానిక సీనియర్‌ నేత పేరం హరిబాబు, మాజీ ఎమ్మెల్యే మేడసాని వెంకట్రామానాయుడు మనవడు ఇందు శేఖర్లు.. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే, అరుణకుమారి సూచన మేరకే అక్కడి వేరొకరిని నియమించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోందని సమాచారం.

ఇవీ కారణాలు..
ఉన్నట్టుండి అరుణకుమారి ముఖ్యమంత్రిని కలవడం, తనను చంద్రగిరి నుంచి తప్పించాలని కోరడం వెనుక పార్టీ వర్గాలు రకరకాల కారణాలను విశ్లేషిస్తున్నాయి. పలువురు నాయకులు ఇదే విషయమై స్పందించారు. 1989లో తొలిసారి చంద్రగిరి నుంచి ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. తర్వాత 1994 ఎన్నికల్లో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. 2004 నుంచి రెండు పర్యాయాలు వివిధ శాఖలకు మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెదేపాలో చేరిన ఆమె.. 2014లో ఆ పార్టీ తరఫున ఓడిపోయారు.
* గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తనకు, తన అనుచర వర్గానికి పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదన్నది అరుణకుమారి వర్గం అభియోగం. ఇటీవల తెదేపాలో చేరిన పలువురికి కీలకమైన నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టినా.. అందులో ఆమె వర్గం వారు లేరని చెబుతున్నారు.
* నియోజకవర్గ పరిధిలో అధికారుల బదిలీల్లో ఆమె ప్రమేయం పని చేయడం లేదు.
* గత ఏడాది ఆగస్టులో దామినీడు వద్ద ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవంలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల నిర్మాణమంతా చంద్రగిరి నియోజకవర్గంలో చేపట్టగా.. లబ్ధిదారులంతా తిరుపతిలో ఓటర్లుగా ఉన్నారు. తద్వారా తనకు, పార్టీకి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రయోజనం లేదంటూ ప్రస్తావించారు. దీన్ని సరిచేయాలని కోరినా స్పందన లేదన్నది ఆమె వర్గం వాదన.
* ప్రొటోకాల్‌ పరంగానూ ఆమె ప్రస్తుతం పదవిలో లేరు. అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యం లోపించందన్న అభిప్రాయంతో ఉన్నారు.
* ఆమె తనయుడు గల్లా జయదేవ్‌ వచ్చే ఎన్నికల్లోనూ గుంటూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేయనున్నారని తెలుస్తోంది. అక్కడ దృష్టి సారించేందుకే ఇక్కడి బాధ్యతలు వద్దనుకున్నారని పార్టీ వర్గాల వాదన

Link to comment
Share on other sites

44 minutes ago, sonykongara said:
చంద్రగిరి నుంచి సెలవివ్వండి!
ముఖ్యమంత్రికి విన్నవించిన అరుణకుమారి
అనూహ్య నిర్ణయంపై పార్టీలో చర్చ
పరిశీలనలో నాని, గాలి భాను పేర్లు
ctr-top2a.jpg

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే : ప్రత్యేక హోదా డిమాండ్‌తో రాజకీయాలు వేడెక్కిన వేళ.. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయాన.. తెలుగు దేశం పార్టీలో చిన్న కుదుపు.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రగిరి ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తనను తప్పించాలంటూ గల్లా అరుణకుమారి ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. మంగళవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డితో కలిసి అరుణకుమారి అమరావతిలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. జిల్లా రాజకీయాలతో పాటు ప్రధానంగా చంద్రగిరి నియోజకవర్గంపై చర్చించినట్లు సమాచారం. తన కుటుంబం నుంచి ఒక్కరే క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించామని, తన కుమారుడు జయదేవ్‌ గుంటూరు నుంచి ఎంపీగా ఉన్నందున తనను చంద్రగిరి పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలంటూ  ఆమె అధినేతను కోరారు. ఎన్నికల వరకూ మీరే కొనసాగాలని చంద్రబాబు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ఒకే కుటుంబం నుంచి వేర్వేరు జిలాల్లో ఇద్దరు రాజకీయాల్లో కొనసాగడం కష్టంగా ఉందని, చంద్రగిరికి వేరొకరిని నియమిస్తే మద్దతిచ్చి గెలిపించుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ అభ్యర్థిని మీరే సూచించాలంటూ చంద్రబాబు ఆమెకే ఆ బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. అరుణకుమారి కూమార్తె డాక్టర్‌ రమాదేవి పేరును భేటీలో పాల్గొన్న పార్టీ నాయకులు ప్రస్తావించగా.. అందుకు ఆమె విముఖత చూపారు. ఆమె వైద్యురాలిగా పెద్ద ఆస్పత్రిని నిర్మిస్తున్నారని, రాజకీయాలపై తన కూతురికి ఆసక్తి లేదంటూ దాటవేసినట్లు తెలిసింది.

తెరపైకి నాని పేరు..
చంద్రగిరి పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న చర్చలో ప్రధానంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాకాల మండలవాసి పులివర్తి శ్రీనివాస్‌ అలియాస్‌ నాని పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. తర్వాత దివంగత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భాను పేరును పరిశీలించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశించిన భానుకు సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఆయణ్ను కాదని తల్లి సరస్వతమ్మను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దింపుతున్నారు. మరోవైపు పార్టీ స్థానిక సీనియర్‌ నేత పేరం హరిబాబు, మాజీ ఎమ్మెల్యే మేడసాని వెంకట్రామానాయుడు మనవడు ఇందు శేఖర్లు.. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే, అరుణకుమారి సూచన మేరకే అక్కడి వేరొకరిని నియమించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోందని సమాచారం.

ఇవీ కారణాలు..
ఉన్నట్టుండి అరుణకుమారి ముఖ్యమంత్రిని కలవడం, తనను చంద్రగిరి నుంచి తప్పించాలని కోరడం వెనుక పార్టీ వర్గాలు రకరకాల కారణాలను విశ్లేషిస్తున్నాయి. పలువురు నాయకులు ఇదే విషయమై స్పందించారు. 1989లో తొలిసారి చంద్రగిరి నుంచి ఆమె కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. తర్వాత 1994 ఎన్నికల్లో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. 2004 నుంచి రెండు పర్యాయాలు వివిధ శాఖలకు మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెదేపాలో చేరిన ఆమె.. 2014లో ఆ పార్టీ తరఫున ఓడిపోయారు.
* గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తనకు, తన అనుచర వర్గానికి పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదన్నది అరుణకుమారి వర్గం అభియోగం. ఇటీవల తెదేపాలో చేరిన పలువురికి కీలకమైన నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టినా.. అందులో ఆమె వర్గం వారు లేరని చెబుతున్నారు.
* నియోజకవర్గ పరిధిలో అధికారుల బదిలీల్లో ఆమె ప్రమేయం పని చేయడం లేదు.
* గత ఏడాది ఆగస్టులో దామినీడు వద్ద ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవంలో ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల నిర్మాణమంతా చంద్రగిరి నియోజకవర్గంలో చేపట్టగా.. లబ్ధిదారులంతా తిరుపతిలో ఓటర్లుగా ఉన్నారు. తద్వారా తనకు, పార్టీకి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రయోజనం లేదంటూ ప్రస్తావించారు. దీన్ని సరిచేయాలని కోరినా స్పందన లేదన్నది ఆమె వర్గం వాదన.
* ప్రొటోకాల్‌ పరంగానూ ఆమె ప్రస్తుతం పదవిలో లేరు. అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యం లోపించందన్న అభిప్రాయంతో ఉన్నారు.
* ఆమె తనయుడు గల్లా జయదేవ్‌ వచ్చే ఎన్నికల్లోనూ గుంటూరు నుంచి పార్లమెంటుకు పోటీ చేయనున్నారని తెలుస్తోంది. అక్కడ దృష్టి సారించేందుకే ఇక్కడి బాధ్యతలు వద్దనుకున్నారని పార్టీ వర్గాల వాదన

Nenu ide post cheddamanukuntunnanu...meeru chesaaru brother. Galla Jayadev family asamtrupthigaa undatam manchi sign kaademo? I think recent times lo Jayadev baaga connect ayyaru janallo.

Link to comment
Share on other sites

41 minutes ago, sonykongara said:

eme meda TDP valla ki anti undha antha

Maamoolu harassment kaadu TDP Cadre ki before 2014, min 30% TDP voting manaku padundadu 2014 lo... Pedda change ledu ippatikee.. Anduke wise decision theeskondi

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 4 weeks later...
  • 2 weeks later...
టీడీపీని గెలిపించాలని చంద్రబాబు వాళ్లతో అనడంతో...
05-07-2018 15:52:35
 
636664027562126057.jpg
  • రాజంపేటలో తిరిగి టీడీపీని గెలిపించండి
  • నియోజకవర్గ నేతలకు సీఎం ఆదేశం
రాజంపేట(కడప జిల్లా): నియోజకవర్గంలో తిరిగి తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నేతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి ఎదుట రాజంపేట తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశం జరిగింది.
 
 
ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్‌, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, ఎంపీ, ఎమ్మెల్యే, పార్టీ పరిశీలకులు ప్రభాకర్‌చౌదరి, నరసానాయుడు, జిల్లా తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి, తెలుగు రైతు మాజీ అధ్యక్షుడు శవనం వెంకటసుబ్బానాయుడు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి సి.సుధాకర్‌ పాల్గొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గంలో తిరిగి భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి ఊరూరా తిరిగి కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ నేతలను కోరారు. కష్టపడే వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని మీరు ఎదుర్కొంటున్న సమస్యలను వాటి పరిష్కార మార్గాలను తమకు తెలియజేస్తే వాటిని పరష్కరిస్తానని సీఎం పేర్కొన్నారు.
 
 
అధికారులు నా ఆదేశాలు ఖాతరు చేయడం లేదు: ఎమ్మెల్యే మేడా
నియోజకవర్గంలో నాయకుల మధ్య చిన్నచిన్న సమస్యలు ఉన్నా వాటిని తాము సర్ద్దుకొని పోతున్నామని, అయితే ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేగా నా ఆదేశాలను ఖాతరు చేయడం లేదని విప్‌, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా అవసరం కొద్ది కొందరు పేద వారు ఇసుక తీసుకొని వెళుతుంటే అటవీ శాఖాధికారులు వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నారని, ఎమ్మెల్యేగా అటవీ శాఖాధికారులకు తాను ఫోన్‌ చేసి వారిని ఇబ్బందుల పాలు చేయవద్దని చెబితే తాను చెప్పిన మాటలను బేఖాతరు చేస్తూ వారిని మరింత ఇబ్బంది పడే విధంగా కొడుతున్నారన్నారు. అదే విధంగా పోలీసులు తన మాటను పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయమై సీఎం మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తుంటే కొందరు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా అక్రమ రవాణా చేయడం తగదన్నారు. ఈ విషయంపై సొంత పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, మీరు కూడా ఇందుకు సహకరించాలని సీఎం సూచించారు.
 
 
నాకు ప్రాధాన్యమివ్వడం లేదు: మాజీ మంత్రి బ్రహ్మయ్య
ఈ సందర్భంగా మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మాట్లాడుతూ గతంలో మదన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ టిక్కెట్టు ఇచ్చినప్పుడు తాను ఆయన విజయం కోసం పనిచేశానని, తిరిగి మేడా మల్లికార్జునరెడ్డికి టిక్కెట్టు ఇచ్చినప్పుడు ఆయన విజయంలో కీలక పాత్ర పోషించానని, అయితే తనకు నియోజకవర్గంలో పార్టీ పరంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. మేడా గ్రూపు, బ్రహ్మయ్య గ్రూపులు అంటూ తమ మధ్య ఏమీ విభేదాలు లేవని, మేమంతా మీ గొడుగు కిందే మీ నాయకత్వంలో సమిష్టిగా పనిచేస్తున్నావన్నారు. అయితే నాకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల నన్ను నమ్ముకున్న వారికి ఇబ్బంది జరుగుతోందని ఈ పరిస్థితులో తనకు ప్రాధాన్యతనిచ్చి తనను నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని బ్రహ్మయ్య విన్నవించుకోగా సీఎం అందుకు సానుకూలంగా స్పందించారు.
 
 
కమ్మ సామాజిక వర్గానికి గుర్తింపు పదవి లేదు : శవన వెంకటసుబ్బానాయుడు
జిల్లా సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నాయకుడు, జిల్లా రైతు మాజీ అధ్యక్షుడు శవన వెంకటసుబ్బానాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలైన కమ్మసామాజిక వర్గానికి పార్టీ ఆవిర్భావం నుంచి కడప జిల్లాలో ఆ సామాజిక వర్గ నేతలకు ఒక్క గుర్తింపు పదవి కూడా ఇంత వరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నూనెమిల్లులు, స్పిన్‌ఫెడ్‌ లాంటి కార్పొరేషన్‌ పదవులను కట్టా నారాయణయ్యకు ఇచ్చారని, ఒక డైరెక్టర్‌ పోస్టు ఇచ్చారని ఆ తరువాత కమ్మ సామాజిక వర్గ నాయకులకు ఎటువంటి పదవీ ఇవ్వలేదన్నారు.
 
 
పదవి ఇస్తే పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా.. : కుసుమకుమారి
జిల్లా తెలుగు మహిళా మాజీ అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి మాట్లాడుతూ తాను తెలుగుమహిళా జిల్లా అధ్యక్షురాలిగా పది సంవత్సరాలు పనిచేశానని, ఈ సమయంలో జిల్లా అంతటా తిరిగి పార్టీ అభివృద్ధికి పాటుపడ్డానన్నారు. ఇటీవల తనను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించారని, ఈ సమయంలో తనకు రాష్ట్రస్థాయిలో ప్రాధాన్యత పదవి ఇస్తే పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని విన్నవించారు. పాత కార్యకర్తలను ఎమ్మెల్యే కలుపుకోవడం లేదని ఆరోపించారు. ఇందుకు సీఎం సమాధానమిస్తూ పాత వారిని కలుపుకొని వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసేటట్లు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను సీఎం ఆదేశించారు.
 
 
మౌనం ప్రదర్శించిన మాజీ కేంద్రమంత్రి సాయి
వివాదరహితుడైన మాజీ కేంద్రమంత్రి సాయిప్రతాప్‌ రాజకీయాలలో ఆరితేరిన, ఆరుసార్లు ఎంపీగా గెలుపొందినా ఈ సమావేశంలో ఆయన మౌనంగానే ఉంటూ తనదైన శైలిని ప్రదర్శిం చారు. సాయిప్రతాప్‌ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సీఎం ఆదేశాలను, పార్టీ నేతలు చెబుతున్న అంశాలను వింటూ మౌనంగానే తన ముద్రను చాటుకున్నారు.
Link to comment
Share on other sites

చిత్తూరులో ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో తిరుగులేని నేత..?
07-07-2018 10:24:25
 
636665558667887517.jpg
అక్కడ సంచలన రాజకీయ నేత ఆయన....మూడుదశాబ్దాలకుపైగా రాజకీయ ప్రస్దానంలో తిరుగు లేని నాయకుడుగా ఎదిగారు...కానీ ఇప్పుడు ఇందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది. రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఏదో ఒక పార్టీలోకి చేరాల్సిన పరిస్దితి వచ్చింది.కానీ ఇప్పుడు ఆపార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఉండదు.వెంటనే భయటకు వచ్చేయండి...ఏపార్టీ లేక పోయినా సరే స్వతంత్రంగానైనా పోటీచేస్తే భవిష్యత్తు ఉంటుంది..అంటూ ఆనేతను అభిమానించే కొందరు కలిసి ఆయనపై తీవ్ర మైన వత్తిడి తెస్తున్నారు.ఈపరిణామాలతో ఇప్పుడు ఆనాయకుని రాజకీయ ప్రస్దానం అనేక మలుపులకు దారితీస్తోంది.ఇంతకీ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నది ఎక్కడ...?ఆనాయకుడు ఎవరు..?ఏమిటన్నది తెలుసుకోవాలంటే ఈస్టోరీ లోకి వెళ్దాం.
 
 
       చిత్తూరులో సీకే బాబు గురించి తెలియనివారుండరు.. సంచలన రాజకీయ నేతగా ఆయనకు పేరుంది.. తిరుగులేని నాయకుడిగా ఎదిగిన సీకే బాబు పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది.. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌పార్టీలో కొనసాగిన సీకే బాబు గత సాధారణ ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు.. అయితే ఆ పార్టీలో ప్రాధాన్యం లభించకపోవడంతో టీడీపీలోకి వెళ్లాలనుకున్నారు.. అక్కడ ఎంట్రీ దొరకకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులలో బీజేపీలో చేరారు.. ఇప్పుడు ఆయనను అమితంగా అభిమానించే ముస్లింలు బీజేపీ నుంచి బయటకు రావాలంటూ కోరికలాంటి డిమాండ్‌ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా మద్దతిస్తాం కానీ.. బీజేపీలో ఉంటే మాత్రం సపోర్ట్‌ చేయమంటున్నారు.. కౌన్సిలర్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన సీకే బాబు రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు.. 2014 వరకు చిత్తూరు కార్పొరేషన్‌లో ఆయన మాటకు ఎదురుండేది కాదు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారంటే అందుకు కారణం కార్పొరేషన్‌పై ఆయన సాధించిన పట్టే! తమ మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించిందన్న కోపంతో ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను భూస్థాపితం చేశారు.
 
    కాంగ్రెస్‌పై ప్రజల్లో పెల్లుబుకుతున్న కోపాన్ని పసిగట్టిన చాలామంది నేతలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.. చిత్తూరు కార్పొరేషన్‌లోని మొత్తం 50 డివిజన్‌లకు అభ్యర్థులను నిలిపారు సీకేబాబు.. అయితే కేవలం ఏడింటిలో మాత్రమే విజయం సాధించగలిగింది సీకే బాబు ప్యానల్‌..మేయర్‌ పదవి కోసం పోటీలో నిలుచుకున్న బాబు సతీమణి సీకే లావణ్య కూడా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీలో ప్రాధాన్యం లభించకపోవడంతో క్రియాశీలక రాజకీయాలకు దూరమవుతూ వచ్చారు. వైకాపా కూడా సీకే బాబును దూరం చేసుకుంది.. ఈ పరిణామాలకంటే ముందే బాబు టీడీపీలో చేరాలనుకున్నారు.. అయితే ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ద్వారా సీకే బాబు దంపతులు బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీ కార్యక్రమాలలో హుషారుగా పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించేవారు. అంతేనా పూల వ్యాపారుల కోసం తన సొంత స్థలంలో నరేంద్రమోదీ పూలమార్కెట్‌ను ఏర్పాటు చేశారు.. మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు సీకే బాబు, లావణ్యలు అక్కడికి వెళ్లి బీజేపీకి ప్రచారం చేశారు.
 
 
      బీజేపీ అంటే ప్రజలు మండిపడుతున్న వాస్తవాన్ని గ్రహించారు కాబోలు ఆ పార్టీపై మునుపటి శ్రద్ధాసక్తులను కనబర్చడం లేదు.. ఇప్పుడు బీజేపీలో ఉంటే ఉన్న పరపతి కూడా పోయేట్టుగా ఉందని తెలుసుకున్నారు సీకే బాబు.. పైగా ఆయన అభిమానులు కూడా పార్టీని వదిలేయమని పోరు పెడుతున్నారు.. మీకున్న పేరుప్రతిష్టలతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలుస్తారేమోగానీ.. బీజేపీ నుంచి పోటీ చేస్తే మాత్రం పరాజయం తప్పదని అంటున్నారు. స్వతంత్రంగా పోటీచేస్తే తామంతా మద్దతిస్తామని హామీ ఇస్తున్నారు ముస్లిం అభిమానులు. పార్టీ ని వీడటంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. సీకే బాబు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు.. తనకు పార్టీ అంటూ ఏదీ లేదని.. తనది ప్రజల పార్టీ అని చెప్పుకొస్తున్నారు. తనకు వ్యక్తిగత స్వార్థాలు లేవని.. ప్రజలు ఎలా చెబితే అలా నడుచుకుంటానని అంటున్నారు. ప్రజల కోరిక మేరకు త్వరలోనే ఓ సముచిత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.. మరి సీకే బాబు పయనం ఎటువైపన్నది చూడాలి...
Link to comment
Share on other sites

రాజంపేటలో గెలుపు ఈసారి ఎవరిని వరిస్తుందో?
09-07-2018 13:01:02
 
636667380616313787.jpg
  • చిత్తూరు జిల్లా ఓటర్లే కీలకం
  • ముందస్తు పోరు వస్తే... నేతల్లో గెలుపు ధీమా
  • టీడీపీ అభ్యర్థి కోసం అన్వేషణ
  • వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌కే ఛాన్స్‌
  • టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్ష
  • ఆరుసార్లు ఎంపీగా గెలిచిన సాయిప్రతాప్‌
  • గెలుపును ప్రభావితం చేసేది ఆ సామాజికవర్గమే
 
ముందస్తు లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి రాజంపేట లోక్‌సభ స్థానం ఎవరికి దక్కేనన్న చర్చ జోరందుకుంటోంది. ప్రధాన పార్టీల నేతల్లో అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఎవరిని దింపాలన్న వ్యూహ ప్రతివ్యూహలు మొదలయ్యాయి. అధికార టీడీపీ అప్పుడే అభ్యర్థుల అన్వేషణ సాగిస్తూ కొన్ని పేర్లను పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌రెడ్డే తిరిగి పోటీ చేస్తారని ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి రాజంపేట లోక్‌సభ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారడం, 12 సార్లు ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు సాధించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ 6 సార్లు ఎంపీగా గెలుపు సాధించి ఓ రికార్డు సృష్టించారు. అభ్యర్థుల గెలుపులో చిత్తూరు జిల్లా ఓటర్లు కీలకంగా మారడంతో పాటు అత్యధికంగా ఉన్న కాపు (బలిజ) సామాజిక వర్గం ఓటర్లే ప్రభావితం చేస్తారన్నది గత ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అప్పుడే రానున్న ఎన్నికల సందడితో రాజంపేటలో రసవత్తర రాజకీయాలకు నేతలు తెరతీస్తున్నారు.
 
కడప (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ముందస్తు లోక్‌సభ ఎన్నికల్లో ఈ సారి రాజంపేట లోక్‌సభ స్థానం ఎవరికి దక్కేనన్న చర్చ జోరందుకుంటోంది. ప్రధాన పార్టీల నేతల్లో అభ్యర్థులుగా ఎన్నికల బరిలో ఎవరిని దింపాలన్న వ్యూహ ప్రతివ్యూహలు మొదలయ్యాయి. అధికార టీడీపీ అప్పుడే అభ్యర్థుల అన్వేషణ సాగిస్తూ కొన్ని పేర్లను పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌రెడ్డే తిరిగి పోటీ చేస్తారని ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. మొదటి నుంచి రాజంపేట లోక్‌సభ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారడం, 12 సార్లు ఆ పార్టీ అభ్యర్థులు గెలుపు సాధించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌ 6 సార్లు ఎంపీగా గెలుపు సాధించి ఓ రికార్డు సృష్టించారు. అభ్యర్థుల గెలుపులో చిత్తూరు జిల్లా ఓటర్లు కీలకంగా మారడంతో పాటు అత్యధికంగా ఉన్న కాపు (బలిజ) సామాజిక వర్గం ఓటర్లే ప్రభావితం చేస్తారన్నది గత ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అప్పుడే రానున్న ఎన్నికల సందడితో రాజంపేటలో రసవత్తర రాజకీయాలకు నేతలు తెరతీస్తున్నారు.
 
 
కాంగ్రెస్‌కు కంచుకోట
రాజంపేట లోక్‌సభ పరిధిలోకి కడప జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు రాజంపేట లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓసారి స్వతంత్ర పార్టీ అభ్యర్థి గెలుపొందగా 1984లో టీడీపీ అభ్యర్థిగా పాలకొండ్రాయుడు, 1999లో టీడీపీకి చెందిన గునిపాటి రామయ్యలు గెలుపొందారు. 1989 నుంచి 2014 వరకు 8 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా సాయిప్రతాప్‌ పోటీ చేసి గెలుపొంది కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. అంటే టీడీపీ రెండు సార్లు, స్వతంత్ర పార్టీ ఒక్కసారి, కాంగ్రెస్‌ 12 సార్లు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారి రాజంపేట లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాయి. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే గెలుపును ప్రభావితం చేస్తుంటారన్నది రాజకీయ పార్టీల నమ్మకం. 2009లో జరిగిన ఎన్నికల్లో పీఆర్‌పీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాసుకు 1,80,531 ఓట్లు అంటే 18.13 శాతం సాధించారు. దాదాపు కాపు సామాజిక వర్గానికి చెందిన వారి మద్దతుతోనే ఆ ఎన్నికల్లో అన్ని ఓట్లు పీఆర్‌పీ అభ్యర్థి సాధించారన్నది పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంటుంది. ఇలా మొదటి నుంచి రాజంపేట లోక్‌సభ కాంగ్రెస్‌కు కంచుకోటగా మారిందని నేతలు పేర్కొంటుంటారు.
 
 
అభ్యర్థుల అన్వేషణ
2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డి పోటీ చేయగా ఆయనకు 6,01,752 ఓట్లు సాధించారు. పోలైన ఓట్లలో 51.95 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ పొత్తుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరికి 4,26,990 ఓట్లతో 36.86 శాతం ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సాయిప్రతాప్‌కు ఈ ఎన్నికల్లో డిపాజిట్‌ గల్లంతై కేవలం 29,332 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే 2.53 శాతం ఓట్లు దక్కించుకున్న సాయిప్రతాప్‌కు 2009 ఎన్నికల్లో సాధించిన ఓట్లను పరిగణలోకి తీసుకుంటే 42 శాతం ఓట్లు తగ్గాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి ఆధిక్యం 1,74,762 ఓట్లు అంటే 15.09 శాతం ఓట్లు సాధించి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డెప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డికి 31.49 శాతం ఓట్లు రాగా 2014లో టీడీపీ పొత్తుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరికి 36.86 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 5.37 శాతం ఓట్లే ఉమ్మడి అభ్యర్థికి వచ్చినట్లు అయ్యింది.
 
 
ఈ సారి రాజంపేట లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ నేతలు ముందస్తు వ్యూహరచన చేస్తున్నారు. ఇటీవల రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమై నేతలంతా సమన్వయంతో పనిచేసి గెలుపు సాధించేలా కృషి చేయాలని గట్టిగా క్లాస్‌ పీకి పంపారు. దీంతో చిత్తూరు, కడప జిల్లాల టీడీపీ నేతలు మంచి అభ్యర్థి కోసం అన్వేషణ మొదలు పెట్టారు. మొదట మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడిని చిత్తూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయించాలని భావించినా ఆయన పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో చిత్తూరు జిల్లా నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరన్నది తేలకపోవడంతో కడప జిల్లా నేతలపైనే లోక్‌సభ అభ్యర్థిని ఖరారు చేయాలని అధినేత ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో టీడీపీ నాయకుడు బత్యాల చెంగల్‌రాయులు, మాజీ ఎంపీ సాయిప్రతాప్‌ తదితరుల పేర్లను టీడీపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరే కాకుండా ఇంకా మెరుగైన అభ్యర్థి ఎవరన్నది కూడా అన్వేషణ సాగుతోంది. వీరిద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారినే టీడీపీ అభ్యర్థిగా ఖరారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన సాగుతోంది. సాయిప్రతాప్‌ 6 సార్లు ఎంపీగా గెలుపొందడం, చిత్తూరు, కడప జిల్లాల్లో బాగా పరిచయం ఉన్న వ్యక్తి కావడం కూడా ఆయన పేరును కూడా పరిశీలించాలని జిల్లా నేతలు అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇక వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మిథున్‌రెడ్డి ఈ సారి కూడా పోటీ చేస్తారని ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
 
 
చిత్తూరు జిల్లాకు చెందిన మిథున్‌రెడ్డికి పుంగనూరు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాలో గట్టి పట్టు ఉండడం, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడం, ఆ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఎంపీ అభ్యర్థిగా వస్తుందని తదితర సమీకరణలతో వైసీపీ నేతలు దాదాపు ఆయననే ఈ సారి పోటీ చేయిస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీలలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతూ ముందస్తు ఎన్నికలొస్తే... గెలుపునకు వ్యూహ ప్రతివ్యూహలు మొదలయ్యాయి. రాజంపేట లోక్‌సభ పోరులో అప్పుడే రసవత్తర రాజకీయాలకు నేతలు తెరతీశారు. మరి ముందస్తు ఎన్నికల్లో ఎవరిని గెలుపు వరిస్తుందన్నది కడప, చిత్తూరు జిల్లా ఓటర్లే తీర్పు చెప్పనున్నారు.
Link to comment
Share on other sites

టీడీపీ టిక్కెట్టుకు కర్ణాటక సీఎం రికమండేషన్ JDS Kumaraswamy recommendation for TDP tirupati seatతిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశిస్తున్న టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ ఏకంగా కర్ణాటక సీఎంను రంగంలోకి దించుతున్నట్లు భోగట్టా. జేడీఎస్‌ చీఫ్‌ దేవెగౌడ, కన్నడ ముఖ్యమంత్రి కుమార స్వామి తిరుపతి అసెంబ్లీ టికెట్‌ రమణకు ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి టికెట్టును దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఆవిడ కాకుండా మరో ముగ్గురు ఆశావహులు కూడా టిక్కెట్టు కోసం పడిగాపులు కాస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబ సమేతంగా ఈనెల 13, 14 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సంధర్భంగా చంద్రబాబు దగ్గర మాట తీసుకోవాలని రమణ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చంద్రబాబు కుమార స్వామి ప్రతిపాదన కాదు అనరని కొందరు నేతలు అనుకుంటున్నారు. అయితే మరొక వర్గం మాత్రం చంద్రబాబు ఇటువంటి విషయాల్లో అంత తేలికగా నిర్ణయాలు తీసుకోరని అంటున్నారు.

 
Link to comment
Share on other sites

టీడీపీలో గ్రూపులతో వైసీపీకి కలిసొచ్చేనా?..
13-07-2018 16:39:31
 
636670967706317795.jpg
విజయనగరం: కురుపాం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. కురుపాం, చినమేరంగి కోటల అధిపతుల మధ్య ఎప్పుడూ ఎన్నికల్లో పోటా పోటీగా ఉండేది. అయితే కురుపాం కోటకు చెందిన ముఖ్యుల్లో ఒకరు మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌కేంద్రంలో రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించారు. ఆయన సోదరుడు ప్రదీ‌ప్‌దేవ్‌ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. దీంతో నియోజకవర్గంనుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోసం చినమేరంగి కోటలోనే పోటీ ఏర్పడిండి.
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరాజు కోడలు పాముల పుష్పశ్రీవాణి, టీడీపీ నుంచి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మేనల్లుడు వీటీ జనార్దన్‌థాట్రాజ్‌ బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య సాగుతోందన్న భావన ఓటర్లలో కలిగేలా గెలుపు కోసం ఎవరికి వారు విస్తృతంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు వైసీపీ అభ్యర్థిని పుష్పశ్రీవాణి గెలుపొందారు. దీంతో చంద్రశేఖరరాజుతోపాటు ఆయన కుమారుడు, ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త పరీక్షిత్‌రాజు వైసీపీ నుంచి చురుకైన పాత్ర పోషిస్తూ ఆ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధిష్టానం శత్రుచర్ల విజయరామరాజుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి నియోజకవర్గాంలో టీడీపీ పటిష్టతకు చర్యలు తీసుకుంది. దీంతో ఆ నియోజకవర్గంలో అధికారులు, ప్రజలకు రెండు అధికారిక కేంద్రాలుగా మారాయి.
 
 
pushpa-320.jpgవిజయరామరాజు ఎమ్మెల్సీ పదవితో, ఆయన మేనల్లుడు జనార్దన్‌ థాట్రాజ్‌ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలతో వారిద్దరి మాటపై వెళ్తోందనటంలో సందేహం లేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పుష్పశ్రీవాణి ఒక పక్క పార్టీ పటిష్టతతోపాటు రెండోసారి ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంలో పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అన్నదమ్ములిద్దరూ టీడీపీలో ఉండటంతో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి రెండో సారి పాగా వేసేందుకు పావులుకదుపుతున్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఒక్కటైతే టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయంపై ఆసక్తిగా గమనిస్తున్నారు. మేనల్లుడు జనార్దన్‌ థాట్రాజ్‌కు పోటీ చేస్తారా లేదా, శత్రుచర్ల విజయరామరాజు భార్య టీడీపీ నుంచి పోటీ చే స్తారా అన్న విషయంపై కోటలో మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
 
 
టీడీపీలో గ్రూపులు ఒక్కటయ్యేనా..?
టీడీపీలో కురుపాం నియోజకవర్గానికి సంబంధించి జియ్యమ్మవలస మండలంలో రెండు గ్రూపులున్నాయి. విజయరామరాజు మద్దతు కలిగిన జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ ఒక వర్గం, ఎంపీపీ దత్తి కామేశ్వరి భర్త లక్ష్మణరావు ఒక వర్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు గ్రూపులను ఏకతాటిపైకి తెచ్చేందుకుపార్టీ అధిష్టానం ప్రయత్నించి అలసిపోయింది. దీంతో ఈమండలంలో వైసీపీకి కలిసొచ్చే అవకాశంఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
 
 
అసమ్మతి వర్గం మూడో పార్టీ వైపు దృష్టి
ఈనియోజకవర్గంలో ఒకప్పుడు ముఖ్య నేతలుగా ఉన్న టీడీపీ నాయకులు పలువురు కొత్తగా ఏర్పాటైన పవన్‌కల్యాణ్‌ పార్టీ జనసేన వైపు దృష్టి పెడుతున్నట్లు సమాచారం. టీడీపీతో పాటు వైసీపీలో కూడా కొంతమంది వెళ్లేందుకు చూస్తున్నారు.
 
 
సీనియర్‌ నాయకుల అలక
గతంలో పదేళ్లు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అండగా నిలిచిన నాయకులను ఆపార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా అధిష్టానం గుర్తించలేదన్న ఆలోచనతో ఆ పార్టీలో సీనియర్‌ నాయకులు అలకతో ఉన్నారనడంలో సందేహం లేదు. పతిపక్షంలో ఉన్నప్పుడు తమపై ఎవరైతే పెత్తనం చెలాయించారో అధికారంలోకి వ చ్చిన తరువాత కూడా ఆ వ్యక్తులే పెత్తనం చెలాయిస్తుంటంతో వచ్చే ఎన్నికల్లో వీరి ఏమేరకు సహకరిస్తారో చూడాలి.
 
 
సీపీఎం బరిలో
కురుపాం నియోజకవర్గంలో ఒకేసారి పాగా వేసిన సీపీ ఎం నేతలు తిరిగి వచ్చే ఎన్నికల్లో పోటీపై దృష్టి కేంద్రీకరించింది. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ప్రజల సమస్యలపై పోరాడుతూ ఎన్నికల్లో తమ బలం ఏమిటో తెలియజెప్పేందుకు ఆపార్టీ నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి పా వులు కదుపతోంది.
 
 
బీజేపీ నుంచి జయరాజ్‌
అరకు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిమ్మక జయరాజు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. అసెంబ్లీకి పోటీ కి చూస్తున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జయరాజ్‌ దేనినుంచి పోటీచేసినా ఆ ప్రభావం ఈ నియోజకవర్గంలో ప్రధాన పా ర్టీ అభ్యర్థులపై తప్పక పడుతుంది. జయరాజ్‌ ఎమ్మెల్యేగా కురుపాం నుంచి బీజేపీ జెండా ఎగురవేయాలని గట్టిగా భావిస్తున్న ట్లు సమాచారం. ఏదిఏమైనా రానున్న ఎన్నికలు కురుపాం నియోజకవర్గంలో ఆక్తిగా మారుతాయనడంలో సందేహం లేదు.
Link to comment
Share on other sites

సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ పరిస్థితి ఇదీ..!!
13-07-2018 14:22:43
 
636670885625879063.jpg
  • వర్గపోరుతో సతమతం
  • ప్రధాన పార్టీల్లో ప్రజ్వరిల్లుతున్న అసంతృప్తి
  • కొన్ని చోట్ల నాయకత్వం కోసం తీవ్ర పోటీ
  • మరికొన్ని చోట్ల నాయకత్వం లేక శ్రేణుల్లో నైరాశ్యం
 చిత్తూరు: మదనపల్లె సీటు గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించారు. ఎన్నికల తర్వాత ఇన్‌ఛార్జిని నియమించలేదు. ఇక్కడ నేతలు చాలామందే వున్నారు. వారిలో టికెట్‌ ఆశిస్తున్న వారూ ఎక్కువే. అందులో ఒకరిద్దరు ముఖ్యనేతలు పట్టణంలో కనిపించిన ప్రభుత్వ భూమినల్లా కబ్జా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రత్యర్థి పార్టీకి ఇవి ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. వీరి వల్ల ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటోందని ఇతర నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. వర్గపోరు ముదిరిపోయి అధిష్ఠానం పిలుపునిచ్చిన కార్యక్రమాలు కూడా పోటాపోటీగా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు.
 
చంద్రగిరి ఇన్‌ఛార్జి గల్లా అరుణకుమారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు బరిలోకి దిగుతారో తెలియక చంద్రగిరి టీడీపీలో మళ్ళీ మునుపటి గందరగోళ పరిస్థితే ఏర్పడింది. ముద్దుకృష్ణమ నాయుడి మృతితో ఖాళీ అయిన నగరి ఇన్‌ఛార్జి పదవిలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఇన్‌ఛార్జిగా ఎవరొస్తారో, ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో తెలియక నగరి టీడీపీలో అయోమయం నెలకొంది. పుంగనూరుకు ఇన్‌ఛార్జిగా వెంకట్రమణరాజు కొనసాగుతుండగానే మంత్రి అమర్‌, ఆయన కుటుంబ సభ్యులు, పొరుగు నేత నల్లారి కిషోర్‌ తదితరులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారు. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థి వస్తారని వారే బహిరంగంగా చెబుతున్నారు.
 
ఈ పరిణామాలను సమన్వయం చేసుకోలేక పుంగనూరు క్యాడర్‌ సతమతమవుతోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అనారోగ్యం కారణంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. అక్కడ కూడా అభ్యర్థిపై స్పష్టత లేదు. బొజ్జల కుటుంబీకులతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు టికెట్‌ ఆశిస్తున్నారు. బొజ్జల, ఎస్సీవీ వర్గాల మధ్య విభేదాల నేపధ్యంలో శ్రేణులు గందరగోళంలో పడిపోతున్నాయి. పీలేరులో ఇటీవలి వరకూ సర్వ స్వతంత్ర సార్వభౌములుగా ఫీలైన పలువురు ఛోటా నేతలు నల్లారి కిషోర్‌ రాకతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో అక్కడా వర్గాలు తలెత్తాయి. గత ఎన్నికల్లో అభ్యర్థి, ఇటీవల వరకూ ఇన్‌ఛార్జిగా వున్న ఇక్బాల్‌ అహ్మద్‌ తనకు పార్టీలో గౌరవం, గుర్తింపు లేదని ఆత్మీయ సమావేశాలు పెట్టి మరీ పార్టీపై నిష్టూరపోతున్నారు. దీనికి బదులుగా ప్రత్యర్థులు ఆయనపై ఆరోపణలు చిట్టా విప్పుతిన్నారు.
 
చిత్తూరులో పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యనేతలు చాలామందే వున్నా ఎవరికి వారే అన్న చందంగా వున్నారు. అంతా కలసి ఒకే కార్యాలయంలో కూర్చుని పనిచేయాలని అధినేత ఇటీవల హెచ్చరించడంతో అందరినీ సమన్వయపరిచేందుకు సీనియర్‌ నేత దొరబాబు రంగంలో దిగారు. పూతలపట్టులో ఇన్‌ఛార్జి లలితకుమారిని మండలస్థాయి నాయకులు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ప్రతి మండలంలోనూ నేతలు రెండు వర్గాలుగా ఏర్పడడంతో పార్టీ బలహీనపడుతోంది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పలమనేరులోనూ పార్టీకి ఇంటిపోరు తప్పడం లేదు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సుభాష్‌ చంద్రబోస్‌ వర్గం అంటీముట్టనట్టుగా వుంది. సత్యవేడు, తంబళ్ళపల్లెల్లో ఎమ్మెల్యే ఆదిత్య, శంకర్‌ పట్ల పలువురు మండల, గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. లోక్‌సభ విషయానికొస్తే చిత్తూరు, రాజంపేట పార్లమెంటు స్థానాల నుంచీ ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంతవరకూ స్పష్టత లేదు.
 
 
అధికారం లేకున్నా వర్గపోరులో తీసిపోని వైసీపీ
చాలా సెగ్మెంట్లలో వైసీపీ నేతలు వర్గాలుగా విడిపోయి పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. కొన్ని చోట్ల నాయకత్వ సమస్య ఎదురవుతోంది. పలమనేరు ఎమ్మెల్యే అమరనాధరెడ్డి టీడీపీలో చేరిపోవడంతో వైసీపీకి నాయకత్వం లేకుండా పోయింది. జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, పలమనేరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శారద, రాకేష్‌రెడ్డి వంటివారున్నా స్థానిక నేతలుగానే మిగిలిపోతున్నారు. వి.కోటకు చెందిన వెంకటే గౌడను ఇటీవలే సమన్వయకర్తగా నియమించినా అతడూ నియోజకవర్గ స్థాయి నేత కాడని క్యాడర్‌ పెదవి విరుస్తోంది. కుప్పంలో పార్టీ ఇన్‌ఛార్జి చంద్రమౌళి స్థానికంగా లేకపోవడం, ప్రజల్లోకి పోకపోవడం పట్ల క్యాడర్‌ తీవ్ర అసంతృప్తితో వుంది. తంబళ్ళపల్లెలో గత ఎన్నికల అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. నాయకత్వ లోటు పూడ్చడానికి మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత తమ్ముడు ద్వారకనాధరెడ్డిని ఇన్‌ఛార్జిగా ప్రకటించారు.
 
ప్రారంభంలో ఉత్సాహంగా పనిచేసినా ఇపుడా జోరు కనిపించడం లేదు. స్థానికేతరుడనే ముద్రను, అందుబాటులో వుండరనే ఆరోపణను పోగొట్టుకోలేకపోతున్నారు. ప్రవీణ్‌ వర్గం నిద్రాణంగా వుంది. పూతలపట్టులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ను క్యాడర్‌ వ్యతిరేకిస్తోంది. మూడు మండలాల్లో నేతలకు, ఎమ్మెల్యేకు నడుమ పూడ్చలేని అగాధం ఏర్పడింది. బలమైన మండలస్థాయి నేతలున్నందున వారి మద్దతు లేకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు. చిత్తూరులో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇన్‌ఛార్జికి పలువురు కీలక నేతలతో సంబంధాలు దెబ్బతిని సర్దుబాటు దశను దాటిపోయాయి.
 
జీడీనెల్లూరులో పార్టీ బాగానే వున్నా నాయకత్వంపై రెండు ప్రధాన సామాజికవర్గాలు గుర్రుమంటున్నాయి. ఇక మదనపల్లెలో నేతల తీరు పార్టీని ప్రజల్లో నవ్వులపాలు చేస్తోంది. మున్సిపల్‌ వ్యవహారాల్లో అధికార పార్టీ నేతలతో కొందరు వైసీపీ నేతలు బహిరంగంగా చేతులు కలపడం, కౌన్సిల్‌ సమావేశాల్లో టీడీపీకి మద్దతుగా సొంత నేతలపైనే ఎదురుదాడికి దిగుతుండడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల పార్టీలో వర్గ విభేదాలు సర్దుబాటు చేయలేని స్థితికి చేరుకున్నాయి. ఈ పార్టీలోనూ చిత్తూరు ఎంపీ స్థానానికి ఎవరు అభ్యర్థనే విషయంలో కనీస స్పష్టత లేదు.
Link to comment
Share on other sites

త్వరలో టీడీపీలోకి ఓవీ రమణ
17-07-2018 13:15:19
 
636674301199797831.jpg
  • టీటీడీ పాలకమండలి నిర్ణయం సరికాదు
  • శ్రీవారి దర్శనాల రద్దుపై ఓవీ రమణ
  • త్వరలో టీడీపీలోకి వస్తానని వెల్లడి
తిరుపతి: మహా సంప్రోక్షణ పేరిట ఆరు రోజులపాటు తిరుమలకు భక్తులు రావద్దని చెప్పడానికి టీటీడీ పాలకమండలికి ఏమి అధికారం ఉందని మాజీ సభ్యుడు ఓవీ రమణ ప్రశ్నించారు. తిరుపతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మహాసంప్రోక్షణ జరుగుతున్న రోజుల్లోనూ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే టీటీడీ పాలకమండలి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు.
 
ఎలాంటి షరతులు లేకుండా త్వరలోనే తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈసారి ఎన్నికలు అభివృద్ధికి, అహంకారానికి మధ్య జరుగుతాయని అన్నారు. గతంలో కరుణాకరరెడ్డి నేతృత్వంలోని టీటీడీ పాలకమండలిలో సభ్యుడిగా ఉన్నప్పటికీ చాలాసార్లు విభేదించానని గుర్తుచేశారు. ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశిస్తున్నప్పటికీ, చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమన్నారు.
Link to comment
Share on other sites

Palamaneru nunchi Lokesh poti chesthaadu antunnaru.

Penamaluru ani mundu anukunnaru kaani ippudu sontha district ayithe better ani Palamaneru selected antunnaru, asking Amarnadha reddy might go to Punganuru.

Link to comment
Share on other sites

మంత్రి అమర్‌కు టీడీపీ టికెట్ ఇస్తే వైసీపీ అభ్యర్థి ఈయనే..?
18-07-2018 14:53:33
 
636675224426242854.jpg
  • వేడెక్కుతున్న రాజకీయం
పలమనేరు/చిత్తూరు: జమిలి ఎన్నికలు జరుగుతాయని ఓవైపు, అసెంబ్లీ, పార్లమెంటులకు ముందస్తు ఎన్నికలు వస్తాయని మరోవైపు సాగుతున్న ప్రచారాల సంగతెలా వున్నా పది నెలల్లో ఎన్నికలు అనివార్యం కావడంతో పలమనేరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలు చాపకింద నీరులా ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి.అధికార పార్టీ తరపున మంత్రి అమర్‌ నియోజకవర్గాన్ని గుప్పిట పట్టేందుకు యత్నిస్తుండగా తమ పార్టీ టికెట్‌పై గెలిచి అధికార పార్టీలోకి జంపై మంత్రి పదవి దక్కించుకున్న అమర్‌కు షాక్‌ ఇచ్చేందుకు వైసీపీ ముఖ్య నేతలు స్కెచ్‌ వేస్తున్నారు. నల్లారి కిరణ్‌ కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకు సన్నిహితంగా మెలిగిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు మళ్ళీ రాజకీయంగా క్రియాశీలం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన, బీజేపీలు కూడా తమ బలం చాటుకునేందుకు శ్రేణుల్ని సమీకరించుకునే పనిలో పడ్డాయి. ఇలా అన్ని పార్టీల కార్యకలాపాలూ ఏదో ఒక స్థాయిలో మొదలు కావడంతో పలమనేరులో ఎన్నికల వేడి రాజుకుంటోంది.
 
 
అభివృద్ధే మంత్రి అమర్‌ ఎన్నికల నినాదం
పలమనేరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎనిమిది ఎన్నికల్లో (1983, 1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో) టీడీపీ విజయం సాధించగా కేవలం రెండు సార్లు మాత్రమే ఇతర పార్టీలు గెలిచాయి. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి తిప్పేస్వామి, 2014లో వైసీపీ అభ్యర్థి అమరనాధరెడ్డి గెలుపొందారు. గెలిచాక ఆయన టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. పార్టీ మారిన నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఆయనకు వ్యక్తిగత ప్రతిష్టగా మారుతోంది. అమర్‌ గత ఎన్నికల ముందు వైసీపీలో చేరడంతో పలమనేరు టీడీపీకి నాయకత్వ సమస్య ఎదురైంది. ఆ నేపధ్యంలో సుభాష్‌ చంద్రబోస్‌ పార్టీ బాధ్యతలు తీసుకుని గత ఎన్నికల్లో అమరనాధరెడ్డిపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. పార్టీ వదలి వెళ్ళి ప్రత్యర్థి పార్టీ తరపున గెలిచిన అమర్‌ను టీడీపీ అధిష్ఠానం పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వడాన్ని సుభాష్‌ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. దానికి తోడు సుభా్‌షకు ప్రాధాన్యత లేని నామినేటెడ్‌ పదవి కట్టబెట్టడం వారి ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. పైకి అంతా మామూలుగానే వున్నా సుభాష్‌ వర్గీయులు మంత్రి పట్ల అసంతృప్తితో వున్నారు. ఈ రెండు వర్గాల నడుమా సర్దుబాటు అవసరం.
 
 
అయితే మంత్రి అమర్‌ పార్టీ బలంతో పాటు తన వ్యక్తిగత ఇమేజ్‌ అడ్డుపెట్టుకుని గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా అసమ్మతి వర్గానికి తగిన సమాధానం చెప్పాలన్న పట్టుదల మంత్రి వర్గంలో కనిపిస్తోంది. దానికోసం మంత్రి అభివృద్ధిని ఎన్నికల నినాదంగా చేసుకుంటున్నారు. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మౌలిక వసతుల కల్పనకు రూ.వందల కోట్లు మంజూరు చేయిస్తున్నారు. నియోజకవర్గానికి పలు పరిశ్రమలు తెప్పిస్తున్నారు. పలమనేరులో పార్కుల అభివృద్ధితో పాటు పట్టణ తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కౌండిన్య రిజర్వాయర్‌కు అనుబంధంగా ఉన్న గంగన్న శిరస్సు మినీ రిజర్వాయర్‌ నిర్మాణానికి, హంద్రీ-నీవా జలాలతో చెరువుల అనుసంధాన పనులకు శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతి నెలా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్‌కు అండగా వున్నానంటూ భరోసా ఇస్తున్నారు. బూత్‌ కమిటీ సమావేశాలు కూడా మొదలు పెట్టారు. అభివృద్ధి చేసి చూపించి జనామోదం పొందాలని కష్టపడుతున్నారు.
 
 
మంత్రికి షాక్‌ ఇచ్చేందుకు వైసీపీ నేతల యత్నాలు
మంత్రి అమర్‌ గత ఎన్నికల ముందు పలువురు టీడీపీ నాయకులతో కలసి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచాక వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయన వెంట వైసీపీకి వెళ్ళిన టీడీపీ నాయకులు చాలా మంది మళ్ళీ ఆయన వెంట టీడీపీలోకి వచ్చేశారు. అమర్‌ నిష్క్రమణతో పార్టీలో నాయకత్వ కొరత కనిపించకూడదన్న ఉద్దేశంతో వైసీపీ మండల నేతలు శ్రేణుల్లో పట్టు పెంచుకుంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ మొగసాల రెడ్డెమ్మ, గంగవరం మాజీ ఎంపీపీ సీవీ కుమార్‌, పెనుమూరుకు చెందిన రాకే్‌షరెడ్డిలను అధిష్ఠానం సమన్వయకర్తలుగా నియమించింది.
 
 
గత రెండేళ్లుగా వారు తమ శక్తిమేరకు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బహు నాయకత్వం బదులు ఏక నాయకత్వం అయితే మంచిదని భావించిన పార్టీ పెద్దలు ఇటీవలే వి.కోట మండలం తోటకనుమకు చెందిన వెంకటేగౌడను నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా నియమించింది. ఆయనకే వైసీపీ టిక్కెట్టు ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.నాలుగేళ్ళ నుంచీ వెంకటేగౌడ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏటా వందలాదిమంది విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడం, నియోజకవర్గంలోని ఇంటింటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ క్యాలెండర్లను పంపిణీ చేస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఒక వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించాక బూత్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎలాగైనా మంత్రికి ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పాలనే పట్టుదలతో వైసీపీ వర్గాలు పనిచేస్తున్నాయి.
 
 
ఇతర పార్టీల్లోనూ మొదలైన సందడి
ప్రధాన పార్టీల విషయమలా వుంచితే ఇతర పార్టీల్లో కూడా కదలిక మొదలైంది. మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 2009-2014 నడుమ పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.రెడ్డెప్పరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సుధాకర్‌, రెస్కో మాజీ ఛైర్మన్‌ జయరామిరెడ్డి తదితరులు కిరణ్‌కు ముఖ్య అనుచరులుగా వున్నారు. కిరణ్‌ కాంగ్రె్‌సలోకి తిరిగి రావడంతో వీరు కూడా ఆయన వెంట రాజకీయంగా క్రియాశీలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే జనసేన విషయానికొస్తే పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు పలమనేరులో అధికంగా వున్నారు. బలిజ సామాజికవర్గం కూడా ఎక్కువే. దానికి తగ్గట్టు ఆ పార్టీ కూడా అంతర్గతంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. బీజేపీ సైతం ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు సంస్థాగతంగా దృష్టి సారించింది.అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఎన్నికల కోసం సన్నద్ధత మొదలు కావడంతో రాజకీయాలు క్రమేపీ వేడెక్కుతున్నాయి.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...