Jump to content

Modi ga


Recommended Posts

రాష్ట్రాల రుణానికి కోత
19-04-2018 03:54:53
 
  • దేశీయ పొదుపు రుణంపై మెలిక
  • కేంద్రం వాటాలో 0.2 శాతం తగ్గింపు
  • రాష్ట్రాలకు మాత్రం 1.7 శాతం కోత
  • ఎఫ్‌ఆర్‌బీఎం కమిటీ సిఫారసు
  • 15వ ఆర్థిక సంఘం ‘అమలు’
  • ఇలాగైతే నిధులకు కటకటే
  • రాష్ట్ర ఆర్థిక శాఖ ఆందోళన
అమరావతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ‘పొదుపు’ సొమ్ముపైనా కేంద్రం కత్తెరేస్తోంది. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రుణాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రజలు చేసిన పొదుపు మొత్తం తగ్గిందంటూ ఎఫ్‌ఆర్‌బీఎం కమిటీ, 15వ ఆర్థికసంఘం కొత్త మెలికలు పెట్టాయి. మొత్తం జీడీపీలో దేశీయ పొదుపు(చిన్నమొత్తాలు, ఎన్‌ఎ్‌సఎస్‌ వంటివి) మొత్తం 10శాతం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ డబ్బు నుంచి రుణం తీసుకోవచ్చు. పొదుపు మొత్తంలో 4 శాతాన్ని అధిక వడ్డీకి(ప్రైవేటు లెండింగ్‌) ఇస్తారు. మిగిలిన 6శాతంలో కేంద్ర, రాష్ట్రాలు సగం సగం రుణంగా తీసుకుంటున్నాయి. ఇప్పుడు దేశీయ పొదుపు మొత్తం జీడీపీలో 7.6 శాతానికి పడిపోయింది. ఇందులో ప్రైవేట్‌ లెండింగ్‌ పోను.. మిగిలిన మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా తీసుకోవాలి. ప్రైవేట్‌ లెండింగ్‌ను 3.1 శాతంగా ఎఫ్‌ఆర్‌బీఎం కమిటీ సిఫారసు చేసింది. ఈ లెక్కన మిగిలిన 4.5 శాతాన్ని కేంద్ర, రాష్ట్రాలు చెరో 2.25శాతం మేర రుణాలు తీసుకోవడానికి ఉపయోగించుకోవాలి. కానీ,ఎఫ్‌ఆర్‌బీఎం కమిటీ రాష్ట్రాల రుణపరిమితిని 1.7 శాతానికి తగ్గించేసింది. కేంద్రం మాత్రం 2.8శాతం రుణాలు తెచ్చుకోవచ్చునని తెలిపింది. అంటే... జీడీపీలో దేశీయ పొదుపు మొత్తం 7.5 శాతానికి తగ్గినా, కేంద్రం తీసుకునే రుణంలో పెద్దగా మార్పు ఉండదన్నమాట. 0.2 శాతం మాత్రమే తగ్గుతోంది. అదే... రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి 1.3 శాతం కోత పడుతోంది. తమకు పెద్దగా నష్టం జరగకపోవడంతో... ఈ సిఫారసులను కేంద్రం పరోక్షంగా అంగీకరించింది. రాష్ట్రాలు మాత్రం తీవ్రం గా వ్యతిరేకించాయి. అయినప్పటికీ అవే సిఫారసులను టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ పేరుతో 15వ ఆర్థికసంఘం నిబంధనల్లో చేర్చారు. ఎఫ్‌ఆర్‌బీఎం కమిటీ ఏం చెప్పిందో.. 15వ ఆర్థికసంఘం రెఫరెన్స్‌లో అదే కనిపిస్తుండటంలో మరో విశేషముంది. ఈ రెంటికీ అధ్యక్షత వహిస్తున్నది ఎన్‌కే సింగ్‌ ఒక్కరే. పొదుపు నిధుల్లో రాష్ట్ర రుణవాటా తగ్గించడంపై ఇటీవల కేరళలో జరిగిన ఉత్తరాది ఆర్థికమంత్రుల సమావేశంలోనూ చర్చించినట్టు ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర తెలిపారు. దీనివల్ల రాష్ట్ర రుణ పరిమితి సగానికి సగం తగ్గిపోతుందని, అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆగిపోతాయని ఆయన పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

ఏపీ విషయంలోనే కొత్త నిబంధనలెందుకు?: కొణతాల
19-04-2018 09:07:21
 
636597256431093887.jpg
విశాఖ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విమర్శించారు. అనకాపల్లి నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆయన స్థానిక తాండవ షుగర్స్‌ గెస్ట్‌ హౌస్‌లో కొద్దిసేపు విలేఖరులతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు సక్రమంగా చేయకపోవడంతో 11 రాష్ట్రాలకు రూ.1.85 లక్షల కోట్లనష్టం జరుగుతోందన్నారు. 1971 జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తున్నా.. కేంద్రం తనకు నచ్చిన విధంగా కొత్త నిబంధనలు తెస్తోందన్నారు.
 
 
కేంద్రం తనకు అనుకూల రాష్ట్రాలకు ఇబ్బడిముబ్బిడిగా నిధులు కేటాయిస్తూ... ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలకు తీరని ఆన్యాయం చేస్తోందని ఆరోపించారు. దీని వల్ల దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం వస్తోందన్నారు. అలాగే 14వ ఆర్థిక సంఘంలో రాష్ట్రాలకు ఇచ్చిన 42 శాతం వాటా తగ్గించాలని చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, విభజన హామీల అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని తెలిపారు. ఆయనతో పాటు ఇంజరపు సూరిబాబు, పెంకే శ్రీను, కర్రి శ్రీను, తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

ఆర్థికం కుదేలే!
20-04-2018 02:25:12
 
  •  15వ ఆర్థిక సంఘం చిత్ర విచిత్రాలు
  •  విధి విధానాలపై ఆర్థిక శాఖ ఆందోళన
అమరావతి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల ఆర్థిక స్థితిని తీవ్రంగా దెబ్బతీసేలా 15వ ఆర్థిక సంఘం విధి విధానాలు (టర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌) ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ ఆక్రోశిస్తోంది. వీటివల్ల రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యమే ప్రమాదంలో పడుతుందని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలకు రెవెన్యూ లోటును భర్తీ చేసే గ్రాంటు చెల్లింపుపైనా సమీక్షించాలనడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. తమ సిఫారసుల అమలుకు బేస్‌ ఇయర్‌గా భవిష్యత్‌ ఏడాదిని నిర్ణయించడాన్నీ తప్పు పట్టారు. ‘‘రెవెన్యూ లోటు గ్రాంటును కొనసాగించాలా? నిలిపివేయాలా? అనే అంశాన్ని కూడా సమీక్షించాలని 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 280(2)(బి) ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం రెవెన్యూ లోటు భర్తీకి నిధి ఇవ్వాల్సిందే. ఈ నిధిని ఎలా ఇవ్వాలన్నది నిర్ణయించడం మాత్రమే ఆర్థిక సంఘాల విధి. ఒకవేళ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు నిధిని నిలిపివేయాలని నిర్ణయిస్తే... రాష్ట్రాల చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు’’ అని రవిచంద్ర తెలిపారు. ప్రతి ప్రాజెక్టుకూ, ప్రతి పనికీ కేంద్రం వద్ద చేతులు చాచే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం కాబట్టి... కేంద్రం దాన్ని వెంటనే 15వ ఆర్థిక సంఘం విధి విధానాల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ‘‘15వ ఆర్థిక సంఘం సమయం 2020-21లో ప్రారంభమై 2024-25తో ముగుస్తుంది. అయితే, ఈ ఐదేళ్లకుగాను రాష్ట్రాలకు నిధుల్లో వాటాలు నిర్ణయించేందుకు 2023-24ను బేస్‌ ఇయర్‌గా తీసుకోవాలని ఆర్థిక సంఘం విధి విధానాల్లో ఉంది. ఇది కూడా అసాధారణమైన ప్రతిపాదన. ఏ కేటాయింపులకైనా, ప్రపంచంలో ఎక్కడైనా గత సంవత్సరాలను బేస్‌ ఇయర్‌గా తీసుకుంటారు. కానీ, భవిష్యత్‌ సంవత్సరాలను బేస్‌ ఇయర్‌గా తీసుకోవడం విచిత్రంగా ఉంది’’ అని రవిచంద్ర వ్యాఖ్యానించారు. దీనివల్ల కచ్చితమైన, సరైన ఫలితాలు రావన్నారు. భవిష్యత్‌లో జరగబోయే ఖర్చులు, వచ్చే ఆదాయాలు ముందుగానే అంచనా వేసి వాటి ప్రకారం నిధులు కేటాయించడం అసాధ్యమని ఆయన తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాల్సిందేనన్నారు. జనాభా ప్రాతిపదికను మార్చాలనే ప్రతిపాదననూ ఆయన తప్పుపట్టారు. ‘‘కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎలాంటి నిధులనైనా కేటాయించేందుకు 1971 జనాభా లెక్కలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంట్‌లో 1970, 1980ల్లో తీర్మానాలు జరిగాయి. ఇలాంటి కీలకమైన తీర్మానాలను కూడా కేంద్రం ఇప్పుడు పక్కన పెట్టేసింది. 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలనుకుంటే... అందుకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. 14వ ఆర్థిక సంఘం 1971 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తూనే... అవసరమనుకుంటే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవచ్చనే ఆప్షన్‌ను కేంద్రానికి ఇచ్చింది. దీంతో కేంద్రం 14వ జనాభా వెయిటేజీలో 17.5 శాతాన్ని 1971 లెక్కలకు, 10 శాతం 2011 జనాభా లెక్కలకు కేటాయించింది. ఇది కూడా పార్లమెంట్‌ తీర్మానాలకు విరుద్ధమే’’ అని రవిచంద్ర వివరించారు.
 
Link to comment
Share on other sites

ఏపీ ప్రభుత్వ వైద్య రంగానికి కేంద్రం ఝలక్‌
22-04-2018 12:58:19
 
636599986981565869.jpg
  • మొండిచేయి!
  • ఏపీ ప్రభుత్వ వైద్య రంగానికి కేంద్రం ఝలక్‌
  • 150 పీజీ సీట్లకు దరఖాస్తు చేస్తే...ఒక్క సీటే మంజూరు
  • పీఎంవో ఒత్తిడితోఆంధ్రాకు కేటాయించని సీట్లు
  • కేంద్రం కక్ష సాధింపు చర్యలు అంటున్న వైద్య వర్గాలు
గుంటూరు (మెడికల్‌): ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందా? మోదీ సర్కార్‌ ఏపీపై కక్ష సాధింపు చర్యలకు ప్పాలడుతోందా? జాతీయ స్ధాయిలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నా ఎన్‌డీఏ సర్కార్‌ తన చేతిలో ఉన్న అధికారం అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు గండి కొడుతోందా? అనే సందేహాలు.. నిజమేనని అంటున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు. తాజాగా వైద్య ఆరోగ్య రంగంలో చోటు చేసుకున్న ఉదంతమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. రాష్ట్రంలో పలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనపు మెడికల్‌ పీజీ సీట్ల కోసం ఏపీ ప్రభుత్వం భారత వైద్య మండలి (ఎంసీఐ)కు నిరుడు దరఖాస్తు చేసుకుంది. గుంటూరు వైద్య కళాశాల (గుంటూరు), సిద్దార్థ వైద్య కళాశాల (విజయవాడ), ఆంధ్ర వైద్య కళాశాల (విశాఖపట్నం), రిమ్స్‌ (కడప), స్విమ్స్‌ (తిరుపతి)లో 150 అదనపు పీజీ సీట్లకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. గుంటూరులో ఐదు కోర్సులు, విజయవాడలో ఒక కోర్సు, విశాఖపట్నంలో ఏడు కోర్సులు, కడపలో మూడు కోర్సులు, తిరుపతిలో ఐదు కోర్సులకు దర ఖాస్తు చేశారు. మొత్తం 150 సీట్లు వస్తాయని అధికారులు భావించారు. ఏపీ వైద్య విద్య శాఖ అభ్యర్థన మేరకు కొద్ది కాలం కిందట భారత వైద్య మండలికి చెందిన ఎస్సెస్సార్స్‌ కమిటీ రాష్ట్రంలో పర్యటించింది.
 
 
ఆయా కాలేజీల్లో పర్యటించి మౌ లిక సదుపాయాలు, బోధన సిబ్బంది వివరాలు పరిశీ లించింది. అన్ని చోట్ల తగిన సదుపాయాలు, తగినంత మంది బోధన సిబ్బంది ఉన్నట్లు గుర్తిం చింది. దాదాపు 95 శాతం పీజీ సీట్లను మంజూరు చేయ వచ్చని ఎంసీఐ ఉన్నతా ధికారులకు సిఫార్సు చేసింది. ఇంకేం అదనంగా 150 పీజీ సీట్లు వస్తాయని, దీని వల్ల ప్రతిభావంతులైన 150 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు పీజీ కోర్సులు చేసే అవకాశం లభిస్తుందని అధికారులు సంతోషించారు. తీరా ఇటీవల భారత వైద్య మండలి పంపిన ఉత్తర్వులు చూసి ఏపీ వైద్య వర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఐదు మెడికల్‌ కాలేజీల్లో కేవలం విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలకు ఈఎన్‌టీ కోర్సులోఒక పీజీ సీటును మాత్రమే మంజూరు చేశారు. 149 సీట్లను తిరస్కరించారు. దీంతో ప్రభుత్వ వైద్య వర్గాలు దిగ్ర్భాంతి చెందాయి.
 
 
కేంద్రం కక్ష సాధింపు చర్యలు ...!
గుంటూరు వైద్య కళాశాల విషయానికి వస్తే ఇక్కడ జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైకాలజీ, పీడియాట్రిక్స్‌ వంటి ఐదు కీలక విభాగాల్లో 45 పీజీ సీట్లకు దరఖాస్తు చేశారు. ఎంసీఐ ఎస్సెస్‌మెంట్‌ కమిటీ సభ్యులు జీజీహెచ్‌/జీఎంసీలో తగినంత మంది ఫ్యాకల్టీ ఉండటంతో కనీసం 41 సీట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. తీరా గుంటూరు వైద్య కళాశాలకు ఒక్క సీటు కూడా కొత్తగా మంజూరు చేయకపోవడంతో వైద్య వర్గాలు తీవ్ర నిరాశ చెందాయి. ఇదే పరిస్థితి మిగిలిన నాలుగు వైద్య కళాశాలల్లో చోటు చేసుకుంది. తగినంత మంది ఫ్యాకల్టీ ఉన్నా తమ సంస్థలను గమనంలోకి తీసుకోకపోవడం ఏమిటని వైద్యవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రత్యేక హోధా ఇవ్వాలని, విభజన చట్టం హామీలను అమలు చేయాలని కోరుతు రాష్ట్ర ప్రభుత్వం, కొద్దికాలం కిందట కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కార్‌తో తెగ తెంపులు చేసుకోవడం ఏపీకి మోడీ సర్కార్‌ చేసిన అన్యాయంపై పార్లమెంటులో, బయటా పోరాటం చేయడం కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించినట్లు చెబుతున్నారు.
 
కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో భారత వైద్య మండలి తలవొగ్గి ఏపీకి 150 పీజీ సీట్లకు కేవలం ఒక్క సీటు మాత్రమే మంజూరు చేసినట్లు చెబుతున్నారు. మోదీ సర్కార్‌ ఏపీ ప్రభుత్వ వైద్య రంగంపై కక్ష సాధింపు చర్యలకు దిగిందని వారు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఏపీకి కొత్తగా పీజీ సీట్లు ఎందుకు మంజూరు చేయలేదో తెలుసుకొనేందుకు ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నా అక్కడ సమాధానం చెప్పే వారే కరవయ్యారు. మరోపక్క రాష్ట్రంలో ప్రైవేటు వైద్య కళాశాల్లో మాత్రం భారీగా పీజీ సీట్లు పెంచుకొనేందుకు ఎంసీఐ ఉన్నతాధికారులు అనుమతులు మంజూరు చేసినట్లు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి ఏపీపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తప్పా మరోకటి కాదని ఏపీ ప్రభుత్వ డాక్టర్లు ఆరోపిస్తున్నారు.
Link to comment
Share on other sites

15వ ఆర్థికసంఘం వల్ల 11 రాష్ట్రాలు నష్టపోతున్నాయి: యనమల
22-04-2018 13:25:58
 
గుంటూరు: బ్యాంకులను మోసం విదేశాలకు పారిపోయిన వారిని కేంద్రం వెనక్కి రప్పించాలని మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అలా చేయకపోతే వారితో బీజేపీ కుమ్మక్కైనట్టేనని వ్యాఖ్యానించారు. జీఎస్టీ కేంద్రానికి అనుకూలంగా మలుచుకోవడం వల్ల ట్రేడర్లకు నష్టం వచ్చిందన్నారు. 15వ ఆర్థికసంఘం వల్ల 11 రాష్ట్రాలు నష్టపోతున్నాయని, త్వరలో అమరావతిలో అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పోలవరానికి ఇప్పటికీ రూ.1200కోట్లు రావాల్సి ఉందని, కేంద్రం రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...