Jump to content

Modi ga


Recommended Posts

  • జీఎస్టీ పరిహారం ఎగవేతకు ఎత్తు
  •  ఐజీఎస్టీ మిగులు మొత్తం స్వాహా
  •  జీఎస్టీ నష్ట పరిహారం ఎగవేతకు ఎత్తు
  •  నవ్యాంధ్రకే రూ.410కోట్లు నష్టం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అదో సూపర్‌హిట్‌ సినిమా... హీరో, కమెడియన్‌ మధ్య డబ్బుల పంపిణీ దృశ్యం!
ఇరవై వేలల్లో... నీకు సగం, నాకు సగం! అని హీరోగారు పదివేలు తీసుకుని, కమెడియన్‌కు పదివేలు ఇస్తాడు!
తన డబ్బులు జేబులో చక్కగా సర్దేసుకుని... కమెడియన్‌ చేతిలోని పదివేలు లాక్కుంటాడు!
‘సగం పని నువ్వు, సగం నేను చేశాను కాబట్టి ఇందులో చెరో సగం’... మరో ఐదువేలు నొక్కేస్తాడు!
 
రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపుల విషయంలో కేంద్రానిది అచ్చంగా ఇదే తీరు! అక్కడ కమెడియన్‌కు ఐదువేలైనా మిగిలాయి! ఇక్కడ... పూర్తిగా గుండు సున్నా! జీఎస్టీలో రెండు పద్దుల కింద రాష్ట్రానికి నిధులు రావాల్సి ఉండగా... ఒక పద్దు కింద ఇచ్చేసి, రెండోదానికి నామం పెట్టి... ‘అప్పుడు ఇచ్చాం కదా! అదే చాలు’ అని కేంద్రం తేల్చేస్తోంది. మొత్తం సొమ్మును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యింది. దీనివల్ల నవ్యాంధ్రకు జరుగుతున్న నష్టం రూ.410 కోట్లు.
 
జీఎస్టీ వల్ల ఆర్థికంగా నష్టపోతామని రాష్ట్రాలు తొలుత మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. దీంతో ఐదేళ్లపాటు నష్ట పరిహారం అందజేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. నవంబరు, డిసెంబరు నెలలకుగాను రాష్ట్రానికి రూ.410 కోట్లు జీఎస్టీ నష్ట పరిహారం రావాల్సి ఉంది. ఇక... ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌)లో మిగులులో సగం కేంద్రం ఉంచుకుని, మిగిలిన సగాన్ని రాష్ట్రాలకు పంచాలి. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు కేంద్రం వద్ద ఐజీఎస్టీ మొత్తం రూ.35వేల కోట్లు మిగులు తేలింది. ఇందులో సగం అంటే రూ.17,500 కోట్లను అన్ని రాష్ట్రాలకు వాటి జీఎస్టీ ఆదాయాల ప్రాతిపదికన పంచారు. ఈ లెక్కలో ఏపీకి రూ.589 కోట్లు లభించాయి. అంతవరకు బాగానే ఉంది. ఇక... జీఎస్టీ నష్ట పరిహారం చెల్లింపు రూ.410 కోట్ల దగ్గరికి వచ్చేసరికి కేంద్రం మెలిక పెట్టింది. ఐజీఎస్టీ మిగులు వాటా కింద ఇప్పటికే చెల్లించిన రూ.589 కోట్లను, నష్ట పరిహారం చెల్లింపు కింద జమ వేసుకోవాలని లేఖ రాసింది. అదనంగా మిగిలిన రూ.179 కోట్లను 10 నెలల పాటు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే ఐజీఎస్టీ సెటిల్మెంట్‌లో 10 శాతం చొప్పున కట్‌ చేసుకుంటామని ఆ లేఖలో పేర్కొంది. అంటే ఐజీఎస్టీ మిగులు మొత్తం రూ.35,000 కోట్లను కేంద్రం తన ఖాతాలోనే వేసుకోవాలని భావిస్తోందన్న మాట! ‘‘జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని చెల్లించాలన్నది ఒప్పందం. ఐజీఎస్టీ మిగులులో చెరిసగం పంచుకోవాలి. కానీ... కేంద్రం మాట తప్పుతోంది’’ అని రాష్ట్ర అధికారులు మండిపడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలన్నీ జీఎస్టీ మండలి వైఖరిపై మండిపడుతున్నాయి. ఈ ప్రతిపాదనను అంగీకరించేదిలేదని స్పష్టం చేస్తున్నాయి. నష్ట పరిహారం కింద ఏపీకి దక్కాల్సిన రూ.410 కోట్లు ఇచ్చి తీరాల్సిందేనని, దీనిపై త్వరలో ఆర్థిక మంత్రి యనమల లేఖ రాస్తారని అధికారులు తెలిపారు.
Link to comment
Share on other sites

1 hour ago, NatuGadu said:

Abbo Bob goru 2004 varaku chesindhi adegaaa motham Hyderabad keee... Nvvu ekkada duka aa time lo

ayana cm ne pm kadu ga pakka state ki cheyytaniki matlade mundu ardham undali.oke state lo antava vizag pharma city,vizag lo hsbc, krishnapatnam port,gangavaram port,kakinada port evari time icchinavai,volkswagen  vizag ki tisthe pune ki dubbapettindi  maha nethalu evaru, akariki eroju vizag airport new terminal  kuda ayna time lo vacchinade.

Link to comment
Share on other sites

2 hours ago, NatuGadu said:

Abbo Bob goru 2004 varaku chesindhi adegaaa motham Hyderabad keee... Nvvu ekkada duka aa time lo

Em matladutunaro meekaina ardham avtundha :sleep:

past gurinchi evadu matladutunnadu, Present gurinchi matladutunna.. AP ki intha anyayam chesthunna BJP ki support chesthunnaru ante dhuukandi ani..

 

 

 

Link to comment
Share on other sites

this is the case always with this STATES kada... :donno:

yevaranna light vestara... how it was before....?

not this am supporting Modi.. (i also started hating this guy).. but some how for the sake of it we can't read the facts through different lence.. kadaa..

Link to comment
Share on other sites

7 minutes ago, naresh_m said:

this is the case always with this STATES kada... :donno:

yevaranna light vestara... how it was before....?

not this am supporting Modi.. (i also started hating this guy).. but some how for the sake of it we can't read the facts through different lence.. kadaa..

Modi gave free hand to RSS Ugravadulu

Link to comment
Share on other sites

నవ్యాంధ్రపై మరో కుట్ర!
16-04-2018 09:23:55
 
636594676517043425.jpg
  • లక్ష కోట్లకుపైగా నష్టం.. లోటుపై 14వ ఆర్థిక సంఘం తప్పుడు అంచనాలు
  •  సరిదిద్దాలన్నా పట్టించుకోని కేంద్రప్రభుత్వం
  •  తాజాగా పన్నుల్లో వాటా తగ్గించే పన్నాగం
అమరావతి(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర విషయంలో 14వ ఆర్థిక సంఘం వేసిన తప్పుడు అంచనాల ఫలితంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. 2015-16 నుంచి 2019-20 నాటికి రూ.లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లనుందని రాష్ట్ర ఆర్థిక శాఖ తేల్చింది. గడిచిన మూడేళ్లలో రూ.49,000 కోట్ల మేర నష్టం జరిగిందని నిర్ధారించింది. రాబోయే రెండేళ్లలో రూ.51,000 కోట్ల వరకు ఈ నష్టం ఉండొచ్చని అంచనాలు సిద్ధం చేసింది. మొత్తం నష్టం రూ.1,09,868 కోట్లకు చేరుకుంటుందని ఆందోళన వ్యక్తంచేసింది. 14వ ఆర్థిక సంఘం.. రాష్ట్రంలో రెవెన్యూ ఖర్చును తక్కువగా అంచనా వేసి.. రాష్ట్ర సొంత ఆదాయాన్ని ఇష్టారీతిలో పెంచి చూపి.. పూర్తి అవాస్తవిక గణాంకాలను సిఫారసు చేసింది. దీంతో ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం తగ్గిపోయింది.
 
  రాష్ట్రాల సొంత ఆదాయం- వాటి రెవెన్యూ ఖర్చు మధ్య ఉన్న తేడాను రెవెన్యూ లోటు గ్రాంటు రూపంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు అందిస్తుంది. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. ఏపీ విషయంలో ఇక్కడే పొరపాటు జరిగింది. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి సొంత ఆదాయం ఎక్కువగా ఉంటుందని, రెవెన్యూ ఖర్చులు తక్కువగా ఉంటాయని ఊహించి.. ఐదేళ్ల కాలానికి రూ.22,112 కోట్లను రెవెన్యూ లోటు కింద ఇవ్వాలని సిఫారసు చేసింది. కానీ ఈ ఐదేళ్ల కాలానికి గాను రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంటు రూపంలో రావలసిన మొత్తం లక్ష కోట్లకు పైగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
 
ఎన్నిసార్లు వేడినా స్పందనేదీ..?
రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయానికి 14వ ఆర్థిక సంఘం లెక్కలు అగ్నికి ఆజ్యం పోసినట్లు తోడయ్యాయి. రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రభుత్వం పలుసార్లు ఈ అంశాన్ని గణాంకాలతో సహా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ‘ప్రత్యేక ప్యాకేజీ అంటూ రాష్ట్రాన్ని ఊరించి.. చివరకు మొండిచేయి చూపిన కేంద్రం.. 14వ ఆర్థిక సంఘం పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. దాని సిఫారసుల ప్రకారమే రాష్ట్రాలకు నిధులివ్వాలన్న నిబంధన ఎక్కడా లేదు. రాష్ట్రం అవసరాన్ని బట్టి, పొరపాటును సరిదిద్దామన్న కారణంతోనూ ఆంధ్రప్రదేశ్‌కు నిధులివ్వొచ్చు. కానీ 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారమే.. రెవెన్యూ లోటు నిధులిస్తాం.. అంతకంటే ఒక్క పైసా ఎక్కువ ఇవ్వబోమని కేంద్రం తేల్చింది’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి పొరపాట్లు 15వ ఆర్థిక సంఘం నివేదికలో జరగకుండా చూసేందుకు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
     15వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని ఆర్థికశాఖ అధికారు లు వ్యాఖ్యానించారు. నిధుల వినియోగం విషయంలో రాష్ట్రాల అస్థిత్వా న్ని దెబ్బతీసి.. వాటిని గుప్పిట్లో పెట్టుకునేందుకే వాటి వాటాను కుదిం చేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషించారు. జీఎస్టీ నిర్వహణకు జీఎస్టీ మండలి ఉండగా.. జీఎస్టీ విధానం అన్నిరాష్ట్రాల్లో ఎలా పనిచేస్తుందో అధ్యయనం చేసే బాధ్యతను 15వ ఆర్థిక సంఘానికి కేంద్రం అప్పగించడంలో ఉన్న అంతరార్థం పన్నుల్లో వాటా తగ్గించడమేనంటున్నారు.
Link to comment
Share on other sites

On 15/04/2018 at 10:56 AM, Raaz@NBK said:

Em matladutunaro meekaina ardham avtundha :sleep:

past gurinchi evadu matladutunnadu, Present gurinchi matladutunna.. AP ki intha anyayam chesthunna BJP ki support chesthunnaru ante dhuukandi ani..

 

 

 

Ade mirekkada dookaro chepthe menu ade setham

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...